Jump to content

Tirupati smart city.


sonykongara

Recommended Posts

  • Replies 225
  • Created
  • Last Reply
  • 3 weeks later...
  • 2 weeks later...
తిరుమలకు కొత్త కళ!
అందుబాటులోకి మూడు కొత్త భవనాలు
రెండు శ్రీవారి సేవకులకు.. ఒకటి భక్తులకు
మార్చిలోగా పూర్తిచేసేందుకు ముమ్మర యత్నాలు
వేగంగా సాగుతున్న రింగురోడ్డు పనులు
ఈనాడు - తిరుపతి
08ap-main4a.jpg

తిరుమల కొత్త కళను సంతరించుకోనుంది. రద్దీ రోజుల్లో వసతి దొరక్క ఇబ్బంది పడుతున్న భక్తుల అవసరాల నిమిత్తం ఆరు అంతస్తుల కొత్త భవనంతో పాటు.. శ్రీవారి సేవకులకు ప్రత్యేకంగా వసతి సముదాయాలు రెండు అందుబాటులోకి రానున్నాయి. సుమారు రూ.43 కోట్లతో ఈ భవనాలు అత్యంత వేగంగా నిర్మితమవుతున్నాయి. 2018 మార్చిలోగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం తిరుమలలో 20 వరకు ప్రత్యేక వసతి సముదాయాలు, 41 అతిథిగృహాలు, మఠాలు, ఇతర ఆధ్యాత్మిక వసతి సముదాయాలు 38 వరకు ఉన్నాయి.

ప్రస్తుతం శ్రీవారి సేవకులుగా వచ్చే మహిళలకు పీఏసీ 3 భవనంలో, మగవారికి బస్టాండు సమీపంలో వసతి కల్పిస్తున్నారు. అక్కడ ఆధునిక సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు అధిగమించేందుకు ఉద్యాన విభాగం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా రెండు వసతి సముదాయాలను తితిదే నిర్మిస్తోంది. వీటిలో 10 పెద్ద హాళ్లు, రెండు పెద్ద భోజనశాలలు, ఒక్కో సముదాయంలో 50 మరుగుదొడ్లు ఉంటాయి. ఇక్కడే శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు పెద్ద హాలును నిర్మించారు. వచ్చే మూడునెలల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు.

08ap-main4b.jpg

6 అంతస్తులతో వకుళామాత అతిథిగృహం
కొండపైన పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా నిర్మిస్తున్న అత్యాధునిక భవనమిది. గోగర్భం డ్యాంకు వెళ్లే దారిలో ఆలయానికి దగ్గర్లో 6 అంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఒక్కో గదిలో గరిష్ఠంగా ఆరుగురు బస చేయొచ్చు. ప్రతి అంతస్తు 31,980 చదరపు అడగుల విస్తీర్ణంతో తీర్చిదిద్దుతున్నారు. రూ.39 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భవనంలో 272 గదులు ఉంటాయి. కార్లు, ద్విచక్రవాహనాలు నిలుపుకునేందుకు సెల్లార్‌ ఉంది. దీనిని వచ్చే ఏడాది మార్చిలోగా అందుబాటులోకి తేనున్నారు.

చకచకా రింగురోడ్డు..
తిరుమలలో రద్దీని అధిగమించేందుకు రింగురోడ్డు ముస్తాబవుతోంది. పాపవినాశనం నుంచి తిరుమలకు వస్తున్న దారిలో గోగర్భం డ్యాం సమీపంలో ప్రస్తుతం ఉన్న రోడ్డును కాస్త మళ్లించనున్నారు. ఇది శ్రీవారి ఆలయం వైపు వెళ్లకుండా   నేరుగా ప్రారంభ ద్వారం వద్దకు చేరుకునేలా పొడిగిస్తారు. ఆలయం చుట్టూ వృత్తాకారంలో నిర్మించి రింగురోడ్డుగా మార్చాలన్నది ప్రతిపాదన. ఇప్పటికే వరాహస్వామి అతిథిగృహం, రాంభగీచ సెంటర్‌, బస్టాండు, సీఆర్‌వో కార్యాలయం దగ్గర ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఈ కొత్తమార్గంతో నారాయణాద్రి, జేఈవో కార్యాలయం మీదుగా సులభంగా తిరుమల లోపలకు వెళ్లకుండానే వాహనాలు బయటపడవచ్చు. రోడ్ల నిర్మాణం కోసం అక్కడక్కడ కొండలను తొలిచి పనులు చేస్తున్నారు. 2018 చివరి నాటికి ఈ రహదారిని అందుబాటులోకి తెచ్చేందుకు తితిదే ప్రయత్నిస్తోంది.

08ap-main4c.jpgఎవరికీ ఇబ్బందులు లేకుండా..
- అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఈవో, తిరుమల తిరుపతి దేవస్థానం
భక్తులకు, శ్రీవారి సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్తగా భవనాలు, రహదారులు నిర్మిస్తున్నాం. త్వరలోనే ఇవి పూర్తవుతాయి. దీనివల్ల వసతి కష్టాలు చాలావరకు తీరుతాయని భావిస్తున్నాం. రింగురోడ్డు పనులను వేగంగా పూర్తిచేయాలని గుత్తేదారులకు, అధికారులకు సూచనలు ఇస్తున్నాం. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

రైల్వేస్టేషన్‌’
రూ.400 కోట్లతో ఆధునికీకరణ 
చైనా తరహాలో ప్లాట్‌ఫారాలు
తిరుపతి (రైల్వే), న్యూస్‌టుడే: తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.400 కోట్లతో స్మార్ట్‌ రైల్వేస్టేషన్‌గా ఆధునికీకరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు వినోద్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. వివిధ సంస్థలు, ప్రభుత్వశాఖల అధికారులు, నాయకులతో గురువారమిక్కడ ఆయన రైల్వే ప్రణాళికలపై చర్చించారు. చైనా వంటి దేశాల తరహాలో రైల్వేస్టేషన్‌లో రైళ్లు బయటకు కనిపించకుండా అండర్‌గ్రౌండ్‌లో ప్లాట్‌ఫాం నిర్మిస్తామని, మొదటి అంతస్తులో ప్రయాణికుల విశ్రాంతికి ఏర్పాట్లు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. రైలు వచ్చే సమయానికి ప్రయాణికులు కింది భాగంలోకి వచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని చెప్పారు. విమానాశ్రయం తరహాలో బాహ్య, అంతర్గత మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నామని తెలిపారు. స్టేషన్‌కు దక్షిణం వైపున 8 అంతస్తుల భవనం నిర్మిస్తున్నామని, గ్రౌండ్‌, మొదటి అంతస్తులను రైల్వే అవసరాలకు వినియోగించుకుని మిగిలిన అంతస్తులను వివిధ వ్యాపార, వాణిజ్య అవసరాలకు కేటాయించనున్నట్లు వివరించారు. స్టేషన్‌ ముందుభాగంలో వాటర్‌ ఫౌంటెయిన్లు, రూఫింగ్‌, గార్డెన్స్‌ తదితర సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో తిరుపతి నగరపాలకకమిషనరు హరికిరణ్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

చంద్రబాబుకు అనుగుణంగా తుడా మాస్టర్ ప్లాన్
05-01-2018 19:22:29

తిరుపతి: తుడా మాస్టర్‌ప్లాన్‌ను తుడా చైర్మన్‌ నరసింహ యాదవ్‌, వీసీ హరికిరణ్‌ విడుదల చేశారు. చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించామన్నారు. తుడా పరిధిలోకి చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, తిరుచానూరు, ఏర్పేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు వరకు 158 గ్రామాలు వచ్చాయని తూడా వీసీ తెలిపారు. ఫిబ్రవరి 5లోపు అభ్యంతరాలు, సూచనలు ఇవ్వొచ్చని ఆయన సూచించారు. రేపటి నుంచి అందుబాటులోకి తుడా ఏపీ.ఇన్‌ వస్తుందన్నారు. కొత్తగా 606 కి.మీ రోడ్లు నిర్మిస్తాయపి తుడా వీసీ హరికిరణ్‌ అన్నారు. 550 కి.మీ మేర రోడ్ల వెడల్పుకు ప్రతిపాదనలు స్థలాలు కోల్పోయేవారికి టీడీఆర్‌ డాక్యుమెంట్లు ఇస్తామని, వద్దనుకుంటే భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...