Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply


ఐదేళ్ల పరిమితి.. 20 లక్షల మందికి ఉపాధి 
మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు 
పెట్టుబడులు పెట్టే వారందరికీ వెంటనే అనుమతులు 
పారిశ్రామిక, సేవల రంగంపై ప్రధానంగా దృష్టి 
ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
విశాఖ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: ‘వచ్చే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పెట్టుబడులు పెట్టే వారందరికీ వెంటనే అనుమతులిచ్చేలా అన్ని ఏర్పాట్లూ చేశాం. ఎలాంటి సమస్య ఉన్నా ఏ సమయంలోనైనా ఫోన్‌ చేసి చెబితే వెంటనే పరిష్కరిస్తాం. భూములు, విద్యుత్తు, నీరు, మౌలిక సదుపాయాల కల్పనలో ఎంతో ముందున్నాం. గత మూడున్నరేళ్లలో చేసుకున్న 1946 అవగాహన ఒప్పందాల విలువ రూ.13.54 లక్షల కోట్లు. ఇవి సాకారమైతే 31 లక్షల ఉద్యోగాలు వస్తాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ కేంద్రంగా వరుసగా మూడోసారి నిర్వహించిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలు సాధించి ఇప్పుడు పారిశ్రామిక, సేవల రంగాలపై దృష్టి పెడుతున్నామని, కేంద్రం సాయంతో విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లను తీసుకొస్తున్నామని, కోస్టల్‌ ఎంప్లాయిమెంట్‌ జోన్‌ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పరిశ్రమలు పెట్టే వారందరికీ 21 రోజుల్లో అనుమతులిస్తామన్నారు. సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలంతా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక్కో ఒప్పందమైనా చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏటా ఇదే ప్రాంతంలో భాగస్వామ్య సదస్సు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దేశంలో ఇప్పటివరకు 23 సదస్సులు నిర్వహిస్తే వీటిలో ఉమ్మడి రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని, ఏటా 60 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని చంద్రబాబు వివరించారు. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ ప్రోసెసింగ్‌, పర్యాటకం, ఏరోస్పేస్‌, జౌళి, పునరుద్పాదక ఇంధనం, వైద్య పరికరాల తయారీ రంగాల్లో అవగాహన ఒప్పందాలు చేసుకుంటామని అన్నారు. 
కొత్త ఆవిష్కరణల్లో ముందంజ 
ఫైబర్‌ గ్రిడ్‌తో ప్రతి ఇంటికీ నెలకు రూ.149 ధరకే 50 ఎంబీపీఎస్‌ డేటాను సమకూర్చి కేబుల్‌ ప్రసారాలు, టెలిఫోన్‌, అంతర్జాలం సదుపాయాన్ని కల్పిస్తున్నామని, 1.50 లక్షల కుటుంబాలు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకునే సదుపాయాన్ని అందించామని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వెళ్లకుండా సేవలందుకునేలా ఈ-ప్రగతి ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, ఇతర కార్యక్రమాల కోసం డ్రోన్‌, నిఘా కెమెరాలు, క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను అమలు చేస్తున్నామని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రియల్‌ టైం గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టామని, ఆధునిక, సాంకేతికతను ప్రభుత్వ పాలనలో అనుసంధానించడంలో ముందున్నామని పేర్కొన్నారు. ప్రజలందరి సహకారంతోనే 15-16లో 10.95 శాతంగా ఉన్న రాష్ట్ర జీడీపీని 2017-18 అర్ధ సంవత్సరానికి 11.37 శాతానికి తీసుకొచ్చామని, నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా సౌరవిద్యుత్తు ఉత్పత్తి, వినియోగాన్ని రాష్ట్రంలో పెంచేలా సంస్కరణలు అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ సూర్యుడేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చంద్రబాబునాయుడు అన్నారు.

Link to comment
Share on other sites

వాహన రంగంలో రూ.14,124 కోట్లు 
47,368 మందికి ఉపాధి 
ఈనాడు - విశాఖపట్నం 

రాష్ట్రంలో వాహన రంగం గణనీయంగా అభివృద్ధి చెందే దిశగా కీలక అడుగు పడింది. శనివారం విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒక్క వాహన రంగంలోనే రూ.14,124 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అన్ని సంస్థల్లో కలిపి 47,368 మందికి ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్ర పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి(ఏపీఈడీబీ) అధికారులు ఆయా పెట్టుబడులు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. వాహన రంగంపై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చర్చా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈడీబీ సీఈవో కృష్ణకిశోర్‌, పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
వాహన రంగానికి చోదక శక్తిగా ఆంధ్రప్రదేశ్‌ 
భారత వాహన  రంగానికి ఆంధ్రప్రదేశ్‌ చోదకశక్తిగా ఆవిర్భవించేలా వాహన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్నాయని ఆ రంగ నిపుణుడు విష్ణుమాథుర్‌ పేర్కొన్నారు. ‘ప్రపంచ మార్కెట్‌కు భావితరం వాహనాల తయారీ లక్ష్యం దిశగా ప్రస్థానం’ పేరుతో నిర్వహించిన చర్చా కార్యక్రమానికి ఆయన సంధానకర్తగా వ్యవహరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు గుజరాత్‌ కేంద్రంగా ఉన్న వాహన రంగం తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడే దిశగా ప్రయాణిస్తోందని చెప్పారు. భారత్‌-బంగ్లాదేశ్‌ ఆటోమొబైల్‌ సంఘ ప్రతినిధి అబ్దుల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌ ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజల వాహన అవసరాల్ని తీర్చడానికి తక్కువ ధరల్లో వాహనాల్ని విక్రయిస్తుండటంతో 95 శాతం బంగ్లాదేశ్‌ వాహన మార్కెట్‌ భారతీయ సంస్థల చేతుల్లోనే ఉందని వివరించారు. కియా మోటార్స్‌ ప్రతినిధి భట్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఐదో అతిపెద్ద వాహన మార్కెట్‌గా ఉన్న భారత్‌లో వాహన అవసరాల్ని తీర్చడం, ఇక్కడి నుంచి విదేశాలకు కార్లను ఎగుమతి లక్ష్యంగా కియా మోటార్స్‌ను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆటోమొబైల్‌ సంఘం జాతీయ ప్రతినిధి మిండా మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఎక్కువగా విక్రయమయ్యే అవకాశాలున్నందున వాటికి అవసరమైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వోల్వో సంస్థ ప్రతినిధి సురేశ్‌ చెట్టియార్‌ మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి వోల్వో సంస్థ బస్సులు, ఇతర వాహనాలను తయారుచేస్తోందన్నారు.
 

Link to comment
Share on other sites

చిత్తూరులో అరవింద్
05-03-2018 02:53:24

రూ.300కోట్ల పెట్టుబడితో వస్త్ర పరిశ్రమ
125 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
15వేల మందికి ఉపాధి అవకాశాలు
సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ
వస్త్ర పరిశ్రమకు ఏపీ అనుకూలం: ఈడీ కులిన్‌
అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో మరో ప్రతిష్ఠాత్మక పరిశ్రమ ఏర్పాటు కానుంది. వస్త్ర రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న అరవింద్‌ లిమిటెడ్‌ను చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆదివారం ఏపీ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు(ఏపీఈడీబీ) సీఈవో జె. కృష్ణకిశోర్‌, అరవింద్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కులిన్‌ లాల్‌భాయ్‌ ఒప్పంద పత్రాలపై
సంతకాలు చేశారు. వెనుక బడిన రాయలసీమలో అటు చెన్నై, ఇటు బెంగళూరుకు రవాణాపరంగా అనుకూలమైన చిత్తూరు జిల్లాలో ఈ పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం 125 ఎకరాలు కేటాయించింది. డెనిమ్‌ వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న ఈ సంస్థ మొదటి దశలో ఇక్కడ రూ.300కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో ఈ ప్రాంతంలో 15వేల మందికి ఉపాధి లభిస్తుంది. అందులో 80శాతం మహిళలకేనని, మొదటి దశలో 5వేల మంది స్కిల్డ్‌ వర్కర్లకు ఉద్యోగాలు వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఏపీఈడీబీ సీఈవో కృష్ణకిశోర్‌ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్న ప్లాంటులో ఉత్పత్తయ్యే వస్త్రాన్ని దక్షిణాసియా దేశాలకు అరవింద్‌ యాజమాన్యం ఎగుమతి చేస్తుందని వెల్లడించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పునిత్‌ లాల్‌భాయ్‌, కులిన్‌ లాల్‌భాయ్‌ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం చూసి తమ పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు వెల్లడించారు. విజనరీ లీడర్‌షి్‌పతో సీఎం చంద్రబాబు పారిశ్రామిక రంగానికి అద్భుతమైన సహకారం అందిస్తున్నారని కొనియాడారు. ఇదే వేగంతో ముందుకెళితే అనతికాలంలోనే రాష్ట్రం ఊహించని ఆర్థిక ప్రగతి సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రగతితోపాటు మహిళల ఆర్థిక ఎదుగుదలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకొంటూ, పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్య మానవ వనరులను అందిస్తూ మరోవైపు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు ముమ్మరం చేశారని వివరించారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ఏపీలో అన్ని అనుకూలతలు ఉన్నాయని, అరవింద్‌ పరిశ్రమను రాష్ట్రంలో మరింత విస్తరించి, మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వారు వివరించారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

A #MoU was signed between @JKRISHNAKISHORE, CEO, @AP_EDB & Sri Sanjay Lalbhai, Managing Director, @ArvindMills, in the presence of @AndhraPradeshCM @ncbn. #AndhraPradesh #ArvindMills #APEDB

DXgCqcyVAAEjrjd.jpg

 

ARVIND TEXTILES LTD comes to AP ! Signs an MOU WITH APDEB.

Arvind Ltd, a flagship company of Lalbhabhai Group will establish a state-of-the-art integrated apparel and textile facility in Chittoor, Andhra Pradesh, in multiple phases across 100 - 125 acres with a capacity to produce 24 million pieces of shirts, jeans per annum.

Arvind Ltd is India's largest denim manufacturer apart from being world’s fourth-largest producer and exporter of denim.

This facility will see an initial investment of INR 250 - 300crores in Chittoor, Andhra Pradesh and will create an employment to around 10,000 employees in the first phase. Arvind Ltd will skill over 5000 workers in garmenting.

The Unit will have 80 % women employees who will be provided with accommodation, training, skill development and education.

Link to comment
Share on other sites

ఏపీలో 2.64 లక్షల మందికి ఉపాధి 

05 Mar 18, 04:14 PM 

న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల రాకతో ఏపీలో ఇప్పటి వరకు 2,64,754 మందికి ఉపాధి లభించిందని కేంద్రం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా వెల్లడించింది. గడచిన నాలుగేళ్లలో ఏపీలో ఎన్ని ఒప్పందాలు జరిగాయి, వాటివల్ల ఎంత పెట్టుబడి రాబోతుంది, ఉపాధి, ప్రస్తుతం పనిచేసేందుకు సిద్ధమైన కెంపెనీలు ఎన్ని అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సీఆర్‌ చౌదరి సమాధానం ఇచ్చారు. నాలుగేళ్లల్లో మొత్తం 2680 ఎంవోయూలు కుదిరాయని, రూ.17,80,891 కోట్లు మేర పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 41,99,357 మందికి ఉపాధి లభించనుందని వివరించారు.
Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌లో వికాట్‌ గ్రూప్‌ సిమెంట్‌ ప్లాంట్‌
14-03-2018 00:45:21
 
  •  రూ.510 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం వద్ద 510 కోట్ల రూపాయల పెట్టుబడితో సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ నెలకొల్పుతున్నట్లు ఫ్రెంచ్‌ సిమెంట్‌ దిగ్గజం వికాట్‌ గ్రూప్‌ వెల్లడించింది. కలబుర్గి సిమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న వికాట్‌ గ్రూప్‌ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఎపిఇడిబి)తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఢిలీల్లో జరిగిన ఇండో-ఫ్రెంచ్‌ ఎకనామిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ సమావేశంలో ఈ అవగాహనా ఒప్పందం సంతకాలు చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. భారతీయ భాగస్వామి వికాట్‌ సాగర్‌ సిమెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో 2008లో వికాట్‌ గ్రూప్‌ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2014లో ఈ జాయింట్‌ వెంచర్‌ నుంచి సాగర్‌ సిమెంట్‌ తప్పుకోవటంతో వికాట్‌కు వంద శాతం యాజమాన్య హక్కులు లభించాయి. దీంతో కంపెనీ పేరును కలబుర్గి సిమెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మార్చింది.
ప్రస్తుతం కర్ణాటకలోని కలబుర్గి వద్ద కంపెనీ ఏటా 27.5 లక్షల టన్నుల సామర్థ్యం గల సిమెంట్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. కాగా భారత్‌లో 1,735 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు వికాట్‌ గ్రూప్‌ తెలిపింది.
Link to comment
Share on other sites

పబ్లిక్‌ ఇష్యూకు నెక్కంటి సీ ఫుడ్స్‌
14-03-2018 00:10:20
 
636565830219165482.jpg
  • రూ.750 కోట్ల సమీకరణకు సన్నాహాలు
  • జూలై నాటికి నెల్లూరు ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ రెడీ
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నెక్కంటి సీ ఫుడ్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపిఒ)కు వస్తోంది. ఇష్యూకు సంబంధించి మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబికి డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డిఆర్‌హెచ్‌పి) దాఖలు చేసింది. ఈ ఇష్యూ ద్వారా 250 కోట్ల రూపాయలకు కొత్త షేర్లను జారీ చేయనుండగా 80 లక్షల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు సెకండరీ మార్కెట్‌ ద్వారా విక్రయించనున్నారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 700-750 కోట్ల రూపాయలు సమీకరించాలని నెక్కంటి ఫుడ్స్‌ భావిస్తోంది.
కాగా ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంధ్య మెరైన్స్‌ లిమిటెడ్‌, దేవి సీఫుడ్స్‌.. పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకుగాను సెబికి ముసాయిదా పత్రాలు సమర్పించాయి. మరోవైపు విశాఖపట్నం కేంద్రంగా ఉన్న దేవి ఫిషరీస్‌ కూడా ఐపిఒకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
 
తొమ్మిది నెలల్లో రూ.1,100 కోట్ల టర్నోవర్‌...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి గాను నెక్కంటి ఫుడ్స్‌ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 1,074.76 కోట్ల రూపాయల రాబడిపై 116.96 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 830.2 కోట్ల రూపాయల రాబడిపై 55.21 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. కాగా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించనున్న మొత్తాల్లో 185 కోట్ల రూపాయలను మూలధన అవసరాలతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం నెక్కంటి ఫుడ్స్‌ వినియోగించనుంది. 1983లో ఏర్పాటైన నెక్కంటి సీ ఫుడ్స్‌.. 1985లో కాకినాడలో సీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాన్ని లీజుకు తీసుకోవటం ద్వారా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. 1989లో విశాఖపట్నంలో సొంతంగా ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నెక్కంటి.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాసెసింగ్‌ ప్లాంట్లను నిర్వహిస్తోంది. కొత్తగా నెల్లూరు జిల్లాలో ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.ఈ ప్లాంట్‌ జూలై నాటికి అందుబాటులోకి రానుంది.
Link to comment
Share on other sites

చంద్రబాబును కలిసిన వికాట్‌ సిఇఒ సిడాస్‌
18-03-2018 03:07:02
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): ఫ్రాన్స్‌కు చెందిన వికాట్‌ సిమెంట్‌ కంపెనీ సిఇఒ గై సిడాస్‌ శనివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ జనరల్‌ ప్రంక్వోయిస్‌ గౌటీయర్‌ కూడా ఉన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఏటా 17.5 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో సిమెంట్‌ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు వికాట్‌ సంస్థ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఒయు కుదుర్చుకుంది. కాల్బర్గీ ఓవర్సేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.510 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 200 ఎకరాల భూమి కేటాయించింది. ఈ ప్లాంట్‌ పూర్తయితే 275 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
Link to comment
Share on other sites

రూ. 1646 కోట్లు.. 22 పరిశ్రమలు..!
24-03-2018 08:58:40
 
636574787198676749.jpg
  • జిల్లా పరిశ్రమల కేంద్రానికి అందిన విశాఖ సదస్సు ఒప్పందాలు
  • రాజధాని మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో 12,545 మందికి ఉపాధి
  • త్వరలో పారిశ్రామికవేత్తలతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం
 
గుంటూరు: రాజధాని అమరావతిని మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలను జిల్లా కలెక్టర్‌, పరిశ్రమల కేంద్రం (డీఐసీ) ద్వారా పర్యవేక్షిస్తారు. గుం టూరులోని జిల్లా పరిశ్రమల కేంద్రానికి అందిన జాబితా ప్రకారం ఆయా పారిశ్రామికవేత్తలతో ప్రత్యే క సమావేశం ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వపరంగా మౌలి కవసతులు కల్పిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు.
 
ఒప్పందం చేసుకున్న సంస్థలు ఇవే...
  • గాయం మోటార్‌ వర్క్స్‌ సంస్థ రూ.195 కోట్లతో ఎలక్ర్టికల్‌ వాహనాల తయారీసంస్థను ఏర్పాటుచేసి 500 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.
  • డీవీఆర్‌ అగ్రి అనే సంస్థ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విభాగంలో ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌పార్కును రూ. 45కోట్లతో ఏర్పాటుచేసి రూ. 1,500 మందికి ఉపాధి చూపిస్తామని తెలిపారు.
  • గోదావరి ఫామ్‌ కెమికల్‌ పరిశ్రమల సంస్థ ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో రూ. 2కోట్లతో పరిశ్రమలను స్థాపించి 20 మందికి ఉపాధి కల్పిస్తామని అంగీకారపత్రం ఇచ్చారు.
  • మార్వెల్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ రూ. 7 కోట్లతో చెరకులో వ్యర్థపదార్థాల ద్వారా డిస్పోజల్‌ ప్లేట్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుచేసి 50 మం దికి ఉపాధి కల్పిస్తామని ముందుకువచ్చింది.
  • మూల్పూరి ఆక్వా ప్రాసెస్‌ అనే సంస్థ ఫిష్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను రూ. 21 కోట్లతో ఏర్పాటుచేసి వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వంతో అంగీకారానికి వచ్చారు.
  • పద్మనాభ ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌హౌస్‌, సోలార్‌ డిహైడ్రేటర్‌ అనే కంపెనీ కూరగాయల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను రూ.2 కోట్లతో ఏర్పాటుచేసి 25 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలిపింది.
  • ఆర్‌ఆర్‌ అగ్రో ఇండస్ర్టీస్‌ అనే సంస్థ మొక్కజొన్న ప్రాసెసింగ్‌ యూనిట్‌ను రూ.కోటితో ఏర్పాటుచేసి 40 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
  • సాయినవజ్యోతి ఎంటర్‌ప్రైజస్‌ అనే సంస్థ సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను రూ. 3కోట్లతో ఏర్పాటు చేసి 60మందికి ఉద్యోగాలు ఇస్తామని పేర్కొంది. సింధూరి అగ్రోస్‌ ఇండస్ర్టీస్‌ అనే సంస్థ అరటి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను రూ. 5కోట్లతో ఏర్పాటు చేసి 50 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
  • శ్రీలక్ష్మి డ్రైఫుడ్స్‌ అనే సంస్థ పాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను రూ.కోటితో ఏర్పాటుచేసి 40 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.
  • శ్రీలక్ష్మీ డెయిరీ ప్రొడక్ట్స్‌ అనే సంస్థ పాల ఉత్పత్తులను రూ. 2కోట్లతో ఏర్పాటుచేసి 30 మందికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది.
  • తేజ అగ్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థ సుగంధ ద్రవ్యాల పౌడర్‌ తయారుచేసే యూనిట్‌ను రూ. కోటితో ఏర్పాటుచేసి 10మందికి ఉద్యోగాలు ఇస్తా మని ప్రభుత్వంతో అంగీకారపత్రం తీసుకుంది.
  • ట్రుప్ట్‌ ఫుడ్‌ పార్క్‌ను మెగా ఫుడ్‌పార్క్‌ అనే సంస్థ రూ. 127కోట్లతో ఏర్పాటు చేసి 3 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వంతో అంగీకారం కుదుర్చుకుంది. జిల్లాలో ఈ సంస్థ మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటుచేస్తున్నారు.
  • వరణ్‌ స్పైసెస్‌ అనే సంస్థ సుగంధ ద్రవ్యాల ప్రా సెసింగ్‌ యూనిట్‌ను రూ. కోటితో ఏర్పాటు చేసి 10మందికి ఉద్యోగాలు ఇస్తామని ముందుకువచ్చింది.
  • విఎన్‌ర్‌ ష్రింప్‌ ఎగుమతుల సంస్థ రూ. 75 కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసి 3వేల మందికి ఉపాది కల్పిస్తామని ప్రభుత్వంతో అంగీకారం కుదుర్చుకుంది.
  • జ్యోతిర్మయి టెక్స్‌టైల్‌ అనే సంస్థ రూ. 590 కో ట్లతో టెక్స్‌టైల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది.
  • ఎన్‌ఎస్‌ఎల్‌ టెక్స్‌టైల్‌ అనే సంస్థరూ. 200 కోట్లతో 650 మందికి ఉపాధి కల్పించడానికి ఫ్యా బ్రిక్‌ తయారీ, ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
  • సూర్య స్పిన్నింగ్‌ మిల్స్‌ అనే సంస్థ రూ. 120కోట్లతో 400 మందికి ఉపాధి కల్పించే వివింగ్‌ ఇతర ఉత్పత్తులను తయారుచేసే సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో అంగీకారం కుదుర్చుకుంది.
  • ఎల్‌పీఎల్‌ అనే సంస్థ ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ అనే సంస్థను ఐటి ఇన్‌ఫ్రాలో ఏర్పాటుచేసి రూ. 200 కోట్లతో 1,500 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా తెలిపింది.
  • సీకే కన్వెన్షన్‌ అనే సంస్థ టూరిజంలో ఎంఐ సీఈని ఏర్పాటు చేసి రూ. 40 కోట్లతో 550 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
  • కాందారి హోటల్స్‌ అనే సంస్థ టూరిజంలో రూ. 3 కోట్లతో 50 మందికి ఉపాధి కల్పించే విధంగ వేసై డ్‌ ఎమెనిటి అనే యూనిట్‌ను ఏర్పాటుచేస్తుంది.
  • మార్‌ సెలబ్రేషన్స్‌ అడ్వంటుర అనే సంస్థ టూరిజంలో రిసార్డ్స్‌ ఏర్పాటు చేయడానికి రూ. 5కోట్లతో 60మందికి ఉపాధి కల్పించేవిధంగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌ టైన్‌మెంట్‌ పార్కును ఏర్పాటు చేస్తామని సంస్థ యజమానులు చెబుతున్నారు.
 
 
12,545 మందికి ఉద్యోగాలు
జిల్లాలో విశాఖ పారిశ్రామిక సదస్సులో వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించింది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని మినహాయించి, జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటుచేసే యూనిట్‌ల వివరాలను పరిశ్రమల కేంద్రానికి పంపారు. టూరిజం, ఫుడ్‌ప్రాసెసింగ్‌, టైక్స్‌టైల్‌, ఐటీ, ఆటోమొబైల్‌ రంగంలో 22 యూనిట్‌లను రూ. 1,646 కోట్లతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఆ సంస్థల యజమానులు అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ సంస్థల్లో 12,545 మందికి ఉపాధి కల్పిస్తామని యజమానులు లిఖితపూర్వకంగా తెలిపారు.
- వై.అజయ్‌కుమార్‌, జీఎం, పరిశ్రమల కేంద్రం
Link to comment
Share on other sites

ఏపీలో అశోక్‌ లేలాండ్‌
31-03-2018 02:57:17
 
  • నేడు మల్లవల్లిలో భూమిపూజ..
  • రెండు దశల్లో 135కోట్ల పెట్టుబడి
అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఆటోమొబైల్‌ హబ్‌గా రూపుదిద్దుకునే దిశగా నవ్యాంధ్ర వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో దిగ్గజ సంస్థలైన ఇసుజు, కియ, హీరో వంటివి రాష్ట్రంలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు భారీ వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ కూడా చేరనుంది. రాజధాని నగరం అమరావతికి సమీపంలోని మీర్జాపురంలోని మల్లవల్లి పారిశ్రామిక పార్కులో ఈ సంస్థ ప్లాంటు ఏర్పాటుకు శనివారం భూమిపూజ జరుగనుంది.
 
తొలిదశలో రూ.90కోట్లతో స్థాపించే ప్లాంటులో ప్రతిఏటా 2,400 వాహనాలను ఉత్పత్తి చేస్తారు. 12 నుంచి 14 నెలల్లో నిర్మించే ఈ ప్లాంటులో 1,065 మందికి ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా రూ.45కోట్లతో చేపట్టే రెండోదశ ప్లాంటులోనూ ఏటా 2,400 వాహనాలు తయారు చేస్తారు. దీనిలో 1,230మందికి ఉద్యోగాలు లభిస్తాయి. భూమిపూజ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కె. దాసరి తదితరులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా, ఆటోమొబైల్‌ రంగంలో మరో మెగా సంస్థ భారత్‌ ఫోర్జ్‌ కూడా రాష్ట్రంలో రూ.1,400కోట్లతో క్లస్టర్‌ను ఏర్పాటు చేయనుంది. త్వరలోనే భూమిపూజను చేపట్టేందుకు భారత్‌ ఫోర్జ్‌ యాజమాన్యం సన్నద్ధమవుతోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...