Jump to content

AIIMS


sonykongara

Recommended Posts

ఎయిమ్స్‌ నిర్మాణ పనులకు శ్రీకారం
 
 
636416699951342494.jpg
  • వేగంగా పనులు చేపడుతున్న కాంట్రాక్ట్‌ సంస్థ
  • రూ.272 కోట్లతో తొలిదశ పనులు
  • పూర్తి కావస్తున్న ప్రహరీ
  • భవన సముదాయాలకు ఫౌండేషన్లు
  • 18 నెలల్లో తొలిదశ పనులు ముగించాలని లక్ష్యం
  • ఆ వెంటనే రెండో దశ పనులు
మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆరంభ దశనుంచే కాంట్రాక్టు ఏజెన్సీ పనుల్లో వేగాన్ని పెంచేసింది. ప్రహరీ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. అవుట్‌ పేషెంట్‌ విభాగం నిర్మాణానికి పునాదులు తీస్తున్నారు. నివాసిత భవన సముదాయానికి ఫౌండేషన్‌ పనులు జరుగుతున్నాయి. రూ.1618 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎయిమ్స్‌ను రెండు దశలుగా నిర్మించనున్నారు. తొలిదశలో ఓపీడీ బ్లాకుతో పాటు దాదాపు అన్నీ నివాసిత భవనాలను నిర్మిస్తున్నారు.
 
 
మంగళగిరి: మంగళగిరిలో ఎయిమ్స్‌ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే 193 ఎకరాల చుట్టూ రూ.8.85 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రహరీ పనులు ముగుస్తున్న దశలో ప్రధానమైన ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించారు. రూ.1618 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎయిమ్స్‌ను రెండు దశలుగా నిర్మించనున్నారు. తొలిదశలో ఓపీడీ బ్లాకుతో పాటు దాదాపు అన్నీ నివాసిత భవనాలను నిర్మిస్తున్నారు. రెండోదశలో ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణాలను పూర్తి చేస్తారు. తొలిదశ పనులను రూ.272 కోట్ల అవార్డు ఒప్పందంతో కేఎంవీ ప్రాజెక్టు సంస్థ రెండు వారాల కిందట క్షేత్రస్థాయిలో పనులను ఆరంభించింది. ప్రాంగణంలో తూర్పుదిశగా ఆసుపత్రి, వైద్య కళాశాల భవన సముదాయాలు రానుండగా పశ్చిమ దిశగా హాస్టళ్లు, ఇతర సిబ్బంది భవనాలను నిర్మిస్తున్నారు. 18 మాసాల్లో తొలిదశ నిర్మాణ పనులను ముగిస్తారు. మరికొద్ది రోజుల్లోనే రెండోదశ పనులు కూడ ప్రారంభం కానున్నాయి.
 
ఆరంభం నుంచే వేగం..
ఆరంభ దశనుంచే కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ పనుల్లో వేగాన్ని పెంచేసింది. సరిగ్గా పక్షం రోజుల కిందటే కాంట్రాక్టు సంస్థ ఎయిమ్స్‌ పనులను చడీచప్పుడు లేకుండా ప్రారంభించింది. తొలిదశ కింద రూ.300 కోట్లకు పైగా వ్యయంతో అవుట్‌ పేషెంట్‌ బ్లాకుతో పాటు మరికొన్ని నివాసిత భవనాలను నిర్మించాలని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ నిర్ణయించింది. ఈ కాంట్రాక్టును కేఎంవీ ప్రాజెక్టు సంస్థ గ్లోబల్‌ టెండర్ల విధానంలో రూ.272 కోట్లకుగాను చేజిక్కించుకుంది. నిర్మాణ పనుల ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ హెచ్‌ఎస్‌సీసీతో అవార్డు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 18 మాసాల కాల వ్యవధిలో పనులను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాన్న సంకల్పంతో కాంట్రాక్టు ఏజెన్సీ క్షేత్రస్థాయిలో జెట్‌స్పీడుతో పనులను చేపట్టింది.
 
కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌ఎస్‌వై నాల్గవ దశకింద దేశంలో మంగళగిరితో పాటు నాగపూర్‌ (మహారాష్ట్ర), కల్యాణి (పశ్చిమబెంగాల్‌) పట్టణాలకు ఎయిమ్స్‌ ఆసుపత్రులను మంజూరుచేసింది. మంగళగిరిలో కొండల నడుమవున్న టీబీ శానిటోరియంకు చెందిన 193 ఎకరాల్లో దీనిని నిర్మించాలని నిర్ణయించారు. 2015 డిసెంబరు 19న కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ ప్రకాష్‌నడ్డా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. ఎయిమ్స్‌ నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను కేంద్రం హెచ్‌ఎస్‌సీసీకి అప్పగించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మంగళగిరి ఎయిమ్స్‌కు ఎంపిక చేసిన స్థలానికి పలు ప్రత్యేకతలు వున్నాయి. కొండల నడుమ ఆహ్లాదకరమైన పచ్చటి వాతావరణంతో పాటు హైవేల మధ్య, రెండు వేర్వేరు రైలుమార్గాల మధ్య ఈ ప్రాంతం వుంది.
 
మంగళగిరి ఎయిమ్స్‌కు కేటాయించిన 190 ఎకరాల చుట్టూ రూ.8.85 కోట్ల వ్యయంతో 4560 మీటర్ల పొడవునా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఈ కాంట్రాక్టును కూడా కేఎంవీ ప్రాజెక్టు లిమిటెడ్‌ ముందుగానే దక్కించుకోవడం విశేషం. ప్రహరీ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఎయిమ్స్‌కు సంబంధించి హాస్పిటాలిటీకి చెందిన భవనాలన్నింటిని తూర్పు దిక్కు, ఇతరత్రా హాస్టల్స్‌, సిబ్బంది క్వార్టర్స్‌, అతిధిగృహా భవన సముదాయాలన్నింటిని పశ్చిమ ప్రాంగణంలోనూ నిర్మించనున్నారు. అంటే ఆసుపత్రి భవనాలన్నీ కొత్త హైవేకు దగ్గరగాను, నివాసిత భవన సముదాయాలన్నీ పాత హైవేకు దగ్గరగాను వుండబోతున్నాయి.
 
నిర్మాణం కోసం కేటాయించిన రూ.1618 కోట్లలో సుమారు రూ.వెయ్యి వేయి కోట్లను భవన నిర్మాణాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కోసం వెచ్చిస్తారు. మిగతా రూ.600 కోట్లను వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ కోసం వినియోగించన్నుట్టు సమాచారం. తొలిదశ భవన నిర్మాణాల కింద ప్రధానమైన అవుట్‌ పేషెంట్‌ డిపార్టుమెంట్‌ బ్లాకుతో పాటు నివాసిత భవనాల రూపంలో మరో 16 భవనాలను నిర్మించనున్నారు. ఓ పక్క వీటి నిర్మాణాలు జరుగుతుండగనే రెండోదశ నిర్మాణ పనులను కూడ త్వరలోనే ప్రారంభిస్తారు. ఈ రెండో దశలో ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణాలే ఎక్కువగా వున్నాయి.
 
జోరుగా నిర్మాణ పనులు
ప్రస్తుతం ఎయిమ్స్‌ అవరణలో తొలిదశ నిర్మాణ పనులు బాగా జోరుగా సాగుతున్నాయి. ఛత్తీస్‌గడ్‌ నుంచి వందలాది మంది కూలీలను రప్పించారు. వీరందరికీ పాత శానిటోరియం తాలూకు శిథిల భవనాలలో వసతి ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో ఓ వైపు జంగిల్‌ క్లియరెన్స్‌ చేస్తూ మరో పక్క ఓపీడీ బ్లాకుకు పునాదులు తీస్తున్నారు. 2.1 మీటర్ల లోతులో పునాదులను తీస్తున్నారు. మరోపక్క రెండు హాస్టల్‌ భవనాలకు పునాదులు తీయడంతో పాటు కాంక్రీటు ఐరన్‌ బెడ్‌ వేసే పనులను కూడ చేపట్టారు.
 
tholi.jpg 
mali.jpg
Link to comment
Share on other sites

  • Replies 203
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 3 weeks later...
ఎయిమ్స్‌.. చకచకా...
26-10-2017 08:24:05
 
636446030468302541.jpg
  • మూడు దశలుగా నిర్మాణ పనులు
  • జనవరిలో రెండోదశ పనులు
  • మూడోదశలో ఎక్విప్‌మెంట్‌
  • రూ.14 కోట్లతో కృష్ణా జలాలు
  • హైవే నుంచి త్వరితగతిన 100 అడుగుల రోడ్డు
  • వివిధ శాఖల అధికారులతో మంత్రి కామినేని సమీక్ష

‘ఎయిమ్స్‌ పనులు బ్ర హ్మాండంగా జరుగుతున్నాయి. నేను వూహించినదాని కన్నా వేగంగా జరుగుతున్నాయి.. ఇక్కడకు వచ్చి చూశాక నాకు చాల చాల సంతృప్తిగాను, మ రెంతో ఉత్సాహంగాను ఉంది’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. మంగళగిరి కొం డల నడుమ 193 ఎక రాల విస్తీర్ణంలో చేపట్టిన అఖిల భారత వైద్య విజ్ఞా న సంస్థ (ఎయి మ్స్‌) ని ర్మాణ పనులను బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌తో కలిసి పరిశీలించా రు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు.
 
మంగళగిరి: ఎయిమ్స్‌ పనులను మూడు దశలుగా చేపట్టినట్టు మంత్రి కామినేని తెలిపారు.. మొదటి రెండు దశలు భవన నిర్మాణాలకు చెందినవే!. ఎయిమ్స్‌ ప్రాంగణంలో తూర్పుదిశగా హస్పిటాలిటీ, ఇన్‌స్టిట్యూషన్‌ భవనాలు వస్తుండగా... పశ్చిమ ప్రాంగణంలో పూర్తిగా నివాసిత, హస్టల్‌ భవన సముదాయాలు వుండేవిధంగా మాస్టార్‌ ప్లాన్‌లో నిర్దేశించాం. తొలిదశ కింద నివాసిత, హస్టల్‌ భవనాలతోపాటు హాస్పిటాలిటీకి చెందిన అతి ప్రధానమైన అవుట్‌ పేషెంట్‌ డిపార్టుమెంట్‌ (ఓపీడీ) బ్లాకును నిర్మిస్తున్నాం. రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఈ పనుల్లో ఇప్పటికే ఎంతో పురోగతి కనిపిస్తోందని మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికల్లా తొలిదశ నిర్మాణాలన్నీ పూర్తవుతాయి. రెండోదశ పనులకు సంబంధించి మరో నెల రోజుల్లోగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి జనవరి కల్లా పనులను ఆరంభించేలా కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ రెండోదశలో పూర్తిగా ఆసుపత్రి, వైద్య కళాశాల భవనాలే వుంటాయని కామినేని తెలిపారు. ఇక మూడో దశలో ఎక్విప్‌మెంట్‌, ఫర్నిచర్‌లను ఏర్పాటుచేసుకునేలా ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. కాగా, 2018లో ఎయిమ్స్‌ వైద్య కళాశాలలో అడ్మిషన్లను ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
 
వివిధ శాఖల వారీగా సమస్యలపై సమీక్ష
అంతకుముందు మంత్రి కామినేని అటవీ, విద్యుత్‌, రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బీ, ప్రజారోగ్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, సీఆర్‌డీఏ అధికారులతో ఎయిమ్స్‌ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ ఆసుపత్రికి ఒప్పందం ప్రకారం రాష్ట్రప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించి శాఖల వారీగా పనుల పురోగతిని సమీక్షించారు. ఆయా ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి..
 
కృష్ణా జలాలకు రూ.14 కోట్లు కావాలి
ఎయిమ్స్‌ ప్రాంగణానికి కృష్ణా జలాలను సరఫరా చేసే పథకాన్ని గురించి మంత్రి కామినేని జిల్లా ప్రజారోగ్యశాఖ అధికారులను విచారించారు. ఉండవల్లిలోని కృష్ణాతీరం నుంచి ఎయిమ్స్‌ వరకు 12.3 కిలోమీటర్ల పొడవున పైప్‌లైను, ఇంటెక్‌వెల్‌, సంపును నిర్మించేందుకు రూ.14 కోట్లు ఖర్చవుతాయని అంచనాలను రూపొందించినట్టు ఆ శాఖ ఈఈ టి.సంపత్‌కుమార్‌ వివిరించారు. రోజుకు 2.5 ఎంఎల్‌డీ నీటిని ఈ పథకం రూపేణా సరఫరా చేయొచ్చునని ఆయన తెలిపారు. ఇలా సరఫరా చేసిన రావాటర్‌ను శుద్ధిచేసి పంపిణీ చేసేందుకు అవసరమైన ట్రీట్‌మెంటు ప్లాంటు, డిస్ట్రిబ్యూటరీ లైన్లను ఎయిమ్స్‌ నిర్మాణ పర్యవేక్షణ ఏజెన్సీ హెచ్‌ఎస్‌సీసీ చూసుకుంటుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి రూ.14 కోట్లు మంజూరు చేయిస్తామని మంత్రి చెప్పారు.
 
సంక్లిష్టంగా 100 అడుగుల రోడ్డు
16వ నెంబరు జాతీయ రహదారి నుంచి తూర్పుదిశగా ఎయిమ్స్‌లోకి 100 అడుగుల రహదారిని నిర్మించే పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రి కామినేని ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ మాధవీ సుకన్యను ప్రశ్నించారు. హైవే నుంచి 1.6 కిలోమీడర్ల పొడవున ఈ రోడ్డును నిర్మించాల్సి వుందని... ప్రస్తుతం ఏపీఎస్పీ, ఎయిమ్స్‌ అధికారులు కలిసి 0.5 కిలోమీటర్ల నిడివి కల స్థలాన్ని తమకు అప్పగించారని... ఇంకా 1.1 కిలోమీటర్ల నిడివికల రోడ్డుమార్గం కోసం 0.941 హెక్టార్ల అటవీ స్థలాన్ని డీ రిజర్వు చేసి తమకు అప్పగించాల్సి వుందని తెలిపారు. ఇందుకోసం అటవీశాఖ రూ.18.89 లక్షలను చెల్లించాలని కోరగా ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిపారు. సొమ్ము చెల్లింపుపై అండర్‌ టేకింగ్‌ తీసుకుని సత్వరమే స్థలాన్ని ఆర్‌ అండ్‌ బీకి అప్పగించాలని మంత్రి అటవీ అధికారులను కోరగా నిబంధనలు అంగీకరించవని తేల్చిచెప్పారు. దీంతో ఆ రెండుశాఖల ముఖ్య కార్యదర్శులతో మంత్రి కామినేని ఫోన్‌లో మాట్లాడారు. 100 అడుగుల రోడ్డును ఎప్పటిలోగా నిర్మించగలరని కలెక్టర్‌ శశిధర్‌ ప్రశ్నించగా ఏడాది సమయం పట్టవచ్చునని ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ మాధవీ సుకన్య చెప్పారు. అంత సమయమా అంటూ మంత్రి సహా ఆశ్చర్యపోయారు. 1.6 కి.మీ. రహదారికి అంతసమయమెందుకని కలెక్టర్‌ ప్రశ్నించారు.
 
మొన్నేసిన ఆ టవర్లు తీయాల్సిందే!
100 అడుగుల రహదారికి మరో అడ్డంకి కూడ వుందంటూ ఆర్‌ అండ్‌ బీ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం హైవే నుంచి ఎయిమ్స్‌ ప్రాంగణంలోకి వస్తున్న హెచ్‌టీ విద్యుత్‌ లైన్‌ టవర్లు రోడ్డు మధ్యకు వస్తున్నాయని... వాటిని పక్కకు మరల్చేందుకు ఏపీఎస్పీడీసీయల్‌ అధికారులు రూ.82 లక్షలు చెల్లించాలని కోరుతున్నారని ఎస్‌ఈ చెప్పారు. సేవాపన్ను చెల్లింపుతో కలిపి ఈ మొత్తం రూ కోటిని చేరుకుందని... నిధుల చెల్లింపునకై ఉన్నతాధికారులకు నివేదించామని వివరించారు. ఈ నిధులను కూడ వెంటనే మంజూరు చేయిస్తామని మంత్రి కామినేని చెప్పారు.
 
132 కేవీ సబ్‌స్టేషన్‌ ఇలా..
ఎయిమ్స్‌లో విద్యుత్‌ అవసరాల నిమిత్తం ప్రత్యేకంగా నిర్మించదలిచిన 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ గురించి మంత్రి ఆ శాఖాధికారులను విచారించారు. సబ్‌స్టేషన్‌ కోసం 0.99 హెక్టారుల అటవీ స్థలాన్ని డీరిజర్వు చేసి తమకు అప్పగించాల్సి వుందని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ బి.జయభరత్‌రావు వివరించారు. ఇందుకుగాను అటవీశాఖ రూ.8.19 లక్షలను చెల్లించాలని కోరినట్టు చెబుతూ త్వరలోనే ఆ మొత్తాన్ని చెల్లించగలమని వివరించారు. కార్యక్రమంలో మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌ గంజి చిరంజీవి, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, కేఎంవీ ప్రాజెక్టు సంస్థ ఎండీ కనకమేడల మల్లేశ్వర వరప్రసాద్‌, మంగళగిరి, తాడేపల్లి తహసీల్దార్లు సంగా విజయలక్ష్మి, పద్మనాభుడు, ప్రజారోగ్యశాఖ డీఈఈ ఎన్‌.గోవిందయ్య,, ఏఈఈ జి.శ్రీనివాసరావు, ఆర్‌ అండ్‌ బీ డీఈఈ వి.భవానీశంకర్‌, విద్యుత్‌శాఖ ఈఈ ఎన్‌.పిచ్చియ్య, ఏడీఈ జి.భాస్కరరావు, ఏఈ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మారుతున్న డిజైన్లు
ఇదిలావుండగా ఎయిమ్స్‌ భవన నిర్మాణాల కోసం ప్రతిపాదించిన డిజైన్లు తరచుగా మారిపోతున్నాయి. తాజాగా హస్పిటాలిటీకి చెందిన ఓపిడి బ్లాకును అయిదంతస్తుల నుంచి ఏడంతస్తులకు మార్చారు. ప్రాంగణంలో సదరు స్థలం పల్లంగా వున్నందున దాని ఎత్తు పెంచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ భవంతిలో మొదటి రెండు ఫ్లోర్‌లను సెల్లార్‌లుగా వాడాలని నిర్ణయించారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
ఎయిమ్స్‌ రహదారి పనులను శ్రీకారం
08-12-2017 08:24:39
 
636483182804090194.jpg
  • 1.6 కి.మీల పొడవున వంద అడుగుల మార్గం
  • రూ.10 కోట్ల అంచనా వ్యయం
  • జాతీయ రహదారి నుంచి 100 అడుగుల రోడ్డు అభివృద్ధి
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి కొండల నడుమ నిర్మిస్తున్న ఎయిమ్స్‌ అసుపత్రికి ప్రధాన రహదారి నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ చేపట్టింది. తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద 16వ నెంబరు జాతీయరహదారి నుంచి డీజీపీ కార్యాలయం, ఏపీఎస్పీ ఆరో పటాలం ప్రాంగణం వెంబడి 1.6 కిలోమీటర్ల పొడవున వంద అడుగుల రోడ్డుగా నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ భూమితో పాటు ఏపీఎస్పీ, అటవీశాఖకు చెందిన భూములను కొద్దిపాటి విస్తీర్ణంలో రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. భూముల బదలాయింపు ఇంచుమించు పూర్తికావడంతో రోడ్లు భవనాల శాఖ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ రహదారి నిర్మాణానికి సుమారు రూ.10 కోట్లు అంచనా వేశారు. 16వ నెంబరు జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ఇది అత్యంత ప్రధానమైన రహదారి. వాస్తుపరంగా తూర్పు రహదారి మార్గంగా కూడా ఇది ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
సిద్ధార్థ’లో ఎయిమ్స్‌ తాత్కాలిక తరగతి గదులు
22-01-2018 08:40:48
 
636522072493070295.jpg
  •  శంకుస్థాపన చేసిన స్పీకర్‌ డాక్టర్‌ కోడెల
విజయవాడ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) తరగతి గదుల నిర్మాణాలకు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రి కామినేని శ్రీనివాస్‌లు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. మంగళగిరిలో నిర్మించనున్న భవన నిర్మాణాలకు రెండేళ్లకుపైగా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈలోగా తాత్కాలిక పరిపాలన భవనాలు, తరగతి గదులను సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. మెడికల్‌ కాలేజీలో వసతులపై ఇటీవల ప్రత్యేక నిపుణుల బృందం పరిశీలించింది. కమిటీ సూచనల మేరకు మెడికల్‌ కాలేజీలో ఏర్పాట్లకు రూ.6కోట్లకు పైగా నిధులు మం జూరవడంతో పనులకు శ్రీకారం చుట్టారు.
జిమ్‌ ప్రారంభం..
సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ పూర్వవిద్యార్థులు సమకూర్చిన రూ.12 లక్షల నిధులతో ఏర్పాటుచేసిన జిమ్‌ను కూడా శాసన సబాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రి కామినేని శ్రీనివా్‌సలు ప్రారంభించారు. ఈ రెండు కార్యక్రమాలలో కూడా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

ఎయిమ్స్‌కు రాచబాట
24-02-2018 07:57:37

మంగళగిరి: మంగళగిరి పట్టణానికి ఈశాన్యంగా కొండల మధ్య ఏర్పాటవుతున్న ఎయిమ్స్‌ ఆసుపత్రికి తూర్పువైపు జాతీయరహదారి నుంచి చేరుకునేలా కొత్తగా రహదారిని నిర్మిస్తున్నారు. హైవేపై వడ్డేశ్వరం అండర్‌పాస్‌ నుంచి ఎయిమ్స్‌లోకి 1.6 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని నిర్మిస్తున్నారు. మొత్తం నాలుగు వరుసలుగా నిర్మిస్తున్న ఈ రహదారి మధ్యలో గ్రీనరీని ఏర్పాటుచేసేందుకు మూడు మీటర్ల వెడల్పుతో సెంట్రల్‌ వెర్జ్‌ను కూడ అందుబాటులోకి తెస్తున్నారు. ఏపీ పోలీసుశాఖ వారి టెక్‌ టెవర్‌ వెనుకగా కొండ అంచువెంబడిగా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. రూ.పది కోట్లకు పైగా వ్యయంతో రహదారులు భవనాలశాఖ పర్యవేక్షణలో రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
 
ఈ రహదారి కోసం అటవీశాఖ 2.35 ఎకరాల భూమిని ఇటీ వలే రహదారులు, భవనాలశాఖకు అప్పగించింది. ఇదిలావుండగా ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణ పనులను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెచ్‌ఎస్‌సీసీ పర్యవేక్షణలో రెండు దశలుగా చేపట్టింది. ఇందులో తొలిదశ పనులు సుమారు రూ.400 కోట్ల వ్యయంతో శరవేగంగా సాగుతున్నాయి. తొలిదశకింద మొత్తం 17 భవనాలను నిర్మిస్తున్నారు. రెండో ప్యాకేజీ కింద రూ.556.99 కోట్ల వ్యయంతో మరిన్ని భవన నిర్మాణాలను చేపట్టవల్సివుంది. దీనికి సంబంధించి గతంలో టెండర్లను ఆహ్వనించినప్పటికీ వాటిని రద్దు చేసి కొత్తగా మళ్లీ టెండర్లను పిలిచినట్టు తెలిసింది.

Link to comment
Share on other sites

ఎయిమ్స్‌కు రాచబాట
24-02-2018 07:57:37

మంగళగిరి: మంగళగిరి పట్టణానికి ఈశాన్యంగా కొండల మధ్య ఏర్పాటవుతున్న ఎయిమ్స్‌ ఆసుపత్రికి తూర్పువైపు జాతీయరహదారి నుంచి చేరుకునేలా కొత్తగా రహదారిని నిర్మిస్తున్నారు. హైవేపై వడ్డేశ్వరం అండర్‌పాస్‌ నుంచి ఎయిమ్స్‌లోకి 1.6 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని నిర్మిస్తున్నారు. మొత్తం నాలుగు వరుసలుగా నిర్మిస్తున్న ఈ రహదారి మధ్యలో గ్రీనరీని ఏర్పాటుచేసేందుకు మూడు మీటర్ల వెడల్పుతో సెంట్రల్‌ వెర్జ్‌ను కూడ అందుబాటులోకి తెస్తున్నారు. ఏపీ పోలీసుశాఖ వారి టెక్‌ టెవర్‌ వెనుకగా కొండ అంచువెంబడిగా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. రూ.పది కోట్లకు పైగా వ్యయంతో రహదారులు భవనాలశాఖ పర్యవేక్షణలో రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
 
ఈ రహదారి కోసం అటవీశాఖ 2.35 ఎకరాల భూమిని ఇటీ వలే రహదారులు, భవనాలశాఖకు అప్పగించింది. ఇదిలావుండగా ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణ పనులను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెచ్‌ఎస్‌సీసీ పర్యవేక్షణలో రెండు దశలుగా చేపట్టింది. ఇందులో తొలిదశ పనులు సుమారు రూ.400 కోట్ల వ్యయంతో శరవేగంగా సాగుతున్నాయి. తొలిదశకింద మొత్తం 17 భవనాలను నిర్మిస్తున్నారు. రెండో ప్యాకేజీ కింద రూ.556.99 కోట్ల వ్యయంతో మరిన్ని భవన నిర్మాణాలను చేపట్టవల్సివుంది. దీనికి సంబంధించి గతంలో టెండర్లను ఆహ్వనించినప్పటికీ వాటిని రద్దు చేసి కొత్తగా మళ్లీ టెండర్లను పిలిచినట్టు తెలిసింది.

Link to comment
Share on other sites

ఎయిమ్స్‌ చకచకా
04-03-2018 10:46:48
 
636557572051085445.jpg
  • ఊపందుకున్న ఎయిమ్స్‌ నిర్మాణ పనులు
  • తొలిదశలో 25 భవనాల నిర్మాణం
  • మరో ఏడాదికి పూర్తికానున్న తొలిదశ పనులు
  • మౌలిక సదుపాయాలకు రూ.50 కోట్లు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
మంగళగిరిలో ఎయిమ్స్‌ పనులు ఊపందుకున్నాయి. రూ.1,618 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును రెండు దశలుగా పూర్తిచేయనున్నారు. తొలిదశ పనులు ఆరు మాసాలకిందట ప్రారంభంకాగా, 40శాతం పనులు పూర్తయ్యాయి. రెండోదశ పనులకు మరో నెలరోజుల్లో టెండరు ప్రక్రియ ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎయిమ్స్‌ను చకాచకా పూర్తి చేసేందుకు అన్నీ సహాయ సహకారాలను అందిస్తోంది. రూ.యాభై కోట్లను వెచ్చించి ఎయిమ్స్‌కు కావలిసిన రహదార్లు, విద్యుత్‌, తాగునీటి వంటి వసతులను చేస్తోంది.
 
 
 
గుంటూరు: ఎయిమ్స్‌ (ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌) నిర్మాణంలో తొలి దశగా రూ.300 కోట్లతో చేపట్టిన పనులను కేఎంవీ సంస్థ పరుగులెత్తిస్తోంది. ఇప్పటికే 193 ఎకరాల చుట్టూ రూ.8.85 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రహరీ పనులు దాదాపు ముగిశాయి. తొలిదశ నిర్మాణ పనుల కింద ఓపీడీ బ్లాకుతో పాటు దాదాపు అన్నీ నివాసిత భవనాలను నిర్మిస్తున్నారు. తొలిదశ పనులను రూ.272 కోట్ల అవార్డు ఒప్పందంతో కేఎంవీ ప్రాజెక్టు సంస్థ చేపట్టి గత సెప్టెంబరులో పనులను ఆరంభించింది. ప్రాంగణంలో తూర్పుదిశగా ఆసుపత్రి, వైద్య కళాశాల భవన సముదాయాలు రానుండగా పశ్చిమ దిశగా హాస్టళ్లు, ఇతర సిబ్బంది భవనాలను నిర్మిస్తున్నారు. రూ.559 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రెండోదశ పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ ముగింపుదశలో వుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ రెండోదశ పనులు కూడ ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌ఎస్‌వై నాల్గవ దశకింద దేశంలో మంగళగిరితో పాటు నాగపూర్‌ (మహారాష్ట్ర), కల్యాణి (పశ్చిమ బెంగాల్‌) పట్టణాలకు ఎయిమ్స్‌ అసుపత్రులను మంజూరుచేసింది. యాదృచ్ఛికంగా ఈ మూడు ఎయిమ్స్‌ ఆసుపత్రుల తాలూకు తొలిదశ పనులను కేఎంవీ సంస్థే దక్కించుకోవడం విశేషం.
 
తూర్పువైపు హాస్పిటాలిటీ
మంగళగిరి ఎయిమ్స్‌కు కేటాయించిన 193 ఎకరాల చుట్టూ రూ.8.85 కోట్లతో 4,560 మీటర్ల పొడవునా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఈ కాంట్రాక్టును కూడ ఎయిమ్స్‌ నిర్మాణ కాంట్రాక్టు సంస్థ కేఎంవీ ప్రాజెక్టు లిమిటెడ్‌ ముందుగానే దక్కించుకుంది. ఈ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఎయిమ్స్‌కు సంబంధించి హాస్పిటాలిటీకి చెందిన భవనాలన్నింటిని తూర్పు దిక్కుగాను, ఇతరత్రా హాస్టల్స్‌, సిబ్బంది క్వార్టర్స్‌, అతిథి గృహ భవన సముదాయాలన్నింటిని పశ్చిమ ప్రాంగణంలోనూ నిర్మించనున్నారు.
 
 
నిధుల వ్యయమిలా..
ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణాన్ని రెండు దశలుగా చేపట్టనున్నారు. దీని నిర్మాణం కోసం కేటాయించిన రూ.1,618 కోట్లలో సుమారు రూ.వెయ్యి కోట్లను భవన నిర్మాణాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కోసం వెచ్చిస్తారు. మిగతా రూ.600 కోట్లను వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ కోసం వినియోగించన్నుట్టు సమాచారం. తొలిదశ భవన నిర్మాణాల కింద ప్రధానమైన అవుట్‌ పేషెంట్‌ డిపార్టుమెంట్‌ బ్లాకుతో పాటు నివాసిత భవనాల రూపంలో మరో 16 భవనాలను నిర్మించనున్నారు. మరో ఎనిమిది సర్వీసు భవనాలుగా వున్నాయి.
 
రెండో దశ..
ఓ పక్క వీటి నిర్మాణాలు జరుగుతుండగనే...రెండోదశ నిర్మాణ పనులను కూడ త్వరలోనే ప్రారంభిస్తారు. ఈ రెండో దశలో ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణాలే ఎక్కువగా వున్నాయి. ఈ ప్యాకేజీ కింద బోధనాసుపత్రి, వైద్యకళాశాల, ల్యాబ్‌ల తాలూకు భవనాలతో పాటు యుటిలిటి బ్లాకు, స్టోరేజి యార్డు, ఫైర్‌ స్టేషన్‌, మార్కెట్‌ స్థల అవసరాలు, ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ల నిమిత్తం మరో అయిదు గ్రౌండు ఫ్లోర్‌ భవనాలను నిర్మిస్తారు. పార్కింగ్‌ ఏరియా కింద మొత్తం ప్రాంగణంలో 13 చోట్ల 69,298 చదరపు మీటర్ల స్థలాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.
 
మౌలిక వసతుల కల్పన
ఇంకోవైపు ఎయిమ్స్‌ అవసరాలకు అనుగుణంగా కల్పించాల్సిన మౌలికసదుపాయలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. సుమారు రూ.15 కోట్ల వ్యయంతో కృష్ణా జలాలను ఎయిమ్స్‌ ప్రాంగణంలోకి తీసుకువచ్చేవిధంగా పధకాన్ని చేపడుతోంది. మరో రూ 16కోట్ల వ్యయంతో 33/11కెవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. తూర్పువైపు 16వ నెంబరు జాతీయరహదారి నుంచి నేరుగా ఎయిమ్స్‌లోనికి చేరుకునేలా రూ పదికోట్ల వ్యయంతో 1.6 కిలోమీటర్ల పొడవునా నాలుగు లేన్ల రహదారిని కొత్తగా నిర్మిస్తుంది. ఎయిమ్స్‌కు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా రమారమి రూ యాభై కోట్ల పైబడి ఖర్చు చేస్తుంది.
 
gt-aims.jpg
ఇవిగాక, సర్వీస్‌ ఏరియా పేరుతో ఎస్‌టీపీ- 1, జీటీపి- 1 భవనం, అంతర్గత ఎలక్ట్రికల్‌ సబ్‌ స్టేషన్ల నిమిత్తం మరో ఆరు భవనాలను వేర్వేరుచోట్ల నిర్మించనున్నారు.
Link to comment
Share on other sites

ఎయిమ్స్‌కు 104 కోట్లు ఇచ్చాం: కేంద్రం
07-03-2018 01:41:26
 
న్యూఢిల్లీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న ఎయిమ్స్‌ ఆస్పత్రి భవనాల నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.104.51 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం రూ.1618 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని 2015లో కేంద్ర కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపారు. మట్టి నమూనాల పరిశీలన, టోపోగ్రాఫికల్‌ సర్వే వంటివి పూర్తయ్యాయని, ప్రస్తుతం ప్రహారీ గోడ నిర్మాణం పనులు జరుగుతున్నాయని వివరించారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...
ఎయిమ్స్‌కు 2.69 కోట్ల ఫీజులు మినహాయింపు
24-04-2018 05:00:59
 
అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): మంగళగిరి ప్రాంతంలో నిర్మిస్తున్న ఎయిమ్స్‌(ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె స్ కు సీఆర్‌డీఏ కొన్ని ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చింది. దరఖాస్తు పరిశీలన, రికమండేషన్‌ ఫీజు, డెవల్‌పమెంట్‌ చార్జీలు, స్పెషల్‌ ఇంపాక్ట్‌ ఫీజులను మినహాయిస్తూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం విలువ రూ.2.69 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

ఇదీ సంగతి !! 

ap state bjp leads :buttkick:

http://www.andhrajyothy.com/artical?SID=569310

ఎయిమ్స్‌కు నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు
25-04-2018 03:41:14
 
636602244736852202.jpg
  • టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్‌24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రానికి ఎయిమ్స్‌ను మంజూరు చేసి, రూ.3500 కోట్ల నిధులు విడుదల చేసినందుకు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి మంగళవారం.. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన ఎయిమ్స్‌కు.. కొంత ఆలస్యమైనా నిధులు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భూమి కూడా సిద్ధంగా ఉందని నిర్మాణం వేగంగా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...