Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
 
636288226786738059.jpg
అమరావతి: రాజధాని పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కృష్ణానదిపై నుంచి అమరావతికి ఎన్ని వారధులు అవసరమో సమగ్ర ప్రణాళికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజారవాణా వ్యవస్థలో చోదకుడు లేని విద్యుత్ బస్సులు, మెట్రో రైలు, తక్కువ దూరానికి జల మార్గాలు ఉంటాయని సీఎం అన్నారు. బస్ స్టేషన్లు, మెట్రో రైలు స్టేషన్లు, పార్కింగ్ ఏరియాలు అండర్ గ్రౌండ్‌లోఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Link to comment
Share on other sites

13.95 కోట్లతో సిటీ గ్యాలరీ ఏర్పాటు: సీఆర్డీఏ కమిషనర్
 
ఉద్దండరాయునిపాలెం, (అమరావతి): ఉద్దండరాయునిపాలెంలో రూ.13.95 కోట్లతో సిటీ గ్యాలరీ ఏర్పాటు చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. నగరం నడిబొడ్డున ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలను పరిగణలోకి తీసుకొని సిటీ గ్యాలరీ ఏర్పాట్లు చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ చెప్పారు.
Link to comment
Share on other sites

రాజధాని ప్రాంతంలో అక్షరధామ్ తరహాలో ఆలయం ఏర్పాటుకు కసరత్తు
 
అమరావతి: విజయవాడలోని రాజీవ్‌గాంధీ పార్క్, నది, కాలువల అభిముఖ ప్రాంతాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వారధి నుంచి పవిత్ర సంగమం వరకు నదికి ఆనుకుని జల క్రీడలు, ఫుడ్ కోర్టులు, ఓపెన్ ఆడిటోరియాలు, సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
నగరానికి ఆవలి వైపున 30 వేల ఇళ్లు నిర్మిస్తామన్నారు. రాజధానిలో పర్వత ప్రాంతంలో అక్షరధామ్ తరహాలో ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు.
Link to comment
Share on other sites

ప్రపంచస్థాయి కాదు.. ప్రపంచంలోనే మేటిగా.. అమరావతిలో ప్రతి నిర్మాణం ఉండాలి
 
636288610840651044.jpg
  • ‘కూచిపూడి ముద్ర’ సహా మరిన్ని వంతెనలు
  • వేగం, పర్యావరణహిత ప్రజారవాణా
  • రాజధాని పరిణామక్రమం కళ్లకు కట్టే ‘అమరావతి సిటీ గ్యాలరీ’
  • అక్షరధామ్‌ తరహాలో పర్వత ప్రాంతం
  • డిజైన్లపై మరో 2 కమిటీలు
  • సీఆర్డీయే సమీక్షలో సీఎం చంద్రబాబు
(ఆంధ్రజ్యోతి, అమరావతి): రాజధానిలో ఇకపై ఏ నిర్మాణం చేపట్టినా అది ప్రపంచ శ్రేణి (వరల్డ్‌ క్లాస్‌) అని కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమం (వరల్డ్‌ బెస్ట్‌) అని అందరూ చెప్పుకొనేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు. వెలగపూడి సచివాలయ సముదాయంలో బుధవారం నాడాయన సీఆర్డీయే చేపట్టిన, చేపట్టబోతున్న పనులపై వార సమీక్ష నిర్వహించారు. అమరావతికి అభిముఖంగా ఉన్న కృష్ణా నదిని దానికి ప్రధాన ఆకర్షణగా సీఎం అభవర్ణించారు. అంతేకాదు.. ఆ నదిపై రాజధానిలోని వేర్వేరు ప్రదేశాల వద్ద నిర్మించనున్న వారధులు కూడా అమరావతికి మరింత వన్నె చేకూర్చే ఆకృతులతో ఉండాలని స్పష్టంజేశారు.
 
రాజధానిని ఇబ్రహీంపట్నంతో అనుసంధానిస్తూ కూచిపూడి నృత్య భంగిమలో రెండంతస్థులుగా నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించిన వంతెన కాకుండా అమరావతిని చేరుకునేందుకు కృష్ణానదిపై మరింకెన్ని వారధులు, ఎక్కడెక్కడ అవసరమవుతాయో గుర్తించాలన్నారు. వాటిని సైతం వినూత్నమైన డిజైన్లతో నిర్మించేందుకు ప్రణాళికలు రచించాలని సూచించారు. రాజధాని నగరంలో నిర్మితమయ్యే ఫ్లైవోవర్లు కూడా అమరావతి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేలా ఉండాలన్నారు. రాజధానిలో అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటులో భాగంగా చోదకుడు లేని విద్యుత్తు బస్సులు, మెట్రో రైలు ఉంటాయని, తక్కువ దూరాలు చేరేందుకు జలమార్గాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అమరావతిలో ఎక్కడికైనా కేవలం 30 నిమిషాల్లోపే చేరుకునేలా ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలని చెప్పారు. బస్‌స్టేషన్లు, మెట్రో రైలు స్టేషన్లు, పార్కింగ్‌ ప్రదేశాలు భూగర్భంలో ఉండేలా చూడాలన్నారు. ఇక రింగ్‌ రోడ్లు, ఇతర రహదారులన్నింటినీ వాహనాలు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా ఆయా రంగాల నిపుణులతో చర్చించి, నిర్మించాలని ఆదేశించారు. రాజధానిలోని నడక, సైకిల్‌ మార్గాల్లో ఎక్కడా ఎండ పడకుండా చల్లని నీడనిచ్చే పచ్చటి చెట్లను పెంచాలన్నారు.
 
అమరావతికి సంబంధించిన భూత, వర్తమాన, భవిష్యత్తు పరిణామాలకు అద్దం పట్టే ‘అమరావతి సిటీ గ్యాలరీ’ని నగరం మధ్య ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాజధానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెంలో సుమారు 4.5 ఎకరాల్లో రూ.13.95 కోట్లతో ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామని సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ చెప్పినప్పుడు చంద్రబాబు పై సూచన చేశారు. రాజధాని నడిబొడ్డున ఈ గ్యాలరీ ఉంటే ప్రతి ఒక్కరూ దానిని చూసి, రాజధాని నిర్మాణమనే బృహత్కార్యం ఏ విధంగా జరిగిందో తెలుసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిలోని పర్వత ప్రాంతాల్లో ఒకదానిని ప్రఖ్యాత అక్షరధామ్‌ తరహాలో ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి పరచాలనుకుంటున్నామని సీఎం వెల్లడించారు.
 
అందరితో చర్చించి
ఈ సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలపై అందరితో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న 2 కమిటీల (రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌ నేతృత్వంలో ఒకటి, క్యాపిటల్‌ కమిటీ పేరిట మరొకటి)కు అదనంగా మంత్రులు, వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులతో కూడిన మరో 2 కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం ఆదేశించారని వెల్లడించారు. ఈ 4 కమిటీలు కలసి రాజధాని డిజెనుౖ, నిర్మాణాలపై కూలంకషంగా చర్చించి, తగు నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పారు. అమరావతిలో నిర్మించదలచిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, అందులోని 2 ఐకానిక్‌ భవంతుల (అసెంబ్లీ, హైకోర్టు) తుది డిజైన్లపై మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌తో చర్చించేందుకు సీఆర్డీయే అధికారులతో కలసి తాను ఈ గురువారం నుంచి జరపాల్సిన లండన పర్యటన వచ్చే నెల 2వ తేదీకి వాయిదచఇా పడిందని నారాయణ తెలిపారు. మే 2 నుంచి 4 వరకు తాము అక్కడ పర్యటించనున్నామన్నారు.
 
నదీ తీరాన పర్యాటక ఆకర్షణలు
సమీక్షా సమావేశంలో.. విజయవాడలోని రాజీవ్‌గాంధీ పార్క్‌తోపాటు కృష్ణానది, వివిధ కాల్వ గట్ల సుందరీకరణకు రూపొందించిన ప్రణాళికపై అధికారులు ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన ఇచ్చారు. కనకదుర్గమ్మ వారధి నుంచి ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమ ప్రదేశం వరకు నదికి ఆనుకుని ఉన్న ప్రదేశాన్నంతటినీ పూర్తిస్థాయిలో సుందరీకరించాలన్న సీఎం.. అందులో జలక్రీడలు, ఫుడ్‌కోర్టులు, షాపింగ్‌మాల్స్‌, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, రోజువారీ ఎగ్జిబిషన్లు, ఫిట్‌నెస్‌ కేంద్రాలు, ఓపెన ఎయిర్‌ ఆడిటోరియాలు, సాంస్కృతిక వేదికలు ఇత్యాదివి ఏర్పాటు చేయాలని సూచించారు. నగరానికి ఆవలివైపున ఉన్న ప్రదేశంలో సుమారు లక్షమందికి సరిపోయేలా 30,000 పక్కాగృహాలను నిర్మించాలనుకుంటున్నామని ప్రకటించారు. సమావేశంలో ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శి సతీశచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ప్రపంచంలోనే మేటిగా ఉండాలి!: నారాయణ
 
అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): అమరావతిలోని ప్రతి నిర్మాణమూ ప్రపంచంలోనే మేటిగా ఉండేలా చూడాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా తుది డిజైన్లు ఉండాలని మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడు నారాయణ మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌కు స్పష్టం చేశారు. శుక్రవారం మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్టనర్స్‌ ప్రతినిధులతో నారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చలు జరిపారు. రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ప్లానతోపాటు అందులోని 2 ఐకానిక్‌ భవంతుల (అసెంబ్లీ, హైకోర్టు) తుది ఆకృతులు ఏ విధంగా ఉండాలన్నదానిపై చర్చ జరిగింది. వచ్చే నెల 2, 3 వారాల్లో తుది డిజైన్లను అందజేసే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పటికే మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ అందజేసిన ప్రాథమిక ఆకృతుల్లో ఏమేం మార్పుచేర్పులు అవసరమన్న విషయమై చర్చించారు. అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యమైనా పర్వాలేదని, తుడి డిజైన్లు మాత్రం ప్రతి ఒక్కరి మనస్సును చూరగొనేలా ఉండాలన్నది సీఎం ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతులకు డిజైన్లలో సముచిత ప్రాధాన్యమివ్వడం అత్యంత ప్రధానమని, తద్వారా అటు అత్యాధునికంగాను.. ఇటు రాష్ట్ర ఘనచరిత్రకు దర్పణం పట్టేలా అవి ఉండేలా చూడాలని కోరారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ‘బ్లూ- గ్రీన కాన్సెప్ట్‌’నకు అనుగుణంగా గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ఉండేలా చూడాలన్నారు.
Link to comment
Share on other sites

రాజమార్గం ఎప్పటికి సిద్ధం?
పది నెలలైనా పూర్తికాని సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు
భూసేకరణ సమస్యలతో మూడు చోట్ల అవరోధం
ప్రభుత్వం, సీఆర్‌డీఏ తాత్సారంతో సమస్యలు
ఈనాడు - అమరావతి
amar.jpg

రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) మొదటి దశ పనులకు శంకుస్థాపన చేసి పది నెలలవుతున్నా ప్రాజెక్టు ఇంకా కొలిక్కి రాలేదు. జాప్యం వెనుక ప్రభుత్వ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తొలి దశలో 18.3 కి.మీ. రహదారి నిర్మాణం చేపట్టగా.. మూడు చోట్ల పనులు నిలిచిపోయాయి. ఆయా ప్రాంతాలలోని రైతులు తమ భూముల్ని భూసమీకరణలో ఇవ్వకపోవడమే కారణం. భూసమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ జాప్యం వల్ల 13.3 కి.మీ. మేర మాత్రమే రహదారి పనులు జరుగుతున్నాయి. ఉండవల్లి గ్రామ పరిధిలో సుమారు నాలుగు కి.మీ. మేర పనులు మొదలవలేదు. అక్కడింకా భూసేకరణ ప్రకటనే జారీ చేయలేదు. ఇప్పుడు ప్రకటన ఇచ్చినా కూడా మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి మూడు నాలుగు నెలల సమయం పడుతుంది. అంటే ప్రధాన అనుసంధాన రహదారి ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాల్లేవు. ఈ ప్రాజెక్టు రెండో దశలో మరో మూడు కి.మీ.ల రహదారి నిర్మించాల్సి ఉండగా ఇప్పటికీ టెండర్లు పిలవలేదు.

amar2.jpg

ఇదే ప్రధాన మార్గం
వివిధ నిర్మాణ పనులు మొదలవడంతో రాజధానికి వచ్చిపోయే వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. దానికి తగ్గట్టు రహదారుల్లేవు. ప్రధాన అనుసంధాన రహదారి నిర్మిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. విజయవాడ-గుంటూరు మార్గంలో జాతీయ రహదారిపై కనకదుర్గ వారధి దాటాక మణిపాల్‌ ఆసుపత్రి వద్ద మొదలై రాజధానిలోని దొండపాడువరకు ఈ రహదారి వెళుతుంది. మొత్తం పొడవు 21.5 కి.మీ.లు. దీన్ని 18.3 కి.మీ.లు, 3.2 కి.మీ.ల చొప్పున రెండు ప్యాకేజీలుగా విభజించారు. 18.3 కి.మీ.ల మొదటి దశ పనులకు 2016 జూన్‌ 26న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. తొలిదశ పనులను ఎన్‌సీసీ సంస్థ చేస్తోంది.

ఇప్పటికీ గందరగోళమే
ప్రధాన అనుసంధాన రహదారి విషయంలో ప్రభుత్వ వైఖరి మొదటినుంచి గందరగోళంగానే ఉంది. దీన్ని ఎన్ని వరుసలుగా వేయాలన్న విషయంలో ప్రభుత్వంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఆరు వరుసలుగా వేస్తామని చెప్పి నాలుగు వరుసలకే టెండర్లు పిలిచారు. ఎన్‌సీసీ సంస్థ నాలుగు వరుసల పనులే చేస్తోంది. మిగతా రెండు వరుసలకు తర్వాత టెండర్లు పిలుస్తామన్నారు. వేరేవాళ్లకు పనులు అప్పగిస్తే ఇబ్బంది అని, ఎన్‌సీసీ సంస్థకే మిగతా రెండు వరుసలు అప్పగిస్తామని అన్నారు. ఇప్పటివరకు ఆ ప్రక్రియ చేపట్టలేదు. ఆరు వరుసలు సరిపోవని, ఎనిమిది వరుసలు వేయండని మధ్యలో ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపైనా ఇంతవరకు స్పష్టత లేదు.

మూడు చోట్ల అవరోధం మొదటిదశ రోడ్డు కొండవీటివాగు వద్ద మొదలై దొండపాడు వద్ద ముగియాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటపాలెం సమీపంలోని మంతెన ఆశ్రమం నుంచి దొండపాడు వరకు పనులు జరుగుతున్నాయి. కొండవీటివాగు నుంచి మంతెన ఆశ్రమం వరకు 4 కి.మీ. మేర, రాయపూడి గ్రామం వద్ద 900 మీటర్ల మేర రహదారి నిర్మాణం నిలిచిపోయింది. రాయపూడిలో కొన్ని ఇళ్లను తొలగించాల్సి ఉండటంతో పనులు నిలిచిపోయాయి. కొండమరాజుపాలెం వద్ద ఒక రైతు పొలం రహదారిలో సగం వరకు ఉంది. అక్కడ వంద మీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. రైతు పొలం పక్కగా రెండు వరుసల రహదారి వేసి వదిలేశారు.

Link to comment
Share on other sites

గ్రీన్‌ ఎనర్జీ సిటీగా అమరావతి
 
636291987270114392.jpg
  • ప్రభుత్వ నిర్మాణాలన్నీ అదే పద్ధతిలో
  • స్విస్‌ ప్రభుత్వ సహకారం సంతోషకరం
  • సీఆర్‌డీఏ అధికారులతో బాబు టెలికాన్ఫరెన్స్‌
అమరావతి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మించనున్న ప్రతి ప్రభుత్వ భవనంలోను గ్రీన్‌ ఎనర్జీ అంతర్భాగంగా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఇంధన రంగం, ఇంధన పొదుపు-సంరక్షణలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని.. ఇదే తరహాలో గ్రీన్‌ ఎనర్జీలో అమరావతి నగరం మొదటి స్థానంలో నిలవాలన్నారు. అమరావతిని గ్రీన్‌ ఎనర్జీ నగరంగా మార్చడంలో భాగస్వామ్యం అందించేందుకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రతి నిర్మాణం అందంగా, ఆహ్లాదంగా, విద్యుత్‌ సంరక్షణ పద్ధతులు ఉండేలా డిజైన్ల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం నాడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
స్విస్‌ ప్రభుత్వ సంస్థ ఫెడరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫారిన్‌ అఫైర్స్‌ విజయవాడలో మే రెండో తేదీన గ్రీన్‌ ఎనర్జీపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తుండడం మంచి పరిణామమన్నారు.
 
అంతర్జాతీయ సంస్థలు రాజధాని నగరానికి రావడాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఆర్‌డీఏ అధికారులకు సీఎం సూచించారు. రాజధాని నగరంలో ప్రభుత్వ భవనాలన్నింటిలో గ్రీన్‌ ఎనర్జీని అంతర్భాగం చేస్తే... ఆ తర్వాత ప్రజలు తమ భవనాల్లో గ్రీన్‌ ఎనర్జీ విధానం ఎలా ఉండాలో అవగాహన చేసుకుంటారన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ... అమరావతి నగరంలోని భవన నిర్మాణాలు విద్యుత్తును పొదుపుగా వాడేలా ఉండడమే కాకుండా, విద్యుత్‌ రంగ సుస్థిరతకు దోహదపడేలా ఉండాలని అధికారులకు సూచించారు. ఇండో-స్విస్‌ భాగస్వామ్యంలో అమరావతిని ఒక అద్భుత నగరంగా మలిచేందుకు వీలవుతుందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ పేర్కొన్నారు. అమరావతి అభివృద్ది కార్పొరేషన్‌కు చెందిన ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ఉన్నతాధికారులు మే రెండో తేదీన జరిగే వర్క్‌షా్‌పలో పాల్గొంటారని చెప్పారు.
Link to comment
Share on other sites

నారాయణ బృందం లండన్‌ పర్యటన వాయిదా
 
  • 4, 5, 6 తేదీల్లో ఉండే అవకాశం..
అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం లండన్‌ పర్యటన మరోసారి వాయిదా పడింది. అమరావతి డిజైన్లపై మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌తో మలివిడత చర్చలు జరిపేందుకు మే 4, 5, 6 తేదీల్లో లండన్‌ వెళ్లనున్నట్లు సమాచారం. నారాయణ నేతృత్వంలో సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.రామకృష్ణారావు తదితరుల బృందం తొలుత ఏప్రిల్‌ చివరి వారరంలో లండన్‌ వెళ్లాలని భావించింది. కానీ తర్వాత మే 2, 3, 4 తేదీల్లో లండన్‌లో పర్యటించాలని నిర్ణయించారు. కొన్ని అనివార్యకారణాల వల్ల ఈ పర్యటనను మరోసారి వాయిదా వేశారు. తాజాగా 3న లండన్‌ బయలుదేరాలని మంత్రి నిర్ణయించినట్లు తెలిసింది. కొద్ది వారాల క్రితం నార్మన్‌ ఫోస్టర్‌ అందజేసిన ప్రాథమిక డిజైన్లలో మార్పులపై సీఎం సహా వివిధ వర్గాల అభిప్రాయాలను ఆ సంస్థకు తెలియజేసి, తదనుగుణంగా ఫైనల్‌ డిజైన్లు రూపొందించాలని నారాయణ కోరనున్నారు.
Link to comment
Share on other sites

రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తాం

‘మాకీ’ సంస్థకు సీఆర్‌డీఏ లీగల్‌ నోటీసు

ఈనాడు, అమరావతి: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్‌ సంస్థ మాకీ అండ్‌ అసోసియేట్స్‌పై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) హెచ్చరించింది. ఇందుకు సంబంధించి సోమవారం లీగల్‌ నోటీసు పంపింది. హైదరాబాద్‌కి చెందిన తమ ‘ఎంపేనల్డ్‌ లా ఫర్మ్‌’ జె.సాగర్‌ అసోసియేట్స్‌ ద్వారా దీనిని జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఆర్‌డీఏల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా మాకీ అండ్‌ అసోసియేట్స్‌ వివిధ ఆన్‌లైన్‌ మ్యాగజైన్ల ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నందుకు లీగల్‌ నోటీసు జారీ చేసినట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకనైనా సంయమనం పాటించాలని, అసత్య, అవాస్తవ ప్రచారాలు చేస్తూ తమ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లీగల్‌ నోటీసులో సీఆర్‌డీఏ హెచ్చరించింది. రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని తెలిపింది. రాజధాని అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయ ఆకృతులకు సంబంధించి సీఆర్‌డీఏ నిబంధనల ప్రకారమే వ్యవహరించిందని, ఆర్కిటెక్చర్‌ సంస్థల మధ్య నిర్వహించిన పోటీలో పాల్గొన్నందుకు మాకీ అండ్‌ అసోసియేట్స్‌కి 1.50 లక్షల డాలర్లను చెల్లించామని గుర్తుచేసింది. మాకీ అండ్‌ అసోసియేట్స్‌తో ఒప్పందం రద్దు చేసుకున్నాక, మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపికకు అంతర్జాతీయ టెండర్లు పిలిచామని తెలిపింది.

Link to comment
Share on other sites

ప్రభుత్వ భవనాల డిజైన్ల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు
 
గుంటూరు: అమరావతిలో ప్రభుత్వ భవనాల డిజైన్ల ఎంపికకు అధికారుల కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా 10 మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏపీ రాజధాని అమరావతిలో కొత్త భవనాల డిజైన్లను ఎంపిక చేస్తుంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

ప్రభుత్వ భవనాల డిజైన్ల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు

 

గుంటూరు: అమరావతిలో ప్రభుత్వ భవనాల డిజైన్ల ఎంపికకు అధికారుల కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా 10 మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏపీ రాజధాని అమరావతిలో కొత్త భవనాల డిజైన్లను ఎంపిక చేస్తుంది.

 

 

inkenni committees ..

Link to comment
Share on other sites

42% Amaravati development corporation. Very good.

 

it's not just 42% mana govt asset ki value perugutundi and that will be with us. also 4 crores per acre choppuna 100 acres kontaru ani kuda undi.

 

 

 DECOIT gadu Raheja,Emaar e.t.c annitlo lo kuda CBN govt ki best equation teste vadu govt percentage ni mottan ettesa vadu personel ga dabbulu dobbadu...

CBN bada to ivvala kuda adi cheppadu..

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...