Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

కంటెయినర్‌ థియేటర్లదే భవిష్యత్తు

విశాఖ ఎంపీ హరిబాబు

అచ్యుతాపురంలో ప్రారంభం

vsp-gen6a.jpg

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ప్రజలకు వినోదం అందించడానికి కంటెయినర్‌ థియేటర్ల అవసరం భవిష్యత్తులో చాలా ఉంటుందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు అన్నారు. అచ్యుతాపురంలో నిర్మించిన రెండు కంటెయినర్‌ థియేటర్లను స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చైనా సాంకేతికతతో ఈ తరహా థియేటర్లను నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. మామూలు థియేటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక సౌకర్యాలతో వీటిని నిర్మించిన ఎస్‌టీబీఎల్‌ నిర్మాణ సంస్థ అధినేత గుత్తికొండ బాలాజీని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ పెరుగుతున్న కంటెయినర్‌ థియేటర్ల నిర్మాణం చేపట్టడానికి చాలామంది ముందుకొస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 250 థియేటర్ల నిర్మాణానికి తమతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. కంటెయినర్‌ థియేటర్ల వల్ల ఖర్చు, సమయం తగ్గుతాయని... ఒకవేళ ప్రేక్షకాదరణ లేకపోతే వేరే ప్రాంతంలో సులభంగా మళ్లీ నిర్మాణం చేపట్టవచ్చని ఆయన తెలిపారు. ఈ తరహా థియేటరల నిర్మాణానికి ఎవరైనా ముందుకొస్తే సాంకేతిక సహాయం అందిస్తామని... లేకుంటే స్వయంగా నిర్మించి ఇస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ప్రారంభ చిత్రంగా ప్రదర్శించిన ఖైదీ నెంబర్‌ 150 చిత్రాన్ని కొద్దిసేపు వీక్షించారు. థియేటర్‌లోని సౌకర్యాలు చూసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీబీఎల్‌ జీఎం కృష్ణ, మండల పరిషత్తు అధ్యక్షుడు చేకూరి శ్రీనివాసరాజు, ఉపాధ్యక్షుడు రాజాన రమేష్‌, జడ్పీటీసీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ జనపరెడ్డి నర్సింగరావు, దూలి రంగనాయకులు, కుమార్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి దేశంశెట్టి శంకరరావు, శివ, వెంకునాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక అదనపు ఎస్సై సీహెచ్‌.మల్లేశ్వరరావు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Link to comment
Share on other sites

వైజాగ్‌లో ‘స్కై టవర్‌’!
 
  • ఈఫిల్‌ టవర్‌ను పోలిన నిర్మాణం
  • 230 మీటర్ల ఎత్తుతో దేశంలోనే తొలిసారి
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): సాగర నగరం విశాఖ సిగలో మరో అద్భుతమైన ప్రాజెక్టు చేరనుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వైజాగ్‌లో అతి పెద్ద ‘స్కై టవర్‌’ నిర్మాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో 120 మీటర్ల ఎత్తున కైలాస గిరిపై స్కై టవర్‌ నిర్మించాలని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కైలాసగిరి 110 మీటర్ల ఎత్తులో ఉంది. పర్యాటక శాఖ నిర్మించతలపెట్టిన స్కై టవర్‌ ఎత్తు 120 మీటర్లు దీంతో మొత్తం 230 మీటర్ల ఎత్తులో స్కై టవర్‌ నిర్మాణం ఆవిష్కృతం కాబోతుంది. స్కై టవర్‌ నిర్మాణానికి జర్మనీకి చెందిన ‘హుస్‌ అట్రాక్షన్స్‌’ సంస్థ ముందుకు వచ్చింది. గత వారం విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ఈ సంస్థతో పర్యాటక శాఖ అధికారులతో ఎంవోయు చేసుకుంది. దీంతో పాటు సంస్థ ప్రతినిధులు ఈ నెల 7న సీఎం చంద్రబాబుతో సమావేశమై ప్రాజెక్టు వివరాలను చంద్రబాబుకు తెలియజేస్తారు. దీని నిర్మాణానికి కైలాస గిరిపై సుమారు 5 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. రెండు ఎకరాల్లో స్కై టవర్‌ నిర్మాణం చేపట్టడంతో పాటు టవర్‌ ఉన్న ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేసేందు మరో మూడు ఎకరాలు కావాలన్నారు. స్కై టవర్‌ ఎక్కి వైజాగ్‌ మొత్తాన్ని ఒకేసారి వీక్షించే విధంగా పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫ్రాన్స్‌లో ఉన్న ఈఫిల్‌ టవర్‌ మాదిరిగానే వైజాగ్‌ స్కై టవర్‌ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...