Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
ఎంపిక మీదే
ఈనాడు, విశాఖపట్నం
ఆర్కే బీచ్‌లో సమీకృత సందర్శనాలయం, పర్యాటక ప్రాజెక్టు
vsp-top2a.jpg
(ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం, టూరిజం ప్రాజెక్టు) ఎంపిక పోటీ మంగళవారం నుంచి మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయాన్ని అధికారులు ఆహ్వానిస్తున్నారు. వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన మూడు నమూనాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రజలు వాటిని పరిశీలించి.. ఒకదానిని ఎంపిక చేయవచ్చు. అత్యధికులు మొగ్గు చూపిన నమూనా ప్రాజెక్టును అమల్లోకి తెస్తారు. అభిప్రాయం తెలియజేసేందుకు తుది గడువు ఈ నెల 30.

ఓటు ఇలా...
* www.vuda.gov.in లోకి వెళ్లాలి.
* హోంపేజీలో సర్క్యులర్స్‌లో ఈ ప్రజాభిప్రాయ ప్రాజెక్టుల వివరాలున్నాయి.
* మొదట వీఎంఆర్‌డీఏ, ఆ తరువాత పర్యాటక శాఖ ప్రాజెక్టులను ఉంచారు.
* మూడు ప్రాజెక్టులను పరిశీలించాక ఓటింగ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళ్లి పేరు, ఆధార్‌ నెంబరుతో కూడిన వివరాలు నమోదు చేసి నచ్చిన ప్రాజెక్టుపై క్లిక్‌ చేయాలి. అంతే ఎంపిక పూర్తవుతుంది. అక్కడే మన అభిప్రాయాన్ని కూడా తెలపొచ్చు.

ఒకదాన్ని మించి మరొకటి...
కొత్త ప్రాజెక్టులు పూర్తయితే ఆర్కే బీచ్‌ స్వరూపమే మారిపోతుంది. సముద్ర తీరం, అక్కడున్న రహదారి, కాలిబాటలు, ఇతర నిర్మాణాల స్థానంలో కొత్తందాలు కనువిందు చేస్తాయి. జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లోని తీర ప్రాంతాలు, ఉద్యానవనాలను పరిశీలించి వాటి తరహాలో టవర్లు, ప్రత్యేక నడక మార్గాలు, పైవంతెనలతో ఆకృతులిచ్చారు.

ప్రజా స్పందన ద్వారానే ఎంపిక
ఈ నెల 30 వరకు ఓటింగ్‌ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటాం. అక్టోబరు మొదటి వారంలో పర్యాటక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రజలతో పరస్పర చర్చలు జరిపిన అనంతరం ప్రాజెక్టు తుది ఎంపిక ఉంటుంది.

- బసంత్‌కుమార్‌, కమిషనర్‌, వీఎంఆర్‌డీఏ
ప్రాజెక్టు 1
అంచనా వ్యయం: రూ. 100 కోట్లు
వీఎంఆర్‌డీఏ రూపొందించిన నమూనాలో జలాంతర్గామి, సీ హారియర్‌ సందర్శనాలయాలతో పాటు భూగర్భ రవాణా వ్యవస్థ, వాహనాలు నిలిపేందుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సుమారు 1200 ద్విచక్ర వాహనాలు, 800 కార్లు నిలిచేలా ఆకృతులు రూపొందించారు. ఆహారశాలలు, పచ్చని వనాలు, వ్యాయామశాలలు, సాంస్కృతిక కేంద్రాలు, ఇతర హంగులకు ప్రత్యేక స్థానం కల్పించారు.

ప్రాజెక్టు 2 (సబ్‌మెరైన్‌ హెరిటేజ్‌ మ్యూజియం)
అంచనా వ్యయం: రూ. 50 కోట్లు
* ఈ ప్రాజెక్టులో కురుసుర, టీయూ-142 యుద్ధవిమాన ప్రదర్శనశాలకు సమీపంలో నౌకాదళ, జెట్‌ విమానాలు ఇతర ముఖ్యమైన యుద్ధ సంబంధ పరికరాల నమూనాల సందర్శనాలయం ఉంటుంది.
* ఆంపిథియేటర్‌, ఆహారశాలలు, ఉద్యానవనాలు, వాహనాలు నిలిపే స్థలం, ఐకానిక్‌ నిర్మాణం, ఇతర ప్రత్యేక రూపాలను ఉంచారు. చికాగో, జర్మనీలోని మ్యూనిచ్‌ పార్కులను పోలి ఉండేలా ఆకృతులను రూపొందించారు. ఇందులో 600 నుంచి 700 వరకు కార్లు, ద్విచక్ర వాహనాలను భూగర్భ మార్గంలో నిలిపేలా చూపించారు.
నీ మూడంతస్తులతో ప్రధాన సందర్శనాలయంతో పాటు భిన్న ఆకృతితో కూడిన గ్యాలరీ, ఆరుబయట ప్రదర్శనశాల, ప్రత్యేక నడక మార్గాలతో ఆకృతులున్నాయి. జలాంతర్గామి పనిచేసే విధానం, నౌకాదళ అధికారుల జీవన శైలి, 50 ఏళ్ల భారత నౌకదాళం చరిత్ర తెలిపే ప్రదర్శనలుంటాయి. కురుసురా వైపు 95 మీటర్ల టవర్‌ ఇతర ప్రత్యేక నిర్మాణాలకు చోటు కల్పించారు.

ప్రాజెక్టు 3
అంచనా వ్యయం: రూ. 40 కోట్లు
*విశాఖకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా సముద్ర యుద్ధ సందర్శనాలయం, కురుసురా, యుద్ధవిమానం, ఇతర ప్రత్యేక సౌకర్యాల ప్రాజెక్టు ఇది.
* అనేక దేశాల్లోని సముద్ర తీర అందాలను పరిశీలించి, వాటిని తలదన్నేలా ఆకృతులను తయారు చేశారు.
* తీరంలోని నాలుగు వరుసల రహదారితో పాటు దానిపైనుంచి సముద్రం వరకు రెండు నడక వంతెనలు వచ్చేలా చూపించారు.
* తీరంలోనే అతి పెద్ద గాలిమరలు, ప్రత్యేక దుకాణాల వరుసను కళ్లకు కట్టించారు.
* వంతెనల వద్ద ప్రత్యేక నిర్మాణాల సరళి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
* ఆ ప్రాంతాల్లోని గోడలను కదిలే అందాలుగా, జ్ఞాపకాల నిలయంగా చూపించారు.
* ఈ ప్రాజెక్టులో సముద్రం లోపలి వరకు కొంత భాగాన్ని భూమి పైనుంచి వీక్షించేలా ప్రత్యేక నిర్మాణాలు రానున్నాయి. దీన్ని రోడ్డు నుంచి సముద్రం లోపలకు నిర్మించనున్నారు. లోపలి వరకు ప్రత్యేక మెట్ల వరుసను రూపొందించారు. * పక్కనే నడక వంతెన వస్తుంది.
* దీనిలో భాగంగా ఏర్పాటు చేసే సందర్శనాలయాన్ని డిజటలైజ్డ్‌గా రూపొందించారు. నడిచే మార్గాన్ని కూడా అలానే ఉంచడం దీని ప్రత్యేకత.
* యుద్ధ పరికరాల జోన్‌ వంటివి ఏర్పాటు చేయించారు. ‘విక్టరీ సీ’ను అత్యంత సొగసులతో తీర్చిదిద్దారు.

ప్రాజెక్టు 2లోని నమూనా వివరాలు ఇలా
1) ప్రవేశం 2) ప్రధాన మ్యూజియం
3) ఆరుబయట ప్రదర్శనశాల
4) టీయూ 142 5) ప్రత్యేక నిర్మాణం
6) టవర్‌ 7) కురుసురా ? నడకదారి
9) వాహనాలు నిలిపే స్థలం
10) రిఫ్లెక్టింగ్‌ ఏరియా
11) ఏయూ కన్వెన్షన్‌ 12 ) సముద్రం

ప్రాజెక్టు 3 మాస్టర్‌ ప్లాన్‌ నమూనా వివరాలు కింది ఇలా
1) ఏయూ కన్వెన్షన్‌ హాలు, 2) టీయూ 142 3) పైవంతెన
4) ఐఎన్‌ఎస్‌ కురుసురా 5) ఆరుబయట ప్రదర్శనాలయం
6) వాహనాలు నిలిపే స్థలం 7) ప్లాజా ? సబ్‌మెరైన్‌ హెరిటేజ్‌
9) గాలి మరలు 10) రాజీవ్‌ గాంధీ స్మృతివనం 11) సముద్రం

 
 
 
 
 

 

Link to comment
Share on other sites

మూడంచెల్లో భీమిలి బీచ్‌రోడ్డు విస్తరణ
vsp-brk7a.jpg

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి సాగరతీర ఆరామం రోడ్డు(బీచ్‌రోడ్డు)ను సుందరీకరణ చేయడంలో భాగంగా 60 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించారు. ఈమేరకు జీవీఎంసీ ఎస్‌ఈ మరియన్న, ఈఈలు ఉదయ్‌కుమార్‌, మెహర్‌బాబా, భీమిలి జెడ్సీ పి.దుర్గాప్రసాద్‌, భీమిలి ఏసీపీ హరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం బీచ్‌రోడ్డులో కొలతలు తీశారు. భీమిలి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల నుంచి ఎస్బీఐ వరకు కిలోమీటరున్నర పొడవు రోడ్డును మూడంచెల్లో విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నోవాటెల్‌ హోటల్‌ నుంచి ఎస్‌.బి.ఐ. వరకు పెద్దగా ఆక్రమణల్లేనందున తొలివిడతగా విస్తరించాలని సంకల్పించారు. రోడ్డు విస్తరణలో రెండువైపులా నడకదారులను ఏర్పాటు చేస్తారు. ద్విచక్రవాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌ వసతి కల్పిస్తారు. చిరువ్యాపారుల తోపుడుబళ్లని ఒకేచోట క్రమపద్ధతిలో నిలుపుకొనేలా స్థలాలు కేటాయిస్తారు. పార్కుల్లో ఆకర్షణీయమైన బొమ్మలను ఏర్పాటు చేస్తారు. జెడ్సీ పి.దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ డిసెంబరులోగా ఈ రహదారి వెడల్పు ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారి ఖ్వాజా మెహబూబ్‌జాన్‌, పబ్లిక్‌ వర్క్స్‌ డి.ఇ. సుధాకర్‌, ఏఈ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

విశాఖలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వర్సిటీ
22-09-2018 03:19:39
 
విశాఖపట్నం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): చమురు రంగంలో అగ్రగామిగా ఉన్న ఎనిమిది సంస్థలు విశాఖపట్నంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. విశాఖలో ఇప్పటికే స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహిస్తున్న ఆయిల్‌ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రూ.600 కోట్ల వ్యయంతో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ ఏడాది జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో చేసుకున్న ఒప్పందం మేరకు దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాయి. ఈ ప్రాజెక్టుకు హెచ్‌పీసీఎల్‌ సారథ్యం వహిస్తోంది. ఇప్పటివరకు ఆరిలోవలోని ఇనిస్టిట్యూట్‌లో ప్లంబింగ్‌, వెల్డింగ్‌, ఫిట్టర్‌ వంటి సంప్రదాయ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. తాజాగా ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’కు శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీ కూడా వస్తే వాటికి పది రెట్ల సంఖ్యలో కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు విశాఖపట్నం ఎంపీ హరిబాబు తెలిపారు. సబ్బవరంలో పెట్రో యూనివర్సిటీ సమీపాన ఈ వర్సిటీకి 100 ఎకరాలు కేటాయించారని, ఆ స్థలాన్ని అప్పగిస్తే... ఇతర పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంటుందన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ను కూడా భాగస్వామిగా చేసుకొని యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. డీపీఆర్‌ను పరిశీలించడానికి, భూముల అప్పగింత, ప్రాజెక్టు పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం హైలెవెల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జెఎ్‌సవీ ప్రసాద్‌ను చైర్మన్‌గా, మరో ఏడుగురిని సభ్యులుగా నియమించారు.
Link to comment
Share on other sites

సమీకృత మ్యూజియంపై 9న అభిప్రాయ సేకరణ
vsp-brk1a.jpg

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : బీచ్‌రోడ్‌లో నిర్మాణం చేయాలని తలపెట్టిన సమీకృత మ్యూజియంపై ప్రజాభిప్రాయ సేకరణ ఈనెల 9 సాయంత్రం సిరిపురం బాలల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ బసంత్‌కుమార్‌ తెలిపారు. వీఎంఆర్‌డీఏ డిజైన్‌ చేసిన ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం, జీవీఎంసి డిజైన్‌ చేసిన ఇంటిగ్రేటెడ్‌ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు కాంప్లెక్స్‌ల నిర్మాణంపైనా ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు బసంత్‌కుమార్‌ తెలిపారు. బీచ్‌రోడ్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టు డిజైన్‌ను సీఎం సమక్షంలో ఇప్పటికే ప్రదర్శించామన్నారు. మూడు ప్రాజెక్టులపై అభిప్రాయాలను తొలుత వెబ్‌సైట్ ఉంచి వెబ్సైట్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ ప్రక్రియ పూర్తయినందున తదుపరి ప్రజలతో నేరుగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. మూడు డిజైన్‌లను సెప్టెంబరు 30 వరకు వెబ్‌సైట్లో ఉంచగా వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టుకు 69.1 శాతం, మిగిలిన ప్రాజెక్టులకు 11 శాతం, 19.8 శాతం ఓట్లు వచ్చాయి. ప్రాథమిక దశ దాటిన ఈ అంశంపై ప్రజలతో నేరుగా అభిప్రాయ సేకరణ చేసేందుకు వీఎంఆర్‌డీఏ కసరత్తు ప్రారంభించింది. బీచ్‌రోడ్‌ అపార్టుమెంట్ రెసిడెంట్్స వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు అభిప్రాయ సేకరణకు విధిగా హాజరు కావాలని కమిషనర్‌ కోరారు. వైఎంసిఎ కూడలి నుంచి పోలీసు అతిథి గృహం వరకు 800 మీటర్ల ప్రాంతంలో వీఎంఆర్‌డీఏ డిజైన్‌ చేసిన ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ ప్రాంతంలో ఉన్న కురుసుర, టీయూ 142, విక్టరీ ఎట్ సీలను సమీకృతం చేస్తారు. ఇందుకు 800 మీటర్ల ప్రాంతంలో భూగర్భ మార్గం, భూగర్భ పార్కింగ్‌ ఏర్పాటు చేస్తారు. దీని పైభాగంలో పార్కులు అభివృద్ధి చేస్తారు. ఫలితంగా బీచ్‌రోడ్‌ ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం అవుతుంది. ఏక కాలంలో 800 కార్లు, 1,400 ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌ చేసే అవకాశం ఉంటుందని కమిషనర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...