Jump to content

Amaravati


Recommended Posts

పరిపాలనా నగరానికి రూ.10వేల కోట్లు 
హైకోర్టు, శాసనసభ భవనాలకు రూ.2,229 కోట్లు 
అంచనాలు రూపొందించిన సీఆర్‌డీఏ 
ఇప్పటికే గృహ నిర్మాణ పనులు ప్రారంభం 
మిగతా పనులకు త్వరలో టెండర్లు 

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో 1360 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగరానికి సుమారు రూ.9,991 కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ప్రధాన మౌలిక వసతుల కల్పనతోపాటు, శాసనసభ, హైకోర్టు భవనాలు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు, న్యాయమూర్తులు, మంత్రులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర అధికారులు, ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణం చేపడతారు. వీటిలో నివాస భవనాల నిర్మాణాలు ఇప్పటికే మొదలయ్యాయి. శాసనసభ, హైకోర్టు, సచివాలయ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. పరిపాలనా నగరంలో రూ.1,773 కోట్లతో ప్రధాన మౌలిక వసతుల కల్పన ప్రతిపాదనకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. పరిపాలనా నగరంతో కలిపి మొత్తంగా రాజధానిలో చేపట్టే మౌలిక వసతుల పనులకు రూ.40,788 కోట్లతో అంచనాలు రూపొందించారు. వీటిలో రూ.16,033 కోట్ల విలువైన పనులు మొదలయ్యాయి. మిగతా వాటిలో కొన్నింటికి ఇప్పటికే టెండర్లు పిలవగా మరి కొన్ని పనులకు త్వరలో టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నగర ప్రణాళికకు తుది మెరుగులు.. 
అమరావతిలో పరిపాలనా నగర ప్రణాళిక ఇప్పటికే ఖరారైంది. హైకోర్టు,   శాసనసభ, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతులూ ఖరారయ్యాయి. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ వాటికి తుది మెరుగులు దిద్దుతోంది. ఈ నెలాఖరుకుగానీ, వచ్చే నెలలోగానీ వివరణాత్మక డిజైన్లను అందజేయనుంది. ఆ వెంటనే టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ సిద్ధమవుతోంది.
* శాసనసభ భవన నిర్మిత ప్రాంతం 12 లక్షల చదరపు అడుగులు, హైకోర్టు భవన నిర్మిత ప్రాంతం 18 లక్షల చదరపు అడుగులుంటుంది. ఈ రెండు భవనాల నిర్మాణానికి రూ.2,229 కోట్లు ఖర్చవుతుందని అంచనా..
* సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 5 భారీ టవర్లు నిర్మిస్తారు. ఒక్కో టవరు ఎత్తు 40 అంతస్తుల వరకూ ఉంటుంది. వీటి మొత్తం నిర్మిత ప్రాంతం 50 లక్షల చదరపు అడుగులు. వీటి నిర్మాణానికి రూ.2,713 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
* పరిపాలనా నగరంలో అఖిల భారత సర్వీసుల అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. 12 అంతస్తుల ఎత్తులో 60కిపైగా టవర్లను నిర్మిస్తున్నారు. వీటిలో మొత్తం 3,840 ఫ్లాట్లుంటాయి. వీటి నిర్మాణ పనులు ఇటీవలే మొదలయ్యాయి. వీటి మొత్తం అంచనా వ్యయం రూ.2,762 కోట్లు.
* మంత్రులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసు సీనియర్‌ అధికారుల కోసం 194 బంగ్లాల నిర్మాణం చేపట్టనున్నారు. వీటి అంచనా వ్యయం రూ.514 కోట్లు. వీటి ఆకృతులు ఖరారయ్యాయి.
* రాజధానిలో రహదారులు, కాలువలు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, భూగర్భ విద్యుత్తు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల ఏర్పాటు వంటి ప్రధాన మౌలిక వసతులు, డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు రూ.1,773 కోట్లతో అంచనాలు రూపొందించారు. టెండర్లు పిలవాల్సి ఉంది.
 

Link to comment
Share on other sites

ఇన్నర్‌ రింగురోడ్డు ఫేజ్‌3కి టెండర్ల ఆహ్వానం
07-01-2018 08:27:56

 ఫిబ్రవరి 5 ఆఖరు తేది
గుంటూరు (కార్పొరేషన్‌): గుంటూరు నగరంలోని మహాత్మాగాంధీ ఇన్నర్‌రింగురోడ్డు ఫేజ్‌3కి టెండర్లు ఆహ్వానించారు. రూ.33 కోట్లతో పనులు చేపట్టేందుకు సీఆర్డీయే టెండర్లను ఆహ్వానించింది. దీనిపై దృష్టి సారించిన అధికారులు ఫిబ్రవరి 5లోగా టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రతిపాదించారు. వచ్చే నెలాఖరు లోగా ఫేజ్‌ 3 పనులు ప్రారంభం కానున్నాయి. ఆర్టీవో కార్యాలయం నుంచి పలకలూరు రోడ్డు వరకు ఫేజ్‌ 3 కింద అభివృద్ధి చేయనున్నారు.

Link to comment
Share on other sites

On 1/7/2018 at 11:17 AM, sonykongara said:

పరిపాలనా నగరానికి రూ.10వేల కోట్లు 
హైకోర్టు, శాసనసభ భవనాలకు రూ.2,229 కోట్లు 
అంచనాలు రూపొందించిన సీఆర్‌డీఏ 
ఇప్పటికే గృహ నిర్మాణ పనులు ప్రారంభం 
మిగతా పనులకు త్వరలో టెండర్లు 

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో 1360 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగరానికి సుమారు రూ.9,991 కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ప్రధాన మౌలిక వసతుల కల్పనతోపాటు, శాసనసభ, హైకోర్టు భవనాలు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు, న్యాయమూర్తులు, మంత్రులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర అధికారులు, ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణం చేపడతారు. వీటిలో నివాస భవనాల నిర్మాణాలు ఇప్పటికే మొదలయ్యాయి. శాసనసభ, హైకోర్టు, సచివాలయ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. పరిపాలనా నగరంలో రూ.1,773 కోట్లతో ప్రధాన మౌలిక వసతుల కల్పన ప్రతిపాదనకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. పరిపాలనా నగరంతో కలిపి మొత్తంగా రాజధానిలో చేపట్టే మౌలిక వసతుల పనులకు రూ.40,788 కోట్లతో అంచనాలు రూపొందించారు. వీటిలో రూ.16,033 కోట్ల విలువైన పనులు మొదలయ్యాయి. మిగతా వాటిలో కొన్నింటికి ఇప్పటికే టెండర్లు పిలవగా మరి కొన్ని పనులకు త్వరలో టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నగర ప్రణాళికకు తుది మెరుగులు.. 
అమరావతిలో పరిపాలనా నగర ప్రణాళిక ఇప్పటికే ఖరారైంది. హైకోర్టు,   శాసనసభ, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతులూ ఖరారయ్యాయి. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ వాటికి తుది మెరుగులు దిద్దుతోంది. ఈ నెలాఖరుకుగానీ, వచ్చే నెలలోగానీ వివరణాత్మక డిజైన్లను అందజేయనుంది. ఆ వెంటనే టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ సిద్ధమవుతోంది.
* శాసనసభ భవన నిర్మిత ప్రాంతం 12 లక్షల చదరపు అడుగులు, హైకోర్టు భవన నిర్మిత ప్రాంతం 18 లక్షల చదరపు అడుగులుంటుంది. ఈ రెండు భవనాల నిర్మాణానికి రూ.2,229 కోట్లు ఖర్చవుతుందని అంచనా..
* సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 5 భారీ టవర్లు నిర్మిస్తారు. ఒక్కో టవరు ఎత్తు 40 అంతస్తుల వరకూ ఉంటుంది. వీటి మొత్తం నిర్మిత ప్రాంతం 50 లక్షల చదరపు అడుగులు. వీటి నిర్మాణానికి రూ.2,713 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
* పరిపాలనా నగరంలో అఖిల భారత సర్వీసుల అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. 12 అంతస్తుల ఎత్తులో 60కిపైగా టవర్లను నిర్మిస్తున్నారు. వీటిలో మొత్తం 3,840 ఫ్లాట్లుంటాయి. వీటి నిర్మాణ పనులు ఇటీవలే మొదలయ్యాయి. వీటి మొత్తం అంచనా వ్యయం రూ.2,762 కోట్లు.
* మంత్రులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసు సీనియర్‌ అధికారుల కోసం 194 బంగ్లాల నిర్మాణం చేపట్టనున్నారు. వీటి అంచనా వ్యయం రూ.514 కోట్లు. వీటి ఆకృతులు ఖరారయ్యాయి.
* రాజధానిలో రహదారులు, కాలువలు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, భూగర్భ విద్యుత్తు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల ఏర్పాటు వంటి ప్రధాన మౌలిక వసతులు, డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు రూ.1,773 కోట్లతో అంచనాలు రూపొందించారు. టెండర్లు పిలవాల్సి ఉంది.
 

highcourt and assembly 12+18 = 30 lakh square feet cost 2229 crore  , per square feet cost 7430 rupees

secretariat , hods department 50 lakh square feet cost 2713 crore , per square feet cost  5426 rupees

average person house kattukunte(construction cost) per square feet 1200 rupees padutundi . luxury gaa ante 2000 rupees padutundi. ikkada chaalaa karchu pedutunnaaru . idantaa narayana mahimenaa ?

amaravathi lo already oka assembly kattaaru kadaa adi saripodaa ? malli inkoti kattaaalaa ?

 

Link to comment
Share on other sites

26 minutes ago, ravindras said:

highcourt and assembly 12+18 = 30 lakh square feet cost 2229 crore  , per square feet cost 7430 rupees

secretariat , hods department 50 lakh square feet cost 2713 crore , per square feet cost  5426 rupees

average person house kattukunte(construction cost) per square feet 1200 rupees padutundi . luxury gaa ante 2000 rupees padutundi. ikkada chaalaa karchu pedutunnaaru . idantaa narayana mahimenaa ?

amaravathi lo already oka assembly kattaaru kadaa adi saripodaa ? malli inkoti kattaaalaa ?

 

iconic structures ki per sq feet lekkalu veyyaru. 

eiffel tower lo usable floor space 3000 feet. ala ani 3000x2000 = 60 lac Rs tho construction ayipotunda (alanti danni ippudu Amaravati lo kadithe)?

Edited by swarnandhra
Link to comment
Share on other sites

రాజధానికి రుణం ఇవ్వొద్దు!
09-01-2018 02:49:41
 
636510629826861608.jpg
  • భూసేకరణతో ప్రజలు నష్టపోయారు
  • ప్రపంచ బ్యాంకుకు కెనడా ఎన్జీవో ఫిర్యాదు
  • భూసేకరణే జరగనప్పుడు నష్టం ఎక్కడ
  • మరో సంస్థ నుంచి రుణం తీసుకుంటాం
  • ప్రపంచ బ్యాంకుకు కేంద్రం స్పష్టీకరణ
అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా అమరావతితో ఎలాంటి సంబంధం లేని కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసింది. అమరావతి నిర్మాణం కోసం రూ.3,324 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రపంచబ్యాంకును కోరింది. అప్పట్లో దీనిపై కొందరు సామాజికవేత్తలు ప్రపంచబ్యాంకుకు లేఖ రాశారు. అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించి, సామాజికవేత్తల అభ్యంతరాల్లో వాస్తవం లేదని నిర్ధారణకు వచ్చారు. తాజాగా కెనడాకు చెందిన స్వచ్ఛంద సంస్థ అమరావతిలో భూసేకరణకు వ్యతిరేకంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రపంచబ్యాంకు రుణ మంజూరుపై అభ్యంతరాలు తెలిపింది.
 
కెనడా సంస్థ పిటిషన్‌పై కేంద్రం ప్రపంచబ్యాంకుకు గట్టిగా జవాబిచ్చింది. భూసేకరణే జరగనప్పుడు బాధితులు ఎక్కడ నుంచి వస్తారని ప్రశ్నించింది. అమరావతికి కావాల్సిన భూమిని అక్కడి ప్రజలు ఇష్టపూర్వకంగానే భూసమీకరణకు ఇచ్చారని స్పష్టం చేసింది. ‘మీకు రుణం ఇవ్వడంలో అభ్యంతరాలుంటే మరో సంస్థ నుంచి రుణం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ప్రపంచబ్యాంకుకు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన సమాధానంతో ప్రపంచబ్యాంకు పునరాలోచనలో పడిందని, రుణ మంజూరుకు సానుకూలత వ్యక్తం చేసిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. మరో సంస్థ నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదించినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు.
 
ఫిర్యాదు వెనుక రాజకీయ కోణం?
అమరావతితో ఎలాంటి సంబంధమూ లేని కెనడాకు చెందిన ఎన్జీవో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేయడం వింతగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయడ్డాయి. దీనివెనుక రాజకీయ కోణం ఉందా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ‘అమరావతి నిర్మాణంపై మొదటి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. పర్యావరణం దెబ్బతింటుందంటూ ఎన్‌జీటీలో పిటిషన్లు వేయడం, రుణం ఇస్తే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ప్రపంచబ్యాంకుకు సామాజికవేత్తలు లేఖలు రాయడం.. ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
 
 
రుణంపై వడ్డీ పెంచేశారు!
అమరావతి నిర్మాణానికి ఇచ్చే రుణంపై 9 శాతం వడ్డీని చెల్లించాలని ప్రపంచబ్యాంకు తాజాగా ప్రతిపాదించింది. సాధారణంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వాలు తీసుకునే రుణాలకు 5 శాతానికి మించి వడ్డీరేట్లు ఉండవు. ఈ రేటుతో రుణం తీసుకుంటే పెరిగిన ప్రాజెక్టు ఖర్చును, పన్నురేట్లలో హెచ్చుతగ్గులను రుణం తీసుకున్న రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. ప్రపంచబ్యాంకు వడ్డీ రేటును 9 శాతానికి పెంచిన నేపథ్యంలో.. ప్రాజెక్టు ఖర్చులో పెరుగుదల, పన్ను హెచ్చుతగ్గుల భారాన్ని ప్రపంచబ్యాంకే భరించాలన్న షరతులపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే రుణ మంజూరుకకు ప్రస్తుత స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్లను కాకుండా 2016-17 రేట్లను ప్రపంచబ్యాంకు పరిగణనలోకి తీసుకుందని అధికారులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

Canada NGO ledu vankai ledu jaggadu canadalo evadoo jaffa tho mail pettinchadu

eee 1.5 years lo elagaina capital buildings katta kunda aapi 2019 lo gelisthe former's nunchi land balavathamga grab chesaru ani sollu cheppi capital shift cheyyali ani jaggadi vedava plan 

Link to comment
Share on other sites

Guest Urban Legend
ఇక వేగవంతం.. 
ఒకే దస్తావేజులో జీపీఏ.. సప్లిమెంట్‌ డీడ్‌లు 
సరికొత్త విధానానికి సీఆర్‌డీఏ రూపకల్పన 
ఈనాడు, గుంటూరు 
gnt-top1a.jpg

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తన వాటాగా ఇచ్చే ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయటానికి సీఆర్‌డీఏ, ప్రభుత్వ వర్గాలు సరికొత్త విధానానికి రూపకల్పన చేశాయి. ప్రస్తుతం భూములు ఇచ్చిన రైతులకు రెండు రకాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ నిర్వహణలో చాలా జాప్యం చోటుచేసుకుంటోంది. సీఆర్‌డీఏ పరిధిలో మొత్తం 59,460 ప్లాట్లు     రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉండగా ఇప్పటి దాకా కనీసం పదివేల ప్లాట్లు కూడా జరగలేదు. ఈ సమస్యను అధిగమించటానికి అటు సీఆర్‌డీఏ, ఇటు రిజిస్ట్రేషన్‌శాఖ నడుం బిగించాయి. 
అమలు చేయడమే తరువాయి...: డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జీపీఎ డాక్యుమెంట్‌ (సీఆర్‌డీఏకు భూమి ఇచ్చినట్లుగా), సప్లిమెంట్‌ డీడ్‌ (సీఆర్‌డీఏ అభివృద్ధి చేసి ఇచ్చే లే అవుట్‌ ప్లాట్లు) రెండింటిని కలిపి ఒకే దస్తావేజులో రాసి ఆ మేరకు రిజిస్ట్రేషన్‌ చేసేలా నూతన విధానాన్ని సీఆర్‌డీఏ రూపొందించింది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆపై రిజిస్ట్రేషన్ల నిర్వహణ ప్రక్రియ చాలా సులభవంతమై రోజుకు అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్‌ చేయటానికి ఈ విధానం బాగుంటుందని రిజిస్ట్రేషన్‌ శాఖ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. దీంతో సీఆర్‌డీఏ నూతన డాక్యుమెంట్‌ నమూనాను తయారు చేసిందని, అమలు చేయటమే తరువాయి అని రిజిస్ట్రేషన్‌ వర్గాలు వెల్లడించాయి. 
రైతుల ముంగిటకు..: ఇప్పటి దాకా రాజధానిలోని 29 గ్రామాలకు కలిపి భూమలు ఇచ్చిన రైతులకు రిజిస్ట్రేషన్‌ చేయాలని రిజిస్ష్రేషన్‌శాఖ కొత్తగా నాలుగు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటుకు 2016లోనే జీఓ జారీ చేసింది. తుళ్లూరు, మందడం, అనంతరం, ఉండవల్లి ప్రాంతాలుగా ఈ కార్యాలయాలకు అవసరమైన భవనాలు, సిబ్బందిని సమకూర్చుకున్నారు. అయితే వాటిల్లో రెండు కార్యాలయాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. గతేడాది డిసెంబరు దాకా ఈ కార్యాలయాల పరిధిలో 7వేల ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఇంకా రిజిస్ట్రేషన్‌ జరగాల్సినవి 50 వేలకు పైనే ఉండటంతో తక్షణం ప్రభుత్వం వాటిని చకచకా రిజిస్ట్రేషన్‌ చేయటంపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం రాజధానిలో తుళ్లూరు, రాయపూడి, మందడం, శాఖమూరు, నిడమర్రు, నవులూరు, వెంకటపాలెం ఏడు చోట్ల సీఆర్‌డీఏ కార్యాలయాలు ఉన్నాయి. వీటి వద్దకు సమీప ప్రాంతాల రైతులను పిలిపించటం, ఇక్కడ దాకా రాలేని రైతుల ఇళ్ల వద్దకు అధికారులే వెళ్లి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందింది. ఈ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బంది ఉంటారు. ఆపై సీఆర్‌డీఏ సిబ్బంది ఉంటారు. దీంతో ఏదైనా రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు సమస్య వస్తే వెంటనే ఇరుశాఖల యంత్రాంగం సదరు రైతుకు వివరించి వారిని ఒప్పించి రిజిస్ట్రేషన్‌ చేయటానికి ఈ ప్రక్రియ బాగా దోహదం చేస్తుందని ఇరుశాఖలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. రిజిస్ట్రేషన్‌శాఖ పరిభాషలో ఇలా రిజిస్ట్రేషన్లు నిర్వహించటాన్ని ఐటేనా రేటింగ్‌ సెంటర్స్‌ అంటారు. 2010కు ముందు శాఖలో కొన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోకి వచ్చే గ్రామాలు చాలా దూరంగా ఉండేవి. దీంతో వారు దూరాభారం నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం దాకా వచ్చే పరిస్థితి లేకపోవటంతో రిజిస్ట్రేషన్‌ అధికారులే అడపాదడపా ఆయా గ్రామాలకు వెళ్లి చుట్టుపక్కల వారిని పలాన రోజున తాము ఈ గ్రామంలో అందుబాటులో ఉంటామని, అక్కడకు రిజిస్ట్రేషన్‌ కోసం రావాలని కోరేవారు. ప్రస్తుతం  సీఆర్‌డీఏ పరిధిలో కూడా అలానే చేయబోతున్నారు. ఒక్కో సీఆర్‌డీఏ కార్యాలయానికి దాని సమీపంలో ఉన్న రైతులు మొత్తాన్ని పిలిపించి ఇక్కడ సాధ్యమైనంత త్వరగా రిజిస్ట్రేషన్‌ చేస్తామని అధికారులు వివరించారు.

డిప్యూటేషన్‌పై ఉద్యోగులు.. 
సీఆర్‌డీఏ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఒక ప్రహసనంలా కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని, ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ ఉద్యోగులను సీఆర్‌డీఏకు తీసుకురావాలనే యోచనలో రిజిస్ట్రేషన్‌ శాఖ ఉంది. ఇటీవల వారం కిందట స్టాంపులు-రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ అధికారులు సమావేశమై సిబ్బందిని సమకూర్చుకోవటంపై దృష్టిపెట్టారు. ఏడు కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్‌లు చేయాలంటే కృష్ణా-గుంటూరు జిల్లాల నుంచి సర్దుబాటు చేయటం సాధ్యం కాదని ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి ఉద్యోగులను పిలిపించటానికి రంగం సిద్ధమవుతోంది. ఒక్కో కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయటానికి ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లు, మరో ఇద్దరు అటెండర్లు అవసరమని భావిస్తున్నారు. ఈ మేరకు సిబ్బందిని డిప్యూటేషన్‌పై పంపటానికి రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

త్వరలో ఢిల్లీకి రాజధాని రైతులు?
19-01-2018 11:44:23
 
  • క్యాపిటల్‌ గెయిన్‌ మినహాయింపు కోసం వినతి
  • ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులకు అభ్యర్ధన పత్రాలు
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లను విక్రయిం చుకుంటే లభించే ఆదాయాన్ని క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ నుంచి కాలపరిమితితో సంబంధం లేకుండా మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ప్రతినిధులు ఈ నెలాఖర్లో న్యూఢిల్లీ వెళ్లను న్నట్లు తెలిసింది. ఉప రాష్ట్రపతి ఎం.వెంక య్యనాయుడు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీలను కలిసి, ఈ విషయమై అభ్యర్థన పత్రాలను సమర్పించాలన్నది వారి యోచనగా తెలుస్తోంది. అమరావతి నిర్మాణార్ధం రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు సుమారు 34,000 ఎకరాలను సమీకరణ ప్రాతిపదికన ప్రభుత్వానికి ఇవ్వగా, పూలింగ్‌ ప్యాకేజీని అనుసరించి వారికి నివాస, వాణిజ్య స్థలాలను కేటాయించిన సంగతి విదితమే.
 
ఈ ప్లాట్లను అవసరార్ధం తాము అమ్ముకుంటే గనుక తద్వారా లభించే మొత్తంపై క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను విధించరాదని రాజధాని రైతులు చేసిన వినతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కృషి తోడవడంతో కేంద్రం అందుకు సమ్మతించింది. గతేడాది కేంద్ర బడ్జెట్‌లో ఈమేరకు మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన చేయగా రైతాంగంలో హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. కానీ రిటర్నబుల్‌ ప్లాట్ల రిజిస్ర్టేషన్‌ జరిగిన నాటి నుంచి 2 సంవత్సరాల్లోగా వాటిని రాజధాని రైతులు అమ్ముకుంటేనే ఈ మినహాయింపు లభిస్తుందని జైట్లీ పేర్కొనడంపై మాత్రం వారు అప్పటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
 
పూలింగ్‌ ప్యాకేజీ ప్రకారం ఆ ప్లాట్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరచేందుకు మూడేళ్లు పడుతుందని, అందువల్ల రెండేళ్ల గడువు నిబంధనను రద్దు పరచి, తాము ఎప్పుడు వాటిని విక్రయించుకున్నా సరే క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్నది రాజధాని రైతుల వాదన. ఇదే విషయమై వారు దాదాపు ఏడాదిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకుంటూనే ఉన్నారు. అయితే ఇంతవరకూ ఆశించిన ప్రతిస్పందన లభించలేదు. ఈ నేపథ్యంలో వారి ప్రతినిధులు మరోమారు దేశ రాజధాని పర్యటనకు సంకల్పించారు.
Link to comment
Share on other sites

బిమ్‌’తో బిందాస్‌
18-01-2018 01:43:53
 
636518366341054267.jpg
  • రాజధాని పరిధిలో నిర్మాణాలకు త్రీడీ ప్లాన్‌
  • వాటి ద్వారానే అనుమతులు మంజూరు
  • ప్లాన్‌ ఉల్లంఘిస్తే ఇట్టే తెలిసిపోతుంది
  • ఎప్పటికప్పుడు నిర్మాణంపై పరిశీలన
  • భద్రతా ప్రమాణాలకూ గ్యారెంటీ
  • ప్రభుత్వానికీ, ప్రజలకూ మేలైన టెక్నాలజీ
మంగళగిరి, జనవరి 17: పెద్ద పెద్ద చార్టులు... వాటిపై గీతలు! ఇది హాలు, ఇది బెడ్‌ రూమ్‌, ఇది మరొక బెడ్‌రూమ్‌, ఇది చుట్టూ వదిలిన ఖాళీ స్థలం అంటూ వాటి తాలూకు కొలతలు! భవన నిర్మాణానికి అనుమతులు కావాలంటే ఈ ‘బ్లూ ప్రింట్‌’ సమర్పించాల్సిందే. ఒకప్పుడు చేత్తో గీసేవారు. ఇప్పుడు... ‘ఆటోక్యాడ్‌’లో కంప్యూటర్‌ ద్వారా చేస్తున్నారు. అంతే తేడా! రాజధాని ప్రాంత పరిధి (సీఆర్డీయే)లో ఆ రోజులు పోనున్నాయి. సింపుల్‌గా పెన్‌ డ్రైవ్‌ తీసుకెళ్లవచ్చు. ‘ఇందులో మా బిల్డింగ్‌ ప్లాన్‌ ఉంది. తీసుకోండి’ అని అధికారులకు సమర్పించవచ్చు. ఔను! దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వరంగంలో సీఆర్డీయే పరిధిలో ‘బిల్డింగ్‌ మ్యాప్‌ మోడలింగ్‌’ (బిమ్‌)ను ప్రవేశపెడుతున్నారు. నిర్మాణ అనుమతులన్నీ ఈ విధానంలోనే ఆమోదిస్తారు.
 
రాజధాని అమరావతిలో రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల పంపిణీ జోరందుకున్న నేపథ్యంలో నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతోపాటు ప్రభుత్వ భవన నిర్మాణాలూ ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘బిమ్‌’ విధానంలో ప్లాన్‌లను ఆమోదించాలని సీఆర్డీయే నిర్ణయించింది.
 
 
గీత దాటలేరు
గతంలో చార్టులపై గీసిచ్చే ప్లాన్‌ల లెక్క వేరు. అక్కడ చూపించే కొలతలు ఒకటి... అసలు నిర్మాణం మరొకటి. చిన్నచిన్న ఉల్లంఘనల నుంచి భారీ ఉల్లంఘనల వరకు షరా మామూలే! ‘బిమ్‌’లో ఇదంతా కుదరదు. భవనం బాహ్య ఆకృతితోపాటు... లోపలి గదుల ఆకృతులూ పూర్తిస్థాయిలో త్రీడీలో పొందుపరచాలి. హాలు, బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, బాల్కనీ ఇతరత్రా నిర్మాణాలన్నీ నిర్దిష్టమైన కొలతలతో చూపించాలి. నిబంధనల ప్రకారం భవన నిర్మాణంలో ఏ పనికి ఎలాంటి మెటీరియల్‌ వాడుతున్నామో చెప్పాలి. ఇటుక, సిమెంటు, మార్బుల్‌... ఇలా ప్రతిదీ పొందుపరచాలి. ఎలక్ట్రికల్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌ వివరాలూ ఇందులో ఉంటాయి. బిల్డింగ్‌ ప్లాన్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత... క్షేత్రస్థాయిలో ఇంటి స్థలాన్ని జీపీఎస్ తో అనుసంధానిస్తారు. భవన నిర్మాణంలో ప్రతి దశను పరిశీలించవచ్చు. హద్దుల్లోనే కడుతున్నారా? ఎన్ని పిల్లర్లు వేస్తామన్నారు? ఎన్ని వేశారు? తగిన సైజులోనే వేశారా? శ్లాబ్‌ పరిస్థితి ఏమిటి? ఇలా ప్రతి అంశాన్ని సీఆర్డీయే ఆఫీసులోనే కూర్చుని అధికారులు గమనించవచ్చు.
 
 
బహుళ ప్రయోజనాలు...
భవన నిర్మాణ ప్రణాళికల్లో ‘బిమ్‌’ అత్యాధునికమైనది. దీనినే ‘వర్చువల్‌ డిజైన్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌’ అని కూడా పిలుస్తారు. భవనం ఎలా ఉంటుందో ‘బిమ్‌’లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది కాబట్టి... అసలు నిర్మాణంలో ఎలాంటి తేడా వచ్చినా యజమానికి తెలిసిపోతుంది. వెంటనే తగిన చర్యలు తీసుకోవచ్చు. గేటెడ్‌ కమ్యూనిటీలకూ ‘బిమ్‌’లో ప్రణాళికలు రూపొందించవచ్చు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఎక్కడైనా విద్యుత్తు, మురుగునీటి పారుదలలో ఇబ్బంది వస్తే... నిర్దిష్టంగా ఎక్కడ సమస్య తలెత్తిందో ఇట్టే గుర్తించవచ్చు. 
  • ‘బిమ్‌’ ద్వారా చేపట్టే ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు సంస్థలు మోసం చేయలేవు. అసోంలో వేసే జాతీయ రహదారి పనిని ఢిల్లీలో కూర్చుని పరిశీలించవచ్చు. రోడ్డు నిర్మాణానికి వాడే సామగ్రి నుంచి కొలతల దాకా ఎక్కడ లెక్కతప్పినా తెలిసిపోతుంది. 
  • ఫర్నీచర్‌కు కూడా ‘బిమ్‌’ విధానాన్ని ఉపయోగించవచ్చు. నాణ్యతలో ఏమాత్రం తేడా వచ్చినా తెలుసుకోవచ్చు. 
  • ప్లాన్‌ డిజైనింగ్‌, డిటైల్డ్‌ ఎస్టిమేషన్స్‌ వంటి ప్రక్రియలన్నీ సులువుగా వేగంగా పూర్తవుతాయి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. వందశాతం కచ్చితత్వం ఉంటుంది. ఆక్రమణలు, భూరికార్డుల ట్యాంపరింగ్‌, క్షేత్రస్థాయిలో నిర్మాణ అతిక్రమణలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు.
 
 
మనదేశంలో మొదటిసారిగా..
ప్రపంచవ్యాప్తంగా బిమ్‌ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మనదేశంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వినియోగించడం మాత్రం ఇదే మొదటిసారి. సీఆర్డీయే పరిధిలో బిమ్‌ పద్ధతిలో ప్లాన్‌లు తయారు చేసేందుకు వీలుగా ఇటీవల లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌లకు ఇటీవల విజయవాడలో ఓ వర్కుషాప్‌ నిర్వహించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...