Jump to content

Tirupati smart city.


sonykongara

Recommended Posts

స్మార్ట్ సిటీల జాబితాలో తిరుపతి
 
636099862892582580.jpg
న్యూ ఢిల్లీ: స్మార్ట్‌ సిటీల రెండో జాబితాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 స్మార్ట్‌సిటీలను కేంద్రం గుర్తించింది. స్మార్ట్ సిటీల జాబితాలో తిరుపతికి చోటు దక్కింది. నిజానికి మొదటి జాబితాలోనే చోటు దక్కాల్సి వుంది.. కానీ రెండో జాబితాలో తిరుపతి పేరు ప్రకటించారు. మొదటి సారి చోటు దక్కకపోవడంతో ఢిల్లీనుంచి కన్సల్టెన్సీని తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా గుర్తింపునకు కావాల్సిన ప్రతిపాదనలను పంపారు. అంతేకాకుండా తిరుపతి ది బెస్ట్ కార్పోరేషన్‌గా నేషనల్ టెలివిజన్ అవార్డును గెలుచుకుంది. దీంతో రెండో జాబితాలో తిరుపతికి చోటు లభించింది. స్మార్ట్ సిటీగా కేంద్రం ఇచ్చే నిధులే కాకుండా.. ఓ వైపు టీటీడీ, మరోవైపు ఏపీ సర్కార్, కేంద్రం నుంచే వచ్చే నిధులతో తిరుపతిని అభివృద్ధి చేయనున్నారు. దాదాపు రూ.1600 కోట్లతో ప్రతిపాదన సిద్ధం చేసి పంపారు.

 

Link to comment
Share on other sites

  • Replies 225
  • Created
  • Last Reply

6 months ki oka sari smart cities ani list release chestaru..ippati varaku emanna vidilchara already announce chesina cities ki 

adhe kada.............smart cities lo pettesamu pandaga chesukondi antunnaru, ippati varaku yemanna oka rupaayi aiyina use aiyyindha?

Link to comment
Share on other sites

తిరుపతిలో భూగర్భ విద్యుత్తు తీగలు

రూ.20కోట్లు మంజూరు

న్యూస్‌టుడే, తిరుపతి(నగరపాలిక)

ctr-gen7a.jpg

తిరుపతి నగరపాలికలో భూగర్భ విద్యుత్‌ తీగల వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తిరుపతి స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందుతుందన్న నమ్మకంతో విభాగాల వారీగా స్మార్ట్‌ పనులు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్‌ భూగర్భ విద్యుత్‌ తీగల ఏర్పాటు పనులు సోమవారం ప్రారంభించింది. శ్రీగోవిందరాజస్వామి దక్షిణ మాడ¿వీధిలో నిర్మిస్తున్న గృహాంతర్గత విద్యుత్‌ సబ్‌స్టేషన్‌(ఇండోర్‌ సబ్‌స్టేషన్‌) నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన 33కేవీ విద్యుత్‌లైన్‌ను భూమిలోపల నుంచి తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎమ్‌ఎస్‌ సుబ్బులక్ష్మీ కూడలి నుంచి గోవిందరాజస్వామి దక్షిణ మాడ¿వీధి వరకు రెండు కిలోమీటర్ల దూరాన్ని భూగర్భ విద్యుత్‌ తీగలను వేస్తున్నారు. అంతేకాకుండా ఆందంగా ఉన్న రహదారులను తవ్వకుండా ప్రత్యేక యంత్రంతో సొరంగంగా డ్రిల్‌ చేసి దాని ద్వారా తీగలు అమర్చడానికి చర్యలు తీసుకున్నారు. నగరంలో విద్యుత్‌ తీగలు అస్తవ్యస్తంగా ఉండడంతో స్మార్ట్‌సిటీలో భాగంగా వాటి స్థానంలో భూగర్భ విద్యుత్‌ తీగలను ఏర్పాటుచేసేందుకు రూ.160 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుతం తిరుపతిలో రూ.20 కోట్ల వరకు వెచ్చించి అధునాతన ఇండోర్‌ సబ్‌స్టేషన్లు, భూగర్భ విద్యుత్‌తీగలను నిర్మిస్తున్నారు. రెండు కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేసేందుకు రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నారు.

గృహాంతర్గత విద్యుత్తు ఉపకేంద్రాలు

తిరుపతిలో విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం కోసం ఏపీఏస్పీడీసీఎల్‌ అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. నగరంలో సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి స్థల సమస్య ఎక్కువగా ఉండడంతో అధికారులు ఇండోర్‌ సబ్‌స్టేషన్‌లను నిర్మిస్తున్నారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి దక్షిణమాడ¿వీధి, తితిదే పరిపాలన భవనం, తిరుచానూరులోని తోళప్పగార్డెన్స్‌లో ఒక్కో సబ్‌స్టేషన్‌ను రూ.3కోట్లతో ఇండోర్‌ సబ్‌స్టేషన్‌లు నిర్మిస్తున్నారు. వీటితో పాటు మదనపల్లె, చిత్తూరులలో కూడా నిర్మించేందుకు విద్యుత్‌శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లలను భూమిలోపల ఉంచి వాటి నుంచి పైబర్‌ తీగల ద్వారా అనుసంధానం చేస్తారు. 20్ఠ20 మీటర్ల స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండడంతో నగరాల నడిబొడ్డున కూడా తక్కువ విస్తీర్ణంలో వీటిని నిర్మించుకునే సౌలభ్యం ఉంది.

Link to comment
Share on other sites

Tirupati enduku unna ah pub culture enduku akkada

Smart city lo pub pedatharani evaru chepparu uncle :D

Water, Electricity, Transport, Solid Waste Management, e-Governance, Housing for poor, Digitalization, Safety & Security measures for citizens,Environmental sustainability

 

Ee features vuntey/develop cheyyataniki smart cities ani chepthunnaru

Link to comment
Share on other sites

Smart city lo pub pedatharani evaru chepparu uncle :D

Water, Electricity, Transport, Solid Waste Management, e-Governance, Housing for poor, Digitalization, Safety & Security measures for citizens,Environmental sustainability

 

Ee features vuntey/develop cheyyataniki smart cities ani chepthunnaru

development to patu Anni rakala avalakshanalu kuda ravatam common ye kada ani na feeling of India uncle ...inta type cheyaleka pub ani small wording icha ante

Link to comment
Share on other sites

India mottam meeda uppatidaaka okka city aina change ayindaa with this smart city concept?

 

Btw... manollu start chesina smart village progress enti?

Ah scheme ni Mahesh bob baaga use cheskoni Sreemantham ni hit cheskonnadu.... After Sremantham end of business not even a xxxx uses that word now
Link to comment
Share on other sites

Tirumala is all set to get a modern facelift shortly, Electrical buses, LED lighting system, advanced sewage treatment plants, solid waste management system, and giant RO water purifiers will change the existing environment at the holy hill station of Tirumala.


Under the CSR activities, the Coal India and ONGC will take over the construction of the new sewage treatment plant proposed by TTD with the capacity of 5.5 mld (million litres per day) and also construct another sewage treatment plant with am equal capacity, which increases the total capacity to 11.1 mld and thus, meet the pilgrim population in Tirumala. Total cost of these two plants would be Rs.6 crore


TTD is paying to APSPDCL for halogen street lights to Tirumala alone Rs.1.2 crore per month, it will triple during Brahmotsavams and festival days. All these street lights will be replaced with LED street lights to reduce the radiation and warmth and also ensure eco-friendly energy conservation initiatives. For this Coal India and ONGC will spend Rs.5.5 crore


Using strictly human friendly and modern equipment, the entire solid waste management system will betaken up under a new scheme at a cost of Rs.1.5 crore, for transportation, collection, placement of bins and other ultra-modern equipment to dispose the waste.


With the donation from the PSUs and expert help of Wegheshna Foundation, the entire Tirumala which has small and medium RO plants including Tirupati, will now have 20 huge RO plants at strategic locations in Tirumala to supply pure drinking water. Each unit will be established at a cost of Rs.10 lakh, with a total expenditure of Rs.2 crore


In place of fuel (petrol/diesel) buses, six electrical buses also will be operated in Tirumala to transport pilgrims at free of cost round the clock.


Link to comment
Share on other sites

  • 2 weeks later...
. అదేవిధంగా తిరుపతిని ఇటీవల కేంద్రం స్మార్ట్‌ సిటీగా ప్రకటించిన నేపథ్యంలో నగర అభివృద్ధి కోసం మరో రూ.450 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకుంటోంది. తిరుపతిలో అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వైరింగ్‌ చేసేందుకు రూ.360 కోట్లు, ఐటీ పరిజ్ఞానం కోసం రూ.50 కోట్లు, స్మార్ట్‌ మీటర్ల కోసం రూ.40 కోట్లు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సమ్మతించింది.
Link to comment
Share on other sites

 

. అదేవిధంగా తిరుపతిని ఇటీవల కేంద్రం స్మార్ట్‌ సిటీగా ప్రకటించిన నేపథ్యంలో నగర అభివృద్ధి కోసం మరో రూ.450 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకుంటోంది. తిరుపతిలో అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వైరింగ్‌ చేసేందుకు రూ.360 కోట్లు, ఐటీ పరిజ్ఞానం కోసం రూ.50 కోట్లు, స్మార్ట్‌ మీటర్ల కోసం రూ.40 కోట్లు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సమ్మతించింది.

State Govt 450 Cr loan teeskuntunnadi. Mari, Central Govt chesedi yemi lenattundi...hadavidi thappa

Link to comment
Share on other sites

  • 3 weeks later...

తిరుపతిలో భూగర్భ కేబుల్‌

రూ.350 కోట్లతో ప్రతిపాదనలు

మార్చికి పనులు ప్రారంభం

ఈనాడు - తిరుపతి

స్మార్ట్‌సిటీ నగర జాబితాలో చోటు సంపాదించుకున్న తిరుపతిని రానున్న రోజుల్లో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అనుగుణంగా ఏపీ ఎస్పీడీసీఎల్‌ అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రపంచబ్యాంకు నిధుల ద్వారా రూ.350 కోట్లతో భూగర్భ కేబుల్‌ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అధికారులు నివేదికను సిద్ధ్దం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో టెండరు ప్రక్రియ పూర్తి చేసి మార్చి నాటికి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ 27.44 చదరపు కి.మీల మేరకు విస్తరించి ఉంది. నగరం మొత్తం 251.33 కి.మీల మేరకు రహదారి నెట్‌వర్క్‌తో విస్తరించింది. అయితే రహదారి పొడవునా ఎక్కడ చూసినా వేలాడే విద్యుత్తు, కేబుల్‌ వైర్లే దర్శనమిస్తున్నాయి. రోజుకు సుమారు లక్ష మంది వరకు తిరుపతికి వెలుపల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. దేశవిదేశాల నుంచి ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని తలచిన ఏపీఎస్పీడీసీఎల్‌ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వేలాడే కేబుళ్లకు చెక్‌ పెడుతూ భూగర్భ కేబుల్‌కు సిద్ధమైంది. వాస్తవానికి ఎప్పటి నుంచో దీనిపై ప్రతిపాదనలు ఉన్నా..కదలిక లేకుండా పోయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తిరుపతిని ఆకర్షణీయమైన నగర జాబితాలో చేర్చింది. దీంతో నగరం అందంగా ఉండాలంటే కేవలం రహదారులను అభివృద్ధి చేయడమే కాకుండా ఎక్కడా రహదారి పక్కన వైర్లు లేకుండా చూడాల్సి ఉంటుంది. అప్పుడే నగరం చూడటానికి అందంగా కనిపిస్తుందని... ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా భూగర్భ కేబులింగ్‌కు ఎస్పీడీసీఎల్‌ సీఎండీ దొర ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. సుమారు రూ.350 కోట్ల వ్యయంతో ప్రపంచ బ్యాంకు సహకారంతో పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో టెండరు ప్రక్రియను పూర్తి చేసి మార్చి నాటికి పనులు ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించారు. అయితే కార్పొరేషన్‌ నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు అనువుగా భూగర్భ కేబుళ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటీవల తిరుపతిలో కొత్త పరిజ్ఞానం ద్వారా భూగర్భంలో కేబులింగ్‌కు అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. అయితే ఇందుకు భారీగా నిధులు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణంగా చేపట్టే విధంగానే రహదారులపై తవ్వకాలు జరిపి కేబుళ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కార్పొరేషన్‌కు ఎక్కడా ఇబ్బంది లేకుండా వారు ఎక్కడెక్కడైతే రహదారుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారో ఆయా ప్రాంతాల్లో అధికారులతో సమన్వయం ఏర్పర్చుకొని ముందుకు వెళ్లనున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో భూగర్భ కేబుళ్ల ఏర్పాటు ద్వారా నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఎస్పీడీసీఎల్‌ సిద్ధమవుతోంది.

Link to comment
Share on other sites

  • 1 month later...
తిరుపతికి కేంద్రం మరో వరం
 
636160054091583070.jpg
  • ‘ప్రసాద్‌’ పథకానికి ఎంపిక చేసిన కేంద్రం
  • యాత్రికులకు మెరుగు పడనున్న వసతులు
  • స్మార్ట్‌సిటీతో అనుసంధానం
తిరుపతి నగరం: తిరుపతికి వరసపెట్టి మరీ కేంద్ర పథకాలు వచ్చిచేరుతున్నాయి. స్మార్ట్‌సిటీ, అమృత్‌, స్వచ్ఛభారత్‌, స్వచ్ఛసర్వేక్షణ్‌తోపాటు తాజాగా మరో పథకానికీ తిరుపతి ఎంపికైంది. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ పిలిగ్రిమేజ్‌ రెజువినేషన్‌ అండ్‌ స్పిర్చువల్‌ అజ్‌మెంటేషన్‌ డ్రైవ్‌ (ప్రసాద్‌) పథకం తాజాగా తిరుపతిని వరించింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ పథకానికి ఎంపిక కావడంతో మరిన్ని అభివృద్ధి పనులు జరిగే వెసులుబాటు లభించనుంది. హృదయ్‌ పథకం కింద ఎంపిక చేసేందుకు తొలుత ప్రతిపాదనలు పంపారు. దానికంటే ‘ప్రసాద్‌’ పథకమే మెరుగైందన్న భావనతో కేంద్రం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. హృదయ్‌లో ఆధ్యాత్మిక నగరంలో పురాతన కట్టడాలకే పరిమితంగా ఉద్దేశించింది. కాగా, ప్రసాద్‌ పథకం కింద యాత్రికులు రైల్వేస్టేషన్‌ లేదా బస్టాండు లేదా విమానాశ్రయం నుంచి వెలుపలకు రావడం మొదలు.. తిరుగు ప్రయాణమయ్యే దాకా వారి అవసరాలకు తగ్గట్టు ఏ పనికైనా నిధులు అందే వెసులుబాటు కల్పించింది.
 
సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా, చారిత్రక కట్టడాలు, వాటి సంరక్షణ, సౌండ్‌ అడ్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు, ఈ-రిక్షాలు, బ్యాటరీ ఆపరేటెడ్‌ వెహికల్స్‌ కొనుగోలు, ప్యాసెంజర్స్‌ టెర్మినల్స్‌ నిర్మాణం, స్ట్రీట్‌ లైటింగ్‌, ఆహ్లాదకర వాతావరణం కిందకు తేవడం వంటి పనులను ఈ పథకం కింద చేపట్టవచ్చు. రెండేళ్ల కిందట కేంద్రం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చి.. రూ.200 కోట్లు కేటాయించింది. పరిమిత సంఖ్యలో నగరాలను ఎంపిక చేసింది. తాజాగా తిరుపతిని చేర్చింది.
 
 
స్మార్ట్‌సిటీతో అనుసంధానం
‘ప్రసాద్‌’ పథకాన్ని స్మార్ట్‌సిటీతో అనుసంధానం చేస్తారు. నిధుల సద్వినియోగంపై జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కన్సల్టెన్సీని కేంద్రమే నియమించనుంది. దీని సహాయంతో నగరపాలక సంస్థ అధికారులు చర్చించి, సమగ్ర నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది.
 
 
స్మార్ట్‌సిటీలో పురోగతి
స్మార్ట్‌సిటీలో తిరుపతి పురోగతి సాధించింది. తిరుపతి కార్పొరేషన్‌ లిమిటెడ్‌గా సోమవారం కేంద్రంలో రిజిస్టర్‌ అయింది. దీంతో వారంలోపు ఎస్‌పీవీ తొలిసమావేశం జరిగే అవకాశాలున్నాయి. ఈ సమావే శంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే పనులను చేపడతారు. జనవరి తొలి వారంలో స్మార్ట్‌సిటీ పనులను లాంఛనంగా ప్రారంభిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ వినయ్‌చంద్‌ పునరుద్ఘాటించారు.
 
 
నగరమంతటా తెలుగుగంగ
త్వరలో నగరమంతటా తెలుగుగంగ సరఫరా కానుంది. అమృత్‌ పథకం కింద రూ.94 కోట్లతో టెండర్ల ప్రక్రియను యంత్రాంగం పూర్తి చేయడంతో ఇక నీటి కష్టాలు తీరనున్నాయి. ప్రత్యేకించి కొత్తగా నగరంలో విలీనమైన ముత్యాలరెడ్డిపల్లె, తిమ్మినాయుడుపాళెం, రాజీవనగర్‌లకు త్వరలోనే అమృత్‌ కింద పైపులైన్‌ నిర్మాణ పనులు జరగనున్నాయి. నగరంలో ప్రస్తుతం తెలుగుగంగతో పాటు కల్యాణిడ్యామ్‌ నీరు సరఫరా అవుతున్న విషయం తెలిసిందే. కల్యాణిడ్యామ్‌ నీటిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...