Jump to content

Amaravati


Recommended Posts

భూ సమీకరణే 
వలయ రహదారులకు, అంతర్జాతీయ విమానాశ్రయానికీ అదే విధానం 
ప్రతిపాదనలు సిద్ధం చేయాలనముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం 
ఈనాడు - అమరావతి 

రాజధాని అమరావతి చుట్టూ నిర్మించే బాహ్య, అంతర వలయ రహదారులకూ భూసమీకరణ విధానంలోనే భూమి తీసుకోనున్నారు. ఇందుకోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని పరిధిలో మూడు నాలుగేళ్లలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన భూమి సమీకరణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. బుధవారం సాయంత్రం రాజధాని పనులు, అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ రహదారి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. రాజధాని బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) మార్గంలో రెండు, మూడు పారిశ్రామిక టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. 30 రోజుల్లోగా ప్రతిపాదనలను అందించాలని సూచించారు. అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ రహదారి మార్గంలోనూ పలు జిల్లాల పరిధిలో పారిశ్రామిక టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతోందంటే సంబంధిత భూముల యజమానులు భూసమీకరణలో భూములిచ్చేందుకు ముందుకు వస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రూ.7,624 కోట్లతో అంతర వలయ రహదారి 
* రాజధాని చుట్టూ గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 30 గ్రామాల మీదుగా సాగే అమరావతి అంతర వలయ రహదారి (ఐఆర్‌ఆర్‌)ని మొదట విడతలో 97.5 కి.మీ. మేర నిర్మిస్తారు. 
* నిర్మాణ వ్యయం రూ.7,624 కోట్లుగా అంచనా. 
* ఐఆర్‌ఆర్‌ నిర్మాణానికి భూములిచ్చేందుకు హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, వడ్డమాను, పెదపరిమి, రావెల గ్రామాల రైతుల సంసిద్ధత.
పారిశ్రామిక కారిడార్‌గా ఎక్స్‌ప్రెస్‌ రహదారి 
* అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ రహదారి భూసేకరణకు వచ్చే బడ్జెట్‌ తొలి త్రైమాసికంలోనే రూ.2500 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరిన అధికారులు. 
* 393.6 కి.మీ. పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి రాష్ట్ర అభివృద్ధిలో కీలకమవుతుందన్న ముఖ్యమంత్రి. 
* ప్రపంచశ్రేణి ప్రమాణాలతో నిర్మించే ఈ రహదారి రాష్ట్రంలో ముఖ్యమైన పారిశ్రామిక కారిడార్‌ అవుతుందన్న సీఎం. 
* రహదారి వెడల్పు 200 మీటర్లు ఉండాలని స్పష్టీకరణ. 
* అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పెగ్‌ మార్కింగ్‌, ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ చాలావరకు పూర్తి.
విలక్షణ వారధుల నగరంగా అమరావతి.. 
అమరావతిని నిరుపమాన (ఐకానిక్‌) వారధుల నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కృష్ణా నదిపై నిర్మించే వారధుల కోసం ప్రపంచంలోని అత్యుత్తమ నిర్మాణాలను పరిశీలించాలని సూచించారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు మార్చి నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ,  తదితరులు పాల్గొన్నారు.
8న పోలవరానికి ముఖ్యమంత్రి 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 8న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రతి సోమవారం ‘పోలవారం’ నేపథ్యంలో అదే రోజు ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికపై పూర్తిస్థాయి కసరత్తు జరిగే అవకాశం ఉంది. అదే రోజు పశ్చిమగోదావరి జిల్లాలో జన్మభూమి కార్యక్రమాల్లోనూ సీఎం చంద్రబాబు పాల్గొంటా

Link to comment
Share on other sites

23 hours ago, KaNTRhi said:

Idi kanukuna jarigithe.. TG nunchi AP ki ravalsindi edi raadu.. :blink:

Adey bhayyaa AP Ki raavalsi financial gas loss ayye vaati gurinchi why CBN or level 1 or 2 leaders NOT making any fuss - just except counters to gallee baffa leaders 

Link to comment
Share on other sites

రూ.17,761 కోట్లతో బాహ్యవలయం 
పొడవు 189 కి.మీ.లు 
ప్రాజెక్టుకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం 

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి చుట్టూ నిర్మించే బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) ప్రణాళిక కొలిక్కి వచ్చింది. దీనికి సంబంధించిన తాజా ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు బుధవారం అందజేశారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదం తెలిపిందని వివరించారు. ముఖ్యమంత్రి చేసిన సూచనల్నీ ఎన్‌హెచ్‌ఏఐ పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లాలో 49 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 38 గ్రామాల మీదుగా ఓఆర్‌ఆర్‌ వెళుతుంది.
రోడ్డు స్వరూపం 
* నిర్మాణ వ్యయం: రూ.17,761.49 కోట్లు. 
* మొత్తం పొడవు: 189 కి.మీ. వెడల్పు: 150 మీటర్లు 
* ఎన్ని వరుసలు: 6 
* ఒక్కో వరుస వెడల్పు: 3.75 మీటర్లు 
* సర్వీసు రోడ్లు: 7 మీటర్ల వెడల్పు 
* ఫుట్‌పాత్‌లు: 2.5 మీటర్ల వెడల్పు 
* సైకిల్‌ ట్రాక్‌లు: 2 మీటర్ల వెడల్పు 
* పెద్ద వంతెనలు: 11 
* ఆర్వోబీలు: 7 
* సొరంగాలు: 2 
* అవసరమైన భూమి: 3404 హెక్టార్లు 
* భూసేకరణ వ్యయం: రూ. 4198 కోట్లు. 
* ఎన్ని గ్రామాల మీదుగా వెళ్తుందంటే: 87 
(ప్రభుత్వం భూ సమీకరణ విధానంలో భూములు తీసుకోవాలనుకుంటుంది కనుక ఈ వ్యయం ఉండదు)
అవసరమైన అటవీ భూమి 
* కృష్ణా జిల్లా జి.కొండూరు రిజర్వు ఫారెస్టు పరిధిలోని 89.83 హెక్టార్లు 
* గుంటూరు జిల్లా కొండవీడు రిజర్వు ఫారెస్టు పరిధిలో 34.46 హెక్టార్లు
ప్రాజెక్టు ప్రస్తుత స్థితి 
* భూసేకరణ ప్రణాళికలు సమర్పించారు. 
* కృష్ణా, గుంటూరు జిల్లాలకు భూసేకరణ అధికారుల నియామకం పూర్తయింది 
* ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల ముసాయిదా నివేదికను సమర్పించారు 
* జి.కొండూరులో టన్నల్‌ వచ్చే ప్రాంతంలో మినహా మిగతా అన్ని చోట్ల మట్టి పరీక్షలు పూర్తయ్యాయి.
మూడు భాగాలు..  11 ప్యాకేజీలు
మొదటి భాగం 
* ప్యాకేజీ 8 - ప్యాకేజీ 11 (ఎన్‌హెచ్‌ 65 - ఎన్‌హెచ్‌ 16) 
* కంచికచర్ల-పోతూరు 
* పొడవు: 63 కి.మీ. 
* కృష్ణా నదిపై దిగ్గజ వంతెన పొడవు- 3.1 కి.మీ (కంచికచర్ల- ముత్తాయపాలెం మధ్య ఈ వంతెన వస్తుంది) 
* టన్నెల్‌: 0.4 కి.మీ.    రెండో భాగం 
* ప్యాకేజీ- 5 నుంచి ప్యాకేజీ- 8 (ఎన్‌హెచ్‌ 16 నుంచి ఎన్‌హెచ్‌ 65) 
* పోతూరు-పొట్టిపాడు 
* పొడవు- 53 కి.మీ. 
* కృష్ణా నదిపై దిగ్గజ వంతెన పొడవు: 4.8 కి.మీ. (కంకిపాడు-మున్నంగి మధ్య ఈ వంతెన వస్తుంది)    మూడో భాగం 
* ప్యాకేజీ- 1 నుంచి ప్యాకేజీ- 5 (ఎన్‌హెచ్‌ 65 - ఎన్‌హెచ్‌ 16) 
* పొట్టిపాడు- కంచికచర్ల
* పొడవు: 65 కి.మీ. 
* టన్నెల్‌ పొడవు: 4.4 కి.మీ.

Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణ పనుల గ్రావెల్‌ కోసం 768.53 ఎకరాలు
ఈనాడు అమరావతి: రాజధాని నిర్మాణ పనుల కోసం 768.53 ఎకరాలను సీఆర్‌డీఏకు అప్పగిస్తూ భూగర్భ గనులశాఖ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నిర్మాణపనులకు అవసరమైన గ్రావెల్‌ కోసం సీఆర్‌డీఏ నుంచి విజ్ఞప్తిని అనుసరించి గుంటూరు జిల్లా కర్లపూడి గ్రామంలో 768 ఎకరాలను కేటాయించినట్లు భూగర్భ గనుల శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

రాష్ట్ర హైకోర్టుపై కమిటీ 

ప్రతిపాదిత భవనాలు పరిశీలించాకే తదుపరి కార్యాచరణ 

అమరావతిలో హైకోర్టు ఏర్పాటుపై సమావేశం 

న్యాయమూర్తుల సుదీర్ఘ చర్చ 

కీలకాంశాలపై కమిటీల ఏర్పాటుకు నిర్ణయం 

ఈ బాధ్యతలు ఏసీజేకు అప్పగింత 

ఈనాడు - హైదరాబాద్‌ 

 

అమరావతి పరిధిలో తాత్కాలిక భవనంలో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసిన నేపథ్యంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ఆధ్వర్యంలో న్యాయమూర్తులందరూ బుధవారం సమావేశమయ్యారు. తాత్కాలిక భవనమా, శాశ్వత భవనమా? సౌకర్యాలు? రికార్డుల తరలింపు? ఉద్యోగుల విభజన? సంబంధిత మార్గదర్శకాలు? గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు? న్యాయవాదుల పాత్ర? ఇలా ఒక్కో అంశంపై వివరంగా చర్చించినట్లు సమాచారం. హైకోర్టు విభజనలో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించి తాత్కాలికంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. తొలుత తాత్కాలిక భవనాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ వెళ్లి వచ్చాక మళ్లీ సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిపాదిత భవనాల్ని పరిశీలించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌కు లేఖ రాసిన నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులందరూ (ఫుల్‌కోర్ట్‌) హైకోర్టు పరిపాలనాభవన్‌లో    బుధవారం సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తదుపరి చర్యలన్నింటిపై కావాల్సిన కమిటీలు ఏర్పాటు చేయడానికి ఏసీజే నిర్ణయం తీసుకునేలా న్యాయమూర్తులందరూ సమ్మతి తెలిపారు. భవనాల పరిశీలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఓటింగ్‌ నిర్వహించగా పరిశీలనకే మొగ్గు చూపినట్లు తెలిసింది. భవనాల్ని పరిశీలించేందుకు ఏసీజే.. ఐదుగురు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ అమరావతి వెళ్లి పరిశీలించి వచ్చాక తిరిగి సమావేశం కావాలని నిర్ణయించారు. ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు ఉండాలని, వీటితో సహా వివిధ అంశాలన్నీ కమిటీల ఆధ్వర్యంలోనే జరిగితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమైంది. హైకోర్టు భవనాలతోపాటు నివాస ఏర్పాట్లు, ఉద్యోగుల ఇబ్బందులపైనా సుదీర్ఘంగా చర్చించారు. తాత్కాలిక భవనమైనా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉండాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. శాశ్వత ఏర్పాట్లు జరిగేదాకా హైకోర్టు తరలింపు సాధ్యం కాదని ఇదే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపైనా చర్చ జరిగింది. న్యాయవాదులను భాగస్వాములను చేసే అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. 

ఏసీజేకు వినతి.. ఏపీ హైకోర్టు రాజధానికి తరలించడంపై నిర్ణయం తీసుకునే ముందు న్యాయవాదుల ప్రయోజనాల దృష్ట్యా తమ అభిప్రాయాల్ని తీసుకోవాలని ఏసీజేను కోరుతూ ఏపీ న్యాయవాది సంఘం బుధవారం లేఖను సమర్పించింది. తమ వాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ న్యాయవాదుల సంఘంతో ప్రమేయం లేకుండా సుమారు 300 మంది న్యాయవాదులు సంతకాలు చేసిన వినతిపత్రాన్ని ఏసీజేకి అందజేశారు.

Link to comment
Share on other sites

రాజధానికి 1484 కోట్లు
05-01-2018 04:11:12
రుణం తెచ్చుకోడానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రాజధాని నగరం అమరావతిలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు బాసటగా నిలిచేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. అమరావతిని హరితవనంగా తీర్చిదిద్దేందుకు ‘అమరావతి గ్రీనింగ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు నుంచి రూ.1484 కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఎట్టకేలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కాలపరిమితి మూడేళ్లు. గతంలోనే ఈ ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపినా నీతిఆయోగ్‌ దీన్ని తిరస్కరించింది.

Link to comment
Share on other sites

రాజధానికి మణిహారం 
రెండు దశల్లో అంతర వలయ రహదారి 
మొత్తం 16,556 ఎకరాలు అవసరం 
8 వరుసలుగా నిర్మిస్తే తొలి దశ నిర్మాణ వ్యయం రూ. 7,625 కోట్లు 
ప్రణాళిక ఖరారు 
ఈనాడు - అమరావతి 

రాజధాని అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ నిర్మించే అంతర వలయ రహదారి (ఐఆర్‌ఆర్‌) ప్రణాళిక ఖరారైంది. దీనిని రెండు దశల్లో చేపడతారు. తొలి దశలో చేపట్టే రహదారి నిర్మాణం పొడవు 97.5 కిలోమీటర్లు. రెండో దశలో నిర్మించే రహదారి పొడవు 29 కిలోమీటర్లు. ప్రస్తుతం తొలి దశలో చేపట్టే 97.5 కి.మీ.ల రహదారి నిర్మాణానికే అంచనాలు సిద్ధం చేశారు. దీన్ని 8 వరుసల రహదారిగా నిర్మిస్తే రూ.7,624 కోట్లు, 10 వరుసల రహదారిగా నిర్మిస్తే రూ.8,300 కోట్లు వ్యయమవుతుంది. తొలి దశలో చేపట్టే రహదారిని 34 కి.మీ., 33. కి.మీ.లు, 30 కి.మీ.ల పొడవైన మూడు భాగాలుగా విభజించారు. మొదటి రెండు భాగాలు పూర్తిగా కొత్తగా (గ్రీన్‌ ఫీల్డ్‌) నిర్మించాల్సినవి. మూడో భాగం ఇప్పటికే ఉన్న రహదారిని మెరుగుపరుస్తారు. మొదటి రెండు భాగాల రహదారి గుంటూరు జిల్లాలోని 18 గ్రామాలు, కృష్ణా జిల్లాలోని 12 గ్రామాల మీదుగా వెళుతోంది. ఈ రెండు భాగాల రహదారి నిర్మాణానికి 1428 ఎకరాల భూమి అవసరం. అవసరమైన భూమి, నిర్మాణ వ్యయానికి సంబంధించి 3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం భూమిని భూసేకరణ విధానంలో తీసుకోవడం, మొత్తం భూసమీకరణలో తీసుకోవడం, స్వచ్ఛందంగా  ముందుకు వచ్చిన గ్రామాల వరకు భూసమీకరణలోనూ, మిగతా భూమిని భూసేకరణ విధానంలోనూ తీసుకోవడం అన్న ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం భూసమీకరణ విధానంలో తీసుకునే పక్షంలో... రహదారికి రెండు పక్కలా 500 మీటర్ల వెడల్పున ప్రత్యేక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అప్పుడు మొత్తం 16,556 ఎకరాల భూమి అవసరమవుతుంది.
అంతర వలయ రహదారి సమగ్ర వివరాలు.. 
మొదటి భాగం 
హైదరాబాద్‌ హైవే- చెన్నై హైవే మధ్య పొడవు 34 కి.మీ.
రెండో భాగం 
చెన్నై హైవే- జాతీయ రహదారి బైపాస్‌ మధ్య పొడవు 33.5 కి.మీ.
మూడో భాగం 
* జాతీయ రహదారి బైపాస్‌- హైదరాబాద్‌ హైవే మధ్య పొడవు 30 కి.మీ. 
* రెండో దశలో చేపట్టే 29 కి.మీ. రహదారి ఎన్‌హెచ్‌ బైపాస్‌ నుంచి హైదరాబాద్‌ హైవే మధ్య వస్తుంది. 
* 8 వరుసల ప్రధాన రహదారి (మెయిన్‌ క్యారేజ్‌ వే), 4 వరుసల సర్వీసు రోడ్డు నిర్మిస్తే... మొదటి భాగానికి రూ.4,531 కోట్లు, రెండో భాగానికి రూ.3,093 కోట్లు ఖర్చవుతుంది. 
* 10 వరుసల ప్రధాన రహదారి, 4 వరుసల సర్వీసు రోడ్డు నిర్మిస్తే మొదటి భాగానికి రూ.4,871 కోట్లు, రెండో భాగానికి రూ.3,429 కోట్లు ఖర్చవుతుంది. 
* ఇంటర్‌ఛేంజ్‌లు 10. 
* మూడు చోట్ల ట్రంపెట్లు. 
* గ్రేడ్‌ సెపరేటర్లు 15. 
* రైలు ఓవర్‌ బ్రిడ్జిలు 5. 
* కృష్ణా నదిపై రెండు చోట్ల వారధులు.

మొదటి, రెండు భాగాల రహదారికి రెండు పక్కలా 500 మీటర్ల మేర కారిడార్‌లు అభివృద్ధి చేసేటట్లయితే..! (భూసమీకరణ విధానంలో తీసుకునే పద్ధతిలో) 
* మొత్తం కావాల్సిన భూమి: 16556 ఎకరాలు. 
* ఇందులో రహదారి నిర్మాణానికి: 1428 ఎకరాలు 
* రైతులకు అభివృద్ధి చేసిన స్థలాల రూపంలో ఇవ్వాల్సింది: 4470 ఎకరాలు. 
* మౌలిక వసతులు, రహదారుల నిర్మాణానికి: 5296 ఎకరాలు 
* ప్రభుత్వానికి నికరంగా మిగిలే భూమి: 5363 ఎకరాలు. 
* ఎకరం రూ.5 కోట్లు వేసుకున్నా ఈ భూమిని విక్రయించడం వల్ల ప్రభుత్వానికి వచ్చే డబ్బు రూ.26,815 కోట్లు. 
* ఐఆర్‌ఆర్‌ నిర్మాణ వ్యయం రూ.7,624 కోట్లు. 
* రైతుల స్థలాల్లో మౌలిక వసతులకయ్యే ఖర్చు రూ.21,784 కోట్లు.
 

Link to comment
Share on other sites

జాతీయ సంస్థకు స్థలమేదీ? 

అఖిల భారత ఆయుర్వేద వైద్య సంస్థ ఏర్పాటుకు అవరోధాలు 

కేంద్రం సిద్ధంగా ఉన్నా స్పందించని యంత్రాంగం

ఈనాడు, అమరావతి: ఎయిమ్స్‌ తరహాలో అఖిల భారత ఆయుర్వేద వైద్య సంస్థను ఇక్కడ ఏర్పాటుచేయాలని కేంద్రం తలపోస్తున్నప్పటికీ స్థలం కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. స్థలం కేటాయిస్తే పనులను ప్రారంభిస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లేదని దిల్లీలోని కేంద్ర వర్గాలు తెలిపాయి. జాప్యం కొనసాగితే సంస్థను మరో రాష్ట్రంలో ప్రారంభించేందుకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాయి. కృష్ణా జిల్లా కొండపావులూరులో సెంట్రల్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా అండ్‌ నేచురోపతి, విశాఖ జిల్లా సబ్బవరంలో అఖిలభారత యోగా అండ్‌ నేచురోపతి సంస్థల ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది. స్థలాలు కేటాయించనందున జాప్యం కొనసాగుతోంది. 

అఖిల భారత ఆయుర్వేద వైద్య సంస్థను తొలుత విశాఖలో ఏర్పాటుచేయాలని కేంద్రం భావించింది. అక్కడ స్థలం లేదని, అమరావతి సీఆర్‌డీఏ పరిధిలో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపైనా కేంద్రం సుముఖంగానే ఉన్నప్పటికీ స్థలం సమస్య కొనసాగుతూనే ఉంది. సంస్థ ఏర్పాటుకు కనీసం 30 ఎకరాల నుంచి 50 ఎకరాలను రాష్ట్రం కేంద్రానికి అప్పగించాల్సి ఉంది. ఇక్కడ కేటాయించిన 25 ఎకరాల స్థలంపై పూర్తి సమాచారం కేంద్రానికి వెళ్లలేదు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది ఆమోదం లభించనందున తదుపరి చర్యలు లేవు. మరోవైపు అంత స్థలం ఎందుకంటూ కొన్ని శాఖలు కొర్రీలు వేస్తున్నట్లు సమాచారం.

రూ.వంద కోట్ల సంస్థ: అఖిలభారత ఆయుర్వేద వైద్య సంస్థను దిల్లీలో రూ.157కోట్ల వ్యయంతో ఏర్పాటుచేశారు. అమరావతి ప్రాంతంలో ఇలాంటిదే మరో సంస్థ ఏర్పాటుకు కనీసం రూ.వంద కోట్లు వెచ్చించనున్నారు. సంస్థ ఏర్పాటైతే రాష్ట్రంలో ఆయుర్వేద వైద్య సేవలు మెరుగుపడతాయి. పరిశోధనలు విస్తృతమవుతాయి. వైద్యసీట్లూ పెరుగుతాయి. వ్యాధులకు సంబంధించి సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

విశాఖలో మరో సంస్థ: అఖిలభారత యోగా అండ్‌ నేచురోపతి సంస్థను విశాఖలో ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సంస్థ ఏర్పాటుకు 25 ఎకరాలు అవసరమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సబ్బవరం వద్ద స్థలాన్ని కేటాయించేందుకు అక్కడి యంత్రాంగం సిద్ధమైంది. అధికారిక సమాచారం కేంద్రానికి చేరితే తదుపరి చర్యలు ప్రారంభమవుతాయి.

Link to comment
Share on other sites

ఈ నెలలో మన అమరావతికి విశిష్ట అతిధి వస్తున్నారు... ఆయనే సింగపూర్ ప్రధాని లీ... సింగపూర్ ప్రధాని మన అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు... జనవరి 26న భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గునటానికి అతిధిగా వస్తున్నారు సింగపూర్ ప్రధాని.. ఈ సందర్భంగా అమరావతి పర్యటనకు కూడా రానున్నారు... ఈ మేరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలకి సమాచారం అందించారు... పోయిన సంవత్సరం సింగపూర్ ప్రధాని అమరావతి రావాల్సి ఉండగా, అది వాయిదా పడింది... ఎట్టకేలకు సింగపూర్ ప్రధాని అమరావతి రావటానికి మార్గం సుగుమం అయ్యింది..


 


సింగపూర్ ప్రధాని అమరావతి వస్తారు కాబట్టి, ఆయనతో పాటు మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా రావాల్సి ఉంటుంది... అది ప్రోటోకాల్ ప్రకారం తప్పదు అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి... ఎప్పుడో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ఒక చెంబుడు నీరు, మట్టి తీసుకువచ్చారు... అదే విధంగా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వటంలేదు అనే వార్తలు వస్తున్నాయి... ఎన్నో సందర్భాల్లో రాష్ట్రానికి రావాలని ఆహ్వానించినా ప్రధాని మోడీ తిరస్కరించారు అనే వార్తలు కూడా వచ్చాయి... ఇప్పుడు సింగపూర్ ప్రధానే అమరావతి పర్యటన ఖరారు చెయ్యటంతో, ఆయనతో పాటు మోడీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది... ఆయనకు ఇష్టం లేకపోయినా ఇక రాక తప్పదు...

అయితే, ఇదే సందర్భంలో అమరావతిలో నిర్మించే గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు సింగపూర్ ప్రధానితో పాటు, మన ప్రధాని మోడీ చేత శంకుస్థాపన చేపించే అవకాశం కూడా ఉంది అని సమాచరం... సచివాలయం, హై కోర్ట్ భవనాలకు ఇటీవలే, నార్మన్ ఫాస్టర్ డిజైన్ లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే... ప్రస్తుతం ఇంటర్నల్ గా డిటైల్డ్ డిజైన్ లు తయారు అవుతున్నాయి.. అవి రాగానే టెండర్లు పిలేచేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది... ఈ నేపద్యంలో సింగపూర్ ప్రధాని చేత శంకుస్థాపన చేపిస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ వచ్చి, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అమరావతి గురించి ఫోకస్ వస్తుంది అని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం...

Link to comment
Share on other sites

7 hours ago, sonykongara said:

ఈ నెలలో మన అమరావతికి విశిష్ట అతిధి వస్తున్నారు... ఆయనే సింగపూర్ ప్రధాని లీ... సింగపూర్ ప్రధాని మన అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు... జనవరి 26న భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గునటానికి అతిధిగా వస్తున్నారు సింగపూర్ ప్రధాని.. ఈ సందర్భంగా అమరావతి పర్యటనకు కూడా రానున్నారు... ఈ మేరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలకి సమాచారం అందించారు... పోయిన సంవత్సరం సింగపూర్ ప్రధాని అమరావతి రావాల్సి ఉండగా, అది వాయిదా పడింది... ఎట్టకేలకు సింగపూర్ ప్రధాని అమరావతి రావటానికి మార్గం సుగుమం అయ్యింది..


 


సింగపూర్ ప్రధాని అమరావతి వస్తారు కాబట్టి, ఆయనతో పాటు మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా రావాల్సి ఉంటుంది... అది ప్రోటోకాల్ ప్రకారం తప్పదు అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి... ఎప్పుడో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ఒక చెంబుడు నీరు, మట్టి తీసుకువచ్చారు... అదే విధంగా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వటంలేదు అనే వార్తలు వస్తున్నాయి... ఎన్నో సందర్భాల్లో రాష్ట్రానికి రావాలని ఆహ్వానించినా ప్రధాని మోడీ తిరస్కరించారు అనే వార్తలు కూడా వచ్చాయి... ఇప్పుడు సింగపూర్ ప్రధానే అమరావతి పర్యటన ఖరారు చెయ్యటంతో, ఆయనతో పాటు మోడీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది... ఆయనకు ఇష్టం లేకపోయినా ఇక రాక తప్పదు...

అయితే, ఇదే సందర్భంలో అమరావతిలో నిర్మించే గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు సింగపూర్ ప్రధానితో పాటు, మన ప్రధాని మోడీ చేత శంకుస్థాపన చేపించే అవకాశం కూడా ఉంది అని సమాచరం... సచివాలయం, హై కోర్ట్ భవనాలకు ఇటీవలే, నార్మన్ ఫాస్టర్ డిజైన్ లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే... ప్రస్తుతం ఇంటర్నల్ గా డిటైల్డ్ డిజైన్ లు తయారు అవుతున్నాయి.. అవి రాగానే టెండర్లు పిలేచేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది... ఈ నేపద్యంలో సింగపూర్ ప్రధాని చేత శంకుస్థాపన చేపిస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ వచ్చి, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అమరావతి గురించి ఫోకస్ వస్తుంది అని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం...

Boodi gadni uriki kadu tittedi.....

 

Japan PM Kurnool SOlar project(Son won's this so) ki vastanu ani Japan delegation interesting(Japan team&even minister came to AP and met CBN with the trip planning) ga unte adi lepincharu PM office.....

China Xi gaddu Andhra vachi Silk route lo part vudam anukunnadu.....Boodi gaaru vadni Gujarat pattukelli Gujarat&MH lo Major Industrial hub pettandi ani MOU cheinchadu....China vadiki AP side interest as we face them on EAST.....

CBN Lee KUan chanipoyinappudu bayaludreite velloddu ani aparu PM office...CBN ki Lee Kuan was major inspiration....CBN always believed like Lee he can turn the state fortunes economically...

By the way Singapore PM wihout frmalities last trip lone vastanu annadu....Delhi vallu aparu....

 

inko major issue kooda nadischindi e gujju gang tho...Amaravati tho patu Vizag&AP complete  coast till Krishnapatnam ki sambandinchana dani meeda inko edupu okati nadustundi center lo....Singapore(migata vallau tho patu) is looking to partner with AP exclusively in that major plan....Babu garu rendu adugulu mundu(asalu ala alochana kooda rala evadiki) chupu tho vesina step west batch ki sahinchatla....

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

‘జోన్‌-12లో’ రూ.1573 కోట్లతో మౌలిక వసతులు
ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని 12వ జోన్‌లో రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ శుక్రవారం టెండరు ప్రకటన జారీచేసింది. హైబ్రిడ్‌ యాన్యుటి (హ్యామ్‌) విధానంలో ఈ పనులు చేపట్టనుంది. అంచనా వ్యయం రూ.1573.92 కోట్లుగా పేర్కొంది. జోన్‌-12లోకి కురగల్లు, నవులూరు, నిడమర్రు గ్రామాల్లోని కొంత భాగానికి సంబంధించిన ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లు వస్తాయి. బిడ్‌లు దాఖలుకు వచ్చే నెల 2వ తేదీ వరకు సీఆర్‌డీఏ గడువు ఇచ్చింది.

Link to comment
Share on other sites

‘ నవలూరు’ భూసేకరణలో మా ఉత్తర్వులను అనుసరించండి 
సీఆర్‌డీఏ అధికారులకు హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మంగళగిరి గ్రామీణ మండలం కురగల్లు గ్రామ పరిధి భూసేకరణ ప్రక్రియకు తాము జారీచేసిన ఉత్తర్వులనే నవలూరు గ్రామ పరిధిలోని భూసేకరణ విషయంలోనూ అమలు చేయాలని సీఆర్‌డీఏ, భూసేకరణ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ.రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా పరిహార చెల్లింపుపై విచారణకు హాజరు కావాలంటూ అధికారులిచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నవలూరు గ్రామ రైతులు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 
సుమారు 400 మంది పిటిషనర్లకు చెందిన పరిహార ఉత్తర్వుల ప్రకటనను విడుదల చేయవద్దని ఆదేశిస్తూనే.. భూసేకరణకు సంబంధించిన ఇతర ప్రక్రియను కొనసాగించుకోవచ్చని స్పష్టంచేశారు.

Link to comment
Share on other sites

అమరావతి మారథాన్‌

అమరావతి: విజయవాడలో ఆదివారం ఉదయం నిర్వహించిన అమరావతి మారథాన్‌లో వేలాది మంది ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,  కలెక్టర్ లక్ష్మీకాంతం, నగర మున్సిపల్ కమిషనర్, పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ ఈ పరుగును ప్రారంభించారు. హాఫ్ మారథాన్, 5కే రన్, 10కే రన్ విభాగాల్లో పరుగు నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఉండవల్లిలోని మంతెన ఆశ్రమం వరకు పరుగు సాగింది. నగరవాసుల్లో ఆనందం, ఆరోగ్యం పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉమా తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని కలెక్టర్, కమిషనర్ తెలిపారు. అమరావతి మారథాన్‌లో సినీ తారలు గౌరి ముంజల్, శాన్వి శ్రీవాస్తవ పాల్గొని సందడి చేశారు. ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు.

Link to comment
Share on other sites

Uఅమరావతి మారథాన్‌

అమరావతి: విజయవాడలో ఆదివారం ఉదయం నిర్వహించిన అమరావతి మారథాన్‌లో వేలాది మంది ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,  కలెక్టర్ లక్ష్మీకాంతం, నగర మున్సిపల్ కమిషనర్, పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ ఈ పరుగును ప్రారంభించారు. హాఫ్ మారథాన్, 5కే రన్, 10కే రన్ విభాగాల్లో పరుగు నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఉండవల్లిలోని మంతెన ఆశ్రమం వరకు పరుగు సాగింది. నగరవాసుల్లో ఆనందం, ఆరోగ్యం పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉమా తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని కలెక్టర్, కమిషనర్ తెలిపారు. అమరావతి మారథాన్‌లో సినీ తారలు గౌరి ముంజల్, శాన్వి శ్రీవాస్తవ పాల్గొని సందడి చేశారు. ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...