Jump to content

Amaravati

Recommended Posts

బాపట్లలో తాత్కాలికంగా ఎన్‌ఐడీఎం ఏర్పాటు
08-02-2018 08:54:47

గన్నవరంలో 10 ఎకరాల భూమి కేటాయింపు
ఎన్‌ఐడీఎం ఈడీ బిపిన్‌మాలిక్‌
విపత్తుల నివారణపై శిక్షణ తరగతులు ప్రారంభం
బాపట్ల టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టంలోని నిబంధనల మేరకు జాతీయ విపత్తుల నివారణ కేంద్రానికి ప్రభుత్వం గన్నవరంలో 10 ఎకరాల భూమి కేటాయించిందని కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి, ఎన్‌ఐడీఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బిపిన్‌మాలిక్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జాతీయ విపత్తుల నివారణపై మూడు రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బిపిన్‌మాలిక్‌ మాట్లాడుతూ దక్షిణ భారత జాతీయ విపత్తుల నివారణ కేంద్రాన్ని బాపట్ల మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. గన్నవరంలో శాశ్వత భవనాల నిర్మాణం ఆలస్యం అవుతున్నందువల్ల మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రంలో జాయింట్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ స్థాయి అధికారి ఉంటాడని తెలిపారు. తుఫాన్‌లు, భూకంపాలు, వరదలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన వివరించారు. మూడు రోజుల శిక్షణ తరగతుల్లో మొదటి రోజు దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు, రెండో రోజు సముద్రతీర ప్రాంత ప్రజలకు, చివరి రోజు స్వచ్ఛంద సేవాసంస్థలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
 
శిక్షణ పొందిన అధికారులు జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ముందస్తుగా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహనను కల్పించాలన్నారు. వేసవిలో 48 డిగ్రీలు ఉష్ణోగ్రతలు సముద్రతీర ప్రాంతంలో నమోదవుతున్నాయని, వాటిపై ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో తాత్కాలిక భవనాలను పరిశీలించి ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. బాపట్ల పట్టణంలో దక్షిణ భారత జాతీయ విపత్తుల నివారణ కేంద్రాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినందుకు ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల కార్యదర్శి పీసీ సాయిబాబు, తహసీల్దార్‌ తిరుమలశెట్టి వల్లయ్య ఆయనకు పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హార్యానా రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ కృష్ణమోహన్‌, ఏపీఎస్‌డీఎంఏ సీఈవో శేషగిరిరావు, ఎన్‌ఐడీఎం జాయింట్‌ డైరెక్టర్‌ ఆర్‌కె.సింగ్‌, ఎస్‌ఐడీఎం శిక్షణాధికారి అనీల్‌షేకావత్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ప్రతిపాదిత ఏపీ హైకోర్టు భవనాల పరిశీలన 
శని, ఆదివారాల్లో వెళ్లనున్న   న్యాయమూర్తుల కమిటీ
ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ హైకోర్టు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన తాత్కాలిక భవనాలను హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ఈ నెల 10, 11వ తేదీల్లో(శని, ఆదివారాల్లో) పరిశీలించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎ.వి.శేషసాయి, జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ విజయవాడ పయనమయ్యేందుకు ఏర్పాట్లు సిద్ధమయినట్లు సమాచారం. ఆ భవనాల్లో న్యాయస్థానం ఏర్పాటుకు అనువుగా అన్ని సౌకర్యాలున్నాయా? లేవా? తదితర అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం ఆ వివరాలను కమిటీ హైకోర్టు న్యాయమూర్తులందరితో నిర్వహించే సమావేశం ముందుంచుతుంది. అక్కడ చర్చించిన తర్వాత దానిపై భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమంటూ ఏపీ సర్కారు హైకోర్టుకు లేఖరాసిన విషయం తెలిసిందే.

త్వరలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయానికి టెండర్లు 
పురపాలకశాఖ మంత్రి నారాయణ
ఈనాడు డిజిటల్‌, అమరావతి: శాసనసభ, సచివాలయం, హైకోర్టు భవనాల ఆకృతులు వచ్చే నెలలో ఖరారవుతాయని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపడతామని పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాదిలోపు రాజధానిలో 24 రోడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. మరి కొన్నింటికి త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపడతామన్నారు. బుధవారం సీఆర్‌డీఏ పరిధిలోని వెంకటపాలెం, మోదుగులంకపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల వద్ద రహదారి నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. కొన్నిచోట్ల మట్టి పరీక్షలు చేయించడంలో జాప్యంపై గుత్తేదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలోనూ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో మొత్తం 1600 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తున్నామన్నారు. కొన్ని చోట్ల నిర్మాణం నెమ్మదిగా జరుగుతుందన్నది వాస్తవమేనన్నారు. వంతెనల నిర్మాణం వర్షాకాలంలోపే పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. పర్యటనలో అమరావతి అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌   లక్ష్మీపార్థసారథి, అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

మెగా సిటీగా అమరావతి
‘అమృత’ విశ్వవిద్యాలయ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు 

ఈనాడు, అమరావతి: దేశంలోనే నంబరు వన్‌ సిటీగా రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని, 35 లక్షల జనాభాకు పరిమితం చేస్తున్న ఈ నగరానికి విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను అనుసంధానించడంతో భవిష్యత్తులో మెగాసిటీగా ఏర్పడే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ ప్రాంతంలో 150 ఎకరాల్లో చేపట్టే అమృత విశ్వవిద్యాలయ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ‘‘ప్రతి ఐదు నిమిషాల వ్యవధిలో వైద్య సదుపాయం, పది నిమిషాల్లో నడిచి ఆఫీసుకు వెళ్లడం, పదిహేను నిమిషాలకో వినోదం వంటివి రాజధాని ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కార్యాచరణ అమలు చేస్తున్నాం’’ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన 14 నుంచి 15 వైద్య కళాశాలలు రాజధాని ప్రాంతంలో ఏర్పడుతున్నందున ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఆరోగ్య కూడలిగా, హెల్త్‌ టూరిజంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా 150కిపైగా ఆసుపత్రులు కలిగిన దుబాయ్‌కి చెందిన బీఆర్‌ చెట్టి గ్రూపు మన రాజధానిలోనూ ఆసుపత్రి నిర్మాణం కోసం ముందుకొచ్చిందన్నారు. రాజధాని ప్రాంతంలో తొమ్మిది సిటీలు, మరో 27 టౌన్‌ షిప్‌ల ఏర్పాటు కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రపంచంలో ఏ సిటీలోనూ లేని విధంగా 1600 కిలో మీటర్ల పొడవునా సైకిల్‌ మార్గం ఏర్పాటుచేసి కాలుష్య రహితంగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కృష్ణా నదిపై కొత్తగా ఐదు రిజర్వాయర్లు వచ్చే అవకాశం ఉందన్నారు. 40 నుంచి 50 కిలో మీటర్ల పొడవునా రెండు వైపులా నీరు ఉండేలా ప్రణాళికలు రూపొందించి రాజధాని ప్రాంతాన్ని ‘నీలి-పచ్చ’ నగరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఎంతో సేవా నిరతి, ఉన్నత ప్రమాణాలు కలిగే విద్యను అందించే అమృత సంస్థ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. సమావేశంలో అమృత విశ్వ విద్యాపీఠం అధ్యక్షులు స్వామి అమృతాస్వరూపానంద పురి, డైరక్టర్‌ సదాశివ చైతన్య, ఉప కులపతి డాక్టర్‌ వెంకటరంగన్‌ పాల్గొని సంస్థ విశిష్టతలు, విద్యా రంగంలో సాధిస్తున్న ఫలితాలను వివరించారు. ముఖ్యమంత్రి సూచనపై సభకు హాజరైన ప్రజలు మాజీ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు మృతికి సంతాపంగా కొద్ది నిమిషాలపాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, డాక్టర్‌ కామినేని శ్రీనివాసరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ippudunna paristhithullo aa tatkalika bhavanale dikku inko 5+ years varaku

oka vela anni bagunte, kottavi ready ayithe, vitini inko vatiki vadukovatchu

yelagu waste avvavu

lekapothe avi anni Hyd lone operate avuthayi - vatche koddi revenue kuda poddi

perm. struct. ayithe, plan lu natchali, aa plans ki dabbu kuda ekkuve - so malli appulu then const. kuda konchem time paduthundi

Link to comment
Share on other sites

3 minutes ago, Urban Legend said:

next elections varaku e high court divide cheyyakudadhu

tappadu, center order vesindi anukonta - kani ela gola inko one year paduthundi

tarvata, administartion election mood loki pothundi again malli inko 6 months delay

Edited by rk09
Link to comment
Share on other sites

2 minutes ago, rk09 said:

ippudunna paristhithullo aa tatkalika bhavanale dikku inko 5+ years varaku

oka vela anni bagunte, kottavi ready ayithe, vitini inko vatiki vadukovatchu

yelagu waste avvavu

lekapothe avi anni Hyd lone operate avuthayi - vatche koddi revenue kuda poddi

perm. struct. ayithe, plan lu natchali, aa plans ki dabbu kuda ekkuve - so malli appulu then const. kuda konchem time paduthundi

none of that will change (revenue wise). almost everybody will operate from Hyderabad except for few that are too old who can not travel. 

Link to comment
Share on other sites

14 minutes ago, rk09 said:

tappadu, center order vesindi anukonta - kani ela gola inko one year paduthundi

tarvata, administartion election mood loki pothundi again malli inko 6 months delay

How can center "order" state government to build temporary high court against the division bill? Did center give funds specifically for this temporary structure?

Edited by swarnandhra
Link to comment
Share on other sites

24 minutes ago, swarnandhra said:

How can center "order" state government to build temporary high court against the division bill? Did center give funds specifically for this temporary structure?

order on division not on temp. buildings

Link to comment
Share on other sites

అమరావతిలో సమగ్ర రవాణా వ్యవస్థ!
09-02-2018 01:06:53

జపాన్‌లో అధ్యయనానికి ఉన్నతాధికారుల బృందం
అమరావతి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సమగ్ర ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అధ్యయనం ప్రారంభించింది. ఇందుకోసం సీఎస్‌ దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో తొమ్మిదిమంది ఉన్నతాధికారుల బృందం జపాన్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు అనుమతిస్తూ సాధారణ పరిపాలనశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే అమరావతిలో ట్రాఫిక్‌ వ్యవస్థకు లండన్‌, ఇతర దేశాల్లోని వ్యవస్థలను పరిశీలించినా ఇంతమంది అధికారులు ఒకేసారి ఎక్కడా అధ్యయనానికి వెళ్లలేదు.
 
తాజా పర్యటన అమరావతి నిర్మాణంలో కీలకం కానుం ది. ఇటీవల జపాన్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ట్రాఫిక్‌ వ్యవస్థ సమర్థంగా ఉన్నట్టు గుర్తించారు. కేవలం వాహనాల రాకపోకలే కాకుండా పాదచారులు, సైకిలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనానికి ఉన్నతాధికారుల బృందం సిద్ధమైంది.
 
ఈనెల 15 నుంచి 19 వరకు జపాన్‌లో పర్యటించి అక్కడి విధానాలను అమరావతికి ఎలా అన్వయించుకోవాలో పరిశీలిస్తారు. బృందంలో సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్‌, విజయవాడ సీపీ గౌతం సవాంగ్‌, గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ జె.నివాస్‌, గుంటూరు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌.విజయారావు, గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌ సి.అనూరాధ, సీఆర్‌డీఏ ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.ఆనంద్‌ ఉన్నారు.

Link to comment
Share on other sites

పల్టాలెక్కని పార్కులు
09-02-2018 09:41:46

డిజైన్ల ఎంపికపై సాగతీత
టెండర్ల దశ దాటని ప్రతిపాదనలు
ఫైళ్లలోనే సెంట్రల్‌పార్కు.. అంబేద్కర్‌ స్మృతివనం
పీపీపీ విధానంలోనూ జాప్యమే!
బ్లూ గ్రీన్‌ సిటీగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలను పట్టాలెక్కించడంలో కొంత జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా రాజధానికి ప్రత్యేక ఆకర్షణ కానున్న శాఖమూరు సెంట్రల్‌ పార్కుతో పాటు అందులోనే భాగస్వామ్యంగా వున్న అంబేద్కర్‌ స్మృతివనం పనులు కూడ మొదలు కాలేదు. గతేడాది ఏప్రిల్‌ 14వ తేదీన ఈ స్మృతివనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినప్పటికీ ఇంకా డిజైన్లు కూడ ఖరారు కాలేదు.
 
మంగళగిరి: రాజధాని అమరావతి ఏరియా, కృష్ణాతీరంతో పాటు శాఖమూరు, నీరుకొండ ప్రాంతాల్లో రెండు భారీ ఉద్యానవనాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిలో నీరుకొండ వద్ద నిర్మించిన దలిచిన ఎమ్మెస్సెస్‌ స్మారక ఉద్యానవనం ప్రతిపాదన నెలల క్రితం రాగా, శాఖమూరు వద్ద ఏర్పాటుచేయదలిచిన సెంట్రల్‌పార్కు ప్రతిపాదన అమరావతి మాస్టర్‌ప్లానుతో పాటు రూపుదిద్దుకున్నదే! అక్కడే అంబేద్కర్‌ స్మృతివనాన్ని కూడ మరో ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. కానీ ఈ రెండింటి విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎనిమిది మాసాల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు సెంట్రల్‌పార్కు విషయమై సంబంధిత శాఖలకు అందిన అధికారులతో సమీక్ష సమావేశాన్ని డిజైన్లను ఖరారు చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ కంపెనీ రూపొందించిన డిజైన్లను ఆ సమావేశంలో ఖరారు చేశారు. సెంట్రల్‌ పార్కు పనులను వెంటనే చేపట్టి 2018 సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కూడ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంతవరకు ఆ ప్రాజెక్టును అధికారులు పట్టాలెక్కించ లేకపోయారు. ఇటీవలె సదరు పార్కులో రూ.18.17 లక్షల వ్యయంతో 3,800 మొక్కలను నాటించేందుకు ఏడీసీఎల్‌ టెండర్లను పిలిచింది. దీనికితోడు రోజ్‌ గార్డెన్‌, ట్రాక్‌లెస్‌ టాయ్‌ ట్రెయిన్‌ నిర్వహాణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను చేపట్టారు.
 
సెంట్రల్‌ పార్క్‌
ప్రస్తుత తాత్కాలిక సచివాలయానికి నైరుతీదిశగా వున్న శాఖమూరులో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్‌పార్కును నిర్మించాలని ప్రతిపాదించారు. పార్కు మధ్యలో 50 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో జలాశయం వుంటుంది. దీని చుట్టూ వున్న ప్రాంతాన్ని నాలుగు జోన్‌లుగా విభజించారు. మొదటిజోన్‌లో ఈవెంట్‌ గ్రౌండు, స్పోర్ట్స్‌ క్లబ్‌, రోజ్‌గార్డెన్‌లను ఏర్పాటుచేస్తారు. రెండో జోన్‌లో క్రాఫ్ట్‌ బజారు, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులను నిర్మిస్తారు. మూడవ జోన్‌లో బాలల ఎడ్వంచర్‌ పార్కు, ఫుడ్‌ కోర్టులు, వైల్డ్‌నెస్‌ పార్కు, నక్షత్రవనాలను నిర్మిస్తారు. నాలుగవ జోన్‌లో ఎకో రిసార్టులు, అయిదు, నాలుగు, మూడు నక్షత్రాల హోటళ్లు, యాంఫీ ఽథియేటరు, షాపింగ్‌మాల్స్‌తో మొత్తం ఆవరణ అంతా గ్రీనరీతో కళకళలాడుతుంటుంది. ఈ నాలుగుజోన్లు 220 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యేవిధంగా డిజైన్‌ చేశారు. సెంట్రల్‌ పార్కులో చూపిన ఈ నాలుగు జోన్ల అభివృద్ధికి సుమారు రెండు వేల కోట్లను ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో మౌలిక వసతుల నిమిత్తం రూ.227 కోట్లు, ఇతర నిర్మాణాల నిమిత్తం రూ.1,650 కోట్లు ఖర్చు కానున్నాయి. ఈ మొత్తం పార్కు ఏర్పాటు, నిర్వహాణ పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించినందున ప్రభుత్వానికి పెద్దగా ఖర్చయ్యేది కూడ ఏమీలేదనే చెప్పాలి. కారణాలేమోగానీ సెంట్రల్‌పార్కుకు సంబంధించిన పనులు మాత్రం క్షేత్రస్థాయిలో ఆరంభం కాలేక పోతున్నాయి.
 
అంబేద్కర్‌ స్మృతివనం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో సుందర ప్రాజెక్టు అంబేద్కర్‌ స్మృతివనం. దీనిని సెంట్రల్‌ పార్కులో మొదటి, రెండు జోన్లకు మధ్యగా 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.వంద కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో రూ.25 కోట్లను విగ్రహ నిర్మాణం కోసమే వెచ్చించనున్నారు. ఈ స్మృతివనం సన్నాహక పనుల బాధ్యతలను ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ స్మతిచిహ్నంగా ఆయన భారీ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించి ఏప్రిల్‌ 14న ముఖ్యమంత్రి చంద్రబాబుతో శంకుస్థాపన కూడ చేయించారు. కానీ స్మతివనానికి సంబంధించిన డిజైన్లను నేటికీ ఖరారు చేయలేదు.
 
రెండు రకాల డిజైన్లను ఏపీఐఐసీ ఆన్‌లైన్‌ ఓటింగ్‌ నిమిత్తం వెబ్‌సైటులో ఉంచి, డిసెంబరు 15వ తేదితో ఆ ప్రక్రియను ముగించింది ఆ ప్రాజెక్టు టెండర్లను దశను దాటలేకపోయింది. అధికారులను దీని గురించి వివరణ కోరగా ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌ అధికారుల పరిశీలనలో డిజైన్లు ఉన్నాయని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

మూలపాడు వద్ద ట్రెక్కింగ్‌కు ఏర్పాట్లు
09-02-2018 09:37:23

పాయకాపురం: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద ఈనెల 18న జరగనున్న ట్రెక్కింగ్‌(పర్వతారోహణ)కు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ట్రెక్కింగ్‌ ఏర్పాట్లు విషయమై ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌, యువజన సంక్షేమశాఖ, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ట్రెక్కింగ్‌కు వందమందికిపైగా యువత హాజరవుతారని విద్యాసాగర్‌ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీకాంతం మాట్లాడుతూ మూలపాడు వద్ద బేస్‌క్యాంపు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రెక్కింగ్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉందని, ఏర్పాట్లలో సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Link to comment
Share on other sites

2వేల కోట్లకు అమరావతి బాండ్లు
09-02-2018 01:22:03
ప్రభుత్వం గ్యారెంటీ.. ఉత్తర్వులు జారీ
అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి అవసరమైన నిఽధుల్లో రూ.2వేల కోట్ల వరకూ వివిధ బాండ్ల ద్వారా సమీకరించనున్నారు. ఇందుకు గ్యారెంటీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలియజేసింది. దేశీయ, మసాలా తదితర బాండ్ల రూపంలో ఈ మొత్తాన్ని సమీకరించి, అమరావతిలో తాను చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులకు నిధులను వినియోగిస్తారు. ఆ బాండ్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలన్న ఏపీసీఆర్డీయే అభ్యర్థనకు అనుగుణంగా ఉత్తర్వులు విడుదలయ్యాయి.
దీంతోపాటు రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ లేఅవుట్లలోని 5 జోన్లలో హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో రూ.10,732 కోట్ల విలువతో మౌలిక వసతులను అభివృద్ధి పరిచేందుకు సైతం ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. రాజధాని పరిపాలనా నగరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం మొత్తం రూ.3,306.80 కోట్లతో నిర్మిస్తున్న 3,840 ఫ్లాట్లతో కూడిన గవర్నమెంట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌కూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ కాంప్లెక్స్‌ను నిర్మించే బాధ్యతను సీఆర్డీయేకు అప్పగించేందుకూ ఆమోదం తెలియజేసింది.

Link to comment
Share on other sites

రాజధాని ట్రాఫిక్‌ వ్యవస్థపై జపాన్‌లో అధ్యయనం
ఈనాడు అమరావతి: రాజధాని ప్రాంతంలో సమగ్రమైన ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థపై అధ్యయనం (సీటీటీఎస్‌) చేసేందుకు రాష్ట్రం నుంచి తొమ్మిది మంది ఉన్నతాధికారులతో కూడిన బృందం జపాన్‌ వెళ్లనుంది. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ ఈ పర్యటన ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌తోపాటు అజయ్‌జైన్‌, గౌతం సవాంగ్‌, కోన శశిధర్‌, చెరుకూరి శ్రీధర్‌, జె.నివాస్‌, సీహెచ్‌ విజయరావు, సి.అనురాధ, ఎన్‌.ఆర్‌.అరవింద్‌ ఈ బృందంలో ఉన్నారు. జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో ఈ పర్యటన సాగుతుంది. ఇందుకు సంబంధించి గురువారం ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి ఉత్తర్వులిచ్చారు. ఈ బృందంలో విజయవాడ, గుంటూరు నగరపాలక కమిషనర్లు, సీఆర్‌డీఏ కమిషనర్లు ఉన్నారు.

బాండ్లతో నిధుల సమీకరణకు సీఆర్డీఏకు ప్రభుత్వ హామీ
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల, మౌలిక వసతుల కల్పన కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) దేశీయ బాండ్లు, మసాలా బాండ్లు విడుదల చేయడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. రూ.2 వేల కోట్ల నిధులు సేకరించేందుకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల నుంచి భూసమీకరణ విధానంలో సేకరించిన భూముల్లో (ఐదు జోన్లు) మౌలిక సదుపాయాల కల్పన కోసం హైబ్రీడ్‌ యాన్యూటీ విధానంలో ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో రూ.10,732 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా అనుమతులిచ్చింది. రూ.3,306 కోట్ల అంచనా వ్యయంతో ఉద్యోగుల కోసం చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులకు బడ్జెటరీ సపోర్టు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Link to comment
Share on other sites

నైపుణ్యాభివృద్ధి సంస్థతో ‘అమరరాజా’ జట్టు 
15 రంగాల్లో శిక్షణకు సంసిద్ధత
ఈనాడు, అమరావతి: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మరింత మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అమరరాజా గ్రూపు ఛైర్మన్‌ గల్లా రామచంద్రనాయుడు వెల్లడించారు. గురువారం విజయవాడలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎస్‌ఎస్‌డీసీ) ఎండీ, సీఈవో కె.సాంబశివరావుతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, విద్యార్థులకు ఇస్తున్న శిక్షణలను సాంబశివరావు వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్న 15 రంగాల్లో నైపుణ్యాభివృద్ధి సంస్థ, అమరరాజా గ్రూపు కలిసి పనిచేయడంపై చర్చించారు. సీఆర్డీఏ పరిధిలో అమరరాజా గ్రూపు తరఫున నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే 5 నుంచి 10ఎకరాల స్థలం కేటాయింపుపై ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.

Link to comment
Share on other sites

ఉన్నతాధికారుల బంగళాలకు టెండర్లు
10-02-2018 03:27:33
 
  • రూ.440 కోట్లతో 186 నిర్మాణాలు
 
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని పరిపాలనా నగరంలో మంత్రులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసులకు చెందిన ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారుల కోసం 186 విశాలమైన బంగళాల నిర్మాణానికి సీఆర్డీయే శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది. వాటి డిజైన్ల రూపకల్పనతోపాటు ఈపీసీ (ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌) విధానంలో నిర్మాణానికి మొత్తం రూ.440.58 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసింది. ఆసక్తి ఉన్న సంస్థలు వచ్చే నెల 12వ తేదీలోగా బిడ్లను సమర్పించాలని కోరింది. ఈ బంగళాలు ఒక్కొక్కటీ జీ+1 అంతస్థులతో రూపుదిద్దుకోనున్నాయి. వీటిల్లో మంత్రులు, న్యాయమూర్తుల కోసం నిర్మించే 71 బంగళాలు, అఖిల భారత సర్వీస్‌ (ఏ.ఐ.ఎస్‌) ఉన్నతాధికారుల కోసం నిర్మించే 115 బంగళాలకు సీఆర్డీయే వేర్వేరుగా టెండర్లు కోరింది.
 
మినిస్టర్లు, జడ్జిల బంగళాలను ఒక్కొక్కటీ రూ.2.86 కోట్లతోనూ, ఏ.ఐ.ఎస్‌. ఉన్నతాధికారుల బంగళాలు ఒక్కొక్కటీ రూ.2.06 కోట్లతోనూ నిర్మించనున్నారు. పరిపాలనా నగరంలో శాసనసభ్యులు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం మొత్తం 3,840 క్వార్టర్లను అపార్ట్‌మెంట్ల రూపంలో నిర్మించే పనులు కొద్ది నెలల క్రితమే ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, రాజధాని నగర భవిష్యత్తు స్వరూపాన్ని కళ్లకు కట్టేట్లుగా విజయవాడలోని తన ప్రధాన కార్యాలయంలో 3-డీ సిటీ మోడల్‌ ఏర్పాటుకు కూడా సీఆర్డీయే సంకల్పించింది. మరోవైపు, అమరావతిలోని ప్రతిష్ఠాత్మక(ఐకానిక్‌) భవంతులైన అసెంబ్లీ, హైకోర్టులతోపాటు సచివాలయం, ప్రభుత్వ గృహ సముదాయం తదితర నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను సీఆర్డీయే ఉన్నతాధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు చూపారు.
Link to comment
Share on other sites

తాత్కాలిక హైకోర్టు దిశగా అడుగులు
10-02-2018 03:27:04

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ ఎ.వి.శేషసాయి, జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి, జస్టిస్‌ పి.సత్యనారాయణ మూర్తిలు శుక్రవారం గన్నవరం వచ్చారు. అక్కడ ఉన్న వెటర్నరీ వర్సిటీ భవనాలను పరిశీలించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...