Jump to content

Nagarjuna Sagar Airport


Recommended Posts

  • 3 weeks later...
  • 4 weeks later...
  • 4 months later...
  • 2 months later...
  • 1 year later...

సాగర్‌, పుట్టపర్తికి..: విజయవాడ- నాగార్జునసాగర్‌, విజయవాడ- పుట్టపర్తి మధ్య కూడా విమాన సేవలను ప్రవేశపెట్టేందుకు ఏపీఏడీసీఎల్‌ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఈ రెండు ప్రాంతాలకు 9 సీట్ల ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడపాలనేది సంస్థ యోచన.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
వచ్చే నెలలో పుట్టపర్తి, సాగర్‌కు విమానయాన సేవలు
విజయవాడ నుంచి నడపనున్న ‘సుప్రీం ఎయిర్‌ లైన్స్‌’
ఈనాడు, అమరావతి: వచ్చే నెల నుంచి విజయవాడ నుంచి పుట్టపర్తి, నాగార్జునసాగర్‌ మధ్య విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నారు. విజయవాడ నుంచి ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ రెండు ప్రాంతాలకు ప్రత్యేకించి పర్యాటకులకు విమానయాన సేవలు ప్రారంభించేందుకు రాష్ట్ర విమానయాన అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ప్రజాభిప్రాయాన్ని కోరినపుడు అత్యధికులు తమ సమ్మతిని తెలిపారు. దీనిపై బిడ్లను ఆహ్వానించినపుడు మిగతా సంస్థల కంటే ‘సుప్రీం ఎయిర్‌లైన్స్‌’ తక్కువ ఖర్చుకు నడిపేందుకు ముందుకు వచ్చిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే సుప్రీం ఎయిర్‌లైన్స్‌తో అవగాహన ఒప్పందం చేసుకొని సేవలు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి పుట్టపర్తికి రోజూ ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరి 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 9 గంటలకు పుట్టపర్తిలో బయలుదేరి 10.30 గంటలకు విజయవాడకు రానుంది. సాయంత్రం మళ్లీ 5 గంటలకు మరో సర్వీసు నడపనున్నారు. విజయవాడ నుంచి నాగార్జునసాగర్‌కు ఉదయం 11 గంటలకు బయలుదేరే విమానం తిరిగి సాయంత్రం 3 గంటలకు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 
 

 

 
Link to comment
Share on other sites

సాగర్‌ టూ బెజవాడ విమానయానం
26-06-2018 09:05:46
 
636656007469964124.jpg
  • వచ్చే మాసం నుంచే..
  • ముందుకు వచ్చిన సుప్రీం ఎయిర్‌ సర్వీస్‌
  • పర్యాటక అభివృద్ధికి దోహదం
మాచర్ల(గుంటూరు జిల్లా): ఆరు దశాబ్ధాల తరువాత సాగర్‌ రన్‌వే అందుబాటులోకి రానుంది. అప్పుడెప్పుడో నాగార్జున సాగర్‌ డ్యాం నిర్మాణ సమయంలో శంకుస్థాపన నిమిత్తం అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రాక కోసం ఏర్పాటు చేసిన మినీ విమానాశ్రయం ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడనుంది. శంకుస్థాపన కోసం నెహ్రూ, ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం కోసం ఇందిరాగాంధీ రావడం మినహా 2008 వరకు ఇక్కడ ఒక్క విమానం వాలింది లేదు.. ఆ తరువాత ఓ సంస్థ పైలట్ల శిక్షణ కోసం లీజుకు తీసుకున్నప్పుడు టూ సీటర్‌ విమానాలు అప్పుడప్పుడు మాత్రమే ఎగిరాయి.
 
 
జూలై నుంచి టేకాఫ్‌
వచ్చే నెల నుంచి నాగార్జునసాగర్‌ ఎయిరోడ్రమ్‌కు విమాన రాకపోకలు జరిపేందుకు రంగం సిద్ధమైంది. తొలివిడతగా విజయవాడ నుంచి నాగార్జున సాగర్‌కు ఉదయం 11 గంటలకు ఫ్లైట్‌ వచ్చేలా సుప్రీం ఎయిర్‌ సర్వీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి విజయవాడకు అదే ఫ్లైట్‌ వెళ్లనుంది. తొలి విడత చిన్న విమానాలను అంటే రమారమి 40 మంది ప్రయాణికుల సామర్థ్యం గల విమానాలను నడుపుతారు. ఇటీవల విజయవాడ-పుట్టపర్తి, విజయవాడ-సాగర్‌ విమానయాన సేవలు ప్రారంభించేందుకు ఏపీఏడీసీఎల్‌ (విమానయాన అభివృద్ధి సంస్థ) బిడ్‌లను ఆహ్వానించింది. ఈ క్రమంలో అతి తక్కువ ధరల్లో తాము నడుపుతామంటూ సుప్రీం ఎయిర్‌లైన్స్‌ ముందుకొచ్చింది. రాజధాని అతి సమీపంగా ఉన్న అమరావతికి వెళ్లేందుకు రాష్ట్రంలో ఈ చివర ఉన్న ప్రజలకు ఇది ఆనందకరమైన వార్తే. రోడ్డు బాట వెళ్లాలంటే సుమారు గంటలు సమయం పడుతుంది. విమానం సర్వీసు ఏర్పాటు వల్ల అరగంటలో రాజధాని ప్రాంతానికి ఎగిరెళ్లొచ్చు.
 
 
పర్యాటకంగా కూడా..
రెండేళ్ల క్రితం సాగర్‌ ఎయిరోడ్రమ్‌ను గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 80 ఎకరాల్లో ఉన్న ఎయిరోడ్రమ్‌ను మరింత విస్తరించాలని బావించింది. రెవెన్యూ శాఖను సమాచారం కోరితే 250 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని సమకూర్చవచ్చన్న విషయాన్ని వివరించింది. అంతర్జాతీయ విమాన ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు వెయ్యి ఎకరాలు అవసరమని విమానయాన అభివృద్ధి సంస్థ సూచించగా, ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
 
నాగార్జునసాగర్‌, ఎత్తిపోతల, అనుపు, ఐల్యాండ్‌ మ్యూజియం వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలు ఇక్కడ ఇప్పటి వరకు నిస్తేజంగా ఉన్నాయి. విమానం ఏర్పాటు వల్ల పర్యాటకాభివృద్ధి సాధ్యం కానుంది. నేపాల్‌, చైనా, టిబెట్‌ తదితర దేశాల నుంచి బౌద్ధ బిక్షువులు ఆచార్య నాగార్జునుడు నడయాడిన సాగర్‌ ప్రాంతానికి శ్రమకోర్చి వస్తున్నారు. విమానాలు తిరిగితే విదేశీ అతిథుల రాక కూడా సులభతరమవుతుంది. తాజాగా విమాన సర్వీసు ప్రారంభం కానుండడంపై హర్షం వెలువెత్తుతోంది.
Link to comment
Share on other sites

  • 6 months later...

AP State govt plans flights to Nagarjunakonda, Puttaparthi  

THE HANS INDIA |   Jan 18,2019 , 12:44 AM IST
   

 
 
AP State govt plans flights to Nagarjunakonda, Puttaparthi  
AP State govt plans flights to Nagarjunakonda, Puttaparthi  
 
 
Guntur: The Andhra Pradesh Airports Development Corporation is making arrangements to operate nine seater flights from Gannavaram to Nagarjunasagar and Puttaparthi by  March end this year. The Supreme Airlines got all the permissions from the government to operate flights from Gannavaram to Nagarjunasagar and Puttaparthi. But it is facing problems with regard to pilots.
 
Pilots who were working in the airlines were shifted to other airlines. Due to pilots’ problem, the company has decided to engage foreign nationals as pilots and seeking permission from the Central government. As soon as it gets clearance from the Centre, it will recruit the pilots and start operations  to Nagarjunasagar and Puttaparthi.
 
 
 
The Supreme Airlines will operate daily two trips to Nagarjunasagar and Puttaparthi. The government  is feeling that  if Nagarjunasagar Airstrip will come into operation, more tourists will visit Amaravati as part of their visits to Nagarjunakonda.
 
 
 
The government is planning to develop Buddhists circuit in the State. Andhra Pradesh Airports Development Corporation Managing Director and CEO Virendra Singh said, ``We are doing our best to operate flights to Nagarjunakonda and Puttaparthi at the earliest. Pilots’ problems will be solved soon. If we operate nine-seater flights to Nagarjunakonda and Puttaparthi, and the tourism in the State will get boost. "
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...