Jump to content

New Air ports


Recommended Posts

Every major PORT in the world has cargo dedicated airport close to it.

CBN ade follow avutunnadu. anthe kani pratidi only passengers ni mind lo petti chesindi kadu.

 

EWR lo port side ki logistics runways untai

Houston jacinto port lo kuda logistics airport undi.

Oakland airport lo sagam port logistics ki vadataru.

 

Antwarp PORT airport+rail combo thoone worlds best port ayyindi

Belgium also has intra water transport that connects ports which we are trying to do with Buckingham revival.

 

http://conexbe.be/img/user/file/Profielenboekje.pdf

 

2002-03 lo dacoit gadu krishnapatnam meda ettane edcheadu enduku private ports ani. A video dorukudda ani chustunna ekkadanna.

 

 

/********************************see below how belgium became logistics hub.Logistics airports are key to achieve that***************/

10 Reasons  Favoring Belgium as a logistics location
 

… has the second largest seaport in Europe, the Port of Antwerp.
… is the gateway to Europe, the most attractive location for goods
distribution within Europe.
… has fast-acting, flexible logistics service providers offering
industry-specific solutions and expertise in all areas of logistics.
… Brussels and Liege Airport handle more than 1.000.000 tons of
airfreight per year.
… is the most central Air Freight Hub of Europe with excellent
trucking connections all over Europe.
… is an intercontinental and intermodal cargo connection point.

… is highly experienced in the African freight market.
… has tons of focus and expertise on Pharmaceuticals, Perishables
and Time-sensitive airfreight cargo.
… has a highly trained, multilingual and flexible workforce.
… the Belgian forwarders orchestrate the supply chain and
ensure the smooth purchase and delivery of your goods by sea,
inland waterways, short sea, rail, road or air.

Link to comment
Share on other sites

Every major PORT in the world has cargo dedicated airport close to it.

CBN ade follow avutunnadu. anthe kani pratidi only passengers ni mind lo petti chesindi kadu.

 

EWR lo port side ki logistics runways untai

Houston jacinto port lo kuda logistics airport undi.

Oakland airport lo sagam port logistics ki vadataru.

 

Antwarp PORT airport+rail combo thoone worlds best port ayyindi

Belgium also has intra water transport that connects ports which we are trying to do with Buckingham revival.

 

http://conexbe.be/img/user/file/Profielenboekje.pdf

 

2002-03 lo dacoit gadu krishnapatnam meda ettane edcheadu enduku private ports ani. A video dorukudda ani chustunna ekkadanna.

 

 

/********************************see below how belgium became logistics hub.Logistics airports are key to achieve that***************/

10 Reasons Favoring Belgium as a logistics location

 

… has the second largest seaport in Europe, the Port of Antwerp.

… is the gateway to Europe, the most attractive location for goods

distribution within Europe.

… has fast-acting, flexible logistics service providers offering

industry-specific solutions and expertise in all areas of logistics.

… Brussels and Liege Airport handle more than 1.000.000 tons of

airfreight per year.

… is the most central Air Freight Hub of Europe with excellent

trucking connections all over Europe.

… is an intercontinental and intermodal cargo connection point.

… is highly experienced in the African freight market.

… has tons of focus and expertise on Pharmaceuticals, Perishables

and Time-sensitive airfreight cargo.

… has a highly trained, multilingual and flexible workforce.

… the Belgian forwarders orchestrate the supply chain and

ensure the smooth purchase and delivery of your goods by sea,

inland waterways, short sea, rail, road or air.

Bro for construction of cargo airport how many acres of land is required

Link to comment
Share on other sites

త్వరతగతిన హైలెవల్‌ కెనాల్‌ ప్రాజెక్ట్‌ భూసేకరణ

ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఇంతియాజ్‌

nlr-gen8a.jpg

నెల్లూరు (సచివాలయం), న్యూస్‌టుడే: జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద ఏర్పాటుచేస్తున్న ఆనం సంజీవరెడ్డి హైలెవల్‌ కెనాల్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూసేకరణ, పునరావాసం తదితర పనులను నిబంధనల మేరకు త్వరితగతిన చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఈ కెనాల్‌ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్‌పై సర్వే పనులు చేపట్టి అవరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఆర్డీవో రమణ, సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాసులురెడ్డి, ఏఈ నగేష్‌, డీఈలు గజేంద్రరెడ్డి, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

దగదర్తి భూసేకణ ప్రక్రియ పూర్తిచేయండి

జిల్లాలో దగదర్తి వద్ద ఏర్పాటు చేస్తున్న విమానాశ్రయానికి నిర్దేశించిన భూసేకరణ పనులు పెండింగ్‌ లేకుండా త్వరిగతగతిన పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో విమానాశ్రయం భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సీజేఎఫ్‌ఎస్‌, పట్టా, అసైన్డ్‌, ప్రభుత్వ భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు సత్వరం పూర్తిచేయాలన్నారు. సర్వేచేసి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అర్హులైన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో నరసింహన్‌, తహసీల్దార్‌ మదుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు జనవరిలో శంఖుస్థాపన

 

 
 

bhogaparam-airport-16112016.jpg

భోగాపురంలో నిర్మించతలపెట్టిన గ్రీన్‌‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచంలోని టాప్-10లో ఒకటిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంలో అనుభవమున్న విదేశీ-స్వదేశీ సంస్థల భాగస్వామ్యంతో దీనిని నిర్మించాలని సూచించారు. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో రాష్ట్రంలోని మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. భోగాపురం విమానాశ్రయానికి వచ్చే నెల మొదటివారం కల్లా పర్యావరణ అనుమతులు పొందాలని, 2017 జనవరి నాటికి పబ్లిక్ హియరింగ్‌ను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

భోగాపురం విమానాశ్రయానికి 2,646 ఎకరాలకు గాను 2,172 ఎకరాల సేకరణ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఓర్వకల్లు, దొనకొండ, నాగార్జునసాగర్, దగదర్తి విమానాశ్రయాల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రంలోని విమానాశ్రయాలకు ప్రయాణికుల తాకిడి పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 44% పురోగతి సాధించామని అన్నారు. అత్యధికంగా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 13,22,538 మంది ప్రయాణికులు రాకపోకలు జరిపినట్టు తెలిపారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల విస్తరణ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణలో భాగంగా 698 ఎకరాలకు గాను 610 ఎకరాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించామన్నారు.

 

తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు, విశాఖపట్నం విమానాశ్రయానికి దుబాయ్, లండన్, హాంగ్‌కాంగ్ నుంచి సర్వీసులు నడిచేలా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే విజయవాడ – ముంబై మధ్యన తక్షణం విమాన సర్వీసుల అవసరం వుందన్నారు.

 
 
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
కడప ఎయిర్‌పోర్టు రన్‌వే పొడిగింపునకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
 
కడప: కడప విమానాశ్రయం రన్‌వే పొడిగింపునకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ. 80 కోట్ల వ్యయంతో 1.2 కి.మీ మేర రన్‌వే పొడిగింపునకు ఏఏఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. జంబో విమానాలు కూడా ల్యాండ్‌ అయ్యేలా రన్‌వే విస్తరణ జరుగనుంది. రన్‌వే పొడిగింపు నిర్ణయంపై కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుకు ఎంపీ సీఎం రమేష్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. రాత్రి వేళల్లో విమానాలు దిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ వినతి చేశారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నెలకొల్పే బాధ్యతను భోగాపురం ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ కంపెనీకి అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదించింది. 1010 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తారు. ఎకరాకు రూ.8 లక్షల చొప్పున చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది. భూసేకరణ కోసం భోగాపురం ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ రూ.100 కోట్లను హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు అంగీకరించింది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
దేశంలో రెండవ అతిపెద్ద లాజిస్టిక్ కార్గో హబ్‌గా దగదర్తి విమానాశ్రయం

 

 
dagadarthi-airport-18032017.jpg
share.png

నవ్యాంధ్ర అభివృద్దిలో ప్ర‌భుత్వం ప్ర‌ణాళికాబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఒకొక్క‌టిగా ప‌రిశ్ర‌మ‌ల‌ను, ఐటీ కంపెనీల‌ను రాష్ట్రానికి ఆహ్వానిస్తుంది. ద‌గ‌ద‌ర్తి విమానాశ్రయాన్ని దేశంలో రెండవ అతిపెద్ద లాజిస్టిక్ కార్గో హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం అవుతున్నాయి. ఈమేర‌కు సీఎం చంద్ర‌బాబునాయుడు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఒప్పందం చేసుకున్న తరువాత 18 మాసాలలో విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆయన మలేసియాకు చెందిన ఏవియేషన్ సంస్థ-‘స్కై పార్క్ బిజినెస్’ ప్రతినిధులకు స్పష్టంచేశారు.

బుధవారం రాత్రి విజయవాడ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి దగదర్తి ఎయిర్ పోర్టు ప్రాజెక్టుపై స్కైపార్క్ ప్రతినిధులతో చర్చించారు. విమానాశ్రయంలో అంతర్భాగంగా కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ తదితర నిర్మాణాలను తామే చేపడుతామని స్కైపార్క్ ప్రతినిధులు చెప్పారు. పర్యాటకంగా కూడా ఆకర్షణీయంగా వుండేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు.

Advertisements

ఒకప్పుడు ఎంతో చిన్నదిగా వున్న తిరుచనాపల్లి విమానాశ్రయం ఇప్పుడు దేశంలో వున్న గొప్ప విమానాశ్రయాల్లో ఒకటిగా వుందని, ఆ తరహాలో దగదర్తి విమానాశ్రయాన్ని అభివృద్ది చేస్తామని అన్నారు. చెన్నయ్ నగరానికి దగ్గరలో వుండటం, నెల్లూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో దగదర్తి విమానాశ్రయానికి రానున్న కాలంలో డిమాండ్ వస్తుందనే ఉద్ధేశంతోనే ఇక్కడ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయాలని తలపెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. కృష్ణపట్నం ఓడరేవుకు 30 కిలోమీటర్ల దూరంలో వుండటమే దీనికి ప్రధాన ఆకర్షణ అని అన్నారు. అటు శ్రీసిటీకి దగ్గరగా వుండటం వల్ల అంతర్జాతీయ అవసరాలు తీర్చగలదన్నారు. సమావేశంలో మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
సాగర్‌ ఎయిర్‌పోర్ట్‌..సర్వేలతో సరి..
 
636280990656030435.jpg
  • సాగర్‌ ఎయిర్‌పోర్టు విస్తరణకు హడావుడి
  • కేంద్ర విమానయాన శాఖాధికారుల పర్యటనలు
  • భూ సేకరణకు రెవెన్యూ అధికారుల కసరత్తు
  • ఏడాదిగా ముందుకు కదలని ప్రయత్నాలు
 
రెండేళ్లు హడావుడి .. మూడుసార్లు కేంద్ర విమానయాన శాఖాధికారుల పర్యటనలు .. అదుగో .. ఇదిగో అని ఊరించిన విమానం జాడ లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నాగార్జునసాగర్‌, దొనకొండలను గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. నాలుగైదుసార్లు వాళ్లు వీళ్లూ వచ్చి చూడడం తప్ప అడుగు ముందుకు పడలేదు.

మాచర్ల: బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ఎందరో పోరాట ఫలితంగా నాగార్జున సాగర్‌ నిర్మాణానికి బీజం పడింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ డ్యాం నిర్మాణ శంకుస్థాపన కోసం వచ్చేందుకు నాగార్జునసాగర్‌లో 90 ఎకరాల విస్తీర్ణంలో మినీ ఎయిర్‌పోర్టును నిర్మించారు. డ్యాం ప్రారంభోత్సవానికి 1967లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. అప్పటి నుంచి కొన్ని దశాబ్ధాలుగా అది అలంకారప్రాయంగానే మిగిలిపోయింది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎయిర్‌పోర్టును ఫ్లయిటెక్‌ విమాన శిక్షణ కేంద్రం సంస్థకు లీజుకిచ్చారు. ఈ సంస్థ పైలట్లకు శిక్షణ ఇస్తుండేది. ఇద్దరు, ముగ్గురు కూర్చునే చిన్నపాటి విమానాలు ఇక్కడ కనిపించేవి. లీజుకు తీసుకున్న సంస్థ కూడా దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. సినిమా షూటింగ్‌లకు అద్దెకిస్తూ సొమ్ము చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత లీజును ప్రభుత్వం రద్దు చేసేసింది.
 
చిగురించిన ఆశలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నపాటి విమానాశ్రయాలను విస్తరించి వినియోగంలోకి తెస్తామనడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురించాయి. నాగార్జునసాగర్‌, సాగర్‌ రిజర్వాయర్‌లోని ఐలాండ్‌ మ్యూజియం, ఎత్తిపోతల, అనుపు ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు. టిబెట్‌, నేపాల్‌, చైనా తదితర ప్రాంతాల నుంచి బుద్ధిస్టులు వచ్చి వెళ్తుంటారు. ఎయిర్‌పోర్టు పూర్తయితే ఈ తాకిడి అధికమై వ్యాపారాలకు కొత్త శోభ వస్తుందన్న ఆశ ఇక్కడి వారికుంది. రాజధానికి కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో ఎయిర్‌పోర్టు పరిధిలో మిర్చి, నాపరాయి అమ్మకాలు ఎక్కువ. భారీస్థాయిలో లభ్యమయ్యే వీటి కోసం దూరప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తారన్న అంచనా కూడా ఉంది. ఇలా అనేకమంది ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

సర్వేలతో సరి..

ఇప్పటికి మూడుసార్లు కేంద్ర విమానశాఖాధికారులు సాగర్‌ ఎయిర్‌పోర్టును సందర్శించారు. విస్తరణ కోసం మరో 500 ఎకరాలు అదనంగా కావాలని రెవెన్యూ శాఖను కోరడంతో అధికారులు కసరత్తు చేశారు. సాగర్‌ పరిధిలోని చింతలతండా, పశువేముల, నాగులవరం గ్రామాల్లో పట్టా, ఆర్‌సీ, ప్రభుత్వ, అటవీ భూములను స్థానిక అధికారులు గుర్తించారు. మరోమారు కేంద్ర విమాన శాఖ నుంచి వెయ్యి ఎకరాలు అవసరమవుతుందని వెల్లడించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇక ఈవైపు చూసింది లేదు.
 
ఎయిర్‌పోర్టు విస్తరణపై అడపా దడపా ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కేంద్ర విమాన శాఖా సహాయ మంత్రి అశోక గజపతిరాజు దేశంలోని 32 విమానాశ్రయాలను బాగు చేయాలని ప్రతిపాదించారు. అందులో సాగర్‌ ఎయిర్‌పోర్టు కూడా ఒకటి కావడం గమనార్హం.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఏడాదిలో ఓర్వకల్లు విమానాశ్రయ సేవలు

కర్నూలు: ఓర్వకల్లు విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ వ్యయంతోనే నిర్మిస్తున్నట్లు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ స్పష్టంచేశారు. శుక్రవారం కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ విమానాశ్రయం కోసం 990 ఎకరాలు సేకరించామన్నారు. రూ.90 కోట్లతో రన్‌వే, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, రోడ్లు, టెర్మినల్‌ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా మౌలిక వసతులు పూర్తిచేసి విమాన రాకపోకలు ప్రారంభిస్తామన్నారు.

రాష్ట్ర వార్తలు
Link to comment
Share on other sites

Work on AP’s Orvakal airport to beginsoon, land acquisition near completion

V Rishi Kumar

comments   ·   print   ·   T+  
 
 
 
Ajay_Jain_3160092e.jpg
Ajay Jain, Principal Secretary, Infrastructure and Energy, Andhra Pradesh

Seeks to join Udan regional network by next year

Hyderabad, May 1:  

Work on the greenfield airport of Orvakal near Kurnool in Andhra Pradesh is set to begin within a few days and will be completed in 12-18 months.

Having secured various mandatory clearances, including clearance from Union Civil Aviation Ministry in October 2016, the State Government will begin work on the new airport planned to come up about 20 km from Kurnool town on the Kurnool-Nandyal section.

Ajay Jain, Principal Secretary, Infrastructure and Energy, told BusinessLine, “Ninety-five per cent of the land acquisition for the airport project has been completed and works are likely to commence within a week. Of the 900 acres, more than 700 acres belongs to the government and the rest is also expected to be acquired soon.”

“The project is being implemented by the government itself as the invitation for private sector participation did not receive good response as they do not see this segment profitable. Therefore, we have tendered out for construction companies and will invest about ₹90 crore for the project. We expect to connect to Vijayawada, Visakhapatnam, Bengaluru and other locations, just as Kadapa airport provides connectivity to some major cities,” he said.

3.5-km runway

 

The no-frills airport will have a runway of about 3.5 km, a terminal building and the airport area would have a protection wall. This airport would join the Prime Minister Narendra Modi’s Udan scheme which seeks to provide regional connectivity. It is expected to boost the economic activity in the Rayalaseema region.

Bhogapuram International Corporation Airport Ltd (BIACL), a special purpose vehicle formed for development of new airports in the State, has been allotted about 639 acres in the Pudicherla, Orvakal and Kannamadakala villages for the airport project.BIACL has the mandate to develop greenfield airports at Bhogapuram in Vizianagaram near Visakhapatnam, Kuppam in Chittoor district, Dagadarthi in Nellore and Orvakal in Kurnool.

The BIACL, which is developing a major international airport with an outlay of ₹2,261 crore, plans to encourage setting up of a MRO (maintenance, overhaul and repair) facility and commercial space, has secured environmental clearance and the land acquisition is at advanced stage and likely to be completed soon.

Hiccups

 

There are some pockets in both at Bhogapuram and Orvakal projects which need to be acquired and there is some opposition from local people and land owners. In some cases the problem is pronounced as there are multiple claimants without having title.

(This article was published on May 1, 2017)
Link to comment
Share on other sites

  • 2 weeks later...
త్వరలో నెల్లూరుకు విమాన సేవలు
 
  • కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు
నెల్లూరు (వైద్యం): నెల్లూరు జిల్లాకు త్వరలో విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన అభివృద్ధి మంత్రి అశోక్‌ గజపతి రాజు వెల్లడించారు. తనయుడిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న మంత్రి నారాయణ కుటుంబాన్ని సోమవారం నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో అశోక్‌ గజపతిరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు భూ సేకరణలో జాప్యం జరుగుతోందన్నారు. పూర్తిస్థాయి స్థలసేకరణ చేపట్టి, రహదారులు నిర్మించి విమాన సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీగా భారత విమానయాన సేవలు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. అలాగే ఆర్థికంగా మరింత వనరులు చేకూర్చేలా సరుకుల రవాణాపై కూడా దృష్టి పెడతామని మంత్రి పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

 

త్వరలో నెల్లూరుకు విమాన సేవలు

 

  • కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు
నెల్లూరు (వైద్యం): నెల్లూరు జిల్లాకు త్వరలో విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన అభివృద్ధి మంత్రి అశోక్‌ గజపతి రాజు వెల్లడించారు. తనయుడిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న మంత్రి నారాయణ కుటుంబాన్ని సోమవారం నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో అశోక్‌ గజపతిరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు భూ సేకరణలో జాప్యం జరుగుతోందన్నారు. పూర్తిస్థాయి స్థలసేకరణ చేపట్టి, రహదారులు నిర్మించి విమాన సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీగా భారత విమానయాన సేవలు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. అలాగే ఆర్థికంగా మరింత వనరులు చేకూర్చేలా సరుకుల రవాణాపై కూడా దృష్టి పెడతామని మంత్రి పేర్కొన్నారు.

 

త్వరలో నెల్లూరుకు విమాన సేవలు :blink: 

Link to comment
Share on other sites

నాలుగేళ్లలో భోగాపురం పూర్తి

అక్కరకు రానున్న శంషాబాద్‌ విమానాశ్రయ నిర్మాణ అనుభవం

నివేదిక వచ్చిన వెంటనే కొత్తగూడెంపై నిర్ణయం

వైమానిక రంగంలో ఒక ఉద్యోగం బయట ఆరు ఉద్యోగాల పెట్టు

పౌరవిమానయాన మిత్రగా ఆంధ్రప్రదేశ్‌

వచ్చే రెండేళ్లలో 50 విమానాశ్రయాల అభివృద్ధి

‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు

ఈనాడు - దిల్లీ

19ap-main4a.jpg శంషాబాద్‌ విమానాశ్రయం రావడానికి ముందు బేగం పేటలో ట్రాఫిక్‌ పెంచడానికి ఇంధనంపై వ్యాట్‌ 4 శాతానికి తగ్గించాం. తర్వాత వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 16 శాతానికి పెంచారు. అలా చేయకపోయి ఉంటే ఈపాటికి శంషాబాద్‌ దేశ ఏరోనాటికల్‌ కేంద్రంగా మారి ఉండేది.  గత ప్రభుత్వంలో ఒక విధానం అంటూ లేకుండా తోచింది చేశారు. లేకపోతే ఇన్ని విమానాశ్రయాలు నిరుపయోగంగా ఉండేవికావు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో 72 విమానాశ్రయాలు ఉపయోగంలో ఉంటే, మేం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఉడాన్‌ పథకం ద్వారా 33 విమానాశ్రయాలు వినియోగంలోకి తెచ్చాం.

భారత పౌరవిమానయాన రంగం మంచి దారిలో నడుస్తోందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిని నమోదుచేసినట్లు వెల్లడించారు. ఈ రంగంలోని వృద్ధి ప్రభావం మిగతా రంగాలపై రెట్టింపు స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగంలో ఒక ఉద్యోగం సృష్టించగలిగితే బయట ఆరు ఉద్యోగాలు వస్తాయని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఉడాన్‌ పథకంలో సెప్టెంబరుకల్లా 33 కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతున్న సందర్భంగా ఆయన ‘ఈనాడు-ఈటీవీ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

మీరు కొత్తగా తీసుకొచ్చిన పౌరవిమానయాన విధానం ఎలా పనిచేస్తోంది?

అధికారం చేపట్టి తొలిరోజు నుంచి స్పష్టమైన దృక్పథంతో వెళ్తున్నాం. అందుకే వృద్ధిరేటులో ప్రపంచ దేశాలకంటే ముందున్నాం. 22 నెలల్లో 21 శాతానికి మించి వృద్ధి నమోదైంది. ఈ రంగాన్ని అభివృద్ధిచేయాలన్న లక్ష్యంతో పౌరవిమానయాన విధానం తీసుకొచ్చాం. భవిష్యత్తులో రద్దీని తట్టుకోడానికి ఏఏఐ రూ.15వేల కోట్లతో విమానాశ్రయాలను అభివృద్ధి చేయబోతోంది.

రైల్వేలా సరకు రవాణ కోసం ప్రత్యేక విధానమేదైనా తీసుకురాబోతున్నారా?

అవును. సరకురవాణా పెంచితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వూతం లభిస్తుంది. వచ్చే రెండేళ్లలో ఇదే మా ప్రధాన లక్ష్యం. విభిన్నరకాల రవాణా రంగాలను ఏకీకృతం చేసి ఒకరికొకరు చేయూతనందించుకొనే విధానం తీసుకురావాలని కసరత్తు ప్రారంభించాం.

19ap-main4b.jpg

రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకొనేలా మన విమానాశ్రయాలు ఉన్నాయా?

కొన్ని చాలా ఇరుగ్గా ఉంటున్నాయి. విమానయానరంగం కేంద్ర ప్రభుత్వంలో ఉంటే భూమి రాష్ట్రప్రభుత్వాల పరిధిలో ఉంటోంది. అందువల్ల రెండు వ్యవస్థలు కలిసి పనిచేయక తప్పదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఇవ్వకుండా విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలంటున్నాయి. అది సాధ్యంకాదు.

ఇకమీదట విమానటికెట్లకు ఆధార్‌ నెంబర్‌ను తప్పనిసరి చేయబోతున్నారా?

కొన్ని విమానాశ్రయాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేశాం. దానివల్ల పనితీరులో వేగం పెరిగింది. పూర్తిస్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. వీలున్న ప్రతి విభాగాన్నీ మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ 3 ఏళ్లలో 800 మంది ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్లను నియమించాం.

లాభదాయక విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించి, అంతగా లాభంలేని వాటిని ఏఏఐ చేతిలో పెట్టుకోవడంవల్ల ఏం మేలు?

ప్రభుత్వం వద్ద వనరులు పరిమితంగా ఉంటాయి. ప్రైవేటు, ప్రభుత్వరంగాలు కలిసి పనిచేయాలి. ఖర్చుతగ్గిస్తూ, ప్రయాణికులకు మెరుగైన సేవలు పెంచుతూ పోవాలి. అందువల్ల ఇలా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడంలో తప్పులేదు.

అంతర్జాతీయ, గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల కోసం వేల ఎకరాలు సేకరిస్తున్నారు ఎందుకని?

ఆధునిక విమానాశ్రయాలు కావాలంటే రన్‌వే పొడవు దాదాపు 4 కిలోమీటర్లు ఉండాలి. సమాంతర రన్‌వేలు తప్పనిసరి. ఆ రన్‌వేల మధ్య దూరం కనీసం 1.5 కిలోమీటర్లు ఉండాలి. అంతకంటే తగ్గితే భద్రతా విషయాల్లో రాజీపడాల్సి వస్తుంది.

ప్రయాణికులపై వినియోగరుసుములు వేయొద్దని పార్లమెంటు స్థాయీ సంఘం చెప్పింది కదా? దీనికి సంబంధించి చర్యలు ఎలా ఉన్నాయి?

పార్లమెంటు ఆమోదించిన చట్టం ద్వారానే వినియోగరుసుములు వసూలుచేస్తున్నారు. యూజర్‌ ఛార్జీలు లేకుండా పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకురారు. ఎవరూ దాతృత్వంతో పనిచేయరు. ప్రైవేటు విమానాశ్రయాలన్నీ యూజర్‌ ఛార్జీలను తొలుత రెగ్యులేటర్‌ దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతి తీసుకున్న తర్వాతే వసూలుచేయాలన్న నిబంధన ఉంది.

భోగాపురం విమానాశ్రయం ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు?

నూరు శాతం భూసేకరణ పూర్తయిన తర్వాతే నిర్మాణం ప్రారంభించడానికి వీలవుతుంది. ఇప్పటికే పర్యావరణ, రక్షణ అనుమతులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం జాయింట్‌వెంచర్‌ను ఖరారుచేయాల్సి ఉంది. నా అభిప్రాయం ప్రకారం దాని నిర్మాణానికి మూడునాలుగేళ్ల సమయం పడుతుంది. శంషాబాద్‌ విమానాశ్రయానికి తొమ్మిదేళ్లుపట్టింది. ఆ అనుభవంతో ఇప్పుడు సగం సమయంలోనే భోగాపురం పూర్తిచేయొచ్చు.

తిరుపతిలో అంతర్జాతీయ సేవలు ఇంకా మొదలుకాలేదెందుకు?

కొత్త టెర్మినల్‌ వచ్చాక తిరుపతిలో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. తదుపరి దశలో హాపింగ్‌ ఫ్లైట్స్‌ వస్తాయి. గతంలో బేగంపేటలోనూ తొలుత హాపింగ్‌ ఫ్లైట్స్‌ వచ్చాయి. తర్వాత నేరుగా అంతర్జాతీయ సర్వీసులు మొదలయ్యాయి. ఇప్పటికే రెండు ఎయిర్‌లైన్స్‌ తిరుపతి నుంచి హాపింగ్‌ ఫ్లైట్స్‌ నడపడానికి ఆసక్తి చూపాయి. హోంశాఖ ఇమ్మిగ్రేషన్‌కు అనుమతి ఇస్తే ఆ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయి.

విమానయాన వృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ దేశ సగటును మించడానికి కారణాలు ఏమై ఉండొచ్చని భావిస్తున్నారు?

పౌరవిమానయాన రంగాన్ని అర్థం చేసుకోవడమే. ఆంధ్రప్రదేశ్‌ అందరికంటే తక్కువగా ఒక శాతం పన్ను వేస్తోంది. నేను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు ఇంధనంపై పన్ను తగ్గిస్తే కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పాను. ఏం చేయమంటారు? అని ఆయన అడిగారు. పన్ను గరిష్ఠంగా రెండు, కనిష్ఠంగా ఒక శాతం ఉండాలని చెబితే ఆయన ఒక శాతానికి పరిమితం చేశారు.

తెలంగాణలో ఏయే విమానాశ్రయాలు అభివృద్ధి చేయబోతున్నారు?

ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం విమానాశ్రయం అడుగుతోంది. దానిపై నివేదిక రావాల్సి ఉంది. వరంగల్‌ అచేతన స్థితిలో ఉంది. పైగా అది హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ రన్‌వే పొడవూ తక్కువ ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌ మధ్య విమానంలోకంటే రోడ్డుమార్గంలోనే తక్కువ సమయంలో వెళ్లొచ్చు. కాబట్టి దాని అభివృద్ధికి ఇవి ప్రతిబంధకంగా కనిపిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో 50 విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ప్రతి విమానాశ్రయానికి రూ.50 నుంచి రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. దాన్ని అన్ని రాష్ట్రాలూ ఉపయోగించుకోవచ్చు.

వైమానిక రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించారు కదా? దాని ఫలితాలు ఎలా ఉన్నాయి?

ఇంతవరకూ దరఖాస్తులేమీ రాలేదు. ఎఫ్‌డీఐలను సరళీకృతం చేసినట్లుగానే ఇంకా యాజమాన్యానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి.

 

19ap-main4d.jpgరాష్ట్రంలో ఎన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేయబోతున్నారు?

ఆంధ్రప్రదేశ్‌ను పౌరవిమాన మిత్ర రాష్ట్రంగా చెప్పొచ్చు. ఏటీఎఫ్‌పై వ్యాట్‌ ఒక శాతం ఉండటం, దేశ సగటు వృద్ధికి రెట్టింపు వృద్ధి సాధించడం అందుకు ఉదాహరణలు. విశాఖ, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఇప్పటివరకూ అచేతనంగా ఉన్న కడప ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభించింది. విజయవాడ విమానాశ్రయాలో రూ.162 కోట్లతో తాత్కాలిక టెర్మినల్‌ కట్టాం. రన్‌వే విస్తరణ తర్వాత అంతర్జాతీయ సేవలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఎయిర్‌ఫ్రైట్‌స్టేషన్‌ ఏర్పాటుచేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 100 ఎకరాలు తీసుకొని దాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుందన్నారు. ఇప్పటికే కలెక్టర్‌తో మాట్లాడి ఆ భూమిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దానివల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. విమాన ఛార్జీలు ఇప్పటికీ అందుబాటులో లేవన్న భావన ప్రయాణికుల్లో ఉంది కదా?

19ap-main4c.jpgఏడాది కాలం టికెట్‌ ఛార్జీలను విశ్లేషించాం. 1.7 శాతం టికెట్లు మాత్రమే ఎక్కువ ధరలకు అమ్మినట్లు తేలింది. మిగిలిన ఛార్జీలు మార్కెట్‌ డిమాండ్‌ ప్రకారం ఉంటున్నాయి. ఇదివరకు విశాఖ-ధిల్లీ మధ్య ఛార్జీ రూ.11వేలు ఉంటే ఇప్పుడు రూ.5వేలకే వస్తోంది. విమానాశ్రయాల్లో అదనపు సామర్థ్యాన్ని పెంచి పోటీని పెంచినప్పుడే ఛార్జీలు తగ్గుతాయి. ప్రతి ఉడాన్‌ విమానంలో 50శాతం సీట్లు రూ.2,500కి విక్రయించాలి. అందుకు విరుద్ధంగా ఎవరైనా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.

Link to comment
Share on other sites

దగదర్తి విమానాశ్రయం ప్రాజెక్ట్‌ రద్దు

ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వెల్లడి

nlr-gen6a.jpg

సచివాలయం, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా దగదర్తిలో నిర్మించతలపెట్టిన విమానాశ్రయ ప్రతిపాదనలు రద్దుచేసి వేరే చోటికి తరలించేందుకు నిర్ణయం తీసుకున్నామని ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ పేర్కొన్నారు. నగరంలోని డీఆర్‌ ఉత్తమ హోటల్‌లో ఆయన ఈ విషయంపై గురువారం జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, జేసీ ఇంతియాజ్‌ తదితర అధికారులతో చర్చించారు. దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతి వచ్చినా.. కొన్ని కారణాల వల్ల అది ఇక్కడ సాధ్యం కాదని నిపుణులు తేల్చేశారన్నారు. దీంతో ఈ విమానాశ్రయాన్ని వేరే చోటికి తరలించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విమానాశ్రయం కోసం సేకరించిన ప్రభుత్వ భూమితోపాటు అదనంగా 168 ఎకరాలు ప్రైవేట్‌ భూములను తీసుకునేందుకు భూసేకరణకు వెళ్తే అక్కడి వారు ఎక్కువ ధర డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. అంత ఎక్కువ మొత్తం చెల్లించడం ప్రభుత్వానికి సాధ్యంకాదని, ఇప్పటి వరకు రూ.20 కోట్లు ప్రజాధనం ఈ ప్రాజెక్ట్‌కోసం ఖర్చుచేశామన్నారు. ఇక ఖర్చుచేసేందుకు ఏవిధమైన అవకాశం లేనందున విమానాశ్రయం ఏర్పాటు రద్దుచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విమానాశ్రయం ఏర్పాటు వీలుకాదని చెప్పారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

సిద్ధమవుతున్న ‘రైతు రథం’!

6వేల ట్రాక్టర్ల పంపిణీ లక్ష్యం

మార్గదర్శకాల తయారీకి కమిటీ

ఈనాడు, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రాష్ట్రంలో పెద్దఎత్తున ట్రాక్టర్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సన్న, చిన్నకారు రైతులకు 6వేల ట్రాక్టర్లను అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు రూ.125కోట్లు రాయితీ రూపంలో ఖర్చవుతుందని అంచనా వేసింది. పథకానికి ‘రైతురథం’ అని పేరు కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రాక్టర్ల ద్వారా ఉపయోగించే పరికరాలే ఎక్కువగా వస్తున్నాయి. విదేశాల్లో వీటిని ఉపయోగించి పెట్టుబడులు తగ్గించడంతోపాటు సేద్యాన్ని సులభతరంగా మారుస్తున్నారు. వాటిని రాష్ట్ర రైతులకు చేరవేసే క్రమంలో ముందుగా పెద్దట్రాక్టర్లను అందించే ఏర్పాట్లు చేస్తోంది.

కమిటీ నియామకం.. మూడు రోజుల్లో మార్గదర్శకాలు: రైతులకు ట్రాక్టర్ల పంపిణీపై మార్గదర్శకాల తయారీకి ప్రభుత్వం ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ టి.వి.సత్యనారాయణ ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు వినయ్‌చంద్‌ కన్వీనర్‌గా, ప్రొఫెసర్‌ సి.రమణ(అసోసియేట్‌ డీన్‌, వ్యవసాయ ఇంజినీరింగ్‌ కాలేజి, మడకశిర), పి.పి.రావు(డైరెక్టర్‌, దక్షిణప్రాంత యంత్ర పరికరాల శిక్షణ, పరిశోధన సంస్థ, గార్లదిన్నె), డి.హరిబాబు చౌదరి(జేడీఏ), ఎం.చంద్రరాజమోహన్‌(జీఎం, ఏపీ ఆగ్రోస్‌) సభ్యులుగా వ్యవహరిస్తారు. మూడు రోజుల్లోనే విధివిధానాలు, మార్గదర్శకాలు తయారు చేసి ఇవ్వాలని గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు

Link to comment
Share on other sites

23 న ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన: కేఈ
 
 

కర్నూలు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను విదేశీయులు తిలకించేందుకు ప్రభుత్వం విమానాశ్రయంను ఏర్పాటు చేస్తోందని, ఈ నెల 23 న ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, రాక్ గార్డెన్ దర్శించేలా టూరిజం శాఖ సర్క్యూట్ రూపొందిస్తోందని మంత్రి అఖిలప్రియ తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఓర్వకల్లు హరిత రాక్ గార్డెన్ దగ్గర పున్నమి ఉత్సవాలలో ఎద్దులకు, వ్యవసాయ పనిముట్లకు కేఈకృష్ణమూర్తి, మంత్రి భూమా అఖిలప్రియ పూజలు చేశారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...