Jump to content

AIIMS

sonykongara

Recommended Posts

3 hours ago, AnnaGaru said:

ఇదీ సంగతి !! 

ap state bjp leads :buttkick:

http://www.andhrajyothy.com/artical?SID=569310

ఎయిమ్స్‌కు నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు
25-04-2018 03:41:14
 
636602244736852202.jpg
  • టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్‌24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రానికి ఎయిమ్స్‌ను మంజూరు చేసి, రూ.3500 కోట్ల నిధులు విడుదల చేసినందుకు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి మంగళవారం.. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన ఎయిమ్స్‌కు.. కొంత ఆలస్యమైనా నిధులు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భూమి కూడా సిద్ధంగా ఉందని నిర్మాణం వేగంగా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

enti idi nijame??????????

allocate chesara leka release chesara?

Link to comment
Share on other sites

  • Replies 203
  • Created
  • Last Reply

http://www.andhrajyothy.com/artical?SID=569779

మంగళగిరి ఎయిమ్స్‌పై మోదీ ఆరా
26-04-2018 04:47:07
 
636603148274199387.jpg
ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష
అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంద్రజ్యోతి): మంగళగిరిలో ఎయిమ్స్‌ పనుల ప్రగతిని ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయా రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 13 కేంద్ర ప్రభుత్వ పథకాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాలతో అనుసంధానంగా ఏపీలో అమలవుతున్న మూడు పథకాల ప్రగతిపై సమీక్షించారు. విజయనగరం-సంబల్‌పూర్‌ మధ్య 265 కిలోమీటర్ల రైల్వే మూడోలైన్‌ పనుల తీరుపై రైల్వేశాఖ సెక్రటరీ అశ్విని తాహిర్‌ను అడిగారు. మంగళగిరిలో ఎయిమ్స్‌ పనులు తీరును సీఎస్‌ దినేశ్‌కుమార్‌ ప్రధానికి వివరించారు. విశాఖ-విజయవాడ-సికింద్రాబాద్‌ పైప్‌లైన్‌ నిర్మాణ పనుల్లో ఏపీ అందిస్తున్న సహకారం మరువలేనిదని పెట్రోలియం, మంత్రిత్వ శాఖ కార్యదర్శి కేడీ తిరుపతి కొనియాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మౌలిక సదుపాయలశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

3 hours ago, AnnaGaru said:

inkaa release chesinattu leru.. 

"The Centre will release funds from the Pradhan Mantri Swasthya Suraksha Yojana (PMSSY) which has a budget allocation of Rs 3,825 crore for 2018-19."

http://www.newindianexpress.com/states/telangana/2018/apr/21/telangana-aiims-a-step-closer-to-reality-1804412.html

That makes sensse. pushpalu asale adedeo chupinchi inkede nakinche rakalu. antha dabbu okkasariga asalu enduku istaru.

Link to comment
Share on other sites

మంగళగిరి ఎయిమ్స్‌పై మోదీ ఆరా
26-04-2018 04:47:07
 
636603148274199387.jpg
ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష
అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంద్రజ్యోతి): మంగళగిరిలో ఎయిమ్స్‌ పనుల ప్రగతిని ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయా రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 13 కేంద్ర ప్రభుత్వ పథకాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాలతో అనుసంధానంగా ఏపీలో అమలవుతున్న మూడు పథకాల ప్రగతిపై సమీక్షించారు. విజయనగరం-సంబల్‌పూర్‌ మధ్య 265 కిలోమీటర్ల రైల్వే మూడోలైన్‌ పనుల తీరుపై రైల్వేశాఖ సెక్రటరీ అశ్విని తాహిర్‌ను అడిగారు. మంగళగిరిలో ఎయిమ్స్‌ పనులు తీరును సీఎస్‌ దినేశ్‌కుమార్‌ ప్రధానికి వివరించారు. విశాఖ-విజయవాడ-సికింద్రాబాద్‌ పైప్‌లైన్‌ నిర్మాణ పనుల్లో ఏపీ అందిస్తున్న సహకారం మరువలేనిదని పెట్రోలియం, మంత్రిత్వ శాఖ కార్యదర్శి కేడీ తిరుపతి కొనియాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మౌలిక సదుపాయలశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
మార్చి నాటికి ఎయిమ్స్‌ సిద్ధం
11-05-2018 06:57:02
 
636616186217609992.jpg
మంగళగిరి: వచ్చే ఏడాది మార్చి నాటికి ఎయిమ్స్‌ ఆసుపత్రి సేవలు రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం వుందని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ చెప్పారు. మంగళగిరిలో నిర్మితమవుతున్న ఎయిమ్స్‌ పనుల పురోగతిపై గురువారం ఆయన క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున కల్పించాల్సిన అల్ని మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రూ.పది కోట్లతో వందడుగుల రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు భవనాలశాఖ అధికారులను ఆదేశించామన్నారు.
 
  ప్రత్యేక విద్యుత్‌ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వుందన్నా రు. ఎయిమ్స్‌లో నిర్మాణ పనులు ఊపందుకోవడంతో ఇక్కడ వున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తప్పనిసరిగా ఖాళీ చేయించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. శానిటోరియం తాలూకు పాత భవనాల్లో వుంటున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సి బ్బందిని మంగళగిరి మార్కెట్‌యార్డు ప్రాంగణంలోకి తరలిస్తామన్నారు. వచ్చే డిసెంబరు నాటికి ప్రధానమైన అవుట్‌ పేషెంట్‌ డిపార్టుమెంట్‌ బ్లాకు (ఓపీడీ బ్లాకు) పూ ర్తయ్యే అవ కా శం వుందన్నా రు. ఎయిమ్స్‌ ప్రాంగణంలో ఇప్పటివరకు 25 శాతం మేర పనులు పూర్తయినట్టేనని ఎ యిమ్స్‌ ఉప సం చాలకులు సందీప్‌సింగ్‌ చెప్పారు.
 
   ఎయిమ్స్‌ భవనాలను రెం డు దశలుగా నిర్మిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో ఎయిమ్స్‌కు చెందిన అధికారులతో పాటు కాంట్రాక్టు నిర్మాణ సంస్థలైన కేఎంవీ ప్రాజెక్ట్ట్సు, ఎల్‌అండ్‌టీ సంస్థల ప్రతినిధులు, ట్రాన్స్‌కో సీఈ రాజబాపయ్య, ఎస్‌ఈ జయభారత్‌రావు, ఏడీఈ భాస్కరరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మాధవీ సుకన్య, జిల్లా అటవీశాఖాధికారి మోహనరావు, గుంటూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు, మంగళగిరి, తాడేపల్లి తహసీల్దార్లు వసంత్‌బాబు, పద్మనాభాచార్యులు, మంగళగిరి మునిసిపల్‌ ఇన్‌చార్జి కమిషనరు బి.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఎయిమ్స్‌ పనుల పురోగతిపై సమీక్ష
11-05-2018 05:40:17
 
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో నిర్మితమవుతున్న ఎయిమ్స్‌ నిర్మాణ పనులను గురువారం కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పరిశీలించారు. పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

ఎయిమ్స్‌ నిర్మాణంలో అలసత్వం!
15-05-2018 00:39:44
 
  • కేవలం 25శాతం పనులే పూర్తి
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్‌ నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈమధ్య కాలంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారులతో విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా మే రెండోవారం నాటికి 30శాతం పనులు పూర్తి కావాలని నిర్దేశించుకుంటే, ప్రస్తుతం 25శాతం మాత్రమే పూర్తి అయ్యాయి. వీటిపై కేంద్ర కార్యదర్శి ఆరా తీయగా సీఆర్‌డీఏ నుంచి భవన అనుమతులు అలస్యం అయ్యాయని, హెచ్‌ఎ్‌ససీసీ నియమించుకున్న డిజైన్‌ కన్సల్టెం ట్‌ కూడా సమయానికి డిజైన్లు అందించలేదని గుర్తించారు. దీనిపై ప్రీతీ సుడాన్‌ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేశారు.
 
కాగా, వారం క్రితం భవన నిర్మాణాలకు సీఆర్‌డీఏ అనుమతులు ఇచ్చింది. దీంతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ అక్కడి భవనాలను ఖాళీ చేయడానికి ఇంకా కొంత సమయం కావాలని కోరుతోంది. మరికొన్ని పనులు కూడా ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈ పరిణామాలపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం మంగళగిరిలో ఈ ఏడాది చివరికి మొదట విడతలో ఓపీడీ బ్లాక్‌ను నిర్మించాలని నిర్ణయించారు. 2019 జనవరి నుంచి వైద్యసేవలతో పాటు అక్కడినుంచే తరగతలు నిర్వహించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. కానీ ఈ ఏడాది చివరికి పనులు పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. ఎయిమ్స్‌ నిర్మాణ పనులెలా ఉన్నా ఈ ఏడాది ఆగస్టు నుంచే సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ వేదికగా తరగతులు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధం అయింది.
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

intaki AIIMS ki icchindhi 172 acres or 250+ acres... ekkado 250+ acres chadivattu gurthu

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...
ఆరు మాసాల్లో అందుబాటులోకి ఎయిమ్స్‌
13-07-2018 07:27:49
 
636670636683566638.jpg
  • రెండు ప్యాకేజీలుగా నిర్మాణ పనులు
  • వేగం పెంచిన కాంట్రాక్టు సంస్థలు
  • కేంద్రం ఆదేశాల మేరకే హడావిడి
  • నేడు కేంద్ర మంత్రి నడ్డా క్షేత్రస్థాయి పరిశీలన
కేంద్రం తాము చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి పెట్టింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించగా.. కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డా మంగళగిరిలో నిర్మితమవుతున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆసుపత్రిని శుక్రవారం సందర్శించనున్నారు. వచ్చే డిసెంబరు నాటికి ఎయిమ్స్‌ ఆసుపత్రి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
మంగళగిరి: తాము చేపట్టిన ప్రాజెక్టులను ప్రారంభించడమో లేక వాటిని ఓ కొలిక్కి తీసుకురావడమో చేయాలని ఎన్డీయే పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు తమ మంతిత్వ్ర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టుల యాత్ర చేపట్టారు. కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డా మంగళగిరిలో నిర్మితమవుతున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆసుపత్రిని శుక్రవారం సందర్శిస్తున్నారు. మంత్రి రాకను పురస్కరించుకుని ఎయిమ్స్‌ ప్రాంగణంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే డిసెంబరు నాటికి ఆసుపత్రి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం చాల పట్టుదలగా వుంది. ఈ మేరకు మంత్రి నడ్డా సంబంధిత అధికారులు, నిర్మాణ కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశనం చేయనున్నట్టు తెలిసింది.
 
మొదటి ప్యాకేజీ
మంగళగిరిలో రూ.1618 కోట్ల వ్యయంతో ఎయిమ్స్‌ ఆసుపత్రిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం నిర్మాణ పనులను చేపట్టేందుకు ఏడాదిన్నరకు పైగా పట్టింది. కేటాయించిన బడ్జెట్‌లో సుమారు రూ.వెయ్యి కోట్లను నిర్మాణ పనులకు, మిగిలిన రూ.694 కోట్లు వైద్య పరికరాలు, ఇంటీరియల్‌ సామాగ్రి నిమిత్తం ఖర్చు చేసేవిధంగా ప్రణాళికను రూపొందించారు. పనుల సౌలభ్యం కోసం నిర్మాణ పనులను రెండు ప్యాకేజీలుగా చేపట్టారు. తొలి ప్యాకేజి కింద ఇప్పటివరకు సుమారు 32శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను మరో ఎనిమిది మాసాల్లోగా పూర్తి చేయాల్సి వుండగా వచ్చే డిసెంబరు నాటికల్లా పూర్తి చేసి తీరాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కేంద్రం ఆదేశాల మేరకు తొలి ప్యాకేజీ నిర్మాణ కాంట్రాక్టు సంస్థ ప్రధానమైన ఓపీడీ బ్లాక్‌ (జీ+5)ను శరవేగంతో నిర్మిస్తోంది. మొత్తం 1500 మంది పనివారలతో తొలి ప్యాకేజీ పనులను మూడు షిఫ్టులుగా కేఎంవీ సంస్థ జరిపిస్తుంది. వచ్చే డిసెంబరు నాటికి తమకు అప్పగించిన పనులన్నింటి నీ పూర్తి చేయగలమన్న ధీమాను కేఎంవీ సంస్థ వ్యక్తం చేస్తోంది.
 
రెండో ప్యాకేజీ
రెండో ప్యాకేజీ కింద హాస్పిటాలిటీకి చెందిన భవన సముదాయాలన్నింటిని నిర్మించాల్సివుంది. ఈ ప్యాకేజీకిగాను కేంద్రం రూ.560 కోట్లకు టెండర్లను పిలువగా ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.41 కోట్ల గరిష్టానికి టెండరును వేసి మొత్తం రూ.601 కోట్ల కాంట్రాక్టు ఒప్పందంపై పనులను చేజిక్కించుకుంది. ఈ పనులు రెండు మాసాల కిందటే ప్రారంభమయ్యాయి. 18 మాసాల వ్యవధి వుండగా అన్నీ ముఖ్యమైన భవన సముదాయాలను ఈ ఏడాది డిసెంబరుకల్లా పూర్తి చేయాలని మౌఖిక ఆదేశాలు వున్నట్టు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఎల్‌అండ్‌టీ సంస్థ జెట్‌ స్పీడుతో పనులను చేపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన భవన సముదాయాలను కాంక్రీట్‌ పునాదుల దశకు చేర్చింది. వాస్తవానికి ఢిల్లీలో భవనాల డిజైన్లను పదేపదే మారుస్తూ వున్న కారణంగానే నిర్మాణ పనుల్లో కొంత ఆలస్యం జరుగుతోంది.
 
నేడు సమీక్ష..
ఎయిమ్స్‌ ప్రాంగణంలో విద్యుత్‌ సరఫరా నిమిత్తం రూ.32 కోట్ల వ్యయంతో రెండున్నర ఎకరాల్లో ప్రత్యేక 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మించాల్సివుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్‌శాఖ టెండర్లను ఫైనలైజ్‌ చేసింది. తూర్పువైపున ఆర్‌అండ్‌బీ శాఖ కూడ ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున రూ.పదికోట్ల వ్యయంతో ఆరు మాసాల కిందట పనులను ఆరంభించి.. రెండు మాసాల కిందట అర్ధంతరంగా నిలిపేసింది. క్షేత్రస్థాయిలో ఈ పనుల పురోగతిని కేంద్రమంత్రి జేపీ నడ్డా శుక్రవారం సందర్శించి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలకు మంత్రి విచ్చేస్తారని బీజేపీ నియోజకవర్గ కన్వీనరు మునగపాటి వెంకటేశ్వరరావు తెలిపారు.
 
విస్తృత ఏర్పాట్లు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం మంగళగిరిలో నిర్మాణం జరుగుతున్న ఎయిమ్స్‌ ఆసుపత్రి సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ఎయిమ్స్‌ ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎయిమ్స్‌ ప్రాంగణం మొత్తం చిత్తడిగా తయారైంది. బీజేపీ నేతలు గురువారం మధ్యాహ్నం ఎయిమ్స్‌ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిత్తడిగా వున్నచోట రబ్బీష్‌ తోలించి రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జాతీయ చేనేత బోర్డు సభ్యుడు జగ్గారపు శ్రీనివాసరావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గారపు రామమోహనరావు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పంచుమర్తి ప్రసాద్‌ వున్నారు.
Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

is this Eenadu or AndhraJyothy? back ground lo LEPL building vacchela photo teesi, mottham AIIMS building ani coloring istunnaru. 

Link to comment
Share on other sites

ఎయిమ్స్‌’లో జనవరి నుంచి ఓపీ సేవలు 
ఆగస్టు నుంచి సిద్ధార్థ  వైద్య కళాశాలలో తరగతులు 
అధ్యాపకుల నియామక ప్రక్రియా మొదలైంది 
మంగళగిరిలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడి 
ఈనాడు, అమరావతి, ఈనాడు - గుంటూరు 
13ap-main4a.jpg

మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో వైద్య సేవలను వచ్చే జనవరి నుంచి ప్రారంభిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌ నెల నుంచి ఓపీ సేవలను ప్రారంభించాలని అనుకున్నా....జనవరి నుంచే ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవన నిర్మాణాల పనులు చురుగ్గా జరుగుతున్నందున ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఎయిమ్స్‌ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, ఇతర అధికారులతో శుక్రవారం సమీక్ష జరిపిన అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు.

‘‘నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలోనూ రూ.1,618 కోట్లతో ఎయిమ్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇక్కడ పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయి. ఓపీ సేవలను రానున్న జనవరి నుంచి ప్రారంభించబోతున్నాం. ఇందుకు అనుగుణంగా భవన సముదాయం తయారుకాబోతుంది. 2018-19 విద్యా సంవత్సరంలో 50 మంది విద్యార్థులు ఎయిమ్స్‌ తరఫున చదవబోతున్నారు. ఆగస్టు నుంచి సిద్ధార్థ వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. 2019-20 విద్యా సంవత్సరంలో తరగతులను మంగళగిరి ఎయిమ్స్‌లోనే ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు తగినట్లు అధ్యాపకుల నియామకాల ప్రక్రియ మొదలైంది. నిర్ణీత కాల వ్యవధిలోనే ఈ నిర్మాణాల పనులను పూర్తిచేస్తాం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కేంద్రం కట్టుబడి ఉంది’’అని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎయిమ్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం విలువైన 185 ఎకరాల భూమిని అందించినట్లు మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. విలేకర్ల సమావేశం అనంతరం కేంద్ర మంత్రి నడ్డా, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, తదితరులు నిర్మాణాల్లో ఉన్న భవనాలను పరిశీలించారు.

రాష్ట్రానికి 19 డయాలసిస్‌ కేంద్రాలు 
ఉద్దానంతో పాటు రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులున్న ప్రాంతాల్లో అందుకు కారణాలేమిటో కేంద్ర వైద్య బృందంతో అధ్యయనం చేయిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ప్రధానమంత్రి డయాలసిస్‌ పథకం కింద రాష్ట్రానికి 19 డయాలసిస్‌ కేంద్రాలను(యూనిట్లు) మంజూరు చేస్తున్నామన్నారు. దీని వల్ల మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు ఉచిత సేవలు అందుతాయని వివరించారు. త్వరలోనే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. శిశువులకు టీకాలు వేసే(ఇమ్యునైజేషన్‌) కార్యక్రమం దేశంలో బాగా జరుగుతోందని, ఈ ఏడాది ఆగస్టు నాటికి దీన్ని 90 శాతానికి తీసుకెళ్లాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి నడ్డా తెలిపారు. 2025 నాటికి క్షయ, కుష్ఠు వంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఎయిమ్స్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం కేంద్రమంత్రి నడ్డా గుంటూరు చేరుకుని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. ఆపై గుంటూరులో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ, గుంటూరు ఛాప్టర్‌) ఆధ్వర్యంలో జరిగిన వైద్యుల సదస్సులో ప్రసంగించారు. వైద్యరంగంలో మైలు రాళ్లుగా నిలిచే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఐఎంఏపై ఉందని మంత్రి నడ్డా గుర్తు చేశారు. వైద్యుల సమస్యలపై ఐఎంఏ అధ్యక్షుడు నాగ కిషోర్‌ వినతిపత్రం అందజేశారు.

కన్నా నివాసంలో రాజకీయ సమాలోచనలు.. 
కేంద్ర మంత్రి నడ్డాతో కన్నా నివాసంలో రాష్ట్రానికి చెందిన భాజపా అగ్రనేతలు పురంధేశ్వరి, కృష్ణంరాజు, మాజీ మంత్రులు మాణిక్యాలరావు తదితరులు సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. రాత్రి గుంటూరులో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో మంత్రి నడ్డా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయటానికి ఈ నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

Link to comment
Share on other sites

ఎయిమ్స్‌ తాత్కాలిక క్యాంపస్‌ రెడీ!
14-07-2018 07:37:51
 
636671506712652874.jpg
  • సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో 8 డిపార్ట్‌మెంట్లు ఏర్పాటు
  • ఆగస్టు ఒకటి నుంచి మొదటి బ్యాచ్‌ తరగతులు ప్రారంభం
  • క్యాంపస్‌ను పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సునీల్‌శర్మ
విజయవాడ: మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో దానికి అనుబంధంగా ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక వసతిని సిద్ధం చేసింది. మంగళగిరిలో ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు రెండేళ్లు పడుతుందని భావిస్తున్నారు. ఆ ఆసుపత్రి పూర్తయిన వెంటనే వైద్యసేవలను ప్రారంభించడానికి అవసరమైన వైద్యులను ముందుగానే రెడీ చేసుకోవాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
 
2018-2019 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎయిమ్స్‌ కౌన్సెలింగ్‌ జరుగుతున్న తరుణంలో ఆ సంస్థ మెడికల్‌ కాలేజీని ఈ ఏడాదే ప్రారంభించేందుకు వీలుగా విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో తాత్కాలిక క్యాంపస్‌ను సిద్ధం చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇక్కడ మొదటి బ్యాచ్‌ (ఎంబీబీఎస్‌) తరగతులను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 50 మంది వైద్య విద్యార్థులకు ఇక్కడ తరగతి నిర్వహించేందుకు అవసరమైన గదులను నిర్మించి వాటిలో అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నారు.
 
రూ.6 కోట్లతో నిర్మాణ పనులు
ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీ నిర్వహణకు తాత్కాలిక క్యాంపస్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించింది. రూ.2.38 కోట్లతో ఫ్యాకల్టీ, డిపార్ట్‌మెంట్‌ గదులతో కూడిన ఏడు బ్లాకులను నిర్మించారు. రూ.1.14 కోట్లతో ఏసీ లెక్చరర్‌ గ్యాలరీని, రూ.45 లక్షలతో ఫోరెన్సిక్‌ బిల్డింగ్‌ నిర్మాణాలను పూర్తి చేశారు. రూ.40 లక్షలతో లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీ డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్ల చాంబర్లకు రూ.20 లక్షలతో ఏసీలు ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్తు సరఫరా కోసం రూ.98 లక్షలతో ప్రత్యేకంగా హెచ్‌టీ పవర్‌ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రూ.45 లక్షలతో కొత్తగా నిర్మించిన గదులలో ఫర్నిచర్‌ ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తికాగా.. వాటిలో ఫర్నిచర్‌, ఏసీల ఏర్పాటు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
 
ఈ నెలాఖరు కల్లా ఈ పనులన్నీ పూర్తి చేసి.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మొదటి బ్యాచ్‌ తరగతులను ప్రారంభించనున్నారు. రెండో బ్యాచ్‌ తరగతులు కూడా ఇక్కడే జరుగుతాయని, ఈలోపు మంగళగిరిలో ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే.. ఆ తర్వాత సంవత్సరం నుంచి ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీని అక్కడే నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సునీల్‌శర్మ శుక్రవారం విజయవాడ వచ్చి.. సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో సిద్ధం చేసిన ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీ తాత్కాలిక క్యాంపస్‌ను పరిశీలించారు. వైద్య విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కల్పించిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

జనవరి నాటికి ఎయిమ్స్‌
14-07-2018 07:35:00
 
636671505001891730.jpg
  • ఎయిమ్స్‌ నిర్మాణం స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌..
  • అభివర్ణించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నడ్డా
  • క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన
మంగళగిరి: దేశం మొత్తంమీద వున్న ఎయిమ్స్‌ ఆసుపత్రులన్నింటి కన్నా మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్‌ అత్యుత్తమ అవుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డా అభివర్ణించారు. ఇది స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌గా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళగిరిలో నిర్మితమవుతున్న ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు పర్యవేక్షణ సంస్థ హెచ్‌ఎస్‌సీసీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మంగళగిరి ఎయిమ్స్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైౖనా సమస్యలున్నాయోమోనని తెలుసుకునేందుకే తానిక్కిడికి వచ్చినట్టు చెప్పారు. ఈ ఏడాది 50మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్‌ ప్రారంభమైందన్నారు.
 
మంగళగిరికి అత్యుత్తమమైన ఫ్యాకల్టీ రాబోతుందని చెప్పారు. అవుట్‌ పేషెంట్‌ డిపార్టుమెంట్‌ బ్లాకును వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. మంత్రి వెంట రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, మాజీమంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, ఎయిమ్స్‌ డిఫ్యూటీ డైరెక్టరు షందీప్‌ సిన్హా, హెచ్‌ఎస్‌సీసీ సీఎండీ జ్ఞానేష్‌ పాండే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి సునీల్‌శర్మ, గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, బీజేపీ నేతలు యడ్లపాటి రఘునాథబాబు, యడ్లపాటి స్వరూపరాణి, జమ్ముల శ్యాంకిషోర్‌, ఆర్‌.లక్ష్మీపతి, డాక్టర్‌ మాదల శ్రీనివాస్‌, టీడీిపీ నేతలు నందం అబద్దయ్య, వల్లభనేని సాయిప్రసాద్‌, కొమ్మారెడ్డి కిరణ్‌, మునగపాటి వెంకట మారుతీరావు, సంకా బాలాజీగుప్తా, కొమ్మారెడ్డి నాని, కేఎంవీ ప్రాజెక్ట్సు డైరెక్టరు కెరమేష్‌చంద్రబోస్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజరు అంకం చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
 
రూ.వేయి కోట్ల విలువైన భూమినిచ్చాం: మంత్రి నక్కా ఆనందబాబు
మంగళగిరిలో ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణానికిగాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కలిసి శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.వెయ్యి కోట్ల విలువైన 183 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎయిమ్స్‌ కోసమై ఇచ్చిందన్నారు. అవసరమైన అన్నీ మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తున్నట్టు చెప్పారు. రూ.15 కోట్ల వ్యయంతో తాగునీటి పథకం, రూ.36 కోట్ల వ్యయంతో 132కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, రూ.40 కోట్ల వ్యయంతో అటవీశాఖ అనుమతులు, రూ.పది కోట్ల వ్యయంతో హైవే నుంచి రహదారి నిర్మాణం వంటి ఎన్నో పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎయిమ్స్‌ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించబట్టే పనులు ఇంత వేగంతో జరుగుతున్నాయన్నారు. డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎయిమ్స్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
Link to comment
Share on other sites

నవరిలో అందుబాటులోకి ఎయిమ్స్‌
14-07-2018 02:38:37
 
636671327170551263.jpg
  • ఇది ఏపీ ప్రజలకు కేంద్రం కానుక
  • కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటన
  • మంగళగిరిలో పనుల పరిశీలన
  • పురోగతిపై సంతృప్తి
మంగళగిరి, గుంటూరు, జూలై 13: నవ్యాంధ్య రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఎయిమ్స్‌ ఆస్పత్రిని 2019 జనవరి కల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రం ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. మంగళగరిలో రూ.1618 కోట్లతో చేపట్టిన ఎయిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణ పనులను శుక్రవారం నడ్డా పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. నిర్మాణ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు ఎయిమ్స్‌ అమూల్యమైన బహుమతిగా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది 50మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్‌ ప్రారంభమవుతుందని, ఇప్పటికే కౌన్సెలింగ్‌ మొదలైందని, ఆగస్టు నుంచి తరగతులు జరుగుతాయని అన్నారు. ఇప్పటి నుంచే రెండో ఏడాది తరగతులపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఆ సమయానికి ఇక్కడ అన్ని సదుపాయాలను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో పనులు జరిపిస్తున్నట్లు వెల్లడించారు.
 
అవుట్‌ పేషెంట్‌ బ్లాకు వచ్చే జనవరిలో ప్రారంభిస్తామని, దీనికి సంబంధించిన భవనం, సిబ్బంది నివాస సముదాయం, వైద్య విద్యార్థుల వసతి భవనాలు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు వివరించారు. నిర్మాణంలో ఉన్న ఓపీడీ బ్లాకును చూశారు. సెప్టెంబరు 15 నాటికే పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎయిమ్స్‌ నమూనాను పరిశీలించారు. ఆ తర్వాత ఐఎంఏ హాలులో వైద్యులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రాణాంతకమైన నిపా వైర్‌సను నాలుగురోజుల్లోనే కట్టడి చేయడంతో మన ప్రతిభ ప్రపంచానికి తెలిసిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...