Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో స్టార్‌ హోటళ్లు!
 
636124368418654673.jpg
  •  ఏర్పాటుపై ప్రముఖ గ్రూపుల ఆసక్తి 
  •  300 కోట్లతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకి సుభాష్‌ గులాటీ సిద్ధం 
  •  ఫోర్‌స్టార్‌, 100 గదుల హోటళ్లకు ఐటీసీ, నోవాటెల్‌ రెడీ 
  •  200 గదుల హోటళ్లకు మాలక్ష్మీ-హిల్టన్, ఫార్చ్యూన్ మురళీ పార్క్‌ల ప్రతిపాదన 
  •  3 నుంచి 5.5 ఎకరాల స్థలం కేటాయిస్తామన్న సీఆర్డీఏ 
  •  ఏక గవాక్ష విధానంలో అనుమతులు 
  • జూ సీఆర్డీఏ వర్క్‌షాప్‌నకు మంచి స్పందన 
అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాజధానిలో ఆతిథ్య రంగం అదిరిపోనుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన పలు హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల యాజమాన్యాలు అమరావతిలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. కొన్ని సంస్థలు ఫైవ్‌స్టార్‌, ఫోర్‌స్టార్‌ హోటళ్లను సైతం నెలకొల్పేందుకు ఆసక్తి చూపాయి. దీంతో తమ ప్రయత్నం ఫలించిందని సీఆర్‌డీఏ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. అమరావతిలో ఆతిథ్య రంగాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు సీఆర్‌డీఏ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఆతిథ్య రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్ల యాజమాన్యాలతో మంగళవారం విజయవాడలో సీఆర్‌డీఏ అధికారులు వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 31 గ్రూపుల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశ అనంతరం ఈవోఐ(ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు)లను 2 వారాల్లో విడుదల చేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించడంతోపాటు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో, సత్వరం అందజేస్తామని హామీ ఇచ్చారు.
 
ప్రతినిధుల సానుకూల స్పందన
ప్రముఖ హోట ల్‌ గ్రూపుల నుంచి హాజరైన ప్రతినిధులు సీఆర్డీఏ ప్రతిపాదనలపై సానుకూలత వ్యక్తం చేశారు.

 
గ్రీన్ ఫీల్డ్‌ నగరమైన అమరావతిలో ఓపెన్ ఏరియాలకు ఎక్కువ స్థలం ఉండాల్సిన దృష్ట్యా భూవిస్తీర్ణాన్ని పెంచాలని కొందరు, లీజు విధానంలో కాకుండా ఫ్రీహోల్డ్‌ ల్యాండ్‌ విధానంలో భూమిని ఇవ్వాలని మరికొందరు కోరారు.
 
 బర్మింగ్‌హాంలోని రమద హోటల్‌తోపాటు బ్రిటనలో 2 హోటళ్లను కలిగి ఉన్న సుభాష్‌ గులాటీ గ్రూపు ప్రతినిధులు దేశంలో తమ తొలి హోటల్‌ను అమరావతిలో నెలకొల్పేందుకు ఆసక్తితో ఉన్నామన్నారు. రూ.300 కోట్లకు పైగా పెట్టుబడితో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, షాపింగ్‌ మాల్‌, ఆఫీస్‌ స్పేస్‌ నిర్మించేందుకు సిద్ధమని ప్రకటించారు.
 
.ఐటీసీ హోటళ్ల ప్రతినిధులు తొలిదశల్లో ఫోర్‌స్టార్‌ హోటళ్లను నెలకొల్పుతామంటూ ఆయా రకాల హోటళ్లకు సీఆర్డీఏ కేటాయిస్తామన్న భూముల విస్తీర్ణంపై సంతృప్తి ప్రకటించారు.
 
 నోవోటెల్‌ గ్రూపు సైతం తొలి దశలో 100 గదులుండే బడ్జెట్‌ హోటళ్లను నిర్మిస్తామని, ఆ తర్వాత మధ్య, విలాసవంతమైన హోటళ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
 
 అమరావతిలో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, కన్వెన్షన సెంటర్‌ నిర్మాణానికి హిల్టన హోటల్స్‌తో అవగాహనపత్రం కుదుర్చుకున్నామన్న మాలక్ష్మీ ప్రాపర్టీ వెంచర్స్‌ తమకు 10 ఎకరాలను దీర్ఘకాలిక లీజు విధానంలో కేటాయిస్తే అందులో 200 రూముల హోటల్‌ నిర్మిస్తామంది.
 
 ఫ్రీహోల్డ్‌ ల్యాండ్‌ మోడల్‌లో తమకు ప్రతిపాదించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో భూమిని ఇస్తే అందులో పచ్చదనం మధ్య 200 రూముల హోటల్‌ను నిర్మిస్తామని ఫార్చ్యూన మురళీ పార్క్‌ పేర్కొంది. అన్ని క్యాటగిరీల హోటళ్లకూ కేటాయించే భూముల విస్తీర్ణాన్ని కూడా పెంచాలని సూచించింది.


3 స్టార్‌ నుంచి 5 స్టార్‌ హోటళ్లకు పుష్కల అవకాశాలు
ఈ వర్క్‌షాపునకు అధ్యక్షత వహించిన సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్‌ శ్రీధర్‌ తొలుత మాట్లాడుతూ.. అమరావతిలో ఆతిథ్య రంగాభివృద్ధికి గల అవకాశాలను వివరించారు. వచ్చే మూడేళ్లలోపే అమరావతిలో 4 లక్షలమందికి పైగా నివసించబోతున్నారని, భారీ సంఖ్యలో పర్యాటకులు, వివిధ పనులపై వచ్చి వెళ్లేవారు రాకపోకలు సాగిస్తారని చెప్పారు. ఫలితంగా రాజధానిలో ఆతిథ్య రంగానికి బ్రహ్మాండమైన డిమాండ్‌ ఉండబోతోందని వివరించారు. హోటళ్లు, కన్వెన్షన సెంటర్ల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులనూ ఏక గవాక్ష విధానంలో జాప్యం లేకుండా మంజూరు చేస్తామన్నారు. 3 స్టార్‌ హోటల్‌కైతే 3 ఎకరాలు, 4 స్టార్‌కైతే 4 ఎకరాలు, 5 నక్షత్రాలకైతే 4.5 నుంచి 5.5 ఎకరాలను కేటాయిస్తామన్నారు. ఈ భూములను ఫ్రీహోల్డ్‌ ల్యాండ్‌, లాంగ్‌ టర్మ్‌ లీజ్‌, రెవెన్యూ షేరింగ్‌ అనే విధానాల్లో ఇచ్చే ప్రతిపాదనలున్నాయన్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Saw ISM movie andulo laga water+roads concept very good koncham alanti architecture vesthe super untundi

 

l_tp-7502.jpg

I mean in this background

 

 

same tough brother movie chusetappudu

and appudu amaravti designs kuda alage vunnai ga

Link to comment
Share on other sites

పచ్చని చెట్లతో అలరారుతున్న అమరావతి
 
636127152932290662.jpg
మిలమిల గ్రీన్ ప్రాజెక్టులో సచివాలయం... వివిధ రకాల మొక్కలతో ఆహ్లాదకరం మెరిసే భవనాలు.. పచ్చదనం శోకులతో.. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఆహ్లాదకరంగా మారుతోంది. ప్రభుత్వం పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఎటు చూసినా పచ్చని మొక్కలతో నిండి ఉండాలని సచివాలయాన్ని గ్రీన్ ప్రాజెక్టుగా చేపట్టింది. సుమారు రూ.4.5 కోట్లతో సచివాలయ ప్రాంగణంతో పాటు దారుల్లో పచ్చదనాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు.అమరావతి: పచ్చని మొక్కలతో నవ్య రాజధాని అమరావతి తాత్కాలిక సచివాలయం అదిరిపోతోంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పచ్చదనానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గ్రీన్ ప్రాజెక్టుగా తీసుకుని దాదాపు రూ.4.5 కోట్లతో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. భవనాల ముందు పచ్చని పరుపులు కన్పిస్తున్నాయి. భవనాల లోపల కూడా ఇంటీరియల్‌ డెకరేషనగా వివిధ రకాల క్రోటన్సు ను ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కడియం నుంచి తెప్పించిన రకరకాల మొక్కలతో పాటు రాజధాని ప్రాంతంలోని నర్సరీల్లో పెంచిన మొక్కలను కూడా సచివాలయం ప్రాంగణంలో నాటుతున్నారు. అందులో ప్రధానంగా ఫైకాస్‌ఫాం, మినీ ఇజ్జోర, కార్పోలాన, ఫైకస్‌మల్లీబాల్‌, టెంపుల్‌ ట్రీ, మహాగని, మొర య్యడ్వాల్స్‌ తదితర మొక్కలున్నాయి. సచివాలయ ఉద్యోగుల కు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే ఉద్ధేశంతో ప్రాంగణమం తా పచ్చదనంతో నింపేందుకు గ్రీనక్రాస్‌ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. రోడ్ల మధ్య డివైడర్లపై ఆకట్టుకునే రకరకాల మొక్కలను నాటారు. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి ట్రీ గార్డ్‌లను ఏర్పాటు చేశారు. సచివాలయ మార్గాలన్నీ పచ్చని చెట్లతో కన్పించాలని సీఎం చంద్రబాబు అధికా రులను ఆదేశించడంతో విజయవాడ, గుంటూరు, మంగ ళగిరి పరిసర గ్రామాల్లోనూ రోడ్ల పక్కన మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు.
Link to comment
Share on other sites

అత్యద్భుత నగరంగా అమరావతి
 
636127142310058807.jpg
గుంటూరు : రాష్ట్ర విభజనతో అనివార్యమైన నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి ఏడాది అవుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంతమైన ఉద్దండ్రాయునిపాలెం వద్ద సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణానికి గత ఏడాది అక్టోబరు 22న దేశ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యద్భుతంగా నిర్మించతలపెట్టిన రాజధాని నగరానికి అమరావతిగా ప్రభుత్వం నామకరణం చేసింది. నవ్యనగరి అమరావతి నిర్మాణానికి తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29గ్రామాల్లో భూ సమీకరణ పథకం ద్వారా 22,189మంది రైతుల నుంచి 34,470ఎకరాల భూమిని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సమీకరించింది. నూతన రాజధాని నిర్మాణమంటే బృహత్తర కార్యం.. అలాంటి మహోన్నత కార్యానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములిచ్చారు. ముఖ్యమంత్రి సంకల్పానికి రైతులు దన్నుగా నిలిచారు. రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు పిలుపు మేరకు వేలాది మంది ఇటుకలను విరాళంగా అందజేశారు. శంకుస్థాపన స్థలంలో ప్రపంచంలోని 80 పవిత్ర స్థలాలు, 171 పుణ్యక్షేత్రాలు, 13వేల పంచాయతీలు, మూడు వేల వార్డులు, స్వాతంత్య్ర సమరయోధుల జన్మస్థలాల నుంచి మట్టిని, 35 పవిత్ర నదుల నుంచి నీరు తెచ్చి నిక్షిప్తం చేశారు. రాజధానిలో జరుగుతున్న పనులు రైతులను సంతోషానికి గురి చేస్తున్నాయి. వారికి వార్షిక సంవత్సరం ప్రారంభంలోనే కౌలు చెల్లింపులను సీఆర్‌డీఏ విడుదల చేస్తోంది. అచ్చొచ్చిన నేలపాడు నుంచే ఏ కార్యక్రమానికైనా శ్రీకారం చుడుతోంది. రాజధాని భూసమీకరణ సమయంలో జాయింట్‌ కలెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ని సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన కొనసాగించేందుకు చర్యల తీసుకొంది.
 
వాకింగ్‌ ట్రాక్‌లు, ఉద్యానవనాలు
రాజధాని నిర్మాణంతో ప్రధానంగా తుళ్లూరుకు కొత్త కళ వచ్చింది. గతంలో చెరువులు పశువులకు ఆవాసంగా ఉండేవి. అలాంటి నేడు చెరువు చుట్టూత వాకింగ్‌ ట్రాక్‌, ఉద్యానవనంతో పట్టణీకరణ సంతరించుకొంటోన్నది. నిత్యం వందల సంఖ్యలో రాజధాని గ్రామాల ప్రజలు వాకింగ్‌కు చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. గతంలో రచ్చబండలకు పరిమితమైన చర్చలు ఇప్పుడు వాకింగ్‌ ట్రాక్‌లు ఎక్కాయి. రాజధాని గ్రామాలన్నింటికి ప్రభుత్వం ఎల్‌ఈడీ సౌకర్యంతో వీధి దీపాలను అమర్చింది. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఆర్‌వో ప్లాంట్లను నిర్మించింది.
 
కలగా ఉందంటున్న రాజధాని వాసులు
తమ గ్రామంలో ఇంత పెద్ద భవన సముదాయాల నిర్మాణం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని వెలగపూడి, మండదం గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణం పూర్తి కావడంతో కచ్ఛితంగా సీడ్‌ కేపిటల్‌ నిర్మాణం పూర్తి అవుతుందన్న భరోసా రైతుల్లో కలిగింది. భూముల ధరలు కూడా క్రమేపి పెరుగుతుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కౌలు చెల్లింపులు, ప్లాట్ల పంపిణీలో తాము ఎంతో సంతృప్తిగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది తాము అసంతృప్తితో ఉన్నామని చేస్తున్న దుష్ప్రచారాన్ని వారు ఖండిస్తున్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు, గ్రీన ట్రిబ్యునల్‌లో దాఖలైన కేసులపై ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.
Link to comment
Share on other sites

అప్రతిహతంగా అమరావతి
 
636127143801112198.jpg
  • రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి ఏడాది
  • ముఖ్యమంత్రి సంకల్పానికి రైతులు వెన్నుదన్ను 
  • ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి 
  • స్ఫూర్తి నింపిన తాత్కాలిక సచివాలయ నిర్మాణం
ఆంధ్రజ్యోతి, తాడికొండ/ గుంటూరు : అమరావతి రాజధాని నగరానికి శంకుస్థాపన జరిగి నేటితో సంవత్సరం పూర్తి అవుతోంది. గత ఏడాది ఇదే రోజున చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా కన్నుల పండువగా శంకుస్థాపన జరిగింది. సంవత్సరం గిర్రున తిరిగి రాగా రాజధాని నగర అభివృద్ధి కూడా అంతే వేగంగా ముందుకు సాగుతోంది. ఎవరూ ఊహించని రీతిలో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని ఎనిమిది నెలల రికార్డు సమయంలో సీఎం చంద్రబాబు పూర్తి చేయించి రాజధాని ప్రజలు తన మీద పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకొన్నారు. దీంతో 2019లోపే అమరావతి సీడ్‌ కేపిటల్‌ నిర్మాణం కూడా ముఖ్యమంత్రి పూర్తి చేస్తారని రాజధాని రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం నుంచి రాష్ట్ర పరిపాలన ప్రారంభం కావడంతో తమ త్యాగాలు ఊరికే పోవన్న భావనను రైతులు వ్యక్తపరుస్తున్నారు.
రైతులకు ప్లాట్ల పంపిణీ..
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీఆర్‌డీఏ రిటర్నబుల్‌ ప్లాట్ల పంపిణీ ప్రక్రియనే ఈనెలలో చేపట్టారు. ఇప్పటికే 10 గ్రామాల రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు జరిగింది. మిగిలిన గ్రామాలకు నవంబరులోగా కేటాయించనున్నారు. రైతులకు ప్లాట్లను కేటాయించాక.. లేఅవుట్లు వేసి, ప్లాట్లలో మౌలిక వసతులు కల్పించనున్నారు.
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు..
రాజధానిలో సీడ్‌ క్యాపిటల్‌కు కీలకమైన రవాణాకు ఉపయోగపడే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి సీఎం గత జూనలోనే శంకుస్థాపన చేశారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతో పాటు మరో ఎక్స్‌ప్రెస్‌ రోడ్ల నిర్మాణానికి సర్వే జరుగుతోంది. త్వరలో పనులు చేపట్టనున్నారు.
పర్యాటక స్థలాల అభివృద్ధి..
రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని పర్యాటక స్థలంగా మార్చారు. నిత్యం ఎంతో మంది ఆ ప్రదేశాన్ని
సందర్శిస్తున్నారు. దాంతోపాటు మందడం వద్ద భూమి పూజ జరిగిన ప్రదేశం, వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ సముదాయాలకు అనేక ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. ఉండవల్లి గుహాలయాలు, అమరావతిలోని ధ్యానబుద్ధతో కలిపి టూరిజం సర్క్యూట్‌గా చేసి విజయవాడ నుంచి బస్సులను నడుపుతున్నారు. పర్యాటక ప్రదేశాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు.
నిరుద్యోగులకు పింఛన్లు..
రాజధాని ప్రాంతంలో వ్యవసాయంపై ఆధారపడి ఉపాధి కోల్పోయిన భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం నెలకు రూ.2,500 చొప్పున పింఛను అందిస్తోంది. 29గ్రామాల్లో ప్రస్తుతం 19,189మందికి పింఛన్లు ఇస్తున్నారు. అలాగే నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు నిర్వహిస్తున్నారు. రాజధాని పరిధిలో 19 నర్సరీలను ఏర్పాటు చేసి, ఉపాధి కూలీలకు భృతి ఇస్తున్నారు.
చౌకధరలకు ఆహారం..
వెలగపూడి వద్ద ఎన్టీఆర్‌ క్యాంటీనను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కార్మికుల భోజన అవసరాలు తీర్చేందుకు ఆరోగ్యకరమైన వంట శాలతో ఎనటీఆర్‌ క్యాంటినను పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. ఇక్కడ రూపాయికే ఇడ్లీ, రూ.3కే పెరుగన్నం, రూ.5కి పులిహోర, సాంబారు అన్నం పంపిణీ చేస్తోంది. రాజధానిలో శాశ్వత నిర్మాణాలను సాగించేందుకు ముందుగా మన ప్రాంతం నుంచే మన పాలన సాగాలన్న ఉద్ధేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి వద్ద 45 ఎకరాల్లో రూ.201కోట్లతో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి17న సచివాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఎనిమిది నెలల క్రితం అక్కడ ఎండిపోయిన పత్తి పొలాలు కనిపించగా నేడు భారీ భవన సముదాయాలు, వేలమంది ఉద్యోగులు, కార్మికులతో కళకళాలాడుతున్న ప్రాంగణం రూపుదిద్దుకుంది. ఈనెల మూడో తేదీ నుంచి వెలగపూడిలో పాలన ప్రారంభమైంది. తన కార్యాలయాన్ని ఈనెల12న చంద్రబాబు ప్రారంభించారు. ఇదే వేగంతో వచ్చే రెండేళ్లలో రాయపూడి వద్ద శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనాలను నిర్మించేందుకు సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రణాళికలు వేగవంతంగా రూపుదిద్దుకొంటున్నాయి. వారంలో ఒకసారి అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి సీఆర్‌డీఏ అధికారులతో సమీక్షిస్తుండటం సత్ఫలితాలనిస్తోన్నది.
Link to comment
Share on other sites

Guest Urban Legend
 

This day marks 1 year of laying foundation for #ManaAmaravati #ManaRajadhani. We've made progress & its pace will pick up from now on. (1/2)

0 replies 10 retweets 32 likes
 
 
 

#Amaravati will be a model capital for the upcoming cities in the world. With your support, we can build it together & better. (2/2)

0 replies 16 retweets 41 likes
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...