Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

Free scuba diving aimed at promoting tourism in Vizag

Vizag has always boasted the potential to emerge as a premier destination for Scuba Diving in the country. From having shallow waters to being well-connected to other cities by various means of transport, Vizag attracts scuba diving enthusiasts from all over. To bolster the same, the government has come forward with a new concept.

As informed at a media event on Monday, the officials will soon be bearing the expenses for the scuba diving of 500 enthusiasts. Those interested, can visit www.goandhrapradesh.com/scubadiving/ for registering themselves.

While the advent of scuba diving at Chintapalli in our scenic Vizag has been attracting tourists from all over, the discovery of shipwrecks assures to take the excitement to an all new level and are establishing the city as a premier diving destination in the country.

Located at a shallow depth, the speciality of these wrecks is that they allow both, swimmers and non-swimmers, to treat themselves to some fascinating sights. Apart from seeing these mammoth wrecks, divers can also avail the unmatched experience of watching the spectacular underwater life. The waters are home to a vivid and vibrant aquatic species, including the critically endangered species of goliath grouper.

Link to comment
Share on other sites

విశాఖ టు బ్యాంకాక్‌
07-12-2018 03:01:09
 
636797484704222102.jpg
  • అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం
  • నేటి నుంచి వారానికి నాలుగు రోజులు
విశాఖపట్నం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విమానాశ్రయం నుంచి క్రమంగా అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దుబాయ్‌, సింగపూర్‌, మలేసియాలకు సర్వీసులు నడస్తున్నాయి. వివిధ కారణాలరీత్యా శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ అక్టోబరు 27 నుంచి కొలంబో సర్వీసును ఉపసంహరించుకొంది. అయితే తాజా గా బ్యాంకాక్‌ సర్వీసు ప్రారంభమైంది. అతి తక్కు వ ధరకు విమానాలు నడిపే థాయ్‌ ఎయిర్‌ ఏసియా విశాఖపట్నం - బ్యాంకాక్‌ మధ్య వారానికి 4 రోజులు విమానం నడపడానికి ముందుకువచ్చింది.
 
 
ప్రతి సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో ఈ విమానం ఉంటుంది. బ్యాంకాక్‌లో రాత్రి ఏడు గంటలకు బయలుదేరే విమానం విశాఖలో రాత్రి 11.45 గంటలకు దిగుతుంది. ఇక్కడి నుంచి 12.15 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4.30 గంటలకు బ్యాంకాక్‌లో ల్యాండవుతుంది. టిక్కెట్‌ ధర కూడా రానుపోను రూ.6 వేలుగా నిర్ణయించా రు. విమానం సామర్థ్యం 180 సీట్లు. తొలి విమానంలో టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. సంస్థకు లాభం/నష్టం లేనివిధంగా ఫిబ్రవరి వరకు టిక్కె ట్లు అమ్ముడయ్యాయని ఇండియన్‌ టూర్‌ ఆపరేటర్ల సంఘం సభ్యులు మురళీకృష్ణ తెలిపారు.
 
 
అతి తక్కువ దూరం బ్యాంకాకే
ఇప్పటివరకు ఎవరైనా విశాఖ నుంచి బ్యాంకాక్‌ వెళ్లాలంటే...హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా నుంచి వెళుతున్నారు. ఇప్పుడు నేరుగా విశాఖ నుంచే వెళ్లిపోవచ్చు. హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌ 2,400 కి.మీ. దూరం. చెన్నై నుంచి 2,254 కి.మీ. దూరం. అదే విశాఖపట్నం నుంచి అయితే 1,905 కి.మీ. మాత్రమే. పైగా ఇంతకు ముందులా హైదరాబాద్‌, చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే సమయంతో పాటు ఖర్చు కూడా కలిసి వస్తుంది. ఐదేళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ఉపాధ్యక్షులు ఓ నరేశ్‌ కుమార్‌ అన్నారు.
 
 
బ్యాంకాక్‌ నుంచి 92 దేశాలకు కనెక్టివిటీ విమానాలు ఉన్నాయని, కాంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలకు అక్కడి నుంచి వెళ్లవచ్చునని ఆయన వివరించారు. విశాఖపట్నం నుంచి శుక్రవారం రాత్రి బ్యాంకాక్‌ వెళ్లే విమానంలో టూర్‌ ఆపరేటర్లను తీసుకువెళుతున్నామని టూర్‌ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయమోహన్‌ తెలిపారు. రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక ప్రాంతాల గురించి అక్కడివారికి వివరించి ఇక్కడకు తీసుకురావాలన్న ఆలోచనతో విశాఖ నుంచి 12 మంది, రాజమండ్రి నుంచి ముగ్గురు, విజయవాడ నుంచి ఐదుగురు ఆపరేటర్లను తీసుకొని వెళ్తున్నట్లు వివరించారు.
Link to comment
Share on other sites

విశాఖలో లులూ కన్వెన్షన్‌ సెంటర్‌ 
ఆకృతులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 
అత్యంత ఆకర్షణీయంగా నిర్మించాలని సూచన 
7ap-state1a.jpg

ఈనాడు, అమరావతి: విశాఖలో లులూ అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ను అత్యంత ఆకర్షణీయంగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. కన్వెన్షన్‌ సెంటర్‌తో పాటు 5 స్టార్‌ హొటళ్లు, విశాలమైన మాల్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు సంబంధించి నిర్మాణ ఆకృతులను శుక్రవారం చంద్రబాబునాయుడు సచివాలయంలో పరిశీలించారు. రూ.1500 కోట్ల వ్యయంతో 13.83 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు లండన్‌కు చెందిన ‘డిజైన్‌ ఇంటర్నేషన్‌ ఆర్కిటెక్టు’ సంస్థ రూపొందించిన వివిధ నమూనాలను, ఆకృతులను ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చూపి.. ముఖ్యాంశాలను వివరించారు. విశాఖ బీచ్‌ ఎదురుగా రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించేలా ఉండాలని ముఖ్యమంత్రి అభిలషించారు. స్టార్‌ హొటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్ల నుంచి బీచ్‌ వీక్షణ కనువిందు కలిగించేలా నిర్మాణ నైపుణ్యం ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందమైన ప్రకృతి ప్రతిబింబించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డిజైన్‌ ఇంటర్నేషన్‌ సీఈవో  డేవిడ్‌ పడోవ వివరించారు. ‘‘లులూ సంస్థ ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆరు లక్షల చదరపు అడుగుల్లో మెగా కమర్షియల్‌ కాంప్లెక్సు, 5000 మంది కూర్చునేలా కన్వెన్షన్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్‌, తొలిదశలో 220 గదుల 5 స్టార్‌  హోటల్‌ నిర్మాణం చేపట్టనుంది’’. గొప్ప దార్శనికతతో అమరావతి నిర్మాణం ప్రారంభించామని, ప్రపంచంలోనే అద్భుత నిర్మాణంగా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి అన్నారు. అమరావతి, విశాఖ, తిరుపతితో పాటు అన్ని ప్రధాన పట్టణాలు కాలుష్య రహిత ప్రాంతాలుగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్తు వాహనాలను విస్తృతంగా వాడుకలోకి వచ్చేలా ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ఏపీఐఐసీ ఎండీ బాబు అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ప్రపంచంలోనే ఆకర్షణీయంగా ‘లులు’
08-12-2018 03:53:52
 
636798380335470836.jpg
  • విశాఖలో రూ.1,500 కోట్లతో 14 ఎకరాల్లో నిర్మాణం
  • ఈ నెలలోనే కన్వెన్షన్‌ సెంటర్‌ పనులు ప్రారంభం.. మొదటి దశలో 220 గదులతో ఫైవ్‌ స్టార్‌ హోటర్‌
  • లండన్‌ సంస్థ డిజైన్లు పరిశీలించిన చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన కన్వెన్షన్‌ కేంద్రంగా విశాఖలోని లులు సెంటర్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నెలలోనే ఈ సెంటర్‌ పనులు ప్రారంభం కానున్నాయి. దీనిని అత్యంత ఆకర్షణీయంగా నిర్మించాలని సంస్థ యాజమాన్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు, కన్వెన్షన్‌ సెంటర్‌తోపాటు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, విశాలమైన మాల్స్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనలను, నిర్మాణ డిజైన్లను చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో పరిశీలించారు. రూ.1,500 కోట్ల వ్యయంతో 13.83 ఎకరాల విస్తీర్ణంలో ఈ అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ను అభివృద్ధి చేయడానికి లండన్‌కు చెందిన డిజైన్‌ ఇంటర్నేషన్‌ అనే ఆర్కిటెక్ట్‌ సంస్థ వివిధ నమూనాలను ముఖ్యమంత్రి ముందుంచింది.
 
విశాఖ బీచ్‌కు ఎదురుగా ఏర్పాటు కానున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించేలా రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి సముద్రాన్ని వీక్షించడం కనువిందు చేసేలా నిర్మాణ నైపుణ్యం ఉండాలన్నారు. విశాఖ తీరం వెంబడి కనిపించే అందమైన ప్రకృతిని ప్రతిబింబించేలా...అన్ని చర్యలూ తీసుకుంటామని డిజైన్‌ సంస్థ స్పష్టం చేసింది. లులు సంస్థ ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆరు లక్షల చదరపు అడుగులలో మెగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఐదువేల సీటింగ్‌ సామర్థ్యం కలిగిన కన్వెన్షన్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్‌లను సిద్ధం చేస్తుంది. తొలిదశలో 220 గదుల ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మిస్తుంది.
 
గొప్ప దార్శనికతతో రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టామని, ఈ సంకల్పంలో తానెక్కడా రాజీపడడంలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజధాని నగరం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు. అమరావతి, విశాఖ, తిరుపతితోపాటు అన్ని ప్రధాన పట్టణాలనూ కాలుష్యరహిత ప్రాంతాలుగా ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ వాహనాలు విస్తృతంగా వాడుకలోకి తీసుకురానున్నామని చెప్పారు. ఈ ఆలోచనలకు దీటుగా లులు కన్వెన్షన్‌ ప్రాజెక్టు రూపుదిద్దుకోవాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి జీ సాయి ప్రసాద్‌, ఏపీఐఐసీ ఎండీ బాబు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

LuLu Group discusses designs for Vizag facility with CM

author-deafault.png Staff Reporter
VIJAYAWADA, December 08, 2018 00:00 IST
Updated: December 08, 2018 05:36 IST
 

Stone for International Convention Centre laid in Februray

The UAE-based LuLu Group International has come out with various designs for the proposed International Convention Centre in Visakhapatnam.

A delegation, comprising London-based architects, Design International, CEO Davide Padoa and others, explained the designs to Chief Minister N. Chandrababu Naidu at the Secretariat on Friday.

Mr. Naidu suggested the delegation that the International Convention Centre should be the talk of the world.

The government was expecting the designs to innovative and attractive. The focus should on the sea view from every point of the mega commercial complex, which the government visualised as an iconic structure in Visakhapatnam.

A unique underpass or overpass from the complex to the beach could be another attraction.

“The group can also plan for 800 rooms with 5-star to 7-star facilities,” Mr. Naidu suggested. The Lulu centre is coming up in 13.83 acres at a cost of Rs. 1,500 crore.

Features

The project components include a mega commercial complex with 6 lakh sqft, convention centre-cum-exhibition halls with 5,000 seating capacity, 5-star hotel with 220 rooms and other supporting facilities.

Foundation stone for it had been laid in February this year during the CII Partnership Summit.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...