Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

Andhra pradesh is 3rd in "Corporate Social Responsibility spending"

 

Even crying haters know why Andhra is 3rd...Just because CBN last 3 years not left any industrialist he met.

He asked everyone(Tata,Susha Murthy) what they can do in Education,Villages e.t.c

 

 

 

 

 

 

CSR-map-for-web-kiCC--414x621@LiveMint.j

Link to comment
Share on other sites

Cabinet cleared these investments today

 

Chittoor

 

1) Toray Industries India Private Limited, a technical textile manufacturing company, will be setting up a unit on 109.35 acres at Sri City in Chittoor district.
The firm will invest ₹970 crore and will provide direct employment to 130 people and indirect employment to 520 people.

 

2) Rockman Industries Limited will invest ₹652 crore to set up a unit in Chittoor district. The firm specialises in aluminium alloy wheels and die casting components for two and four- wheelers.

 

Vizag

 

1) An IT firm, Conduent Inc., will be investing ₹649 crore for their project in Visakhapatnam. The project includes diversified business process services and generates direct employment for 5,000 people.

 

2) Electronic manufacturing company, will set up an unit on 5 acres, for touch panel manufacturing, at Atchutapuram in Visakhapatnam district. Their investment amounts to ₹504.07 crore, and they commit to employ (direct) 300 people.

Link to comment
Share on other sites

Cabinet cleared these investments today

 

Chittoor

 

1) Toray Industries India Private Limited, a technical textile manufacturing company, will be setting up a unit on 109.35 acres at Sri City in Chittoor district.

The firm will invest ₹970 crore and will provide direct employment to 130 people and indirect employment to 520 people.

 

2) Rockman Industries Limited will invest ₹652 crore to set up a unit in Chittoor district. The firm specialises in aluminium alloy wheels and die casting components for two and four- wheelers.

 

Vizag

 

1) An IT firm, Conduent Inc., will be investing ₹649 crore for their project in Visakhapatnam. The project includes diversified business process services and generates direct employment for 5,000 people.

 

2) Electronic manufacturing company, will set up an unit on 5 acres, for touch panel manufacturing, at Atchutapuram in Visakhapatnam district. Their investment amounts to ₹504.07 crore, and they commit to employ (direct) 300 people.

Rock man is subsidiary of hero motors :thinking:

Link to comment
Share on other sites

5 భారీ పరిశ్రమలు!
 
 
636438942686257063.jpg
  • 3 వేల కోట్ల పెట్టుబడులు.. 14 వేల మందికి ఉపాధి
  • చిత్తూరులో టోరే, రాక్‌మ్యాన్‌
  • విశాఖలో కాండ్యూనెట్‌, గౌట్టే ఫోన్స్‌
  • ‘అనంత’కి రానున్న జాకీ అండ్‌ స్పీడో
  • ఎస్‌ఐపీబీ భేటీలో సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
  • నెల్లూరులో మహిళా పారిశ్రామిక
  • పార్కుకు 48 ఎకరాల భూమి
  • ఇకపై నేరుగా పారిశ్రామికవేత్తల ఖాతాల్లోకే ప్రోత్సాహకాలు
  • సులభతర వ్యాపారాభివృద్ధిలో భాగంగా సర్కారు నిర్ణయం
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు మరో ఐదు భారీ పరిశ్రమలు రానున్నాయి. వీటి ద్వారా సుమారు రూ.3 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. 14 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎ్‌సఐపీబీ) సమావేశమైంది. ఈ సందర్భంగా ఐదు భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రానికి రానున్న భారీ పరిశ్రమల్లో స్పోర్ట్స్‌ వేర్‌ తయారీలో ప్రపంచప్రఖ్యాతి గాంచిన జాకీ అండ్‌ స్పీడో, అల్లాయ్‌ వీల్స్‌ తయారీలో పేరొందిన రాక్‌మ్యాన్‌ ఇండస్ట్రీస్‌ తదితర సంస్థలు ఉన్నాయి.
 
రాష్ట్రానికి రానున్న భారీ పరిశ్రమల వివరాలు ఇవీ..
  •  చిత్తూరు జిల్లా శ్రీసిటీలో టోరే టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ రూ.970 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ కంపెనీకి శ్రీసిటీలో 109.35 ఎకరాల భూమిని కేటాయించారు. వైద్య సంస్థల్లో ఉపయోగించే టెక్స్‌టైల్‌ను టోరే కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ స్థాపనతో 130 మందికి ప్రత్యక్షంగా.. 520 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ సంస్థ ఏప్రిల్‌ 2020 నాటికి కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.
  •  స్పోర్ట్స్‌వేర్‌ తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాకీ అండ్‌ స్పీడో అనంతపురం జిల్లా రాప్తాడులో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రూ.129 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ కంపెనీలో 6420 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2018కి సంస్థ కార్యకలాపాలు ప్రారంభవుతాయని అంచనా.
  •  రాక్‌మ్యాన్‌ ఇండస్ట్రీస్‌ రూ.652 కోట్లతో 45 ఎకరాల్లో చిత్తూరు జిల్లాలో యూనిట్‌ను ప్రారంభించనుంది. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు అల్యూమినియం అల్లాయ్‌ వీల్స్‌ తయారీలో ఈ సంస్థ పేరొందింది. ఈ కంపెనీ ద్వారా 1500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.
  •  కాండ్యూనెట్‌ ఐఎన్‌సీ ఐటీ పరిశ్రమ విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ రూ.649 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. బిజినెస్‌ ప్రాసెస్‌ సేవలను అందించే ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 5000 మందికి ఉపాధి లభిస్తుంది.
  •  విశాఖ జిల్లా అచ్యుతాపురంలో 5 ఎకరాల్లో ఎలకా్ట్రనిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ గౌట్టే ఫోన్స్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.504.07 కోట్ల పెట్టుబడితో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ సంస్థలో ప్రత్యక్షంగా 300 మందికి ఉపాధి లభించనుంది.
  • మహిళా పారిశ్రామిక పార్కుకు 48 ఎకరాలు
 
నెల్లూరు జిల్లాలో మహిళా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 48 ఎకరాలను కేటాయించింది. ఈమేరకు మంగళవారం పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ఆరోక్య రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారి పాలెంలో ఏర్పాటు చేయనున్న అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా (అలై) కోసం గతంలో ఎకరా రూ.7.90 లక్షల చొప్పున 15 ఎకరాలు కేటాయించారు. ఈ భూమికి అదనంగా మరికొంత కావాలంటూ అలై ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మరో 33 ఎకరాలను అదనంగా కేటాయించింది. ఈ 33 ఎకరాలకు ఏపీఐఐసీ నిబంధనావళి మేరకు ధరను నిర్ధారించారు. ఈ పార్కులో 100 చిన్న మధ్యతరహా పరిశ్రమలను రూ.200 కోట్ల పెట్టుబడితో స్థాపిస్తామని 5000 మందికి ఉపాధి కల్పిస్తామని అలై గతంలో ప్రభుత్వానికి తెలిపింది. కాగా, తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభధ్రపురంలో మహిళా పార్కు కోసం అలైకు 34.19 ఎకరాలను ఎకరా రూ.10.45 లక్షలకు కేటాయించారు. అయితే ఇంత మొత్తాన్ని చెల్లించలేమని, ధర తగ్గించాలని అలై ప్రభుత్వానికి కోరింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం రూ.8.29 లక్షలకు ధరను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.
 
నేరుగా ఖాతాల్లోకి ప్రోత్సాహకాలు
రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను ఇకపై నేరుగా పారిశ్రామికవేత్తల ఖాతాల్లో జమ చేయాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. దీనివల్ల పరిశ్రమల శాఖతోసహా ఇతర ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించడంతోపాటు జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలను అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక సంస్థలకు అర్హతను బట్టి భూమి, కరెంటు, నీరు తదితర అంశాల్లో పరిశ్రమల శాఖ రాయితీలు, ప్రోత్సాహకాలను ఇస్తోంది. ఈ మొత్తాలను ఆయా సంస్థలకు ఇచ్చేందుకు సంబంధిత ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో సులభతర వ్యాపారాభివృద్ధికి అవకాశాలు కుంటుపడుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు నేరుగా పారిశ్రామిక సంస్థల ఖాతాల్లోకే ప్రోత్సాహకాలు జమ అయ్యేలా చూడాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Link to comment
Share on other sites

ఏపీలో రెండు సంప్రదాయేతర వర్సిటీలు
636249291075610104.jpg
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్ధులకు సువర్ణావకాశం. ఇప్పటివరకు సాంకేతిక విద్యలో మూసపాత్ర అమలవుతోంది. దానికి ప్రతిగా సంబంధిత రంగాలపై ప్రత్యేక అధ్యయనానికి అవకాశాలను కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కాకినాడలో లాజిస్టిక్‌ యూనివర్సిటీని, అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీని స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ దిశగా రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ సన్నద్ధమవుతుంది.
 
లాజిస్టిక్‌
ఆంధ్ర ప్రదేశ్‌ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఇన్‌క్యాప్‌) తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లాజిస్టిక్‌ వర్సిటీని ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు చేపడుతోంది. కాకినాడలో 75 నుంచి 100 ఎకరాల మధ్య 350 కోట్ల రూపాయలతో అయిదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లాజిస్టిక్‌ వర్సిటీ నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ రంగంలో ప్రత్యేక బోధన విధానాలతో విద్యను అందించనున్నారు. ఏటా 1300 నుంచి 1400 మందికి విద్యా బోధన చేసే ఈ వర్సిటీలో అకడమిక్‌ బోధన సిబ్బంది 80-90 మంది ఉంటారు. పూర్తిస్థాయి పరిశోధకులు 15 మంది వరకు ఉంటారు. లీడర్‌షిప్‌ టీమ్‌లు 12 నుంచి 18 వరకూ ఉంటాయి. భోదనేతర సిబ్బంది 140-160 వరకూ ఉంటారు. షిప్పింగ్‌ లాజిస్టిక్‌ , ఎయిర్‌లాజిస్టిక్‌ , సర్ఫేస్‌ ట్రాన్స్‌పోర్టు, వేర్‌ హౌసింగ్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ వంటి ఐదు బోధన శాఖలు ఉంటాయి. ఈ విభాగాల్లో అంతర్గత రవాణా, షిప్పింగ్‌, పోర్టు ఆపరేషన్స్‌, సప్లయ్‌ చైన్‌, వేర్‌ హౌసింగ్‌ వంటి వాటిలో నిష్ణాతులైన వారితో శిక్షణ ఇస్తారు.
 
ఈ వర్సిటీలో 2017-18 విద్యా సంవత్సరం నుంచే బోధనను ప్రారంభిస్తారు. ఈ ఏడాది ఎండిపి కోర్సులు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, అడ్మిషన్ల ప్రక్రియ, తాత్కాలిక వర్సిటీ క్యాంపస్‌ ఎంపిక ఉంటాయి. రెండో ఏడాది 2018-19లో బి.టెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్‌ కోర్సులు ఉంటాయి. శాశ్వత క్యాంప్‌సను నిర్మిస్తారు. యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకలను పూర్తిగా అమలు చేస్తారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డి అందుబాటులోకి వస్తుంది. ఎన్‌బీఏ, నాక్‌, ఏఐసీటీఈ అక్రిడిటేషన్‌ను పొందుతారు. 2020-21 నుంచి సమగ్రంగా వర్సిటీ కార్యకలాలను చేపడుతుంది. పూర్తిసామర్థ్యంతో పనిచేస్తుంది. విదేశీ వర్సిటీలతో కలసి విద్యా బోధనలోనూ, ఇతర అంశాల్లోనూ ఎక్ఛేంజీ విధానాన్ని అమలు చేస్తారు.
 
ఈ వర్సిటీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులలో .. ఉపరితల రవాణాలో బి.టెక్‌ (సివిల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌), పోర్టు ఆపరేషన్స్‌/ షిప్పింగ్‌ లాజిస్టిక్‌లో బి.టెక్‌ ( బి.టెక్‌ - మెకానికల్‌, ఇండసి్ట్రయల్‌ ఇంటిగ్రేటెడ్‌), వేర్‌హౌసింగ్‌లో బి.టెక్‌( మెకానికల్‌/ఆటోమేషన్‌), ఎయిర్‌ లాజిస్టిక్స్‌లో బి.టెక్‌ (మెకానికల్‌/ఆటోమేషన్‌) ఉంటాయి. అదేవిధంగా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో బీబీఏ, ఎంబీఏ ఉంటాయి. మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో ఎంబీఏ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ డిప్లోమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఉంటాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉపరితల రవాణాలో ఎంటెక్‌, (ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌), పోర్టు ఆపరేషన్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (మెకానికల్‌ ఇంజనీరింగ్‌ - ఇండసి్ట్ర ఇంటిగ్రేటెడ్‌), ఎయిర్‌ లాజిస్టిక్‌లో మాస్టర్స్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (ఇండసి్ట్రయల్‌), వేర్‌ హౌసింగ్‌లో మాస్టర్స్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (ఆటోమేషన్‌) అందిస్తారు.
 
ఇంధన
ఇంధన రంగంలోనూ స్పెషలైజేషన్‌ కోర్సులతో రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం సంయుక్తంగా ‘ఇంధన వర్సిటీ’ని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాయి. అనంత పురంలో 150-200 ఎకరాల్లో దాదాపు రూ.400 కోట్లతో ఏటా 1400 నుంచి 1500 మందికి విద్యనందించేందుకు ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంధన వర్సిటీని స్థాపించేందుకు సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ సిద్ధమైంది.
 
ఇంధన వర్సిటీలో సౌర శక్తి, సుస్థిరత-పర్యావరణం, థర్మల్‌ ఎనర్జీ, సరఫరా- పంపిణి, ఎనర్జీ స్టోరేజ్‌ అనే ఆరు విభాగాలు ఉంటాయి. ఈ ఏడాది నుంచే ఇంధన వర్సిటీ తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది.
 
2017-18 విద్యా సంవత్సరం నుంచే ఎండిపి కోర్సులు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, అడ్మిషన్ల ప్రక్రియ, తాత్కాలిక వర్సిటీ క్యాంపస్‌ ఎంపిక ఉంటాయి. రెండో ఏడాది 2018-19లో బి.టెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్‌ కోర్సులు ఉంటాయి. శాశ్వత క్యాంప్‌సను నిర్మిస్తారు. యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకలను పూర్తిగా అమలు చేస్తారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డి అందిస్తారు. ఎన్‌బీఏ, నాక్‌, ఏఐసీటీఈ అక్రిడిటేషన్‌ను పొందుతారు. 2020-21 నుంచి సమగ్రంగా కార్యకలాపాలను వర్సిటీ చేపడుతుంది. పూర్తిసామర్థ్యంతో పనిచేస్తుంది. విదేశీ వర్సిటీలతో కలసి విద్యా బోధనలోనూ,ఇతర అంశాల్లోనూ ఎక్ఛేంజీ విధానాన్ని అమలు చేస్తారు.
అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బి.టెక్‌ (మెకానికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌)లో విండ్‌ ఎనర్జీ, బి.టెక్‌ (మెకానికల్‌/ ఎలకి్ట్రకల్‌ ఇంజనీరింగ్‌లో ఎనర్జీ ఎఫిషియెన్సీ, థర్మల్‌ ఎనర్జీ, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌-డసి్ట్రబ్యూషన్‌ ఉంటాయి.
 
పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఎం.టెక్‌ ( మెకానికల్‌/ ఎలకి్ట్రకల్‌ / ఎనర్జీ)లో ఎఫిషియెంట్‌ టెక్నాలజీస్‌ ఇన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ, ఎంటెక్‌ ( మెకానికల్‌ / ఎలకా్ట్రనికల్‌ ఇంజనీరింగ్‌)లో పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, డిసి్ట్రబ్యూషన్‌, ఎంటెక్‌ (సివిల్‌ / మెకానికల్‌/ ఎలకి్ట్రకల్‌ ఇంజనీరింగ్‌)లో ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌, ఎనర్జీ బిల్డింగ్‌ తదితరాలు ఉంటాయి. ఎంటెక్‌ (ఎలకా్ట్రనికల్‌ / ఎనర్జీ/ రెన్యువబుల్‌ ఎనర్జీ)లో విండ్‌ ఎనర్జీ, సోలార్‌ ఎనర్జీ, ఆల్టర్నేటివ్‌ ఎనర్జీ కోర్సులు ఉంటాయి. ఎంబీఏలో మేనేజ్‌మెంట్‌ ప్రాసెస్‌ ఆప్టిమైజేషన్‌ ఆఫ్‌ వేరియస్‌ ఎఫిషియెన్సీ మోడల్స్‌, బిజినెస్‌ మోడల్స్‌ ఇన్‌ ద ఫీల్డ్‌ ఆఫ్‌ ఎనర్జీ, సస్టైనబిలిటీ ఆఫ్‌ ఆల్టర్నేట్‌ ఎనర్జీ అండ్‌ ఇట్స్‌ ఎకనామిక్స్‌ ఉంటాయి. విద్యుత్తు రంగానికి సంబంధించి డాక్టరేట్‌ కోర్సులూ ఉంటాయి.
- ఆర్‌.హరగోవిందరావు
Link to comment
Share on other sites

విశాఖలో బ్యాటరీ తయారీ యూనిట్‌
21-10-2017 02:54:03
 
  • రూ.650 కోట్ల పెట్టుబడి... మూడు వేల మందికి ఉపాధి
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఎలక్ర్టిక్‌ బస్సులు, కార్లలో ఉపయోగించే బ్యాటరీలకు సంబంధించి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియా కంపెనీ ముందుకొచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాటరీలతో బస్సులు, కార్లు కేవలం 100 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుండగా, తాము 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం గల బ్యాటరీలను తయారుచేస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎలక్ర్టికల్‌తో పాటు థర్మల్‌ బ్యాటరీలు కూడా తయారు చేస్తామని, అందుకు అవసరమైన స్థలం కోరగా, విశాఖపట్నంలోని ఏపీఐఐసీ అధికారులు జిల్లాలో అందుబాటులో ఉన్న స్థలాలను చూపించారు. రూ.650 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ ద్వారా సుమారుగా మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Andhra Pradesh will soon be a home to eight bio-CNG plants that use organic waste as raw material for producing the green fuel as well as bio-fertiliser if plans of a Mahindra group company bear fruit.

Mahindra Powerol, part of $19-billion Mahindra group, is gearing up to establish these plants at different cities and towns including the famous temple town of Tirupati and also at Madanapalle, both in Chittoor district, once it gets final nod from the AP government. 

"We are taking up bio-CNG in Andhra Pradesh in a big way. We entered into a contract with the AP government on this. AP Chief Minister N Chandrababu Naidu saw our technology which was on display at Swachh Bharat exhibition, and invited us to set up the plants in his state.

 We will start establishing these eight plants after we formally sign a final agreement with the government there," P Palaniappan, Business Head, Mahindra Powerol.  Each of the plants requires Rs 5 to 6 crore investment, but the outlay will depend on the capacity of the respective plant.

Link to comment
Share on other sites

రాష్ట్రానికి హోండా? 
తయారీ యూనిట్‌పై ఆసక్తి 
పరిశీలనలో చిత్తూరు, అనంత, కర్నూలు 
ఈనాడు - అమరావతి 
15ap-main5a.jpg

అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ‘హోండా’ మోటార్‌ సైకిళ్లు మన రాష్ట్రం నుంచే తయారయ్యే అవకాశాలున్నాయి. జపాన్‌కు చెందిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రస్తుతం జపాన్‌లో ఉండటంతో ఆయన తిరిగి రాగానే చర్చలు జరపనున్నారు. కర్నాటకలోని యూనిట్‌లో రోజుకు 6,600 మోటార్‌ సైకిళ్లను తయారు చేస్తోంది. ఆంధ్రాలో అంతకంటే పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ఆ సంస్థ యోచనగా ఉంది. ఇక్కడ పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు అనుకూలమైనవిగా భావిస్తున్నారు. కావాల్సిన భూమి ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నందున హోండా ప్రాజెక్టుపై వివరాలను అధికారులు బయటకు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. 
నేడు టయోటాతో ఎంఓయూ: జపాన్‌కు చెందిన టయోటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక అవగాహన, భాగస్వామ్యం కోసం గురువారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. సచివాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ పాల్గొంటున్నారు. ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విద్యుత్తు కార్లను బహుకరించనుంది. దాంతో పాటు మౌలికంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏయే అంశాల్లో కలిసి పనిచేయాలనే దానిపైన కూడా చర్చించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

Link to comment
Share on other sites

వాయువేగం
రెండున్నరేళ్లలో 23 వేలకుపైగా పరిశ్రమలకు అనుమతులు
ఏకగవాక్ష విధానమంతా ఆన్‌లైన్‌ పరం
ఈనాడు - అమరావతి

    పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ అమలు చేస్తున్న ఏకగవాక్ష విధానం సత్ఫలితాలనిస్తోంది. ఈ విధానం ద్వారా   పరిశ్రమలకు అనుమతులివ్వడంలో వాయువేగంతో దూసుకెళుతోంది. దాదాపుగా అన్ని అనుమతులను 21 రోజుల్లోనే ఇస్తుండటం పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటోంది. అనుమతులు, ఫిర్యాదులు, అర్జీలను ప్రస్తుతం అన్నీ ఆన్‌లైన్‌ ద్వారా తీసుకుంటున్న పరిశ్రమల శాఖ వాటిని పరిష్కరించడానికి నిర్ణీత గడువు పెట్టింది. 2015 మే నుంచి 2017 నవంబరు వరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పరిశ్రమలకు సంబంధించి మొత్తం 24,473 దరఖాస్తులు అనుమతుల కోసం అందాయి. వాటిలో 23,204 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చేశారు.

శాఖల అనుసంధానం
పరిశ్రమ పెట్టాలంటే రెవెన్యూ, విద్యుత్తు, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, పురపాలక, పంచాయతీ తదితర శాఖల నుంచి 40 రకాల అనుమతులు పొందాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఒక్కో శాఖ నుంచి ఈ అనుమతులు పొందాలంటే నెలలు, సంవత్సరాలు సమయం పడుతుంది. అలా కాకుండా కేవలం ఒకే ఒక్క ధరఖాస్తు పరిశ్రమల శాఖకు చేసుకుంటే అక్కడి నుంచే మిగిలిన అన్ని అనుమతుల కోసం మిగిలిన శాఖలకు ఆ దరఖాస్తు వెళ్లేలా పరిశ్రమల శాఖ ఏక గవాక్ష విధానంలో అన్ని శాఖలను అనుసంధానం చేసింది. ఈ దరఖాస్తుల తీరు, స్థాయి, పెండింగ్‌ తదితర వివరాలను పరిశ్రమల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిర్ణీత గడువులోపు అన్ని అనుమతులు సాధించేలా చేస్తున్నారు. దానివల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. సులభతర వ్యాపార నిర్వహణలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా చేయడంలో ఈ ఏకగవాక్ష అనుమతుల విధానం కీలకంగా పనిచేసిందనే చెప్పాలి. ఈసారి కూడా ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుని రాష్ట్ర ప్రతిష్ఠను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నిస్తున్నారు.
జిల్లాల మధ్య పోటీలు
సులభతర వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఈసారి వినూత్నంగా అన్ని జిల్లాల మధ్య కూడా పోటీ పెట్టింది. దాన్ని కూడా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఫలితాలు తెలియజేస్తూ వెనుకబడుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో సైట్‌ను నిర్వహిస్తూ ఫలితాలను ఎప్పటికప్పుడు మదింపు చేసింది. తొలి త్రైమాసికంలో పశ్చిమ గోదావరి జిల్లా సులభతర వ్యాపారానికి అనుకూలమైన జిల్లాగా మొదటి స్థానంలో నిలిస్తే మూడో త్రైమాసికంలో శ్రీకాకుళం జిల్లా ఆ స్థానానికి ఎగబాకింది.

జిల్లాల వారీగా అనుమతుల వివరాలు
http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=5

Link to comment
Share on other sites

* 2018 జులైలో తమ దేశంలో నిర్వహించే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని చంద్రబాబుకి సింగపూర్‌ ప్రతినిధుల ఆహ్వానం. ఈ సదస్సుని ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి నిర్వహించాలని కోరిన చంద్రబాబు. 

 

 

:rofl::rofl::rofl: asalu edi vadalaru babu garu...

Link to comment
Share on other sites

Touch screen panel production plant  in Vizag

 

 

The unit once commissioned fully will produce 1.5 million touch screen panels per annum and create 250 direct and 50 indirect jobs. Gouttephone Technology Private Limited will be setting up a world-class touch screen panel production plant in Visakhapatnam in collaboration with Taiwanese leading R&D house with an investment of $76 million. Visakhapatnam is expected to find a place in laptop and smartphone manufacturing with the touch screen panels produced by the new project to be sourced by several production units. The project for which the company, one of the leaders in touch screen panel manufacturing, has identified five acres land in Visakhapatnam Special Economic Zone and signed an MoU with Andhra Pradesh Economic Development Board (APEDB) sometime ago. APEDB will provide necessary support to the project proponent in expediting the establishment of the project by getting the required approvals.

Link to comment
Share on other sites

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విప్రో ఆసక్తి
29-11-2017 20:31:46
 
636475843072259869.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో విప్రో ప్రతినిధి రాఘవ స్వామినాథన్‌ సమావేశమయ్యారు. చంద్రబాబుతో విప్రో రాఘవ స్వామినాథన్ పలు అంశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విప్రో ఆసక్తి చూపుతోంది. రూ. 200 కోట్ల నుంచి రూ. 350 కోట్ల మేర విప్రో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు విప్రో సంస్థ ముందుకు వచ్చింది
Link to comment
Share on other sites

చంద్రబాబుతో సీఎండీ భేటీ.. ఏపీలో అశోక్ లేల్యాండ్ బస్సు ప్లాంట్..
29-11-2017 21:05:19
 
636475863201968188.jpg
అమరావతి: సీఎం చంద్రబాబుతో అశోక్ లేల్యాండ్ సీఎండీ వినోద్ కె.దాసరి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై చంద్రబాబుతో వినోద్ చర్చించారు.
ఏపీలో అశోక్ లేల్యాండ్ బస్సు ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు అశోక్ లేల్యాండ్ సీఎండీ ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో బస్సు ప్లాంట్, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వినోద్ తెలిపారు. 75 ఎకరాల భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబుకు అశోక్ లేల్యాండ్ సీఎండీ వినోద్ కే దాసరి విజ్ఞప్తి చేశారు. బస్సు ప్లాంట్ ఏర్పాటు ద్వారా 5వేల మందికి ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బస్సు ప్లాంట్‌లోనే నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...