Jump to content

Amaravati


Recommended Posts

Hyderabad ORR

Right of Way (ROW) 150 m

 

what is ROW? you mean road width at junctions? I am seeing Hyderabd ORR width any where from 100 meters to 125 meters in search engine. in any case, Hyderbad ORR should not be a model for us. That was built on barren rocky land. This is quite opposite.

Link to comment
Share on other sites

Guest Urban Legend

150m is too much its not needed never heard of it ane range lo cheptuntey  ..i am just giving an example of Hyd ORR

Hyd ORR ki 150m teesukunnaru

 

meeru annatu barren land , agriculture land etc is debatable ..

Link to comment
Share on other sites

సాంకేతిక వలయం

రాజధానికి వలయ రహదారులకు శాస్త్రీయ పద్ధతిలో సర్వే

బాహ్య మార్గం 150 మీటర్లు, అంతర రోడ్డు 75 మీటర్ల వెడల్పు

gnt-top1a.jpg

నవ్యాంధ్ర రాజధానిలో బాహ్య, అంతర వలయ రహదారుల నిర్మాణానికి ఏరియల్‌ సర్వే, తాత్కాలిక బెంచ్‌ మార్క్‌ (టీబీఎం)ల ఏర్పాటు, డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ (డీజీపీఎస్‌) పద్ధతి ద్వారా సర్వే ముమ్మరంగా జరుగుతోంది. 2018 నాటికి వలయ రహదారులు నిర్మాణం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ రోడ్లను త్వరితగతిన చేపట్టనుంది.

ఈనాడు, అమరావతి

సర్వేకు సంబంధించి తమకు సమాచారం లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో దాదాపు తాత్కాలిక బెంచ్‌మార్కుల గుర్తింపు ప్రక్రియ పూర్తికావచ్చింది. ప్రాథమికంగా సర్వే జరుగుతోందని, శాస్త్రీయ, సాంకేతిక పరంగా అధ్యయనం చేస్తున్నామని సీఆర్‌డీఏ కమిషన్‌ చెరుకూరి శ్రీధర్‌ ‘ఈనాడు’కు చెప్పారు. భూ యజమానులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని సూచించారు.

బాహ్యవలయ రహదారి ఇలా..!: అమరావతి నగరానికి వడ్డాణం తరహాలో బాహ్య వలయ రహదాని నిర్మాణం కానుంది. నవ్యాంధ్ర రాజధాని నగరం, విజయవాడ నగరానికి చుట్టూ ఇది ఏర్పాటు కానుంది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ తరపున జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చేపట్టనుంది. గ్రీన్‌ ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ పద్ధతిలో ఎన్‌హెచ్‌డీపీ ఏడోదశలో దీన్ని చేపట్టనున్నారు.

దీని మొత్తం పొడవు 188 కిలోమీటర్లు. 150 మీటర్ల వెడల్పు అంచనాలతో నిర్మిస్తారు.

కృష్ణానదిపై రెండు ఐకానిక్‌ వంతెనలను నిర్మాణం చేయనున్నారు. దీనికి సర్వే జరుగుతోంది. ప్రస్తుతం ఏరియల్‌ సర్వేకు కన్సెల్టెన్సీలను నియమించారు. సాంకేతికంగా సర్వే పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించాల్సి ఉంది.

ఏరియల్‌ సర్వేలో భాగంగా డిజిటల్‌ గ్లోబల్‌ పొజషనింగ్‌ విధానంలో తాత్కాలిక బెంచ్‌మార్కులు గుర్తించి రాళ్లతో సూచిలను ఏర్పాటు చేస్తున్నారు.

సర్వే పూర్తి చేసిన తర్వాత రైట్‌ ఆప్‌వేను నిర్థరిస్తారు. ప్రతిపాదిత అలైన్‌మెంట్‌కు మధ్యస్థరేఖను నిర్ణయించి అనంతరం ఆకృతులను రూపొందిస్తారు. ఆ ప్రకారం భూసేకరణ ప్రారంభం అవుతుంది.

gnt-top1b.jpg

అంతర వలయ రహదారి..!

అమరావతి నగరానికి అంతర వలయ రహదారి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. నెక్లెస్‌ తరహాలో ఇది మారనుంది. అమరావతి నగరంలోకి, విజయవాడ నగరంలో త్వరితగతిన చేరుకునేందుకు అంతర వలయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ సీఆర్‌డీఏ దీన్ని నిర్మాణం చేపట్టనుంది.

రహదారి పొడవు 97 కిలోమీటర్లు. దీన్ని 75 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేయనున్నారు. అమరావతిలో ప్రధాన రహదారులు 50మీటర్లు, 60 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏరియల్‌ లైడార్‌ సర్వే జరుగుతోంది. దీనికి తాత్కాలిక బెంచ్‌మార్కులు గుర్తిస్తూ రాళ్లు పాతుతున్నారు. ఇవి ప్రాథమిక సూచికలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు.

రెండురహదారులకు సంబంధించి సర్వేల్లో భాగంగా పొలాల్లో పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని, కేవలం సూచికలు మాత్రమేనని అధికారులు అంటున్నారు.

ప్రతి 5 కిలోమీటర్ల మధ్య డీజీపీఎస్‌ ద్వారా సర్వే చేసి సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సిమెంట్‌ పిల్లర్లను 45 సెంటీమీటర్ల లోతున వేస్తున్నారు. భూమి పైన 15 సెంటీమీటర్లు మాత్రం కనిపిస్తుంది. దీనికి పసుపు రంగు వేసి సూచికలుగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 250 మీటర్లకు ఒకటి చొప్పున ఈ సూచికను ఏర్పాటు చేస్తున్నారు. ‌

 

సర్వే ద్వారా నేల స్వభావం, మట్టం, ఎత్తు పల్లాలు అంచనా వేస్తారు. దీని ద్వారా తాత్కాలిక అలైన్‌మెంట్‌ గుర్తిస్తారు.

గగనతల సర్వేకు డ్రోన్‌, లైడార్‌లను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా 150 మీటర్ల నుంచి 200 మీటర్ల వెడల్పు ఉన్న వాటిని గుర్తించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా తాత్కాలిక అలైన్‌మెంట్‌ ఒక కొలిక్కి వస్తుంది.

Link to comment
Share on other sites

అదరహో!
ఆకట్టుకునేలా రాజధానిలో ప్రాంతీయ పార్కు
శాఖమూరులో 300 ఎకరాల్లో ఏర్పాటుకు నిర్ణయం
ప్రాథమిక ఆకృతుల రూపకల్పన
ఈనాడు, అమరావతి
aaa.jpg

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రజలు ఒత్తిడికి దూరంగా ఉల్లాసంగా గడిపేలా, ఉత్సాహం నిండేలా చేయడానికి ప్రభుత్వం తన ప్రణాళికలో ప్రత్యేక దృష్టిసారించింది. చిన్నారులతో పాటు పెద్దలూ సేద తీరేలా శాఖమూరులో రీజనల్‌ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మ్యూజికల్‌ ఫౌంటేన్లు.. లేజర్‌ షో.. రాక్‌ క్లైంబింగ్‌ వంటి ఆకర్షణలతో 300 ఎకరాల్లో అతి పెద్ద పార్కును అభివృద్ధి చేయటానికి అమరావతి అభివృ ద్ధి సంస్థ(ఏడీసీ) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పార్కు నిర్మాణం దిశగా ప్రతిపాదిత భూమిలో మార్కింగ్‌ పనులు పూర్తి చేశారు. నిర్మాణ పనులు చేపట్టడానికి భూమిని తమకు స్వాధీనం చేయాలని ఏడీసీ కోరింది. దీనికి సీఆర్‌డీఏ కూడా సానుకూలత వ్యక్తం చేసి భూమి పొసెషన్‌ ధ్రువపత్రాలను అందజేయటానికి సిద్ధమవుతోంది.

దేశంలోనే అతి పెద్ద పార్కు..: ఈ పార్కుకు పిల్లలకే కాదు పెద్దలకు ఆనందాన్ని.. వినోదాన్ని.. ఆహ్లాదాన్ని పంచేలా దీన్ని తీర్చిదిద్దటానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. 300 ఎకరాల్లో అత్యద్భుతమైన, అత్యాధునికమైన ఉద్యానం(పార్కు) దేశంలోనే ఇది అతిపెద్దదిగా అవతరించబోతోంది. రాజధాని అమరావతిలో శాఖమూరు-ఐనవోలు మధ్య దీనికి రూపకల్పన జరిగింది. ఇక్కడే అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మితం కానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో లుంబినీ పార్కు, నక్లెస్‌ రోడ్డులో ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ లాంటివి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌కు దీటుగా ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ ఉద్యానం లేదు. ఈ లేమిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన విజయవాడ-గుంటూరు మధ్య సాధ్యమైనంత త్వరగా పర్యాటకులను ఆకర్షించేలా ఒక పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సీఆర్‌డీఏను ఆదేశించింది. దీని పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనను అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చూస్తోంది. తొలుత రెండు నగరాలకు ఉపయుక్తంగా ఉండేలా గుంటూరులోని ఎన్టీఆర్‌ మానస సరోవరం పార్కును అభివృద్ధి చేయాలని భావించారు. ఇది కూడా నగరపాలక సంస్థకు చెందిన 100 ఎకరాలకు పైగా భూమిలో కొలువుదీరింది. అయితే ఇది వూరికి దూరంగా ఉండడం, దీన్ని భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా పర్యాటకుల రద్దీకి అనుగుణంగా విస్తరించడానికి స్థలం లేకపోవడంతో ఆ ప్రతిపాదన విరమించారు. దీనికి ప్రత్యామ్నాయంగా రాజధాని అమరావతి నగరంలో అసెంబ్లీ, సచివాలయ భవనాలకు కూతవేటు దూరంలోని శాఖమూరు-ఐనవోలు మధ్య సహజసిద్ధమైన నీటి వనరుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ప్రస్తుతం రీజనల్‌ పార్కుగా అభివృద్ధి చేయటానికి చర్యలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే ఈ భూమిలో భూమి మార్కింగ్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలో హద్దురాళ్లు పాతి ఆ స్థలాన్ని సీఆర్‌డీఏ నుంచి తమ స్వాధీనంలోకి తీసుకోవాలని ఏడీసీ భావిస్తోంది.

అనేక అధ్యయనాల తర్వాత..
ఈ పార్కును ప్రతిపాదించడానికి ముందుగా ఏడీసీ ప్రతినిధులు మనదేశంతో పాటు, ఇతర దేశాల్లో అనేక ఉద్యానాలను పరిశీలించి వచ్చారు. ఏడీసీ ఛైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారిని లక్ష్మీ పార్థసారథి భాస్కర్‌ నేతృత్వంలో గుజరాత్‌లోని సబర్మతి పార్కు, బెంగళూరులోని ఉద్యానాలు చూశారు. సబర్మతి పార్కును రివర్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేసినట్లు శాఖమూరు పార్కును కూడా ఆ తరహాలో సహజసిద్ధమైన నీటి వనరుల ద్వారా అభివృద్ధి చేయవచ్చని నిపుణులు సూచించడంతో స్థల ఎంపిక పూర్తి చేశారు.

సహజసిద్ధమైన చెరువు
శాఖమూరు రీజనల్‌ పార్కుకు కేటాయించిన భూమిలో 50 ఎకరాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన చెరువు ఉంది. దీనిలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. ఈ చెరువు ఆకారం ఏ మాత్రం దెబ్బతినకుండా దీన్ని కూడా ప్రతిపాదిత పార్కు భూమిలోనే కలిపి అభివృద్ధి చేస్తే దేశంలోనే ప్రఖ్యాత పార్కుగా ఇది రూపుదిద్దుకుంటుందని ఏడీసీ ప్రతినిధులు చెబుతున్నారు. లక్ష్మీ పార్థసారథి భాస్కర్‌కు హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, సఫల్‌గూడాలో లేఖ ట్రీస్‌ను అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. దీంతో స్వయంగా ఆమె ఇక్కడ పార్కు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పటికే ఆర్కిటెక్టులు, ల్యాండ్‌స్కేప్‌ డిజైనర్లు, ఆటపరికరాల నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రణాళికలకు శ్రీకారం చుట్టారు. దేశంలో పేరెన్నికగన్న మూడు ఆర్కిటెక్టు సంస్థలకు నమూనాలు తయారుచేసి ఇవ్వాలని కోరారు. వారు కూడా ఆయా నమూనాలను అందించడానికి కసరత్తు చేస్తున్నారని ఏడీసీలో పట్టణ ప్రణాళిక పనులను పరిశీలిస్తున్న అధికారి ఒకరు చెప్పారు. పార్కులో కనీసం పది వేలమంది వచ్చి వీక్షించేలా ఏర్పాట్లు చేయాలనేది ఏడీసీ ఆలోచనగా తెలుస్తోంది. అందరికీ అందుబాటులో ఉండేలా ప్రవేశ రుసుం వంటివి ఉంటాయి. అన్నింటికీ మించి పార్కుకు వచ్చే పర్యాటకులకు భద్రతా పరంగా ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ కెమెరాలు నిర్మాణ దశ నుంచే ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నామని సదరు అధికారి తెలిపారు.

gnt-top2b.jpg

ఆకర్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు
వచ్చే విద్యా సంవత్సరానికి రాజధానిలో రెండు డీమ్డ్‌ వర్సిటీలు రాబోతున్నాయి. వాటి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు.. మరోవైపు పాలనా యంత్రాంగం.. ఇంకోవైపు విద్యా సంస్థలు మొత్తం చకచకా వచ్చేస్తుండడంతో వీరికి రాజధానిలో వినోదం.. ఆహ్లాదాన్ని కల్పించటానికి సాధ్యమైనంత త్వరగా శాఖమూరు ప్రాంతీయ పార్కును పట్టాలెక్కించటమే ధ్యేయంగా పనులకు ఏడీసీ తెరదీసింది. ఒకవైపు అంబేడ్కర్‌ స్మృతివనం.. మరోవైపు ఉద్యానం రెండూ పక్కపక్కనే రానుండటంతో పర్యాటకులకు ఆటవిడుపునకు ఏ మాత్రం కొదవ ఉండదు. నూతన పార్కులో ఏర్పాటు చేయాలని భావిస్తున్న జాయింట్‌ వీల్స్‌ వంటివి కూడా విదేశాల నుంచి రప్పించడానికి త్వరలో టెండర్లు పిలవాలనే యోచనలో ఏడీసీ ఉంది. పార్కుకు వచ్చిన పెద్దలకు కొండలు ఎక్కాలనే ఆకాంక్షను కూడా నెరవేర్చటానికి ఈ పార్కులో ప్రత్యేకంగా ట్రెక్కింగ్‌ ఏర్పాట్లకు ప్రతిపాదనలో స్థానం కల్పించారు. ట్రెక్కింగ్‌ ఏర్పాట్లు, సహజసిద్ధమైన నీటి వనరులు, లేజర్‌ షో, వాటర్‌ ఫౌంటైన్లకు సంబంధించిన వూహా చిత్రాలను ఏడీసీకి ఇప్పటికే డిజైనర్లు అప్పగించారు. త్వరలో భూమి స్కేపింగ్‌ పనులు చేపట్టాలని భావిస్తున్నామని ఏడీసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ వూహా చిత్రాలను చూస్తేనే అదరహో అనేలా ఉన్నాయి. పార్కు పూర్తిస్వరూపం సంతరించుకున్న తర్వాత మరింత అందంగా ఉంటుందని భావిస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య నాలుగైదు చిల్డ్రన్స్‌ పార్కుల అభివృద్ధికి ఏడీసీ ప్రతిపాదనలు రూపొందించింది. అన్నీ అనుకూలిస్తే ఏడాది వ్యవధిలోనే వీటిని ఆచరణలో అమలు చేసి చూపాలనేది తమ లక్ష్యంగా ఉందని ఏడీసీ వర్గాలు అంటున్నాయి.

Link to comment
Share on other sites

50 acre cheruvu ekkada vundi ?

వరద నీటి నిల్వ కోసం రిజర్వాయర్లు

వరద నీటిని ఒడిసి పట్టేందుకు రాజధాని ప్రాంతంలో 3 భారీ జలాశయాలను ఏర్పాటు చేస్తారు. శాఖమూరు వద్ద 50 ఎకరాలు, నీరుకొండ వద్ద 450 ఎకరాలు, కృష్ణాయపాలెం వద్ద 190 ఎకరాల్లో.. మొత్తం 690 ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేస్తారు. వీటిలో 8 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు

 

కొండవీటివాగుని వెడల్పు చేయడానికి 885 ఎకరాలు, పాలవాగుకి 433 ఎకరాలు, గ్రావిటీ కాలువకి 217 ఎకరాలు కావాలని అంచనా.

* నీరుకొండ వద్ద 0.4 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ, శాకమూరు వద్ద 0.2 టీఎంసీ సామర్థ్యంగల రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఈ మూడు జలాశయాలకు 690 ఎకరాలు కావాలి. రాజధానికి వెలుపల లాం వద్ద 0.3 టీఎంసీలు, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీ, సామర్థ్యంగల రిజర్వాయర్లు నిర్మిస్తారు.

* కాలువలు, వాగులు, వాటి పక్కన హరిత వనాలకు కలిపి మొత్తం 2226 ఎకరాలు కావాలని అంచనా.

* ఐదు రిజర్వాయర్లలో 1.3 టీఎంసీ, వాగులు కాలువల్లో 0.31 టీఎంసీ జలాలు నిల్వ చేసేందుకు అవకాశం ఉంటుంది. ede anukunta

Link to comment
Share on other sites

lankaa.jpg

lanka.jpg

కృష్ణాలో సప్త ద్వీపాలను స్వాధీనం చేసుకోవాలి: బాబు

 

636282175475151441.jpg
అమరావతి: కృష్ణానదిలో సప్త ద్వీపాలను స్వాధీనం చేసుకుని అభివృద్ధి కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణంపై బుధవారం ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మట్లాడుతూ...అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే రహదారులపై హోర్డింగుల ఏర్పాటుపై ప్రణాళిక ఉండాలన్నారు. అలాగే రోడ్ల మధ్యలో ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా... కృష్ణా నదిలో 250 ఎకరాల మేర వున్న మరో ద్వీపాన్ని గుర్తించామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

raaz bro, kiran bro, krishna river lo saptha dvipalu ante E lanka lu na, leka vere emi ayina unnaya.

Link to comment
Share on other sites

raaz bro, kiran bro, krishna river lo saptha dvipalu ante E lanka lu na, leka vere emi ayina unnaya.

 

ave...actual ga 25 daka unnai....kakapote ippudu vykuntapuram barrage kadite barrage above(ani chala peddavi) konni munigi potai :blink:

 

Kakpote vykuntapuram barrage-praksam madyalo islands matram inka India lo the best and ekada levu.....

Mana capital ki ave pettubadi and return future lo

 

https://www.google.com/maps/place/Venkata+Palem,+Andhra+Pradesh+522503,+India/@16.5495681,80.5474702,12109m/data=!3m1!1e3!4m5!3m4!1s0x3a35ee0309791ec1:0x81b291d9ad495272!8m2!3d16.5127201!4d80.5528729

Link to comment
Share on other sites

ave...actual ga 25 daka unnai....kakapote ippudu vykuntapuram barrage kadite barrage above(ani chala peddavi) konni munigi potai :blink:

 

Kakpote vykuntapuram barrage-praksam madyalo islands matram inka India lo the best and ekada levu.....

Mana capital ki ave pettubadi and return future lo

 

https://www.google.com/maps/place/Venkata+Palem,+Andhra+Pradesh+522503,+India/@16.5495681,80.5474702,12109m/data=!3m1!1e3!4m5!3m4!1s0x3a35ee0309791ec1:0x81b291d9ad495272!8m2!3d16.5127201!4d80.5528729

ayyo enni migulutayi bro

Link to comment
Share on other sites

ayyo enni migulutayi bro

 

 

Anything above Vykuntapuram anni munigipotai.....But it's ok....e migilina vatilone dadapu 3-4K acres untundi

 

- Vijaywada/Amaravati is the only place in India where Natural islands in River be seen with steady water 365 days

- These are the only islands that are part of any capital city

- these islands have 30 KM visibility on both sides of river

 

 

US-Cananda border lo untai ilantive(ofcourse water is 99.5%pure&also very large scale) ...kakapote chali dobbudi so only 2-3 months matram tourists untaru... US-Canada ki oka hanging bridge untundi ikkada kuda

 

Mana CRDA vallau danni model ga teesukuni kummeyochu atleast "mana India range lo mana low budget lo"..

 

kakapote mana advantage  Capital&between two large corporations no weather closure issues

 

 

Link to comment
Share on other sites

Anything above Vykuntapuram anni munigipotai.....But it's ok....e migilina vatilone dadapu 3-4K acres untundi

 

Vijaywada/Amaravati is the only place in India where Natural islands in River be seen with steady water 365 days

These are the only islands that are part of any capital city

 

 

US-Cananda border lo untai ilantive(ofcourse water is 99.5%pure&also very large scale) ...kakapote chali dobbudi so only 2-3 months matram tourists untaru... US-Canada ki oka hanging bridge untundi ikkada kuda

 

Mana CRDA vallau danni model ga teesukuni kummeypchu atleast mana India range lo edo mana budget lo..

 

 

:shakehands:

Link to comment
Share on other sites

శాసనసభ’ ఎత్తు 530 అడుగులు!
ప్రజా రాజధానికి అద్దం పట్టేలా ఆకృతి
amar2.jpg

ఈనాడు, అమరావతి: ఆధునిక నిర్మాణ శైలి, శాస్త్రీయ దృక్కోణం, ప్రజారాజధాని భావనల మేలు కలయికగా రాజధానిలో దిగ్గజ భవనంగా నిర్మించే శాసనసభ ఆకృతుల్ని బ్రిటన్‌కు చెందిన నార్మన్‌ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఒక ఆకృతి రూపొందించిన ఆ సంస్థ, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు మరో రెండు ఆకృతులు రూపొందిస్తోంది. ఈ మూడు ఆకృతులను వచ్చే నెల 10, 11 తేదీల్లో ఆ సంస్థ తీసుకు రానుంది. వాటిలో ఉత్తమమైన దాన్ని ముఖ్యమంత్రి ఎంపిక చేస్తే.. దాని సవివర ఆకృతుల్ని ఆ సంస్థ సిద్ధం చేస్తుంది. ఆకృతులపై చర్చించేందుకు పురపాలక మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఈ నెల 27, 28 తేదీల్లో మరోసారి లండన్‌కు వెళుతున్నారు. ఆ పర్యటనలో భాగంగా పరిపాలన నగర బృహత్‌ ప్రణాళికకు ఆమోదముద్ర వేస్తామని, దిగ్గజ భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టుల ఆకృతులపై వచ్చే నెల 10, 11 తేదీల్లో ఒక స్పష్టత వస్తుందని శ్రీధర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. శాసనసభతో పాటు, హైకోర్టుకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మూడేసి ఆకృతులు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

విశేషాల సమాహారం శాసనసభ భవనం
శాసనసభ భవనానికి సంబంధించి నార్మన్‌ఫోస్టర్‌ సంస్థ ఇప్పటికే అందించిన ఆకృతి విశేషంగా ఆకట్టుకుంటోంది. మరింత మెరుగుపరిచిన శాసనసభ భవన ఆకృతిని ఇటీవల మంత్రిమండలి సమవేశంలో ప్రదర్శించారు. మూడు లేదా నాలుగు భవంతులు, వాటిపైన చతురస్రాకారపు కప్పు, దానిపైన అత్యంత ఎత్తైన ఒక టవర్‌ వచ్చేలా ఆకృతి రూపొందించారు. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామన్న ప్రభుత్వ భావనకు అద్దం పట్టేలా ఈ ఆకృతి ఉంది.

* శాసనసభ, మండలి భవనం మొత్తం ఐదెకరాల విస్తీర్ణంలో ఉంటుంది. భవనం ఎత్తు టవర్‌తో సహా 530 అడుగులు ఉంటుంది. అంటే సుమారు 50 అంతస్తుల ఎత్తుంటుంది.

Link to comment
Share on other sites

స్విస్‌ఛాలెంజ్‌’ ప్రక్రియ కొలిక్కి..!

ఈనాడు, అమరావతి: అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో 6.84 చ.కి.మీ. విస్తీర్ణంలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును సింగపూర్‌కు చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థలకు అప్పగించే ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ఈ ప్రాజెక్టు చేపడుతోంది. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్‌ సంస్థల కన్సార్టియంతో చేసుకునే ఒప్పందం విధివిధానాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెలలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చాక జరిగే మంత్రివర్గ సమావేశంలో దీన్ని ఆమోదించనున్నారు. ఒప్పందంలో పొందుపరుస్తున్న అంశాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ఇచ్చిన స్విస్‌ఛాలెంజ్‌ ప్రతిపాదనలోని లాభనష్టాలను బేరీజు వేసి రాష్ట్రానికి లాభదాయకంగా ఉండేలా ఒప్పందంలోని నిబంధనల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ సోమవారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి ఆధ్వర్యంలో మరో దఫా సచివాలయంలో సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు సీఆర్‌డీఏ అధికారులు సింగపూర్‌ సంస్థల కన్సార్టియంతో ఇప్పటికే పలు దఫాలు చర్చించారు. ఈ చర్చలు ఫలప్రదంగా జరగడంతో ఒప్పందంపై అంగీకారం కుదిరినట్టు తెలిసింది. సీఆర్‌డీఏ అధికారులు సోమవారమంతా ఇదే అంశంపై విస్తృత కసరత్తు చేశారు. సింగపూర్‌ సంస్థల కన్సార్టియంతో చేసుకునే ఒప్పందానికి సంబంధించిన పత్రాలు సిద్ధం చేశారు. మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన వెంటనే సింగపూర్‌ సంస్థల కన్సార్టియంతో అధికారిక ఒప్పందం కుదరనుంది.

Link to comment
Share on other sites

రాజధానిలో రూ.4 కోట్లతో పిరమిడ్‌ కేంద్రం
pir.jpg

నెక్కల్లు(తుళ్ళూరు), న్యూస్‌టుడే: అమరావతిలో అతిపెద్ద పిరమిడ్‌ ధ్యాన కేంద్రాన్ని మే ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్వాహకులు కోటేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం నెక్కల్లులో రూ.4 కోట్ల వ్యయంతో 100 అడుగుల ఎత్తు కలిగిన పిరమిడ్‌ను నిర్మించినట్లు ఆయన చెప్పారు.

Link to comment
Share on other sites

శాసనసభ’ ఎత్తు 530 అడుగులు!

ప్రజా రాజధానికి అద్దం పట్టేలా ఆకృతి

amar2.jpg

 

 

:super:

second picture ayithe, picchuka goodu lopala nunchi bayataku chsutunnatlu vundi. idi ganuka complete ayithe deeni chudataanike vastaremo tourists.

Link to comment
Share on other sites

అమరావతికి ‘టెరీ’
 
636287690454426765.jpg
  • అంతర్జాతీయ స్థాయిలో ‘హరిత’ అధ్యయన కేంద్రం!
  • త్వరలో సీఎంతో భేటీ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతి నగరాన్ని గ్రీన్ సిటీగా నిర్మించేందుకు సీఆర్‌డీఏ పరిధిలో అంతర్జాతీయ స్థాయి అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ‘టెరీ’ సంస్థ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు దూరదృష్టితో చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని టెరీ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ మాధుర్‌ తెలిపారు. మంగళవారం టెరీ కార్యాలయంలో అజయ్‌ మాథుర్‌తో రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఉన్నతస్థాయి బృందం సమావేశమైంది. ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ భేటీలో పాల్గొనగా... సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఇంధన, సీఆర్‌డీఏ సలహాదారు ఏ.చంద్రశేఖరరెడ్డి మాధుర్‌ను స్వయంగా కలిశారు. సీఆర్‌డీఏ పరిధిలో రూ.1.37 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని, మే 15వ తేదీ నాటికి అమరావతి తుది మాస్టర్‌ ప్లాన సిద్ధమవుతుందని శ్రీధర్‌ తెలిపారు. దీంతో, తాము టెరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, మే 3వ వారంలో ముఖ్యమంత్రితో భేటీ అవుతామని అజయ్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

ఏపీ రాజధానికి పుష్కలంగా నీరు
 
636287904880155449.jpg
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి 2050 వరకూ పుష్కలంగా తాగునీటిని అందజేయడంతోపాటు ఈ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్న విధంగా ‘బ్లూ-గ్రీన కాన్సె్‌ప్ట’లో తీర్చిదిద్దేందుకు రూపొందించిన ‘బ్లూ మాస్టర్‌ప్లాన్’ అమలుపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ ఆధ్వర్యంలో విస్తృతంగా చర్చించారు. విజయవాడలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి, సీఆర్డీయే అడిషనల్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, కన్సల్టెంట్‌ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సేకరించిన సమాచారం ప్రకారం ఈ సమావేశంలో చర్చించిన అంశాలిలా ఉన్నాయి..
 
జలాశయాల నిర్మాణంపై..
అమరావతిలో క్రమంగా పెరిగే జనాభా సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, 2050 వరకూ ఈ నగరపు నీటి అవసరాలను తీర్చేందుకు బ్లూ మాస్టర్‌ప్లానులో ప్రతిపాదించిన వైకుంఠపురం రిజర్వాయర్‌ నిర్మాణంపైనా, దాని నుంచి రాజధానిలోని అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేసే విధానంపైన ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిపై నిర్మించదలచిన ఈ జలాశయాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం ద్వారా రాజధానికి పుష్కల నీటి వనరులను అందుబాటులోకి తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. ఈ నేపథ్యంలో ఈ బ్యారేజ్‌ నిర్మాణాంశాలపై నారాయణకు ఉన్నతాధికారులు, కన్సల్టెంట్లు వివరించినట్టు తెలిసింది. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన ద్వారా వైకుంఠపురం జలాశయంలో చేయదగిన నీటినిల్వ పరిమాణం, అక్కడి నుంచి రాజధాని వాసులకు నీటిని అందించేందుకు ఏర్పాట్లు, నీటి శుద్ధీకరణ ప్లాంట్లు ఇత్యాది అంశాల గురించి వారు విశదీకరించినట్టు తెలుస్తోంది. అమరావతికి వరద ముప్పును నిరోధించడంతోపాటు ఏడాది పొడవునా తగినంత నీటిని సరఫరా చేసే లక్ష్యంతో రాజధాని ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో ప్రతిపాదించిన జలాశయాల నిర్మాణంపై సైతం ఈ భేటీలో సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తోంది.

అమరావతి పొడవునా చక్కటి కాలువలను తవ్వి ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించడంతోపాటు వాటిల్లో జలరవాణా వ్యవస్థను అభివృద్ధి పరచడం ద్వారా చౌకైన, కాలుష్యరహితమైన ప్రజారవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సదరు కాలువల్లో నిరంతరం, సరిపడా నీరు పారుతూ ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్లు భోగట్టా.
 
రాజధానిలో నిర్మాణాలకు నీటి సరఫరాపై..
పైన పేర్కొన్న విషయాలతోపాటు అమరావతిలో క్రమంగా ఊపందుకుంటున్న నిర్మాణాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన నీటిని సరఫరా చేయడమెలాగన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారని సమాచారం. ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైన సీడ్‌ యాక్సెస్‌, సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లకు తోడు త్వరలో పనులు మొదలవనున్న ఫేజ్‌-2 రహదారులు, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ వంటి ప్రభుత్వపరమైన నిర్మాణాలకు తోడు రోజురోజుకూ పెరుగుతున్న కట్టడాలకు అవసరమైన నీటిని అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను సాధ్యమైనంత త్వరగా అధిగమించేందుకు తీసుకోవలసిన చర్యలపై సంప్రదింపులు సాగాయని తెలుస్తోంది. రాజధానిలో తొట్టతొలి భారీ ప్రైవేట్‌ నిర్మాణాలైన విట్‌, ఎస్‌.ఆర్‌.ఎం. క్యాంప్‌స్ లు తమ నిర్మాణావసరాలకు, సిబ్బంది తాగునీటికి ఎదుర్కొంటున్న అవస్థలు పునరావృతమవకుండా ఉండాలంటే రాజధాని ప్రాంతంలోనూ, దాని పరిసరాల్లోనూ ఉన్న వివిధ జల వనరుల నుంచి సరిపడినంత నీటి సరఫరాకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించి, సత్వరమే దానిని అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకతను నారాయణ వివరించినట్లు సమాచారం. లేని పక్షంలో రాజధాని ప్రాంతంలో నీటి కొరత తీవ్రమై, అమరావతి నిర్మాణ ప్రక్రియను పరుగులెత్తించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యానికి విఘాతం కలుగుతుందన్నారని తెలిసింది.
 
 
సీఎం సమీక్షకు సన్నద్ధత..
ప్రతి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించే అమరావతి సమీక్షా సమావేశాల్లో భాగంగా రేపు జరగనున్న భేటీలో ప్రస్తావనకు రానున్న అంశాలపై కూడా ఈ మీటింగ్‌లో చర్చించినట్టు సమాచారం. ఏడీసీ, సీఆర్డీయే ఆధ్వర్యంలో రాజధానిలోనూ, రాజధాని ప్రాంతంలోనూ జరుగుతున్న వివిధ పనుల పురోగతి, వాటిల్లో కొన్నింటి విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, గత సమీక్షా సమావేశాల్లో సీఎం ఇచ్చిన ఆదేశాల అమలు తీరుతెన్నులు వంటివి ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయంటున్నారు.
Link to comment
Share on other sites

అమరావతిలో ‘టెరి’ అధ్యయన కేంద్రం

సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న టెరీ డీజీ అజయ్‌మాథుర్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అధ్యయన కేంద్రం ఏర్పాటుకు ఇంధన, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి అధ్యయనంలో ప్రపంచ ప్రఖ్యాతి పరిశోధనాసంస్థ ‘ద ఎనర్జీ, రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌’’ (టెరి) ముందుకొచ్చింది. మంగళవారమిక్కడ టెరి కార్యాలయంలో ‘టెరి’ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌మాథుర్‌తో రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం భేటీ అయింది. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరకూరి శ్రీధర్‌, ఇంధన, సీఆర్‌డీఏ సలహాదారు ఎ.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘అమరావతిని గ్రీన్‌ సిటీగా మార్చడానికి నిరంతర సహకారాన్ని అందించడానికి టెరి సీఆర్‌డీఏ పరిధిలో అంతర్జాతీయ స్థాయి అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. గ్రీన్‌ ఎనర్జీ నగరాల వృద్ధిలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని టెరి పంపనుంది. గ్రీన్‌ ఎనర్జీ విధానాలు వల్ల 40 నుంచి 50శాతం విద్యుత్తు పొదుపు అవుతుందని’ అజయ్‌మాథుర్‌ తెలిపారు. పట్టణ, నగర ప్రాంతాల్లో వీధి దీపాలను 100శాతం ఎల్‌ఈడీ బల్బులు అమర్చడంతోసహా వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జైన్‌ వివరించారు. అమరావతి సాధించిన ప్రధాన అభివృద్ధి అంశాలను దృశ్య విధానంలో శ్రీధర్‌ వివరించారు. ‘‘అజయ్‌మాథుర్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం మే 3వ వారంలో సీఎం చంద్రబాబుతో భేటీ కానుంది. ఈ భేటీలో టెరి అధ్యయన కేంద్రం ఏర్పాటుపై చర్చిస్తారు’’ అని శ్రీధర్‌ తెలిపారు. సీఆర్‌డీఏ పరిధిలో రూ.1,37,832 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయని, త్వరలోనే అవి కొలిక్కి వస్తాయని శ్రీధర్‌ తెలిపారు. మే 15 నాటికి అమరావతి తుది మాస్టర్‌ప్లాన్‌ ఎంపిక పూర్తవుతుందన్నారు.

Link to comment
Share on other sites

శరవేగంగా పరుగులు పెడుతున్న అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు...   26 April 2017 Hits: 16  

seed-access-road-26042017.jpg
share.png

ఏం జరుగుతుంది అమరావతిలో, అనే వారికి దిమ్మ తిరిగే సమాధానం... అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు... అడుగడుగునా, అంతర్జాతీయ స్థాయి డిజైన్లు, అత్యుత్తమ మౌలిక వసతులతో నిర్మిస్తున్న అమరావతికి జీవనాడిగా పేర్కొంటున్న సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు పరుగులు పెడుతున్నాయి.... ఈ రహదారి నిర్మాణం చూస్తుంటే, ఎదో ఒక ఎయిర్ పోర్ట్ రన్ వే లాగా, అద్భుతంగా ఉంది అంటున్నారు చూసిన వాళ్ళు.. ఇంత తక్కువ సమయంలో, ఇంత ఫాస్ట్ గా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న తీరు చూసి, చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంటే ఇలానే ఉంటుంది అంటున్నారు ప్రజలు... అమరావతి లాంటి ఒక మహానగర నిర్మాణానికి, సరైన రోడ్ కనెక్టివిటీ ఎంతో ముఖ్యం... అందుకే, ముందుగా సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు చేపట్టారు... జూన్ నాటికి పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో పనులు సాగుతున్నాయి. ఈ రోడ్డు చూస్తే రాజధాని భవిష్యత్తు అర్థం కావాలని చంద్రబాబు అభిప్రాయం. అందుకు తగ్గట్టే పనులు జరుగుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి ప్రతి వారం ఈ రోడ్డు పనులను సమీక్షిస్తున్నారు.

అటు నాలుగు వరుసలు.. ఇటు నాలుగు వరుసలు! మొత్తం 200 అడుగుల వెడల్పు రోడ్డు. మధ్యలో మెట్రో కోసం కొంత స్థలం కేటాయింపు. అటూ ఇటూ పచ్చదనానికి మరికొంత స్థలం. పాదచారులకు, సైక్లింగ్ చేసేవారికి ప్రత్యేకమైన ట్రాక్ లు!! వెరసి.. రాజధాని అమరావతి దారి.. ఎనిమిది వరుసల రహదారిగా ఉండబోతోంది.. ముందుగా నాలుగు వరుసల రహదారి నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 8 వరుసల రహదారిగా మారుస్తారు.

ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు స్వరూపం:
కృష్ణా కరకట్టకు సమాంతరంగా ఉండవల్లి నుంచి పశ్చిమ దిక్కున ఉన్న దొండపాడు మధ్య 18.27 కిలోమీటర్ల పొడవున 60 మీటర్ల(196.80 అడుగుల) వెడల్పుతో, రూ.215 కోట్ల అంచనా వ్యయంతో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఈ రోడ్డే అమరావతిలోని అన్ని రహదారుల్లో ప్రధానమైనది, భారీది. దీనిలో భాగంగా ఇరువైపులా మూడేసి వరుసల సాధారణ వాహనాల లేన్లు(క్యారేజ్‌ వే), మధ్యలో 2 వరుసల బస్‌ ర్యాపిట్‌ ట్రాన్సపోర్టు (బీఆర్టీ) వరుసలతో మొత్తం 8 వరుసలుంటాయి. 2 వైపులా ఉండే క్యారేజ్‌ మార్గాల తర్వాత కొంత విస్తీర్ణంలో హరితం, అనంతరం నాన మోటార్‌ ట్రాన్సపోర్టు(ఎనఎంటీ) జోన ఏర్పాటు చేస్తారు. ఈ జోనలో భాగంగా సైక్లింగ్‌ ట్రాక్‌లు, అనంతరం మళ్లీ కొద్దిపాటి విస్తీర్ణంలో మొక్కలు, ఆ తర్వాత నడక మార్గాలు ఉంటాయి. బీఆర్టీ జోన, క్యారేజ్‌ మార్గాలపై పడే వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు నేలలోకి వెళ్లేందుకు వీలుగా బీఆర్టీ జోనకు ఇరువైపులా, క్యారేజ్‌ మార్గాలు-ఎనఎంటీ జోన్ల మధ్య డ్రెయిన్లు ఏర్పాటు చేస్తారు.

 

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు రెండో ప్యాకేజీలో భాగంగా 3.2 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారు. ఈ రోడ్డు మార్గంలో కృష్ణా డెల్టా పశ్చిమ కాలువ ఉంది. దీనిపై నిర్మించే ఎలివేటెడ్‌ హైవే(ఫ్లైఓవర్‌) 1.5 కిలోమీటర్లు ఉంటుంది. కాలువపై నిర్మించే వంతెన ఐకానిక్‌గా ఉండాలని సీఎం సూచించారు. మరికొన్ని నెలల్లో ఈ ప్యాకేజీకి కూడా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారని సీసీడీఎంసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి పేర్కొన్నారు.

72.16 అడుగుల్లో గ్రీన జోన్లు!
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెడల్పు 196.80 అడుగులు కాగా.. దాని పొడవునా, అదనంగా మరొక 72.16 అడుగుల(22 మీటర్ల) మేర గ్రీన బెల్టులను అభివృద్ధి పరచనున్నారు. అంటే వీటితో కలుపుకొంటే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెడల్పు 268.96 అడుగులు(82 మీటర్లు) అవుతుంది

నాగార్జున constructions కంపెనీ, దీన్ని 2017 జూన్ నాటికి పూర్తీ చేసే విధంగా పనులు చేస్తుంది. ఈ రహదారి పూర్తి అయితే, రాజధాని గ్రామాల్లో ఎక్కడికైనా నిమషాల్లో చుట్టేయవచ్చు.

సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న తీరు ఈ వీడియోలో చూడవచ్చు...

Link to comment
Share on other sites

అమరావతి డిజైన్స్‌పై రెండు కమిటీలు
 
636288156672850970.jpg
అమరావతి: అమరావతి డిజైన్స్ పై రెండు కమిటీలు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు సీఆర్డీఏపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులతో ఒకటి, ప్రిన్సిపల్ సెక్రటరీలతో మరో కమిటీ వేయనున్నారు. కమిటీల నివేదికలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం సీఎం తీసుకోనున్నారు. వచ్చే నెల 2,3,4 తేదీల్లో మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ లండన్ పర్యటించనున్నారు. నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో డిజైన్స్‌పై చర్చించనున్నారు.
Link to comment
Share on other sites

అమరావతి డిజైన్లపై మరో రెండు కమిటీలు

26brk120a.jpg

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర ఆకృతుల కోసం మరో రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. డిజైన్లపై మరింతగా చర్చించి ఎక్కువ ఇన్‌పుట్స్‌ తీసుకోవాలని సీఎం సూచించారన్నారు. మంత్రులలతో ఒక కమిటీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీలతో మరో కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఈ కమిటీ సూచనల్ని కేబినెట్‌లో పెట్టి వారి సలహాలు తీసుకొని డిజైన్లను ఖరారు చేస్తామని తెలిపారు. మే నెల 2,3,4 తేదీల్లో లండన్‌లో పర్యటించనున్నట్టు చెప్పారు. నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో సమావేశం కానున్నట్టు తెలిపారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...