Jump to content

Handri - Niva SUJALA - PHASE 2


sonykongara

Recommended Posts

why srisailam water is getting diverted with out leaving water to nagarjuna sagar...why NS aycut farmers are getting treated as secondary citizens in AP

 

Imagine the political fallout if Krishna delta was kept dry until 2019 while water was diverted to seema

 

without pattiseema horrible sir horrible

Link to comment
Share on other sites

  • Replies 443
  • Created
  • Last Reply

We r suffering like anything since we have 5 acres under this aycut and imagine others whose children yet to settle atleast I got settled

govt em cheyalekapotundi.. NS right canal ki.. aa Congi/centre Nagarjunasagar mottham TG control loki ichi sacharu... vadu emo unna konchem water kooda lagesthunnadu... :sleep: 

 

NS Right canal farmers.. should go to Highcourt appude emaina water vache chances untayi..

 

Srisailam nunchi water emaina release chesthe... vatini ee NS dwara TG mottham thodesthadi :sleep:

Link to comment
Share on other sites

We r suffering like anything since we have 5 acres under this aycut and imagine others whose children yet to settle atleast I got settled

 

I understand you bro, imagine the plight of entire rayalaseema farmers for all these years. In this case, there is nothing that can be done. Even if water is released to NS from srisailam it will not benefit you because of KCR, so CBN is just working in the best interests of the state. If you see the last couple of years TG has never followed the orders from Krishna tribunal in spirit. This is bound to happen if you create an authority to oversee things but without any power to implement them. Center too is staying mum on this and I consider it a bigger culprit here.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 4 weeks later...
  • 2 weeks later...

NS farmers should approach the courts. Opposition wont help as it is entirely seema based. Bad luck 

 

This year sep, oct lo manchi water vastayi anipistondi. chooddam

 meeru annatle - manchi water vatchayi

 

Super prediction

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
లెక్క తప్పింది...ముందే ఊరు మునిగింది 
గండికోట ముంపు గ్రామాల అంచనాల్లో ఇంజినీరింగ్‌ వర్గాల వైఫల్యం 
22.5 టీఎంసీలకు కొండాపురంలోకి  నీళ్లొస్తాయన్నారు.. 7.6 టీఎంసీలకే మునక 
పరిహారానికి ముందే గ్రామాల్లోకి నీరు రాకపై నిర్వాసితుల ఆందోళన 
సీఎంవో దృష్టికి చేరిన సమస్య.. అధికారుల మల్లగుల్లాలు
అధికారుల అంచనాలు లెక్కతప్పాయి.. ఊహాజనిత చిత్రాలు ఊహలకే పరిమితం కాగా ముందే నీళ్లు ఊళ్లను ముంచేస్తూ  ఉసూరుమనిపిస్తున్నాయి.. పరిహారం దక్కనిస్థితిలో తొలి, మలివిడత గ్రామాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జిల్లాలోని గండికోట జలాశయ ముంపు గ్రామాల్లో ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
kdp-top2a.jpg

ఈనాడు, కడప : గండికోట జలాశయం కింద కొండాపురం, ముద్దనూరు మండలాలకు సంబంధించి మొత్తం 22 గ్రామాలు ముంపులో వెళ్లాయి. 26.84 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన గండికోట జలాశయంలో టీఎంసీల వారీగా ఏఏ గ్రామాలు ముంపులోకి వెళతాయన్న దానిపై అధ్యయనం చేసి ఆ మేరకు ఊహాజనిత చిత్రాలను రూపొందించారు. వాటి ఆధారంగా విడతల వారీగా గ్రామాలను విభజించి పరిహారం లెక్కలకు ప్రతిపాదించారు. ప్రస్తుతం తొలి విడతలో 14 గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం రూ.479 కోట్ల మేర మంజూరు చేసింది. ఇప్పటికే మూడోవంతు మేర సొమ్ము క్షేత్రస్థాయిలో పంపిణీ జరిగింది.  ఇప్పుడు ముంపు పరంగానే కొత్తరకం సమస్య వచ్చింది. మూడో విడతలో మునుగుతాయనుకున్న గ్రామాలు మొదటి విడతలోనే మునిగాయి.

ఇదీ పరిస్థితి.. 
గండికోట జలాశయంలో ప్రస్తుతం 7.689 టీఎంసీల నీరు ఉంది. 20 రోజులుగా ఎక్కువగా నీరు చేరుతోంది. ప్రస్తుతం 4,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇలా గండికోటకు వస్తున్న నీటిని పైడిపాళేనికి 680 క్యూసెక్కులు, మైలవరానికి 2,400 క్యూసెక్కులు, సీబీఆర్‌కు 1000, వామికొండకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గండికోట ముంపుపరంగా ఇబ్బందులు నెలకొంటున్నాయి.

ఏం చెప్పారంటే 
మొత్తం 26.84 టీఎంసీల నిల్వసామర్థ్యం ఉన్న గండికోట జలాశయంలోకి 3.48 టీఎంసీల నీరు వస్తే సీతాపురం గ్రామం మునకలో చేరుతుందని ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించారు. 3.49 టీఎంసీలకు చౌటిపలి,్ల 4.16కు గండ్లూరు, 4.33కు ఓబన్నపేట మునిగిపోతాయన్నారు. 4.59 టీఎంసీలకు బొమ్మేపల్లి, 5.26కు దొరువుపల్లి, 5.78కు బుక్కపట్నం, 6.22కు గంగాపురం, 6.95కు రేపల్లె, 7.54కు ముచ్చుమర్రి గ్రామాలు మునుగుతాయని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటిమట్టం ప్రకారం చూస్తే ఇప్పటివరకు పేర్కొన్న గ్రామాలన్నీ మునిగిపోవాలి. ప్రస్తుతం

ksp-top2b.jpg

ముచ్చుమర్రి పూర్తిగా మునకలోకి చేరలేదు. పంటపొలాలు, రోడ్లపైకి నీరు చేరింది. ఇక్కడే 7.92 టీఎంసీలకు ఫక్కీరుపేట, 8.97కు దత్తాపురం, 9 టీఎంసీలకు నేదరపేట, 11.82కు కొర్రపాడు, 17.7కు తాళ్ల ప్రొద్దుటూరులోకి నీరు చేరుతుందని స్పష్టం చేశారు. 18.87కు చామలూరు, యర్రగుడి, 22.53కు కొండాపురం.. 26.84 టీఎంసీల మట్టానికి పి.అనంతపురం, రేగడిపల్లి, ఏటూరు, సుగుమంచిపల్లి పల్లెల్లోకి జలాలు చేరుతాయని అధికారులు తేల్చారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రస్తుతం కొండాపురంలోకి నీరు చేరుతోంది.

అంతా తల్లకిందులు : ఇప్పుడు 7.68 టీఎంసీలు నీరు ఉండగా 7.54 టీఎంసీలకే మునగాల్సిన ముచ్చుమర్రి గ్రామం ఇంకా ముంపునకు గురికాలేదు. పంటపొలాలు, రహదారి ముంపునకు గురైంది. గ్రామం సమీపంలోకి నీళ్లు చేరాయి. 22.53 టీఎంసీల మట్టానికి మునకలో చేరాల్సిన కొండాపురం ప్రస్తుతం ముంపులోకి చేరుతోంది. మొత్తం 22 గ్రామాలు ముంపులో ఉండగా.. తొలివిడతలో 14 గ్రామాలను పరిహారం పంపిణీ చేపట్టారు. అందులో ఇంకా కొందరికి అందాల్సి ఉంది. రెండో విడతలో 8 గ్రామాలున్నాయి. తాళ్లప్రొద్దుటూరు, చామలూరు, యర్రగుడి, కొండాపురం, పి.అనంతపురం, రేగడిపల్లి, ఏటూరు, సుగుమంచిపల్లి గ్రామాలకు పరిహారం అందాల్సి ఉంది. వీరికి సంబంధించి అధికారులు సర్వే నిర్వహిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ వర్గాల లెక్కలు తప్పడం.. గండికోట ముంపులో గ్రామాలు నీళ్లలోకి చేరే అంశం తారుమారు కావడంతో రెండోదశ గ్రామాల్లోనూ అలజడి మొదలైంది. చివరన ముంపులోకి వెళ్లాల్సిన తమ పల్లెలు.. ప్రస్తుతం ముంపునకు గురైతే తమ పరిస్థితేంటన్న భయం వారిని వెంటాడుతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము ఇబ్బందిపడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఈ సమస్య ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో వారూ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.

సమస్యపై ప్రత్యేక దృష్టి 
-బాబూరావునాయుడు, జిల్లా కలెక్టర్‌ 
గండికోటలో 7 టీఎంసీల నీటిమట్టానికే కొండాపురం పరిసరాల్లోకి నీరు వస్తోందన్న విషయం ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఇంజినీరింగ్‌ వర్గాలతోనూ ఈ విషయంపై మాట్లాడాం. ఏం జరుగుతోందన్న దానిపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నాం. నిరుపేదలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. సమస్యను ఉన్నతవర్గాల దృష్టికీ తీసుకెళ్లాం.

పొంతనలేని మాటలు  - వెంకటసుబ్బయ్య, రామచంద్రనగర్‌ 
అధికారులు చెప్పిన మాటలకు ఇక్కడ జరుగుతున్న దానికీ సంబంధం ఉండటం లేదు. 22.5టీఎంసీల నీరు గండికోటకు వస్తే కొండాపురం మునుగుతుందని చెప్పారు. 7 టీఎంసీకే మా కాలనీ సమీపంలోకి నీళ్లు వచ్చాయి. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వం స్పందించాలి.

సమొదటి జాబితాలో చేర్చాలి  -మనోహర్‌బాబు, కొండాపురం 
మా గ్రామం పరిహారం పొందే విషయంలో మూడో జాబితాలో ఉంది. మొదటి జాబితాలో ఉన్న పల్లెలతో పాటే మా పల్లె కూడా నీళ్లలోకి చేరుతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ తప్పిదం జరిగింది. మొదటిజాబితాలో కొండాపురాన్ని చేర్చి తొందరగా పరిహారం లెక్కలు తేల్చాలి.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
గాలేరు - నగరి అంచనాల పెంపు 
మల్లెమడుగు రిజర్వాయర్‌కు అనూహ్య వ్యయం 
మరో రూ.50 కోట్లతో ప్రతిపాదనలు 
పనుల్లో కానరాని పురోగతి

ఈనాడు-తిరుపతి : గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నమూనాలో మరో మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుత డిజైన్ల ప్రకారం ప్రాజెక్టు అసాధ్యమని నిర్ధరించిన అధికారులు.. కొన్ని మార్పులు చేస్తూ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. రేణిగుంట సమీపంలోని మల్లెమడుగు రిజర్వాయరు చుట్టూ కట్ట నిర్మించేందుకు భారీగా ఖర్చు అవుతుందని భావిస్తున్న గుత్తేదారు.. ఆ మేరకు వ్యయ అంచనాలు పెంచాల్సిందిగా అధికారులను కోరారు. ఇదే విషయాన్ని అధికారులు రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించారు. 
జిల్లాలోని తూర్పు ప్రాంతానికి కల్పతరువుగా భావిస్తున్న గాలేరు నగరి ప్రాజెక్టు పనులు ప్రారంభానికి ముందే వివాదాలు చుట్టుకుంటున్నాయి. తొలుత గ్రావిటీ ద్వారా కాల్వల్లో నీటిని తరలించాలని భావించినా అది సాధ్యం కాదని తేలింది. తాజాగా ఎత్తిపోతల పథకాలనే చేర్చుతూ జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతిపాదిత ఏడు రిజర్వాయర్ల సంఖ్యను మూడుకు కుదించే అంశంపైనే అధికారులు దృష్టిసారించారు. కడప జిల్లాలోని గాలేరు నది నుంచి నీటిని రైల్వే కోడూరు దాటిన తర్వాత తిరుపతి సమీపంలో మల్లెమడుగు రిజర్వాయర్‌కు తరలించాల్సి ఉంది. ఈ రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 2.65   టీఎంసీలకు పెంచాలని, ఇందుకోసం రూ.195.12 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తూ గుత్తేదారుకు పనులు అప్పగించారు. అయితే, గుత్తేదారు తాను చేయాల్సిన దానికంటే ఎక్కువ పనులు చేశానంటూ మరో రూ.50 కోట్ల అదనంగా అంచనాలు పెంచి చెల్లించాల్సిందిగా కోరుతున్నారు. ఈ రిజర్వాయర్‌ చుట్టూ 4.575 కి.మీల మేరకు 30 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మించాల్సి ఉంది. బండ్‌ నిర్మాణం చేపట్టాలంటే.. ముందుగా భూమి అడుగు భాగంలో సుమారు 2.5 మీటర్ల లోతు నుంచి కందకం తవ్వాల్సి ఉంటుంది.

పనుల్లో అవాంతరం 
ఇప్పటి వరకు అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఓ అవాంతరం ఎదురైంది. బండ్‌ కోసం 1 కి.మీ పరిధి వరకూ భూమి కింది భాగంలో డొల్లగా ఉండటంతో ఏకంగా 20 అడుగుల లోతుకు తవ్వి మట్టి నింపాల్సి వస్తోంది. దీంతో వ్యయ అంచనాలు పెరిగినట్లు గుత్తేదారు అధికారుల దృష్టికి తెచ్చారు. ఇందుకు సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ అదనంగా చెల్లించాల్సిందిగా కోరారు. ఈ మొత్తం నిధులు అందని కారణంగా పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. టెండర్‌ షెడ్యూలుకు విరుద్ధంగా అదనంగా డబ్బు చెల్లించే అధికారం అధికారులకు లేదు. దీంతో ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి నివేదించారు. కమిటీ సభ్యులు కూడా గుత్తేదారుతో రెండు మూడు సార్లు చర్చలు జరిపారు. తర్వాత పనుల అంచనా కమిటీ కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆమోదం లభిస్తే.. ప్రభుత్వం అదనంగా నిధులు చెల్లించే ఆస్కారం ఉంటుంది.

పంపింగ్‌లోనూ ఇబ్బందులు... 
రిజర్వాయర్‌ నిర్మాణ సమయంలో భారీ ఎత్తున గుంతలు తవ్వారు. గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు వాటిల్లో నీరు చేరింది. ఇప్పుడా నీటిని తొలగిస్తే తప్ప పనులు ముందుకు సాగవు. మోటార్లతో నీటిని తోడేందుకు కూడా నిధులు చెల్లించాల్సిందిగా గుత్తేదారు అధికారులను కోరారు. అయితే ఇలా పంపింగ్‌ ద్వారా నీటిని తోడేందుకు ఒకేసారి నిధులను మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ బిల్లుల చెల్లింపుపై స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. అధికారుల స్పందనపై గుత్తేదారు విముఖంగా ఉన్నట్లు తెలిసింది. వెరసి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుంటే.. గుత్తేదారు వ్యయం పెరిగిందంటూ జాప్యం చేయడం గమనార్హం.

ctr-gen6a.jpg
Link to comment
Share on other sites

చక్కని ఆదరువు! 
పీఏబీఆర్‌ కుడి కాలువకు నీరు 
25 నుంచి జనవరి ఆఖరు దాకా.. 
49 చెరువులకు 2.5 టీఎంసీలు 
atp-top2a.jpg

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ఎట్టకేలకు పెన్న అహోబిలం సమతుల జలాశయం (పీఏబీఆర్‌) కుడి కాలువకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల 25 నుంచి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 31 దాకా ఇస్తారు. రోజూ 650 క్యూసెక్కుల చొప్పున సరఫరా చేయనున్నారు. ఈ విషయాన్ని హెచ్చెల్సీ ఎస్‌ఈ సురేందర్‌రెడ్డి ధ్రువీకరించారు. నీటి విడుదలపై రెండు నెలల నుంచి సుదీర్ఘ తర్జనభర్జన సాగింది. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తలెత్తిన వివాదంతో నీటి విడుదలలో జాప్యం సాగుతూ వచ్చింది. ఎస్‌ఈ సురేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత సదరు ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చించారు. ఈ వ్యవహారంపై నెలకొన్న వివాదాన్ని కలెక్టర్‌ వీరపాండియన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అందరి అభిప్రాయాలు, అంగీకారం మేరకు... ఈనెల 25న నీరు  ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్నారు. పీఏబీఆర్‌ కుడి కాలువ 112 కి.మీ. మేర ఉంది. ఈ జలాశయంలో ప్రస్తుతం 4.5 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇందులో 2.5 టీఎంసీల దాకా కుడి కాలువ కింద ఉన్న 49 చెరువులకు ఇస్తారు. తొలి దశగా ఒక్కో చెరువుకు 30 శాతం ప్రకారం నీరు ఇవ్వాలని భావించారు. హంద్రీనీవా నుంచి ఆశించిన మేర నీరు వస్తే రెండో విడతగా అదనంగా నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది.

కాలువ వెంట పోలీసు నిఘా... 
పీఏబీఆర్‌ కుడి కాలువ కింద మొత్తం 38,600 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇదంతా ఆ 49 చెరువుల కింద ఉన్న ఆయకట్టే. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా కుడి కాలువ కింద చెరువులకు నీరు ఇస్తూనే ఉన్నారు. 2015-16లో కుడి కాలువ కింద అన్ని చెరువులకు నీరు ఇచ్చారు. ఆ తర్వాత 2016-17 సీజన్‌లోనూ 30 నుంచి 100 శాతం దాకా 32 చెరువులను నింపారు. ఇప్పుడు కూడా ఒక్కో చెరువుకు 30 శాతం దాకా నింపాలని నిర్ణయించారు. ఇందుకు 2.5 టీఎంసీలు కేటాయించారు. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో కూడేరు, శింగనమల మండలం గార్లదిన్నెలో కొన్ని చెరువులు, రాప్తాడు పరిధిలో ఆత్మకూరు, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గ పరిధిలో బత్తలపల్లి, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో ఆ 49 చెరువులు ఉన్నాయి. నిర్దేశించిన ప్రకారం ఒక్కో చెరువుకు కేవలం 30 శాతం నీరు మాత్రమే ఇస్తారు. మధ్యలో నీటి చౌర్యానికి గురి కాకుండా కాలువ వెంట పోలీసు బందోబస్తు ఉంటుంది. ఇందుకు పది మంది ఎస్సైలు, 80 మంది కానిస్టేబుళ్ల దాకా బందోబస్తు అవసరమని ఇప్పటికే ఎస్‌ఈ సురేందర్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై ఎస్పీకి కూడా నివేదించారు.

Link to comment
Share on other sites

జలసిరి..జిల్లాకు ఊపిరి! 
కృష్ణాజలాలతో జలకళను సంతరించుకున్న గండికోట జలాశయం 
8.25 టీఎంసీలతో తొలిసారి రికార్డు స్థాయిలో నీటినిల్వ 
kdp-top1a.jpg

కడప, ఈనాడు : కడపలో కృష్ణమ్మ సవ్వడి కనువిందు చేస్తోంది.. గండికోటలో శ్రీశైల జలం కళకళలాడుతోంది. రాయలసీమ జిల్లాల గుండెకోటగా పేరొందిన గండికోట జలాశయంలోకి చరిత్రలోనే తొలిసారిగా 8.25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మొత్తం 26.84 టీఎంసీల నిల్వసామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ఇప్పటివరకు 3-5 టీఎంసీల లోపు మాత్రమే నీటిని నింపగలిగారు. అదీ ట్రయల్‌రన్‌, పైడిపాళెం ఎత్తిపోతల పథకం కోసం నిల్వచేశారు. ఇప్పుడు తొలిసారిగా గండికోటలోకి కృష్ణాజలాలను పారిస్తూ.. వాటిని పరిసర జలాశయాలకూ పంపిణీ చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు గండికోటలోకి 8.25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఇక్కడి నుంచి ప్రస్తుతం మరో నాలుగు జలాశయాలకు పంపిణీ జరుగుతోంది. కడప-అనంత సరిహద్దున ఉన్న చిత్రావతి జలాశయంలోకి 960 క్యూసెక్కుల చొప్పున పంపిస్తున్నారు. సీబీఆర్‌కు 2 టీఎంసీల నీరు చేరింది. పైడిపాళెం జలాశయంలోకి నాలుగు మోటార్ల ద్వారా 680 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. మైలవరం జలాశయంలోకి 5 టీఎంసీల నీరు చేరింది. వామికొండకు 200 క్యూసెక్కులు వెళుతుండగా.. సర్వరాయసాగర్‌కు 0.29 టీఎంసీల నీరు విడుదల చేసేందుకు సమాయత్తమయ్యారు.

ఇబ్బందులు అధిగమిస్తూ.. : గండికోట నుంచి నీటి పంపిణీకి పరిసర జలాశయాల వరకు ప్రతిచోటా  ఇబ్బందులు ఎదురయ్యాయి. గండికోటలోకి ప్రభుత్వం 12 టీఎంసీల నీరు తెచ్చేందుకు సంకల్పించింది.  ఇక్కడ కొన్ని ముంపుగ్రామాలకు ఇంకా పరిహారం అందకపోవడంతో బాధితులు ఊళ్లు ఖాళీ చేసేందుకు వెనకడుగేశారు. వారిని ఒప్పించి బయటకు తెస్తోంది. ఇంజినీరింగ్‌ వర్గాల అంచనాలు తప్పి 23 టీఎంసీల మట్టానికి మునకలో చేరాల్సిన కొండాపురం 7 టీఎంసీలకే మునుగుతోంది. దీంతో గండికోటలోకి చేరే నీటిని తగ్గిస్తున్నారు. గతంలో 4 వేల క్యూసెక్కులు రాగా.. ప్రస్తుతం 2,800 క్యూసెక్కులకు తగ్గించారు.  గండికోట-చిత్రావతి జలాశయాల మధ్యన ఎత్తిపోతల పథకంలోనూ నాణ్యతాలోపాలు పూర్తిస్థాయి పంపింగ్‌కు సమస్యగా మారాయి. ప్రభుత్వం పట్టువిడవకుండా శ్రీశైలం నీటితో నింపేందుకు ప్రయత్నిస్తోంది.    కడపలో ఏళ్లుగా బీడుబారిన కాల్వలు జలాలతో కనిపిస్తున్నాయి. రైతుల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ బాబూరావునాయుడు ‘ఈనాడు’తో మాట్లాడుతూ గండికోట నిర్వాసితులకు న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు గండికోటలోకి 8.25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఇక్కడి నుంచి ప్రస్తుతం మరో నాలుగు జలాశయాలకు పంపిణీ జరుగుతోంది. కడప-అనంత సరిహద్దున ఉన్న చిత్రావతి జలాశయంలోకి 960 క్యూసెక్కుల చొప్పున పంపిస్తున్నారు. సీబీఆర్‌కు 2 టీఎంసీల నీరు చేరింది. పైడిపాళెం జలాశయంలోకి నాలుగు మోటార్ల ద్వారా 680 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. మైలవరం జలాశయంలోకి 5 టీఎంసీల నీరు చేరింది. వామికొండకు 200 క్యూసెక్కులు వెళుతుండగా.. సర్వరాయసాగర్‌కు 0.29 టీఎంసీల నీరు విడుదల చేసేందుకు సమాయత్తమయ్యారు.

ఇబ్బందులు అధిగమిస్తూ.. : గండికోట నుంచి నీటి పంపిణీకి పరిసర జలాశయాల వరకు ప్రతిచోటా  ఇబ్బందులు ఎదురయ్యాయి. గండికోటలోకి ప్రభుత్వం 12 టీఎంసీల నీరు తెచ్చేందుకు సంకల్పించింది.  ఇక్కడ కొన్ని ముంపుగ్రామాలకు ఇంకా పరిహారం అందకపోవడంతో బాధితులు ఊళ్లు ఖాళీ చేసేందుకు వెనకడుగేశారు. వారిని ఒప్పించి బయటకు తెస్తోంది. ఇంజినీరింగ్‌ వర్గాల అంచనాలు తప్పి 23 టీఎంసీల మట్టానికి మునకలో చేరాల్సిన కొండాపురం 7 టీఎంసీలకే మునుగుతోంది. దీంతో గండికోటలోకి చేరే నీటిని తగ్గిస్తున్నారు. గతంలో 4 వేల క్యూసెక్కులు రాగా.. ప్రస్తుతం 2,800 క్యూసెక్కులకు తగ్గించారు.  గండికోట-చిత్రావతి జలాశయాల మధ్యన ఎత్తిపోతల పథకంలోనూ నాణ్యతాలోపాలు పూర్తిస్థాయి పంపింగ్‌కు సమస్యగా మారాయి. ప్రభుత్వం పట్టువిడవకుండా శ్రీశైలం నీటితో నింపేందుకు ప్రయత్నిస్తోంది.    కడపలో ఏళ్లుగా బీడుబారిన కాల్వలు జలాలతో కనిపిస్తున్నాయి. రైతుల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ బాబూరావునాయుడు ‘ఈనాడు’తో మాట్లాడుతూ గండికోట నిర్వాసితులకు న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...