Jump to content

CBN promoted list of AP industries

LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

టమోటా ఉపఉత్పత్తుల పరిశ్రమ 
చిత్తూరులో ఏర్పాటుకు ముందుకొచ్చిన మహారాష్ట్ర అంకుర సంస్థ 
కుదిరిన ఒప్పందం 
ఈనాడు - అమరావతి 
23ap-main17a.jpg

టమోటా పండించే రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి. నాటు టమోటా నుంచి ఉప ఉత్పత్తులు తయారు చేసేందుకు మహారాష్ట్రకు చెందిన అంకురసంస్థ కృషి స్టార్‌ ఆసక్తి కనబరచింది. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు ఈ సంస్థ ప్రతినిధులు చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన నిధులతో ప్రభుత్వపరంగా చేయూత అందించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ధరల్లో హెచ్చుతగ్గులు 
రాష్ట్రంలో 56 వేల హెక్టార్లలో టమోటా సాగు చేస్తున్నారు. ఏటా 26.13లక్షల టన్నుల పంట ద్వారా రూ.2వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. పంట ఎక్కువొచ్చినప్పుడు ధర అమాంతం పడిపోవడం ఏటా జరిగే తంతే. కిలో రూ.50 ఉన్నది కాస్తా వారంలోనే రూ.2 నుంచి 5 అవుతుంది. ఒక్కో సమయంలో కిలో రూ.0.50 చొప్పున కూడా కొనడం లేదు. పారబోసి పోవాల్సి వస్తోంది. నిల్వ అవకాశాల్లేక 30 శాతం పంట వృథా అవుతోంది.

ఉప ఉత్పత్తులతో సమస్యకు పరిష్కారం.. 
* ఆంధ్రప్రదేశ్‌లో సాగయ్యే పంటలో 85 శాతం నాటు రకాలే. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవనే కారణంతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. హైబ్రిడ్‌ రకాలైతే నిల్వకు వీలుంటుంది. దీని నుంచి ఉప ఉత్పత్తులు కూడా తయారు చేసేందుకు వీలుంటుంది. టమోటా రైతులను నష్టాల నుంచి గట్టెక్కించాలంటే ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయడమే మార్గంగా ప్రభుత్వం గుర్తించింది.

* మహారాష్ట్రకు చెందిన కృషిస్టార్‌ అక్కడ రైతులు, ఉత్పత్తి సంఘాల నుంచి టమోటాలు సేకరించి ఉప ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్‌కు సరఫరా చేస్తోంది. ఇందులో నాణ్యమైన టమోటా నేరుగా ముంబయి, వివిధ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఇళ్లకు ఫోన్‌కాల్‌ ద్వారా చేరవేస్తోంది. టమోటా ఎండపెట్టడం (డ్రై టమోటా), పొడి, గుజ్జు, తదితర ఉత్పత్తులు తయారు చేస్తోంది.

కుదిరిన ఒప్పందం.. 
* సంస్థ పని తీరు, అక్కడి రైతులకు కలుగుతున్న లబ్ధిని పరిశీలించిన అధికారులు రాష్ట్రంలోనూ అడుగు పెట్టాలని ఆహ్వానించారు. వారి సూచన మేరకు రాష్ట్రంలో సాగయ్యే నాటు రకం టమోటాలు 50 కిలోలు పంపి ప్రయోగాత్మకంగా పంపి పరీక్షలు చేయించారు. ఇందులో నిల్వకు ఎలాంటి ఢోకా లేదని తేలడంతో   కృషిస్టార్‌ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌ రైతుల నుంచి టమోటా తీసుకునేందుకు ప్రాథమికంగా అంగీకరించింది. ఈ క్రమంలోనే విశాఖపట్నం అగ్రిటెక్‌ సదస్సులో చర్చలు జరిగాయి. అనంతరం ప్రభుత్వం, సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది.

* టమోటా సాగులో యాజమాన్య పద్ధతుల పరిశీలనకు సంస్థ ప్రతినిధి బృందం బుధవారం చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో పర్యటించింది. రైతులతో మాట్లాడి సాగు విధానాలు, పురుగుమందుల పిచికారి తదితర వివరాలు తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఆహారశుద్ధి పరిశ్రమ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వై.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీపై లోకేష్ సమీక్ష
27-12-2017 21:27:35
 
636500068563363081.jpg
అమరావతి: సచివాలయంలో ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్ పోర్ట్, పరిశ్రమలు, ఆర్టీసీ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2017-2020పై చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల నుండి విడి భాగాల తయారీ వరకూ పూర్తిస్థాయి ఎకో సిస్టం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చే విధంగా పాలసీ రూపకల్పన చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్‌లు ఏర్పాటు చేసే విధంగా పాలసీ ఉండాలన్నారు. 60 వేల ఉద్యోగాలు, 30 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పాలసీ తీసుకురావాలని సూచించారు. విశాఖలో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే వారికి రాయితీ కల్పించేలా పాలసీ ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా 100 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Link to comment
Share on other sites

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ప్రత్యేక విధానం: లోకేష్‌
ఈనాడు, అమరావతి: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రోత్సహించేలా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి లోకేష్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులతో మాట్లాడారు. వచ్చే మూడేళ్లలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి సంబంధించిన విధానం రూపొందించాలన్నారు.  60 వేల మందికి ఉపాధి లభించాలన్నారు. విశాఖలో ఈ వాహనాల తయారీ పైలెట్‌ ప్రాజెక్టు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. రూ.200 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే ఎలక్ట్రిక్‌ వాహనాల మెగా ప్రాజెక్టుగా, రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్లు పెడితే మొబిలిటీ పార్కుగా ప్రభుత్వం గుర్తిస్తుందని వివరించారు.

Link to comment
Share on other sites

Apollo Tyres firmed up plans to invest Rs 525 crore in a greenfield facility in Andhra Pradesh, construction work to commence in January 2018. Land allocated in Chittoor district,Incentives provided.

Link to comment
Share on other sites

Gurugram-based Apollo Tyres, which recently raised Rs 1,500 crore through a QIP (Qualified Institutional Placement), is looking to partially deploy the resources to develop a new greenfield facility in Andhra Pradesh. A part of the amount will also be used to double capacity at its facility in Chennai, as the company seeks to consolidate its leadership position in the truck bus radials and the passenger cars tyres segment in the local market. 

Apollo Tyres vice-chairman Neeraj Kanwar told ET that with capacity expansion cycle drawing to a close, the focus will be on expanding operations in India and Europe through the organic route, "The company is built through organic and inorganic routes. But everything's organic in the next plan. Both capital and human resources are today occupied in getting Hungary up, Chennai up and in developing the Andhra facilty. It is very critical not to vacate our leadership position in India." 

Currently, Apollo Tyres registers almost 60% of its revenue from sales in the domestic market. Though the company plans to expand its footprint in Europe and North America, Kanwar said that going forward, revenue mix would continue to be skewed in favour of India. 

"India is our dominant home market... Our India vision is very clear, by 2020, we want to be number one in the product categories that we operate in. In Europe, we want to be a premium tyre company, be it in terms of products, pricing, our brand or the service levels we offer to customers, all have to be premium." 

Apollo Tyres has, in fact, firmed up plans to invest Rs 525 crore in a greenfield facility in Andhra Pradesh, construction work of which is expected to commence in January 2018. In the first phase, the facility will roll out 5.5 million passenger car tyres. Eventually, the unit will also go on to manufacture truck and off-highway tyres. 

In Hungary, where a facility of similar scale was commissioned earlier this year, the plan is to ramp up production to 8,000 tyres a day by March 2018, and to 16,000 tyres a day by September. The company, which largely catered to requirements in the European replacement market, has firmed up alliances and is set to supply tyres to vehicle manufacturers next year. 

Overall, Kanwar said while raw material prices put pressure on tyre manufacturers in the first half of the year, improved volumes October onwards should improve EBITDA margins in the second half.Imposition of anti-dumping duty by the government here has helped curb Chinese imports, and been a positive for manufacturing firms in the domestic industry. But challenges remain. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
2 minutes ago, Jeevgorantla said:
503 Aparna Enterprises Limited East Godavari Adb Road Street, Peddapuram Village, Peddapuram Mandal, East Godavari District Glass & Ceramics Ceramic Tiles 10777 220 08-DEC-2015 7 16-DEC-2015 APPROVED SDDOF004150511 11-DEC-2015 - SDDOF004150511
 
from CORE DB

https://www.apindustries.gov.in/APIndus/CMDashBoard.aspx?deptid=28-0

 Date of Receipt by Dept.     08-DEC-2015

Approved Date 11-DEC-2015      (3 days for approval)

Permissible Date for Approval  16-DEC-2015

Link to comment
Share on other sites

రూ.10 లక్షల కోట్లు.. 21 అత్యంత ప్రభావిత ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధికి దోహదం
కలెక్టర్ల సదస్సులో వివరాలు విడుదల చేసిన రాష్ట్రం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే రూ.10లక్షల కోట్ల విలువైన 21 అత్యంత ప్రభావిత ప్రాజెక్టుల కోసం రాష్ట్రప్రభుత్వం సరికొత్త మేనేజ్‌మెంట్‌ నమూనాను రూపొందించింది. మొత్తం 8 విభాగాలకు సంబంధించిన 21 ప్రాజెక్టుల వివరాలను గురువారం కలెక్టర్ల సదస్సులో విడుదల చేసింది. అవి ఇలా ఉన్నాయి.

వాక్‌ టూ వర్క్‌, ప్లగ్‌ ఎండ్‌ ప్లే విధానంలో 11 ఆర్థిక నగరాల అభివృద్ధికి ప్రతిపాదనలు: జక్కంపూడి ఆర్థిక నగరం * హిందూపురం వస్త్ర నగరం * సినీ, వైద్య నగరం, విశాఖపట్నం * ఏవీజీసీ నగరం, విశాఖపట్నం * విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవాలలోని నోడ్‌లలో ఉత్పత్తుల ఆధారిత ఆర్థిక నగరాల అభివృద్ధి

ఏపీలో తయారీ ఉత్పత్తులు-500 కోసం ప్రతిపాదనలు: కళాకారుల కోసం అమరావతి బ్రాండ్‌ను ఆవిష్కరించడం

పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వడం: సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి

ఆధునిక సాంకేతికతలను ప్రొత్సహించడం: ఇంక్యూబేటర్లు, యాక్సిలేటర్ల సామర్థ్యం పెంపు * విశాఖపట్నంలో ఫిన్‌టెక్‌-ఫిన్‌టెక్‌ వ్యాలీ * ఐవోటీ, ఏఆర్‌/వీఆర్‌, ఏవీజీసీ, బ్లాక్‌చైన్‌, రోబోటిక్స్‌

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో కోల్డ్‌ చైన్‌-విలువ ఆధారిత ప్రాజెక్టులు: మార్కెట్‌ యార్డుల అధునికీకరణ * ఆహారశుద్ధి పరిశ్రమలను పెంచడం * కోల్డ్‌చైన్‌ సామర్థ్యం పెంపు * సూక్ష్మసేద్యం కింద సాగును పెంచడం

రిటైల్‌ రంగాన్ని ప్రోత్సహించడం: విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లో శిల్పారామాల్ని ఆధునికీకరించడం * రిటైల్‌ పార్కుల అభివృద్ధి * కిరాణా దుకాణాల మార్పు * రైతుబజార్ల ఆధునికీకరణ

ఆర్థికాభివృద్ధి కోసం సామర్థ్యాల పెంపు: ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటుకావాల్సిన కేంద్ర విద్యాసంస్థలు 13 స్థాపన (వీటిలో 11 ఉన్నత విద్యకు సంబంధించినవి)

పర్యాటకరంగ మౌలిక వసతుల పెంపు: పర్యాటకరంగ మౌలిక వసతుల కోసం సమీకృత అభివృద్ధి ప్రణాళిక తయారీ * ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఎం అండ్‌ ఈ.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...