Jump to content

APIIC industrial park in Mallavalli,Verpanenigudam


sonykongara

Recommended Posts

  • Replies 240
  • Created
  • Last Reply

మెగా ఫుడ్ స్ట్రోక్
07-02-2018 09:11:02

పక్క పక్కనే ఉన్న భూములకు వేర్వేరు ధరలు
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌ - ఏపీఐఐసీ ఇష్టారాజ్యం
ఫుడ్‌ పార్క్‌ భూములకు రూ. 42 లక్షల ధర నిర్ణయం
ఆన్‌లైన్‌ పెట్టి నెలైనా... పది దరఖాస్తులు రాని వైనం
రెండున్నరేళ్ల నుంచి ఎదురు చూసిన వారికి నిరాశ
ఆసక్తి చూపని పారిశ్రామిక వేత్తలు
 పక్క పక్కనే స్థలాలు... ధరల్లో బోలెడంత వ్యత్యాసం. ఒకటి ఎకరం రూ. 16.50 లక్షలు, మరొకటి రూ. 42 లక్షలు, ఇంకోటి రూ. 6 లక్షలే. ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు కేటాయించిన భూమికి నిర్ణయించిన ధర రూ .16.50 లక్షలు. దీని అభివృద్ధికి రైతులకు భారీ పరిహారం ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇక ఎకరం రూ. 42 లక్షలు నిర్ణయించిన భూమి మెగా ఫుడ్‌ పార్కుకు కేటాయించినది. దీని అభివృద్ధికి కేంద్రం నుంచి సబ్సిడీలు కూడా పెద్దమొత్తంలోనే వచ్చినా ధర భారీగా నిర్ణయించారు. టాప్‌ లేచిపోయే ధరలతో మెగా ఫుడ్‌ పార్క్‌ ప్లాట్లను ఆన్‌లైన్‌లో పెట్టారు. దాంతో పట్టుమని పదిమంది పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రాలేదు.
 
ఏపీఐఐసీ అధికారుల రూటే వేరు! భూ సేకరణ చే యకుండానే ప్రభుత్వ భూములను ఉచితంగా పొందింది..! రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం అంతకన్నా లేదు! మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టే మొత్తంలో సగం కేంద్రం భరిస్తుంది! ఇలాంటపుడు ఆ భూములను అభివృద్ధి చేసి అమ్మకానికి పెడితే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. భూ సేకరణ జరిపి, రైతులకు నష్టపరిహారం చెల్లించి, కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేపట్టి విక్రయించిన ప్లాట్లను మాత్రం కారుచౌక ధరకు విక్రయిస్తున్న ఏపీఐఐసీ అధికారులు మెగా ఫుడ్‌ పార్క్‌ వంటి కేంద్ర సబ్సీడీ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం రెట్టింపు ధరలతో స్థానిక పారిశ్రామికవేత్తలకు చుక్కలు చూపిస్తున్నారు.
 
విజయవాడ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మల్లవల్లిలోని మెగాఫుడ్‌ పార్క్‌ ఎప్పుడు పూర్తవుతుందా అని రెండున్నర సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న స్థానిక పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ అధికారులు ఝలక్‌ ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయకుండా ఏపీఐఐసీ ఉన్నతాధికారులు రెట్టింపు ధరను నిర్ణయించటంతో.. ప్లాట్ల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టి దాదాపు నెల దాటినా పట్టుమని పది దరఖాస్తులు కూడా రాకపోవటం గమనార్హం.
 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చాలా ప్రాధాన్యతా రంగం. సాధారణ పరిశ్రమలలో రూ.1 కోటి పెట్టుబడికి ఒక్క ఉద్యోగం కల్పిస్తే.. ఈ రంగంలో పదిమందికి ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం ద్వారా గ్రామాల్లో ఉద్యానపంటల సాగు పెరుగుతుంది. ఇంత ముఖ్యమైన ఫుడ్‌ ప్రాసెస్‌ సెక్టార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కూడా టాప్‌ ప్రయారిటీగా తీసుకుని బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేపట్టింది. రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఫుడ్‌పార్క్‌లు ఉండగా, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే లేవు. కేంద్ర ప్రభుత్వం 2014లో కృష్ణాజిల్లాకు మెగా ఫుడ్‌పార్క్‌ను ప్రకటించింది. ముందుగా తోటపల్లిలో 468 ఎకరాలను కృష్ణాజిల్లా యంత్రాంగం కేటాయించింది. అది కొండ ప్రాంతంగా ఉండటంతో బాపులపాడు మండలం మల్లవల్లిలోని ప్రభుత్వ భూములు 100 ఎకరాలను కేటాయించింది.
 
ఈ భూముల్లో 57 ఎకరాలు కేంద్ర పోర్షన్‌లోను, 43 ఎకరాలను రాష్ట్ర పోర్షన్‌లోనూ ఏపీఐఐసీ అధికారులు లేఅవుట్‌ వేశారు. కేంద్ర పోర్షన్‌లో లేఅవుట్‌ వేసి ప్లాట్ల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచింది. తీరా ప్లాట్ల ధరలు చూస్తే పారిశ్రామికవేత్తలకు షాక్‌ తగిలింది. ఎకరం రూ.42 లక్షల చొప్పున నిర్ణయించటంతో రాష్ట్రంలోని ఇతర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పారిశ్రామికవేత్తలు కూడా ముక్కున వేలేసుకున్నారు. కేంద్ర పోర్షన్‌ ప్లాట్లను ఆన్‌లైన్‌లో పెట్టిన కొద్ది రోజులకు స్టేట్‌ పోర్షన్‌ ప్లాట్ల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టింది. కేంద్ర పోర్షన్‌లో రోడ్లు, పవర్‌, డ్రెయిన్లు, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌తో పాటు కోట్లాది రూపాయల కామన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు వంటి సౌకర్యాల వల్ల ధర అంత నిర్ణయించారు. మరి.. స్టేట్‌ పోర్షన్‌లో రోడ్లు తప్ప ఎలాంటి సదుపాయాలు లేని భూములు ఎకరం రూ.42 లక్షలుగా ఏపీఐఐసీ అధికారులు ధరను నిర్ణయించారు. దీంతో దరఖాస్తులే రాని పరిస్థితి ఏర్పడింది.
 
ఆశలపై నీళ్లు
స్థానికంగా రెండున్నరేళ్లుగా ఆశలు పెట్టుకున్న పారిశ్రామిక వేత్తలలో సంతోషం మటుమాయం అయింది. దరఖాస్తు చేయటానికి భయపడుతున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అన్నది సీజనల్‌ వ్యాపారం. పండ్లు, ఆహార పంటల ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి విపత్తులు సంభవించినా.. దిగుబడి తగ్గిపోయినా పరిశ్రమలు మూతపడతాయి.
 
అధికారుల ద్వంద్వ నీతి
ఇదే ఫుడ్‌ పార్క్‌ను ఆనుకుని 1299.12 ఎకరాలలో ఇండస్ర్టియల్‌ కారిడార్‌ను అభివృద్ధి చేశారు. రైతులకు పరిహారం, కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులకు వెచ్చించారు. ఖర్చు చేసిన దాని కంటే కూడా తక్కువగా ఎకరం రూ.16.50 లక్షలుగానే ధర నిర్ణయించారు. ఫుడ్‌పార్క్‌ను ఆనుకుని ఉన్న ఈ భూమి రూ.16.50 లక్షలు, దీని పక్క భూమిని ఏపీఐఐసీ రూ.42 లక్షలుగా నిర్ణయించటం గమనార్హం. వీరపనేని గూడెంలో మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ భూములను ఎకరం రూ.6 లక్షలుగా ఏపీఐఐసీ నిర్ణయించింది.
 
కొసమెరుపు: మెగాఫుడ్‌ పార్క్‌కు యాక్సెస్‌ రోడ్డు లేకుండానే ప్లాట్లను ఆన్‌లైన్‌లో పెట్టడం గమనార్హం. మీర్జాపురం నుంచి యాక్సెస్‌ రోడ్డు రావాల్సి ఉంది. ఇక్కడ భూములను సేకరించాల్సి ఉంది. చిన్న దారి ఉన్నా దానిని కూడా ప్రస్తుతం రైతులు దిగ్బంధించారు.
 
ప్రైవేటుగా అలా.. ఏపీఐఐసీగా ఇలా ..
ఇతర జిల్లాల్లో ప్రైవేటు వ్యక్తులు ఫుడ్‌పార్క్‌లకు సంబంధించి చాలా తక్కువ ధరకే భూములను విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎకరం రూ.6 లక్షలకే సకల సదుపాయాలతో కల్పించటం వల్ల చాలా మంది అటు వైపు చూస్తున్నారు. మల్లవల్లి సమీపంలోని రేమల్లెలో కొద్దికాలం కిందట జామ్‌ పల్పీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల స్థానికంగా 500 ఎకరాల విస్తీర్ణంలో జామతోట అదనంగా సాగు అయినట్టుగా తెలుస్తోంది. జామ పల్పీ పరిశ్రమ రావటంతో స్థానికంగా జామను పండించటానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునైనా ఏపీఐఐసీ అధికారులు వ్యవహరిస్తే బాగుంటుంది.
 
సీపీసీ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకునే ధర నిర్ణయం
మెగా ఫుడ్‌ పార్క్‌లో సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ) రూ.85 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయటం జరుగుతోంది. అనేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు ఇది ఎంతగానో ఉపయోగపడతుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే వారికి కూడా కొంత పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. సీపీసీకి అయ్యే వ్యయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని భూముల ధరలను ఉన్నత స్థాయిలో నిర్ణయించటం జరిగి ఉండవచ్చు.
- శరత్‌బాబు, ఏపీఐఐసీ జడ్‌

Link to comment
Share on other sites

మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ హౌస్‌ఫుల్
11-02-2018 07:20:52

మొత్తం 964 ప్లాట్లు.. ఇందులో అసోసియేషన్లకు 507..
మరో ఐదొందలకు పైగా ఆశావహులు
పెద్ద పరిశ్రమల నుంచి ఆసక్తి
తలలు పట్టుకుంటున్న ఏపీఐఐసీ అధికారులు
ఐదు రోజుల్లో కేటాయింపులు పూర్తి
మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కేటాయింపులకు ముందే హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తం 1260.06 ఎకరాల సువిశాల భారీ మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో 964 ప్లాట్లు ఉండగా.. దాదాపు 20 శాతం అధికంగా దరఖాస్తులు అందాయి. అన్నింటికీ ప్రాఽధాన్యం కల్పించాల్సిన పరిస్థితుల్లో ఏపీఐఐసీ అధికారులకు వీటి కేటాయింపు ఓ సవాల్‌గా మారింది.
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి): మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ఈ పార్క్‌లో మొత్తం 1260.06 ఎకరాల విస్తీర్ణంలో 964 ప్లాట్లు ఉన్నాయి. దరఖాస్తులు దాదాపు 20 శాతం అధికంగా అందాయి. మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలకు కూడా స్థానం కల్పించాల్సి ఉంది. వారం రోజుల్లో ఏపీఐఐసీ అధికారులు పూర్తిస్థాయిలో మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌ ప్లాట్ల కేటాయింపు చేయబోతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్‌లోని పారిశ్రామిక సంస్థలు సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పారిశ్రామిక రంగాలు ఆసక్తి చూపించాయి. దాదాపుగా ప్లాట్లలో సింహభాగం అసోసియేషన్ల నుంచి డిమాండ్‌ వచ్చింది. పెట్టుబడుల సదస్సు సందర్భంగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లను ఏర్పాటు చేసే అసోసియేషన్లతో వారు కోరినన్ని ప్లాట్లు ఇవ్వటానికి ఎంవోయూ కుదర్చుకున్నారు. ఈ మేరకు ప్లాట్లను కల్పించాల్సి ఉన్నా.. పూర్తి స్థాయిలో ఏపీఐఐసీ అధికారులు కల్పించలేదు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ కోసం 100 ఎకరాలను ఏపీఐఐసీ అధికారులు కేటాయించారు. ఇందులో మొత్తం 125 ప్లాట్లు ఉన్నాయి. ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ అసోసియేషన్‌ తరపున 40 ఎకరాలను కేటాయించారు. ఇందులో 64 ప్లాట్లు ఉన్నాయి. నవ్యాంధ్ర అసోసియేషన్‌కు 51.96 ఎకరాలను కేటాయించారు. ఇందులో 126 ప్లాట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి చూస్తే.. 191.96 ఎకరాలను కేటాయించినట్టు అయింది. మొత్తంగా 315 ప్లాట్లు ఇవి దక్కించుకోబోతున్నాయి. ఇంకా పలు అసోసియేషన్లకు కేటాయించాల్సి ఉంది. వాటితో ఏపీఐఐసీ అధికారులు సంప్రదింపులు జరపాల్సిఉంది.
 
దీంతో పాటు మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఏపీఐఐసీ అధికారులు మహిళా పారిశ్రామిక పార్క్‌ (కోవె)కు తాత్కలికంగా 30 ఎకరాలను కేటాయించారు. ఇందులో మొత్తం 59 ప్లాట్లు ఉన్నాయి. ప్లాస్టిక్‌ ఇండస్ర్టీస్‌ కోసం 100 ఎకరాలను కేటాయించారు. ఇందులో మొత్తం 65 ప్లాట్లు ఉంటాయి. మహిళా పారిశ్రామికవేత్తల నుంచి ప్లాస్టిక్‌ పార్క్‌లకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి ఆసక్తి వ్యక్తమౌతోంది. ఇందుకోసం దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. మరోవైపు స్థానికంగానూ, వివిధ జిల్లాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపుగా ఇలాంటివి నాలుగు వందలకు పైగా దరఖాస్తులు ఉంటాయని తెలుస్తోంది. అశోక్‌ లేల్యాండ్‌కు ఇక్కడ 75 ఎకరాలను ఇటీవలే ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ ఇక్కడ రూ.135 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.
 
2,295 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఏపీఐఐసీతో సేల్‌ అగ్రిమెంట్‌ చేసుకోవటమే మిగిలి ఉంది. మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థకు ఇంటిగ్రేటెడ్‌ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటుకు 81 ఎకరాలను ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి ఫేజ్‌లో రూ.328.14 కోట్ల పెట్టుబడులు, రెండవ ఫేజ్‌లో రూ.275.85 కోట్ల వ్యయంతో యూనిట్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేయాల్సి ఉంది. మొత్తంగా రెండు వేల మంది ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సంస్థ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. ఈ సంస్థ తనకు కేటా యించిన భూములకు డబ్బులు చెల్లించింది. రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ మిగిలి ఉంది. భారీ పరిశ్రమల కేటగిరిలో ఇవి పోను గోల్డ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనేక స్పి న్నింగ్‌ మిల్లులు, ఫార్మా కంపె నీలు ఆసక్తి చూపి స్తున్నాయి. ప్రభుత్వ స్థాయిలో సంప్రదింపలు చేస్తు న్నాయి. ఎంవోయూ దశలో ఉన్నాయి.
 
మల్లవల్లికి దారేది..?
ఇండ స్ర్టియల్‌ ఏరియాలో ప్లాట్లకు అనూహ్య డిమాండ్‌ ఉన్న పరిస్థితుతిల్లో మల్లవల్లికి సీడ్‌యాక్సెస్‌ రోడ్డు లేకపోవటం గమనార్హం. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ ఏరియాకు స్టేట్‌ హైవే (ఎస్‌హెచ్‌) - 14 దగ్గరగా ఉంటుంది. మీర్జాపురం దాటిన తర్వాత ఇటు స్టేట్‌ హైవే (ఎస్‌హెచ్‌) - 14, అటు నేషనల్‌ హైవే (ఎన్‌హెచ్‌ ) 16 లకు అనుసంధాన కేంద్ర ప్రాంతం ఉంది. ఇక్కడ నుంచి 3.7 కిలోమీటర్ల దూరం మేర మల్లవల్లికి గ్రీన్‌ఫీల్డ్‌ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉంది. దాదాపుగా 45 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు మల్లవల్లికి వెళ్ళాలంటే గ్రామాలలోని ఇరుకు రోడ్లు, డొంకల నుంచి చేరుకోవాల్సి వస్తోంది. ఏపీఐఐసీ అధికారులు ఈ ప్రాంతాల నుంచి సింగిల్‌ లేన్‌ రోడ్డు అభివృద్ధి చేసినా.. కేవలం సైట్‌ చూసి రావటానికి తప్ప రవాణాకు ఉపయోగపడదు. మీర్జాపురం నుంచి మల్లవల్లి ఇండస్ర్టియల్‌ ఏరియాకు రోడ్డు ఏర్పాటు చేయటానికి ప్రధానంగా భూ సేకరణ సమస్య ఉంది. ఐపీ కోసం 40 ఎకరాల భూ సేకరణ జరపాల్సి ఉంది. మెగా ఫుడ్‌ పార్క్‌కు సంబంధించి చూస్తే ఈ దారిని అనుసంధానం చేయటానికి 0.71 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. సేకరించాల్సిన భూములకు సంబంధించి ఏపీఐఐసీ అధికారులు భూ ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగానికి పంపారు. రెవెన్యూ అధికారులు బిజీగా ఉండటంతో జాప్యం జరుగుతోంది.
 
మధ్యలో రైతులను పిలిచి రెవెన్యూ అధికారులు సంప్రదింపులు చేసినా రైతుల నుంచి సానుకూలత రాలేదు. మెగా ఫుడ్‌ పార్క్‌కు రోడ్డు అనుసంధానం కోసం తమ భూములు ఇవ్వటానికి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఫుడ్‌పార్క్‌కు వెళ్ళే రోడ్డును భారీ దుంగలతో మూసివేశారు. మోడల్‌ ఇండస్ర్టియల్‌ ఐపీకి వెళ్ళే దారిలో ఇంకా 40 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. లే అవుట్లతో ప్లాట్లను విడగొట్టి లోపల ఎన్ని మౌలిక సదుపాయాలను కల్పించినా.. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు లేకపోతే అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది. తక్షణం ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Link to comment
Share on other sites

మల్లవల్లిలో పరిశ్రమలకు భూకేటాయింపులు 
రూ.800 కోట్లు పెట్టుబడులు 
8 వేల మందికి ఉపాధి
ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా మల్లవల్లిలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు(ఎమ్‌ఎస్‌ఎంఈ) భూములు కేటాయించే ప్రక్రియ మొదలైంది. 120 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలకు ఇస్తున్నారు. ఏడాది కిందటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి(ఈడీబీ)తో మల్లవల్లి ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అవగాహన ఒప్పందం చేసుకొంది. దీని ద్వారా రూ.800 కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా 8వేల మంది గ్రామీణులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని అంచనా. ప్రధానంగా ఫ్యాబ్రికేషన్‌, హెవీ స్ట్రక్చర్‌, మెటలర్జీ, ఏవియేషన్‌, బస్‌ బాడీ బిల్డింగ్‌ లాంటి రంగాలకు చెందిన పరిశ్రమలు మల్లవల్లిలో ఏర్పాటు కానున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌) సమర్పించిన సంస్థల వివరాలను ఏపీఐఐసీ పరిశీలిస్తోంది. అందులో భాగంగా గత రెండు రోజుల్లో 193 మందికి 80 ఎకరాల కేటాయింపులు చేశారు. రాబోయే రెండు వారాల్లో మరికొన్ని కేటాయింపులు చేయనున్నారు. ఎకరం రూ.16.5 లక్షల చొప్పున కేటాయించారు. మల్లవల్లి ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ నాయకులు చౌదరి, కె.సాయికిశోర్‌ మాట్లాడుతూ సుమారు 600 మంది ఏపీలో పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి అమరనాథ్‌రెడ్డి చొరవతో మల్లవల్లిలో భూకేటాయింపుల ప్రక్రియ వేగవంతంగా జరిగిందనీ, ఈ విధానం చూసి బెంగళూరులో పరిశ్రమలు నిర్వహిస్తున్నవారు ఇక్కడకు వచ్చేందుకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. మౌలిక వసతులు కల్పించిన వెంటనే తమ కార్యకలాపాలు మొదలవుతాయని తెలిపారు.
రాష్ట్ర వార్తలు

Link to comment
Share on other sites

మల్లవల్లికి అశోక్‌ లేలాండ్‌
14-02-2018 02:19:33
 
  • వచ్చేనెలలో సీఎం చేతుల మీదుగా భూమిపూజ
విజయవాడ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : నవ్యాంధ్రలో మరో ప్రతిష్ఠాత్మకమైన వాహన తయారీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. విజయవాడ పరిధిలోని మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో బాడీ బిల్డిండ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘అశోక్‌ లే ల్యాండ్‌’ ముందుకొచ్చింది. మార్చి నెలలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించటానికి కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించి, ఆయన చేతులమీదుగా భూమి పూజ జరిపించాలని నిర్ణయించారు.
 
అశోక్‌ లేలాండ్‌ స్థాపిస్తున్న యూనిట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 ఎకరాల భూములకు కేటాయించింది. ఎకరానికి రూ.16.50 లక్షల చొప్పున మొత్తం రూ.12.37 కోట్లను ఏపీఐఐసీకి.. అశోక్‌ లేలాండ్‌ చెల్లించింది. దీంతో ఏపీఐఐసీ అధికారులు కొద్దిరోజుల కిందట ఈ సంస్థతో సేల్‌డీడ్‌ రాసుకున్నారు. అశోక్‌ లేలాండ్‌ పనులుచేపట్టి వాటిని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చిన తర్వాతే, పూర్తిస్థాయిలో ఈ స్థలాన్ని దానికి రిజిస్ర్టేషన్‌ చేస్తారు.
 
అశోక్‌లేలాండ్‌ సంస్థకు ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు! అందువల్లనే మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌ను ప్రకటించాక, అందరికంటే ముందుగా ఈ సంస్థే స్పందించింది. దాదాపుగా ఏడాది కిందటే విజయవాడలో బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మల్లవల్లి అందుకు అనుగుణంగా ఉండటంతో ఇక్కడ 100 ఎకరాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఆ తరువాత 75 ఎకరాలు సరిపోతాయని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఆ సంస్థకు భూములు కేటాయించింది.
 
Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=536219

మల్లవల్లికి.. అశోక్‌ లేలాండ్‌
14-02-2018 06:52:14

బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు సన్నద్ధం!
 మార్చిలో భూమిపూజ
 సీఎం చంద్రబాబు హాజరు!
75 ఎకరాలకు రూ.12.37 కోట్ల చెల్లింపు
 ఏపీఐఐసీతో అశోక్‌ లేలాండ్‌ సేల్‌ డీడ్‌
విజయవాడ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో.. పనులు ప్రారంభించటానికి ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘అశోక్‌ లే ల్యాండ్‌’ సన్నద్ధమౌతోంది. రవాణా వాహనాల బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఇక్కడ అశోక్‌ లేలాండ్‌ ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 75 ఎకరాల భూములకు సంబంధించి ఎకరానికి రూ.16.50 లక్షల చొప్పున మొత్తం రూ.12.37 కోట్లను ఏపీఐఐసీకి, అశోక్‌ లేలాండ్‌ చెల్లించింది. దీంతో ఏపీఐఐసీ అధికారులు కొద్దిరోజుల కిందట అశోక్‌ లేలాండ్‌ సంస్థతో సేల్‌డీడ్‌ రాసుకున్నారు. నిబంధనల ప్రకారం అశోక్‌ లేలాండ్‌ సంస్థ పనులుచేపట్టి వాటిని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చిన తర్వాతే.. పూర్తిస్థాయిలో స్థలాన్ని ఆ సంస్థకు రిజిస్ర్టేషన్‌ చేస్తారు. అశోక్‌ లేలాండ్‌ సంస్థ పనులు ప్రారంభించటానికి సమాయత్తమౌతోంది. అశోక్‌లేలాండ్‌ కంపెనీ ప్రతినిథులు క్షేత్రస్థాయిలో తమకు కేటాయించిన భూములను పరిశీలించారు. ఈ భూములలో బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయటానికి వీలుగా కంపెనీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి నెలలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించటానికి కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు.
 
భూమిపూజ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా జరిపించాలని నిర్ణయించారు. కంపెనీ ఉన్నతాధికారులు ఈ నెలలోనే సీఎం చంద్రబాబును కలిసి భూమిపూజకు ఆహ్వానించనున్నారు. అశోక్‌లేలాండ్‌ సంస్థకు ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు! దక్షిణ భారతదేశంలోనే బాడీ బిల్డింగ్‌ హబ్‌గా చెప్పవచ్చు. అశోక్‌ లేలాండ్‌ వంటి అతిపెద్ద కంపెనీ మల్లవల్లిలో ఏర్పాటు కానుండటంతో రాష్ట్రం కూడా ప్రత్యేక ఆసక్తితో ఉంది. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌ను ప్రకటించాక అందరికంటే ముందుగా స్పందించింది అశోక్‌ లేలాండ్‌ కంపెనీ కావటం గమనార్హం. దాదాపుగా ఏడాది కిందటే విజయవాడలో బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. మల్లవల్లి అందుకు అనుగుణంగా ఉండటంతో ఇక్కడ 100 ఎకరాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. సంస్థ అడగటమే తరువాయి అన్నట్టుగా కోరిన విధంగా 100ఎకరాలను కేటాయించటానికి ప్రభుత్వం సిద్ధపడింది. అఽధికారికంగా అనుమతులు ఇచ్చే సందర్భంలో తమకు 100 ఎకరాలు అవసరం లేదని, 75 ఎకరాలు ఇస్తే సరిపోతుందని మళ్ళీ అశోక్‌ లేలాండ్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. సంస్థ నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం వెంటనే క్యాబినెట్‌లో చర్చించి అంగీకరించటం జరిగింది. కొద్ది రోజులకే భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది.

Link to comment
Share on other sites

మల్లవల్లి ప్లాట్ల కేటాయింపు ప్రారంభం
14-02-2018 06:26:22

విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధాని ప్రాంతానికి పారిశ్రామిక జోన్‌గా మారిన మల్లవల్లి మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో ప్లాట్ల కేటాయింపు ప్రారంభమైంది. ఇండస్ర్టియల్‌ పార్కులో భూములను కేటాయించాల్సిన అసోసియేషన్‌లలో... మల్లవల్లి ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అతి పెద్దది. ఈ అసోసియేషన్‌కు ప్రస్తుతం 85 ఎకరాల మేర ఏపీఐఐసీ అధికారులు భూములను కేటాయించారు. మొదటి విడత గా 219 మంది సభ్యుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) లను ఈ అసోసియేషన్‌ ఏపీఐఐసీకి సమర్పించింది. ఇప్పటి వరకు 190 మంది సభ్యులకు మొత్తం 85 ఎకరాల భూములను ఏపీఐఐసీ కేటాయించింది. మిగిలిన 30 మంది సభ్యులకు ఈ నెలలోనే కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారని అసోసియేషన్‌ కార్యదర్శి జీఎన్‌బీ చౌదరి తెలిపారు. మల్లవల్లి అసోసియేషన్‌ ద్వారా మొత్తం రూ.900 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. సుమారు 9000 మందికి ఉద్యోగాలు అందించగలమని అసోసియేషన్‌ అధ్యక్షులు సాయి కిషోర్‌ తెలిపారు. స్థానిక గ్రామీణ యువ తకుఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ ద్వారా ఉపాధి కల్పించటానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. త్వరలో మిగిలిన 30 మంది సభ్యులకు కూడా భూ కేటాయింపు జరిగితే తర్వాత దశ పనులు ప్రారంభిస్తామని ఉపాధ్యక్షులు పున్నయ్య తెలియజేశారు.

Link to comment
Share on other sites

చక చకా మల్లవల్లి మెగాపుడ్‌ పార్కు
20-02-2018 07:10:39

 ఊపందుకున్న మౌలిక వసతుల ఏర్పాటు
 అంతర్గత రహదారులు పూర్తి
 త్వరలో సీపీపీ యూనిట్‌ పనులు
 పూర్తి కావస్తున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌
 హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, ఫిబ్రవరి 19: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఏపీఐఐసీ చేపట్టిన మెగాపుడ్‌ షార్కులో చేపట్టిన మౌలిక వసతుల కల్పనకు పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఆర్‌ఎస్‌ నెం.11లోని ఉద్యానవన శాఖ అధీనంలో ఉన్న మామిడి నర్సరీకి చెందిన 100 ఎకరాల భూమిని ఏపీఐఐసీ స్వాధీనం చేసుకొని మెగాఫుడ్‌ పార్కు నిర్మాణం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించే సెంట్రల్‌ పార్కుకు 57.65 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే స్టేట్‌ పార్కు 42.35 ఎకరాలు కేటాయించిన విషయం కూడా తెలిసిందే. సెంట్రల్‌ పార్కులో మొదటి ఫేస్‌లో రూ.5.5 కోట్లతో 1.60 కి.మీ పొడవు, 80 మీటర్ల వెడల్పుతో రహదారుల నిర్మాణం పూర్తి చేశారు. 3 కి.మీ పొడవున డ్రైనేజీ నిర్మించారు. రూ.1.20 కోట్లతో ప్రహరీ నిర్మాణం చేశారు. మొదటి ఫేస్‌లో దాదాపు రూ.18 కోట్లతో సెంట్రల్‌ పార్కులో ప్రధాన రహదారులు, డ్రైనేజీ నిర్మాణం పూర్తిచేశారు. స్టేట్‌ పార్క్‌లో రూ.2 కోట్లు వెచ్చించి రహదారులు, కల్వర్టులు, డ్రైనేజి నిర్మాణం చేశారు.
 
కామన్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌
సెంట్రల్‌ పార్కులో కామన్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను రూ.77 కోట్లు అంచనాలతో నిర్మాణం చేపట్టారు. గతేడాది సెప్టెంబరులో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రాసెసింగ్‌ సెంటర్‌ నిర్మాణం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. 1.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ముంబైకి చెందిన మానిష్‌ ప్లోర్‌ మిల్‌ సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకుని నిర్మిస్తోంది. ఈ యూనిట్‌లో మామిడి, జామ, బొప్పాయి, అరటి పండ్లను ప్రాసెసింగ్‌ చేసే యూనిట్‌ పాటు, టెట్రా ప్యాకెట్‌ యూనిట్‌, ఎలైటికల్‌ ల్యాబ్‌, పాకింగ్‌ యూనిట్‌, అన్ని రకాల జామ్‌లు తయారీ యూనిట్‌, కోల్డు స్టోరేజి వంటివి ఏర్పాటు చేయనున్నారు.
 
విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం
ఇటు మెగాపుడ్‌ పార్కుతో పాటు 1,260 ఎకరాల్లో నిర్మించే మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్కులో (ఎంఐపీ) ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు విద్యుత్‌ అవసరాలకు సెంట్రల్‌ పార్కు స్థలంలో 5 మెగా వాట్ల సామర్ధ్యంతో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. రూ.1.80 కోట్లతో ఈ సబ్‌స్టేషన్‌ నిర్మాణం జరుగుతోంది. మార్చి నెలాఖరు నాటికి నిర్మాణం పూర్తి చేసి విద్యుత్‌ సరఫరా చేయడానికి పనులను వేగవంతం చేస్తున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
 
ప్రధాన రహదారి
మోడల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కులోకి ప్రవేశించే ప్రధాన రహదారి నిర్మాణానికి ఏపీఐఐసీ అఽధికారులు చర్యలు చేపట్టారు. మెగాపుడ్‌ పార్కును ఆనుకొని 1,260 ఎకరాల్లో నిర్మించే ఎంఐపీ పార్కులోకి వెళ్లేందుకు 2.6 కి.మీ 45 మీటర్లు వెడల్పుతో ప్రధాన రహదారిని నిర్మించడానికి చర్యలు చేపట్టింది.రూ.4.50 కోట్లతో నిర్మించబోయే ఈ రహదారికి టెండర్లు కూడా పిలిచారు.రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ రహదారి నిర్మాణం చేపట్టనుంది.
 
ఆగస్టు నాటికి సీపీపీ నిర్మాణం పూర్తి : జోనల్‌ మేనేజర్‌ శరత్‌బాబు
మెగాఫుడ్‌ పార్కులకు ప్రధాన భూమిక పోషించే కామన్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నట్లు ఏపీఐఐసీ విజయవాడ జోన్‌ల్‌ మేనేజర్‌ శరత్‌బాబు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి సీపీపీ యూనిట్‌ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ లోగానే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు కూడా పూర్తవుతాయన్నారు. ప్రధాన రహదారి వెంబడి 12 మీటర్ల వెడల్పున పవర్‌ కారిడార్‌కు స్థలాన్ని కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
నిషేధిత జాబితా నుంచి ‘మల్లవల్లి’కి ఊరట!
02-03-2018 07:35:32
 
636555729317021909.jpg
  • నిషేధిత భూములు 21ఏ జాబితా నుంచి మినహాయింపు
  • రిజిస్ర్టేషన్స్‌ డీఐజీ నుంచి సబ్‌ రిజిస్ర్టార్లకు ఆదేశాలు
  • సేల్‌ అగ్రిమెంట్లకు సంసిద్ధం
విజయవాడ: నిషేధిత భూముల జాబితా 21ఏ నుంచి ‘మల్లవల్లి’ని కృష్ణాజిల్లా యంత్రాంగం తొలగించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం రిజిస్ర్టేషన్స్‌ శాఖ డీఐజీకి లేఖ పంపారు. వెనువెంటనే నిషేధిత భూములుగా మల్లవల్లిని పరిగణించవద్దంటూ రిజిస్ర్టేషన్స్‌ శాఖ.. జిల్లా, సబ్‌ రిజిస్ర్టార్‌లందరికీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఎంవోయూలు జరిగాయి. మల ్లవల్లి భూములు రెవెన్యూ ఫారెస్ట్‌గా రికార్డుల్లో ఉంది. ఒకరకంగా ఇవి ప్రభుత్వ భూములుగా పరిగణించాల్సి వస్తుంది. ప్రభుత్వ భూములను విక్రయించటానికి లేదు కాబట్టి నిషేధిత జాబితా 21ఏలో ఉంటాయి. మల్లవల్లిలో దాదాపుగా 11260 ఎకరాల్లో మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌, 100 ఎకరాల్లో మెగా ఫుడ్‌పార్క్‌ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
 
   ఇండస్ర్టియల్‌ కారిడార్‌, మెగా ఫుడ్‌పార్క్‌లను ప్లాట్లుగా విభజించి రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్లు, వరదనీటి మళ్లింపు కాల్వలు, లైటింగ్‌ వంటి సౌకర్యాలను కల్పించి అభివృద్ధి చేసిన నేపథ్యంలో, ఐపీ ప్లాట్ల ధర ఎకరం రూ.16.50 లక్షలు, మెగా ఫుడ్‌పార్క్‌ ధర రూ.40 లక్షలుగా నిర్ణయించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చిన అసోసియేషన్లన్నీ ఈ భూములను కొంటున్నందున వాటికి విధిగా ఏపీఐఐసీ అధికారులు సేల్‌డీడ్‌తో పాటు రిజిస్ర్టేషన్స్‌ చేయాలి. ఇప్పటి వరకు 21ఏ జాబితాలో ఉండటం వల్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. అసోసియేషన్లన్నీ ఏపీఐఐసీకి పూర్తి మొత్తం చెల్లించగానే సేల్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమలు పూర్తిగా ఏర్పాటు చేసిన తర్వాతే ఏపీఐఐసీ అధికారులు ఆయా సంస్థలకు రిజిస్ర్టేషన్‌ చేస్తారు.
 
అశోక్‌ లేల్యాండ్‌తో సేల్‌ అగ్రిమెంట్‌
భారీ పరిశ్రమల కోటా కింద ‘మల్లివల్లి’లో బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చిన అశోక్‌ లేలాండ్‌ సంస్థతో ఏపీఐఐసీ అధికారులు సోమవారం నూజివీడు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో సేల్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకోనున్నారు. అశోక్‌ లేలాండ్‌ సంస్థ రూ.135 కోట్ల వ్యయంతో యూనిట్‌ నిర్మించి 2,295 మందికి ఉద్యోగావకాశాలను కల్పించనుంది. మరో భారీ పరిశ్రమ మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థకు ఇక్కడే 81 ఎకరాలను కేటాయించారు. ఈ సంస్థ పూర్తి మొత్తం చెల్లించిన తర్వాతనే సేల్‌ అగ్రిమెంట్‌ నిర్వహిస్తారు.
Link to comment
Share on other sites

అడుగు దూరంలో భూముల అప్పగింత 
అశోక్‌ లేల్యాండ్‌తో ఏపీఐఐసీ క్రయ ఒప్పందం
హనుమాన్‌జంక్షన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: అమరావతి పరిధిలోని మల్లవల్లిలో పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి దాదాపు అన్ని పనులు పూర్తి చేసిన రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి మండలి(ఏపీఐఐసీ).. భూకేటాయింపుల ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో అశోక్‌ లేల్యాండ్‌ సంస్థకు కేటాయించిన భూమిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వీలుగా లాంఛనాలను పూర్తి చేసింది. 
డీడీ చెల్లింపు: బస్సు బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ మల్లవల్లిని ఎంచుకుంది. దీనికోసం ఏపీఐఐసీ 75 ఎకరాలు కేటాయించింది. ఎకరం రూ.16.50 లక్షల చొప్పున ధర నిర్ణయించడంతో ఈ ప్రకారం 75 ఎకరాలకు రూ.12.50 కోట్లను ఏపీఐఐసీకి చెల్లించింది. సంస్థ ప్రతినిధులు రిజిస్ట్రేషన్‌ రుసుం కింద రూ.50 లక్షలు చెల్లించారు. 
రిజిస్ట్రేషన్ల సమయంలో డీడీల వల్ల తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు. డీడీని బ్యాంకులో నిర్ధరించుకున్నాకే రిజిస్ట్రేషన్‌ను ఖరారు చేస్తున్నారు. అశోక్‌ లేల్యాండ్‌ వ్యవహారంలోనూ నూజివీడు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఇదే పాటించింది. ఏపీఐఐసీ తరఫున అన్ని దస్త్రాలు సమర్పించి జోనల్‌ మేనేజర్‌ శరత్‌బాబు క్రయ ఒప్పందానికి అనుగుణంగా లాంఛనాలు పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కాగానే భూమి పూజ నిర్వహించేందుకు అశోక్‌ లేల్యాండ్‌ ఏర్పాట్లు చేసుకుంటోంది. మలి విడతలో ఛాసిస్‌ల తయారీ యూనిట్‌ నెలకొల్పవచ్చని సమాచారం.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
అమరావతిలో పారిశ్రామిక సందడి మొదలు..!
23-03-2018 08:24:37
 
636573902771018491.jpg
  • వీరపనేనిగూడెం ఐపీలో యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం
  • పనులు మొదలు పెట్టిన అమరావతి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌
  • 59 ఎంఎస్‌ఎంఈ యూనిట్లతో సేల్‌ అగ్రిమెంట్‌ పూర్తి
  • పలు ప్లాట్లలో పనులు ప్రారంభించిన సంస్థలు
 
విజయవాడ: వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్‌ పార్క్‌ (ఐపీ)లో పారిశ్రామిక సందడి ప్రారంభమైంది. అమరావతి ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు పలువురు ఔత్సాహికులు శ్రీకారం చుట్టారు. ఏపీఐఐసీ దగ్గర నుంచి ఔట్‌రేట్‌ సేల్‌ (ఓఆర్‌ఎస్‌) విధానంలో భూములను కొనుగోలు చేసిన పారిశ్రామికవేత్తలంతా ఈ వేసవిలో పనులు ప్రారంభించారు. ఏపీఐఐసీతో దాదాపుగా పారిశ్రామికవేత్తలంతా సేల్‌ డీడ్‌ చేసుకున్నారు. సేల్‌ డీడ్‌ చేసుకున్నవారిలో చాలామంది ప్రస్తుతం పనులు ప్రారంభిస్తున్నారు. ఏపీఐఐసీ దగ్గర నుంచి ఓఆర్‌ఎస్‌ విధానంలో ఎకరం రూ.16.50 లక్షలతో భూములు కొనుగోలు చేసిన తర్వాత విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తమ పారిశ్రామిక యూనిట్ల త్రీడీ డెమోలను ప్రదర్శించారు. అదే రోజు సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ యూనిట్ల పనులను సన్నాహకంగా ప్రారంభించారు.
 
   ముఖ్యమంత్రి ప్రారంభించగానే పనులు ప్రారంభం అవుతాయనుకుంటే కాస్త జాప్యమైంది. దీంతో కొద్దిరోజులు అనిశ్చితి నెలకొంది. ఏపీఐఐసీ, అమరావతి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌ పరిధిలోని పారిశ్రామిక వేత్తలతో సేల్‌డీడ్లు కుదరటంతో సమస్య తొలగింది. వీరపనేనిగూడెంలో ఇండస్ర్టియల్‌ పార్క్‌లో మొత్తం 75 మంది పారిశ్రామికవేత్తలకు చోటు కల్పించాల్సి ఉంది. అయితే స్థలాభావం, కొద్దిగా ఇంకా వివాదంలోనే ఉండటంతో కేవలం 59 మంది పారిశ్రామిక వేత్తలకే ప్లాట్లను కేటాయించటం జరిగింది. ప్లాట్లను కేటాయించిన పారిశ్రామికవేత్తలంతా ఏపీఐఐసీతో సేల్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. సేల్‌డీడ్‌ కుదుర్చుకున్న వారిలో దాదాపు సగానికి సగం మంది పనులు ప్రారంభించారు. తమ ప్లాట్లను చదును చేసుకోవటంతో పాటు, చుట్టూ ప్రహరీల కోసం కొలతలను కొంతమంది వేయిస్తున్నారు. మరి కొంతమంది ప్రహరీల నిర్మాణం జరుపుతున్నారు. ఇంకొంత మంది ఏకంగా వీటన్నింటినీ పూర్తి చేసి యూనిట్ల నిర్మాణం చేపడుతున్నారు. పారిశ్రామిక వేత్తలు పనులు ప్రారంభించటడంతో ఏపీఐఐసీ అధికారులు కూడా సమాంతరంగా మలి విడతగా చేపట్టవలసిన పనులపై దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన సంప్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారు.
Link to comment
Share on other sites

అమరావతికి క్యూ కడుతున్న భారీ పరిశ్రమలు
24-03-2018 08:52:09
 
636574783288367780.jpg
  • మల్లవల్లిలో మొట్టమొదటి బిగ్‌ ఇండస్ర్టీగా అశోక్‌ లేలాండ్‌
  • మార్చి 31న సీఎం చంద్రబాబుచే శంకుస్థాపన
  • 75 ఎకరాల్లో భారీ ఇండస్ర్టీ 
  • 2,295 మందికి ఉపాధి కల్పన
  • వరుస కడుతున్న భారీ పరిశ్రమలు
 
విజయవాడ: రాజధాని ప్రాంతంలోని మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో మొట్టమొదటి భా రీ పరిశ్రమగా అశోక్‌ లేలాండ్‌ సంస్థ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ నెల 31న భారీ పరిశ్రమల శ్రేణిలో మొ దటిదిగా ఈ సంస్థ పనులు ప్రారంభం కాబో తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. శంకు స్థాపన తేదీ ఖరారు కావటంతో ఏపీఐఐసీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
 
మెగా ఇండస్ర్టీస్‌ కేటగిరిలో మొత్తం 75 ఎకరాలను ఎకరం రూ.16.50 లక్షల వ్యయంతో ఔట్‌ రేట్‌ సేల్‌ (ఓఆర్‌ఎస్‌) విధానంలో అశోక్‌ లేలాండ్‌ సంస్థ ఈ భూములను కొనుగోలు చేసింది. మొత్తం 75 ఎకరాలను రూ.13 కోట్ల వ్యయంతో అశోక్‌ లేల్యాండ్‌ ఈ భూములను కొనుగోలు చేసింది. ఏపీఐఐసీ అధికారులకు ఇటీవలే ఈ సంస్థ పూర్తి మొత్తాన్ని చెల్లించింది. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో కొద్ది రోజుల కిందట ఏపీఐఐసీ, అశోక్‌ లేలాండ్‌ సంస్థలు సేల్‌ డీడ్‌ అగ్రిమెంట్‌ను రాసుకున్నాయి. ముఖ్యమంత్రి ఈ నెల 31 వ తేదీన శంకుస్థాపన చేయటానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటంతో తొలి భారీ ఇండస్ర్టీ ఏర్పాటుకు బీజం పడింది. అశోక్‌ లేలాండ్‌ సంస్థ ఇక్కడ రూ.135 కోట్ల వ్యయంతో బస్‌బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా స్థానికంగా 2,295 మందికి ఉపాధిని ఈ సంస్థ కల్పించనుంది.
 
రాష్ట్ర విభజన తర్వాత మాతృగడ్డపై మమకారంతో హైదరాబాద్‌, ఇతర రాష్ర్టాల్లో పరిశ్రమలు నెలకొల్పిన పారిశ్రా మికవేత్తలంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాం తంలోని కృష్ణాజిల్లా గన్నవరం నియో జకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లిని ఇండస్ర్టియల్‌ జోన్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సమీపంలోని వీరపనేనిగూడెంలో 170 ఎకరాలలో రెండు ఇండస్ర్టియల్‌ పార్క్‌లు, మల్లవల్లిలో 100 ఎకరాల విస్తీర్ణంలో మెగా ఫుడ్‌ పార్క్‌, దీనిని ఆనుకుని 1,269 ఎకరాలలో మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లకు శ్రీకారం చుట్టింది. మల్లవల్లిలోని మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ను 30.10 లక్షల చ.మీటర్ల విస్తీర్ణంలో లే అవుట్‌ వేసి 962 ప్లాట్లను అభివృద్ధి చేసింది. ప్రభుత్వ జీఓ 456 ప్రకారం ఎకరం ల్యాండ్‌ కాస్ట్‌ రూ.7.5 లక్షలు, అంతర్గత రోడ్లు రూ.4 లక్షలు, స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్లకు రూ.3 లక్షలు, అంతర్గత పవర్‌ సప్లైకు రూ.1 లక్ష, అంతర్గత నీటి సరఫరాకు రూ.1 లక్ష చొప్పున మొత్తంగా రూ.16.50 లక్షల ధరను నిర్ణయించారు. ఈ ప్రాతిపదికన సూక్ష్మ, చిన్న, మధ్య (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలకు కేటాయించటానికి వీలుగా లేఅవుట్‌ను రూపొందించారు.
 
 
మరిన్ని యూనిట్లు..
ఇదే మల్లవల్లిలో ఎంఎస్‌ఎంఈ యూనిట్ల కోసం అనేక అసోసియేషన్స్‌ దరఖాస్తు చేసుకున్నాయి. నిర్ణీత ప్లాట్ల కంటే డిమాండ్‌ ఎక్కువుగా ఉండటంతో ఏపీఐఐసీ అధికారులకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. పలు అసోసియేషన్లకు ఇప్పటివరకు 300కు పైగా ప్లాట్లను కేటాయించారు. భారీ పరిశ్రమల కేటగిరిలోకి అనేక బడా సంస్థలు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ముందుగా అశోక్‌ లేల్యాండ్‌, ఆ తర్వాత మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థలు ఎంఓయూ చేసుకున్నాయి. అశోక్‌ లే ల్యాండ్‌తో పాటు మోహన్‌ స్పిన్‌టెక్స్‌ కూడా పనులను ప్రారంభించాల్సి ఉంది.
 
   మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థ 81 ఎకరాలను ఇక్కడ కొనుగోలు చేసింది. ఏపీఐఐసీకి ధర ఇంకా చెల్లించలేదు. మొదటి దశలో రూ.328.14 కోట్ల వ్యయంతోను, రెండవ దశలో రూ.273.25 కోట్ల వ్యయంతో టెక్స్‌టైల్స్‌ ఇండస్ర్టీని ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. దాదాపుగా మొదటి దశలో 1,547 మందికి, రెండవ దశలో 553 మందికి ఈ సంస్థ ఉపాధిని కల్పిస్తానని ఎంఓయూలో పేర్కొంది. భారీ పరిశ్రమల కేటగిరిలో ఫార్మా ఇండస్ర్టీస్‌, గోల్డ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయటానికి పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకోవాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...