Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

Tirupati smart city.

Recommended Posts

ఇంటింటికీ డిజిటల్‌ డోర్‌ నెంబర్లు 
చిరునామా మరింత సులభం 
  తిరుపతిలో నేడు ప్రారంభించనున్న సీఎం 
.ఈనాడు - తిరుపతి

‘మీ ఇంటి నెంబరు చెప్పండి..’ అని ఎవరైనా అడిగితే.. 8 అబ్లిక్‌ 16 బై 78సీ అంటూ మధ్యలో ఆగిపోవడం చాలామందికి అనుభవమే. ఐదారు సంఖ్యలు, నాలుగైదు ఆంగ్ల అక్షరాలతో కూడిన ఇంటినెంబర్లు గుర్తించుకోవడం కష్టమే. తరచూ ఇళ్లు మారే వారి సంగతి సరేసరి. ఇంటినెంబరు చెప్పినా నగరంలో చిరునామా కనుక్కోవడం క్లిష్టమైన పనే. ఇకపై ఈ ప్రయాసకు స్వస్తి చెబుతూ.. సరికొత్త విధానంలో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ‘డిజిటల్‌ డోర్‌నెంబర్‌’ వ్యవస్థను తిరుపతి నగరపాలక సంస్థ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో తొలిసారి తిరుపతిలో ఈ ప్రక్రియ పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం దీన్ని ప్రారంభించనున్నారు.

21ap-main15a.jpg

ఏంటీ విధానం? 
* ప్రతి ఇంటికి మూడు అంకెల డిజిటల్‌ నెంబరును, క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ను కేటాయించారు. దాని పక్కనే పాత ఇంటినెంబరును రాసి ఓ బోర్డును అతికించారు. తిరుపతిలో ఆస్తి పన్ను కట్టే ఇళ్లను 66 వేలుగా గుర్తించి ఈ ఇళ్లకు డిజిటల్‌ డోర్‌నెంబర్ల(డీడీఎన్‌)ను ఇచ్చేశారు. 
* ఎన్ని పోర్షన్లు ఉన్నా ఇంటికి ఒక్క నెంబరే ఇచ్చారు. 
* నగరంలోని వివిధ వీధులను(లొకాలిటీ) ఓ సమూహం (క్లస్టర్‌)గా చేసుకొని నెంబర్లను కేటాయించారు. ఫలానా వీధిలో డిజిటల్‌ డోర్‌నంబర్‌ అని చెబితే చిరునామాను సులభంగా గుర్తించవచ్చు. తిరుపతిలో మొత్తంగా 278 వీధులను గుర్తించారు. 
* డిజిటల్‌ నెంబరును పురపాలక సంఘంతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలు ఎస్పీడీసీఎల్‌, గ్యాస్‌, తపాలా, రెవెన్యూ తదితరాలతో అనుసంధానిస్తున్నారు. ఇకపై ఆయా శాఖలు కొత్త ఇంటి నెంబర్ల ప్రకారమే సంప్రదింపులు సాగిస్తాయి. 
* ప్రతి ఇంటికి జిప్పర్‌ కోడ్‌, జియోట్యాగింగ్‌ ద్వారా డేటాబేస్‌ రూపొందిస్తున్నారు. వీటితో ఇంటి చిరునామా సులభంగా కనుక్కోవచ్చు. డీడీఎన్‌ సంఖ్యను స్మార్ట్‌ఫోన్‌లో ‘దారి’ యాప్‌లో నమోదుచేస్తే అక్కడికి చేరుకునే మార్గాలను చూపిస్తుంది. గూగుల్‌మ్యాప్‌ యాప్‌లో క్యూఆర్‌ సంఖ్యను నమోదు చేస్తే ఇంటి ఉనికిని గుర్తిస్తుంది. మున్సిపాలిటీలో ఇంటి యజమాని ఫొటోను అనుసంధానిస్తే మ్యాప్‌లో ఫొటోతో సహా చూపిస్తుంది. 
* అంబులెన్సులకు, ఇతర అత్యవసర సేవలకు అనుసంధానిస్తారు. క్యూఆర్‌ కోడ్‌ పంపితే వెంటనే వారు చేరుకునేందుకు వీలుంటుంది. ఇప్పటివరకు ఇలాంటి సౌలభ్యం కొన్ని విదేశాల్లోనే ఉంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.5 కోట్ల మేర వెచ్చించారు. తిరుపతిలో వచ్చే ఫలితాన్ని బట్టి విజయవాడలోనూ ప్రక్రియను ప్రారంభించనున్నారు. 
* ఆస్తిపన్ను, నీటి పన్ను, ఇతర రెవెన్యూ వసూళ్లను పక్కాగా చేపట్టవచ్చు. ఆక్రమణలు, అతిక్రమణలకు నిరోధించవచ్చని అధికారులు చెబుతున్నారు

Share this post


Link to post
Share on other sites
500 కోట్లతో తిరుపతిలో సైన్స్‌సిటీ
03-12-2018 03:24:14
 
 • నాలుగు నగరాల్లో సైన్స్‌ మ్యూజియంలు
 • సైన్స్‌ ఎక్స్‌పో- 2018లో మంత్రి శిద్దా
తాడేపల్లి, డిసెంబరు 2: తిరుపతిలో రూ.500కోట్లతో సైన్స్‌సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని, త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటీలో రెండురోజులపాటు జరిగే 26వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సైన్స్‌ ఎక్స్‌పో-2018ను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ రాజమహేంద్రవరం, ఒంగోలు, కర్నూలు ప్రాంతాల్లో రూ.25కోట్ల చొప్పున, విశాఖలో రూ.26కోట్లతో సైన్స్‌ మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని సైన్స్‌ మ్యూజియంను అభివృద్ధి చేస్తామన్నారు.

Share this post


Link to post
Share on other sites
రోడ్డెక్కనున్న ఆశల వారధి.. తిరుపతిపై వంతెన
20-12-2018 12:44:20
 
636809067870510181.jpg
 • మార్కెట్‌ యార్డు నుంచి కపిలతీర్థం వరకు ఫ్లై ఓవర్‌
 • రూ.500 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం
 • టీటీడీ 67శాతం, స్మార్టు సిటీ నిధులు 33 శాతం
 • రెండేళ్లలో పూర్తికి సన్నాహాలు
తిరుపతి: ఎప్పటి నుంచో వేచిచూస్తున్న తిరుపతి ఆశల వారధి రోడ్డెక్కనుంది. తిరుపతి స్మార్ట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ (ఫ్లైఓవర్‌) పేరిట ఏర్పాటుకానున్న మెగా ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులిచ్చింది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌లో.. టీటీడీ 67 శాతం, స్మార్ట్‌ సిటీ నిధుల నుంచి 33 శాతం ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా స్మార్ట్‌ స్ట్రీట్స్‌నూ అభివృద్ధి చేయనున్నారు. టీఎ్‌ససీసీఎల్‌ కంపెనీ ఫ్లైఓవర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను దక్కించుకుంది. ఐదేళ్ల పాటు సదరు కంపెనీనే నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఆ తర్వాత టీటీడీ పర్యవేక్షణలో ఫ్లైఓవర్‌ ఉంటుంది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనరు విజయ్‌రామరాజు బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతిలో ట్రాఫిక్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందిగా ఉంది. రోజూ లక్షమంది యాత్రికులు వచ్చిపోతుంటారు. ట్రాఫిక్‌ సమస్య తీరాలంటే ఫ్లై ఓవర్‌ వంతెన అవసరమని గుర్తించాం.
 
 
ఐఐటీ చెన్నై వాళ్లు 2009లో ఫ్లైఓవర్‌ డిజైన్‌ చేశారు. దానిని బయటకు తీసి ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా మార్చాం. చాలా అందంగా డిజైన్‌ వచ్చింది. మార్కెట్‌ యార్డు నుంచి కపిలతీర్థం వరకు ఫ్లై ఓవర్‌ ఉంటుంది. మధ్యలో రామానుజ సర్కిల్‌.. సుబ్బులక్ష్మి విగ్రహం.. లీలామహల్‌ సర్కిల్‌ వద్ద జంక్షన్‌ పాయింట్లు ఉంటాయి. సుబ్బులక్ష్మి విగ్రహం వద్ద బటర్‌ఫ్లై (సీతాకొక చిలుక) డిజైన్‌ ఉంటుంది’ అని కమిషనరు వివరించారు. ఈ క్రమంలో కొంత భూసేకరణ చేయాల్సి ఉంటుందని, అందరూ పెద్ద మనసుతో సహకరించాలని కోరారు. పరిహారం చెల్లించేందుకు కూడా సిద్దంగా ఉన్నామన్నారు. ఆరు నెలలుగా శ్రమించి ఎలివేటెడ్‌ స్మార్ట్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌ను తుది దశకు తీసుకొచ్చామన్నారు. మరో మూడు వారాల్లో భూమి పూజ జరిపి, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఫైఓవర్‌ అందుబాటులోకి వస్తే మరో 30 ఏళ్లు పాటు తిరుపతి ప్రజలు ట్రాఫిక్‌ కష్టాలు చూడాల్సిన పనిలేదన్నారు.
 
 
అలిపిరి నుంచి రైల్వే స్టేషన్‌
తిరుమల నుంచి వచ్చే వాహనాలు కపిలతీర్థం వద్ద ఫ్లై ఓవర్‌ ఎక్కి ఎంఎస్‌ సుబ్బలక్ష్మి విగ్రహం వద్ద బట్టర్‌ఫ్లై (సీతాకోకచిలుక) ఆకారంలోని దారి గుండా బస్టాండు ముందు దిగి.. రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. అదే ఆర్టీసీ బస్టాండుకు వెళ్లాలంటే సుబ్బలక్ష్మి సర్కిల్‌ నుంచి తిరిగి పీఎల్‌ఆర్‌ గ్రాండ్‌ రోడ్డుగుండా వెళ్లాలి.
 
 
చెన్నై టూ అలిపిరి
చెన్నైనుంచి తిరుమల వెళ్లే వాహనాలు మార్కెట్‌యార్డు వద్ద ఫ్లై ఓవర్‌ చేరుకుంటాయి. అక్కడ్నుంచి నేరుగా కపిలతీర్థం వద్ద దిగాలి. తిరుగు ప్రయాణం లోనూ ఇదే దారి.
 
 
ఫ్లైఓవర్‌ విస్తీర్ణం: 3.4 కి.మీ..
బడ్జెట్‌ : రూ.500 కోట్లు
మార్గాలు: మార్కెట్‌యార్డు టూ కపిలతీర్థం. రామానుజ సర్కిల్‌, లీలా మహల్‌ వద్ద జంక్షన్‌ పాయింట్లు సుబ్బలక్ష్మి విగ్రహం వద్ద బటర్‌ఫ్లై సర్కిల్‌
 
 
స్మార్ట్‌ స్ట్రీట్స్‌ అభివృద్ధి
తిరుపతి స్మార్ట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లో స్మార్ట్‌ స్ట్రీట్స్‌ కూడా అభివృద్ధి చేయనున్నారు. ఇవి నగరంలో 27 కిలోమీటర్లు మేర ఉంటాయి. పాదచారులు నడిచి వెళ్లేందుకు వేరుగా స్మార్ట్‌స్ట్రీట్స్‌లో ఉంటాయి. అలిపిరి బైపాస్‌ నుంచి స్మార్ట్‌ స్ట్రీట్స్‌ మొదలుకానున్నాయి.
 
 
రేల్వే స్టేషన్‌ టూ అలిపిరి
రైల్వే స్టేషన్‌, మెయిన్‌ బస్టాండు నుంచి తిరుమల వెళ్లాలంటే సుబ్బలక్ష్మి విగ్రహం వద్ద ఫ్లై ఓవర్‌ ఎక్కి కపిలతీర్థం వద్దకు చేరుకోవాలి.
 
 
బస్టాండు టూ రేణిగుంట
 • తిరుపతి మెయిన్‌ బస్టాండు నుంచి రేణిగుంట వైపు వెళ్లే వాహనాలు సుబ్బలక్ష్మి సర్కిల్‌ వద్ద ఫ్లై ఓవర్‌ బటర్‌ఫ్లై సర్కిల్‌ చుట్టుకుని రామానుజం సర్కిల్‌ వద్ద దిగాలి.
 • రేణిగుంట నుంచీ బస్టాండు రావాలంటే రామానుజ సర్కిల్‌ వద్ద ఫ్లై ఓవర్‌కు చేరుకుని బటర్‌ ఫ్లై దారిగుండా చేరుకోవాలి. రేణిగుంట నుంచి తిరుమల వెళ్లాంలటే రామానుజ సర్కిల్‌ వద్ద ఫ్లై ఓవర్‌ ఎక్కి కపిలతీర్థం వద్ద దిగాలి.
 • tpt-vanthena.jpg

Share this post


Link to post
Share on other sites

 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×