Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో బ్రహ్మకుమారీల విశ్వశాంతి కేంద్రం

ఈనాడు, అమరావతి: అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటుకాబోతుంది. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలోని పెదపరిమి-నెక్కల్లు మధ్య ‘యూనివర్సల్‌ పీస్‌ రీట్రీట్‌ సెంటర్‌’ నిర్మాణం కానుంది. విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ అత్యాధునిక రీతిలో పదెకరాల విస్తీర్ణంలో కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా అమరావతిలో ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయాలని సంస్థ సంకల్పించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న కేంద్రం తరహాలోనే దీన్ని నిర్మిస్తారు. ఇందులో భాగంగా ఆడిటోరియం, యాంఫి థియేటర్‌, లేజర్‌షో తదితర నిర్మాణాలు చేపడతారు. ఫిబ్రవరి 1న యూనివర్సల్‌ పీస్‌ రిట్రీట్‌ సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని సీఆర్‌డీఏ కమిషనర్‌ డా.చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

అమరావతిలో విశ్వశాంతి కేంద్రం
29-01-2018 07:40:16
 
636528084152280489.jpg
  • బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో 1న శంకుస్థాపన
  • ప్రతినిధి పద్మజ వెల్లడి
విజయవాడ (ఆంధ్రజ్యోతి): ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ సంస్థల ఆధ్వర్యంలో అమరావతిలో విశ్వశాంతి కేంద్రం(యూనివర్సల్‌ పీస్‌ రిట్రీట్‌ సెంటర్‌) ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రతినిధి పద్మజ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 139 దేశాల్లో తమ సంస్థకు ఎన్నో శాఖలు ఉన్నాయని తెలిపారు. వీటిలో భాగంగా సీఎం చంద్రబాబు ఆదేశాలు, సహాయ సహకారాలతో ఫిబ్రవరి 1న విశ్వశాంతి కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్‌లో ఆదివారం సంస్థ ప్రతినిధులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎంతో స్ఫూర్తితో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో బ్రహ్మకుమారీస్‌ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడానికి స్థలం ఇచ్చారని, ఇప్పుడు అమరావతిలో తమ సంస్థ ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయించారని తెలిపారు.
 
అక్కడ ఫిబ్రవరి 1న బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ యూనివర్సల్‌ పీస్‌ రిట్రీట్‌ సెంటర్‌ ముఖ్య అధినేత్రి దాది జానకి, సీఎం చంద్రబాబు చేతులమీదుగా శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. కార్యక్రమానికి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, సంస్థ ముఖ్యులు సహా వివిధ దేశాల నుంచి 8 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని వివరించారు. దేశంలో స్త్రీ శక్తికి గౌరవం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమెన్‌ ఎంపవర్‌మెంటును మరింత బలోపేతం చేయడానికి మున్ముందు పలు కార్యక్రమాలు చేపడతామన్నారు.
Link to comment
Share on other sites

సంతోష నగరాల సదస్సుకు విద్యార్థులు
29-01-2018 01:24:10
 
636527858487296992.jpg
  • వారి ఆలోచనలు పంచుకునేలా ఏర్పాట్లు
  • సీఆర్‌డీఏకు చంద్రబాబు ఆదేశం
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్‌లో జరుగనున్న ‘‘సంతోష నగరాల సదస్సు-అమరావతి 2018’’లో విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని సీఆర్‌డీఏ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆదివారం సీఆర్‌డీఏ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమరావతిని అత్యంత సంతోషకర నగరంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కూడా ఆలోచనలు పంచుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
 
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఆర్థిక, సాంకేతిక ఫలాలు అందాలని సీఎం పునరుద్ఘాటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రజా కేంద్రీకృత వ్యూహాన్ని సిద్ధం చేయాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. అమరావతిని సంతోషకర నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. దేశంలో అతి చిన్న వయసున్న అమరావతి నగరం... అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భవిష్యత్‌ ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా నిలవనుందని, ఇది తనకెంతో సంతోషకరమని సీఎం చెప్పారు. క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌, కృత్రిమ మేధ, డేటా అనాలసిస్‌, సైబర్‌ భద్రత, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో అమరావతిని దేశానికి కేంద్రంగా మార్చాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం వెల్లడించారు.
 
అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.30-40 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఆర్‌డీఏ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌, కమిషనర్‌ శ్రీధర్‌ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, సీఎం ప్రత్యేక సీఎస్‌ సతీశ్‌చంద్ర, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌, ఏడీసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యానికి ఆసక్తి
30-01-2018 09:04:59

సీఎంను కలిసిన ఇటలీ కంపెనీ
రాజధానిలో పెట్టుబడుల అవకాశాలను
వివరించిన సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మించనున్న రహదారుల ప్రాజెక్టుల్లో భాగస్వాములవుతామని ఇటలీకి చెందిన అనాస్‌ ఇంట ర్నేషనల్‌ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి తెలిపారు. ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణంపై కూడా వారు ఆసక్తి కనబరిచారు. వెలగపూడిలోని సచివా లయంలో సోమవారంనాడు సీఎంను కలిసిన వారు ఈ సందర్భంగా దోహాలో ఇప్పటికే తాము నిర్మించిన ఐకానిక్‌ బ్రిడ్జి గురించి వివరించారు. రష్యా, ఖతార్‌, లిబియాల్లోనూ తాము అనేక ప్రాజెక్టులను చేపట్టినట్లు తెలిపారు. అమరావతి నిర్మాణంలో ఏఏ అంశాల్లో పాలుపంచుకు నేందుకు అవకాశాలున్నాయో గుర్తించేందుకు ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులతో చర్చలు జరపాల్సిందిగా సీఎం వారికి సూచించారు. రాజధానిలో ప్రతిపాదించిన కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ సిటీ నిర్మాణంలో పాలుపంచుకోవాల్సిందిగా కూడా చంద్రబాబు వారితో చెప్పారు.
 
రూ.29,798 కోట్ల పెట్టుబడులకు అవకాశం
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కార్యకలాపాల్లో ప్రధానంగా ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో సుమారు 4.7 బిలియన్‌ డాలర్ల్ల (దాదాపు రూ.29,798 కోట్లు) పెట్టుబడులకు అవకాశం ఉందని సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ అనాస్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై అధ్యయనం కోసం సోమవారంనాడు అమరావతిని సందర్శించి, సీఎంతో భేటీ అయిన వారు అనంతరం సీఆర్డీయే ఉన్నతా ధికారులతో విజయవాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా శ్రీధర్‌ రాజధానిలోని ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభి వృద్ధి, ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్ల నిర్మాణంలో పీపీపీలో పెట్టు బడులకు గల అవకాశాలను వివరించారు. ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించిన 1.5 బిలియన్‌ డాలర్ల విలువైన పనులకు హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యాం) విధానంలో 5 టెండర్లను పిలిచామన్న ఆయన ఈ విధానం గురించి తెలియజేశారు.
 
వీటితోపాటు రాజధాని చుట్టూ రూ.7,624 కోట్లతో నిర్మించే 97 కిలోమీటర్ల పొడవైన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, 180 కి.మీ. పొడవైన అవుటర్‌ రింగ్‌రోడ్డు పనుల్లోనూ పెట్టుబడులకు అవకా శాలున్నాయని పేర్కొన్నారు. అనాస్‌ ఇంటర్నేషనల్‌ సీఈవో బెర్నాడో మాగ్రి మాట్లాడుతూ రహదారుల డిజైన్‌, నిర్మాణం, నిర్వహణ, మరమ్మతుల వంటి అంశాల్లో తమ సంస్థకు దాదాపు వందేళ్ల చరిత్ర ఉందని, పలు దేశాల్లో తమ కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. భారతదేశంలో ఇటలీ కాన్సుల్‌ జనరల్‌ స్టెఫానియా కోస్టాంజా నేతృత్వంలో విచ్చేసిన ఇటలీ బృందంలో అనాస్‌టెక్‌ సీఈవో నికోలా చియారా, ఛైర్మన్‌ రేమండ్‌ మైకేల్‌, బోర్డు డైరెక్టర్‌ జార్జి మైకేల్‌, కమర్షియల్‌ డైరెక్టర్‌ గియుసెప్పె సీలియా మాగ్నో, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలపర్‌ జానీ ఫెర్నాండెజ్‌, భారత భాగస్వామి ఆర్వీఆర్‌ చౌదరి ఉన్నారు.

Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణంలో మేమూ.. 
ఇటలీ సంస్థ ‘అనస్‌ ఇంటర్నేషనల్‌’ ఆసక్తి 
ముఖ్యమంత్రితో ప్రతినిధి బృందం భేటీ 
ఈనాడు - అమరావతి 

రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ఇటలీకి చెందిన ఇంజినీరింగ్‌, నిర్మాణ సంస్థ ‘అనస్‌ ఇంటర్నేషనల్‌’ ముందుకొచ్చింది. భారత్‌తో ఇటలీ కాన్సుల్‌ జనరల్‌ స్టెఫానియా కోస్టాంజా సారథ్యంలో ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసింది. రష్యా, ఖతార్‌, లిబియాల్లో ఇప్పటికే తమ సంస్థ అనేక ప్రాజెక్టులు చేస్తోందని, భారత్‌లోనూ కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్నామని అనస్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు తెలిపారు. దోహాలో తాము నిర్మించిన ఐకానిక్‌ బ్రిడ్జి గురించి వివరించారు. అమరావతిలో రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో భాగస్వాములవుతామని తెలిపారు. కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ వారధి నిర్మాణంపై ఆసక్తి కనబరిచారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిత ‘నిర్మాణ సామగ్రి నగరం’లో భాగస్వాములు కావాలని ఆ సంస్థను సీఎం కోరారు. రాజధానిలో ఏయే అంశాల్లో సహకరించేందుకు అవకాశాలున్నాయో సీఆర్‌డీఏ అధికారులతో చర్చించి, నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలని సూచించారు.
రాజధానిలో విస్తృత అవకాశాలు.. 
అమరావతిలో ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.29,798 కోట్ల పెట్టుబడులకు అవకాశముందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. ఇటలీ ప్రతినిధుల బృందం సోమవారం విజయవాడలోని ఒక హోటల్‌లో సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమైంది. రాజధానిలో ఎల్పీఎస్‌ లేఅవుట్‌ల అభివృద్ధి, బాహ్య, అంతరవలయ రహదారుల పనుల్లో పీపీపీ విధానంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ పేర్కొన్నారు. రాజధానిలో ప్రస్తుతం ఎల్పీఎస్‌ లేఅవుట్‌లు, టైర్‌-1, టైర్‌-2 మౌలిక వసతుల పనులకు పెట్టుబడులు అవసరమవుతాయని తెలిపారు. ఎల్పీఎస్‌ లేఅవుట్‌లకు సంబంధించి 1.5 బిలియన్‌ డాలర్ల విలువైన పనులకు హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో ఐదు విడతలుగా టెండర్లు పిలిచామని, ఆసక్తిఉంటే వీటిలో పాల్గొనవచ్చునని సూచించారు. రాజధాని నగరం చుట్టూ రూ.7,624 కోట్లతో 97 కి.మీ.ల మేర అంతరవలయ రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ పూర్తయిందని, ఆరు నెలల్లో పనులు మొదలవుతాయని, దీనిలోనూ పెట్టుబడులకు అవకాశాలుంటాయని తెలిపారు. 180కి.మీ. పొడవైన బాహ్య వలయ రహదారి నిర్మిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తమ సంస్థ వందేళ్లుగా రహదారుల డిజైన్‌, నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులు వంటి అంశాల్లో పనిచేస్తోందని అనస్‌ ఇంటర్నేషల్‌ సంస్థ సీఈఓ బెర్నార్డో మాగ్రి పేర్కొన్నారు. సమవేశంలో అనస్‌ టెక్‌ సీఈఓ నికోలా చియారా, ఛైర్మన్‌ రేమండ్‌ మైఖేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=529771

 

భూసేకరణకు రెడీ.. ఆరు గ్రామాలకు అవార్డులు జారీ
31-01-2018 08:27:41
 
636529840619989661.jpg
గుంటూరు: అమరావతి రాజధాని నగర పరిధిలోని ఆరు గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియని గుంటూరు జిల్లా యంత్రాంగం కొలిక్కి తీసుకొచ్చింది. భూసేకరణలో చివరి అంకంగా పరిగణించే అవార్డుల జారీని ప్రకటించింది. గతంలో నేలపాడు గ్రామానికి అవార్డు ప్రకటన పూర్తి కాగా తాజాగా అబ్బరాజుపాలెం, బోరుపాలెం, లింగాయపాలెం, రాయపూడి-1, రాయపూడి-2, శాకమూరు గ్రామాలకు అవార్డులను ప్రకటించారు. అవార్డులు ప్రకటించిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సీఆర్డీయే వర్గాలు తెలిపాయి. మరికొద్ది రోజుల్లో మిగిలిన గ్రామాల అవార్డులను కూడా ప్రకటిస్తామని వెల్లడించాయి. ఒకవేళ ఈలోపు రైతులు ముందుకొస్తే వారి భూములను భూసమీకరణ పథకం కింద తీసుకొనేందుకు ఇంకా అవకాశం ఉందని స్పష్టం చేశాయి.
 
భూసమీకరణే మేలు
భూసేకరణలో ప్రభుత్వం ఎకరానికి నిర్ణయించిన ధర కంటే రెండున్నర రెట్లు అధికంగా వస్తుంది. అబ్బరాజుపాలెంలో ఎకరం భూమి రూ.8 లక్షలు కాగా దీనికి రెండున్నర రెట్లు కలిపితే కేవలం రూ.28 లక్షలు మాత్రమే రైతులకు వస్తాయి. అదే భూసమీకరణ కింద ఇస్తే ఎకరానికి వెయ్యి చదరపు గజాల నివాస, 250 చదరపు గజాల వాణిజ్య భూమిని సీఆర్‌డీఏ ఇస్తోంది. ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో చదరపు గజం భూమి విలువ రూ.20 వేల వరకు ఉన్నట్లు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకొంటే ఎకరం భూమి ఎల్‌పీఎస్‌ కింద ఇస్తే ప్రస్తుతం ఉన్న ధరని లెక్కిస్తేనే సుమారు రూ.2.50 కోట్ల మేరకు లబ్ధి కలుగుతుందని బేరీజు వేసి చూపిస్తున్నాయి. అంతేకాకుండా ఏటా రూ.30 వేలు ప్రతీ ఏటా 10 శాతం పెంచుతూ కౌలు ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి అదనంగా విద్య, వైద్యం, పక్కా ఇళ్లు, పెన్షన్లు, ఒకేసారి రుణమాఫీ వర్తింపు వంటి ప్రోత్సాహకాలు అదనంగా లభిస్తాయని వివరిస్తున్నాయి. మిగిలిన గ్రామాల్లో రైతులు అవార్డులు ప్రకటించే లోపు వస్తే వారి భూములను ఎల్‌పీఎస్‌ కింద తీసుకొనే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నాయి.
 
Link to comment
Share on other sites

నిధులకూ సమీకరణే! 
రాజధానికి పన్ను రహిత బాండ్లు
రూ.10వేల కోట్లకు సిద్ధం 
మసాలా, దేశీయ బాండ్ల ద్వారా మరో రూ.2వేల కోట్లు 
రాష్ట్ర ప్రభుత్వం యోచన 
అనుమతి కోరుతూ కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ 
ఈనాడు - అమరావతి 

భూసమీకరణలాగే రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణకు ‘అమరావతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌’ పేరుతో పన్ను రహిత బాండ్లను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానంలో రూ.10వేల కోట్లు సమీకరించుకోవాలన్నది ఆలోచన. మరో రూ.2 వేల కోట్లను దేశీయ సంస్థాగత బాండ్లు, మసాలా బాండ్ల (విదేశాల్లో విడుదల చేసేవి) ద్వారా సమకూర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ బాండ్ల జారీకి అనుమతి కోరుతూ కేంద్ర ఆర్థికశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వెళ్లింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థికశాఖకు ఒక లేఖ రాశారు. బాండ్ల జారీకి అనుమతితోపాటు, రాజధానిలో చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టులకు నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) ద్వారా నిధులు సమకూర్చాలని కోరారు. రాజధానిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ.11,602 కోట్లు వ్యయమవుతుందని, దీనికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే నీతి ఆయోగ్‌కి సమర్పించామని, ఆ నిధులు మంజూరు చేయాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం హామీ... రాజధాని నిర్మాణానికి దేశీయ, మసాలా బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకోవాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దేశీయ మార్కెట్‌లో బాండ్లు విడుదల చేసేందుకు అవసరమైన క్రెడిట్‌ రేటింగ్‌ కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ‘కేర్‌’ అనే క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థను నియమించుకుంది. బాండ్ల జారీ ప్రక్రియ నిర్వహించేందుకు ఏకే కేపిటల్‌ అనే మర్చంట్‌ బ్యాంకర్‌నూ నియమించుకుంది. సీఆర్‌డీఏ జారీ చేసే బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనకు ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బాండ్ల జారీకి అనుమతి కోరుతూ కేంద్ర ఆర్థికశాఖకు లేఖ రాశారు. పన్ను రహిత బాండ్లలో వ్యక్తిగత మదుపుదారులు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ బాండ్లలో మదుపు చేసిన మొత్తానికి 80(సి) కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), ఐడీఎఫ్‌సీ వంటి సంస్థలు ఇలా బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమకూర్చుకుంటాయి. అదే కోవలో రూ.10వేల కోట్ల సమీకరణకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం సరేనంటే ఆర్‌బీఐ అనుమతులు వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని మూడు నాలుగు నెలల్లో మార్కెట్‌లోకి వెళ్లవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి.
క్రెడిట్‌ రేటింగ్‌ కీలకం.. దేశీయ, మసాలా బాండ్ల ద్వారా రూ.2000 కోట్లు సమీకరించుకోవాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఈ రెండూ సంస్థాగత మదుపరులు పెట్టుబడులు పెట్టేవి. దేశీయ బాండ్లను మన దేశంలోనే విడుదల చేస్తారు. మసాలా బాండ్లు విదేశాల్లో అక్కడి స్టాక్‌ ఎక్ఛేంజీల ద్వారా విడుదల చేస్తారు. లండన్‌, సింగపూర్‌ స్టాక్‌ ఎక్ఛేంజీల ద్వారా మసాలా బాండ్లు విడుదల చేయాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. మొదట దేశీయ బాండ్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలి విడతలో రూ.500 కోట్ల విలువైన బాండ్లు విడుదల చేయాలన్నది ఆలోచన. మార్కెట్‌ పరిస్థితిని బట్టి దశలవారీగా బాండ్లు విడుదల చేయాలని భావిస్తోంది. బాండ్లు విడుదల చేయడంలో క్రెడిట్‌ రేటింగ్‌ కీలకమైంది. క్రెడిట్‌ రేటింగ్‌ ఎంత బాగుంటే... పెట్టుబడులు పెట్టేందుకు సంస్థాగత మదుపరులు అంతగా ముందుకు వస్తారు. వడ్డీ శాతం తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి క్రెడిట్‌ రేటింగ్‌ ‘ఎ’ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది కాబట్టి సీఆర్‌డీఏకి ‘ఎ’ లభించవచ్చని భావిస్తున్నారు. మసాలా బాండ్లను విదేశాల్లో డాలర్లలో కాకుండా, రూపాయి మారకం విలువతో జారీ చేస్తారు.

Link to comment
Share on other sites

అమరావతిలో స్మార్ట్ సైకిళ్ల సవారీ
ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: రాజధాని అమరావతిలోని సచివాలయంలో స్మార్ట్‌ సైకిళ్ల పరుగులు ప్రారంభమయ్యాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్‌డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్‌ల ఏర్పాటు చేస్తుండగా... ప్రయోగాత్మకంగా తొలిసారి వీటిని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. జర్మనీ నుంచి ఇప్పటికే 30 అత్యాధునిక సైకిళ్లు దిగుమతి చేసుకున్నారు. లక్ష రూపాయల విలువ చేసే ఈ ఒక్కో సైకిల్ కు సంబంధించి సచివాలయం పరిధిలో మొత్తం మూడు స్మార్ట్‌ సైకిల్‌ స్టేషన్ల ఏర్పాటు చేసి...,  ప్రతి స్టేషన్‌లో 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. 

సైకిల్‌ సవారీని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. సైకిల్ తయారీ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.  సచివాలయ ప్రాంగణానికి వెలుపల, పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఒకటి, ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే మరొకటి, రెండో బ్లాక్‌కి ఎదురుగా ఇంకొకటి.. మొత్తం మూడు బైక్‌స్టేషన్లు నిర్మించారు. 30 సైకిళ్లను ఈ మూడింటిలోను ఉంచుతారు. వీటిలో ఎక్కడైనా సైకిల్‌ తీసుకోవచ్చు, ఎక్కడైనా అప్పగించవచ్చు. ఉచితంగానే వినియోగించుకోవచ్చు. సైకిల్‌ కావలసినవారు పేరు నమోదు చేసుకుంటే ప్రత్యేకమైన 'యాక్సెస్‌ కార్డు' ఇస్తారు. యాక్సెస్‌ కార్డుని సైకిల్‌కుండే కంప్యూటర్‌కి చూపిస్తే తాళం తెరుచుకుంటుంది. సైకిల్ పార్కింగ్ ప్రదేశంలో ఏసీలు, సోలార్ ప్యానల్, కుర్చీలు ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్థేశం చేశారు. దగ్గర్లో ఉద్యానవనం ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. తన కార్యాలయం వరకూ సీఎం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి సచివాలయ ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపారు.

Link to comment
Share on other sites

తాత్కాలిక హైకోర్టు నిర్మాణానికి ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
31-01-2018 19:40:55

అమరావతి: రూ.108 కోట్ల వ్యయంతో నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు నిర్ణయం చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఆర్డీఏపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జీప్లస్‌-2 పద్ధతిలో నాలుగు ఎకరాల్లో హైకోర్టు భవన నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రధాన న్యాయమూర్తికి 2వేల చదరపు అడుగుల్లో కోర్టు, వెయ్యి చదరపు అడుగుల చొప్పున 18 కోర్టు హాళ్లు నిర్మించాలని సూచించారు. ఈ పనులన్నీ 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

Link to comment
Share on other sites

41 minutes ago, sonykongara said:

తాత్కాలిక హైకోర్టు నిర్మాణానికి ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
31-01-2018 19:40:55

అమరావతి: రూ.108 కోట్ల వ్యయంతో నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు నిర్ణయం చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఆర్డీఏపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జీప్లస్‌-2 పద్ధతిలో నాలుగు ఎకరాల్లో హైకోర్టు భవన నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రధాన న్యాయమూర్తికి 2వేల చదరపు అడుగుల్లో కోర్టు, వెయ్యి చదరపు అడుగుల చొప్పున 18 కోర్టు హాళ్లు నిర్మించాలని సూచించారు. ఈ పనులన్నీ 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

Ussh.. deniki 108 c petti.. Temporary vi kattinchadam.. Center emaina isthada aa funds :kick:

Link to comment
Share on other sites

2 minutes ago, swarnandhra said:

asalu high court division ye anavasram, daaniki malli inko temporary building aa. antha desparate ga division kavalanukunte Mukkodino, pushpalano pay cheyyamanandi. manaki enduku antha durada.

+11111 2019 tharuvatha emaina chesthe best.. 

Link to comment
Share on other sites

జంట ఐటీ టవర్లు 
రాజధానిలో నిర్మాణం 
10 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం 
6 ఎకరాల్లో అమరావతి మెరీనా 
19.5 ఎకరాల్లో గాంధీ స్మృతి చిహ్నం 
నీరుకొండపై 108 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం 
30 ఎకరాల్లో హెల్త్‌ స్ట్రీట్‌ 
భవానీ ద్వీపంలో సంతోష నగరాల సదస్సు 
రాజధాని పనుల పురోగతిపై సీఎం సమీక్ష 
ఈనాడు - అమరావతి 
31ap-main1a.jpg

రాజధాని అమరావతిలో ఐటీ కంపెనీల కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) 10 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతంతో జంట టవర్ల నిర్మాణం చేపట్టనుంది. ఒక టవర్‌లో 6 లక్షల, రెండోదానిలో 4 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది. మార్చి మొదటివారంలో నిర్మాణం ప్రారంభించనున్నారు. రాజధానిలో వివిధ ప్రాజెక్టులు, పనుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. రాజధానిలో ఐటీ టవర్లు, మెరీనా, హెల్త్‌స్ట్రీట్‌, కంటైనర్‌ హోటళ్లు, అమరావతిలో ఏప్రిల్‌లో నిర్వహించనున్న సంతోష నగరాల సదస్సు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియా ప్రతినిధులకు వివరాలు తెలియజేశారు.

ముఖ్యాంశాలివి.. 
* ఐటీ కంపెనీల ఏర్పాటుకి 5లక్షల చ.అడుగుల భవనాలు కావాలని 42 కంపెనీలు కోరాయని, మరో 5లక్షల చ.అడుగుల కార్యాలయ స్థలం (ఆఫీస్‌ స్పేస్‌) కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఐటీ టవర్లలో మొదటి దశ నిర్మాణం 12నెలల్లో, రెండోది 24 నెలల్లో పూర్తిచేస్తామని వివరించారు. సీఆర్‌డీఏ నిర్మిస్తున్న కార్యాలయ స్థలం విక్రయించడం ద్వారా రూ.90.6కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనాగట్టారు. ఐటీ టవర్లను హరిత భవన హితంగా నిర్మించాలని సీఎం సూచించారు.

* పరిపాలన నగరం మధ్యభాగంలో ఏడెకరాల్లో సిటీస్క్వేర్‌కి ఒకపక్క స్టేడియం, మరోపక్క కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మిస్తామని అధికారులు ప్రతిపాదించగా, స్టేడియం అక్కడ వద్దని క్రీడానగరంలోనే ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

* రాజధానిలోని కృష్ణా తీరంలో ఆరెకరాల విస్తీర్ణంలో అమరావతి మెరీనా ఏర్పాటుచేస్తారు. బోటు యార్డు, నీటిశుద్ధి కేంద్రం, సెయిలింగ్‌ శిక్షణ కేంద్రం, పవర్‌ బోటింగ్‌, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్‌ సెంటర్‌ వంటి సదుపాయాలతో మెరీనాకు రూపమిస్తారు. దీన్ని పీపీపీ విధానంలో చేపట్టాలని సీఎం సూచించారు.

* అమరావతిలో నిర్మించే గాంధీ స్మారక ఉద్యానవనం డిజైన్లు దాదాపు ఖరారుచేశారు. శాఖమూరు పార్కులోని 19.5ఎకరాల్ని దీనికి కేటాయిస్తారు. బాపూజీ స్మృతి చిహ్నంగా నిర్మించే ఈ పార్కుకి ‘గాంధీ టు మహాత్మా పార్కు’ అని పేరు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మరో రెండుచోట్ల జగజ్జీవన్‌రామ్‌, జ్యోతీరావుపూలే పేరిట పార్కులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

* అమరావతిలో నీరుకొండ గ్రామంలోని కొండపై 108 అడుగుల ఎత్తున ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. డిజైన్లను మంత్రివర్గ సమావేశంలో ప్రదర్శించాలని, ఆన్‌లైన్‌లో  ప్రజాభిప్రాయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

* అమరావతిలో 30ఎకరాల్లో హెల్త్‌స్ట్రీట్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయం. దీనిలో స్థలాలు అభివృద్ధి చేసి ఆస్పత్రులు, ఇతర ఆరోగ్య సేవాకేంద్రాలకు కేటాయిస్తారు.

* ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు భవానీద్వీపంలో సంతోష నగరాల సదస్సు నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనాల్సిందిగా సంతోష సూచీలో మొదటి 50 స్థానాల్లో ఉన్న నగరాలకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా నగరాల్లోని ఉత్తమ విధానాలు, వినూత్న పద్ధతుల గురించి తెలుసుకోవడానికి సదస్సు దోహదం చేస్తుందన్నారు.

* ‘అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ టు గ్లోబల్‌ లివింగ్‌’ థీమ్‌తో నిర్వహించే ఈ సదస్సుకి 2వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. ప్రజలు కూడా పాల్గొనేలా సదస్సుండాలని ముఖ్యమంత్రి ఆదేశం.

* అతిథులకు విజయవాడ, గుంటూరు నగరాల్లోని హోటళ్లలో వసతి కల్పిస్తారు. అవసరమైతే భవానీ ద్వీపంలో 200 తాత్కాలిక గదుల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశం.

* షిప్పింగ్‌ కంటైనర్లని ఉపయోగించి మూడు నెలల్లోనే ఆధునిక వసతులతో హోటళ్లను ఏర్పాటుచేస్తామని బీటిల్‌ స్మార్ట్‌ హోటల్స్‌ సంస్థ ప్రతిపాదన.. మొదట సంతోష నగరాల సదస్సుకి వచ్చే అతిథుల కోసం 100 కంటైనర్‌ హోటల్‌ గదులు ఏర్పాటుచేయాలన్న ముఖ్యమంత్రి. పేరొందిన హోటళ్ల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటుచేయాల్సిందిగా సూచన.

* సిలికాన్‌ వ్యాలీ తరహాలో మన రాష్ట్రం ఇన్నోవేషన్‌ వ్యాలీగా అవతరించాలని, దాని కోసమే త్వరలో ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌, స్టార్టప్‌లలో మన రాష్ట్రం మిగతా ప్రపంచానికి నమూనాగా నిలవాలని ఆయన స్పష్టీకరణ.

* పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు, నివాస భవనాలను తొలి ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా చేపట్టి, ఏడాదిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించిన అధికారులు.

* సచివాలయం, శాఖాధిపతుల భవనాల నిర్మాణ ప్రణాళికల్ని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ గురువారం పంపిస్తుందని, మార్చిలోగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించిన సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌.

* హైకోర్టు భవనం ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో వస్తాయని, శాసనసభ భవన నిర్మాణ ప్రణాళికలు మరో రెండు వారాల్లో వస్తాయని వెల్లడి.

* శాసనసభ్యులు, అఖిలభారత సర్వీసుల అధికారులు, ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిర్మించే అన్ని నివాస భవనాల్లోను క్లబ్‌హౌస్‌లతో పాటు, స్విమ్మింగ్‌పూల్‌ కచ్చితంగా ఉండాలని సీఎం ఆదేశం.

రోజుల తరబడి చేస్తే ఎలా? 
రాజధానిలో ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన పనులు మందకొడిగా సాగడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్న పనికీ రోజులకొద్దీ సమయం తీసుకుంటే ఎలా? అని  అసంతృప్తి వ్యక్తంచేశారు. రహదారుల నిర్మాణానికి గ్రావెల్‌ కొరత ఎక్కువగా ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అనంతవరం కొండప్రాంతం నుంచి దాన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవానీ ద్వీపంలో మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ వంటి వసతులు నాసిరకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి పర్యాటకశాఖ అధికారులపై మండిపడ్డారు.

సచివాలయంలో సీఎం సైకిల్‌ సవారీ 
స్మార్ట్‌ సైకిల్‌ కేంద్రాన్ని  ప్రారంభించిన చంద్రబాబు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: వెలగపూడి సచివాలయం ఆవరణలో సందర్శకుల కోసం స్మార్ట్‌ సైక్లింగ్‌ వ్యవస్థ ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది.  ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు సైకిల్‌ కేంద్రాల్లో ఒకదానిని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. పార్కింగ్‌ కేంద్రం నుంచి బ్లాక్‌-1లోని తన కార్యాలయం వరకూ సైకిల్‌పై వెళ్లారు. వీటి తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

పాస్‌వర్డ్‌తో పనిచేసే సైకిళ్లు: ఇక్కడ వినియోగించేందుకు జర్మనీ నుంచి 3 గేర్లతో ఉండే 30 సైకిళ్లను తెప్పించారు. వీటిని తీసుకునే వారికి స్వైపింగ్‌ కార్డు, పాస్‌వర్డ్‌ కేటాయిస్తారు. ఈ పాస్‌వర్డతోనే సైకిళ్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తమ పని పూర్తయ్యాక సందర్శకులు సైకిల్‌ను మూడు స్టేషన్లలో ఎక్కడైనా అప్పజెప్పవచ్చు.

Link to comment
Share on other sites

తాత్కాలిక హైకోర్టు 
అక్టోబరు నాటికి రాజధానిలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం
4 ఎకరాల్లో 1.8 లక్షల చ.అడుగులలో నిర్మాణం 
రూ.108 కోట్ల అంచనా వ్యయం 
పరిశీలనకు వస్తామని ప్రభుత్వానికి తెలిపిన హైకోర్టు! 

ఈనాడు అమరావతి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుని రాజధాని అమరావతికి తరలించేందుకు అక్టోబరు నాటికి తాత్కాలిక భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలోని పరిపాలన నగరంలో శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి కొంత సమయం పట్టే అవకాశముండటం, రాజధానిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాలేవీ హైకోర్టు ఏర్పాటుకు తగినట్టుగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 2 నాటికి భవన నిర్మాణం పూర్తిచేసి, హైకోర్టుని రాజధానికి తరలించాలన్నది ఆలోచన. పరిపాలన నగరంలోని శాశ్వత హైకోర్టు కాంప్లెక్స్‌లో ట్రైబ్యునళ్లు, శిక్షణ కేంద్రాల భవనాల నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలోనే తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం చేపడతారు. దీనికి సంబంధించిన ఆకృతులను (డిజైన్లను) ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పరిశీలించారు. డిజైన్లు తుది దశలో ఉన్నాయని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు వాటిని చూపించి వారి అనుమతి తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరులోగానీ, మార్చి మొదటివారంలోగానీ నిర్మాణం మొదలు పెడతామన్నారు. అది శాశ్వత భవనమేనని, భవిష్యత్తులో శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం పూర్తయిన తర్వాత, ఇప్పుడు నిర్మిస్తున్న భవనాన్ని ట్రైబ్యునళ్ల కోసం వినియోగిస్తారని మంత్రి తెలిపారు.
తాత్కాలిక హైకోర్టు భవనంలోని ముఖ్యాంశాలు ఇవీ...! 
విస్తీర్ణం: 4 ఎకరాలు 
నిర్మిత ప్రాంతం: 1.8 లక్షల చ.అడుగులు. 
ఎన్ని అంతస్తులు: జీ+2 (భవిష్యత్తులో జీ+4కి విస్తరించుకునేందుకు వీలుగా డిజైన్లు రూపొందిస్తున్నారు) 
కోర్టు రూంలు: ప్రధాన న్యాయమూర్తి కోర్టు-2 వేల చ.అడుగులు, ఛాంబర్‌-1200 చ.అడుగులు 
మొత్తం 18 కోర్టు హాళ్లు (ఒక్కొక్క కోర్టు హాలు విస్తీర్ణం వెయ్యి చ.అడుగులు) 
న్యాయమూర్తుల ఛాంబర్లు ఒక్కొక్కటి 600 చ.అడుగులు. 
అంచనా వ్యయం- రూ.108 కోట్లు 
నిర్మాణ గడువు: 6-8 నెలలు.
ముఖ్యాంశాలు.. 
* జడ్జిలు, ప్రజలు, న్యాయవాదులు, సిబ్బందికి వేర్వేరు ప్రవేశ ద్వారాలుంటాయి. 
* 200 కార్లు నిలిపేందుకు వీలుగా పార్కింగ్‌ వసతి ఉంటుంది. 
* న్యాయమూర్తులకు అవసరమైన వసతులు, హైకోర్టు అడ్మినిస్ట్రేషన్‌ వసతులు, లైబ్రరీ, బార్‌ అసోసియేషన్‌హాలు వంటి సదుపాయాలన్నీ ఉంటాయి.
భవనాల పరిశీలనకు వస్తాం: లేఖ రాసిన హైకోర్టు 
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖపై హైకోర్టు స్పందిస్తూ.. జనవరి చివరి వారం తర్వాత ఎప్పుడైనా వచ్చి ప్రతిపాదిత భవనాల్ని(నమూనాల్ని) పరిశీలించేందుకు సిద్ధమని సర్కారుకు లేఖ రాసినట్లు తెలిసింది. హైకోర్టు లేఖ నేపథ్యంలో..ఫిబ్రవరి మూడవ తేదీ లేదా ఆ తరువాత ఎప్పుడైనా పరిశీలనకు రావచ్చని ప్రభుత్వం.. హైకోర్టును కోరనున్నట్లు సమాచారం. అమరావతిలో జస్టిస్‌ సిటీ ఒరిజినల్‌ ప్లాన్‌ పరిధిలో ఉన్న కోర్టు కాంప్లెక్స్‌ను అయిదు మాసాల్లో సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ఆ భవనాన్ని కూడా ప్రతిపాదిత భవనాల్లో ఒకటిగా హైకోర్టును నుంచి వచ్చే భవన పరిశీలన కమిటీకి చూపించనున్నారు.

Link to comment
Share on other sites

పరిపాలనా నగరం 
సిద్ధమైన ఆకృతులు 

ఈనాడు-అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో కృష్ణా తీరానికి సమీపాన.. బహుళ ప్రయోజన భవనాలివి. ఇందులో కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు, నివాస భవనాలు, కళల నిలయాలు.. అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇందులో కూచిపూడి టవర్స్‌ ఆకృతులను గతేడాది ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటికి కొన్ని మార్పులు సూచించిన సీఎం మరింత మెరుగ్గా ఆకృతులు రూపొందించాలని సూచించారు. అందుకు అనుగుణంగా పల్లవ నిర్మాణాలను ప్రతిబింబించే విధంగా తయారు చేసి ప్రదర్శించారు.
ప్రత్యేకతలు.. 
* కింది భాగంలో రిటైల్‌ దుకాణాలు, తర్వాత అంతస్తుల్లో కార్యాలయాలు, ఆ పైభాగంలో సర్వీస్‌ అపార్టుమెంట్లు, మధ్యలో హోటళ్లు, ప్రీమియం అపార్ట్‌మెంట్లు, చివరి అంతస్తులో స్కైక్లబ్‌, ప్రతి అంతస్తు పై భాగంలో స్కైలాబీ, పచ్చదనం 
* భవనాల వారీగా లిప్ట్‌లను ఏర్పాటు చేస్తారు. పైభాగానికి చేరేందుకు ఎక్స్‌ప్రెస్‌ లిప్ట్‌లు అమరుస్తారు. 
* టవర్‌ పైభాగంలో హెలికాప్టర్‌ దిగేందుకు ఏర్పాట్లు. 
* సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ఏర్పాట్లు.
 

Link to comment
Share on other sites

రాజధాని సిగలోఆధ్యాత్మిక సుమం! 
బ్రహ్మకుమారి ఈశ్వరీయ సంస్థకు 10 ఎకరాలు 
నేడు విశ్వశాంతి కేంద్రానికి సీఎం శంకుస్థాపన 

ఈనాడు, అమరావతి : నవ్యాంధ్ర రాజధాని కేంద్రం అమరావతిలో మరో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు కానుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ సంస్థ యూనిర్శల్‌ పీస్‌ రిట్రీట్‌ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తోంది. సుమారు 10 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ కేంద్రం రూ.కోట్లలోనే అంచనా వ్యయం ఉంది. అయితే నిర్దిష్టంగా ఖరారు కాలేదు. ఈ కేంద్రానికి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. బ్రహ్మకుమారిల ముఖ్య అధినేత్రి దాదీ జానకి పాల్గొంటున్నారు. మౌంట్‌అబు నుంచి ముఖ్యులు సంతోష్‌దీదీ, మృత్యుంజయలతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడి కేంద్రంలో 1500 మందికి ఆశ్రయం కల్పించే విధంగా పూర్తిగా అధునాత సౌకర్యాలతో ఏర్పాటు చేయనున్నారు. బ్మ్రహకుమారి సంస్థలో సభ్యులుగా ఉన్న వారు ఇక్కడ నిర్మాణం చేసే భవనాల వ్యయాన్ని భరించనున్నారు. మానవాళి సుఖ శాంతులను కోరుతూ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 8,500 కేంద్రాలు ఉన్నాయి. యూనిసెఫ్‌లో కూడా ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనూ కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడును ఆ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేయగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. తుళ్లూరు మండలం నెక్కెల్లు గ్రామంలో ఈ స్థలాన్ని కేటాయించారు. అక్కడే గురువారంనాడు శంకు స్థాపన చేయనున్నారు. దాదాపు 2వేల మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా ఆడిటోరియం, అధునిక వసతులతో సెమినార్‌ హాలు, ఒక మ్యూజియం, లేజర్‌షో, మెడిటేషన్‌ హాలు, నివాస గృహాల సముదాయం నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన ఆకృతులను సమర్పించారు. ఆకర్షణీయంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఈ సంస్థ ద్వారా అన్ని కార్యక్రమాలు ఉచితంగానే నిర్వహించనున్నారు. రాజయోగం, ధ్యానం, యువజనాభివృద్ధి, మహిళా సాధికారిత, ఒత్తిడికి గురైన వారికి ఉపశమనం కల్గించడం, శిశు సంక్షేమం అభివృద్ధి, సానుకూల ధృక్పథం పెంపొందించడం, స్వయం పైపుణ్యాభివృద్ధి పెంపొందించడం, నైతిక విలువలు పెంపొందించడం ఈ కేంద్రం ఉద్దేశం.

Link to comment
Share on other sites

శాసనసభ ఆవరణలో మరో భవనం 
9200 చ.అడుగులలో నిర్మాణం 
సిబ్బంది కార్యాలయాలన్నీ కొత్త భవనంలోకి: కోడెల 

ఈనాడు అమరావతి: వెలగపూడి సచివాలయం ఆవరణలోని శాసనసభ భవనానికి అనుబంధంగా 9,200 చ.అడుగుల విస్తీర్ణంగల ఒక భవనాన్ని నిర్మించనున్నారు. శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌రావు బుధవారం ఈమేరకు తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో ప్రస్తుతం మీడియా పాయింట్‌, సెక్యూరిటీ పోస్ట్‌ ఉన్న ప్రాంతంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. సభాపతి సీఆర్‌డీఏ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులతో కలసి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుత శాసనసభ, శాసనమండలి సమవేశ మందిరాలు చాలా సౌకర్యంగా ఉన్నాయి. కానీ శాసనసభ భవనంలో మిగతా అవసరాలకు సరిపడిన స్థలం లేదు. మంత్రులు, శాసనసభ్యులు, విప్‌లు, కార్యాలయ సిబ్బంది తగినంత స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. విపక్ష సభ్యుల నుంచీ ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో భవనాన్ని నిర్మిస్తున్నాం. శాసనసభ, శాసన మండలి సిబ్బంది కార్యాలయాలన్నీ కొత్త భవనంలోకి మారుస్తాం. శాసనసభ భవనంలో చిన్న చిన్న మార్పులతో మంత్రులు, విప్‌లకు అవసరమైన కార్యాలయాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తాం’’ అని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించే భవనం జీ+1 విధానంలో ఉంటుందన్నారు.
ఉద్యోగుల సంఖ్య పెంచాలి 
ప్రస్తుతం శాసనసభ, శాసనమండలి సెక్రటేరియేట్‌లో సుమారు 100 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని స్పీకర్‌ తెలిపారు. మొత్తం 450-500 మంది సిబ్బంది అవసరమవుతారన్నారు.  సిబ్బంది సంఖ్యను పెంచే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించానన్నారు.
క్యాన్సర్‌పై అవగాహనకు 5కె రన్‌ 
ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినం సందర్భంగా తానా, రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు స్పీకర్‌ తెలిపారు. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడలో వేలాది మందితో 5కె రన్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు.
మార్చి మొదటి వారంలో శాసనసభ సమావేశాలు 
శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతాయని కోడెల తెలిపారు. మార్చి నెలాఖరు వరకు సమావేశాలు జరుగుతాయన్నారు.

Link to comment
Share on other sites

ఏడాదిలో రాజధానికి రూపం!
01-02-2018 03:21:10

అక్టోబరుకు తాత్కాలిక హైకోర్టు.. ప్రభుత్వ గృహ సముదాయమూ రెడీ
సచివాలయం సిద్ధం.. హెచ్‌వోడీ కార్యాలయాలు కూడా
అమరావతిలో ఐటీ కంపెనీల కోసం జంట టవర్ల నిర్మాణం
నీరుకొండపై ఎన్టీఆర్‌ విగ్రహం.. శాఖమూరులో గాంధీ పార్కు
6 ఎకరాల్లో ప్రత్యేక ఆకర్షణలతో అమరావతి మెరీనా
రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
డిజైన్ల దశ దాటి... నిర్మాణ ప్రక్రియ దిశగా ‘అమరావతి’ అడుగులు వేయనుంది. ఈ ఏడాది అక్టోబరు నాటికి తాత్కాలిక హైకోర్టు సిద్ధం కానుంది. ప్రభుత్వ గృహ సముదాయాలూ పూర్తి కానున్నాయి. పరిపాలనా నగరిలో కీలకమైన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు వచ్చే ఏడాదికి పూర్తయ్యేలా కసరత్తు జరుగుతోంది. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన అన్న ఎన్టీఆర్‌ 108 అడుగుల ఎత్తులో రాజధానిలో ఠీవీగా కొలువుదీరనున్నారు. దళితుల ఆత్మగౌరవ ప్రతీక అంబేడ్కర్‌ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. ఇవన్నీ ఏడాదిలో పూర్తికానున్నాయి. అమరావతిపై సీఎం చంద్రబాబు బుధవారం కీలక సమీక్ష నిర్వహించారు. అమరావతిలో మరో బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్‌లో సంతోష నగరాల సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది.
 
అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని పనుల్లో వేగం పెరగనుంది. పరిపాలనా నగరంలో నిర్మించనున్న సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాలు, ప్రభుత్వ హౌసింగ్‌ కాంప్లెక్స్‌ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదికి వినియోగంలోకి తీసుకురానున్నారు. తాత్కాలిక హైకోర్టు భవనాలను ఈ ఏడాది అక్టోబరులోనే అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. రాజధాని నిర్మాణ పనులపై బుధవారం సచివాలయంలో సీఆర్డీయే అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో చేపట్టిన వివిధ రహదారులు, పరిపాలనా నగరంలోని వివిధ భవంతుల నిర్మాణంతోపాటు మెరీనా ప్రాజెక్టు, ఐటీ టవర్లు, కంటైనర్‌ హోటళ్లు తదితర ప్రాజెక్టులపై ఈ సమావేశంలో సవివరమైన చర్చ జరిగింది.
 
మార్చిలోగా సచివాలయానికి టెండర్లు
సచివాలయం, శాఖాధిపతుల భవంతుల నిర్మాణ ప్రణాళికలను బుధవారం రాత్రిలోగా పంపుతున్నట్లు మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ తెలియజేసిందని, వాటిని ఖరారు చేయగానే ఈ ఏడాది మార్చిలోగా టెండర్లు పిలిచి, నిర్మాణం ప్రారంభిస్తామని సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ సీఎంకు తెలిపారు. హైకోర్టు భవంతి అంతర్గత ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలు ఫిబ్రవరి 4 లేదా 5వ తేదీలోగా రానున్నాయన్నారు. శాసనసభ భవంతి అంతర్గత డిజైన్లు కూడా మరో 2 వారాల్లో వస్తాయని చెప్పారు. ఈ ఏడాది అక్టోబరు కల్లా పరిపాలనా నగరంలో నిర్మిస్తున్న ప్రభుత్వ గృహ సముదాయాలన్నీ సిద్ధమవుతాయని, మొత్తం 10 ప్రదేశాల్లో 69 టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోందని తెలిపారు. ఈ గృహ సముదాయాలన్నింట్లో క్లబ్‌ హౌస్‌తోపాటు స్విమ్మింగ్‌పూల్‌ కూడా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.
 
అమరావతిలో ఐటీ ట్విన్‌ టవర్స్‌
రాజధానిలో ఐటీ కంపెనీలకు అవసరమైన ఆఫీస్‌ స్పేస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు 10 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణం కలిగిన జంట టవర్లను నిర్మించనున్నట్లు సీఆర్డీయే అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ పాలసీకి అనుగుణంగా వీటి నిర్మాణం జరుపుతామని, ముందుగా సీఆర్డీయే ఈ ప్రాజెక్టును చేపట్టి, అనంతరం డెవలపర్లకు అప్పగిస్తుందని పేర్కొన్నారు. ఈ టవర్లలో తొలి దశ నిర్మాణాన్ని 12 నెలలు, రెండో దశను 24 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలుపగా, వాటిని గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్ లో నిర్మించాలని సీఎం సూచించారు.
 
ఈ టవర్లలో సీఆర్డీయే నిర్మించే ఆఫీస్‌ స్పేస్‌ను చదరపు అడుగుకు రూ.3వేలు వంతున విక్రయించడం ద్వారా మొత్తం రూ.90.6 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. డెవలపర్లు నిర్మించే ఆఫీస్‌ స్పేస్‌కు అప్పటి మార్కెట్‌ను బట్టి ధరలను నిర్ణయించనున్నారు. పరిపాలనా నగరం మధ్యలో 7 ఎకరాల్లో నిర్మించే సిటీ స్క్వేర్‌కు ఓవైపు స్టేడియం, మరోవైపు కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించే ప్రతిపాదనలను సీఎం ముందుంచగా, స్టేడియాన్ని అక్కడ కాకుండా స్పోర్ట్స్‌ సిటీలోనే నిర్మించాలని సీఎం ఆదేశించారు.
 
108 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం
రాజధాని గ్రామాల్లో ఒకటైన నీరుకొండలో ఉన్న కొండపై 108 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సమావేశంలో చర్చ జరిగింది. అమరావతిలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్నామని, నీరుకొండలోని కొండ ఎత్తు దృష్ట్యా ఎన్టీఆర్‌ విగ్రహం ఎత్తును కొంత తగ్గించవచ్చునని కొందరు సూచించగా, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎం చెప్పారు. శాఖమూరు ఉద్యానవనంలో భాగంగా 19.5 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న గాంధీ స్మారక ఉద్యానవనానికి ‘గాంధీ టు మహాత్మా పార్క్‌’ అని పేరు పెట్టాలని చంద్రబాబు సూచించారు.
 
దీనితోపాటు రాజధానిలోని మరొక 2 ప్రాంతాల్లో బాబూ జగ్జీవన్‌ రాం, జ్యోతిరావు పూలే పేరిట పార్కులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీరుకొండపై ఏర్పాటు చేయదలిచిన ఎన్టీఆర్‌ విగ్రహం డిజైన్లు సిద్ధమైనట్లు మంత్రి నారాయణ సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు. మార్చి నుంచి ఎన్టీఆర్‌ విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. పలు జలక్రీడలు, ఇతర పర్యాటక ఆకర్షణలతో వెంకటపాలెంకు సమీపంలో రూపొందించనున్న అమరావతి మెరీనా ప్రాజెక్ట్‌ను 6 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బోట్లు, సెయిలింగ్‌ శిక్షణ కేంద్రం, పవర్‌ బోటింగ్‌, ఫుడ్‌ కోర్టు, కన్వెన్షన్‌ సెంటర్‌తోపాటు వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఉంటాయి. దీనిని పీపీపీ విధానంలో చేపట్టాలని సీఎం సూచించారు.
 
భవానీద్వీపంలో సంతోష నగరాల సదస్సు
ఈ ఏడాది ఏప్రిల్‌ 10 నుంచి 12వ తేదీ వరకు విజయవాడకు సమీపంలోని భవానీద్వీపంలో భారీ ఎత్తున నిర్వహించనున్న సంతోష నగరాల సదస్సు ద్వారా మరోసారి అమరావతి ప్రాభవాన్ని ప్రపంచానికి చాటే అవకాశం వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఇందులో పాల్గొనాలని కోరుతూ ప్రపంచంలో హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో తొలి 50 స్థానాల్లో ఉన్న నగరాలకు లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. ఆయా దేశాల ప్రభుత్వాల్లోని ముఖ్యులతోపాటు కేంద్ర మంత్రులనూ ఆహ్వానించాలన్నారు. వారి ద్వారా సంతోషం పెంచేందుకు ఆయా నగరాల్లో అమలుపరుస్తున్న ఉత్తమ విధానాలు, వినూత్న పద్ధతుల గురించి మనం తెలుసుకోగలుగుతామన్నారు.
 
‘అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ టు గ్లోబల్‌ లివింగ్‌’ అనే థీమ్‌తో జరగనున్న ఈ సదస్సుకు సుమారు 2వేల మంది అతిథులు వస్తారని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమయాన్ని, స్థలాన్ని, వ్యయాన్ని గణనీయంగా ఆదా చేసే కంటెయినర్‌ హోటళ్ల నిర్మాణంపై సమావేశంలో చర్చ జరిగింది. సముద్రంలో పయనించే నౌకల్లోని కంటెయినర్లను ఉపయోగించి, నిర్మించే ఈ వినూత్న హోటళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయని అధికారులు సీఎంకి వివరించారు. ఈ హోటళ్ల నిర్మాణంలో విశేష అనుభవమున్న అంతర్జాతీయ సంస్థ బీటిల్‌ స్మార్ట్‌ హోటల్స్‌ సమావేశంలో ప్రత్యేక ప్రజెంటేషన్‌ ఇచ్చింది.
 
కేవలం 3 నెలల్లోనే ఈ విధానంలో హోటల్‌ను నిర్మించి, ప్రారంభానికి సిద్ధం చేయవచ్చునని తెలిపింది. ఈ సందర్భంగా అమరావతిలో నెలకొల్పాలనుకుంటున్న 100 కంటెయినర్‌ హోటల్‌ రూములను తొలుత భవానీద్వీపంలో ఏర్పాటు చేయడం ద్వారా వాటిని సంతోష నగరాల సదస్సుకు వచ్చే అతిథుల కోసం వినియోగించవచ్చునని సీఎం సూచించారు. సిలికాన్‌ వ్యాలీ తరహాలో మన రాష్ట్రం ఇన్నొవేషన్‌ వ్యాలీగా అవతరించాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి నగర నిర్మాణం వేగం పుంజుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
 
1.80 లక్షల చ.అ. విస్తీర్ణంతో హైకోర్టు
పరిపాలనా నగరంలో తాత్కాలిక హైకోర్టు భవంతిని 4 ఎకరాల్లో నిర్మించనున్నట్లు పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీయే సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో జి ప్లస్‌ 2 పద్ధతిలో రూ.108 కోట్లతో నిర్మించనున్న ఈ భవంతిని 6 నుంచి 8 మాసాల్లో నిర్మిస్తామని చెప్పారు. ఇందులో ప్రధాన న్యాయమూర్తి కోసం 2వేల చదరపు అడుగుల్లో కోర్టు రూం, 1200 చదరపు అడుగుల చాంబర్‌ నిర్మిస్తామని, ఒక్కొక్కటి 1,000 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియాతో 18 కోర్టు హాళ్లు, 600 చదరపు అడుగుల విస్తీర్ణంతో న్యాయమూర్తుల చాంబర్లు ఉంటాయన్నారు.
 
నిర్మాణ పనులను ఫిబ్రవరి ఆఖరులో కానీ, మార్చి మొదటి వారంలో కానీ ప్రారంభిస్తామని వెల్లడించారు. హైకోర్టు భవనాల డిజైన్లు సిద్ధం కాగానే హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లి పనులు ప్రారంభిస్తామన్నారు. పట్టణాల్లో ఉన్న ప్రతి ఇంటికీ తాగునీటి కనెక్షన్‌ ఇవ్వాలని నిర్ణం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భావిస్తోందని వెల్లడించారు. జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై శుక్రవారం జరిగే కేబినెట్‌ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Link to comment
Share on other sites

అసెంబ్లీ వద్ద మరో భవనం
01-02-2018 03:43:22

త్వరలో ఖాళీల భర్తీ.. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): వెలగపూడి తాత్కాలిక అసెంబ్లీ ఆవరణలో 4600 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండంతస్తులతో మరో భవనం నిర్మించనున్నట్లు శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. బుధవారం ఆయన వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో సీఆర్‌డీఏ అధికారులతో కలిసి భవన నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ, కౌన్సిల్‌ హాళ్ల నిర్మాణం, నిర్వహణ ఇప్పుడు బాగానే ఉందన్నారు.
 
అయితే మంత్రులు, చీఫ్‌విప్‌లు, ప్రతిపక్షనాయకులతోపాటు ఉద్యోగులకు మరింత సౌకర్యవంతమైన వసతి కోసం మరో భవనం అవసరమని చెప్పారు. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులు 450 నుంచి 500 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 100 మంది మాత్రమే ఉన్నారని, వీరిలోనూ 40 శాతం అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అని తెలిపారు. సీఎం అనుమతితో త్వరలోనే అసెంబ్లీలో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నామన్నారు.
 
4న విజయవాడలో 5కే రన్‌
ఫిబ్రవరి 4న ప్రపంచ కేన్సర్‌ దినోత్సవం సందర్భంగా విజయవాడలో.. తానా ఫౌండేషన్‌, రూట్స్‌, బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో 5కే రన్‌ నిర్వహిస్తామని స్పీకర్‌ కోడెల తెలిపారు. ఉదయం 4 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో విద్యార్థులు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...