Jump to content

Vizag (Araku Valley) Coffee


Recommended Posts

8 minutes ago, Seniorfan said:

I mean processed in Europe. Gold is not available in US except for the imported ones.

not true at all. US now produces more gold than it was during gold rush days. US is top 3 gold producer in the world. any way, that is a side topic.

coming to your coffee subject, yes you are right. story is same on Cocoa also. Hardwork is African/South American child labor, profits are for european brands

Link to comment
Share on other sites

3 hours ago, swarnandhra said:

not true at all. US now produces more gold than it was during gold rush days. US is top 3 gold producer in the world. any way, that is a side topic.

coming to your coffee subject, yes you are right. story is same on Cocoa also. Hardwork is African/South American child labor, profits are for european brands

:-) ? baga confuse ayyaru.... I was talking about Nescafé gold, a particular roast variant....that is available in Europe market and not in US...pina link ichha....I like taste and aroma of it...

Link to comment
Share on other sites

4 hours ago, Seniorfan said:

:-) ? baga confuse ayyaru.... I was talking about Nescafé gold, a particular roast variant....that is available in Europe market and not in US...pina link ichha....I like taste and aroma of it...

:P

 :shakehands:

Edited by swarnandhra
Link to comment
Share on other sites

  • 1 month later...
అరకు కాఫీ ఆకులతో టీ
02-05-2018 02:18:44
 
636608291763106988.jpg
  • ఇదో.. వెరై‘టీ’
  • ‘చాయ్‌ గురు’ పేరుతో ప్రచారం
  • పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమం
అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): కాఫీ ఆకులతో టీ తయారు చేస్తే వెరైటీగా ఉంటుంది కదూ..! అందుకే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ దేశంలోనే తొలిసారిగా కాఫీ ఆకులతో టీ తయారు చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జింకే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పర్యాటకశాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్‌ మీనా తెలిపారు. కాఫీ ఆకులతో టీ తయారు చేసే వినూత్న విధానాన్ని ప్రోత్సహిస్తూ, దీనికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ‘చాయ్‌ గురు’ అని నామకరణం చేశారు. అరకు టీని పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గ్రీస్‌ టీకి ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుందని వివరించారు.
 
 
గ్రీస్‌ టీకి ప్రత్యామ్నాయంగా అరకు టీని విశ్వవ్యాప్తం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చాయ్‌ గురు కార్యక్రమం పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహణ సంచాలకులు హిమాన్షు శుక్లా నేతృత్వంలో జరుగుతుందని తెలిపారు. మొత్తం నాలుగు రకాల కాఫీ ఆకుల టీని పర్యాటకులకు పరిచయం చేయనున్నామని తెలిపారు. అరకు చాయ్‌, కుటి, ఉదయపు టీ, రోసెల్లె టీ పేరిట నాలుగు రకాల టీలు తయారవుతుండగా, ఇతర రాష్ట్రాలు, దేశాల నంచి వచ్చిన పర్యాటకులకు వీటిని పరిచయం చేయాలని నిర్ణయించామన్నారు. కెఫిస్‌ తక్కువగా, కృత్రిమ రుచులకు దూరంగా ఉండడమే ఈ అరకు కాఫీ ఆకుల టీ ప్రత్యేకతని వివరించారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
హాయ్‌ హాయ్‌.. అరకు చాయ్‌
కాఫీ ఆకులతో తయారీ
ఈనాడు డిజిటల్‌ - విశాఖపట్నం
7ap-main3a.jpg
విశాఖ జిల్లాలోని అరకు కాఫీకి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. విదేశాల్లోనూ అరకు కాఫీ షాపులు కొనసాగుతున్నాయి. మన్యం కాఫీకి మరింత ప్రాచుర్యం కల్పించి..ఇంటింటికీ చేరేలా ఇన్‌స్టెంట్‌ కాఫీ పొట్లాలను మార్కెట్లోకి తెచ్చారు. తాజాగా కాఫీ ఆకులతో తయారుచేసే తేనీటి(టీ)ని వినియోగంలోకి తెస్తున్నారు. అరకు లోయ నుంచి కాఫీ ఆకులతో తయారుచేసిన తొలి టీ ప్రయోగం విజయవంతం కావడంతో ‘అరకు చాయ్‌’ పేరుతో మార్కెట్‌లోకి తేవాలని భావిస్తున్నారు. ఈ తేనీటి తయారీకి పాలు అవసరం లేదు. సహజ సిద్ధంగా తయారయ్యే ఈ చాయ్‌తో తేనీటి ప్రియుల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని తయారీదారు చెబుతున్నారు. గ్రీన్‌ టీ మాదిరిగ మంచిగ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు కాఫీ గింజలతోనే రైతులకు ఆదాయం వచ్చేది.. ఆకులను వదిలేసేవారు. తాజా పరిశోధనల్లో ఈ ఆకులు సైతం టీపొడి తయారీకి పనికొస్తాయని తేలడంతో ఇకపై రైతులకు వాటితో అదనపు ఆదాయం లభించే అవకాశముంది.

7ap-main3b.jpg

దేశంలోనే మొదటిది.. తేయాకుతో తయారైన పొడినే ఇప్పటివరకు చాయ్‌ తయారీకి వినియోగిస్తున్నాం. తద్భిన్నంగా కాఫీ ఆకులతో ఎందుకు చేయకూడదని అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు రామన్‌ మదాల ఆలోచన చేశారు. అరకులోయ ప్రాంతంలో లభ్యమయ్యే కాఫీ ఆకులు, కొన్ని మూలికలను తీసుకెళ్లి అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో పరిశోధనలు జరిపారు. సానుకూల ఫలితాలు రావడంతో ఈ తేనీటిని పరిచయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాఫీ ఆకులతో టీ తయారీని తొలిసారిగా ఇథియోపియా దేశంలో చేశారు. అక్కడ దాన్ని ‘కుటి’ అని పిలుస్తారు. మన దేశంలో ఇప్పటి వరకు అలాంటిదేం జరగలేదు. అరకు చాయ్‌తోనే తొలిసారిగా భారతీయ మార్కెట్‌లోకి కాఫీ ఆకు టీ అందుబాటులోకి వస్తోంది. 70శాతం కాఫీ ఆకులు, 12శాతం అనాస పువ్వు, 10 శాతం నిమ్మగడ్డి, 8శాతం సోపు విత్తనాల మిశ్రమంతో ఈ అరకు కాఫీ ఆకుల టీపొడిని తయారుచేస్తున్నారు. పాలు, పంచదార కలపనవసరం లేదు. నేరుగా వేడినీటిలో ఈ పొట్లాన్ని ముంచి తాగేయడమే. ఈ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెచ్చేందుకు నాచురల్‌ ఫార్మసీ ఇండియా ప్రైవేటు సంస్థ ప్రతినిధి రామన్‌ మదాల గిరిజన సహకార సంస్థ(జీసీసీ)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై జీసీసీ ఎండీ బాబూరావునాయుడు వద్ద ప్రస్తావించగా.. ‘‘అరకు కాఫీ ఆకులతో టీ తయారీ పరిశోధన విజయవంతం అయినట్లు తెలిసింది. త్వరలోనే మార్కెట్‌లోకి రావొచ్చు. ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవలే మమ్మల్ని కలిశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై ఆలోచన చేస్తాం’’ అన్నారాయన.
 
Link to comment
Share on other sites

  • 5 weeks later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...