Jump to content

Amaravati


Recommended Posts

మహానగరం కావాలి
అమరావతికి రూ.1.20 లక్షల కోట్లు అవసరం
మౌలిక వసతులకే రూ.43వేల కోట్లు వెచ్చించాలి
ప్రధానికి సమర్పించబోతున్న వినతిపత్రంలో వివరించనున్న ఏపీ
116 పేజీల పుస్తకం తయారీ
ఈనాడు - దిల్లీ

వ్యవసాయ ఆధారితంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల రాజధానులతో సమానమైన రాజధానిని నిర్మించుకోవాల్సి ఉందని, అందుకోసం అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దడానికి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీకి అందించబోతున్న విజ్ఞాపన పత్రంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివరించబోతోంది. ఈనెల 12వ తేదీన ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి రాష్ట్ర సమస్యలపై 17 పేజీల వినతిపత్రం సమర్పించినప్పుడు ఆయన మరిన్ని వివరణలు కోరారు. ఈ నేపథ్యంలో ప్రతి అంశంలోని లోతుపాతులను, పూర్వాపరాలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 116 పేజీల పుస్తకాన్ని తయారు చేసింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి త్వరలో దీనిని ప్రధానమంత్రి కార్యాలయానికి అందించనున్నారు. ఇందులో అమరావతిని పూర్తి స్థాయి మహానగరంగా తీర్చిదిద్దడానికి వచ్చే రెండు దశాబ్దాల్లో రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అత్యవసర మౌలిక వసతులైన రాజ్‌ భవన్‌, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీతోపాటు ప్రధాన రహదారులు, తదితర నిర్మాణాలకే వచ్చే ఐదేళ్లలో రూ.42,935 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. అమరావతిని కొత్త రాష్ట్ర వృద్ధి కేంద్రంగా     మార్చాలంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రహదారి, రైలు అనుసంధానం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో విజయవాడ, విశాఖపట్నం, అమరావతి నగరాల్లో మెట్రో రైలు మార్గాలు నిర్మించడంతోపాటు, విశాఖపట్నం- చెన్నై నగరాలను హైస్పీడ్‌ రైలుతో అనుసంధానిస్తామని చెప్పినట్లు గుర్తు చేసింది. ఈ ప్రాజెక్టులు మొదలుకావడానికి 2018-19 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం చేయాలని కోరింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొత్త రాజధానిలో రాజ్‌ భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శానస మండలి నిర్మాణంతోపాటు ఇతర అత్యవసర మౌలిక వసతులకు కేంద్రమే సాయం చేస్తుందని చెప్పినందున ఇతోధిక సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మౌలిక వసతుల నిర్మాణానికి రూ.43వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, కానీ కేంద్రం రూ.3,500 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చిందని పేర్కొంది. ఇప్పటివరకూ మూడేళ్లలో ఏటా సగటున రూ.500 కోట్ల చొప్పున రూ.1500 కోట్లతోపాటు, కేంద్ర ఆర్థికశాఖ అదనంగా రాజధాని నిర్మాణం కోసం రూ.1,050 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానికి ఇవ్వనున్న నివేదికలో పేర్కొంది. కానీ నూతన రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.10వేల కోట్లయినా ఇవ్వాలని 2015 జనవరి 6నే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు గుర్తు చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ 2015 మార్చి 31న ప్రత్యేక సాయం కింద విజయవాడ, గుంటూరు మున్సిపాలిటీల్లోని మౌలిక వసతుల కోసం రూ.వెయ్యి కోట్లు ఇచ్చిందని, ఆ మొత్తాన్ని అమరావతి అభివృద్ధి కోసం ఉపయోగించే పరిస్థితి లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం తగిన సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది.

Link to comment
Share on other sites

రాజధానిలో ఉద్యోగులకు 3,840 ఇళ్లు
24-01-2018 07:11:38
 
636523746994921828.jpg
  •  15 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక
  •  ఫైల్‌ ఫౌండేషన్‌ పనులు చివరి దశకు
  •  శరవేగంగా నిర్మాణాలు ఫ పేదలకు ఇంటి కల సాకారానికి కృషి
  •  మంత్రి నారాయణ ఫ నిర్మాణ పనుల పరిశీలన
(తుళ్లూరు, జనవరి 23): రాజధానిలో ఉద్యోగులు కోసం 3,840 ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తామని మంత్రి పి.నారాయణ తెలిపారు. రాయపూడి రెవెన్యూ పరిధిలో ఐదెకరాల్లో జరుగుతున్న ఇళ్ల సముదాయ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంప్లాయిస్‌ ఇళ్ల నిర్మాణాలు 15 నెలలో పూర్తి చేయాలని కంపెనీలను ఆదేశించినుట్ట తెలిపారు. పైల్‌ పౌండేషన్‌ పనులు చివరి దశకు వచ్చాయన్నారు. మార్చి పదో తేదీన గ్రౌండు శ్లాబు, 18న మొదటి శ్లాబు వేస్తున్నట్లు చెప్పారు. మూడు నెలల్లో 12 స్లాబులు పూర్తి చేస్తామన్నారు. 61 టవర్లలో 3,840 ఇళ్లు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 240 ఎమ్మెల్యేల గృహాలు, 144 ఐఏఎస్‌ల ఇళ్ళు, 1968 ఎన్జీవోల ఇళ్లు, 15 క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగస్తుల ఇళ్లు ఉంటాయని తెలిపారు. రాజధానిలో 34 పెద్ద రోడ్లు ఏర్పాటు అవుతున్నట్లు తెలిపారు. ఇందులో 22 రోడ్లకు చెందిన టెండర్లు పూర్తి చేసుకొని నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నట్లు చెప్పారు. రూ.22 వేల కోట్ల మేర టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అసెంబ్లీ , సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవనం, ముఖ్యమంత్రి నివాసం డిజైన్‌ నిర్మాణం ఖారారు అయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు.
 
ఇంటి కల సాకారం..
అనంతరం అనంతవరంలో నిర్మాణంలో ఉన్న పేదల గృహ సముదాయాలను ఆయన పరిశీలించారు. సోషల్‌ ఎకనమిక్‌ సర్వే ప్రకారం రాజధానిలో 7,500 ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారి కోసం ఐదు వేల ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతన్నాయన్నారు. తరువాత మరో 2500 ఇళ్ళ నిర్మాణం చేపడతున్నట్లు చెప్పారు. ఫిబ్రవ రి 24 కల్లా పదిశాతం మేర పేదల ఇళ్ల నిర్మాణం పూర్తి జరిగి అప్పజెపటం జరుగుతుందన్నారు. ఆయన వెంట సీఆర్డీయే అదనపు కమిషనర్‌ షణ్ముఖ, ఏసీడీ, ఇంజనీరింగ్‌ అధికారులు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రాజధాని పేదలకు 7,500 ఇళ్లు
24-01-2018 02:18:49
 
636523571302970387.jpg
  • మార్చి నుంచి దశలవారీగా గృహ ప్రవేశాలు
  • వర్షాలకు ముందే 80 శాతం రాజధాని పనులు పూర్తి
  • 30 రోజుల్లో అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్‌ డిజైన్ల ఖరారు: నారాయణ
అమరావతి, తుళ్లూరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలో చేపట్టిన నిర్మాణాలను అత్యంత నాణ్యతతో.. వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాలను ఏడాదిలోగా, పరిపాలనా భవనాలను 15 నెలల్లోగా నిర్మించి, అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పేదల కోసం నేలపాడు, రాయపూడి, అనంతవరంలలో నిర్మిస్తున్న గృహ సముదాయాల పనులను మంగళవారం మంత్రి పరిశీలించారు. పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన సూచనలు ఇచ్చారు.
 
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అధునాతన షియర్‌వాల్‌ టెక్నాలజీతో రాజధానిలో నిర్మాణాలను పూర్తి చేస్తున్నామన్నారు. పనులను ప్రతివారం క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామన్నారు. రాజధాని గ్రామాల రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల ప్రక్రియ పూర్తయ్యిందని, వాటిల్లో కల్పించాల్సిన ప్రపంచస్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం పిలుస్తున్న టెండర్ల ప్రక్రియ పూర్తి కావొస్తున్నదని తెలిపారు. రాజధాని అమరావతిలో ఇళ్లులేని నిరుపేదల కోసం 7,500 ఇళ్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు.
 
వీటిలో 10 శాతం ఇళ్లు ఫిబ్రవరి 24కి పూర్తవుతాయన్నారు. అప్పటి నుంచి ప్రతి నెలా గృహ ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ తదితర నిర్మాణాల డిజైన్‌ 30 రోజులలో ఖరారవుతుందని చెప్పారు. వర్షాలు ప్రారంభం కాకముందే రాజధాని నిర్మాణ పనులు 80 శాతం పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు తయారు చేసినట్టు చెప్పారు.
Link to comment
Share on other sites

7న ‘అమృత’కు సీఎం శంకుస్థాపన..?
24-01-2018 10:42:17
 
636523873387480958.jpg
అమరావతి: ప్రఖ్యాతి చెందిన అమృత విశ్వవిద్యాలయం అమరావతి ప్రాంగణానికి వచ్చే నెల 7వ తేదీన శంకుస్థాపన జరగనున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి చంద్ర బాబు చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగబోతోందని సమాచారం. రాజధాని గ్రామాలైన నవులూరు- ఎర్రబాలెంల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 200 ఎకరాల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ విశ్వవిద్యాలయం క్యాంపస్‌కు సంబంధించిన ఆకృతులను ఇటీ వల సీఎంకు ‘అమృత’ ప్రతినిధులు చూపారు. ఇటు స్థానిక చరిత్రను చాటే మంగళగిరి గాలి గోపురాన్ని స్ఫురింపజేసే ప్రవేశద్వారంతోపాటు అటు ఆధునికతను కలబోసి తయారుచేసిన ఈ డిజైన్లను చంద్రబాబు ఆమోదించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించి, చురుగ్గా కొనసాగించి, ఈ ఏడాది ఆగస్టులో అమరావతి క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌ కోర్సు తరగతులను ప్రారం భించాలని అమృత విద్యాసంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
 
    దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో 9వదిగా, ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో అగ్ర గామిగా, ఆసియాలోని బెస్ట్‌ యూనివర్సిటీల్లో 168గా గుర్తింపు పొందిన అమృతకు ఇప్పటికే దేశంలోని అమృతపురి, కోయంబత్తూరు, కొచ్చిన్‌, బెంగుళూరు, న్యూఢిల్లీలలో 5 క్యాం పస్‌లున్నాయి. అమ రావతిలో రాబోయేది దాని 6వ ప్రాంగణం. ఈ క్యాంపస్‌కు సంబంధించిన కొన్ని విశేషాలిలా ఉన్నాయి.
 
  • అమృత అమరావతి క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌, మెడికల్‌ వైద్యసంస్థలు (సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో సహా) నెల కొల్పనున్నారు.
  • 5 ఏళ్లలో పూర్తయ్యే తొలి దశను 150 ఎకరాల్లో, 5 నుంచి 7 ఏళ్లల్లో సిద్ధమయ్యే మలి దశను 50 ఎకరాల్లో నిర్మించనున్నారు.
  • మొత్తం 6 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణముండే 7 అంతస్థుల భవన సముదాయాలను ఈ క్యాంపస్‌లో నిర్మిస్తారు.
  • ఈ ప్రాంగణ ప్రవేశద్వారాన్ని చారిత్రాత్మకం, సమున్నతమైన మంగళగిరి గాలి గోపురం ఆకారంలో ఏర్పాటు చేయనున్నారు.
  • పెద్ద సంఖ్యలో వృక్షాలు, ఆకట్టుకునే ల్యాండ్‌స్కేపింగ్‌తో ప్రాంగణం పచ్చదనంతో అలరారేలా చూడనున్నారు. దీంతో క్యాంపస్‌లో ఆక్సిజన్‌ లభ్యత పెరిగి, ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్య నభ్యసించగలుగుతారన్నది యాజమాన్య ఉద్దేశ్యం.
  • ఇంజినీరింగ్‌ విభాగ భవంతి మధ్యభాగాన్ని అబ్బురపరచే సృజనాత్మకతతో, వర్తులాకారంలో తీర్చిదిద్దనున్నారు.
  • విద్యార్థినీ విద్యార్థుల కోసం వేర్వేరుగా వసతిగృహాలను జి ప్లస్‌ 10 ఫ్లోర్లతో నిర్మించనున్నారు.
  • అధ్యాపకులు, ఉద్యోగుల కోసం లక్షకు పైగా చదరపుటడుగుల విస్తీర్ణంలో, 14 అంతస్థుల్లో, 104 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు.
Link to comment
Share on other sites

ఆధ్యాత్మిక కేంద్రానికి త్వరలో భూమిపూజ
25-01-2018 09:30:38
 
  • నెక్కల్లుకు ఈశాన్యంలో స్థలం కేటాయింపు
తుళ్లూరు: రాజధానిలో ఆధ్యాతిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని సీఆర్‌డీఏ భావించి నెక్కల్లు గ్రామానికి ఈశాన్య భాగంలో దాదాపు పదెకరాల భూమి కేటాయించినట్లు తెలిసింది. ఫిబ్రవరి ఒకటో తేదీ ఈ కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమిపూజ చేయనున్నట్లు సమాచారం. విద్యా, ఆధ్యాత్మిక, పలు సేవా కార్యక్రమాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కమ్మ జనసేవా సంఘం ఆధ్వర్యం లో ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పడబోతున్నట్టు సమాచారం. అనంతవరం, నెక్కల్లు రెవెన్యూలోని 2065 ఎకరాల్లో మీడియా సిటీ ఏర్పాటుకు క్యాపిటల్‌ మ్యాప్‌లో సూచించారు. అందులో భాగంగా ఆధ్యాత్మిక, సాస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్థలం కేటాయించినట్టు తెలిసింది. అనంతవరం కొండపైన భూదేవీ, శ్రీదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిసియున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానంవారు దత్తత తీసుకున్న విషయం విదితమే. రాజధాని ప్రకటించిన తరువాత అనంతవరంలో మొదటి ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించింది. అనంతవరం నెక్కల్లు ప్రాంతాన్ని ఆఽధ్యాత్మిక, మీడియా నగరిగా రూపుదిద్దటానికి సీఆర్‌డీఏ ప్రణాళికలు తయారు చేసుకుంది.
Link to comment
Share on other sites

తుళ్లూరులోనూ బసవతారకం ఆస్పత్రి: బాలకృష్ణ

12405926BRK76A.JPG

హైదరాబాద్‌: తెలుగు ప్రజలందరికీ బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి తరపున ఆస్పత్రి ఛైర్మన్, సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ జెండా ముందు ప్రజలంతా సమానమే అని... చిన్నా పెద్దా తేడా లేదన్నారు. ఉన్నది నలుగురికి పంచాలన్న ఉద్దేశంతోనే  క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకి సహాయం చేసేందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి , రీసెర్చ్ సెంటర్‌ని ప్రారంభించామన్నారు. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరు ప్రాంతంలోనూ బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం 15ఎకరాల భూమిని కేటాయించిందన్న ఆయన.... తమకు ఎంతగానో సహకరిస్తున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.

12410426BRK76B.JPG

Link to comment
Share on other sites

జాతీయ హోదాతో మహర్దశ
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ‘డీఎన్‌ఏ’ ప్రయోగశాల
  భవన నిర్మాణానికి రూ.7.30 కోట్ల కేంద్ర నిధులు
  గుంటూరులో ఆరు నెలల్లో పూర్తికానున్న నిర్మాణం
25ap-main14a.jpg

ఈనాడు, అమరావతి: గుంటూరులోని డీఎన్‌ఏ వేలిముద్రలు, జన్యుమార్పిడి పంటల పర్యవేక్షణ ప్రయోగశాలకు కేంద్ర వ్యవసాయశాఖ జాతీయ రెఫెరల్‌ ప్రయోగశాల హోదా కల్పించడంతో మహర్దశ పట్టనుంది. ఇక్కడి ప్రయోగశాల పనితీరును గుర్తించి నవంబరులో జాతీయహోదాను కల్పించింది. దీంతో ఈ కేంద్రం జన్యుమార్పిడి, జీవనక్రమంలో మార్పిడికి గురైన జీవుల ఉనికి, అంతర్థానం గురించి పరిశోధనల బాధ్యతను చేపట్టింది. ఈ ప్రయోగశాలలో విత్తనాలలో జన్యు స్వచ్ఛత, జన్యుమార్పిడి పంటల పరీక్షలు, సంకరజాతి విత్తనాల్లో తయారీదారులు చెప్పిన లక్షణాలు విత్తనాల్లో ఉన్నదీ లేనిదీ నిర్ధారించి నివేదికలు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా విత్తనాల్లో సమస్య వచ్చినప్పుడు ఇక్కడ చేసే పరీక్షలు కీలకం అవుతాయి. ఇప్పటివరకూ ఈ తరహా పరీక్షలు కోసం విదేశాలకు పంపాల్సి వచ్చేది.

జాతీయహోదా ఎలా దక్కిందంటే..
గుంటూరులోని డీఎన్‌ఏ వేలిముద్రలు, జన్యుమార్పిడి విత్తనాల పరిశోధన కేంద్రం దేశవ్యాప్తంగా 108 కేంద్రాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయహోదా దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 2007 నుంచి కొన్ని ప్రాంతాల్లో పత్తిసాగులో కలుపు నివారణ రసాయనం పిచికారీ చేసినా తట్టుకునే పత్తిని సాగుచేస్తున్నారని, రాష్ట్రంలో ప్రకాశం జిల్లా టంగుటూరు, పర్చూరు ప్రాంతాల్లో బీజీ-3 అక్రమంగా సాగుచేసినట్లు కేంద్రానికి ఫిర్యాదులొచ్చాయి. దీంతో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యాన ఒక కమిటీ రాష్ట్రంలోని పత్తి పొలాల్లో పర్యటించి నమూనాలు సేకరించింది. వారికి సహకారంగా ఏపీ డీఎన్‌ఏ ప్రయోగశాల నుంచి వెళ్లిన అధికారులు కూడా నమూనాలు సేకరించి స్థానికంగా ప్రయోగాలు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన కమిటీ పత్తిసాగులో కలుపు జన్యువులున్నట్లు గుర్తించలేకపోయాయి. నమూనాలను విదేశాలకు పంపి పరీక్షించాలని నిర్ణయించింది. అయితే ఏపీ డీఎన్‌ఏ ప్రయోగశాల అధికారులు కలుపు తట్టుకునే జన్యువు ఉన్నట్లు ఆధారాలతో నిర్ధారించి జీఈఏసీకి నివేదిక ఇచ్చారు. దీని తర్వాత పలుమార్లు క్లిష్టతరమైన నమూనాలను ఏపీ ప్రయోగశాలకు పంపి ప్రయోగశాల పనితీరును పరీక్షించారు. ఇక్కడి ప్రయోగశాల విజయవంతం కావడంతో జాతీయహోదా కల్పిస్తూ నవంబరులో ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడి నుంచి 8మందిని స్వీడన్‌కు పంపి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇప్పించారు. అప్పుడే కేంద్రం రూ.85లక్షలు విలువైన పరికరాలను ప్రయోగశాలకు సమకూర్చింది.

రూ.7.30 కోట్లతో అత్యాధునికంగా..: ఏపీ డీఎన్‌ఏ పింగర్‌ ప్రింట్‌ ప్రయోగశాలను రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు తరలించారు. నవ్యాంధ్రలో నూతన ప్రయోగశాల నిర్మాణానికి కేంద్రం రూ.7.30కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఐదెకరాల భూమిని కేటాయించింది. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. జులై నాటికి ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది అందుబాటులోకి వస్తే విత్తనపరంగా దేశవ్యాప్తంగా ఎలాంటి సమస్య వచ్చినా పరిశోధించడానికి సిద్ధంగా ఉంటామని డీఎన్‌ఏ ప్రయోగశాల సహాయ సంచాలకులు పి.జయకృష్ణ తెలిపారు. వారం రోజుల్లో ఫలితాలు తెలియజేసే వెసులుబాటు కలుగుతుందన్నారు.

Link to comment
Share on other sites

సివిల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 4 ఎకరాలు
26-01-2018 02:04:53
 
అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం అమరావతిలో 4 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్రీ హోల్డ్‌ ప్రాతిపదికన ఎకరం రూ.10 లక్షలకు భూమిని ఆ సంస్థకు అందజేయాలని సీఆర్డీయే కమిషనర్‌ను ఆదేశించింది.
Link to comment
Share on other sites

అమరావతిలో స్మార్ట్ బైక్స్.. అప్పుడే వాడేస్తున్నారు.. ఇవీ ప్రత్యేకతలు...

   
smart-bikes-26012018-1.jpg
share.png

అమరావతిలో స్మార్ట్‌ బైకులు పరుగులు తీయనున్నాయి. తొలిసారిగా వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వం వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. ఇక్కడ విజయవంతమైతే సీఆర్‌డీఏ పరిధిలో ట్రాక్‌లు ఏర్పాటుచేసి ప్రజలకు, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్‌ బైక్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే జర్మనీ నుంచి 30 సైకిళ్లు సచివాలయానికి చేరాయి. ఆవరణలోపల ప్రస్తుతం రెండు స్మార్ట్‌ సైకిల్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. సచివాలయం వాహనాల పార్కింగ్‌ వద్ద మరో స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు...

 

smart bikes 26012018 2

ప్రతి స్టేషన్‌లో 10 సైకిళ్లను ఉంచుతారు. అవసరమైన వారు సైకిల్‌ తీసుకుని వెళ్లవచ్చు. సైకిల్‌ కావలసిన వ్యక్తికి స్వైపింగ్‌ కార్డు ఇస్తారు. పాస్‌వర్డ్‌ ఇస్తారు. పాస్‌వర్డ్‌తోనే సైకిల్‌ లాక్‌ తెరుచుకుంటుంది. సచివాలయం లోపల, బయట సందర్శకులు వీటిని ఉపయోగించుకోవచ్చు. పని ముగించుకున్న తర్వాత ఆ సైకిల్‌ను 3 స్టేషన్లలో ఏదో ఒకచోట నిలిపి వెళ్లిపోవచ్చు... ఇవీ ప్రత్యేకతలు.. ఈ స్మార్ట్‌ బైక్స్‌ బాడీ మొత్తం ఎల్లాయిడ్‌, అల్యూమినియంతో తయారు చేయబడింది. వర్షంలో తడిసినా తుప్పు బట్టే అవకాశం లేదు. ఈ బైక్‌కు మూడు గేర్లు ఉన్నాయి...

smart bikes 26012018 3

దీని విలువ రూ.50 వేలపైనే ఉంటుంది. ఈ బైక్‌ కదలాలంటే స్వైపింగ్‌ కార్డు ఉండాలి. ఇందుకు పాస్‌వర్డ్‌ తెలియాలి. దీనికి జీపీఎస్‌ సిస్టం అమర్చబడి ఉంటుంది. ఎవరైనా దొంగిలించినా సైకిల్‌ ఎక్కడ ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. రాత్రి పూట కూడా వినియోగించుకునేందుకు ద్విచక్ర వాహనాలకు వలే ఫ్రంట్‌, బ్యాక్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సైకిల్‌కి అమర్చిన బ్యాటరీ చార్జింగ్‌ చేయకపోయినా ఏడాదిపాటు పని చేస్తుందని అధికారులు తెలిపారు. హ్యాండిల్‌ లాక్‌ కూడా ఆటోమేటిక్‌ సిస్టంలోనే ఉంటుంది.

Link to comment
Share on other sites

సచివాలయంలో.. ‘స్మార్ట్‌’గా సైకిల్‌ సవారీ..!
27ap-state2a.jpg

రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడం సహా రాజధాని అమరావతి పరిధిలో కాలుష్యం నియంత్రణకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) పటిష్ఠ చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా వెలగపూడి సచివాలయంలో ఉద్యోగులు, సందర్శకుల కోసం ఈ స్మార్ట్‌ సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కొక్కటి రూ. లక్ష చొప్పున 30 స్మార్ట్‌ సైకిళ్లను జర్మనీ నుంచి ఇటీవల సీఆర్డీఏ అధికారులు తెప్పించారు. త్వరలో వీటి సేవలను ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం ప్రతిఒక్కరూ వినియోగించుకోవచ్చు. యాప్‌తో పాటు స్మార్ట్‌కార్డు ద్వారా కూడా ఈ అత్యాధునిక సైకిళ్ల సేవలు పొందొచ్చు.

- ఈనాడు, అమరావతి
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...