Jump to content

Huge Coal Mines found in Chintalapudi, Nuziveedu


sonykongara

Recommended Posts

  • 4 months later...
చింతలపూడి.. భారీ బొగ్గు క్షేత్రం!
 
636205594364630703.jpg
  • 3వేల మిలియన్‌ టన్నుల నిల్వలు
  • సర్వేలో ప్రాథమిక నిర్ధారణ.. తిరుగులేని నాణ్యత
  • సమీపంలో విద్యుత కేంద్రం ఏర్పాటుకు చర్యలు
 
ఏలూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రాంతం... నాణ్యతతో కూడిన అపార బొగ్గు క్షేత్రం! దాదాపు మూడు వేల మిలియన్‌ టన్నుల నిల్వలకు కేంద్రంగా ఉంది! మూడేళ్లుగా చేసిన సర్వేలో ఈ విషయం బయటపడింది. రాష్ట్ర విభజన కంటే ముందే ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని భావించి ప్రాథమిక సర్వేకు దిగారు. 2013లో తొలి సర్వేలో భూమి అంతర పొరల్లో 715 మీటర్ల దిగువున బొగ్గు ఉన్నట్టు తేల్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక... ఏయే ప్రాంతాల్లో, ఎంత విస్తీర్ణంలో, ఎంత మోతాదులో ఇవి ఉన్నాయో నిర్ధారణ కోసం రెండు ప్రైవేటు కంపెనీలకు మరోసారి సర్వే బాధ్యత అప్పగించారు. ఈ క్రమంలో... 600 మీటర్ల లోతున బొగ్గు నిక్షిప్తమై ఉందని, చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామాల్లో నిక్షేపాలు ఉన్నాయని తాజాగా మరోసారి నిర్ధారించారు. ఒక్క రాఘవాపురం గ్రామ పరిధిలోనే 30 కిలోమీటర్ల వైశాల్యంలో బొగ్గు నిక్షేపాలు కేంద్రీకృతమయ్యాయని, అన్నిటికంటే మించి ఈ ప్రాంతంలోనే అద్భుతాలు కనపడుతున్నాయని సర్వే బృందాలు చెబుతున్నాయి. సర్వే వృథా కాలేదని, అద్భుత ఫలితాలు వస్తున్నాయని కేంద్ర, రాషా్ట్రలకు నివేదించాయి. సింగరేణి తరహాలోనే నాణ్యమైన బొగ్గుకు చింతలపూడి కేంద్రం కాబోతుందని, రాష్ట్ర అవసరాలు తీర్చడంతోపాటు విక్రయాల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చిపెడుతుందని ఈ వర్గాలు అంటున్నాయి.
 
ఎలా తేలిందంటే..?
చింతలపూడి మండలం శెట్టివారిగూడెం, నామవరం, రాఘవాపురం, చింతలపూడి పరిధిలో వరుసగా మూడు దశల్లో రిగ్గులు వేసి అంతర పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాలపై ఒక అంచనాకు వచ్చారు. మొదటి దశలో 51 మీటర్లు, రెండోదశలో 70 మీటర్లు, మూడో దశలో 250 మీటర్లు చొప్పున రిగ్గులను పంపి అంతర్గతంగా ఉన్న బొగ్గు, సున్నం ఇతరత్రాలను గుర్తించారు. నిర్దేశించిన ప్రకారం ఇంకో ఐదు నెలల్లో సర్వే ప్రాథమిక దశ పూర్తికావాలి. అయితే, అంతకుముందే వేగంగా సర్వే కొనసాగుతుండడం, అది కూడా తక్కువ సంఖ్య రిగ్గులతో కూడిన ఫలితాలు ఆశాజనకంగా రావడం విశేషం. దీని ప్రకారం ఇప్పటికే నాణ్యమైన బొగ్గు ఈ ప్రాంతంలో ఉన్నట్టు తేల్చారు. సౌత్‌ వెస్ట్‌ పినాకిల్‌, మహేశ్వరి కంపెనీలు ఈ సర్వే చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు శాసీ్త్రయ పద్ధతిలో అత్యాధునిక యంత్రాలతో ప్రతీ వంద మీటర్లకు శాంపిల్స్‌ను తీసుకున్నాయి. వీటి ప్రకారం బొగ్గు నాణ్యతను గుర్తించాయి. మొదటి 50 మీటర్ల కంటే పైబడి రిగ్‌ చేస్తేనే నాణ్యత బయటపడింది. సరాసరిన 600 మీటర్ల మేర రిగ్గును పంపినప్పుడు అపార నిక్షేపాలు, అత్యంత విశిష్ఠమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు నిర్ధారించాయి. తాజా అంచనాల ప్రకారం మూడు వేల మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు తగ్గకుండా నిల్వలు ఉన్నట్లు గుర్తించాయి.
 
భారీ ధర్మల్‌ కేంద్రం
ఎలాగూ బొగ్గు నిక్షేపాలు అపారంగా ఉన్నట్టు తేలడంతో దీనికి తగ్గట్టుగానే నాగిరెడ్డిగూడెం సమీపంలో భారీ ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు వీలుగా భూమిని అన్వేషిస్తున్నారు. తమ్మిలేరు రిజర్వాయరు చేరువగా ఉండడం, మరోవైపు చింతలపూడి ఎత్తిపోతల నుంచి గోదావరి జలాలు ఈ ప్రాంతంలో మీదగానే వెళ్లాల్సి ఉండడంతో అన్ని విధాలా నీటి సౌకర్యం అందుబాటు వల్ల ఈ ప్రాంతం ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అనువైనదిగా తేల్చారు. ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ఏడాది పొడవునా సాధ్యమని అంచనా వేస్తున్నారు. ఐదారు నెలల్లో ఈ కేంద్రం ఏర్పాటుకు వీలుగా భూమి సర్వే జరగనుంది.

ఆరు నెలల్లో సర్వే పూర్తి
2boggu3.jpgచింతలపూడి ప్రాం తంలో జరిపే బొగ్గు నిల్వల సర్వేలో తమ సంస్థ సుమారు 120 రిగ్గులతో పనిచేయనుంది. ప్రస్తుతం పది రిగ్గులతో పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మిగిలిన రిగ్గులు వస్తాయి. ఈ సర్వే మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. ఇంకా మిగిలిన చోట్ల ఎప్పుడు తవ్వకాలు చేపట్టాలో ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది.

- ఆర్‌.సుదర్శన్‌, సౌత్‌ వెస్ట్‌ పినాకిల్‌ సంస్థ ప్రతినిధి
 
 
 
 
 
 
2boggu1.jpg 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...