Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
రోజులన్నీ సీమవే!
15-12-2018 02:09:57
 
636804365986747516.jpg
  • ఆటోమొబైల్‌ నుంచి ఐటీ దాకా.. ఏ పరిశ్రమైనా రాయలసీమలోనే
  • యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం
  • శ్రీశైలం నుంచి సమృద్ధిగా తాగు-సాగునీరు
  • ఉత్పత్తి దశలో 1695 పరిశ్రమలు
  • ప్రాథమిక దశలో మరో 937 ప్లాంట్లు
  • పరిశ్రమలు రాకుండా కేంద్రం అడ్డుపుల్ల
  • అయినా ముందుకు సాగుతున్నాం
  • రాష్ట్రానికేం జరిగిందని విపక్షాలు అంటున్నాయి
  • వాటికి పారిశ్రామికీకరణే సమాధానం: సీఎం
  • రామ్‌కో ఫ్యాక్టరీకి వీసీ ద్వారా భూమిపూజ
బనగానపల్లె/అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యో తి): రాబోయే రోజులన్నీ రాయలసీమవేనని సీఎం చం ద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి-కృష్ణా అనుసంధానం తో సీమ ప్రాంతానికి సమృద్ధిగా సాగు, తాగు నీటిని సరఫరా చేస్తున్నామని.. తెలిపారు. యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆటోమొబైల్‌ నుం చి ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ దాకా సీమలోనే స్థాపించేలా చూస్తున్నామన్నారు. ఫలితంగా.. ఇటు చెన్నై, అటు బెంగళూరుకు సమీపంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పరిశీలన చేసుకుంటున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో రూ.1500 కోట్లతో నిర్మిస్తున్న రామ్‌కో గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంటు ఫ్యాక్టరీకి శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భూమి పూజ చేశారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.15,73,172 కోట్ల పెట్టుబడులు తెచ్చే 2,632 పరిశ్రమలను ఆకర్షించగలిగామన్నారు. వీటి స్థాపన సాకారమైతే 33,03,671 మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో రూ.6,30,457 కోట్ల పెట్టుబడులతో 1695 పరిశ్రమలు.. అనుమతుల నుంచి ఉత్పత్తి దశలో ఉన్నాయని.. వాటిలో 795 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపారు. ఇంకో 638 పరిశ్రమలు డీపీఆర్‌ దశలో ఉన్నాయని తెలిపారు. భూ కేటాయింపుల దశకు చేరిన పరిశ్రమల ద్వారా 10,23,782 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. ప్రారంభించిన పరిశ్రమల్లో రెండున్నర లక్షల మందికి పైగా ఉద్యోగాలు దక్కాయన్నారు. రాష్ట్రానికి జరిగిందేమిటన్న విపక్షాలకు పరిశ్రమల ఏర్పాటే సమాధానమని చెప్పారు.
 
కేంద్రం సహకరించకున్నా..
‘పరిశ్రమల స్థాపనకు కేంద్రం సహకరించకున్నా ముందుకు సాగుతున్నాం. కర్నూలును పారిశ్రామిక హ బ్‌గా తీర్చిదిద్దుతాం. కొలిమిగుండ్లను సిమెంటు హబ్‌గా మారుస్తాం. సంజామల నుంచి కొలిమిగుండ్లకు ప్రత్యేక రైల్వే లైన్‌ వేసి పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తాం. కొలిమిగుండ్లలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల పర్యటన ర ద్దయింది. అయినా అభివృద్ధి ఆగకూడదన్న ఉద్దేశంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశాను. రామ్‌కో సిమెం టు దేశంలోనే ఐదో పెద్ద కంపెనీ. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రూ.2500 కోట్లతో ఫ్యాక్టరీలు పెట్టింది. 3 వేల మంది వాటిలో పనిచేస్తున్నారు. 14.45 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంటును రామ్‌కో ఉత్పత్తి చేస్తోంది. కొలిమిగుండ్ల ఫ్యాక్టరీ ద్వారా 300 మంది ప్రత్యక్షంగా, 3 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ పరిశ్రమను 14 నెలల్లోనే పూర్తి చేయాలని రామ్‌కోని ఆదేశించాం. రైతుల నుంచి గతంలో ఎకరా రూ.76 వేలకు రామ్‌కో కొనుగోలు చేసింది. వారికి మరో రూ.76 వేలు చెల్లించేలా ఒప్పించాం’ పరిశ్రమలు సహా ఏ ప్రాజెక్టునూ పునాదిరాళ్లతో వది లిపెట్టడం లేదు. ప్రారంభోత్సవ తేదీలనూ ఖరారు చేస్తున్నాం. కాలికి బలపం కట్టుకుని దేశవిదేశాలు తిరిగాం. దాని ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నాం’
 
బనగానపల్లె ఎమ్మెల్యేకు అభినందనలు..
‘కర్నూలు జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు రాలేదో ఆలోచిస్తే నాయకుల స్వార్థం ఏంటో అర్థమవుతుంది. స్థానిక బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి వచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పరిహార ప్రక్రియను కొలిక్కి తెచ్చేవరకూ ఉత్సాహాన్ని కనబరిచారు. ఎమ్మెల్యేలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి’
 
చెడగొట్టడం సులువు..
ఒక పరిశ్రమను సాధించడం చాలా కష్టం. చెడగొట్టడం మాత్రం సులభం. కొంతమంది అభివృద్ధి నిరోధకులు పరిశ్రమలు రాకుండా, అభివృద్ధి జరగకుండా అడ్డుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే... స్థానిక యువతకు నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రం కూడా నష్టపోతుంది!
 
మళ్లీ చీకటి రోజులే!
ధనిక రాష్ట్రాలూ చేయనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి అండగా ఉండకపోతే అరాచక శక్తులు మళ్లీ విజృంభిస్తాయి. చీకటి రోజులు వస్తాయి
 
కేసీఆర్‌ను పొగడటమా?
ప్రత్యేక హోదా మన హక్కు. ఒకప్పుడు మనకు హోదా ఇవ్వాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి హోదాకు అడ్డు పడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని జగన్‌, పవన్‌ కల్యాణ్‌ ఆకాశానికెత్తేస్తూ తెగ పొగిడేస్తున్నారు. వారి ఉద్దేశాన్ని ప్రజలే గ్రహించాలి.
- చంద్రబాబు
Link to comment
Share on other sites

ఫలిస్తున్న పరి‘శ్రమ’
01-01-2019 03:15:17
 
636819093179209454.jpg
  • 10 పరిశ్రమల్లో 2.51 లక్షల ఉద్యోగాలు
  • ఇవి భాగస్వామ్య ఒప్పందాల్లోనివే
  • మరెన్నో భారీ, మధ్యతరహా సంస్థలు
  • కియ నుంచి హీరో దాకా ఎన్నెన్నో!
  • ‘ముగ్గురు మోదీ’లు మోకాలడ్డు
  • అయినా సొంతంగా సాధిస్తున్నాం
  • 62 వేల కోట్లతో పెట్రో కాంప్లెక్స్‌
  • 4వ తేదీనే కాకినాడలో భూమిపూజ
  •  9న రామాయపట్నం పోర్టుకు శ్రీకారం
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన
  • ‘పరిశ్రమల’పై శ్వేతపత్రం విడుదల
‘‘మేం పెట్టం, మీ దగ్గర ఎవరినీ పెట్టుబడులు పెట్టనీయం అన్నట్లుగా ప్రధాని మోదీ వ్యవహరించారు. మిడిల్‌ మోదీ కేసీఆర్‌, జూనియర్‌ మోదీ జగన్‌ ఆయనతో జతకట్టారు. అయినా... కష్టపడి, ఏళ్లతరబడి సంపాదించుకున్న విశ్వసనీయత దన్నుతో అన్నీ మనమే చేసుకున్నాం!’’
- చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ‘‘ముగ్గురు మోదీలు కలిసి మోకాలడ్డినా... నాకున్న విశ్వసనీయత, ఉత్తమ విధానాలతో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తీసుకువచ్చాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. పరిశ్రమలు, సేవారంగం, నైపుణ్యాభివృద్ధిపై సోమవారం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కడప ఉక్కు పెడతామని పెట్టలేదు. మనం శంకుస్థాపన చేసుకున్నాం. దుగరాజపట్నం పోర్టు పెడతామన్నారు. పెట్టలేదు. దానికి ప్రత్యామ్నాయంగా మనమే రామాయపట్నం పోర్టు పెట్టుకుంటున్నాం. కాకినాడలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ పెడతామన్నారు. దానికోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని శక్తికిమించి భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని షరతు పెట్టారు. తగ్గించమంటే తగ్గించలేదు. చివరకు మనమే ప్రైవేటు పెట్టుబడి తెచ్చాం.
 
రూ.25వేల కోట్లు కాదు.. రూ.62వేల కోట్ల పెట్టుబడితో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌కు జనవరి 4న శంకుస్థాపన చేస్తున్నాం. మరోవైపు జనవరి 9 తేదీన రామాయపట్నం పోర్టు, ప్రకాశం జిల్లాలో పేపర్‌మిల్‌కు శంకుస్థాపన చేస్తున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు. కియ, హీరో మోటార్స్‌, అపోలో టైర్స్‌, టీసీఎల్‌, రిలయన్స్‌ సెజ్‌, హెచ్‌సీఎల్‌ తదితర భారీ కంపెనీలను రాష్ట్రానికి తెచ్చుకోగలిగామని తెలిపారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం ఏమాత్రం సహకరించలేదన్నారు. సొంత కృషితో ఈ పారిశ్రామిక కారిడార్లను అభివృద్ది చేస్తున్నామని... విశాఖపట్నంలో 7680 ఎకరాలు, శ్రీకాకుళంలో 11వేల ఎకరాల్లో రెండు నోడ్‌లను సిద్ధం చేశామని చెప్పారు. కృష్ణపట్నం, నెల్లూరు. ఓర్వకల్లు, హిందూపురం నోడ్‌లను చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
 
అమలు దిశగా ఒప్పందాలు...
భాగస్వామ్య సదస్సుల్లో రూ.15.42 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరిగాయని చంద్రబాబు తెలిపారు. అందులో రూ.1.77లక్షల కోట్ల పెట్టుబడితో 810 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. వీటిద్వారా 2.51లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ‘‘ఎంఎ్‌సఎంఈల ద్వారా 3.3 లక్షల మందికి, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా 1.78 లక్షల మందికిపైగా, ఎపిటా ద్వారా 13 వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. భాగస్వామ్య సదస్సు ఒప్పందాల్లోని మరో 5.27 లక్షల కోట్ల పెట్టుబడితో 1211 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే 7.66 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయి’’ అని చంద్రబాబు వివరించారు.
 
వీటికితోడు ప్రతి నియోజకవర్గంలో ఎంఎ్‌సఎంఈల స్థాపన ద్వారా లక్షల సంఖ్యలో ఉపాధి కల్పించనున్నామన్నారు. ఇప్పటికే ఇప్పటికే 31నియోజకవర్గాల్లో పూర్తయ్యాయని చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఇంటికీ ఒక స్మార్ట్‌ఫోన్‌ ఇస్తామని, ఫైబర్‌ గ్రిడ్‌తో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ వస్తుందని... రాబోయే రోజుల్లో ఇంటి దగ్గరి నుంచే పని, ఏదైనా వ్యాపారం చేసుకునే అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు.
 
మైనస్‌ నుంచి ప్లస్‌కు
‘‘2013-14నాటికి పారిశ్రామిక ప్రగతి మైన్‌సలో ఉంది. జాతీయ స్థాయిలో 2013-14లో 17.9శాతం పారిశ్రామిక ప్రగతి వృద్ధిరేటు ఉంటే... ఏపీలో మైనస్‌ నాలుగుశాతం ఉంది. నాలుగేళ్ల తర్వాత జాతీయ స్థాయిలో 7.1శాతం ఉంటే.. రాష్ట్రంలో 9.52శాతం వృద్దిరేటు సాధించాం’’ అని చంద్రబాబు తెలిపారు. ఏళ్లతరబడి సంపాదించుకున్న విశ్వసనీయత వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. అదే సమయంలో అధికారులు వినూత్న విధానాలతో పనిచేశారని ప్రశంసించారు. ‘‘69 అనుమతుల్ని సింగిల్‌ డెస్క్‌ నుంచి అందించాం. ఏ రాష్ట్రానికీ రానన్ని భారీ పరిశ్రమలు తెచ్చుకున్నాం. రూ.12,918కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించాం. బకాయి ఉన్న రూ.3,675కోట్ల పారిశ్రామిక రాయితీలు చెల్లించాం. రూ.14,290 కోట్ల పెట్టుబడులతో 33,309ఎంఎ్‌సఎంఈలు వచ్చాయి’’ అని వివరించారు. నాలుగు మెగా ఫుడ్‌పార్కులు, ఐదు ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌పార్కులు, వేల సంఖ్యలో ఎంఎ్‌సఎంఈ ప్రాజెక్టులు, చిన్న పరిశ్రమలు రాష్ట్రంలో ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు.
 
వచ్చిన పరిశ్రమలు ఇవీ...
ఆటోమొబైల్‌ రంగం: ఇసుజు, కియ మోటార్స్‌, అపోలో టైర్స్‌, అశోక్‌ లేలాండ్‌, భారత్‌ ఫోర్జ్‌, హీరో మోటార్స్‌. ఈ రంగంలో మొత్తం 24,800 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌: ఈ రంగంలో 202 సంస్థలు ఉత్పత్తులు ప్రారంభించాయి. వాటిలో ముఖ్యమైనవి... లావజ్జా, అవంతి సీడ్స్‌, పతంజలి, జైన్‌ ఇరిగేషన్‌, పార్లే, జెర్సీ, ఇండస్‌ కాఫీ, ఫ్యూచర్‌ గ్రూప్‌, కాంటినెంటల్‌ కాఫీ, ఇంటర్నేషనల్‌ ఫ్లేవర్స్‌ అండ్‌ ఫ్రాగ్రెన్సెన్‌, గోద్రెజ్‌, ఎస్‌హెచ్‌ గ్రూప్‌, టాటా ఫుడ్స్‌, ఐటీసీ, కాన్‌ ఆగ్రో, మన్‌పసంద్‌.
 
ఐటీ, ఎలక్ర్టానిక్స్‌: రాష్ట్ర విభజన తర్వాత 376 లీడ్‌లను ట్రాక్‌ చేశారు. కాండ్యునెంటల్‌, పైడేటా, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, విప్రో, మిరాకిల్‌ సాప్ట్‌ స్క్వేర్‌, ఫాక్స్‌కాన్‌, షామీ, జియోనీ, వన్‌ ప్లస్‌, ల్యూమినా, ఆసూస్‌, ఇన్‌ ఫోకస్‌ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌, డిక్సన్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఎల్‌ఈడీ టీవీలు తయారు చేస్తున్నాయి. టీసీఎల్‌కు శంకుస్థాపన జరిగింది. రిలయన్స్‌, వోల్టాస్‌ త్వరలో రానున్నాయి.
 
ఫార్మా: హొస్పిరా హెల్త్‌కేర్‌, రెడ్డి ల్యాబ్స్‌, లుపిన్‌, లారస్‌ ల్యాబ్స్‌, అరబిందో ఫార్మా, వెస్ట్‌ ఫార్మా, దివీస్‌ ల్యాబ్య్‌. నాట్కో.
 
టెక్స్‌టైల్స్‌: టోరే, టెక్స్‌పోర్ట్‌, మోహన్‌ స్పింటెక్స్‌, ఇండియన్‌ డిజైన్‌, షాహి ఎక్స్‌పోర్ట్స్‌, శ్రీగోవిందరాజా టెక్స్‌టైల్స్‌, ఎస్‌ఏఆర్‌ డెనిమ్‌, పేజ్‌ ఇండస్ర్టీ్‌స(జాకీ), అరవింగ్‌ గ్రూప్‌, నిషా డిజైన్స్‌, గుంటూరు టెక్స్‌టైల్‌ పార్క్‌, తారకేశ్వర టెక్స్‌టైల్‌ పార్క్‌లు.
 
పర్యాటకం: విజయవాడలో నోవాటెల్‌, తిరుపతిలో తాజ్‌ గేట్‌వే, హాలిడే ఇన్‌, గుంటూరులో ఐటీసీ మై ఫార్చ్యూన్‌, విశాఖపట్నంలో జేడబ్ల్యూ మారియట్‌ హోటళ్లు ప్రారంభమయ్యాయి, సన్‌ రే రిసార్ట్స్‌ వచ్చింది.
 
ఇవీ విశేషాలు...
 
  • మొత్తం 15.45 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 2622 భారీ, మెగా ప్రాజెక్టుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 210 ప్రాజెక్టులు రూ.1.77 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ సంస్థల్లో 2.51 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయి. మొత్తం అన్ని ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే .. 32.35 లక్ష మందికి ఉద్యోగాలొస్తాయి.
  • ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద 3.3 లక్షల మంది యువతీ యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి డిసెంబరు 25వ తేదీ వరకూ 81 కోట్ల అలవెన్సుల రూపంలో యువతకు అందింది.
  • రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం అందిస్తూ.. 2018-20 ఐటీ విధానాన్ని ప్రకటించారు. దీంతోపాటు... స్టార్టప్‌ విధానం, గ్లోబల్‌ ఇన్‌ హౌస్‌ కేంద్రాల పాలసీ, సమీకృత సృజనాత్మక సాంకేతిక విధానం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్లౌడ్‌ విధానం, యానిమేషన్‌ గేమింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్‌ కామిక్‌ పాలసీలను ప్రకటించారు.
  • రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ)ని ఏర్పాటు చేసింది. వ్యాపార సంస్కరణలు, సాంకేతికతలను ప్రోత్సహించే చర్యలను ఏపీఈడీబీ చేపడుతోంది.
  • రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు గ్యారెంటీగా అందేలా పాలసీనీ తీసుకొచ్చింది. వ్యాపారాభివృద్ధి సంస్కరణలూ తీసుకొచ్చింది. చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌, పారిశ్రామిక పార్కులు, క్లస్టర్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...