Jump to content

AIIMS


sonykongara

Recommended Posts

  • Replies 203
  • Created
  • Last Reply

10 Thousand new people to Capital of AP with AIMS. Great. Activities baaga peruguthaayi.

 

It is very useful for West Godavari,Krishna, Guntur, Prakasam & Nellore people mainly. ilaantide oka pedda state/centre level hospital in UA & Rayalaseema vasthe baagutundi.

Link to comment
Share on other sites

10 Thousand new people to Capital of AP with AIMS. Great. Activities baaga peruguthaayi.

 

It is very useful for West Godavari,Krishna, Guntur, Prakasam & Nellore people mainly. ilaantide oka pedda state/centre level hospital in UA & Rayalaseema vasthe baagutundi.

vims undi ga bro

Link to comment
Share on other sites

ఎయిమ్స్‌ నిర్మాణ పనులు ముమ్మరం
21-09-2016 06:17:14
636100354351203088.jpg
  • నెలాఖరులోగా ఏజన్సీ ఖరారు 
  • 2020 నాటికి వందశాతం పనుల పూర్తి చేయాలని లక్ష్యం
గుంటూరు : ఎయిమ్స్‌.. ఈ పేరు వినగానే అత్యాధునిక వైద్యసేవలు గురుకొస్తాయి. విభజన వరాల్లో ఒకటిగా మంగళగిరి ప్రాంతంలో ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు పనులను ఇప్పటికే ప్రభుత్వం ముమ్మరం చేసింది. 2020 సంవత్సరంలోగా నూరుశాతం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రూ.1618 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మంగళగిరి: మంగళగిరి ప్రాంతంలో నిర్మించతలపెట్టిన ఎయిమ్స్‌ ప్రాజెక్టు పనులకు అవసరమైన గ్రౌండింగ్‌ వర్క్‌ను కేంద్రం ముమ్మరం చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లు, మాస్టర్‌ప్ల్లాన్ల రూపకల్పనకు ఇప్పటికే దృష్టి సారించారు. ఆసుపత్రి భవన ఆకృతుల కోసం చేపట్టిన బిడ్డింగ్‌ ప్రక్రియ ఈనెల తొమ్మిదవ తేదీతో పూర్తయింది. నెలాఖరులోగా సంబంధిత కన్సల్టెంట్‌ ఏజెన్సీని ఖరారు చేస్తారు. అన్ని డిజైన్లకు సంబంధించిన సంతృప్తికర నివేదికలు సిద్ధమయ్యేందుకు సుమారు ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. కాన్సెప్ట్‌ డిజైన్‌లు, మాస్టర్‌ప్లాను వచ్చే రెండు మాసాల్లో, డీటైల్డ్‌ డిజైన్లు, డ్రాయింగ్స్‌ ఆరు మాసాల్లో, వర్కింగ్‌ డ్రాయింగ్స్‌ ఏడాదిలోగా పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణ పనులను చేపట్టి 2020లోగా నూరుశాతం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మంగళగిరిలో నిర్మించనున్న ఎయిమ్స్‌ కోసం మొత్తం రూ.1,618 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ.1,090 కోట్లు నిర్మాణ పనులకు, రూ.528 కోట్లు ఆసుపత్రి నిర్వహణ సామాగ్రి కోసం ఖర్చు చేస్తారు.
ఎయిమ్స్‌ కోసం మంగళగిరి వద్ద 193 ఎకరాలు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నిర్మాణ పనులకు పర్యవేక్షణ ఏజెన్సీగా నోయిడాకు చెందిన హెచ్‌ఎస్‌సీసీ(ఇండియా) లిమిటెడ్‌ను కేంద్రం నియమించింది. ఈ సంస్థ పర్యవేక్షణలో ఇప్పటికే ఎయిమ్స్‌ ప్రతిపాదిత స్థలం చుట్టూ సుమారు రూ.8.5 కోట్ల వ్యయంతో ప్రహరీ నిర్మాణ పనులను చేపట్టి 70శాతం పూర్తిచేశారు. నాణ్యమైన వైద్యవిద్య, వైద్యరంగంలో అధునాతన పరిశోధనలు, సంపూర్ణ ఆరోగ్య రక్షణ ప్రధాన ధ్యేయాలుగా ఎయిమ్స్‌ ఆవిష్కృతమవుతోంది. 
ఎయిమ్స్‌లో ఏమేం వుంటాయంటే..
960 పడకలతో కూడిన సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, ఏటా వందసీట్లతో కూడిన వైద్య కళాశాల, ఏటా 60 సీట్లతో కూడిన నర్సింగ్‌ కళాశాల, కార్యనిర్వాహక బ్లాకు, ఆయూష్‌ బ్లాకు, ఆడిటోరియం, నైట్‌ షెల్టర్‌, హాస్టళ్లు, నివాసిత భవన సముదాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత అధునాతన పద్ధతుల్లో నిర్మించనున్నారు. ఆసుపత్రిలోని 960 పడకలను మూడు ప్రధాన విభాగాలుగా విభజిస్తారు. స్పెషాలిటీ విభాగాలకు 500 పడకలు, సూపర్‌ స్పెషాలిటీ విభాగాలకు 300 పడకలు, ఇతర విభాగాలకు కలిపి 160 పడకల వంతున కేటాయించారు.
ఎయిమ్స్‌ ప్రాంగణం విభజన ఇలా.. 
193 ఎకరాల విస్తీర్ణం కల ఎయిమ్స్‌ ప్రాంగణాన్ని నైసర్గికంగా సర్వేచేసి స్థల విభజన చేశారు. ఆసుపత్రి దాని ఆధారిత అనుబంధ సేవా విభాగాలకు కలిపి లక్షా 31వేల చదరపు మీటర్లు, సంస్థలు, బోధన విభాగాలకు కలిపి 41వేల చదరపు మీటర్లు, నివాసిత భవన సముదాయాలకు 53వేల చదరపు మీటర్లు వంతున కేటాయించారు. 
అద్భుతంగా 
ఆడిటోరియం.. 

750 నుంచి వెయ్యి సీట్ల సామర్ధ్యం కల ఆడిటోరియంను అత్యద్భుతంగా నిర్మిస్తారు. ఇందులో ప్రొజెక్షన్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌, మీటింగ్‌ రూమ్‌లు, సెమినార్‌ హాళ్లు, వంద, 150 సీట్ల సామర్ధ్యంతో కూడిన రెండు ప్రత్యేక కాన్ఫరెన్స్‌ హాళ్లు వుంటాయి. 132, 155, 312 మందికి వసతి సమాకూర్చే మూడు పీజీ హాస్టళ్లతో పాటు, 366 మందికి వసతిని కల్పించే విధంగా మరో నాలుగు హాస్టళ్లు, 436 మంది నర్సింగ్‌ విద్యార్థినుల సౌకర్యార్ధం మరో రెండు ప్రత్యేక హాస్టళ్లను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 18 సింగిల్‌ రూమ్‌లు, ఆరు సూట్‌లు, రెండు ప్రత్యేక సూట్‌లతో కూడిన అతిఽథి గృహాన్ని, 178 ఫ్లాట్‌లతో కూడిన నివాస భవన సముదాయాన్ని, డైరెక్టరు నివాస భవనం, మరో 177 బంగ్లాలను నిర్మించాలని ప్రతిపాదించారు. మొత్తం క్యాంపస్‌ అంతా జీరో డిశ్చార్డ్‌ క్యాంపస్‌గా అంటే వ్యర్ధజలాలను సైతం తిరిగి వినియోగించుకునేలా అబివృద్ధి చేస్తారు. 
వచ్చే ఏడాదినుంచే ఎయిమ్స్‌ సేవలు 
వచ్చే ఏడాదినుంచి మంగళగిరి ఎయిమ్స్‌ సేవలను ప్రాథమికంగా ప్రారంభించాలని కేంద్ర పభ్రుత్వం పట్టుదలగా వుంది. విజయవాడ సిద్ధార్ధ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి లేదా తెనాలి ప్రభుత్వాసుపత్రిలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 50 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్యవిద్యా బోధన చేయాలని భావిస్తుంది. ఈ మేరకు ఈనెల ఐదో తేదీన కేంద్రబృందం ఈరెండు ఆసుపత్రులను సందర్శించింది. తెనాలి ఆసుపత్రినే ఎంపిక చేసుకోవాలంటే అదనంగా అక్కడ అనాటమీ, ఫిజియాలజీ, మైక్రో బయాలజీ, పెథాలజీ, ఫొర్సెనిక్‌ మెడిసన్‌ విభాగాలను ప్రవేశపెట్టాలని కేంద్రబృందం సూచించింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
‘ఎయిమ్స్‌’ నిర్మాణంలో విదేశీ భాగస్వామ్యం
 
  • కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇదే తొలిసారి
గుంటూరు(మెడికల్‌), అక్టోబరు 3: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ‘ఎయిమ్స్‌’లో విదేశీ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పే ఈ సంస్థలో ఇన్‌ఫెక్షన్‌ను తట్టుకునే సామర్థ్యం గల వార్డులను నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రసిద్ధ కట్టడాలను నిర్మించిన విదేశీ నిర్మాణ సంస్థల సహకారం తీసుకోబోతున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో వైద్యశాల నిర్మాణాల్లో విదేశీ సంస్థలకు భాగస్వామ్యం ఇదే తొలిసారి.
Link to comment
Share on other sites

‘ఎయిమ్స్‌’ నిర్మాణంలో విదేశీ భాగస్వామ్యం
 
  • కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇదే తొలిసారి
గుంటూరు(మెడికల్‌), అక్టోబరు 3: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ‘ఎయిమ్స్‌’లో విదేశీ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పే ఈ సంస్థలో ఇన్‌ఫెక్షన్‌ను తట్టుకునే సామర్థ్యం గల వార్డులను నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రసిద్ధ కట్టడాలను నిర్మించిన విదేశీ నిర్మాణ సంస్థల సహకారం తీసుకోబోతున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో వైద్యశాల నిర్మాణాల్లో విదేశీ సంస్థలకు భాగస్వామ్యం ఇదే తొలిసారి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...