Jump to content

APIIC industrial park in Mallavalli,Verpanenigudam


sonykongara

Recommended Posts

అశోక్‌ లేలాండ్‌ భూమిపూజ
31-03-2018 07:10:38
 
636580770397628645.jpg
  • మల్లవల్లికే మణిహారం
  •  సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
(విజయవాడ): దేశీయ దిగ్గజ ఆటోమొబైల్‌ ‘అశోక్‌ లేల్యాండ్‌’ సంస్థతో.. నేడు మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో పారిశ్రామిక ఘంటిక మోగబోతోంది. రాజధాని ప్రాంతంలో పారిశ్రామిక జోన్‌గా మారిన గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం, మల్లవల్లి గ్రామం ఇప్పుడు మెగా ఇండస్ర్టియల్‌ హబ్‌గా మారుతోంది. మొత్తం 30.10 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి పరిచిన మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో 75 ఎకరాల విస్తీర్ణంలో దక్షిణ భారత దేశంలోనే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బస్‌ బాడీ బిల్డింగ్‌, ఛాసిస్‌ మేకింగ్‌ యూనిట్లు ఏర్పడబోతున్నాయి. కృష్ణా జిల్లాకు ఎప్పటి నుంచో బిగ్‌ ఇండస్ర్టీ రావాలని కోరుకుంటున్న ప్రజలకు నిజంగా ఇది శుభవార్తే! భారీ పరిశ్రమల కేటగిరిలో మొట్టమొదటిదిగా అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ నేడు మల్లవల్లిలో కాలుమోపుతోంది. రూ.13 కోట్లతో ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేసిన అశోక్‌ లేల్యాండ్‌ ఎంఓయూలో భాగంగా వేగంగా పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రూ.135 కోట్ల మేర పెట్టుబడులను ఈ సంస్థ పెడుతోంది. మొత్తం 2,295 మందికి స్థానికంగా ఉద్యోగాలు కల్పించే భారీ ఇండస్ర్టీ ఇదే కావటం గమనార్హం. అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ రాకతో మల్లవల్లికే ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌లో మొత్తం 962 ప్లాట్లు ఉన్నాయి.
 
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమలకు వీలుగా 500, 750, 1000, 1500, 2754, 3500, 4257, 19,000, 20,250 31,297, 75,581, 5,91,591 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లాట్లను వర్గీకరించటం జరిగింది. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల కోసం మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 82.5 ఎకరాలు, నవ్యాంధ్ర ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 11.5 ఎకరాలు, స్వర్ణాంధ్ర ఇండస్ర్టీస్‌ అసోసియేషన్కఉ 13.5 ఎకరాలు, మల్లవల్లి స్మాల్‌ మీడియం ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 26.1 ఎకరాల చొప్పున మొత్తం 133 ఎకరాలను కేటాయించటం జరిగింది. మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌తో వాస్తవంగా 468 ఎకరాలకు ఏపీఐఐసీ ఎంవోయూ చేసుకోవటం జరిగింది. అలాగే ఏపీజే అబ్దుల్‌ కలాం అనే అసోసియేషన్‌తో మరో 60 ఎకరాలు ఇవ్వటానికి ఎంవోయూ జరిగింది. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌ ప్రాజెక్టు కింద మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌ రూ. 1100 కోట్ల పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించటానికి సిద్ధంగా ఉంది. డైరెక్ట్‌గా 10,500 మందికి ఉపాధి, పరోక్షంగా మరో 8 వేల మందికి ఉపాధి కల్పించటానికి సిద్ధమని హామీ ఇచ్చింది. ఇండస్ర్టీస్‌ అసోసియేషన్స్‌ అన్నీ కలిపి మొత్తం 400 పైచిలుకు పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చాయి. ముందుకు వచ్చిన అసోసియేషన్లకు తగిన భూములు ఏపీఐఐసీ కల్పించలేకపోవటానికి మల్లవల్లిపై ఉన్న డిమాండ్‌ అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఏపీఐఐసీ అధికారులు కూడా ల్యాండ్‌ కాస్ట్‌తో పాటు అంతర్గత రోడ్లు, వరదనీటి మళ్ళింపు కాల్వలు, అంతర్గత పవర్‌ సప్లై, అంతర్గత నీటి సరఫరా వంటి కోసం ఎకరానికి రూ.16.50 లక్షలు ఖర్చు చేసింది. అదే ధరకు పారిశ్రామికవేత్తలకు విక్రయిస్తోంది. కంటింజెన్సీస్‌, ప్రైస్‌ ఎస్కలేషన్‌, లేఅవుట్‌ అప్రూవ్‌- డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, ల్యాండ్‌ కన్వర్జెన్స్‌ ఛార్జీలు, ఎన్విరాన్‌మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌, అడ్మినిస్ర్టేషన్‌ ఛార్జీలు, వడ్డీలు కలిపి ఏపీ ఐఐసీ అధికారులు రూ.4.50 కోట్ల మేర ఖర్చు చేయటం జరిగింది. భారీ పరిశ్రమల శ్రేణిలో ముందుగా అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ ముందుకు రావటం గొప్ప విషయంగా భావించాల్సి ఉంది.
 
ఏర్పాట్లు పూర్తి
అశోక్‌ లేల్యాండ్‌ శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత మల్లవల్లిలో ఎన్టీఆర్‌ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సెంట్రలైజ్డ్‌ ఎయిర్‌ కూలింగ్‌ వేదికను సిద్ధం చేవారు. వేదికను తీర్చిదిద్దారు. డిజిటల్‌ స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు. ఐదువందల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అశోక్‌ లేల్యాండ్‌ ఎండీ వినోద్‌ కే దాసరి వస్తున్నాయి. కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయబోయే పరిశ్రమకు సంబం ధించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వను న్నారు. ఏపీఐఐసీ అధికారులు రోడ్డు, హెలి ప్యాడ్‌ వంటి పనులు పూర్తి చేశారు. మల్లవల్లి లే అవుట్‌ డెమోను ప్రదర్శిం చను న్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ బాల య్యనాయుడు లక్ష్మీకాంతం ఏర్పాట్లను సమీక్షించారు. జేసీ విజయకృష్ణన్‌, నూజివీడు ఆర్డీవో సీహెచ్‌ రంగయ్య, డీఎస్పీ శ్రీని వాసరావు, తహసీల్దార్‌ కె.గోపాలకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు.
Link to comment
Share on other sites

  • Replies 240
  • Created
  • Last Reply
లేలాండ్‌ @ ఏపీ
01-04-2018 02:18:46
 
636581459274198973.jpg
  • చాసిస్‌ తయారీ ప్లాంటుకు సీఎం భూమిపూజ
  • ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీకీ అశోక్‌ లేలాండ్‌ సై
  • తొలి ప్లాంట్‌ మన గడ్డపైనే.. దుబాయ్‌ స్థాయిలో తయారీ
  • ఏపీకి సదర్‌లాండ్‌, నెట్‌మ్యాజిక్‌, డెస్క్‌ ఎరా!
 
అమరావతి(ఆంధ్రజ్యోతి): అతి భారీ వాహనాల తయారీకి పెట్టింది పేరయిన ‘అశోక్‌ లేలాండ్‌’ ..ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. శనివారం కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో తన ప్లాంటుకు ఘనంగా భూమిపూజ జరుపుకొంది. అదే వేదిక నుంచి.. ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీకి కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా తాము చేపడుతున్న ఈ వాహనాలను ఏపీ ప్రభుత్వం కోరితే, అందించడానికి సుముఖత వ్యక్తం చేసింది. అశోక్‌ లేలాండ్‌ చేసిన ఈ ప్రకటనను అక్కడికక్కడే సీఎం చంద్రబాబు స్వాగతించారు. త్వరలోనే దీనిపై ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని అశోక్‌ లేలాండ్‌ సీఎంవో, ఎండీ వినోద్‌ కే దాసరికి ఆ వేదిక నుంచే చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నూరుశాతం ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగమే తమ లక్ష్యమని ప్రకటించారు. అశోక్‌ లేలాండ్‌ ఏర్పాటుచేస్తున్న అత్యాధునిక చాసిస్‌ మేకింగ్‌ - బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌కు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. నాలుగు నెలల్లోగా ఈ ప్లాంటు దాకా రహదారి సౌకర్యం ఏర్పాటు చేయిస్తానన్న సీఎం, ఆరు నెలల్లో వాహనాలను అందుబాటులోకి తీసుకోవడం మొదలుపెట్టాలని లేలాండ్‌ యాజమాన్యానికి స్పష్టం చేశారు. ఈ ప్లాంటు కోసం ఉదారంగా ముందుకొచ్చి, భూములిచ్చిన రైతులకు ఈ సందర్భంగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
 
       ‘‘రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదు. విభజనచట్టంలో ఇచ్చిన హామీలనూ కేంద్రం నెరవేర్చలేదు. అయినా, సీఎంగా నేను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటిదాకా అనుక్షణం రైతన్నలు చేదోడువాదోడుగా నిలిచారు. రాజధాని నిర్మాణం మొదలు గన్నవరం విమానాశ్రయానికి ఔటర్‌ రింగ్‌రోడ్డు, రన్‌వే, కొత్త టెర్మినల్‌ అభివృద్ధి, పట్టిసీమ కాలువ, మల్లవల్లి పారిశ్రామికవాడ దాకా రైతులు భూములు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించారు. భూములు ఇవ్వకుండా అడ్డుకోవాలని కొంతమంది రాజకీయ నేతలు ప్రయత్నించినా, వారి మాటను వినలేదు. నాపై నమ్మకంతో రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారు’’ చంద్రబాబు అన్నారు.
 
         ‘రాష్ట్రంలో అశోక్‌ లేలాండ్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనతో వినోద్‌ కె దాసరి ముందుకొచ్చారు. తొందరగా ప్లాంటును స్థాపించాలనుకుంటే, తిరుపతిలో లేక శ్రీసిటీ సెజ్‌లో ప్లాంటును ఏర్పాటు చేయాలని నేను సూచించాను. అయితే.. తాను కృష్ణా జిల్లాకు చెందినవాడినని.. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వీలుగా మల్లవల్లిలోనే ప్లాంటును ఏర్పాటు చేస్తానని వినోద్‌ నాతో చెప్పారు. ఆయన మాటలు విని నేనెంతో సంతోషించాను’’ అని అంటూ.. వినోద్‌ను చంద్రబాబు అభినందించారు. మల్లవల్లి పార్కు లో లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని, అశోక్‌ లేలాండ్‌లోనే 2500 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
 
సీఎం చెప్పిన ‘వజ్రం’ కథ!
బ్రిటీష్‌ పాలకులు దేశాన్ని విడిచి, హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో భాగం అయ్యే సమయంలో కృష్ణాజిల్లా పరిటాల, మల్లవల్లిని విడిచిపెట్టేందుకు నిజాం నవాబు అంగీకరించలేదని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ‘‘మల్లవల్లిలో వజ్రాలు ఉండేవని నిజాం నవాబులు భావించారు. ఈ ప్రాంతాలను ఆయన తన ఆధీనంలో ఉంచుకోగా, స్థానిక ప్రజలు తిరగబడ్డారు. నిజాం సంస్థానం భారత్‌లో విలీనం జరిగినప్పుడు మల్లవల్లి గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. మల్లవల్లిలో వజ్రాల సంగతేమోగాని, ఇప్పుడు వజ్రం లాంటి అశోక్‌ లేలాండ్‌ వస్తోంద’’ని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
 
ప్రతి ఊరూ.. కాకులపాడు కావాలి
రాజధాని నిర్మాణం కోసం తానిచ్చిన పిలుపునకు తక్షణమే స్పందించిన కాకులపాడు రైతులను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కాకులపాడు రైతులు విరాళంగా సమకూర్చిన రూ.2,66,000 చెక్కును కృష్ణాజిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సీఎంకు అందజేశారు. పాడి రైతులు, తాము అమ్మిన పాలలో ఒక లీటర్‌ పాలు డబ్బులను రూ.16 వేలను సీఎంకు అందించారు.
 
    ఎకరానికి బస్తా ధాన్యం చొప్పున కాకులపాడులోని రైతులందరూ రాజధాని నిర్మాణంకోసం విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారని ఆంజనేయులు.. సీఎంకు వివరించారు. ప్రతి ఊరు ఒక కాకులపాడు కావాలని సీఎం ఆకాంక్షించారు. ‘‘పట్టిసీమ నిర్మించటం వల్లే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైంది. పంటలను సమృద్ధిగా పండించుకోగలుగుతున్నారు’’ అని చెప్పారు. విజయవాడకు చెందిన ఆదర్శ రైతు చలసాని సుబ్బారావు రూ.1,10,000 విరాళాన్ని అందించారు. గతంలోనూ రాజధానికి రూ.5 లక్షలు ఇవ్వడం గమనార్హం.
Link to comment
Share on other sites

మల్లవల్లి.. ఇక ఇండస్ర్టియల్‌ టౌన్‌షిప్‌
01-04-2018 06:41:44
 
636581617028881917.jpg
  • అమరావతి, ఎయిర్‌పోర్టు, పోర్టులు, జాతీయ రహదారులతో అనుసంధానం
  •  మల్లవల్లిలో 802 పరిశ్రమలు .. లక్ష మందికి ఉద్యోగాలు
  •  జిల్లా మీద మమకారం చూపించిన దాసరి మీకే ఉద్యోగాలు ఇస్తాడు
  •  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
(విజయవాడ/హనుమాన్‌జంక్షన్‌ ): ‘మల్లవల్లి ఇక ఇండస్ర్టియల్‌ టౌన్‌షిప్‌గా మారిపోతుంది. వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మొత్తం 802 పరిశ్రమలు రాబోతున్నాయి. తద్వారా లక్ష ఉద్యోగాలు... స్థానికంగానే ఎక్కువ సంఖ్యలో రాబోతున్నాయి’ అని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్ర బాబునాయుడు అన్నారు. మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో 75 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే మొట్టమొదటిదిగా అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ ఏర్పాటుచేస్తున్న అత్యాధునిక ఛాసిస్‌ మేకింగ్‌, బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌కు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాతిక కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌పోర్టు ఉంది. దగ్గర్లోనే ఔటర్‌రింగ్‌ వస్తోంది. రాజధానికి అనుసంధానం కావచ్చు.. జాతీయ రహదారి మీదుగా కాకినాడ పోర్టుకు, భవిష్యత్తులో బందరు పోర్టుకు వెళ్లవచ్చు. జలరవాణా కూడా అందుబాటులోకి రాబోతోంది. పారిశ్రామిక వికాసానికి అవసరమైన సదుపాయాలు అతి దగ్గరలో ఉన్నాయి’ అని అన్నారు. మల్లవల్లి ఇంత త్వరగా సాకారం కావటానికి రైతుల చొరవే కారణమని చెప్పారు. రైతుల చొరవ వల్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామన్నారు.
 
అమరావతి రాజధానికి 34 వేలఎకరాల భూములు పెద్దమనసుతో రైతులు ఇచ్చారని చెప్పారు. విజయవాడ విమానాశ్రయానికి రోజుకు ఒక్క విమానం వచ్చే పరిస్థితి ఒకప్పుడు ఉండేదని, కొన్ని సందర్భాలలో అది కూడా ఉండేది కాదన్నారు. ఒక చిన్న పాత టెర్మినల్‌తో ఉండే ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయటానికి భూములు కావాల్సి వస్తే అమరావతి భూములు ఇస్తామని హామీ ఇస్తే నమ్మకంగా గన్నవరం నియోజకవర్గం రైతులు 1000 ఎకరాల భూములు ఇచ్చారని చెప్పారు. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌ ఇంత త్వరగా సాకారం అవుతుందని తాను కూడా అనుకోలేదన్నారు. రైతులను రెచ్చగొట్టి అడ్డుకోవటానికి కొందరు ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం మీద నమ్మకం తగ్గలేదన్నారు. అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ ఏర్పాటుచేయటానికి ఆ సంస్థ ఎండీ వినోద్‌ కే దాసరి తన దగ్గరకు వచ్చినపుడు .. అప్పటికి మల్లవల్లి సిద్ధమవుతుందో లేదోనని చిత్తూరులో భూములు ఇస్తానని, శ్రీ సిటీలో ఏర్పాటుచేయాలని తాను సూచించినట్టు చెప్పారు. కృష్ణా జిల్లా బిడ్డ కాబట్టి జన్మభూమిపై ఉన్న మమకారంతో మల్లవల్లిలోనే ఏర్పాటుచేస్తానని ఆయన చెప్పారని కొనియాడారు. జన్మభూమి మీద మమకారం చూపించినవాడు మీకే ఉద్యోగాలు ఇస్తాడని చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర న్యాయశాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యుడు కొణకళ్ల నారాయణరావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, కలెక్టర్‌ లక్ష్మీకాంతం, అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ ప్రతినిధులు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

మల్లవల్లి నుంచే... ఎలక్ర్టిక్‌ బస్సులకు నాంది !
01-04-2018 06:50:09
 
636581622079066628.jpg
  • దుబాయ్‌ తర్వాత .. ఆ స్థాయిలో దేశంలోనే మొదటి ప్లాంట్‌
  •  6 నెలల్లో .. ఉత్పత్తి బయటకు తెస్తాం: వినోద్‌ కే దాసరి
  •  4 నెలల్లో రోడ్డు వేసి ఇస్తాం.. 6 నెలల్లో తప్పకుండా రావాలి : చంద్రబాబు
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ / హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌):ఎలక్ర్టిక్‌ కమర్షియల్‌ వాహనాల తయారీకేంద్రంగా మల్లవల్లి భాసిల్లబో తోంది. దుబాయ్‌ తరహా ఆధునిక పరిజ్ఞానం కలిగిన ‘ఛాసిస్‌ మేకింగ్‌- బస్‌బాడీ’ ప్లాంట్‌ను మల్లవల్లిలో దేశంలోనే మొదటిదిగా ఏర్పడబోతున్న శుభతరుణం లో.. చారిత్రక నేపథ్యం కలిగిన మల్లవల్లి కేంద్రంగా దేశంలోనే మొదటిగా ఎలక్ర్టిక్‌ వాహనాలను రూపొందించనున్నట్టు అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ సీఈవో, ఎండీ వినోద్‌ కే దాసరి ప్రకటించారు. మల్లవల్లి కేంద్రంగా ఎలక్ర్టిక్‌ వాహనాలను తీసుకువస్తున్నట్టు వినోద్‌ కే దాసరి ప్రకటించటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇంతకు ముందు ఈ వాహనాలను తీసుకు వస్తున్నట్టు అశోక్‌ లేల్యాండ్‌ ఎప్పుడూ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు. దీంతో ఎలక్ర్టిక్‌ వాహనాలను తీసుకువస్తున్నామని చెప్పగానే సీఎం సంతోషం వ్యక్తంచేశారు. ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని నూరుశాతం అమలు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఉందని, దీనికి సంబంధించి ప్రత్యేక పాలసీని కూడా రూపొందించామని, అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రపంచంలో దుబాయ్‌లో మాత్రమే ఉన్న ఆధునిక సదుపాయాలతో కూడిన ఛాసిస్‌ మేకింగ్‌ - బస్‌ బాడీ ప్లాంట్‌ను దేశంలో తొలిసారిగా ఏర్పాటుచేస్తున్న విధానాన్ని, ప్లాంట్‌లో ఏర్పాట్ల గురించి దాసరి వివరించిన తీరు ముఖ్యమంత్రిని ఆకట్టుకుంది.
 
ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం
అశోక్‌ లే ల్యాండ్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ సంస్థ ఎండీ మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు కమిట్‌మెంట్లు ఇచ్చారు. ప్రధాన రోడ్డును పూర్తిచేసి ఇస్తే.. ఆరునెలల్లోనే తాము ప్రోడక్టును విడుదల చేస్తామని, మళ్లీ మీ చేత ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. నాలుగు నెలల్లో భూ సేకరణ పనులన్నీ పూర్తిచేసి పూర్తి రోడ్డును అప్పగిస్తామని, 180 రోజుల్లో ఉత్పత్తిని తీసుకు రావటానికి సిద్ధంగా ఉండాలని, ఈ రోజు మార్చి 31.. తనతోపాటు అందరూ గుర్తుంచుకోవాలని, సరిగ్గా 180 రోజుల తర్వాత ప్రారంభించటానికి వస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. రెండవ కమిట్‌మెంట్‌గా.. వినోద్‌ కే దాసరి స్థానిక ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సామాజిక బాధ్యత కింద స్థానికంగా ఉండే ప్రాథమిక పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
 
 1.jpgఅమరావతి సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణాలు
మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌లో అశోక్‌ లే ల్యాండ్‌ సంస్థ ఏర్పాటుచేయబోయే ప్లాంట్‌లోని నిర్మాణాలను అమరావతి సంస్కృతి నేపథ్యంలో నిర్మించబోతున్నట్టు ఆ సంస్థ ఎండీ ప్రకటించారు. ఇదే సందర్భంలో ప్రధాన ప్లాంట్‌ పర్‌స్పెక్టివ్‌ వ్యూ డిజైన్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ సంస్థ నిర్మించబోయే అడ్మిన్‌ బిల్డింగ్‌ అమరావతి స్థూపాన్ని పోలి ఉండేలా... మధ్యలో స్థూపంతో నిర్మించబోయే అడ్మిన్‌ భవనం నమూనాను ప్రదర్శించారు. అలాగే క్యాంటిన్‌ను పూర్తిగా స్తూపాకారంలో నిర్మించే డిజైన్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. దీంతోపాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం నిర్మించబోయే బిల్డింగ్‌ నమూనాను కూడా ఆయన విడుదల చేశారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...
ఇండస్ర్టియల్‌ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటులో జాప్యం.. వద్దు !
27-06-2018 09:13:50
 
636656876309268178.jpg
  • వీరపనే నిగూడెం ఇండస్ర్టియల్‌ పార్క్‌లో ఎంఎస్‌ఎంఈ ఆలస్యం
  • ఏపీఐఐసీ నోటీసులు
  • క్షేత్ర స్థాయి ఇబ్బందులపై పారిశ్రామికవేత్తల వివరణ
ఆంధ్రజ్యోతి, విజయవాడ: రాజధాని ప్రాంతంలో పారిశ్రామిక జోన్‌గా అభివృద్ధి చెందుతున్న గన్నవరం ప్రాంతంలోని వీరపనేని గూడెం ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటు.. జాప్యమవుతోంది. దీనిపై ఏపీఐఐసీ ఆందోళన చెందుతోంది ! ఇంకా చాలా యూనిట్ల ఏర్పాటు ఆలస్యం కానుండటంతో డెడ్‌లైన్‌లోపు పనులు పూర్తి చేయించడానికి ఏపీఐఐసీ శ్రీకారం చుట్టింది. నత్తనడకన పనులు జరుగుతున్న యూనిట్ల పారిశ్రామిక వేత్తలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చింది. వీటిని అందుకున్న పారిశ్రామిక వేత్తలు పనులు ఎందుకు ఆలస్యవు తున్నాయో వివరణలు పంపారు.
 
 
తలో కారణం
ఇది కొండప్రాంతం కావడంతో చదును చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవు తున్నాయని కొందరు, భవన నిర్మాణ అనుమతులకు ప్లాన్లు రావడం లేదని మరికొందరు, స్టేషనరీ రవాణా, సాంకేతిక ఏర్పాట్ల ప్రక్రియ తదితర కారణాలతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. అనుకున్న సమయంలోనే పూర్తి చేస్తామని చాలా వరకు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సొంత రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలంతా అమరావతి ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌గా ఏర్పడి ప్రభుత్వంతో సంప్రదించారు.
 
 
తగిన విస్తీర్ణంలో లేక
వీరపనేనిగూడెం ప్రాంతంలోని దాదాపు 81 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండ ప్రాంతాన్ని ఇండస్ర్టియల్‌ పార్క్‌గా ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. దీన్ని చదును చేయించి రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు.
 
 
70కిపైగా పారిశ్రామికవేత్తలకే..
తగిన విస్తీర్ణంలో స్థలం చూపించలేకపోవడంతో 70కి పైగా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే ప్లాట్లను కేటాయించగలింది. ఔట్‌రేట్‌ సేల్‌ కింద ఇక్కడి ప్లాట్లను తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఎకరం అభివృద్ధి చేయడానికి రూ.60 లక్షలు వ్యయమైనా, పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం పెద్ద మనసుతో రూ.16.50 లక్షలకే కేటాయించింది. పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా పనులు ప్రారంభించారు. ఏర్పాటుచేసే యూనిట్ల త్రీడీ డెమోలను ప్రదర్శించారు. అంతే వేగంగా వారికి కేటాయించిన ప్లాట్లలో పనులకు ఉపక్రమించారు.
 
సమయానికే పూర్తవుతాయా!
చకచకా ఏర్పాట్లు చేసినా వేగంగా పనులు జరగకపోవటంతో నిర్ణీత సమయంలో పనులు పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారుతోంది. వచ్చే ఏడాది వరకు సమయం ఉన్నా షెడ్యూల్‌ జాప్యమవుతుండటంతో ఏపీఐఐసీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. నిర్దేశించిన సమయంలో పనులు జరిగేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుండటం.. ప్రస్తుతం జరుగుతున్న ఆలస్యంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు.. దీంతో నిబంధనలకు అనుగుణంగా ఏపీఐఐసీ అధికారులు పారిశ్రామికవేత్తలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
 
 
నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది బిల్డింగ్‌ ప్లాన్‌కు దరఖాస్తులు చేసుకున్నామని, అనుమతులు త్వరగా రావడం లేదని చెబుతుండటం గమనార్హం. సొంతగడ్డపై మమకారంతో ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి వస్తే ప్లాన్ల మంజూరులో జరుగుతున్న జాప్యంపై కొందరు పారిశ్రామిక వేత్తలు అసహనంతో ఉన్నారు. కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ మట్టి చదును చేసుకుని యూనిట్లను ఏర్పాటు చేయటానికి అంత ఆషామాషీ కాదని చెప్పడం గమనార్హం. కొందరు జాప్యం చేస్తున్నా చాలా వరకు ఏదో ఒక ఇబ్బందుల వల్లనే ఆలస్యమవుతున్నాయని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి వారి ఇబ్బందులను తొలగించటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 
మల్లవల్లి .. ఇంకా సేల్‌ డీడ్‌ల దశలోనే..
మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో కొద్ది కాలం కిందట అసోసియేషన్లకు కేటాయించిన భూముల్లో పనుల ప్రారంభం ఆలస్యమవుతోంది. ముందుగా ఆయా సంస్థలు, ఏపీఐఐసీ మధ్య సేల్‌డీడ్లు జరగాల్సి ఉన్నాయి. ఈ ప్రక్రియ జాప్యమవుతోంది. ఇది ఎంత త్వరగా పూర్తయితే అంతవేగంగా పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
Link to comment
Share on other sites

నిరీక్షణ ఫలించింది.. రైల్‌ నీర్‌ వచ్చేస్తోంది..!
12-07-2018 08:09:20
 
636669797596942997.jpg
  • నెల రోజుల్లో బాటిలింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు
  • మల్లవల్లిలో ఏర్పాటుకు ఐఆర్‌సీటీసీ సన్నద్ధం
  • ఏపీఐఐసీ నుంచి 1.04 ఎకరాల కొనుగోలు
  • స్థలాన్ని పరిశీలించిన ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు
ఐదేళ్ల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు జిల్లాలో ‘రైల్‌ నీర్‌’ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అడుగు ముందుకుపడింది. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో రైల్‌నీర్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయటానికి ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) శ్రీకారం చుట్టింది. బుధవారం మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో తమకు ప్రతిపాదించిన భూమిని పరిశీలించిన ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు తాము వెంటనే ‘రైల్‌ నీర్‌’ బాట్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయదలిచామని చెప్పారు.
 
 
విజయవాడ: ఐదేళ్ల ఎదురుచూపు తర్వాత ... ఎట్టకేలకు ‘రైల్‌ నీర్‌’ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అడుగు ముందుకుపడింది! దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలో ఏర్పాటు కావాల్సిన ‘రైల్‌ నీర్‌ ’ ప్లాంట్‌ కథ కంచికి చేరిందనుకున్న తరుణాన.. అనూహ్యంగా ఇది తెర మీదకు వచ్చింది. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో ‘ రైల్‌నీర్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌’ ఏర్పాటు చేయటానికి ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) శ్రీకారం చుట్టింది. మల్లవల్లిలో ప్లాంట్‌ కోసం 1.04 ఎకరాల భూమిని ఏపీఐఐసీ నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఎకరం రూ. 16.50 లక్షల ధరకు అవుట్‌రేట్‌ సేల్‌ కింద కొనుగోలు చేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. భూమి కేటాయింపుపై ఇప్పటికే ఏపీఐఐసీ నుంచి ఐఆర్‌సీటీసీకి మౌఖికంగా అనుమతి లభించింది. అధికారికంగా ఐఆర్‌సీటీసీకి, ఏపీఐఐసీ భూమిని కేటాయించాల్సి ఉంది.
 
స్వాధీనంచేసే భూమిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఏపీఐఐసీ ఆసక్తి చూపింది. ఏపీఐఐసీ ఇంకా భూమిని తమకు కేటాయించకపోవటంతో బుధవారం ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో తమకు ప్రతిపాదించిన భూమిని పరిశీలించారు. ఆ తర్వాత ఏపీఐఐసీ అధికారులను ఎప్పటికి భూమిని స్వాధీనం చేస్తారని అడిగారు. అలాట్‌మెంట్‌ చేసిన తర్వాత సేల్‌ డీడ్‌ రాసుకున్నాక భూమిని స్వాధీనం చేస్తామని, దీనికి నెల రోజుల సమయం పట్టవచ్చని ఐఆర్‌సీటీసీ ప్రతినిధులకు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. తాము త్వరగా ‘రైల్‌ నీర్‌’ బాట్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయదలిచామని, సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్థలం స్వాధీనంతోనే ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తామని ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు ఏపీఐఐసీ దృష్టికి తీసుకు వచ్చారు.
 
ఐదేళ్ల కిందట ‘రైల్‌నీర్‌ ప్లాంట్‌’కు కేటాయింపులు
సరిగ్గా 2012-13 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రైల్‌ నీర్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేటాయింపులు చేయటం జరిగింది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్‌ తర్వాత కీలకమైన విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ నీర్‌ ’ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం కేటాయింపులు చే సింది. విజయవాడలో పుష్కలంగా నీటి లభ్యత ఉందని, కృష్ణానది చెంతనే ఉండటం వల్ల నీటికి సమస్య ఉండదని గుర్తించిన కేంద్రం ఈ ప్రాజెక్టును ఏరికోరి మరీ అప్పట్లో విజయవాడ డివిజన్‌కు కేటాయించింది. అప్పట్లో రూ.10 కోట్ల వ్యయంతో ‘రైల్‌ నీర్‌ ’ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. కానీ, కార్యరూపం దాల్చటంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంది.
 
కాంట్రాక్టు సంస్థల పేచీతో... టెండర్లు రద్దు
ప్రతిష్ఠాత్మక ‘రైల్‌ నీర్‌’ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీకి అప్పగించింది. కృష్ణానది తీరం వెంబడి కృష్ణా ప్యాలెస్‌ (రైల్వే బ్రడ్జి) దగ్గర ప్రత్యేకంగా రైల్వేశాఖకు రిజర్వాయర్‌ ఉంది. ప్రస్తుతం విజయవాడ రైల్వే జంక్షన్‌, వివిధ శాఖల కార్యాలయాలు, లోకోషెడ్‌లు, సిబ్బంది క్వార్టర్స్‌ అన్నింటికీ ఇదే రిజర్వాయర్‌ నుంచి నీటి సరఫరా జరుగుతోంది. ఐఆర్‌సీటీసీ ఇక్కడ ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించి టెండర్లను పిలిచింది. టెండర్లలో పాలుపంచుకున్న కాంట్రాక్టు సంస్థలు స్థలాన్ని బీవోటీ కింద అప్పగించే విషయంలో విధించిన కాల పరిమితిపై అభ్యంతరాలు వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టు సంస్థ ఆసక్తి చూపలేదు. దీంతో వేచిచూసిన ఐఆర్‌సీటీసీ ఆ టెండర్లను రద్దు చేసింది. ఆ తర్వాత ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్‌లో విజయవాడ డివిజన్‌కు రైల్‌నీర్‌ బాట్లింగ్‌ యూనిట్‌కు కేటాయింపులు చూపటం తప్పితే ఇప్పటివరకు ఇది కార్యరూపం దాల్చలేదు. మళ్ళీ ఇంతకాలానికి కానీ పాత ప్రతిపాదన కార్యరూపంలోకి రానుంది.
 
రైల్‌ నీర్‌ .. సురక్షిత నీరు
దక్షిణ మధ్య రైల్వే తమ ప్రయాణికులకు సురక్షిత మంచినీటిని అందించటానికి ‘రైల్‌ నీర్‌’ పేరుతో సరికొత్త మినరల్‌ బాటిల్స్‌ను తీసుకువచ్చింది. రైల్వే ప్రయాణికులు సురక్షిత మంచినీటిని తాగలేకపోతున్నారని ఫిర్యాదులు తరచూ వస్తుండటం.. వాటర్‌ బాటిల్స్‌ పేరుతో రీ సైక్లింగ్‌ బాటిల్స్‌ను విక్రయించటం వంటి ఉదంతాలు వెలుగుచూడటంతో దక్షిణ మధ్య రైల్వే సొంతంగా తక్కువ ధరకు మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ను అందించాలని నిర్ణయించి ‘రైల్‌ నీర్‌’ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టింది. రైల్వే ప్రయాణికులకు బయటి సంస్థలు రూ.20కి బాటిల్‌ను విక్రయిస్తుండటంతో రూ.15కే వాటర్‌ బాటిల్‌ను అందించాలని నిర్ణయించి పలుచోట్ల ప్లాంట్లను నెలకొల్పింది. రైల్వే శాఖ పరిధిలో ప్రయాణికులకు ఈ బాటిల్స్‌ తప్ప మిగిలినవి విక్రయించకూడదని ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు.
 
ఐఆర్‌సీటీసీయే .. నిర్వహణ
ఆపరేషన్స్‌ పరంగానే కాకుండా ఇతర ఆదాయాలపై దృష్టి సారించిన రైల్వేశాఖ ఫుడ్‌ క్యాటరింగ్‌, టిక్కెట్‌ రిజర్వేషన్‌, టూరిజం ప్యాకేజీలు వంటివి ఐఆర్‌సీటీసీ సంస్థకు అప్పగించింది. రైల్‌నీర్‌ కాన్సెప్ట్‌ వచ్చిన తర్వాత దీనిని కూడా ఐఆర్‌సీటీసీకి అప్పగించింది. అప్పటి నుంచి రైల్వే శాఖ పరిధిలో ఐఆర్‌సీటీసీ ప్రైవేటు సంస్థల ద్వారా రైల్‌నీర్‌ బాటిల్స్‌ను ఉత్పత్తి చేయిస్తోంది. విజయవాడలో మాత్రం ఏర్పాటు చేయటంలో జాప్యం జరిగింది. విజయవాడ నుంచి ఫుడ్‌ క్యాటరింగ్‌ ప్రధానంగా జరుగుతుంటుంది. ప్యాంట్రీ కూడా ఇక్కడే ఉంది. అలాంటపుడు స్థానికంగానే ‘రైల్‌నీర్‌ ప్లాంట్‌’ కూడా ఉంటే బాగుండేది.
 
నెల రోజుల్లో ‘రైల్‌ నీర్‌’ ప్లాంట్‌ ఏర్పాటు పనులు
కాంట్రాక్టు సంస్థల అనాసక్తి, టెండర్ల రద్దుతో ‘రైల్‌ నీర్‌’ ప్లాంట్‌ను ఎక్కడ పెట్టాలన్న దానిపై ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే, ఐఆర్‌సీటీసీలు రెండూ కుస్తీ పట్టాయి. అనుకూలమైన స్థలం లభ్యం కాలేదు. చివరికి మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో భూములపై ఐఆర్‌సీటీసీ దృష్టి సారించింది. పరిశ్రమల ఏర్పాటుకు తక్కువ ధరకే భూమిని ఏకంగా కొనుగోలు చేసే అవకాశం దొరకటంతో మార్గం సుగమం అయింది. బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఐఆర్‌సీటీసీ సంసిద్ధంగా ఉంది. మౌలిక సదుపాయాలతో స్థలం అభివృద్ధి చేసి అప్పగించటానికి నెల రోజుల సమయం పడుతుందని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. ఈ లోపు ప్లాంట్‌ ఏర్పాటుకు తగిన ప్రక్రియను పూర్తిచేయాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...