Jump to content

Handri - Niva SUJALA - PHASE 2


sonykongara

Recommended Posts

1 hour ago, ravindras said:

jagan accusing that cbn did  not completed distribution canals in handri neeva . he is saying  rain guns are useless. is there any truth in it? can somebody in anantpur tdp fans give facts about it

Main Canal going to be complete 

and filling ponds

distribution canals work in progress 

Link to comment
Share on other sites

  • Replies 443
  • Created
  • Last Reply
నిండుగా జలం... నిండైన ఫలం! 
న్యూస్ టుడే , అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌) 
atp-top1a.jpg

‘‘అనంత... ‘జలకళ’లాడుతోంది. తుంగభద్ర ఎగువ కాలువ (టీబీ హెచ్చెల్సీ), హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టులు కల్పతరువులా మారాయి. జిల్లా దాహార్తి తీర్చడమే కాదు.. అన్నదాత మోమున వెలుగులు నింపాయి.  ఏటా కనుచూపు మేర బీడు భూములే కన్పించేవి.. నేడు దశదిశలా పచ్చదనం వెల్లివిరుస్తోంది. మూడేళ్ల తర్వాత మళ్లీ ఆశించిన మేర నీరు జిల్లాకు చేరడం శుభ పరిణామం. అన్ని ప్రాంతాలను ఆదుకోవాలనే ప్రభుత్వ ముందుచూపు.. జల నిర్వహణ.. నీటి పంపిణీలో పారదర్శకతతో సాగుకు జీవం వచ్చింది.

కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌డివిజన్‌ పరిధిలో ఏకంగా రబీలో తొలిసారి వరి సాగుకు శ్రీకారం చుట్టడం విశేషం. మొత్తంగా హెచ్చెల్సీ ఆయకట్టు కింద 45 వేల ఎకరాల్లో వరి.. మరో 50 వేల ఎకరాల్లో ఆరుతడి, ఇతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. జలాశయాలు పుష్కల నీటితో భవిష్యత్తుపై ఆశలు పదిలం చేశాయి.’’

జిల్లాకు తుంగభద్ర హెచ్చెల్సీ నుంచి, ఇటు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు మొత్తం 29.182 టీఎంసీలు వచ్చాయి. వీటిలో హెచ్చెల్సీ నుంచి 14.215, హంద్రీనీవా నుంచి 14.967 టీఎంసీల ప్రకారం చేరాయి. ఇప్పుడొచ్చిన 29.182 టీఎంసీలకు అదనంగా... ఇంకా రావాల్సిన హెచ్చెల్సీ వాటా, హంద్రీనీవా, కేసీ కెనాల్‌ మళ్లింపు జలాలను కలిపితే మరో పది టీఎంసీలు దాకా వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. జనవరి ఆఖరు నాటికి దాదాపు 40 టీఎంసీలు చేరినట్లేనని లెక్క కడుతోంది. గత అక్టోబరు మొదటి వారం దాకా కేవలం తాగునీటికే గగనంగా కనిపించింది. వర్షాలు భారీగా కురవడం... పై రెండు ప్రాజెక్టుల నుంచి నీరు ఎక్కువగా రావడంతో జిల్లా జలాలకు కొదవ లేకపోవడంతోపాటు ఆయకట్టు సాగులోకి వచ్చింది. గతేడాది ఆ రెండు ప్రాజెక్టుల ద్వారా కేవలం 22.216 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. ఇందులో హెచ్చెల్సీ వాటాగా 10.327, హంద్రీనీవా ద్వారా 11.889 టీఎంసీల ప్రకారమే అందాయి. ఈ ఏడాది ఇప్పటికే 29.182 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి.

atp-top1b.jpg

తుంగ..‘భద్రమే’... 
తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ వాటాగా 17.476 టీఎంసీలు రావాల్సి ఉంది. ఆగస్టు 30 నుంచి నీరు విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా మొత్తం 14.215 టీఎంసీలు జిల్లాకు చేరాయి. ఇంకా 3.261 టీఎంసీలు రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 7.751 టీఎంసీలు వినియోగించారు. మిగిలిన జలాలను పీఏబీఆర్‌లో 4.181 టీఎంసీలు, చిత్రావతిలో 4.238 టీఎంసీలు, మధ్యపెన్నార్‌లో 2.375 టీఎంసీలు, పెండేకల్లులో 0.321, చాగల్లులో 0.753 టీఎంసీల ప్రకారం జలాశయాల్లో నిల్వ చేశారు. ప్రస్తుతం ఈనెల 17 నాటికి హెచ్చెల్సీ నుంచి నీటి సరఫరా ఆగింది. మళ్లీ జనవరి 2 నుంచి పునఃప్రారంభిస్తారు. నిర్దేశిత కోటా ప్రకారం ఇంకా 3.261 టీఎంసీలతోపాటు, కెసీ కెనాల్‌ మళ్లింపు ద్వారా మరో 4 టీఎంసీలు వచ్చే వీలుంది. హెచ్చెల్సీ ఆయకట్టు పచ్చదనంతో కళకళలాడుతోంది.

దయ తలచిన కృష్ణమ్మ.. 
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ దఫా కృష్ణమ్మ కూడా జిల్లాపై దయ తలిచింది. ఈ ఏడాది అక్టోబరు 11 నుంచి హంద్రీనీవా నీరు వస్తోంది. ఈ కాలువ ద్వారా గతంలో కేవలం 11.889 టీఎంసీలు మాత్రమే వస్తే... ఈ దఫా ఇప్పటికే 14.967 టీఎంసీలు చేరాయి. జనవరి ఆఖరు దాకా కృష్ణా జలాలు రానున్నాయని యంత్రాంగం చెబుతోంది. ఈ జలాల్లో 10.254 టీఎంసీలు జీడిపల్లి జలాశయానికి ఎత్తిపోశారు. మరో 4.713 టీఎంసీలు గుంతకల్లు, గుత్తి మున్సిపాల్టీల తాగునీటికి, 11 చెరువులు, ఆలూరు బ్రాంచి కాలువ, డిస్ట్రిబ్యూటరీలకు ఇచ్చారు. జీడిపల్లికి చేరిన 10.254 టీఎంసీల్లో... పీఏబీఆర్‌ జలాశయానికి 4.727 టీఎంసీలు మళ్లించారు. హంద్రీనీవా రెండోవిడత కాలువకు 3.841 టీఎంసీలు వదిలారు. జీడిపల్లిలో ప్రస్తుతం 1.398 టీఎంసీలు నిల్వ ఉంచారు. ఈ రెండు ప్రాజెక్టుల నీరే కాకుండా... అక్టోబరు వర్షాలకు చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యాం.. వంటి వనరుల్లో దాదాపు 16 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇందులో సగానికి సగం వాడేశారు. భూగర్భ జల మట్టం సైతం పెరిగింది.

Link to comment
Share on other sites

హంద్రీనీవా నీటిని భీమా నదితో అనుసంధానించాలి 

అధికారులకు సీఎం ఆదేశం

ఈనాడు, అమరావతి: హంద్రీనీవా కాల్వ నీటిని కుప్పం మీదుగా భీమ నదితో అనుసంధానించి ఆరు చెరువులు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

Link to comment
Share on other sites

హంద్రీ-నీవా పనుల్లో చలనం
06-01-2018 03:49:17
 
  • 17 ఎకరాల భూసేకరణకు లైన్‌ క్లియర్‌
  • పూర్తి పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు
అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల్లో చలనం వచ్చింది. భూసేకరణ పనుల్లో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వీడిపోవడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. 17 ఎకరాల సేకరణకు సంబంధించి రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పనుల పూర్తికి మార్గం సుగమమైంది. హంద్రీ-నీవా రెండో దశలో 340వ కిలోమీటరు వద్ద అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద 16 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూమి హక్కుదార్లయిన నలుగురు రైతులు భూ సేకరణను వ్యతిరేకించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె 173 కిలోమీటరు వద్ద ఒక ఎకరా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూమిని సేకరిస్తే.. కుప్పం బ్రాంచి కెనాల్‌కు నీరందుతుంది. ఈ 17 ఎకరాలకూ పూర్తి పరిహారం చెల్లించి.. రైతులకు పునరావాసం కల్పించాలని హైకోర్టు గత నెల 29న ఆదేశించింది. పరిహారం చెల్లింపు మొత్తంలో సగాన్ని కోర్టు రిజిస్ట్రారు వద్ద జమ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం తక్షణమే రూ.3.63 కోట్లు విడుదల చేసింది. ఈ తీర్పుతో కరువు ప్రాంతాల్లో శాశ్వతంగా దాహార్తి తీరుతుందని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

తరగని జలం... తరతరాలకు బలం 
ఇక కృష్ణమ్మ పరవళ్లు మున్ముందుకు... 
పుట్టపర్తి వద్ద శరవేగంగా కాలువ నిర్మాణం 
నెలాఖరుకు అపరిష్కృత పనులన్నీ పూర్తి 
మారాల, చెర్లోపల్లె జలాశయాలకూ నీరు 
నెరవేరనున్న జిల్లావాసుల కల 


atp-top2a.jpg
అనంత జీవనాడి అనగానే ఠక్కున చెప్పే పేరు... తుంగభద్ర ఎగువ కాల్వ (హెచ్చెల్సీ). ఈ ఖ్యాతిని మున్ముందు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) కూడా సొంతం చేసుకోనుంది. ఇప్పటికే హంద్రీనీవా ద్వారా జిల్లాకు వస్తున్న కృష్ణమ్మ జలాలు... తాగునీటి కష్టాలను, కొంతమేర సాగు ఇక్కట్లను తీరుస్తున్నాయి. ఈ పథకంలో ఇప్పటి వరకు జిల్లాలో రెండు జలాశయాలకే నీరు చేరుతుండగా... మరో రెండు జలాశయాల్లో కృష్ణమ్మ పరవళ్లు ఈదఫా ఉండవని అంతా భావించారు. అయితే పుట్టపర్తి వద్ద భూసేకరణకు మార్గం సుగమం కావడం, అక్కడ అపరిష్కృత పనులు మొదలు కావడంతో జిల్లావాసుల కల త్వరలో నెరవేరే అవకాశం కనిపిస్తోంది.

ఈనాడు - అనంతపురం: హంద్రీనీవా మొదటి దశ జీడిపల్లి జలాశయంతో ముగుస్తుంది. అక్కడి నుంచి రెండో దశ మొదలవుతుంది. ఇందులో భాగమైన మడకశిర బ్రాంచి కాల్వ పరిధిలో గొల్లపల్లి జలాశయం ఉంది. ఇప్పటి వరకు జీడిపల్లి, గొల్లపల్లి జలాశయాలకు మాత్రమే కృష్ణమ్మ వస్తోంది. అయితే బుక్కపట్నం మండలంలోని మారాల జలాశయం, కదిరి మండలంలో ఉన్న చెర్లోపల్లె జలాశయాలకు నీటి ప్రవాహం ఈ ఏడాది కూడా ఉండదనే సందేహాలు ఉండేవి. పుట్టపర్తి పరిధిలోని కమ్మవారిపల్లె వద్ద ప్యాకేజీ-9బిలో భాగమైన హంద్రీనీవా ప్రధాన కాల్వ కి.మీ. 340.450 నుంచి 340.950 వరకు 500 మీటర్ల మేర కాల్వ పనులు జరగలేదు. అక్కడ భూసేకరణ సమస్య తలెత్తడంతో చాలా కాలంగా పనులు ఆగిపోయాయి. పరిహారం విషయంలో భూ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే పొందారు. అయితే ఈ సమస్య కొంత కొలిక్కి రావడంతో ఇటీవల కాల్వ పనులు ఆరంభించారు.

నెలాఖరుకు లక్ష్యం.. 
పుట్టపర్తి వద్ద పెండింగ్‌ ఉన్న కాల్వ పనిలో భాగంగా 1.86 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వి తీయాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి కాల్వ పూర్తికావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో రోజుకు 6,700 క్యూబిక్‌ మీటర్లు చొప్పున మట్టి తీస్తున్నారు. జేసీబీలు, టిప్పర్లు తదితర యంత్రాలు, వాహనాలు కలిపి మొత్తం 25 వరకు అక్కడ పనిచేస్తున్నాయి. వీటితో నిరంతరం పనిచేయిస్తే 20 రోజుల్లో ఈ 500 మీటర్ల కాల్వ పనులు పూర్తవుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక బుక్కపట్నం వద్ద ప్యాకేజీ-10బిలో భాగంగా 358.150 కి.మీ నుంచి 360.250 కి.మీ వరకు సొరంగం పనులు జరుగుతున్నాయి. ఇందులో 10 మీటర్ల మేర మినహా మిగిలిన సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన 10 మీటర్ల పనులు ఈ నెల 20 నాటికి పూర్తిచేయనున్నారు.

దిగువకు పరవళ్లు... 
పుట్టపర్తి వద్ద 500 మీటర్ల కాల్వ పనులు పూర్తికావడం, బుక్కపట్నం వద్ద సొరంగం పనులు పూర్తయితే కృష్ణమ్మ పరవళ్లు మున్ముందుకు వెళ్లనున్నాయి. ముందుగా బుక్కపట్నం మండలంలోని హంద్రీనీవా ప్రధాన కాల్వలోని 371.040 కి.మీ. వద్ద సిద్ధమైన మారాల జలాశయానికి నీరు చేరనుంది. ఇప్పటికే ఈ రిజర్వాయర్‌ పనుల్లో 90 శాతం వరకు పూర్తయ్యాయి. 0.464 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ జలాశయాన్ని తొలిసారిగా నీటితో నింపనున్నారు. ఆ తర్వాత ప్రధాన కాల్వలోని 400 కి.మీ వద్ద నుంచి పుంగనూరు బ్రాంచి కాల్వ మొదలవుతుంది. ఇందులోని ప్యాకేజీ-26బిలో భాగంగా కదిరి మండలంలో చెర్లోపల్లి జలాశయం నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ కూడా దాదాపు 86 పనులు జరుగుతున్నాయి. ఇక్కడి జలాశయ మట్టికట్ట, తదితర పనులను గుత్తేదారు సంస్థ శరవేగంగా చేస్తోంది. 1.425 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న జలాశయానికి కూడా త్వరలో కృష్ణమ్మను తీసుకెళ్లనున్నారు. దీంతో హంద్రీ-నీవాలో భాగంగా జిల్లాలోని జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి జలాశయాలకు నీరిచ్చినట్లు అవుతుంది.

ఉత్సవాల నాటికి జలకళ... 
మరోవైపు మడకశిర బ్రాంచి కాల్వలలో కృష్ణమ్మ గలగలలు కనిపించేలా ఇంజినీర్లు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వచ్చే నెల 24, 25 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరిగ్గా ఆ సమయానికి లేపాక్షి వరకు మడకశిర బ్రాంచి కాల్వలో నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. హంద్రీనీవా రెండో దశలోని ప్రధాన కాల్వ 310 కి.మీ నుంచి మడకశిర బ్రాంచి కాల్వ మొదలవుతుంది. అక్కడి నుంచి 172 కి.మీ. మేర ఈ మడకశిర బ్రాంచి కాల్వ ఉండగా, ఇందులో గొల్లపల్లి జలాశయం వరకు ఇప్పుడు కృష్ణమ్మ చేరుతోంది. అక్కడి నుంచి లేపాక్షి వరకు ఫిబ్రవరిలో నీటిని తీసుకెళ్లనున్నారు. మధ్యలో హిందూపురం, సోమందేపల్లి వద్ద రైల్వే టన్నెల్‌ పనులు పెండింగ్‌లో ఉండగా... వీటిలో హిందూపురం వద్ద పనులు పూర్తయ్యాయి. త్వరలో సోమందేపల్లి వద్ద పనులు కూడా పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి నాలుగో వారానికి లేపాక్షి వరకు నీటిని తీసుకెళ్తామని జలవనరులశాఖ ముఖ్య ఇంజినీర్‌ (ప్రాజెక్ట్స్‌) సుధాకర్‌బాబు ‘ఈనాడు’కు తెలిపారు. హిందూపురం సమీపంలోని భూసేకరణ సమస్య కొలిక్కి వస్తే, అదే సమయానికి హిందూపురం వరకు కూడా మడకశిర బ్రాంచి కాల్వలో నీటిని తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వివరించారు.

Link to comment
Share on other sites

11 Jan 2018 - EEnadu - dt edition

మనసు పెడితే గలగలలే! 
హంద్రీ-నీవా రెండో దశ వేగవంతం అవశ్యం 
బీటీపీ, పేరూరు ఉత్తర్వులకు ఎదురుచూపు 
అనంతకు అదనపు జలాశయాలు తప్పనిసరి 
ఈనాడు, అనంతపురం 
 

‘‘కరవే... అనంతను చూసి భయపడేలా చేస్తానని జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ హామీని నెరవర్చేలా.. జల కల సాకారం అయ్యేలా జిల్లాకు వీలైనంత నీటిని తొసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అపరిష్కృత పనులు పూర్తయ్యేలా చూడటం, ఒక్కో జలాశయానికి నీటిని తీసుకెళ్లేలా ప్రయత్నిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని పనులు సకాలంలో జరగకుండా జాప్యం అవుతున్నాయి. అలాగే ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన కొన్ని హామీలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరికొన్ని కొత్త ప్రతిపాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈనేపథ్యంలో అధినేత ఓసారి వీటిపై దృష్టిసారిస్తే.. మున్ముందు జిల్లా మరింత సస్యశ్యామలం కావడం తథ్యం.’’ కరవు జిల్లాగా పేరున్న అనంతలో ఆ మాటే లేకుండా చేయాలంటే వీలైనంత ఎక్కువ నీటిని జిల్లాకు వచ్చేలా చూడాలి. ఇందులో భాగంగానే జిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద పనులు చేస్తున్నారు. ఇప్పటికే ఈ జలాశయం కింద మొదటి దశలో ఉన్న జీడిపల్లి, రెండో దశలో ఉన్న గొల్లపల్లి జలాశయాలను కృష్ణా జలాలు తీసుకొచ్చారు. అయితే వాస్తవానికి గుత్తేదారులు సకాలంలో పనులు చేయడం, మరికొన్ని సమస్యలు పరిష్కరించగలిగి ఉంటే.. ఇప్పటికే రెండో దశలోని మారాల, చెర్లోపల్లి జలాశయాలతోపాటు, జిల్లా సరిహద్దు వరకు కృష్ణమ్మ పరవళ్లు కన్పించేవి. అయితే గుత్తేదారులు సకాలంలో పనులు చేయలేకపోవడం, గడువు మీద గడువులు తీసుకోవడం, మరికొన్ని చోట్ల చిన్నచిన్న సమస్యలతో పనులు జాప్యమవుతూ వచ్చాయి. దీంతో జిల్లాకు ఈఏడాది కూడా కృష్ణా జలాలు వస్తున్నప్పటికీ రెండో దశలోని చివరి వరకు తీసుకెళ్లలేకపోతున్నారు.

కొత్త వారొచ్చినా వేగం లేదాయే.. 
హంద్రీనీవాలోని రెండో దశ అనంత జిల్లాకు ఎంతో కీలకమైంది. రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలకు ఈ రెండో దశలోనే నీరు చేరుతుంది. ఇటువంటి ముఖ్యమైన దశలో పనులు ఆశించిన వేగంగా జరగలేదు. వాస్తవానికి ఆయా ప్యాకేజీల్లో గత గుత్తేదారులు నెమ్మదిగా పనులు చేస్తుండటంతో వారిని తప్పించి, కొత్తగా ధరలకు అనుగుణంగా అంచనాలు పెంచి కొత్త గుత్తేదారులకు పనులు అప్పగించారు. అయితే వీరు కూడా సకాలంలో పనులు చేయలేకపోతున్నారు. ఆయా ప్యాకేజీల్లో గడువు మీద గడువు పెంచుతున్నారు.

* మడకశిర బ్రాంచి కాల్వలో భాగమైన గొల్లపల్లి జలాశయం 2016 డిసెంబరులో సిద్ధమైంది. అప్పుడే అర్ధ టీఎంసీకిపైగా నీటిని నింపారు. ఆ తర్వాత దిగువన మడకశిర బ్రాంచి కాల్వలో 216.30 కి.మీ. వరకు నీరు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ పనులు సకాలంలో జరగలేదు. వాస్తవానికి గత ఏడాదే ఈ మడకశిర బ్రాంచి కాల్వలోని పెండింగ్‌ పనులన్నీ పూర్తిచేస్తామని గుత్తేదారులు చెబుతూవచ్చారు. ఆయా ప్యాకేజీల్లో పనిచేస్తున్న పాత, కొత్త గుత్తేదారులకు గత ఏడాది జూన్‌ నాటికి పనులు పూర్తిచేసేలా గడువు విధించారు. అయినా సరే అప్పటికీ ఇవి జరగకపోవడంతో మళ్లీ ఈ ఏడాది మార్చి నెలాఖరుకు గడువు ఇచ్చారు. దీంతో లేపాక్షి, హిందూపురం, మడకశిర ప్రాంతాల ప్రజల కృష్ణమ్మ గలగలల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

* హంద్రీనీవా ప్రధాన కాల్వలోని ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం చెరువు వరకే నీరు వెళ్తోంది. వాస్తవానికి కృష్ణమ్మ పుట్టపర్తి, బుక్కపట్నం దాటి కదిరి నియోజకవర్గంలోని తలుపుల మీదగా చిత్తూరు జిల్లాలోకి వెళ్లాల్సి ఉంది. అలాగే పుంగనూరు బ్రాంచి కాల్వ ద్వారా ఇటు కదిరి, నల్లచెరువు, తనకల్లు మీదగా కూడా నీరు చిత్తూరు జిల్లాకు పోవాల్సి ఉంది. అయితే ఈ పనులు అంత వేగంగా సాగడం లేదు. వాస్తవానికి మొన్నటి వరకు పుట్టపర్తి వద్ద 500 మీటర్ల మేర భూసేకరణ సమస్య ఉండేది. ఇటీవలే దీనిని కొంత వరకు కొలిక్కి తీసుకొచ్చి పనులు ఆరంభించారు. వచ్చే నెలలో మారాల, చెర్లోపల్లి జలాశయాలకు నీటిని తీసుకెళ్తామని ఇంజినీర్లు చెబుతున్నారు.

* అయితే ప్రధాన కాల్వలోని ప్యాకేజీ-15బిలో సొరంగం పనులు సకాలంలో జరగడం లేదు. అక్కడ జరుగుతున్న పనుల తీరుచూస్తే ఇప్పుడప్పుడే అది పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

బీటీపీపై నేడు ఉత్తర్వులుండేనా? 
ఎగువన కర్ణాటకలో నిర్మించిన కట్టడాలు కారణంగా జిల్లాలోని అటు భైరవానితిప్ప, ఇటు అప్పర్‌ పెన్నార్‌ (పేరూరు) జలాశయాలకు చాలా కాలంగా జలకళ లేకుండా విహీనంగా మారాయి. అయితే వీటిలో భైరవానితిప్ప, పేరూరుకు జీడిపల్లి జలాశయాల నుంచి నీటిని ఇస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు 2016లో అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రకటించారు. ఆ తర్వాత ఈ రెండు పథకాలకు సంబంధించి ఇంజినీర్లు సమగ్ర పథక నివేదికలు (డీపీఆర్‌) సిద్ధం చేసే ప్రయత్నాలు చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట మండలంలో ఉన్న బీటీపీకి జీడిపల్లికి నీరు తరలించేందుకు తొలుత ఇంజినీర్లు ఓ ప్రతిపాదన సిద్ధం చేశారు. జీడిపల్లి నుంచి ఉప్పొంక వరకు ఎనిమిది ఎత్తిపోతల పథకాల ద్వారా 29 కి.మీ. మేర నీటిని తీసుకెళ్తారు. అక్కడి నుంచి 30 కి.మీ.మేర గ్రావిటీపై నీరు బీటీపీకి చేరుతుంది. ఇది ఒకటో దశ కింద ప్రణాళిక సిద్ధం చేశారు.  పూర్తిగా వెనుకబడిన ప్రాంతంలో ఓ జలాశయానికి పునరుజ్జీవం ఇవ్వడం ద్వారా అక్కడి వలసలు ఆపేందుకు వీలుంటుందని మంత్రి కాలవ శ్రీనివాసులు సీఎం వద్ద ప్రస్తావించి బీటీపీకి నీరు తరలించేందుకు ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించేలా చూశారు.

* ఇక జీడిపల్లి నుంచి పేరూరు జలాశయానికి కూడా నీటిని తరలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జీడిపల్లి నుంచి దాదాపు 55 కి.మీ. మేర కాల్వ, మధ్యలో మూడు జలాశయాలు, ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని పేరూరుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కూడా దాదాపు రూ.వెయ్యి కోట్లకు అటూ ఇటుగానే ఉంది. పేరూరుకు నీరివ్వాల్సిన అవసరం ఎంతో ఉందంటూ మంత్రి పరిటాల సునీత మొదటి నుంచి గట్టిగా కోరుతున్నారు. దీనికి సంబంధించిన దస్త్రం ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది.

కొత్త కొత్తగా మరిన్ని.. 
మరోవైపు తుంగభద్ర ఎగువ కాల్వ (హెచ్చెల్సీ) పరిధిలోని కొత్తగా మరికొన్ని జలాశయాలు నిర్మిస్తే భవిష్యత్తులో మేలు జరుగుతుందని ఇంజినీర్లు ప్రతిపాదిస్తున్నారు. సాధారణంగా తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ ప్రధాన కాల్వ ద్వారా జిల్లాకు వచ్చే నీరు నేరుగా కణేకల్లు చెరువుకు, అక్కడి నుంచి పీఏబీఆర్‌గానీ, ఎంపీఆర్‌లోకిగానీ చేరేందుకు వీలుంది. అయితే ఎగువ కాల్వ పరిధిలో ఎక్కడా నీటిని నిలిపేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో బొమ్మనహాళ్‌ మండలంలోని ఉంతకల్లు వద్ద ఓ జలాశయం నిర్మిస్తే అక్కడ తుంగభద్ర జలాశయాలను నిలిపేందుకు వీలుందనీ.. ఎగువ ప్రధాన కాల్వ పరిధిలో పంటలకు అవసరమైనప్పుడు నీరివ్వవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే దిగువన ఎంపీఆర్‌, పీఏబీఆర్‌ జలాశయాల్లో కూడా నీటిని నింపాల్సిన అవసరం ఉంది. మరోవైపు గండికోట నుంచి ఎత్తిపోతల ద్వారా జిల్లాకు నీటిని తీసుకురావడం... ఇందులో భాగంగా తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో ఒక్కో జలాశయం నిర్మించడం.. తదితర ప్రతిపాదనలను హెచ్చెల్సీ ఇంజినీర్లు సిద్ధం చేశారు. అయితే వీటన్నింటికీ నీటి కేటాయింపులు ఎవరిస్తారనేది కూడా ప్రశ్నార్థకం అవుతోంది.

Link to comment
Share on other sites

అనంతలో ఒక్కసారిగా అద్భుతమే జరిగింది...
21-01-2018 16:03:00
 
636521473697042790.jpg
వానలు ముఖం చాటేశాయి.. పంటలు కనుమరుగయ్యాయి.. భూములన్నీ బీడే.. ఎటుచూసినా.. ఎడారే.. పిల్లలను ఇంటి వద్ద వదిలి.. పండుటాకులను వారి వద్ద పెట్టి.. పొలం, ఇల్లు, ఊరు విడిచి.. వలస బాట పట్టారు.. ఆలుమగలు.. ఇక ఊరు ఆదుకోదనుకున్నారు.. పరాయి ప్రాంతమే శరణనుకున్నారు.. పుట్టి, పెరిగిన ఊరికే.. చుట్టాలయ్యారు..  ఒక్కసారిగా అద్భుతమే జరిగింది.. భూముల్లోకి నీరొచ్చింది.. భూమి లోపలి నుంచి ఉబికొచ్చింది.. ఎటుచూసినా.. పంటలు నిండిన పొలాలే.. ఊరికొచ్చిన వలస జీవులు.. కళ్లు నుళిమి చూసుకుంటున్నాయి.. ఇది కలా.. నిజమా.. అని.. సంబర పడుతున్నాయి.. ఇక.. ఊరిలోనే ఉండొచ్చని..
  • నిన్నటి దాకా కరువు కోరల్లో నలిగిన కలుగోడు..
  • బీటీపీకి నీటి చేరికతో మారిన ముఖచిత్రం..
  • బీడుభూముల్లో పరుచుకున్న పసిరిక..
  • పొలం పనుల్లో ప్రజలు బిజీ.. బిజీ..
గుమ్మఘట్ట(అనంతపురం జిల్లా): మండలంలోని కలుగోడు తదితర గ్రా మాలు ఒక్క ఉదుటన కరువు సీమ నుంచి భూతల స్వర్గంలోకి దూకేశాయి. నిన్నటి దాకా ఎటుచూసినా.. బీడుగా దర్శనమిచ్చిన పొలాలు.. నేడు పసిరిక పరచుకుని, కనువిందు చేస్తున్నాయి. బతుకు భారమై వలస వెళ్లిన ఊరి జనం.. తిరిగొచ్చారు. ఎండిన భూముల్లో పంటలు పెడుతూ.. సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలుతున్నారు. 20 ఏళ్ల క్రితం వరకు మండలంలోని భైరవాన్‌ తిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కింద సాగవుతున్న భూములన్నీ పచ్చని పంటలతో తులతూగుతుండేవి. ఏడేళ్లుగా తీవ్ర వర్షాభావం ఆవరించింది. బీటీపీ బీటలు వారి వట్టి పోవటంతో 12 వేల ఎకరాల ఆయకట్టు కంపచెట్లతో కళావిహీనంగా మారిపోయింది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు బీటీపీకి వరద నీరు చేరటంతో ప్రాజెక్టు కింద 3600 ఎకరాలు సాగునీటితో పంటలు పండేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎడమ కాలువ పరిధిలోని కలుగోడు, జే వెంకటాంపల్లి, రంగచేడు, బేలోడు గ్రామాల పరిధిలో బీడు పడ్డ ఆయకట్టు భూములు బీటీపీ నీటితో పంట పొలాలుగా మారాయి. ఏడేళ్లుగా భూగర్భజలాలు అడుగంటి బోసిపోయి కనిపిస్తున్న బోరు బావుల్లో సైతం పుష్కలంగా నీరు వస్తుండటంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. నీరు నిండిన పొలాల్లో కొంగల గుంపులు చేరి, సందడి చేస్తున్నాయి. నీరు లేక ఈ ప్రాంతాన్ని పదేళ్లుగా కన్నెత్తి చూడని సైబీరియన్‌ కొంగలు.. ప్రస్తుతం పొలాల్లో కనిపిస్తుండటం రైతులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఏడాది బీటీపీ నీటితో రైతులు వరి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భజలాలు పెంపొంది, బోరు బావుల్లో సైతం నీరు పుష్కలంగా వస్తోంది. దీంతో మూడేళ్ల పాటు బోరుబావులున్న రైతులు పుష్కలంగా పంటలు పండించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడాది వరుణ దేవుడు కరుణిస్తే కరువును కంటికి కనిపించకుండా తరిమేస్తామని రైతులు పేర్కొంటున్నారు. బీటీపీకి హంద్రీనీవా జలాలను తరలించేందుకు సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చర్యలు చేపడుతుండటం అన్నదాతలు ఆశలు రేకెత్తిస్తోంది. అది నిజమై, రెండేళ్లలో హంద్రీనీవా జలాలతో రిజర్వాయర్‌ను నింపితే ఈ ప్రాంత కరువు శాశ్వతంగా కనుమరుగవుతుందని ఇక్కడి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
పుంగనూరుకు కృష్ణా జలాలు! 
ఈనెల 12 నుంచి శ్రీకారం 
  400 క్యూసెక్కులతో ప్రారంభం 
  హంద్రీనీవా యంత్రాంగం కసరత్తు 
atp-brk1a.jpg

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా కృష్ణా జలాలు ఇప్పటి దాకా అనంతకే పరిమితం అయ్యాయి. కృష్ణమ్మను అనంత దాటించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు సాగిస్తోంది. ఎలాగైనా సరే ఈ నెలలోనే చిత్తూరు జిల్లా పుంగనూరు ఉప కాలువకు నీరు విడుదల చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపకల్పన చేశారు. ఈ దిశగా హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) అధికార యంత్రాంగం కూడా సన్నాహాలు చేస్తోంది. ఏ ఆటంకం ఏర్పడకపోతే ఈనెల 12 నుంచి నీరు విడుదల చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కూడా ఇక్కడి సీఈ సుధాకర్‌బాబుతో చర్చించారు. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి పుంగనూరు ఉప కాలువ పనులు ఎంత వరకు వచ్చాయనే దానిపై కూడా ఆరా తీశారు. పనులన్నీ దాదాపు పూర్తి దశకు చేరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం పుంగనూరు ఉప కాలువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువ 400.65 కి.మీ. వద్ద నుంచి పుంగనూరు ఉప కాలువ మొదలు అవుతుంది. కదిరి మండలం పట్నం సమీపంలోని నాగారెడ్డిపల్లి వద్ద ఈ కాలువ ప్రారంభం అవుతుంది. పుంగనూరు ఉప కాలువ మొత్తం దూరం 75.275 కి.మీ. ఇందులో సగం దూరం అనంతపురం జిల్లాలోనే ఉంటుంది. ఈ ఉప కాలువ 22.206 కి.మీ. నుంచి 26.425 కి.మీ. మధ్య చెర్లోపల్లి జలాశయం ఉంది. దీనిని 1.425 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు.

ఏప్రిల్‌ నాటికి జలాల చేరిక... 
ఈనెల 12 నుంచి కృష్ణా జలాలను విడుదల చేస్తే... ఏప్రిల్‌ ఆఖరు నాటికి పుంగనూరు ఉప కాలువ ద్వారా ఆఖరుగా ఉన్న చిప్పిరి జలాశయానికి చేరుతాయి. ఈ విషయాన్ని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సీఈ సుధాకర్‌బాబు ‘న్యూస్‌టుడే’తో సూచనప్రాయంగా తెలిపారు. నీటి విడుదల ప్రక్రియ అధికారింగా వెల్లడి కాలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ స్థాయిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మరో వైపు... ప్రస్తుతం చెన్నేకొత్తపల్లి మండలంలోని హంద్రీనీవా ప్రధాన కాలువ 304 కి.మీ. దాకా కృష్ణా జలాలు వెళ్లాయి. ఇక్కడి నుంచి పుంగనూరు ఉప కాలువకు నీరు వెళ్తాయి. 400.65 కి.మీ. దాకా ప్రధాన కాలువలోనే పారుతాయి. ఇక్కడే పుంగనూరు ఉప కాలువ మొదలయ్యేది. ఈనెల 23 దాకా ప్రధాన కాలువ నుంచి ఉప కాలువకు ప్రారంభం అవుతాయి. ఇక్కడి నుంచి ఏప్రిల్‌ 25 నాటికి ఈ ఉప కాలువ ఆఖరుకు చేరనున్నాయి. కొత్త కాలువ కావడం... ప్రథమంగా నీరు వెళ్లనుండటంతో వృథా (లాస్‌) ఎక్కువ అయ్యే వీలుందని ఇంజినీర్లు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం 400 క్యూసెక్కుల ప్రకారం విడుదల చేస్తారు. ఇప్పటి దాకా కృష్ణా జలాలు అనంతకు 19 టీఎంసీలు దాకా వచ్చాయి. గొల్లపల్లి, జీడిపల్లి, పీఏబీఆర్‌ వంటి జలాశయాలకే కాకుండా... చెరువులు, గుంతకల్లు ఉప కాలువకు సైతం ఈ నీటిని విడుదల చేస్తారు. మార్చి రెండో వారం దాకా శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవాకు నీరు వచ్చే వీలుంది. దాదాపు 8 టీఎంసీలు వస్తాయి. ఇందులో ఎక్కువగా పుంగనూరు ఉప కాలువకు మళ్లించే వీలుంది.

Link to comment
Share on other sites

గలగలా కృష్ణమ్మ.. పరుగులెట్టేలా! 
పుట్టపర్తి వద్ద ఆగిన కాల్వ పనులు 
ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి.. 
ముసళ్లవంక మీదుగా మళ్లించే వీలు 
మారాల, చెర్లోపల్లికి తరలించే యోచన 
atp-gen1a.jpg

హంద్రీనీవా ద్వారా పుష్కలంగా వస్తున్న కృష్ణా జలాలు మన జిల్లా చివరి వరకు, ఆపై చిత్తూరు జిల్లాకు వెళ్లేందుకు.. పుట్టపర్తి వద్ద కొంత భూసేకరణే సమస్య ఉండేది. దీనిని ఎలాగోలా అధిగమించి ఇటీవల అక్కడి కాల్వ తవ్వకం శరవేగంగా మొదలుపెట్టారు. అంతా సవ్యంగా జరుగుతోందని భావిస్తున్న సమయంలో.. సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. వెరసి కృష్ణా జలాలను పుట్టపర్తిని దాటించేందుకు ప్రత్యామ్నాయాలపై ఇంజినీర్లు దృష్టి సారించారు.

ఈనాడు - అనంతపురం

అనంతపురం జిల్లాకు దండిగా కృష్ణా జలాలు వస్తున్నా వాటిని హంద్రీనీవా కాల్వలో చివరి వరకు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పుట్టపర్తి వద్ద వివాదంగా మారిన భూసేకరణే ఇందుకు ప్రధానంగా అవరోధంగా ఉంది. దీంతో నీటి తరలింపునకు ఇతర మార్గాలపై కసరత్తు చేస్తున్నారు. హంద్రీనీవా రెండో దశలోని పుట్టపర్తి వద్ద ప్రధానకాల్వ కి.మీ.340 నుంచి 360 కి.మీ. వరకు తొమ్మిదో ప్యాకేజీ ఉంది. ఇందులో కమ్మవారిపల్లె వద్ద 500 మీటర్ల మేర కాల్వ పనులకు భూసేకరణ అవరోధంగా మారింది. భూ యజమాని పరిహారం కింద ఎక్కువ మొత్తం కోరుతుండటం, నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.23 లక్షలే ఇస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. ఆ తర్వాత ఇంజినీర్లు కాల్వ పనులు చేయడాన్ని సవాల్‌ చేస్తూ భూ యజమాని హైకోర్టును ఆశ్రయించడంతో చాలా కాలంగా ఇక్కడ పనులు నిలిచిపోయాయి. మరోవైపు ఈ కాల్వ అవతల సొరంగం పనులు దాదాపు పూర్తికావడం, అలాగే మారాల, చెర్లోపల్లి జలాశయాలు కూడా సిద్ధమవుతున్నా.. అక్కడికి నీటిని తీసుకెళ్లలేక పోయారు.

ఐదారు రోజుల్లో 
ముగుస్తుందనగా.. 
ఈ ఏడాది మార్చిలోపు ఎలాగైనా కృష్ణా జలాలను మారాల, చెర్లోపల్లి జలాశయాలకు తీసుకెళ్లడమే కాకుండా, చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి కూడా మళ్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరాకండిగా చెప్పారు. దీంతో అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేసి.. పుట్టపర్తి పరిధిలో భూసేకరణకు సంబంధించి హైకోర్టులో స్టే తొలగిపోయేలా చూశారు. దీంతో గత నెల 4 నుంచి మళ్లీ పుట్టపర్తి వద్ద పెండింగ్‌ కాల్వ పనులు ఆరంభించారు. శరవేగంగా ఈ పనులు సాగాయి. ఇక కృష్ణా జలాలు ఈప్రాంతాన్ని దాటి ముందుకు పరవళ్లు తొక్కుతాయని అంతా అనుకున్నారు. పెండింగ్‌ కాల్వ పనుల్లో దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. మరో ఐదారు రోజుల్లో కాల్వ పనులు పూర్తయ్యేవి. అయితే ఇంతలో భూయజమాని సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తీసుకు రావడంతో కాల్వ పనులు ఆగిపోయాయి. దీంతో జిల్లాకు వస్తున్న కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

చెరువు నుంచి మళ్లిద్దాం... 
ముఖ్యమంత్రి గడువు నిర్దేశించిన నేపథ్యంలో.. కృష్ణాజలాలు పుట్టపర్తిని దాటించి ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఇంజినీర్లు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం బుక్కపట్నం చెరువును కృష్ణా జలాలతో పూర్తిగా నింపారు. బుక్కపట్నం మండలంలోని ఈ చెరువులో నీటిని అక్కడి జానకంపల్లి వద్ద ముసళ్లవంకలోకి మళ్లించి 500 మీటర్లు దూరం తీసుకెళ్లి అక్కడ హంద్రీనీవా ప్రధాన కాల్వలోకి కలపాలని భావిస్తున్నారు. ఇలా అయితే పుట్టపర్తి వద్ద భూసేకరణ సమస్య కొలిక్కి రాకపోయినా ఇబ్బంది ఉండదు. అయితే బుక్కపట్నం చెరువు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి (ఎఫ్‌ఆర్‌ఎల్‌), ముసళ్లవంక బెడ్‌లెవెల్‌కు 1.2 మీటర్లు మేర మాత్రమే వ్యత్యాసం ఉంది. దీంతో ఈ వంక మీదుగా 200-250 క్యూసెక్కులు మాత్రమే మళ్లించే వీలుంది. చెరువు ఎఫ్‌ఆర్‌ఎల్‌కు, వంక బెడ్‌లెవెల్‌కు దాదాపు 3 మీటర్ల వ్యత్యాసం ఉంటే వేయి క్యూసెక్కులు వరకు మళ్లించేందుకు వీలుండేది. మరోవైపు ముసళ్లవంక నుంచి నీటిని తీసుకెళ్లాలని భావిస్తుండగా.. ఈ వంకలోని వాస్తవంగా ఉండే ప్రవాహానికి వ్యతిరేక దిశలో (రివర్స్‌లో) నీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో తమ పంటలకు నష్టం కలుగుతుందని ఈ వంకకు ఆనుకొని పంటలు సాగు చేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముసళ్లవంక ఒక్కటే మార్గం... 
అయినా ప్రస్తుతానికి ముసళ్లవంక మీదుగా నీరు మళ్లించడం ఒక్కటే మార్గమని ఇంజినీర్లు చెబుతున్నారు. దీనికి తుది ఆమోదం లభిస్తే.. హంద్రీనీవా నీటిని బుక్కపట్నం చెరువులోకి, ఆ చెరువు నుంచి ముసళ్లవంక మీదుగా మళ్లీ బుక్కపట్నం మండలంలోని హంద్రీనీవా కాల్వలోకి నీటిని పోస్తారు. అక్కడి నుంచి తొలుత మారాల జలాశయాన్ని (0.464 టీఎంసీల సామర్థ్యం)  నింపుతారు. ఆ తర్వాత హంద్రీనీవా ప్రధాన కాల్వలోని 410 కి.మీ. నుంచి మొదలయ్యే పుంగనూరు బ్రాంచి కాల్వలోకి నీటిని మళ్లించి కదిరి పరిధిలో ఉన్న చెర్లోపల్లి జలాశయానికి (1.425 టీఎంసీల సామర్థ్యం) తీసుకెళ్లనున్నారు. ఇదిలాఉండగా.. పుట్టపర్తి వద్ద భూసేకరణపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఈ శుక్రవారం పరిష్కారం అవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...