Jump to content

Amaravati


Recommended Posts

కృష్ణా తీరాన.. ‘అమరావతి మెరీనా’ 
వెంకటపాలెం దగ్గర్లో ఏర్పాటు 
  6 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం
ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘మెరీనా’ ఏర్పాటుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ‘మెరీనా’ అభివృద్ధి చేయాలన్నది ఆలోచన. రాజధానిలోని కృష్ణా తీరాన్ని జల క్రీడలకు, జల విహారానికి వేదికగా, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగానే ‘మెరీనా’ ఏర్పాటు చేయనున్నారు. చిన్న బోట్లు, యాట్‌లు నిలిపేందుకు వీలుగా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన హార్బర్‌నే ‘మెరీనా’గా పిలుస్తారు. మన దేశంలో కొచ్చిలో మొదటి అంతర్జాతీయ మెరీనాను 2010లో ఏర్పాటు చేశారు. నవీ ముంబయిలోని బేలాపూర్‌లో మహారాష్ట్ర మేరిటైమ్‌ బోర్డు ఒక మెరీనా ఏర్పాటు చేయనుంది. అమరావతిలోనూ అదే కోవలో మెరీనా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
ఎక్కడ: రాజధానిలో వెంకటపాలెం గ్రామానికి దగ్గర్లో మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమాన్ని ఆనుకుని మెరీనా ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. 
ఎన్ని ఎకరాలు: ఆరు ఎకరాల్లో ఏర్పాటవుతుంది. కృష్ణా నదికి, కరకట్ట నుంచి కృష్ణా నది వరకూ ఆరు ఎకరాలు, కరకట్టకు రెండోపక్కన ఒక ఎకరం స్థలం కేటాయిస్తారు.
ఏమేముంటాయి? 
* కనీసం 60 బెర్త్‌లు. 
* 10 పవర్‌ బోట్లు/పాంటూన్లు, 6 ఆప్టిమిస్ట్‌ సెయిల్‌ బోట్లు, 2 లేజర్‌ సెయిల్‌ బోట్లు, సహాయ, రక్షణ చర్యల కోసం 2 బోట్లు. 
* నీటిశుద్ధి కేంద్రం. మెరీనాలోని బోట్లకు ఇక్కడి నుంచే నీటి సరఫరా జరుగుతుంది. 
* బోట్ల మరమ్మతు కేంద్రం. 
* సెయిలింగ్‌ శిక్షణ కేంద్రం. పవర్‌బోట్లు నడపటంలో ఇక్కడ సర్టిఫికెట్‌ కోర్సులు అందజేస్తారు. 
* శిక్షణ కోసం రివర్‌పూల్‌, భద్రతా చర్యలకు సంబంధించిన శిక్షణ కేంద్రం, బోట్ల విడి భాగాల దుకాణం, షవర్‌ రూం వంటివన్నీ ఉంటాయి. 
* వీటితో పాటు రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులు, ఫిష్‌ అక్వేరియంలు, జిమ్‌, జల వినోద క్రీడలు, జాతీయ, అంతర్జాతీయ జల క్రీడల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు వంటివి ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Guest Urban Legend
9 hours ago, Urban Legend said:

 

అమరావతిలో.. కంటైనర్‌ హోటల్స్‌!
image for reference 

636533186942405195.jpg

  • హ్యాపీ సిటీ సదస్సులో పాల్గొనే అతిథులకు
  • తొలుత భవానీద్వీపంలో 100 గదులతో ఏర్పాటు
అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): అమరావతికి వచ్చే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఏపీసీ ఆర్డీయే ఒక వినూత్న యోచన చేస్తోంది. రాజధానిలో శాశ్వత ప్రాతిపదికన హోటళ్ల స్థాపనకు కనీసం 3-5 ఏళ్లు పట్టే అవకాశమున్నందున.. ఆతిథ్యానికి ఇబ్బంది రాకుండా స్వల్ప వ్యవధిలో, తక్కువ నిర్మాణ వ్యయంతో ఏర్పాటు చేసేందుకు వీలున్న కంటైనర్‌ హోటళ్ల స్థాపనకు ప్రతిపాదించింది. దీనిని ఇటీవల జరిగిన సీఆర్డీయే సమీక్షా సమావేశంలో కమిషనర్‌ శ్రీధర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలపగా... ఆయన ఆమోదించారు. విజయవాడకు సమీపంలోని భవానీద్వీపంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 10-12 తేదీల్లో నిర్వహించే సంతోష నగరాల సదస్సుకు హాజరయ్యే జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ఇలాంటి 100 గదులను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అనంతరం మరిన్ని కంటైనర్‌ హోటళ్ల స్థాపనపై ముందుకు వెళ్దామని సీఎం చెప్పారు.
 
షిప్‌ కంటైనర్లే గదులు!
సముద్ర రవాణాకు ఉపయోగించే షిప్‌ కంటైనర్లను సకల వసతులతో కూడిన అధునాతన హోటల్‌ గదులుగా మార్చి, వాడుకునే ప్రక్రియ మనకు కొత్తయినప్పటికీ పలు విదేశాల్లో కొంతకాలంగా ప్రాచుర్యం పొందింది. కంటైనర్‌ హోటళ్లను కేవలం 3 మాసాల్లోనే ఏర్పాటు చేసేయొచ్చు! ఖర్చు చాలా తక్కువ. ఇప్పటికే ముంద్రా సెజ్‌లో ఇలాంటి దాన్ని నెలకొల్పారు. వీటి నిర్మాణంలో కాలుష్యపరమైన సమస్యలు తలెత్తవు. ఈ తాత్కాలిక హోటళ్లను అవసరమై నంత కాలం ఉంచి, తర్వాత వేరొక చోటకు సులభంగా తరలించవచ్చు.
Link to comment
Share on other sites

సీఆర్‌డీఏ అధికారుల భేటీ
ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే హైకోర్టు భవనం వివరణాత్మక ఆకృతులు ఖరారు చేయడంపై కసరత్తు దాదాపు తుది దశకు చేరుకుంది. హైకోర్టు భవనానికి బౌద్ధ స్థూపాన్ని పోలిన ఆకృతిని ఇప్పటికే ఖరారు చేశారు. నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ వివరణాత్మక ఆకృతులు సిద్ధం చేసింది. సీఆర్‌డీఏ ప్రణాళికా విభాగం అధికారులు, నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్‌లో హైకోర్టు రిజిస్ట్రార్‌ తదితరులతో సమావేశమయ్యారు. హైకోర్టు పనితీరు, అవసరాలకు అనుగుణంగా వాటిలో ఇంకా ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంపై వీరు చర్చించారు.
రాష్ట్ర వార్తలు

Link to comment
Share on other sites

ఏపీ నుంచి థాయ్‌ ఎయిర్‌వేస్‌ సేవలు

అమరావతి: ఏపీ నుంచి సేవలందించేందుకు థాయ్‌ ఎయిర్‌వేస్‌ సంసిద్ధత వ్యక్తంచేసింది. విశాఖ లేదా విజయవాడ నుంచి త్వరలో సేవలు ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు థాయ్‌లాండ్‌ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపింది. ఈ మేరకు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును థాయ్‌లాండ్‌ ప్రతినిధులు కలిశారు. విజయవాడ నుంచి సేవలు ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం వారికి  సూచించారు.  
నాగార్జున విశ్వవిద్యాలయంలోని బుద్దిస్టు లెర్నింగ్ సెంటర్‌కు అనుసంధానంగా ఉంటూ బౌద్ధ ధర్మం, విశిష్ఠతలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు థాయ్‌లాండ్ కాన్సుల్‌ జనరల్ కాంగ్ కనీత్ రక్చోరియన్‌ తెలిపారు. ఒకనాడు బౌద్ధమతానికి ఆలంబనగా, ముఖ్య కేంద్రంగా విరాజిల్లిన అమరావతి ప్రాంతంలో బౌద్ధ  ఆలయ నిర్మాణానికి థాయ్‌లాండ్‌ బృందం ముందుకొచ్చింది. అమరావతిలో పది ఎకరాల స్థలం కేటాయిస్తామని, ఆలయ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, ఆకృతులతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు.

Link to comment
Share on other sites

శాఖమూరులో పచ్చదనానికి ప్రణాళిక
07-02-2018 09:20:27

అమరావతి/తుళ్ళూరు(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని శాఖమూరు ఉద్యానవనంలో పచ్చదనం అభివృద్ధి పను లను ప్రారంభించాల్సిందిగా అమరావతి అభి వృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ డి.లక్ష్మీ పార్థ సారధి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏడీసీ అధికారులతో కలసి ఉద్యా నవన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ పార్క్‌ నిర్మాణానికి ఏడీసీ రూపొందించిన బృహత్తర ప్రణాళిక ఆధారంగా అధికారులకు మార్గ దర్శకాలను జారీ చేశారు. సుమారు 300 ఎకరాల్లో నిర్మితంకానున్న ఈ భారీ ఉద్యానవనంలో ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా, సంపంగి, నాగలింగం, ఫ్లుమేరియా వంటి అరుదైన మొక్కలతోపాటు అధిక నీడనిచ్చే రావి, వేపచెట్ల పెంపకాన్ని వెంటనే చేపట్టాలని ఆదేశించారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ పర్యటనలో ఏడీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జి.రత్నకుమార్‌, సీఈ టి.మోజెస్‌కుమార్‌, అటవీవిభాగం డిప్యూటీ కన్జర్వేటర్‌ వై.రమేష్‌, భూ వ్యవహారాల సంచాలకుడు బి.రామయ్య, పట్టణ ప్రణాళికా విభాగాధిపతి పి.సురేష్‌బాబు, ఎస్‌.ఇ. ఎం.వి.సూర్య నారాయణ, ఈఈ నరసింహమూర్తి, డీఈఈ సూర్యారావు, అటవీ అధికారి సుబ్బారెడ్ది పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

థాయిలాండ్‌ దేవాలయ నిర్మాణానికి 10 ఎకరాల కేటాయింపు
07-02-2018 10:20:41
గుంటూరు: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో థాయిలాండ్‌ దేవాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు థాయిలాండ్‌ కాన్సులేట్‌ క్రాంగ్కనిట్‌ రఖావు తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ కోన శశిధర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అమరావతిలో థాయిలాండ్‌ దేవాలయ నిర్మాణానికి 10 ఎకరాలు కావాలని సీఎం చంద్రబాబును కలిసి కోరామని, అందుకు ఆయన అంగీకరించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి థాయిలాండ్‌ సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తుందని ఆమె వెల్లడించారు. ఆధ్యాత్మిక రంగంతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి కూడా థాయిలాండ్‌ ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బౌద్ధ ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. విజయవాడలో థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్రపర్యాటక శాఖ కమిషనర్‌ హిమాన్షు శుక్లా, గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ కృతికా శుక్లా, కొరియన్‌ కాన్సులేట్‌ చుక్కపల్లి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

నేడు అమృత విశ్వవిద్యాపీఠం శంకుస్థాపన
07-02-2018 09:19:01

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాక
సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు
ఏర్పాట్లను పరిశీలించిన అర్బన్‌ ఎస్పీ 
గుంటూరు/మంగళగిరి రూరల్‌: ప్రఖ్యాతి చెందిన అమృత విశ్వవిద్యాలయం అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొని భూమిపూజ చేయనున్నారు. మంగళగిరి మం డలం కురగల్లు, యెర్రబాలెం గ్రామాల మధ్య అమృత యూనివర్సిటీ ఏర్పాటుకు 200 ఎకరాల్లో నిర్మాణాలను చేపట్టనన్నారు. తొలిదశలో 150 ఎకరాల్లో నిర్మాణాలను తలపెట్టినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. వెంటనే నిర్మాణపనులను ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రూ.150 కోట్లతో నిర్మాణాలను జరుపనున్నట్లు పేర్కొన్నారు.
 
భూమిపూజ మహోత్సవానికి ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. సభకు హాజరయ్యే విద్యార్థులకు, రైతులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లా అర్బన్‌ ఎస్పీ విజయారావు మంగళవారం సభాస్థలికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. ఐదుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 31 మంది ఎస్‌ఐలు, 23 మంది ఏఎఎస్‌లు, 180 మంది కానిస్టేబుల్‌/హోంగార్డులు, ఏఆర్‌, క్యూఆర్‌టీ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ఏర్పాట్లను అర్బన్‌ ఎస్పీతో పాటు నార్త్‌ డీఎస్పీ రామాంజనేయులు, ఇంటిలిజెన్స్‌ సెక్యూరిటీ డీఎస్పీ అశోక్‌, ఎస్‌బీ డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ రవికుమార్‌తో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు, ఏఎస్సైలు పరిశీలించారు.

Link to comment
Share on other sites

Dఅమరావతిలో సీఎస్‌ఐఆర్‌ కేంద్రం! 
07-02-2018 02:55:59
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతిలో పారిశ్రామిక, శాస్త్రీయ పరిశోధనకు ఉపకరించే ముఖ్య కేంద్రం ఒకటి ఏర్పాటు కానుంది. దేశంలో అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థగా ఉన్న ‘సీఎస్‌ఐఆర్‌’ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ రిసెర్చ్‌) ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న సీఎ్‌సఐఆర్‌ ప్రయోగశాలల్లో కనుగొన్న పరిశోధన ఫలాలను, సరికొత్త ఆవిష్కరణలను పరీక్షించి, ప్రదర్శించడానికి వీలుగా ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ‘సెంటర్‌ ఫర్‌ స్కేలింగ్‌ అప్‌ అండ్‌ డిమాన్‌స్ట్రేషన్‌ ఆఫ్‌ రెలవెంట్‌ సీఎ్‌సఐఆర్‌ టెక్నాలజీస్‌’ పేరుతో నెలకొల్పుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు నెలల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆ సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ గిష్‌ సాహ్ని వెల్లడించారు. సాహ్ని బృందం మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది.

Link to comment
Share on other sites

అమరావతిలో బౌద్ధ ఆలయ నిర్మాణం 
ముందుకొచ్చిన థాయ్‌లాండ్‌ బృందం
ఈనాడు డిజిటల్‌, అమరావతి: పూర్వం బౌద్ధ మతానికి ముఖ్య కేంద్రంగా నిలిచిన అమరావతిలో బౌద్ధ ఆలయం నిర్మించేందుకు థాయ్‌లాండ్‌ బృందం ముందుకొచ్చింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన బృంద సభ్యులు.. విశాఖపట్నం లేదా విజయవాడ నుంచి త్వరలో థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమాన సేవలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బౌద్ధ ఆలయ నిర్మాణానికి పదెకరాలు కేటాయిస్తామని, అందుకు అవసరమైన ఆకృతులు రూపొందించాలని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. విజయవాడ నుంచి విమానాశ్రయ సర్వీసులు నడపాలని కోరారు.

Link to comment
Share on other sites

అమరావతిలో బౌద్ధ ఆలయ నిర్మాణం 
ముందుకొచ్చిన థాయ్‌లాండ్‌ బృందం
ఈనాడు డిజిటల్‌, అమరావతి: పూర్వం బౌద్ధ మతానికి ముఖ్య కేంద్రంగా నిలిచిన అమరావతిలో బౌద్ధ ఆలయం నిర్మించేందుకు థాయ్‌లాండ్‌ బృందం ముందుకొచ్చింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన బృంద సభ్యులు.. విశాఖపట్నం లేదా విజయవాడ నుంచి త్వరలో థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమాన సేవలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బౌద్ధ ఆలయ నిర్మాణానికి పదెకరాలు కేటాయిస్తామని, అందుకు అవసరమైన ఆకృతులు రూపొందించాలని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. విజయవాడ నుంచి విమానాశ్రయ సర్వీసులు నడపాలని కోరారు.

Link to comment
Share on other sites

U భవనాలు నిర్మించకుంటే నోటీసులు 
ప్రభుత్వ కార్యాలయాలకు భూముల కేటాయింపు 
ఒప్పంద ఉద్యోగులకు 50శాతం జీతాల పెంపు 
మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు
ఈనాడు, అమరావతి: రాజధానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మంగళవారం జరిగింది. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థల ఏర్పాటుకు భూములు తీసుకుని నిర్మించని వారితోపాటు ఒప్పందాలను అమలు చేయని వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ, కాలవ శ్రీనివాసులు, కామినేని శ్రీనివాస్‌, జవహర్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రాజధానిలో భూఅక్రమంపై విచారణ: రాజధాని ప్రాంతంలో నదిలో కలిసే భూములను సమీకరణ కింద తీసుకుని స్థలాలు, కౌలు కేటాయించడంపై విచారిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అధికారుల పరిశీలనలోనే తప్పు జరిగిందని పేర్కొన్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ తప్పు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ షణ్మోహన్‌ను విచారణాధికారిగా నియమించినట్లు తెలిపారు.
ఎనిమిది విద్యాసంస్థలకు భూములు: అమరావతిలో ఎనిమిది విద్యాసంస్థలకు భూములు కేటాయించినట్లు రాష్ట్ర మంత్రులు వివరించారు. దీంతోపాటు పలు బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా కేటాయింపులు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న పాఠశాలలకు 3, 4, 5, 8 ఎకరాల లెక్కన నాలుగు విభాగాల్లో ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మంగళవారంనాటి సమావేశంలో చిన్మయ మిషన్‌, స్కాటిష్‌ హైఇంటర్నేషనల్‌, హెరిటేజ్‌ ఎక్స్‌పర్మెంటల్‌ లెర్నింగ్‌ స్కూల్‌, రేయాన్‌ గ్రూప్‌, సద్భావన, హొడా, బ్లెండెల్‌ అకాడమీ, గ్లోబల్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ విద్యాసంస్థలకు భూములిచ్చామని చెప్పారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల పెంపు: ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నామని మంత్రి కామినేని శ్రీనివాస్‌ వివరించారు. ప్రస్తుత వేతనంపై 50శాతం పెంచుతున్నట్లు చెప్పారు. కనిష్ఠంగా రూ.10వేల జీతం ఉంటుందని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.219కోట్ల భారం పడుతుందని, 19వేల ఉద్యోగులకు లబ్ధి కలుగుతుందని అన్నారు. పీజీ మెడికల్‌, డిప్లొమా, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చదివే విద్యార్థులకు రెండేళ్లుగా రావాల్సిన ఉపకార వేతనాలతోపాటు ప్రస్తుత ఏడాది ఉపకార వేతనాలు కలిపి చెల్లిస్తామని చెప్పా

Link to comment
Share on other sites

సీఎస్‌ఐఆర్‌ కేంద్రం 
రెండు నెలల్లో డీపీఆర్‌ సిద్ధం చేస్తామన్న సంస్థ ప్రతినిధులు 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమరావతిలో పారిశ్రామిక, శాస్త్రీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) సంస్థ ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్‌ ప్రయోగశాలల్లో కనుగొన్న పరిశోధన ఫలాలను, సరికొత్త ఆవిష్కరణలను పరీక్షించి ప్రదర్శించే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ గిరీశ్‌ సాహ్ని సీనియర్‌ శాస్త్రవేత్తలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం సచివాలయంలో కలిశారు. ‘సెంటర్‌ ఫర్‌ స్కేలింగ్‌ అప్‌ అండ్‌ డిమాన్‌స్ట్రేషన్‌ ఆఫ్‌ రిలవెంట్‌ సీఎస్‌ఐఆర్‌ టెక్నాలజీస్‌’ పేరుతో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు నెలల్లో డీపీఆర్‌ సిద్ధం చేస్తామని డీజీ గిరీశ్‌ సాహ్ని వెల్లడించారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యేవరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదని, తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుని వెంటనే కార్యరంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగించుకునేలా సీఎస్‌ఐఆర్‌ తమకు మార్గదర్శనం చేయాలని ముఖ్యమంత్రి వారిని కోరారు.

Link to comment
Share on other sites

ర్తలు
ఏపీలో మరో ప్రతిష్టాత్మక విద్యాలయం
07-02-2018 13:02:39
అమరావతి: ఏపీ రాజధానిలో మరో ప్రతిష్టాత్మక విద్యాలయం ఏర్పాటు కానుంది. మంగళగిరి మండలం కురగళ్లులో అమృత విద్యాపీఠం నిర్మించేందుకు అంతాసిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి క్యాంపస్‌కు బుధవారం శంకుస్థాపన చేశారు. 200 ఎకరాల్లో ఏర్పాటుకానున్న అమృత ప్రాంగణాన్ని నిర్మించనున్నారు. రూ.2500 కోట్లతో అమరావతి క్యాంపస్‌ను అమృత విద్యాపీఠం అభివృద్ధి చేయనుంది. ముందుగా 150 ఎకరాల్లో ఇంజనీరింగ్ క్యాంపస్‌‌ను నిర్మించిన అనంతరం 50 ఎకరాల్లో మెడికల్.. యోగా సైన్సెస్ కేంద్రం అభివృద్ధి చేయనున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభంకానున్నాయి.

Link to comment
Share on other sites

రాజధాని ప్రాంతంలో 14 మెడికల్ కళాశాలలు: చంద్రబాబు
07-02-2018 13:59:39

అమరావతి: రాజధాని ప్రాంతంలో 14 మెడికల్ కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయని, రూ.34 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుధవారం మంగళగిరి మండలం కురగళ్లులో అమృత విద్యాపీఠం, అమరావతి క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలకు రూ. 15,900 కోట్లు, పరిపాలనా నగరానికి రూ. 9,600కోట్లు, కొండవీటి వాగు వరద నివారణకు రూ. 1,450 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలో 10-15 నిమిషాల నడక దూరంలోనే ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు, వినోద సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, రాజధానిలో 1600 కి.మీ. సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
 
అమృత విద్యాపీఠం విలువలతో కూడిన విద్యను అందించడం అమృత విద్యాలయం ప్రత్యేకత అని, నవ్యాంధ్ర రాజధానిలో సంస్థ ఏర్పాటుకావడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ముందుగా ఇంజనీరింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఆర్ట్స్ విభాగాల్లో కోర్సులు ఉంటాయని, పేద కుటుంబంలో పుట్టిన అమృతానందమయి సేవకు ప్రతిరూపంగా ఎదిగారని, అమృతానందమయి సంస్థ విద్యారంగం, ఆధ్యాత్మికరంగంలో ముందుందని సీఎం కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా మాతా అమృతానందమయికి లక్షలమంది భక్తులున్నారని, ఇలాంటి విద్యాసంస్థ రాజధానికి రావడంతో ఆధ్యాత్మికత పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Tags : Chandrababu, Amaravati

Link to comment
Share on other sites

రైతుల భూములకు ప్రభుత్వం భద్రత : నారాయణ
07-02-2018 14:31:42

అమరావతి: రైతుల భూములకు ప్రభుత్వం భద్రత కలిపిస్తుందని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నిన్న జరిగిన ల్యాండ్ స్కాంతో సంబంధమున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంత్రి రాజధానిలో రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిలో మొత్తం 320 కి.మీ రోడ్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో కూడా రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు వచ్చే నెలలో వస్తాయని తెలిపారు. రాజధానిలో పని చేసే కార్మికులకు చట్ట ప్రకారం మౌలిక వసతులు కల్పించని సంస్థలను పనుల నుంచి తొలగిస్తామని నారాయణ హెచ్చరించారు.

Link to comment
Share on other sites

అమరావతికి మరో 30 సంస్థలు: నారాయణ

అమరావతి: అమరావతిలో మరో 30 సంస్థలు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారి పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. రహదారులను నిర్మిస్తున్న తీరును అమరావతి అభివృద్ధి సంస్థ, గుత్తేదారులతో కలిసి ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అమరావతిలో నిర్మించే 34 రహదారులకు గాను 24 రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయని.. మరో 10 రహదారులకు మార్చి నెలాఖరులోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పనులు ఆలస్యంగా చేస్తున్న గుత్తేదారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోపు పూర్తిచేయకపోతే సహించే ప్రసక్తి లేదని తేల్చిచేప్పారు. అమరావతిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న గృహాలను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేస్తామన్నారు.

Link to comment
Share on other sites

34 వేల కోట్లతో రాజధాని పనులు
08-02-2018 01:02:56

చకచకా రోడ్లు, వాగుల అభివృద్ధి
నీటి ఎద్దడి లేకుండా 5 రిజర్వాయర్లు
సైక్లింగ్‌ కోసం ప్రత్యేక రహదార్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
అమృత వైద్య వర్సిటీకి శంకుస్థాపన
మంగళగిరి, ఫిబ్రవరి 7: రాజధాని అమరావతి నిర్మాణ పనులను రూ.34 వేల కోట్ల వ్యయంతో ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి పరిధిలో కురగల్లు-నవులూరు మధ్య మాతా అమృతానందమయి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించనున్న అమృత వైద్య విశ్వవిద్యాలయానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాజధానిలో రోడ్లు, విద్యుత్‌, వివిధ పైపులైన్ల ఏర్పాటుకు రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాజధానికి భూములిచ్చిన రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల కోసం 13 ఎల్‌పీఎస్‌ లేఅవుట్లను రూ.15,900 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నాం. పరిపాలనా నగరం కోసం రూ.9,600 కోట్లు.. కొండవీటి వాగు, ఇతర వాగుల అభివృద్ధి.. వరద నియంత్రణ పనుల కోసం మరో రూ.1450 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఇందుకు అవసరమయ్యే నిధులను ఒప్పందాలపై సమకూర్చుకున్నాం. ఈ అభివృద్ధి పనులతో రైతులకిచ్చిన ప్లాట్లకు గిరాకీ వస్తుంది’ అని పేర్కొన్నారు.
 
ఇదే సందర్భంలో రాజధాని రైతుల త్యాగాలను మరువలేనంటూ వారికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. రైతాంగం ముందుకొచ్చి భూములను ఇవ్వకుంటే రాజధాని నగరం...ఈ అభివృద్ధి అంతా ఓ కలగా మిగిలిపోయి ఉండేదని చెప్పారు. ‘నైబర్‌హుడ్‌ కాన్సె్‌ప్టతో ఐదు నిమిషాల్లో ఆస్పత్రులకు, 10 నిమిషాలలో వాక్‌ టూ వర్క్‌, 15 నిమిషాల్లో వినోద నగరానికి చేరుకునే విధంగా తొమ్మిది నగరాలు, 27 టౌన్‌షి్‌పలను ఏర్పాటు చేస్తున్నాం. మోటారు రహిత రవాణా కోసం ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా అమరావతిలో సైకిళ్లపై వెళ్లేందుకు ప్రత్యేక రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. రాజధానిని పూర్తి కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రికల్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. కృష్ణానదితో కలిపి రాజధానిలో ఐదు రిజర్వాయర్లు వస్తాయి’ అని తెలిపారు.
 
ఇంజనీరింగ్‌, టెక్నాలజీ.. ఎన్నెన్నో
అమృత వర్సిటీలో ఇంజనీరింగ్‌ కళాశాల, రీసెర్చిసెంటర్లు, మేనేజ్‌మెంట్‌ స్కూల్‌, ఇన్నోవేషన్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్లు, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ క్యాంపస్‌, సోషల్‌ సైన్సెస్‌, జర్నలిజం, అంతర్జాతీయ యోగా-ఆధ్యాత్మికత, గ్లోబల్‌ పీస్‌ లీడర్‌షిప్‌-ఎఽథిక్స్‌ సెంటర్‌లు ఉంటాయని తెలిపారు. 750 పడకల బోధనాస్పత్రి, 1500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పతి, డెంటల్‌, ఫార్మసీ, నేచురోపతి, నర్సింగ్‌, ఆయుర్వేద ఇంటిగ్రేటెడ్‌ ఆస్పత్రులు ఏర్పాటవుతాయని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకురాలు మాతా అమృతానందమయి ఓ సాధారణ పేద కుటుంబంలో జన్మించినా శక్తివంతమైన వ్యక్తిగా ఆవిర్భవించారని, ఆమె తన ఇంటికి కూడా వచ్చారని సీఎం పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

అమరావతి ఆణిముత్యం అమృత
08-02-2018 09:01:26

కురగల్లు- నవులూరు మధ్య 200 ఎకరాల కేటాయింపు
సీఎం చేతుల మీదగా భూమిపూజ
మంగళగిరి: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌ ప్రధాన కార్యాలయంగా అమృత సంస్థ దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అయిదు క్యాంపస్‌లను నిర్వహిస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరుతోపాటు కేరళలోని అమృతపురి (కొల్లం), కొచ్చిన్‌, కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు నగరాల్లో అమృత క్యాంపస్‌లు పనిచేస్తున్నాయి. దేశంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో అమృత ప్రథమ స్థానంలో కొనసాగుతుండగా అన్నిరకాల విద్యాసంస్థల ర్యాంకింగ్‌ల ప్రకారం దేశంలో 16వ స్థానంలో ఉంది. ఇక ఆసియా దేశాల్లో ఈ సంస్థ తన ర్యాంకింగ్‌ను 168గా నమో దు చేసుకుంది. ప్రస్తుతం హర్యానాలో ఆరో క్యాంపస్‌ నిర్మాణ పనులను చేపట్టిన అమృత విద్యాపీఠం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తన ఏడో క్యాంపస్‌కు బుధవారం పునాదిరాయి వేసింది. ఈ క్యాంపస్‌కు మొత్తం 200 ఎకరాలను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తొలిదశ కింద 150 ఎకరాలను అమృత సంస్థకు బదలాయించింది. సుమారు రూ.2500 కో ట్ల వ్యయంతో ఈ క్యాంపస్‌ను దశలవారీగా విస్తరించనున్నా రు. ఈ క్యాంపస్‌లో వైద్యకళాశాలతోపాటు మల్టీసూపర్‌ స్పెషాలిటీ, నర్సింగ్‌, డెంటల్‌, ఫార్మసీ, నేచురోపతి, ఆయుర్వేద కళాశాలలే కాకుండా బిజినెస్‌ స్కూల్‌, ఇంజనీరింగ్‌ కళాశాల, ఇతర సాంకేతిక కళాశాలలను ఏర్పాటుచేస్తారు.
 
ఒకే డీమ్డ్‌ యూనివర్సిటీ కింద ఏర్పాటయ్యే ఈ విద్యాసంస్థలను రెండుదశలుగా ఏర్పాటుచేసేందుకు విద్యాపీఠం నిర్వాహకులు ప్రణాళికలు రూపొందించారు. తొలిదశ కింద 150 ఎకరాల విస్తీర్ణంలో ఇంజనీరింగ్‌ కళాశాల, వైద్యకళాశాల, 750 పడకల టీచింగ్‌ హాస్పటల్‌, బిజినెస్‌ స్కూల్‌ను ఏర్పాటుచేస్తారు. రెండవ దశ కింద 50 ఎకరాల్లో మల్టీసూపర్‌ స్పెషాలిటీ హా స్పటల్‌, అత్యాధునిక ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన పరిశోధనా కేం ద్రాలు ఏర్పాటుచేస్తారు. 2018 ఆగస్టులో 300మంది విద్యార్ధులతో క్యాంపస్‌ తరగతులను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 2020నాటికి 2 వేల మంది, 2033 నాటికి 10 వేల మంది విద్యార్థులు క్యాంపస్‌లో విద్యనభ్యసించేవిధంగా దీనిని తీర్చిదిద్దుతామని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. తమసంస్థలో విద్యాప్రతిభకు భరోసాను కల్పించేందుకు స్టూడెం ట్‌, ఫ్యాకల్టీ రేషియోను 10:1గా కొనసాగించబోతున్నామని వారు చెప్పారు.
 
ఇదిలావుండగా అమృత వంటి విద్యాసంస్థలు సమాజానికి బాధ్యత కలిగిన మంచి పౌరులను అందిస్తాయని సీఎం చంద్రబాబు శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో చెప్పారు. అమరావతికి ఎన్నో ప్రఖ్యాతమైన విద్యాసంస్థలను తీసుకొస్తున్నప్పటికీ... వాటిలో అమృత ప్రత్యేకత ఇంకా ప్రత్యేకమైనదని చెప్పడం విశేషం! తమ పార్టీకి చెందిన ముఖ్యనేత ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణం కారణంగా అన్నీ కార్యక్రమాలను రద్దుచేసుకున్నప్పటికీ అమృత శంకుస్థాపనను మాత్రం వాయిదా వేయలేకపోయామని సీఎం చెప్పారు.
 
ఇప్ప టికే ఈ సంస్థ అమరావతి క్యాంపస్‌ డిజైన్లను అత్యద్భుతంగా రూపొందించింది. విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మికత, సృజనాత్మకత, స్థానికతలను మేళవించేలా క్యాంపస్‌ భవన సముదాయాల ఆకృతులను రూపొందించారు. స్థానికతకు చిహ్నం గా మంగళగిరి శ్రీ లక్ష్మీనృసింహస్వామి తూర్పురాజగోపురాన్ని నమూనాగా తీసుకుని అమృత క్యాంపస్‌ ప్రధాన ద్వారాన్ని డి జైన్‌ చేశారు. అమరావతికి అమృత విద్యాసంస్థ రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తంచేశారు. ఇప్పటికే ఇండో-యూకే హెల్త్‌ యూనివర్సిటీ, ఎయిమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణపనులు ఆ రంభమయ్యాయి. తాజాగా అమృత వైద్యకళాశాల కూడా శంకుస్థాపన జరుపుకొంది. మొత్తంగా అమరావతిలో 15వరకు వైద్య కళాశాలలు వస్తాయని సీఎం చంద్రబాబు మరోమారు స్పష్టంచేశారు.
 
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకే నగరంలో ఇన్నేసి వైద్య కళాశాలలు రావడం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అమరావతి రాబోయే రోజుల్లో హెల్త్‌ హబ్‌గా, మెడికల్‌ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందగలదన్న సీఎం వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారు. బుధవారం నిర్వహించిన అమృత విశ్వవిద్యాపీఠం భూమిపూజ కార్యక్రమంలో విద్యాపీఠం అధ్యక్షులు స్వామి అమృతాస్వరూపానందపురి, వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి.వెంకట్‌రంగన్‌, అమరావతి క్యాంపస్‌ డైరెక్టర్‌ సదాశివచైతన్య, మరో డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రేమ్‌నాయర్‌, ఇంజనీరింగ్‌ డీన్‌ డాక్టర్‌ సాసంగన్‌ రామనాథన్‌, మంత్రులు పి.నారాయణ, కామినేని శ్రీనివాస్‌, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.
 
మహిళలకు శ్రీమాతా అమృతానందమయిదేవి చీరల పంపిణీ
మంగళగిరి రూరల్‌, ఫిబ్రవరి 7: ప్రపంచ ప్రసిద్ధ మానవతావాది, ఆధ్యాత్మిక నాయకురాలు శ్రీమాతా అమృతానందమయి దేవి (అమ్మ) నేతృత్వంలోని మాతా అమృతానందమయి మఠ్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా పంపిన చీరలను బుధవారం మహిళలకు అందజేశారు. అమృత విశ్వవిద్యాపీఠం భూమిపూజ సందర్భంగా హాజరైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మండలంలోని యర్రబాలెం, కురగల్లు గ్రామాల మధ్యలో 150 ఎకరాల్లో తొలిదశలో ఏర్పాటుకానున్న అమృత విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు. శంకుస్థాపన మహోత్సవానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. తొలుత వేదికపై నుంచి సమావేశానికి హాజరయ్యే మహిళలకు అమ్మ పంపిన చీరలు ప్రతి ఒక్కరికీ అందజేస్తామని, వేదికపై పది మందికి మాత్రం పంపిణీ చేసి తదుపరి మీ స్థానాల వద్దకు వచ్చి టోకెన్లు అందజేస్తారని ప్రకటించారు. ఆ టోకెన్లు తీసుకుని కౌంటర్ల వద్దకెళ్లి చీరలు తీసుకోవచ్చని తెలిపారు.
 
టోకెన్‌రానివారు అధైర్యపడాల్సిన పనిలేదని సమావేశానికి హాజరైన ప్రతి మహిళకు అందించేందుకు 5 వేల చీరలను అమ్మ పంపిందని తెలిపారు. అందరికీ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని, చీరలు తీసుకుని భోజనం చేసి వెళ్లాలని కోరారు. చంద్రబాబునాయుడు ప్రసంగం ముగియగానే మహిళలు ఒక్కసారిగా చీరల కౌంటర్‌ వద్ద గుమికూడారు. పోలీసులు ఒక క్రమపద్ధతిలో చీరలు అందే విధంగా చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా బస్సులలో దూరప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా ప్రతి ఒక్కరూ అమ్మ పంపిన చీర కోసం ఆసక్తి కనబరిచారు. సమావేశం అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

Link to comment
Share on other sites

గడువులోగా రాజధాని రహదార్లు నిర్మిస్తాం
08-02-2018 08:53:54

మంత్రి నారాయణ
ఎన్‌-8, ఎన్‌-10 రహదార్ల నిర్మాణం పరిశీలన
అమరావతి/తుళ్లూరు(ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలో ఏడీసీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న వివిధ రహదారులు నిర్దేశిత గడువులోగా పూర్తవుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, ఏపీ సీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ చెప్పారు. ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారధి, ఇతర అధికారులతో కలసి బుధవారం అమరావతిలోని ఎన్‌-8, ఎన్‌-10 రహదారుల నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. మందడం నుంచి వెలగపూడి, మల్కాపురం, మోదుగుల్లంపాలెం, ఐనవోలు తదితర గ్రామాల్లో పర్యటించి, పనుల పురోగతిని ప్రత్యక్షంగా చూశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజధానిలో మొత్తం 217 కిలోమీటర్ల పొడవైన 34 ప్రాధాన్య రహదారులను నిర్మిస్తున్నామని, వీటిల్లో 24 రోడ్లు ఈ ఏడాది జూలైలోపు పూర్తవుతాయని పేర్కొన్నారు. వీటిని వేగంగా నిర్మిస్తున్నారంటూ ఏడీసీని అభినందించారు. మిగిలిన 10 రహదారుల నిర్మాణం టెండర్ల దశలో ఉందని, ఆ ప్రక్రియను త్వరలోనే పూర్తిచేసి, వాటి పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ రోడ్లన్నీ ఎక్కడా మలుపు లేకుండా, తిన్నగా సాగుతూ వాటిపై ప్రయాణాన్ని ఆహ్లాదభరితం చేస్తాయన్నా రు. రహదారుల నిర్మాణం చురుగ్గా సాగేందుకు వారానికి మూడుసార్లు ఏడీసీ అధి కారులు, ఒక పర్యాయం తాను పనులను పరిశీలి స్తామని చెప్పారు.
 
పూలింగ్‌ సమయంలో రైతులకు ఇచ్చిన హామీలమేరకు రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తామని, అన్ని రాజధాని గ్రామాలకు కలుపుతూ రోడ్లను నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఎల్పీఎస్‌ లేఅవుట్లలో కూడా చక్కటి రహదారులను నిర్మిస్తామన్న ఆయన అసెంబ్లీ, హైకోర్టులకు మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ వచ్చే నెలలో తుది డిజైన్లను ప్రభుత్వానికి సమర్పిస్తారన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రాజధానిలో ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న 3840 క్వార్టర్లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
 
ఈ పర్యటనలో ఏడీసీ ఈడీ జి.రత్నకుమార్‌, భూవ్యవహారాల సంచాలకుడు బి.రామయ్య, సీఈ టి.మోజెస్‌కుమార్‌, ఎస్‌ఈ ఎంవీ సూర్యనారాయణ తదితర అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...