Jump to content

Amaravati


Recommended Posts

మాస్టర్‌ ప్లాన్ పరిశీలనకు మంత్రుల కమిటీ
 
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): రాజధాని మాస్టర్‌ ప్లాన, అర్బన డిజైన మార్గదర్శకాలు, ప్రముఖుల నివాసాల డిజైన్లు పరిశీలనకు నలుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటైంది. రాజధాని బృహత ప్రణాళికతో పాటు మౌలిక వసతుల ఏర్పాటుకు నియమ నిబంధనలను పరిశీలించి, తగిన సిఫారసులు చేసేందుకు ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రాష్ట్ర ఆర్థిక, పురపాలక, సాంఘిక సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని.. ఆర్ధిక, ఆరోగ్య-వైద్య, ఉన్నత విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులు సహకరిస్తారని బుఽధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.
Link to comment
Share on other sites

ఇండో- యూకే హెల్త్‌ ఇనస్టిట్యూట్‌కు జూన్ 28న శంకుస్థాపన?
 
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): రాజధానిలో విద్యారంగానికి మరో మణిపూసగా అభివర్ణించదగిన ఇండో-యూకే హెల్త్‌ ఇనస్టిట్యూట్‌కు వచ్చే నెల 28న శంకుస్థాపన చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రక్రియలోని పురోగతిపై బుధవారం విజయవాడలో సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో వారు విస్తృతంగా చర్చించారు. ఇంగ్లండ్‌ మంత్రి, కొందరు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరుల సమక్షంలో శంకుస్థాపనకు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలిసింది. ఇరుపక్షాలూ గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు కృష్ణాయపాలెం వద్ద ఏర్పాటు చేయనున్న ఈ వైద్యసంస్థకు అనుబంధంగా 1,000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఇండో-యూకే హెల్త్‌ ఇనస్టిట్యూట్‌ నిర్మించాల్సి ఉంది. అయితే తాజా చర్చల్లో 200 పడకల ఆస్పత్రిని మాత్రమే నిర్మిస్తామని ఈ సంస్థ ప్రతినిధులు చెప్పారని సమాచారం. ఇందుకు సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు అంగీకరించలేదని సమాచారం. ఒప్పందం ప్రకారం 1000 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తమ యాజమాన్యానికి తెలిపి.. నిర్ణయం తీసుకుంటామని ఇనస్టిట్యూట్‌ ప్రతినిధులు తెలియజేశారు. సమావేశంలో ఇండో-యూకే హెల్త్‌ ఇనస్టిట్యూట్‌ సీఈవో అజయ్‌ రాజన గుప్తా, గ్రూప్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ రిచర్డ్‌ మిల్లర్‌, ఇన్వెస్ట్‌ ఇండియా ప్రతినిధి ఉదయ్‌ ముంజల్‌, సీఆర్‌డీఏ సా్ట్రటజీ డైరెక్టర్‌ జేఎస్సార్కే శాసి్త్ర తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతికి ‘స్టార్టప్‌’
 
636300704032460469.jpg
  • 15న కీలక ఎంవోయూ
  • సీఆర్డీయేతో సింగపూర్‌ డీల్‌
  • ఉద్ధండరాయునిపాలెం వద్ద
  • వేదిక ఎంపిక.. భారీ సభ
 
అమరావతి, తుళ్లూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి బీజం పడనుంది. 6.94 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ఏరియాను స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అభివృద్ధి పరచే మాస్టర్‌ డెవలపర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన సింగపూర్‌ కన్సార్టియం వచ్చే సోమవారం ఏపీసీఆర్డీయేతో కీలక ఎంవోయూ చేసుకోనున్నట్టు తెలిసింది. రాజధాని నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి, గతేడాది అక్టోబరులో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ రాజధాని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలోని ఒక అనువైన ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ బృందం సభ్యుల సమక్షంలో ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గ ంటల వరకు శిలాఫలకం ఆవిష్కరణ, ఎంవోయూ, సభ జరుగుతాయి. ఈ మేరకు సీఎంవో ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌ కార్యక్రమం నిర్వహించే ప్రదేశాన్ని సందర్శించారు. జేసీ శుక్లా, గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌, వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాజధాని రైతులు, విద్యార్థులు సహా ఐదు వేలమంది సభకు హాజరవుతారని కలెక్టర్‌ తెలిపారు. కాగా, రాష్ట్ర మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు పీ నారాయణ కుమారుడు ఆకస్మిక మృతి చెందిన నేపథ్యంలో ఈ కార్యక్రమం రద్దు కావొచ్చునన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణాలపై మంత్రివర్గ ఉపసంఘం

ఈనాడు, అమరాతి: రాజధాని ప్రణాళిక, నిర్మాణాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం అమరావతిలో నిర్మించనున్న హైకోర్టు, శాసనసభ, సచివాలయం, ఇతర నిర్మాణాలకు ఆకృతులు, బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌), పట్టణ ప్రణాళిక మార్గదర్శకాలను పరిశీలించి, ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ ఉపసంఘంలో పురపాలక, సాంఘిక, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య శాఖల ముఖ్య కార్యదర్శులు ఉపసంఘంలోని మంత్రులకు సహకరిస్తారని బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Link to comment
Share on other sites

పెట్టుబడులకు ఆంధ్రా అనుకూలం
మత్స్య ఎగుమతులకు ఇక్కడ మరిన్ని అవకాశాలు
షెన్యాంగ్‌ మున్సిపల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ పాన్‌లింగో
ఈనాడు - అమరావతి
image.jpg

వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అనుకూల వాతావరణం ఉందని చైనాలోని షెన్యాంగ్‌ మున్సిపల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ పాన్‌ లింగో అన్నారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం చైనా ప్రభుత్వ సీనియర్‌ అధికారుల, పారిశ్రామికవేత్తల బృందం సచివాలయాన్ని సందర్శించింది. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌úనాథరెడ్డి, సీనియర్‌ అధికారులు స్వాగతం పలికి రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై దృశ్య, శ్రవణ నివేదిక ప్రదర్శించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చక్కటి పరిస్థితులు ఉన్నాయని పాన్‌ లింగో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల గురించి చురుగ్గా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య పరిశ్రమ రంగంలో ఎగుమతులకు ఇంకా ఎంతో అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. చైనా, బ్రిటన్‌, సింగపూర్‌, జపాన్‌, డెన్మార్క్‌ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో 29 గ్రామాలను కలుపుతూ 217 చదరపు కిలో మీటర్ల పరిధిలో నిర్మించే నూతన రాజధాని గురించి అధికారులు వివరించే సందర్భంలో చైనా ప్రతినిధులు ఎంతో ఆసక్తి కనబరిచారు. పట్టణాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాల పరిశీలన కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలెవన్‌తోనూ ఈ బృందం సమావేశమైంది. పాన్‌ లింగోతోపాటు వెల్‌ హోప్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎలెక్స్‌, నెక్సెస్‌ ఫీడ్‌ ఎండీ సత్యనారాయణరెడ్డి, రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అమరావతి వలయ రైళ్ల ఏర్పాటుకు
చైనా సంస్థ ఆసక్తి!
అమరావతిలో వేగవంతమైన (హైస్పీడ్‌) వలయ రైళ్లు (సర్క్యూట్‌ రైళ్లు) ఏర్పాటుకు చైనా సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. చైనాకు చెందిన చైనా రైల్వే రూలింగ్‌స్టాక్‌ కార్పొరేషన్‌ (సీఆర్‌ఆర్‌సీ) ప్రతినిధులు బుధవారం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఎండీ రామకృష్ణారెడ్డితో విజయవాడలో సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు వివిధ అంశాలపై చర్చించారు. వలయ రైళ్లు ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తంచేశారు. ప్రతినిధి బృందంలో సీఆర్‌ఆర్‌సీ డిప్యూటీ డైరెక్టర్లు కాయోయాన్‌, డిగాంగ్‌యువాన్‌, ఉపాధ్యక్షుడు ఝాంగ్‌మిన్యూ, ఎండీ వాంగ్‌ ఉన్నారు. ఈ సందర్భంగా వారు వలయ రైలు నమూనాను ఎండీ రామకృష్ణారెడ్డికి అందించారు. విజయవాడ -అమరావతి, గుంటూరు- తెనాలి నుంచి మంగళగిరి మీదుగా విజయవాడకు వలయ రైళ్లు నడపాలనే ప్రతిపాదన ఉంది. ఇటీవల దీన్ని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి సమగ్ర నివేదిక తయారు చేసేందుకు యూఎంటీసీ సలహాసంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఇదేతరహా ప్రాజెక్టును సీఆర్‌ఆర్‌సీ సంస్థ మలేసియాలో నిర్వహిస్తోంది. డీపీఆర్‌ పూర్తయిన తర్వాత ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిందిగా చైనా సంస్థ బృందానికి సూచించారు.

Link to comment
Share on other sites

రాజధానికి తలమానికం
 
636300934448914272.jpg
  • వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి గవర్నమెంట్‌ కోర్‌ నిర్మాణం పూర్తి
గుంటూరు: అమరావతి రాజధానికి తలమానికం కానున్న గవర్నమెంట్‌ కోర్‌ ఏరియాని అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌ కన్సార్షియం సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నది. అనంతరం ఉద్ధండ్రాయునిపాలెం - తాళ్ళాయపాలెం మధ్యన కోర్‌ కేపిటల్‌ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి గవర్నమెంట్‌ కోర్‌ నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకోనున్నారు. రాజధానిలో గవర్నమెంట్‌ కోర్‌ ప్రాంతంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఉంటాయి. వీటితో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖల హెచవోడీలు, సివిక్‌ ప్లాజా, సివిక్‌ యాక్సిస్‌, రాష్ట్ర మంత్రుల నివాసాలు నిర్మిస్తారు. ఈ నేపథ్యంలో డిజైన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుందని మాస్టర్‌ ప్లాన రూపొందించిన సంస్థ పేర్కొన్నది. పచ్చదనానికి అభిముఖంగా నిర్మిస్తారు. పచ్చదనం ప్రదేశాల్లో క్యాంటినలు, కాఫీ షాప్‌లు, డైనింగ్‌ వంటివి నిర్మిస్తారు. మొత్తం 564 హెక్టార్లలో సుమారు 7.4 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోర్‌ కేపిటల్‌ నిర్మాణం జరుపుతారు. ఇందులో ఆరు లక్షల మంది ప్రజలు నివాసం ఉండటానికి కూడా భవంతులు నిర్మిస్తారు. ఉన్నతస్థాయి ర్యాంకు కలిగిన అధికారులకు ఇళ్లను కూడా కోర్‌ ఏరియాలోనే నిర్మిస్తారు. సిటీ గ్యాలరీ, కల్చరల్‌ సెంటర్‌ని కూడా నిర్మిస్తారు. కోర్‌ కేపిటల్‌ నిర్మాణం విషయంలో వాస్తుకు కూడా అధిక ప్రాధాన్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కృష్ణానదికి అభిముఖంగా నిర్మించే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు రాజధానికి కొత్తరూపు తీసుకొస్తాయని సీఆర్‌డీఏ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Link to comment
Share on other sites

అమరావతికి ‘స్టార్టప్‌’
 
636300704032460469.jpg
  • 15న కీలక ఎంవోయూ
  • సీఆర్డీయేతో సింగపూర్‌ డీల్‌
  • ఉద్ధండరాయునిపాలెం వద్ద
  • వేదిక ఎంపిక.. భారీ సభ
 
అమరావతి, తుళ్లూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి బీజం పడనుంది. 6.94 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ఏరియాను స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అభివృద్ధి పరచే మాస్టర్‌ డెవలపర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన సింగపూర్‌ కన్సార్టియం వచ్చే సోమవారం ఏపీసీఆర్డీయేతో కీలక ఎంవోయూ చేసుకోనున్నట్టు తెలిసింది. రాజధాని నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి, గతేడాది అక్టోబరులో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ రాజధాని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలోని ఒక అనువైన ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ బృందం సభ్యుల సమక్షంలో ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గ ంటల వరకు శిలాఫలకం ఆవిష్కరణ, ఎంవోయూ, సభ జరుగుతాయి. ఈ మేరకు సీఎంవో ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌ కార్యక్రమం నిర్వహించే ప్రదేశాన్ని సందర్శించారు. జేసీ శుక్లా, గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌, వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాజధాని రైతులు, విద్యార్థులు సహా ఐదు వేలమంది సభకు హాజరవుతారని కలెక్టర్‌ తెలిపారు. కాగా, రాష్ట్ర మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు పీ నారాయణ కుమారుడు ఆకస్మిక మృతి చెందిన నేపథ్యంలో ఈ కార్యక్రమం రద్దు కావొచ్చునన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Link to comment
Share on other sites

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడనుంది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియంతో సీఆర్డీయే ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఒప్పందం జరగనుంది. ఈశ్వరన్ వెంట 18 మంది బడా పారిశ్రామిక వేత్తలు అమరావతి రానున్నారు. ఈ నెల 15న విజయవాడలో అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఉద్దండరాయనిపాలెంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ వీడియో క్లిక్ చేయండి.

Link to comment
Share on other sites

రాజధాని అంకుర ప్రాంత అభివృద్ధికి 15న శంకుస్థాపన

ఈనాడు, అమరావతి: అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో అంకుర (స్టార్టప్‌) ప్రాంత అభివృద్ధి పనులకు ఈనెల 15న శంకుస్థాపన చేయనున్నారు. మందడం గ్రామానికి సమీపంలో మధ్యాహ్నం మూడింటికి శంకుస్థాపన తరువాత అదే ప్రాంగణంలో 15 వేల మందితో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపార, సాంకేతిక రంగాల్లో ఇదే సందర్భంగా సింగపూర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పం దం ఉంటుంది. అమరావతిలో 6.84 చ.కి.మీ. ప్రాంతాన్ని స్టార్టప్‌ ప్రాంతంగా సింగపూర్‌కు చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియం అభివృద్ధి చేయనుంది.

జీఎస్‌టీపై 15న అవగాహన: వస్తు సేవా పన్ను(జీఎస్‌టీ)పై ఈనెల 15న తెదేపా ఎమ్మెల్యేలకు శాసనసభ కమిటీ హాల్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే అంశంపై 16న ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నందున మంత్రులు, ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

అమరావతి రాజధాని అభివృద్ధికి శ్రీకారం
 
636301707056809125.jpg
 వేడుకగా స్టార్టప్‌ ఏరియా శంకుస్థాపనోత్సవం
 మందడం వద్ద 15వ తేదీన కార్యక్రమం
 రాజధాని రైతులకూ ఆహ్వానాలు
 సింగపూర్‌ కన్సార్టియంతో ఎంవోయూపై సంతకాలు
కార్యక్రమానికి విస్తృత సన్నాహాలు
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ ఏరియాలోని 6.84 చదరపు కిలోమీటర్లలో స్టార్టప్‌ ఏరియాను మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపిక చేసిన సింగపూర్‌ కన్సార్టియం (అసెండాస్‌- సింగ్‌బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌) ద్వారా అభివృద్ధి పరచే కార్యక్రమానికి ఈ నెల 15న శంకుస్థాపన జరగనుంది. రాజధాని గ్రామాల్లో ఒకటైన మందడం వద్ద ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పెద్దఎత్తున నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌, అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు, ఏపీసీఆర్డీయే అధికారులు పాల్గొననున్నారు. సీఎం కోరిన వెంటనే అమరావతి నిర్మాణార్ధం వేలాది ఎకరాలను సమీకరణ ప్రాతిపదికన స్వచ్ఛందంగా అందజేసిన రాజధాని రైతులకు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు. అపార ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు వివిధ పన్నుల్లో వాటా రూపేణా ప్రభుత్వానికి, పెరగబోయే భూముల విలువల రూపేణా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాజధాని రైతులకు భారీ లబ్ధి చేకూర్చాలన్నది ఈ స్టార్టప్‌ ఏరియా ప్రతిపాదన వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఇది అభివృద్ధి చెందితే ఆ ప్రభావం అమరావతి అంతటిపై పడి, రాజధాని నగరం చకచకా నిర్మితమయ్యేందుకు బాటలు పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్టార్టప్‌ ఏరియాను స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో అభివృద్ధి చేయించాలని నిర్ణయించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ విధానం వల్ల సింగపూర్‌ కన్సార్టియానికి వేల కోట్ల రూపాయల్లో లబ్ధి చేకూరనుండగా మౌలిక వసతుల కల్పనకు వేల కోట్ల రూపాయలను వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వం (ఏపీసీఆర్డీయే)కు దక్కేది నామమాత్రమేనని అవి ఆరోపణలు గుప్పించాయి. దీనిపై కొన్ని నిర్మాణ సంస్థలు హైకోర్టును సైతం ఆశ్రయించడంతో మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక ప్రక్రియలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు కోర్టుకేసులు ఈమధ్యనే ఒక కొలిక్కి రావడంతో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిని శరవేగంగా సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌ కన్సార్టియాన్ని మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. వెన్వెంటనే దీనికి సంబంధించిన శంకుస్థాపనోత్సవాన్ని ఈ నెల 15న జరిపేందుకు నిర్ణయించింది. కాగా.. ఈ ఎంవోయూకు సంబంధించిన చర్చల్లో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణకు అనూహ్యంగా సంభవించిన పుత్రశోకం దృష్ట్యా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆహ్వానపత్రంలో ఆయన పేరు ఉండడంతో ఆ ఒక్క రోజున నెల్లూరు నుంచి వచ్చి, కార్యక్రమంలో పాల్గొని, తిరిగి వెళ్తారని భావిస్తున్నారు.
ఎంవోయూపై సంతకాలు సైతం..
సోమవారం జరిగే కార్యక్రమంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి సంబంధించిన అవగాహనాపత్రం (ఎంవోయూ)పై ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ ప్రభుత్వాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ఈ ఎంవోయూలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపరమైన, ఆర్ధికపరమైన ప్రగతికి సంబంధించిన అంశాలు కూడా ఉండనున్నాయి. తద్వారా ఆ రోజున కుదుర్చుకోబోయే ఎంవోయూ ఒక్క అమరావతి స్టార్టప్‌ ఏరియాకే కాకుండా మొత్తంగా రాష్ట్రాభివృద్ధికే చోదకశక్తిగా ఉపకరిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సీఆర్డీయే..
రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అమరావతి డిజైన్లపై మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌తో చర్చల నిమిత్తం ప్రస్తుతం లండన్‌లో ఉన్న తమ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఇస్తున్న ఆదేశాలను అనుసరించి శంకుస్థాపనోత్సవానికి సీఆర్డీయే అధికారులు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రాజధాని రైతుల్లో ఎంపిక చేసిన కొందరికి అందజేసేందుకు ఆహ్వానపత్రాలను రూపొందిస్తున్నారు. సుమారు 5 వేల నుంచి 10,000 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్న అంచనాతో తదనుగుణంగా ప్రాంగణం, సభావేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా అంకురార్పణ నుంచి ఇప్పటి వరకూ అమరావతి ప్రస్థానంలోని వివిధ ధశల గురించి తెలిపే ఛాయాచిత్రాలతో కూడిన ప్రదర్శనను సభాప్రాంగణంలోనూ, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా గన్నవరం విమానాశ్రయం నుంచి మందడం వరకూ వివిధ కూడళ్ల వద్ద రహదారికి పక్కన భారీ ఫ్లెక్సీలనూ ఏర్పాటు చేయనున్నారు. అడిషనల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావు నేతృత్వంలో సీఆర్డీయే అధికారులు, సిబ్బంది పైన పేర్కొన్న సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు.
Link to comment
Share on other sites

సేవల రంగానికే ‘స్టార్టప్‌’!

ఐటీ, ఐటీఈఎస్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు వంటి సంస్థలకు ప్రాధాన్యం

మూడేళ్లలో 8.07 లక్షల చ.అడుగుల భవన నిర్మాణం

అన్ని అర్హతలూ చూశాకే స్థలాల కేటాయింపు

ఈనాడు - అమరావతి

అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసే స్టార్టప్‌ ప్రాంతంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవలు (ఐటీఈఎస్‌), బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా, టెలికాం, చిల్లర వాణిజ్యం, ఆతిథ్య రంగాలకు చెందిన సంస్థల ఏర్పాటుకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇన్‌స్టిట్యూషనల్‌ జోన్స్‌లో విద్యా సంస్థలు వంటివి వస్తాయి. షాపింగ్‌ మాల్స్‌, వినోద, పర్యాటక కేంద్రాలు వంటి ప్రత్యేక జోన్లు ఉంటాయి. సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ)తో కలసి ఏర్పాటు చేసే అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) సంస్థ 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనిలో తొలి దశలో 656 ఎకరాల్ని అభివృద్ధి చేయనుంది. మొదట 8.07 లక్షల చదరపు అడుగుల నిర్మితప్రాంతం కలిగిన భవనాన్ని మూడేళ్లలో సిద్ధం చేస్తారు. భవన నిర్మాణంతో పాటు, వాటిలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఏడీపీదే. ఇది బహుళ అవసరాలకు వినియోగించే భవనం. దీనిలో కొంత నివాస ప్రాంతం, కొంత కార్యాలయాల కోసం, మరి కొంత వినోద కేంద్రాలు, మాల్స్‌ కోసం కేటాయించనున్నారు. ఈ భవన నిర్మాణంతో పాటు, దానికి సమాంతరంగా 656 ఎకరాల్లో మౌలిక వసతుల అభివృద్ధిని ఏడీపీ చేపడుతుంది.

ఈ అర్హతలుండాలి..!

స్టార్టప్‌ ప్రాంతంలో భవనాల నిర్మాణంతో పాటు, అభివృద్ధి చేసిన స్థలాలను వివిధ సంస్థలకు ఏడీపీ కేటాయిస్తుంది. తాను రావడంతో పాటు, అనుబంధంగా మరిన్ని కంపెనీలను రప్పించే సామర్థ్యం ఉన్న కంపెనీలు (క్వీన్‌ బీ కంపెనీలు) 10 తీసుకు వస్తామన్నది సింగపూర్ సంస్థల కన్సార్టియం ఇచ్చిన హామీ. మౌలిక వసతులు అభివృద్ధి చేసి, వివిధ సంస్థలకు స్థలాలు కేటాయించడంతో పాటు.... అవి అక్కడ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించేలా చూడటం కన్సార్టియం బాధ్యత. దీనికి కొన్ని మార్గదర్శకాలను అనుసరిస్తామని ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో సింగపూర్‌ కన్సార్టియం పేర్కొంది. స్టార్టప్‌ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని, స్థలం కావాలని ఏదైనా సంస్థ ముందుకు వస్తే... అలాంటి ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేయడంలో ఆ సంస్థకు గతంలో ఉన్న అనుభవనాన్ని చూస్తారు. ఉపాధి కల్పనలో ఆ సంస్థకు ఉన్న నేపథ్యాన్ని చూస్తారు. స్టార్టప్‌ ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్ల లభ్యత, దరఖాస్తు చేసుకునేవారికి ఉండాల్సిన అర్హతలు, నియమ నిబంధనలు తెలియజేసేందుకు ఏడీపీ ఒక వెబ్‌ పోర్టల్‌ నిర్వహిస్తుంది.

పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సంస్థ

స్టార్టప్‌ప్రాంత అభివృద్ధితో పాటు రాజధాని ప్రాంతంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ‘కేపిటల్‌ రీజియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ (క్రిపా)’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని సింగపూర్‌ సంస్థల కన్సార్టియం తెలిపింది. దీంతో పాటు ‘అమరావతి బ్రాండ్‌’కి విదేశాల్లో ప్రాచుర్యం కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, రోడ్‌షోలు నిర్వహిస్తామని, అమరావతిని ఆకర్షణీయ నగరంగా రూపొందించేందుకు అవసరమైన మార్గసూచిని సిద్ధం చేయడానికి సహకరిస్తామని తెలిపింది. మానవ వనరుల శిక్షణ, అభివృద్ధిలో సహకారం అందిస్తామని పేర్కొంది.

Link to comment
Share on other sites

15న స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి శంకుస్థాపన

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తుళ్లూరు: అమరావతిలోని రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులకు 15న నిర్వహించే శంకుస్థాపనకు సింగపూర్‌ నుంచి 70 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇందులో సింగపూర్‌ వాణిజ్య, పారిశ్రామిక వ్యవహారాల మంత్రి ఈశ్వరన్‌తోపాటు అక్కడి ప్రభుత్వం తరఫున 16 మంది, వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి మిగతా వారు ఉన్నారు. నగరంలోని గేట్‌ వే హోటల్‌లో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే అల్పాహార సమావేశానికి ఈ బృందం హాజరవుతుంది. ఈ సందర్భంగా సాంకేతిక, వాణిజ్యంపై ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ ప్రభుత్వాలు అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి. అనంతరం అమరావతిలోని స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియంకు ‘లెటర్‌ ఆఫ్‌ అవారు’్డను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేస్తారు. ఉదయం 11:30 గంటల సమయంలో హోటల్‌ ఆవరణలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ముఖాముఖీ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు మందడంలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అదే ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. గుంటూరు కలెక్టరు కోన శశిధర్‌, ఐజీ సంజయ్‌, గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌ ఇతర అధికారులు శుక్రవారం రాత్రి శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.ముఖ్యంగా యువతను బహిరంగ సభకు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టరు చెప్పారు.

Link to comment
Share on other sites

శంకుస్థాపనకు సన్నద్ధం
 
636302650405556531.jpg
  • గవర్నమెంట్‌ కోర్‌ శంకుస్థాపనకు విస్త్రృత ఏర్పాట్లు
  • ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న గుంటూరు కలెక్టర్‌, జేసీ
  • శాఖల వారీగా అధికారులకు బాధ్యతల కేటాయింపు
  • 10 వేల మంది ప్రజలకు తాగునీరు, భోజన సౌకర్యం
గుంటూరు/తుళ్లూరు: అమరావతి రాజధాని నగరంలో గవర్నమెంట్‌ కోర్‌ ఏరియా అభివృద్ధికి సోమవారం జరగనున్న శంకుస్థాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వ హించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్‌ కోన శశిధర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న ప్రథమ ప్రభుత్వ కార్యక్రమం కావడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలు శంకుస్థాపన జరగనున్న ఉద్దండ్రాయునిపా లెం - తాళ్ళాయపాలెం మధ్య నిర్ణయించిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచన లు ఇచ్చారు. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ కృతిక శుక్ల కూడా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సింగపూర్‌ కన్షార్షియం సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్న దృష్ట్యా ఏర్పాట్లలో ఎక్కడా లోపం లేకుండా చూడాలని జిల్లా శాఖల అధికా రులను ఆదేశించారు. శుక్రవారం సాయం త్రం జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేసారు. ఐజీ సంజయ్‌, గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌, అమరావతి రాజదాని ఏఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆర్డీవో బండ్ల శ్రీనివాసరావు, సీఆర్‌డీఏ అధికారులతో కలెక్టర్‌ ఏర్పాట్లపై చర్చించారు. శుక్రవారం సాయంత్రం జాయింట్‌ కలెక్టర్‌ కృతిక శుక్ల వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలనేది వివరించారు. రెండు, మూడు హెల్త్‌ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని డీఎం హెచవోని ఆదేశించారు. ఆ రోజంతా రాజధానిలో విద్యుత సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. పోలీసుశాఖ తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని గవర్నమెంట్‌ కోర్‌ శంకుస్థాపన కార్యక్రమంపై దృష్టి పెట్టేలా చేస్తున్నారు.
 
గవర్నమెంట్‌ కోర్‌ ఏరియా అమరావతి రాజధానిలో కీలక ప్రదేశం. ఇక్కడ ఒక వైపున అసెంబ్లీ, మరోవైపున సచివాలయం, ఇంకో వైపున హైకోర్టు భవనాలు ఉంటాయి. వీటితో పాటు మంత్రుల నివాసాలు, ప్రభుత్వ శాఖల హెచవోడీలు, కమిషనరేట్లు నిర్మిస్తారు. సుమారు 6 లక్షల మంది ప్రజలు నివసించేందుకు వీలుగా హౌసింగ్‌ కార్య క్రమాలు కూడా చేపడతారు. ఉన్నతస్థాయి అధికారుల నివాసాలు కూడా గవర్నమెంట్‌ కోర్‌ ఏరియాలోనే ఉంటాయి. రివర్‌ఫ్రంట్‌, పచ్చదనంకు అధిక ప్రాధాన్యం కల్పిస్తారు. ప్రభుత్వ కార్యకలాపాలను సమీపంలో నుంచి చూసేందుకు వీలుగా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అమరావతి రాజధాని మాష్టర్‌ప్లాన రూపొందించిన సింగపూర్‌ సంస్థ గవర్నమెంట్‌ కోర్‌ ఏరియాలో భాగాస్వామ్యం కావాలని నిర్ణయించింది. స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిన సింగపూర్‌ కన్షార్షియం సంస్థ బిడ్డింగ్‌లో పాల్గొన్నది. మధ్యలో కొన్ని న్యాయపరమైన అవాంతరాలు ఎదురుకాగా అవన్నీ తొలగిపోవడంతో ఆ సంస్థతో ఒప్పందం కుదర్చుకొని అదేరోజున శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
 
సీఎం ఆదేశాల మేరకు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఎంవోయూ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ఏర్పాటు చేశారు. అనంతరం హెలికాఫ్టర్లలో సీఎంతో పాటు సింగపూర్‌ బృందం సభ్యులు నేరుగా శంకుస్థాపన జరిగే తాళ్ళాయపాలెంకు చేరుకొంటారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల మధ్యన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాజధాని ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 10 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
Link to comment
Share on other sites

 

AP to ink MoU with Singapore for new capital at Amaravati

 

Models of the capital city Amaravati Ch Vijaya Bhaskar

 

Hyderabad, May 13:  

In a move that can speed up construction of its new capital, Amaravati, Andhra Pradesh Government will enter into a Memorandum of Understanding (MoU) with Republic of Singapore on Monday.

``This is first of its kind MoU being entered into by a state government with a foreign country,’’ Sreedhar Cherukuri, Commissioner, Andhra Pradesh Capital Region Development Authority (APCRDA), told Business Line here on Saturday.

The MoU will enhance cooperation between Singapore Govt and state government in master development of the start up area in Amaravati city.

“A high level Joint Implementation Steering Committee, co-chaired by Chief Minister of Andhra Pradesh and Singapore Minister of Trade and Industry will provide leadership and direction for the implementation of the MoU,’’ the official said.

In addition, there will also be a joint implementation working committee comprising senior officials from both the governments which will report to JSIC.

The MoU is also intended to create opportunities for Singapore entities to invest in the new capital and Andhra Pradesh and contribute their expertise in the economic development.

The state government had earlier accepted the Singapore Consortium proposal on `Swiss Challenge’ mode for development of start-ups of seed capital area of Amaravati.

The Singapore based Ascendas-Singbridge, Sembcorp Development Ltd., formed into a consortium for the seed capital seed capital construction.

The estimated cost of the new capital city infrastructure has been pegged at Rs. 33,000 crore which will be developed in seven to eight years in phases.

```We have completed financial tie-ups for Rs. 15,000 crore with assistance from HUDCO, World Bank and Government of India,’’ Cherukuri said.

This includes Rs. 7,500 crore from Hudco, $500 million from the World Bank and Rs. 2,500 crore from the Government of India.

While Rs. 1500 crore has already been granted by the Centre, it is expected to release another Rs. 1,000 crore shortly.

Asked on the progress of the new capital project, the official said about 45 per cent of the work has been completed.

``We have completed 95 per cent of the land acquisition, readied master plans and city plan, handed over 60,000 plots to 27,000 farmers,’’ among others, the official said.

(This article was published on May 13, 2017)
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...