Jump to content

Tirupati smart city.


sonykongara

Recommended Posts

  • Replies 225
  • Created
  • Last Reply

తిరుపతిలో హెలి పర్యాటకం

రూ.999కే ప్రయాణం

శాశ్వత హెలిప్యాడ్‌ నిర్మాణానికి నిధులు విడుదల

తిరుపతి: పర్యాటకశాఖ సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు హెలికాప్టర్‌ ప్రయాణాన్ని అందుబాటులోకి తేనుంది. 2015 శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత తిరుపతి ప్రాంతం హెలీ పర్యాటకానికి అనువువైన కేంద్రంగా నిర్ధారణ అయింది. సమీప ప్రాంతాల ప్రజలతో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు ఈ హెలి పర్యాటకాన్ని ఆదరిస్తారని పర్యాటకశాఖ భావిస్తోంది. ఆలయాల జిల్లా అయిన చిత్తూరు జిల్లా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించింది. తాజాగా తిరుపతి నగరాన్ని ప్రసాద్‌ పథకం ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటకశాఖ ప్రకటించిన విషయం విధితమే. తిరుపతి కేంద్రంగా హెలి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవ చూపుతున్నారు.

తిరుపతిలో శాశ్వత హెలిప్యాడ్‌, టికెట్‌ విక్రయ కేంద్రం, ప్రధాన రహదారులకు అనుసంధాన రహదారులు అభివృద్ధి కోసం రూ.80 లక్షల ప్రతిపాదనలకు జిల్లా పాలనాధికారి ఆమోదం లభించింది. హెలిప్యాడ్‌ నిర్మాణం పూర్తి కాగానే రెండు నెలల్లో హెలి పర్యాటకం ఆస్వాదించేందుకు అవసరమైన ఏర్పాట్లును చేసే పనిలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ నిమగ్నమైంది.

* ప్యాకేజీల రూపకల్పనలో అధికారులు

తిరుపతిలో హెలి పర్యాటకం శాశ్వతం చేయనున్నారు. ఖరీదైన వ్యవహారం కావడంతో గిట్టుబాటు కలిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో పర్యటించేందుకు రూ.999కే అవకాశం కల్పించాలని పర్యాటక శాఖ అధికారులు నిర్ణయించారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి, కాణిపాకం, హర్సిలీహిల్స్‌తో పాటు కడప జిల్లా గండికోట వరకూ పర్యటించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా చెన్నై-తిరుమల, బెంగళూరు-తిరుపతి.. ప్యాకేజీలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందనే విషయమై ఆధ్యయనం చేస్తున్నారు. బృందాలుగా ప్యాకేజీ బుకింగ్‌ చేసుకున్న వారిని తిరుపతి వరకూ హెలికాప్టర్‌లో తీసుకుని వచ్చి తిరుపతి నుంచి తిరుమలకు పర్యాటకశాఖ వాహనాల్లో తిరుమలకు తరలించి అక్కడ శ్రీవారి దర్శనం కల్పించి తిరిగి బెంగుళూరు, చెన్నైలకు తరలిస్తే మంచి స్పందన ఉంటుందని పర్యాటకశాక అధికారులు ఆలోచిస్తున్నారు. ఆలయాల సందర్శన, పొరుగు రాష్ట్రాలకు సేవల విస్తరణతో హెలి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

* శిల్పారామం వద్ద శాశ్వత హెలిప్యాడ్‌

- సురేష్‌బాబు, డీవీఎం, పర్యాటకశాఖ, తిరుపతి

శిల్పారామం సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో హెలిప్యాడ్‌ నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రాంతం నుంచి ప్రధాన రహదారులకు అనుసంధానంగా రహదారులను నిర్మించనున్నారు. హెలికాప్టర్‌ ఇక్కడే ఉంటున్నందున దాని రక్షణ, ఇతర భద్రతా చర్యలు చేపట్టేలా హెలిప్యాడ్‌ ప్రాంగణం ఉంటుంది. అన్‌లైన్‌ బుకింగ్‌ తో పాటు తక్షణం ప్రయాణం పొందేందుకు టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌జైన్‌ ఆదేశానుసారం ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించి పనులు చేపట్టేందుకు ఆదేశించారు. రెండు నెలల వ్యవధిలో పనులు పూర్తి చేస్తాం. ఇప్పటికే రెండు సంస్థలు హెలి పర్యాటకాన్ని అందించేందుకు సుముఖంగా ఉన్నాయి. ప్యాకేజీల రూపకల్పన అనంతరం పర్యాటక సేవలు ప్రారంభిస్తాం.

Link to comment
Share on other sites

తిరుపతిలో అతిపెద్ద సైన్స్ మ్యూజియానికి జనవరిలో శంకుస్థాపన

 

 
 

science-musuem-tirupati-12012016.jpg

ప్రతిష్టాత్మక సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ చిహ్నంగా తిరుపతిలో వంద ఎకరాలలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం రోజునే సైన్స్ మ్యూజియం నిర్మాణానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. జనవరి 3 నుంచి 7 వ తేదీ వరకు జరగనున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ కోసం రాష్ట్రానికి ప్రధాని రానున్నారు.

సైన్స్ కాంగ్రెస్ కోసం జరుగుతున్న ఏర్పాట్లపై తన కార్యాలయంలో అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని సప్తగిరుల థీమ్‌తో సైన్స్ మ్యూజియం నిర్మాణం తలపెట్టినట్టు అధికారులు తెలిపారు. 7 గ్లోబుల ఆకారంలో ఈ సైన్స్ మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు. హాంకాంగ్ సైన్స్ మ్యూజియాన్ని స్పూర్తిగా తీసుకున్నారు. దేశంలోనే అతి పెద్ద సైన్స్ మ్యూజియంగా దీన్ని నిర్మాణం జరగనున్నది.

‘బ్రహ్మాండ’ పేరుతో నిర్మాణం అవుతున్న ఈ మ్యూజియానికి తిరుపతిలో ప్రాథమికంగా స్థల ఎంపిక పూర్తిచేశారు. అయితే, భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకుని అక్కడ కాకుండా మల్లెమడుగు ప్రాంతంలో విశాలమైన సరస్సుకు ఒకవైపుగా ప్రభుత్వ స్థలంలో దీన్ని నిర్మించడానికి గల అవకాశాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనతో స్థల ఎంపికపై మళ్లీ కసరత్తు చేయాలని నిర్ణయించారు. దీనిపై రెండురోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మ్యూజియానికి అనుసంధానంగా కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తారు.

 

ఈ మ్యూజియం ఏర్పాటు ఏపీలో సైన్స్ టూరిజం అభివృద్దికి పడిన తొలి అడుగుగా నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ సరస్వత్ అభివర్ణించారు. రెండొందల ఎకరాలలో భారీ గ్లోబ్ ఆకారంలో 7 కట్టడాలను నిర్మించనున్నారు. ఆథునిక సాంకేతిక విధానాలతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 3డి పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోనున్నామని అధికారులు చెప్పారు.

మ్యూజియంలో ఓషనోగ్రఫీ, మిస్సైల్ టెక్నాలజీ, బయోలజీ, పురావస్తు పరిశోధన, ప్రాచీన చరిత్ర, అంతరిక్ష, ఖగోళ శాస్త్రాలు, ఆక్వా, మెరైన్, రోబోటిక్స్ తదితర సకల శాస్త్రాల అంశాలు వుంటాయి. లోపలనుంచి నేరుగా తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాటు వుంటుంది. ఇదే భవిష్యత్‌లో మ్యూజియానికి ప్రధాన ఆకర్షణ అవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. మ్యూజియంలో నిత్యం రోబోటిక్ ప్రదర్శనలు, డైనమిక్ ఈవెంట్స్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్, అబ్జర్వేటరీస్, నాలేడ్జ్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు చెప్పారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...


సీఎంను కలిసిన కుమియుమి అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రెసిడెంట్ యమజ 636204383434105162.jpg

దావోస్‌:కుమియుమి అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రెసిడెంట్ యమజ సీఎం చంద్రబాబును కలిసారు. టెక్నాలజీ, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ రంగాల్లో కుమియుమి ఆసక్తి

చూపింది. తిరుపతి అభివృద్ధిలో భాగస్వాములవ్వడానికి ఆయన ఆసక్తి కనబరిచింది.

టెంపుల్ టౌన్ అభివృద్ధిలో అనుభవం వున్న ఈ కంపెనీ ఇప్పటికే వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా వుంది.గృహ నిర్మాణం, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగాలలో జపనీస్ కంపెనీలతో కలిసి ఒక కన్సార్టియంగా ముందుకొచ్చి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకురాగలమని కుమియుమి ప్రతిపాదించింది. స్పష్టమైన ప్రణాళికతో మా రాష్ట్రానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

Link to comment
Share on other sites

  • 5 weeks later...

స్మార్ట్‌గా జూ అభివృద్ధి!

స్మార్ట్‌సిటీ నేపథ్యంలో జంతు ప్రదర్శనశాల విస్తరణ

రూ.200 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌

నైట్‌సఫారీ, ట్రెక్కింగ్‌ పాయింట్ల ఏర్పాటు

న్యూస్‌టుడే, మంగళం(తిరుపతి)

ctr-gen1a.jpg

స్మార్ట్‌సిటీగా ఎంపికైన తిరుపతి నగరానికి మహర్దశ పట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని సందరనగరంగా తీర్చిదిద్దే వీలు కలిగింది. దేశవిదేశాల నుంచి వచ్చే యాత్రికులు, పర్యాటకులను ఆకర్షిస్తూనే.. అభివృద్ధికి దారులు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే నగరంలోని ఉద్యానవనాలు అభివృద్ధి చేసే పనులు ఇప్పటికే పూర్తిచేశారు. ప్రస్తుతం శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వంతు వచ్చింది. జూను అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు.

తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతామంటూ అధికారంలో ఉన్న పార్టీలు ఏళ్లుగా ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నాయి. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇందుకు సంబంధించిన అడుగులు పడ్డాయి. జిల్లాకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జూను అంతర్జాతీయస్తాయిలో తీర్చిదిద్దేందుకు సుమారు రూ.100 కోట్ల వ్యయంతో మాస్టర్‌ ప్లాన్‌ విడుదల చేశారు. వీటితో జూకు పూర్తిస్థాయిలో ప్రహరీ నిర్మించడం, జంతు నివాస స్థావరాలను ఆధునిక సాంకేతికతతో తీర్చిదిద్దడం, మోనోరైలు ఏర్పాటు, జూ ప్రవేశమార్గాన్ని తీర్చిదిద్దడం వంటి పనులు చేయట్టాలని నిర్ణయించారు. ఆ ప్రయత్నం కొంతవరకు విజయవంతమైనా, పూర్తిస్థాయిలో అమలు జరగలేదు. ఆ తరువాత మాస్టర్‌ ప్లాన్‌కు నిధులు మంజూరు కాకపోవడంతో పథకం మరుగున పడిపోయింది. దీంతో సీజెడ్‌ఏ(సెంట్రల్‌ జూ అథారిటీ) నిధులు, జూపార్కు ఆదాయంతో జూను కొంతమేరకు అభివృద్ధి చేశారు.

తెరపైకి మాస్టర్‌ప్లాన్‌

స్మార్ట్‌సిటీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మాస్టర్‌ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. దీంతో జూపార్కు అధికారులు రూ.200 కోట్ల వ్యయంతో 1200 హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టబోయే అభివృద్ధి పనులతో మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేశారు. జూలోని అన్ని విభాగాలను ఆధునికీకరించడం, విస్తరించడం వంటి పనులను రాబోయే 20 ఏళ్లలో చేపట్టే ప్రణాళికలు రూపొందించారు. ప్రతిపాదనలను ఇటీవలే జూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే పనులు ప్రారభించేందుకు సిద్ధంగా ఉన్నారు.

నైట్‌సఫారీ.. ట్రెక్కింగ్‌..

జూపార్కును మాస్టర్‌ ప్లాన్‌కు అనువుగా తీర్చిదిద్దేందుకు అధికారులు లేఔట్‌ను రూపొందించారు. ఇందులో ప్రధానంగా సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో నైట్‌సఫారీని డిజైన్‌ చేశారు. ఎంపిక చేసిన భూభాగంలో అంతర్గత రోడ్లు, వన్యప్రాణుల నివాస స్థావరాలు, సందర్శకులకు అనువుగా వసతి కేంద్రాలు, తాగునీటి శుద్ధికేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రాత్రి ఆరుగంటల తరువాత నైట్‌సఫారీని ఏర్పాటు చేస్తారు. జూపార్కు అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో సందర్శకులు తిరుగుతూ రాత్రి సంచార జంతువులను చూసే అవకాశం కల్పిస్తారు.

మేకలబండ కొండపైకి ట్రెక్కింగ్‌

అలానే 200 హెక్టార్ల పరిధిలో ఉన్న మేకలబండ కొండపైకి ట్రెక్కింగ్‌ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కొండపైకి మార్గాన్ని ఏర్పాటుచేసి, పై భాగంలో హిల్‌వ్యూ కేంద్రం ఏర్పాటు చేస్తారు. కొండపై నుంచి తిరుపతి నగరాన్ని చూసేందుకు వీలుగా టెలీస్కోపులను అందుబాటులో ఉంచుతారు. వీరికి అనువుగా విశ్రాంతి కేంద్రాన్ని నిర్మిస్తారు. దీంతోపాటు మరో రెండు వందల హెక్టార్లలో వివిధ జంతువుల సఫారీలను ఏర్పాటు చేస్తారు.

స్మార్ట్‌సిటీకి అనువుగా..

తిరుపతి నగరం ఆకర్షణీయనగరంగా ఎంపికైన నేపథ్యంలో జంతు ప్రదర్శనశాలనూ విస్తరించే పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాబోయే ఇరవై సంవత్సరాల్లో అభివృద్ధి చేసేందుకు అనువుగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాం. ఇందుకోసం రూ.200 కోట్ల అంచనాలను ప్రభుత్వానికి పంపాం.మాస్టర్‌ప్లాన్‌ అమలుతో జూ దశ మారనుంది. సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం.

- శ్రీనివాసులురెడ్డి, సంరక్షకులు(క్యూరేటర్‌), శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల
Link to comment
Share on other sites

  • 1 month later...

తిరుపతిలో జల‘కల్యాణి’

11ap-story3a.jpg

తిరుమల, తిరుపతికి తాగునీరందించే కల్యాణి డ్యాం మండు వేసవిలోనూ జలకళను సంతరించుకుంది. కొండల మధ్య డ్యాం ఉండటంతో వూట నీరు డ్యాంలోకి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. అయితే నీటి లీకేజీల కారణంగా వేసవి రాగానే ప్రతి యేడాది డ్యాం వట్టిపోయేది. ఈ సంవత్సరం డ్యాంకు, పైపు లైన్లకు చేపట్టిన మరమ్మతులు, నీటిసంరక్షణ చర్యలు ఫలితాలనిస్తున్నాయి. వేసవి వచ్చినా ప్రస్తుతం 69 అడుగుల నీటితో నిండుకుండలా ఉంది. 4 లక్షల జనాభా ఉన్న తిరుపతి నగరంతోపాటు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే వేలాదిమంది భక్తుల దాహార్తి తీరుస్తోంది. దీంతో రెండేళ్లపాటు వర్షాలు లేకపోయినా నీటికే మాత్రం కొరత ఉండదని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

తిరుపతిలో క్యాన్సర్‌ ఆసుపత్రి

5brk-66a.jpg

తిరుమల: తితిదే, టాటా గ్రూప్‌ సంస్థ సహకారంతో తిరుపతిలో క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందం శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగింది. టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ నటరాజన్‌ శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలరంగనాయకుల మండపంలో ఆలయ ఈవో సాంబశివరావుతో సమావేశమయ్యారు. రూ. 150కోట్ల వ్యయంతో 18నెలల కాలంలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా టటా ఛైర్మన్‌ను ఆలయ ఈవో సాంబశివరావు సత్కరించారు.

5brk-66b.jpg

5brk-66c.jpg

 
Link to comment
Share on other sites

రూ.140 కోట్లతో తిరుపతిలో కేన్సర్‌ ఆస్పత్రి

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం

టాటా ట్రస్టు రూ.100 కోట్లు కేటాయింపు

దాతల నుంచి రూ.40 కోట్ల విరాళం

ఒప్పందంపై తితిదే ఈవో, టాటా ట్రస్టు ఎండీ సంతకాలు

5ap-state1a.jpg

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి పాదాల చెంత తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై తితిదే ఈవో సాంబశివరావు, టాటా ట్రస్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకటరమణన్‌ శ్రీవారి ఆలయంలో శుక్రవారం సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో టాటా గ్రూపు ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ నటరాజన్‌, ట్రస్టీ ఆర్‌.కె.కృష్ణకుమార్‌ పాల్గొన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి రూ.140 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా టాటా ట్రస్టు రూ.100 కోట్లు భరించనుంది. మిగిలిన రూ.40 కోట్లలో అమెరికాకు చెందిన ఓ భక్తుడు రూ.33 కోట్లు ఇది వరకే అందజేశారు. మరో రూ.7 కోట్లు ఓ ప్రముఖ కంపెనీ అందచేసింది. రూ.40 కోట్ల విరాళాలు ఇచ్చిన దాతలు తమ పేర్లు వెల్లడించవద్దని తితిదేకు విజ్ఞప్తి చేశారు. అలిపిరి సమీపంలోని శ్రీవేంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ సమీపంలో తితిదేకు చెందిన 25 ఎకరాల స్థలాన్ని లీజు ప్రాతిప¾దికన కేటాయించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈవో సాంబశివరావు మాట్లాడుతూ టాటా ట్రస్టు ఇప్పటికే ముంబయి, కోల్‌కతల్లో కేన్సర్‌ ఆస్పత్రులు నిర్వహిస్తోందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిని మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేయడంలో భాగంగా అనేక వైద్యశాలలను ఇక్కడ ఏర్పాటు చేసిందని చెప్పారు. అరవిందో నేత్ర వైద్యశాల ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మరో 15 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. టాటా ట్రస్టు ఎండీ వెంకటరమణన్‌ మాట్లాడుతూ తిరుపతిలో కేన్సర్‌ ఆస్పత్రి నిర్మించేందుకు తితిదేతో ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని, రెండేళ్లలోపు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యశాల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టాటా గ్రూపు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ నటరాజన్‌ మాట్లాడుతూ కేన్సర్‌ రోగులకు సేవలందించేందుకు ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. ఇందుకు సహకారం అందించిన తితిదే ఈవో సాంబశివరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈవో అభ్యర్థన మేరకు తితిదేకు ఐటీ సేవలు అందించామని తెలిపారు.

 
Link to comment
Share on other sites

తిరుపతి పర్యాటకానికి..చైనా ప్రణాళికలు

జిల్లాలో చైనా బృందం పరిశీలన

ctr-gen6a.jpg

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, రేణిగుంట ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతిలో పరాటక రంగాభివృద్ధికి.. భారీ పెట్టుబడులతో పారిశ్రామికీకరణ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విదేశీ సంస్థల సహకారంతో ఈ రెండు రంగాల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.. ఏటా కోట్లాది మంది వచ్చే తిరుమల తిరుపతి వేదికగా పర్యటకాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.. చైనాకు చెందిన పలువురు ప్రతినిధులు శనివారం తిరుమల తిరుపతి సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది చైనా పర్యటన సందర్భంగా ఆ దేశ కంపెనీలతో చర్చలు జరిపారు. కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఆ నేపథ్యంలోనే తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన చైనా ప్రతినిధుల బృందం జిల్లాలో పర్యటించింది. జిల్లా పాలనాధికారి పీఎస్‌ ప్రద్యుమ్న సహా.. పర్యటక.. నగరపాలక సంస్థ అధికారులతో సమావేశమైంది. రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్‌తో భేటీ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. సమీపంలోని రామాపురం చెరువు బోటింగ్‌కు ఎంత వరకు అనుకూలమో.. పరిశీలించారు. ఆ తర్వాత తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదుట ఉన్న స్థలాన్ని, తిరుమల బైపాస్‌ మార్గంలో ఉన్న ప్రకాశం నగరపాలక సంస్థ ఉద్యానాన్ని చూశారు. కపిలతీర్థం వద్ద ఉన్న దివ్యారామాన్ని, పక్కనే ఉన్న శ్రీహరిధామం ప్రాజెక్టులను సందర్శించారు. అక్కడినుంచి చంద్రగిరి కోటకు వెళ్లి.. అక్కడి కోట విశిష్టతను తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ బృందం తిరుమలకు చేరుకుంది. వీరు పరిశీలించిన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాజెక్టులు తీసుకువస్తే ప్రయోజనకరంగా ఉంటుందో ప్రాథమికంగా చర్చించారు. చైనా ప్రతినిధుల్లో ఫిర్‌దోస్‌ దున్‌జిషా, కుయ్‌లి, లియాంగ్‌ వెన్‌బిన్‌, జాంగ్‌ యాంగై, నార్మన్‌ తదితరులు ఉన్నారు. వీరు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నాక.. తితిదే ఈవో ఏకే సింఘాల్‌, పాలనాధికారి ప్రద్యుమ్నతో భేటీ కానున్నట్లు తెలిసింది.

  • martimony1.jpg
Link to comment
Share on other sites

  • 4 weeks later...

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు

తుది దశకు చేరుకున్న పీఎంసీ ఎంపిక

స్మార్ట్‌సిటీ మూడో పాలకమండలి సమావేశం

ctr-gen7a.jpg

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి నగర పవిత్ర, ఆధ్యాత్మిక అనుభూతిని పెంపొందించేలా స్మార్ట్‌సిటీ పనులు చేపట్టనున్నట్లు జిల్లా పాలనాధికారి పీఎస్‌ ప్రద్యుమ్న తెలిపారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం స్మార్ట్‌సిటీ మూడో పాలకమండలి సమావేశం( స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) జిల్లా పాలనాధికారి అధ్యక్షతన జరిగింది. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్‌టెన్సీ(పీఎంసీ) ఎంపిక ప్రధాన అజెండాగా సాగిన సమావేశంలో తిరుపతి నగరపాలిక కమిషనర్‌ హరికిరణ్‌, తితిదే జేఈవో పోలా భాస్కర్‌, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్సీ జయలక్ష్మీ డైరెక్టర్ల హోదాలో పాల్గొన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలకమైన పీఎంసీపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. అధికారులు వూహించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో పీఎంసీ సంస్థలు టెండర్లు వేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థలు ముందుకు రావడంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేసే సంస్థను గుర్తించే ప్రక్రియ గురువారం పూర్తికాలేదు. మరో వారం రోజుల్లో నాలుగో స్మార్ట్‌సిటీ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. సమావేశం అనంతరం జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న మాట్లాడుతూ జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌జైన్‌, తిరుపతి నగరపాలిక కమిషనర్‌ వినయ్‌చంద్‌ల బదిలీలో స్మార్ట్‌సిటీ సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని, పనులు ప్రారంభానికి సంబంధించిన ముందస్తు చర్యలు శరవేగంగా సాగుతున్నట్లు వివరించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా ప్రతిపాదించిన ప్రాజెక్టులతో పాటు విలీన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. తిరుపతి నగరాన్ని చెరువుల నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేస్తున్నదని, నగరంలోని అంతరించిన, శిథిµలావస్థలో ఉన్న, ఆక్రమణల పాలైన చెరువులకు పూర్వవైభవం తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరా, నమ్మకమైన ప్రజా రవాణా వ్యవస్థ, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్‌ తీగలు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంచి తిరుపతి ప్రజలకు, తిరుమలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా పాలనాధికారి తెలిపారు.

రూ.1300 కోట్లతో నగరం అభివృద్ధి

ప్రజలకు సౌకర్యవంతమైన జీవనం అందించడమే స్మార్ట్‌సిటీ ఉద్దేశం అని నగరపాలిక కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్‌ అన్నారు. నగరంలో కీలకమైన 750 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నగరాన్ని ఎంపిక చేసి రూ.1300 కోట్లతో ఆదర్శప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మిగిలిన రూ.350 కోట్లతో పాన్‌సిటీ విధానంలో నగరంలో మిగిలిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 2015-16కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.182 కోట్లు వచ్చాయని, మరో రూ.360 కోట్లు రావాల్సి ఉందని కమిషనర్‌ వెల్లడించారు.

Link to comment
Share on other sites

తిరుమలకు ట్రామ్స్‌
 
 
636324862084166444.jpg
  • తిరుపతి స్మార్ట్‌ సిటీలో కొత్త ప్రాజెక్టు
  • సాధ్యాసాధ్యాలపై అధ్యయనం ప్రారంభం
తిరుపతి నగరం, జూన్‌ 7: తిరుపతి-తిరుమల మధ్య ఇక ట్రామ్స్‌ నడవనున్నాయా? స్మార్ట్‌సిటీ మిషన్‌లో భాగంగా ఈ సరికొత్త ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం ప్రారభమైంది. తిరుపతిలో 1610 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన స్మార్ట్‌ సిటీ ప్రణాళికలకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద చెరి ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నాయి. మిగిలిన నిధులను ప్రైవేటు భాగస్వామ్యం కింద సమీకరించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈఎస్సెల్‌ (ఈఎస్ఎస్ ఈఎల్‌) సంస్థ ట్రామ్స్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తోంది. అయితే ఆర్థిక అంశాల్లో మరింత స్పష్టత రావాల్సి ఉంది. స్విస్‌ చాలెంజింగ్‌ పద్ధతిలో ప్రాజెక్టును చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. తిరుపతి, తిరుమలల్లో భౌగోళిక అంశాలను అధ్యయనం చేస్తోంది. ముఖ్యమైన డేటా కోసం నగర పాలక సంస్థను సంప్రదించగా తిరుమల కొండకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉండదని యంత్రాంగం సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా సమాచారం సేకరించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ట్రామ్స్‌ ప్రాజెక్ట్‌ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. ప్రస్తుతానికి ప్రాథమిక దశలో ఉందని ధ్రువీకరించారు. మెట్రో రైల్‌, మోనో రైల్‌, రోప్‌ వే వంటి ప్రతిపాదిత ప్రాజెక్టులు వచ్చినంత వేగంగానే వెనక్కివెళ్లాయి. వైఖానస ఆగమ శాస్ర్తాలతోపాటు సాంకేతిక అభ్యంతరాలు రావడమే ఇందుకు ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి తిరుపతి-తిరుమల మధ్య ప్రయాణానికి వీలుగా మరో ప్రాజెక్టు పరిశీలనకు రావడం చర్చనీయాంశమైంది. ఆగమ శాస్ర్తాల విషయం ఎలా ఉన్నా సాంకేతిక అంశాలపై అధ్యయనం ప్రారంభమైంది. పరిస్థితులు అనుకూలిస్తే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 5 నుంచి పదేళ్ల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
Link to comment
Share on other sites

తిరుపతి దారులకు సరికొత్త శోభ

ప్రధాన కూడళ్లలో తోరణాలు

ctr-top1a.jpg

తిరుపతి: దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తిరుమలకు చేరుకుంటే.. తప్ప ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి వచ్చామన్న భావన కనిపించడం లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల తరహాలో తిరుపతిలోనూ ఆధ్యాత్మిక శోభ తీసుకురావాలని తితిదే, అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. అధికారుల్లో కదలిక వచ్చింది. నగర అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పలు నమూనాలు తయారుచేశారు. త్వరలోనే ఆచరణలోకి తీసుకురానున్నారు.

తిరుమలతోపాటు తిరుపతిలోనూ రాష్ట్రవ్యాప్త ప్రాధాన్యమున్న దేవాలయాలెన్నో ఉన్నాయి. వీటిలో తితిదేకు చెందిన అనేక అనుబంధ ఆలయాలు ఉన్నాయి. వీటిని సందర్శించేందుకూ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, అక్కడి ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు నగరంలో ఆధ్యాత్మిక భావన భక్తులకు సరిగా కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నగరాన్ని ఆ దిశగా అభివృద్ధి చేసేందుకు తితిదే కసరత్తు ప్రారంభించింది. నగరంతోపాటు చుట్టు పక్కల ఉన్న రహదారులు, కూడళ్లను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టింది. రహదారుల మధ్యలో విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేయడంతోపాటు పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దడం, నడక దారులు, కూడళ్లు, బస్‌, రైల్వేస్టేషన్‌ ఇలా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి తిరుపతికి కొత్త రూపు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

తోరణాల నిర్మాణం

తిరుపతి నగరానికి చేరుకునేందుకు నలువైపులా పలు మార్గాలు ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, కడప, నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చే దారుల్లో.. నగర సరిహద్దుల్లో కూడళ్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మార్‌పల్లి, ఉప్పరపల్లి, రేణిగుంట, కారకంబాడి, తిరచానూరు.. తదితర ప్రాంతాల్లోని సర్కిళ్లను ఎంపిక చేస్తున్నారు. అక్కడ తిరుపతిలోకి ప్రవేశిస్తున్నామని ప్రజలు భావించేలా ప్రత్యేక స్వాగత తోరణాలు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆర్చీలు, కళాకృతులను ప్రతిష్టించేందుకు తితిదే, కార్పొరేషన్‌ సంయుక్తంగా సన్నాహాలు చేస్తున్నాయి.

అవిలాలకు మహర్దశ

అవిలాల చెరువును వినియోగంలోకి తెచ్చేందుకు, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తితిదే అధికారులు సిద్ధమయ్యారు. చెరువు అభివృద్ధికి సంబంధించి గతంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం అడ్డంకులు తొలగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో దీన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో తుడా అధికారులు రూ.70 కోట్లలో అవిలాల చెరువు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఇందులో బోటింగ్‌, రెయిన్‌ డ్యాన్సింగ్‌, ఫౌంటెయిన్లు, రెస్టారెంట్లు వంటి వసతులు సమకూర్చాలని ప్రతిపాదన తయారు చేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చెరువులో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని న్యాయస్థానం సూచించింది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే థీమ్‌ పార్క్‌ తరహాలో కొత్త హంగులు అద్దాలని చూస్తున్నారు. చెరువు చుట్టూరా మొక్కల పెంపకం చేపట్టనున్నారు.

28 కి.మీల పరిధిలో..

తిరుపతి నగర వ్యాప్తంగా సుమారు 28 కి.మీ పొడవైన రహదారులు తితిదే ఆధీనంలో ఉన్నాయి. వీటి నిర్వహణ, సుందరీకరణ బాధ్యతను తితిదే పూర్తిగా చేపట్టనుంది. ఈ ఆర్థిక సంవత్సరం తితిదే బడ్జెట్‌లో కూడా ఇంజినీరింగ్‌ పనులకు అధికారులు పెద్దపీట వేశారు. రహదారుల అభివృద్ధి నిమిత్తం సుమారు రూ.18.45 కోట్లు ఖర్చు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు పొందుపర్చారు. అలిపిరి-చెర్లోపల్లి రహదారి ప్రస్తుతం వాహనాల తాకిడికి అనువుగా లేదు. ఈ ప్రాంతంలో జూపార్కు, వేదిక్‌ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ఉన్నాయి. వీటితోపాటు కొత్తగా అక్కడ కంటి ఆసుపత్రి నిర్మాణానికి ఇప్పటికే సీఎం శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో రాకపోకలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రహదారిని నాలుగు లైన్లగా మార్పు చేసేందుకు తితిదే సిద్ధమవుతోంది.

కూడళ్లు సైతం...

నగరంలో అనేక కూడళ్లు ఉన్నాయి. తితిదే వీటిని అభివృద్ధి చేయనుంది. నగరంలో ఎన్ని కూడళ్లు ఉన్నాయి? అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటనేది ముందుగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఎంపిక చేసిన కూడళ్లలో పనులు చేపడతారు. స్వామి వారి వైభవం, విశిష్టతను తెలిపే విధంగా పలు కళాకృతులను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల నగరంలో తిరిగే భక్తులు ఎటు చూసినా స్వామి వారినే స్మరించుకునే విధంగా మార్పులు తీసుకురానున్నారు. ఇందుకోసం తితిదే అధికారులు తుడా, కార్పొరేషన్‌ అధికారులతో సమన్వయం ఏర్పర్చుకొని పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

బస్‌, రైల్వే స్టేషన్లలోనూ....

తిరుపతికి బస్‌, రైళ్ల ద్వారా రోజుకు సుమారు లక్ష మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప¾రిస్థితుల్లో వాటిని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా తితిదే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బస్టాండులో దిగిన వెంటనే సామాన్య భక్తులు అక్కడే తమ కాలకృత్యాలు తీర్చుకుని తిరుమల చేరుకునే విధంగా అవసరమైన ఏర్పాటు చేసే అంశాన్ని తితిదే పరిశీలిస్తోంది. దీనివల్ల భక్తులు ప్రశాంతమైన మనస్సుతో స్వామి వారి దర్శనానికి వెళ్లేందుకు వీలుగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలా రానున్న రోజుల్లో నగరానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...