Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని రాజసం
శాసనసభ.. అద్భుత శిలాశోభితం
3.05 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో సముదాయం ఏర్పాటు
శాసనసభకు నాలుగు నమూనాలు
ఈనాడు - అమరావతి

image.jpg

అమరావతిలో నిర్మించతలపెట్టిన శాసనసభ ప్రాంగణ సముదాయాలకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ నాలుగు రకాల ప్రాథమిక నమూనాలను అందజేసింది. ఈ భవనాల సముదాయాన్ని 3,05,673.53 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించేలా ప్రతిపాదించింది. ఇందులో శాసనసభ భవనమే 35 శాతం విస్తీర్ణంలో ఉంటుంది. శాసనసభ, మండలికి మధ్యలో కేంద్ర సభామందిరం ఉండేలా రూపొందించారు. ప్రతి నమూనాలోనూ 3 గోపురాలను పోలిన నిర్మాణాలు ప్రధాన ఆకర్షణ.



అమరావతిలో నిర్మించతలపెట్టిన శాసనసభ ప్రాంగణ సముదాయాలకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ నాలుగు రకాల ప్రాథమిక నమూనాలను అందజేసింది. ఆ వివరాలు..
* భవనాలు జీప్లస్‌వన్‌గా నిర్మించేలా ప్రతిపాదించారు. భవనం కింది భాగంలో శాసనసభ ప్రధాన సమావేశ మందిరం ఉంటుంది. మధ్యలో ఎత్తైన ఆకారం ఏర్పాటుచేస్తారు. 250మంది సభ్యులు కూర్చునే సామర్థ్యంతో శాసనసభ ఉంటుంది. ఈ భవనంలోనే శాసనసభ్యుల లాంజ్‌, ఫలహారశాలలు ఉంటాయి.
* శాసనసభాపక్ష కార్యాలయాలు, కమిటీ హాళ్లు, ప్రత్యేక సమావేశ మందిరాలు ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నాలుగు కమిటీ హాళ్లను, సభాకమిటీ ఛాంబర్లు 25 ప్రతిపాదించారు.
* మొదటి అంతస్తులో సభాపతి, ఉపసభాపతి ఛాంబర్లు, సమావేశ మందిరాలుంటాయి. అక్కడే సందర్శకుల కోసం నిరీక్షణ మందిరాలుంటాయి.
* ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యాలయం, సందర్శకులకు నిరీక్షణ గదులుంటాయి.
* 28 మంది మంత్రులకు ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటుచేస్తారు.
* ప్రతిపక్ష నేతకు ప్రత్యేక కార్యాలయం ఉంటుంది. ఆ పక్కనే ప్రభుత్వ చీఫ్‌విప్‌, విప్‌లకు సంబంధించిన గదులు ఇదే అంతస్తులో ఉంటాయి.
* శాసనసభ పరిపాలనకు సంబంధించి కార్యదర్శులు, ఉపకార్యదర్శులు, సహాయ కార్యదర్శుల కార్యాలయాలు కింది అంతస్తులో ఉంటాయి. ఇక్కడే సమావేశ మందిరాలుంటాయి. పై అంతస్తులో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 40 ప్రత్యేక గదులుంటాయి.
* శాసనసభ ప్రాంగణంలో వాహనాలను నిలపడానికి తగినంత స్థలం కోసం ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యమంత్రి వాహన శ్రేణిలో పది వాహనాలు, సభాపతి వాహన శ్రేణిలో మూడు వాహనాలు నిలిపేలా ప్రతిపాదించారు. దాంతో పాటు శాసనసభా ప్రాంగణంలో 450 కార్లు, 300 ద్విచక్రవాహనాల పార్కింగ్‌ స్థలం ప్రతిపాదించారు.

శాసనమండలి
* కింది అంతస్తులో వంద మంది కూర్చునే సామర్థ్యంతో ఉంటుంది. ఇందులో సభ్యుల లాంజ్‌, పఠన కేంద్రాలుంటాయి. మహిళా సభ్యులకు ప్రత్యేక గదులుంటాయి.
* శాసనసభాపక్ష కార్యాలయాలు ఆరు, మూడు కమిటీ హాళ్లు, ప్రతిపక్ష నేతలకు ప్రత్యేక గది, సభా కమిటీ గదులు పది ఉంటాయి.
* పై అంతస్తులో మండలి ఛైర్మన్‌, డిప్యూటీఛైర్మన్ల ఛాంబర్లు, వారి సందర్శకుల నిరీక్షణ మందిరాలు, సెక్యూరిటీ ఛాంబర్లు, ముఖ్యమంత్రి ఛాంబర్‌ ఉంటాయి. వాటిని ఆనుకునే మంత్రులకు 20 గదులు, చీఫ్‌విప్‌, విప్‌ల గదులుంటాయి.
* ఇదే అంతస్తులో అధికారులకు ప్రత్యేక లాంజ్‌ ఉండేలా ప్రతిపాదించారు.

మొదటి నమూనా
26ap-main2c.jpg

చతురస్ర ‘యు’ ఆకారంలో ఉంటుంది. గోపుర ఆకారాలను పోలిన మూడు ఎత్తైన భవనాలుంటాయి. ఇది మొత్తం ఏడు భవనాల సముదాయంగా ఉంటుంది. అందులో నాలుగు చతురస్రాకారంలో ఉంటాయి. ఈ నమూనాకు సంబంధించి మళ్లీ మూడు రకాల నమూనాలను ఆ సంస్థ ప్రతిపాదించినా ప్రధాన భావం మాత్రం చతురస్ర యు ఆకారమే.


రెండో నమూనా

దీర్ఘచతురస్రాకారంలో ఉండే నమూనా. మధ్యలో ఎత్తైన గోపురాకారపు భవనం.. దానికంటే తక్కువ ఎత్తులో అటుఇటు రెండు గోపురాలను పోలిన ఆకారాలతో ఉంటుంది. ఉద్యానవనాలు, జలశోభితంగా అలరారుతుంది.

 

మూడో నమూనా
image.jpg

దీర్ఘచతురస్రాకార ‘యు’ రూపంలో మధ్యలో ‘జెల్లీ చేప’ను పోలిన నమూనా ఇది. ఒకవైపు పూర్తి ఖాళీగా ఉంటుంది. మిగిలిన ప్రాంతంలో మూడు ఎత్తైన గోపుర ఆకారాలుంటాయి. భవనం మధ్యలోనే శాసనసభ, మండలి, కేంద్ర సభామందిరాలుంటాయి.

 

నాలుగో నమూనా
image.jpg

స్తంభాల ఆధారంతో నీటిపైన నిలిచి ఉండేలా కనిపించే నమూనా ఇది. నాలుగువైపులా స్తంభాలు, మధ్యలో మూడు గోపురాలను పోలిన భవనాలు నిలిచి ఉండేలా రూపొందించారు. భవనం కింద జల కళ, పుష్పసోయగం కనిపిస్తుంది.


కేంద్ర సభామందిరం

* పార్లమెంటు తరహాలో ఈ సభామందిరం ఉంటుంది. ఈ భవనానికి అటుఇటు శాసనసభ, మండలి భవనాలుంటాయి.
* కేంద్ర సమావేశ మందిరం ఎత్తైన గోపురం తరహాలో కనిపిస్తుంది. శాసనసభ, మండలి సంయుక్త సమావేశాలను ఇందులో నిర్వహించేలా ప్రతిపాదించారు. ఈ భవనానికి అనుసంధానంగానే శాసనసభ గ్రంథాలయం, పీరియాడికల్స్‌, బృంద చర్చల గదులుంటాయి.
* ఈ ప్రాంగణంలోనే తపాలా కార్యాలయం, రైల్వేరిజర్వేషన్‌ కౌంటర్‌, బ్యాంకు, ఏటీఎం, ఆసుపత్రి, ఫలహారశాల, పాస్‌ల జారీ కేంద్రం, రహదారులు, భవనాల శాఖ కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం, విద్యుత్తు ఉపకేంద్రాలుంటాయి.

26ap-main2e.jpg

Link to comment
Share on other sites

న్యాయదేవతకు విరుల దండ!
విశాలమైన, పుష్పశోభిత న్యాయ నగరం
8.09 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
హైకోర్టు భవన ప్రాంగణ సముదాయ నమూనా ఇలా..
ఈనాడు - అమరావతి
image.jpg

రాజధానిలో రాష్ట్ర హైకోర్టు భవన సముదాయం ప్రత్యేక ఆకర్షణగా నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. వాటికి అనుగుణంగా నార్మన్‌ ఫాస్టర్‌ సంస్థ మూడు రకాల నమూనాలను రూపొందించింది. హైకోర్టు ప్రాంగణాన్ని 8,09,865.80 చ.అడుగుల విస్తీర్ణంలో ఉండేలా ప్రతిపాదించింది. దీని పరిధిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల న్యాయస్థానాలు, వారి ఛాంబర్లు, పరిపాలన భవనం తదితరాలను రూపొందించింది.

రాజధానిలో రాష్ట్ర హైకోర్టు భవన సముదాయం ప్రత్యేక ఆకర్షణగా నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. వాటికి అనుగుణంగా నార్మన్‌ ఫాస్టర్‌ సంస్థ మూడు రకాల నమూనాలను రూపొందించింది.

మొదటి నమూనా
image.jpg

రెండు పొడవాటి ‘ఎల్‌’ ఆకార భవన సముదాయాలు కుడిఎడమల చివరలను ఆక్రమిస్తూ ఉంటాయి. వాటి ముందు తక్కువ ‘ఎల్‌’ ఆకారాల్లో మొత్తం తొమ్మిది భవన సముదాయాలు ఉంటాయి. ముందుభాగంలో అటుఇటు చివరల్లో రెండు దీర్ఘ చతురస్రాకార భవనాలుంటాయి. ఈ నమూనాలో హైకోర్టు ప్రాంగణం 18 భవనాల సముదాయంగా ఉంటుంది. ఖాళీభాగాల్లో పుష్ప శోభిత ఉద్యానవనాలు, ఫౌంటేన్లతో ఆకర్షణీయంగా ఉంటుంది.

రెండో నమూనా

అటుఇటు దీర్ఘ చతురస్రాకార భవనాలతో ఉన్న నమూనా ఇది. ఇందులో మొత్తం 19 భవనాలు ఉంటాయి. ఒకవైపు ఎనిమిది, మరోవైపు ఏడు భవనాల చివర మూడు భారీ పెద్ద భవనాలు, ప్రవేశమార్గం వద్ద పెద్ద భవనంతో రూపొందించిన నమూనా ఉంటుంది. మధ్యలో ఖాళీ స్థలంలో ఉద్యానవనాలుంటాయి.

మూడో నమూనా

ప్రతి భవనం కూడా చతురస్రాకారంలో ఉండే నమూనా ఇది. రెండు వరసల భవనాలుంటాయి. ఎనిమిది భవనాల సముదాయంతో ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం, ఇతర భవనాలుంటే.. వాటి చుట్టూ మరో 15 చతురస్రాకార భవనాలు ఉంటాయి.

‘న్యాయ నగరం’ ఆకర్షణలు ఇవి
* ప్రతి నమూనా కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం కేంద్రంగా చేసుకుని మిగిలిన ప్రాంతం విస్తరించేలా ఉంటుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్తు భవనాలను ప్రతిపాదించారు. ప్రధాన న్యాయమూర్తి భవనం గ్రౌండ్‌ఫ్లోరులో ఉంటుంది. రిజిస్ట్రార్‌ కోసం ప్రత్యేకంగా భవన సముదాయం ఉంటుంది. వారికి ప్రత్యేక లాంజీలు ఉంటాయి.
* ప్రత్యేకించి మీడియేషన్‌ కేంద్రం, హైకోర్టు మ్యూజియం ఉంటాయి.
* సందర్శకుల కోసం ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేక లాంజీ, ప్రత్యేక సచివాలయం ఉంటాయి.
* ఫుల్‌కోర్టు మీటింగ్‌ హాలు పేరుతో విశాలమైన సమావేశ మందిరం, న్యాయమూర్తుల కోసం మరో ప్రత్యేక సమావేశ మందిరం ఉంటుంది.
* యోగా కేంద్రం, వ్యాయామశాలలు ఉంటాయి.

26ap-story1c.jpg

Link to comment
Share on other sites

కూడలి.. ప్రగతి కూర్పు
లండన్‌ వీధులను పోలిన నిర్మాణాలు
26ap-main9a.jpg

ఈనాడు, అమరావతి: పరిపాలన నగర స్థూల ప్రాథమిక ప్రణాళికలో మంత్రుల నివాస సముదాయాలు, విద్యాలయాలు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, ఇతర భవనాలను 1,24,98,510 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రజోపయోగ స్థలాల్లో లండన్‌లోని ట్రఫాల్గర్‌, స్లోన్‌, డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌ కూడళ్లను పోలిన మూడు నగరకూడళ్లను నిర్మించేందుకు నార్మన్‌ఫోస్టర్‌ సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాంతాల్లో హోటళ్లు, దుకాణ సముదాయాలు, ఆహ్లాదకర పార్కులు, జలాశయాలు, కాల్వలు, ఫౌంటెయిన్‌లు ఏర్పాటు చేయనున్నారు. 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలన నగరంలో ప్రజోపయోగ స్థలాల్లో 1,47,17,490 చ.అడుగుల్లో పచ్చదనం కల్పిస్తారు. 3,63,820 చ.అడుగుల్లో నగరకూడళ్లను నిర్మించనున్నారు. కాల్వలు, జలాశయాలు 40,46,154 చ.అడుగుల్లో ఉండనున్నాయి.

26ap-main9b.jpg

* ప్రజోపయోగ స్థలాల్లో పార్కులు, వనాలు, నగరకూడళ్లు, ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో మొత్తం 3,63,820 చ.అడుగుల్లో కూడళ్లు నిర్మించనున్నారు. కూడళ్లు, ప్లాజాలు 17,22,226 చ.అడుగుల్లో నిర్మిస్తారు.
* లండన్‌లోని ట్రఫాల్గర్‌ కూడలిని పోలిన నగరకూడలిని 1,05,480 చ.అడుగుల్లో నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇక్కడే తిరుమల ఆలయ కోనేరు నమూనాలో 1,07,630 చ.అడుగుల్లో కోనేరు నిర్మించనున్నారు.

26ap-main9c.jpg

* లండన్‌లోని స్లోన్‌ కూడలిని పోలిన మరొక నగరకూడలిని 35,790 చ.అడుగుల్లో నిర్మించనున్నారు.
* లండన్‌లోని డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌ కూడలి నమూనాలో పట్టణ (అర్బన్‌) నమూనాను నిర్మించనున్నారు. మొత్తం పట్టణ కూడలి 16,30,732 చ.అడుగులు కాగా ఇందులో ప్రతిపాదిత పట్టణ కూడలి 17,220 చ.అడుగులు ఉంటుంది.
* బృహత్‌ ప్రణాళిక ప్రకారం 51శాతం పచ్చదనం, 10శాతం కాల్వలు, జలాశయాలు ఉండనున్నాయి. 14శాతం రహదారులు, 25శాతం భవనాల నిర్మాణం ఉంటుంది.

భూవినియోగం ఇలా..
ప్రభుత్వ సంస్థలు 30,79,555 చ.అడుగులు, మంత్రుల నివాస సముదాయం 5,95,244 చ.అ., సాంస్కృతిక కార్యక్రమాలకు భవనాలు 11,19,447 చ.అ., విద్యా సంస్థలు 5,62,414 చ.అ., కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు 19,15,976 చ.అ., రిటెయిల్‌ 19,37,504 చ.అ., తక్కువ ఎత్తు ఉండే భవనాలు 9,46,147 చ.అ., మధ్యస్థంగా ఉండే భవనాలు 15,51,079 చ.అ., ఎత్తు ఎక్కువగా ఉండే భవనాలు 8,34,203 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.

Link to comment
Share on other sites

అమరావతి రాజధానిలో మరో మైలురాయి
 
636263769058149432.jpg
అమరావతి రాజధానిలో ఇది మరో మైలురాయి. సీఎం చంద్రబాబునాయుడి ఉక్కు సంకల్పానికి ఇదో నిదర్శనం. భవ్య నగరిని సృష్టించి చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకునేందుకు ఆయన చేస్తున్న కృషికి తార్కాణం. నేడు(ఉగాది శుభదినాన) రాజధానిలోని యర్రబాలెం సమీపంలో తొలి ఏడు ప్రాధాన్య రోడ్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ మహత్తర ఘట్టానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.
మంగళగిరి/గుంటూరు:
విసుగు లేదు.. విరామమే లేదన్నట్టు అమరావతి నగర నిర్మాణానికి వడివడిగా మైలురాళ్లను దాటిపోతున్నారు. ఈ క్రమంలో అమరావతి నగర రూపురేఖలకు తొలిమెట్టుగా ప్రధాన రహదార్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే రూ.600 కోట్ల వ్యయంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులను ఆరంభించారు. ఉగాది పర్వదినాన 18 ప్రధాన సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లకు గాను తొలి ఏడు ప్రాధాన్య రోడ్లకు ఎర్రబాలెంలో శంకుస్థాపన చేయనున్నారు. యావత్‌ ప్రపంచం యమహా నగరి.. అమరావతి అని శ్లాఘించేలా ఓ భవ్య నగరిని సృష్టించి చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకునేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. ఆయన ఉక్కు సంకల్పానికి ప్రకృతి సైతం సహకరించింది. అందుకే ఏటా రెండేసిమార్లు పది చదరపు కిలోమీటర్లను ముంచెత్తే కొండవీటివాగుకు ఈ రెండేళ్లు వరదల్లేవు. ఇదే అదనుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ కొండవీటివాగు వరదలకు శాశ్వత ప్రాతిపదికన ముక్కుతాడేస్తూ భవ్య నగరి అమరావతికి ముప్పు లేకుండా రూ.430 కోట్ల వ్యయంతో ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. పదేళ్ల సమయమున్నా రెండేళ్ల వ్యవధిలోనే మొత్తం పాలనా యంత్రాంగాన్ని సమూలంగా అమరావతికి రప్పించి శ్రీఘ్రమైన స్వపరిపాలన చూపించారు.


రూపురేఖలు మార్చే రహదారులు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రహదారుల పాత్ర చాలా ప్రముఖమైంది. అమరావతిలో ప్రధాన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతోపాటు మరో మూడు మేజర్‌ రహదారులు, 18 సబ్‌ఆర్టీరియల్‌ రహదార్లు, మరో 17 ఆర్టీరియల్‌ రహదారులు ఏర్పాటు కానున్నాయి. వీటిలో సీడ్‌యాక్సెస్‌ రోడ్డును 16వ నెంబరు జాతీయ రహదారి నుంచి రాజధాని ప్రాంతానికి అనుసంధానం చేస్తూ రూ.600 కోట్ల వ్యయంతో 21.47 కిలోమీటర్ల పొడవునా నిర్మాణ పనులను రెండు దశలుగా చేపట్టారు. ఉండవల్లి నుంచి బోరుపాలెం వరకు 18.3 కిలోమీటర్ల పొడవునా తొలిదశ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 18 సబ్‌ఆర్టీరియల్‌ రహదార్లలో ఏడు ప్రాధాన్య రోడ్లను రూ.995 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిపించనున్నారు.
అమరావతి నగరానికి 2015 జూన్‌ 6న తాళ్లాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబుచే భూమిపూజ
అమరావతి నగరానికి 2015 అక్టోబరు 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
తాత్కాలిక సచివాలయానికి 2016 ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన
తాత్కాలిక సచివాలయానికి 2016 జూన్‌ 29న ముఖ్యమంత్రి చంద్రబాబుచే ప్రారంభోత్సవం
రాజధానికి ప్రధానమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు 2016 జూన్‌ 25న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన
శంకుస్థాపన వేదిక అయిన యర్రబాలెంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. యర్రబాలెం-పెనుమాక రోడ్డు వెంబడి సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లను కేవలం రెండు రోజుల వ్యవధిలో పూర్తిచేశారు. రహదారి పక్కగా శంకుస్థాపన శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దాని పక్కనే సభా వేదికను ఉత్తరముఖంగా భారీ ఎత్తున నిర్మించారు. సభా ప్రాంగణమంతా టెంట్లను ఏర్పాటు చేశారు. సుమారు ఐదు వేలమందికి పైగా కూర్చొనేందుకు సీట్లను ఏర్పాటు చేశారు. వీఐపీ లాంజ్‌ పేరుతో మరో ఆరేడొందల మందికి ప్రత్యేకంగా సీటింగ్‌ సౌకర్యం కల్పించారు. టెంట్లతోపాటు ప్రాంగణంలో ఎయిర్‌ కూలర్స్‌ను ఉంచారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.
ఒక్కో రోడ్డు వెడల్పు.. 50 మీటర్లు
అనుమతించే వేగం.. 40 నుంచి 60 కిలోమీటర్లు
అదనంగా.. బీఆర్‌టీఎస్‌, ఎంఆర్‌టీఎస్‌ లేనలు
కాలిబాట.. 2 మీటర్లు
సైకిల్‌ వే.. 2 మీటర్లు
మొక్కలకు.. 2 మీటర్లు
పార్కింగ్‌.. అనుమతించరు
రవాణా సౌకర్యాలు.. బస్‌ల రాకపోకలు, బస్టాప్‌లు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా రాజధానిలోని యర్రబాలెం, గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అర్బన ఎస్పీ త్రిపాఠి తెలిపారు. బుధవారం ఉదయం యర్రబాలెంలో 6 రహదారుల నిర్మాణం ప్రారంభోత్సవానికి, సాయంత్రం 4.30 గంటలకు అరండల్‌పేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరవుతున్నారన్నారు. బందోబస్తులో భాగంగా రోప్‌ పార్టీ, బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఏఎన్‌ఎస్‌, క్యూ ఆర్‌ టీమ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. యర్రబాలెంలో 8 మంది డీఎస్పీలు, 13 మంది సీఐలు, 28 మంది ఎస్‌ఐలు, 30 మంది ఏఎస్‌ఐ/హెచ్‌సీలు, 270 మంది కానిస్టేబుళ్లు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు, ఏఆర్‌ బలగాలను బందోబస్తుకు నియమించినట్లు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆరుగురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 75 మంది ఏఎస్‌ఐ/హెచ్‌సీ, 240 మంది కానిస్టేబుళ్ళు, ఇరువురు మహిళా కానిస్టేబుళ్లు, ఏఆర్‌ సిబ్బంది నియమించినట్లు పోలీసులు తెలిపారు. మొదటి రోడ్డు కృష్ణాయపాలెం నుంచి నెకల్లు (పశ్చిమ హద్దు) వరకు నిర్మిస్తారు. రెండో రోడ్డుని ఉద్ధండ్రాయునిపాలెం నుంచి నిడమర్రు (దక్షిణ హద్దు) వరకు నిర్మిస్తారు. మూడు, నాలుగు రోడ్లను వెంకటపాలెం నుంచి నవులూరు వరకు, బోరుపాలెం నుంచి శాకమూరు వరకు నిర్మిస్తారు. ఐదు, ఆరు, ఏడు రోడ్లను పెనుమాక నుంచి ఐనవోలు, మంగళగిరి నుంచి నీరుకొండ, అబ్బరాజుపాలెం నుంచి నెక్కల్లు వరకు నిర్మిస్తారు.
Link to comment
Share on other sites

అమరావతికి ఏడు డైమండ్లు: చంద్రబాబు


అమరావతి:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో  ఏడు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతిలో పరిపాలన భవనాలకు చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఏడు రహదారుల నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. రూ.915 కోట్లతో నిర్మించనున్న ఈ ఏడు రోడ్లను నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు రోడ్లు రాజధానికి ఏడు డైమండ్లు అని అభివర్ణించారు. ఈ ఏడు రోడ్లను వచ్చే ఉగాదికల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అందుకు అందరూ సహకరించాలని కోరారు.

 

భవిష్యత్‌లో ఒలింపిక్స్‌ ఇక్కడే నిర్వహించేలా అమరావతిని తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడు ప్రధాన రహదారులతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో  ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుందన్నారు. స్థిర నివాసంతో పాటు పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు అమరావతి కేంద్రం అవుతుందని చంద్రబాబు అన్నారు. ఇక ఉండవల్లి, పెనుమాక, నిడమర్రులో కొంతమంది రైతులు భూములు ఇవ్వలేదని, వారు కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించి భూములు ఇవ్వాలని ఆయన సూచించారు.

కాగా ఈ రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం 331 ఎకరాలను సమీకరించింది. అయితే యర్రబాలెంలో మరో 12.50 ఎకరాలను రైతులు సమీకరణకు ఇవ్వలేదు. మరోవైపు రహదారుల నిర్మాణానికి రూ.915 కోట్లను ప్రపంచ బ్యాంక్‌ ఇస్తుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నప్పటికీ ... ఆ ప్రతిపాదనలకు ఇప్పటివరకూ ప్రపంచ బ్యాంక్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని సమాచారం. దీంతో హడావుడిగా శంకుస్థాపన చేసినా...పనులు జరగడం కష్టమేనని కొందరు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

ఆకర్షణీయంగా అమరావతి!

ప్రాథమిక వసతులతో ప్రణాళికలు సిద్ధం

రహదారుల నుంచి విపత్తు నిర్వహణ వరకు మొత్తం 13

అంతర్జాతీయ నగరాల అధ్యయనంతో రూపకల్పన

2050ని దృష్టిలో పెట్టుకొని కసరత్తు

సమస్యలే లేని నగరంగా అవతరణ

ఈనాడు - అమరావతి

30ap-main1a.jpg

అమరావతిని ఆకర్షణీయ(స్మార్ట్‌) నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక వసతుల పరంగా కావాల్సిన ప్రణాళికలన్నీ రూపొందాయి. అంతర్గత రహదారుల నుంచి మంచినీరు, విద్యుత్తు సరఫరా, మురికినీటి పారుదల వ్యవస్థ, వరద నీటి నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, విపత్తు నిర్వహణ సహా మొత్తం 13 రకాల ప్రణాళికలు తయారయ్యాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, బ్రిటన్‌ నుంచి జపాన్‌ వరకు ప్రపంచం నలుమూలల ఉన్న అంతర్జాతీయ నగరాల్లోని ప్రాథమిక వసతుల్ని అధ్యయనం చేసి వీటిని రూపొందించారు. నివసించే జనాభా నుంచి ఏర్పాటయ్యే పరిశ్రమల వరకు ప్రతి అంశంలోనూ 2050 సంవత్సరం నాటికి అవసరమయ్యే వసతుల్ని అంచనా వేసి వాటికి అనుగుణంగా తయారుచేశారు. దేశంలోని నగరాలన్నింటిలో నిత్యం ఎదురయ్యే సమస్యలేమీ ఇక్కడ ఆలోచించటానికి కూడా అవకాశం లేనంత స్థాయిలో వీటిని రూపొందించారు. కాలుష్యానికి వీలు లేని రీతిలో పూర్తి పర్యావరణ అనుకూల విధానాల్ని అనుసరిస్తున్నారు. ప్రతి అంశంలోనూ ఆయా వసతుల ఏర్పాటు, నిర్వహణ సులువుగా ఉండేందుకు నగరాన్ని జోన్లగా విభజించారు. ఏడాదిన్నర కిందట సింగపూర్‌ సంస్థలిచ్చిన నగర ప్రణాళికల ఆధారంగానే అన్నిరకాల సౌకర్యాలు సమకూర్చేందుకు వీలుగా... చైనాకు చెందిన గిజౌ మారిటైం సిల్క్‌ రోడ్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌(జీఐఐసీ) ఆర్‌వీ అసోసియేట్స్‌ సంయుక్తంగా ‘స్మార్ట్‌ సిటీ అమరావతి’ పేరుతో సమీకృత ప్రాథమిక వసతుల మాస్టర్‌ ప్లాన్‌ని రూపొందించాయి. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విడుదల చేశారు. వీటి ఆధారంగానే సవివరమైన అంచనాలతో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. సమీకరణలో భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చే వివరాలతో కూడిన ప్రణాళికలను ఇందులో పొందుపరిచారు.

విపత్తుపై అప్రమత్తత

తుపాను, భూకంపాలను ఎదుర్కొనేలా ప్రణాళిక

ఈనాడు - అమరావతి

తుపాన్లు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి రాజధాని ప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అప్రమత్తత చర్యలు పాటించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈ ప్రాంతంలో గత వందేళ్లలో వచ్చిన తుపాన్ల నుంచి వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. గత వందేళ్లలో 72 తుపాన్లు రాష్ట్రంలో తీరం దాటాయి. ఇందులో 46 తీవ్ర తుపాన్లు. కృష్ణా తీరంలోని కొండవీటివాగు, పాలవాగుకు, కాలువలకు వరద తాకిడి ఉంటుంది. మరో వైపు వేసవిలో ఇక్కడ వడగాలుల ప్రభావం ఎక్కువ. ఈ క్రమంలో ప్రభుత్వపరంగానే కాకుండా ప్రజల్లో కూడా అప్రమత్తత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

* విపత్తు సంభవించే విషయాన్ని ముందుగానే హెచ్చరించే వ్యవస్థ ఏర్పాటు. ప్రమాదం తీవ్రతపై అవగాహన కల్పించడంతోపాటు వర్షపాతంతోపాటు నదిలో నీటిమట్టం, హెచ్చరికల గురించి రేడియో/టీవీ, ఫోన్‌ల ద్వారా సమాచారం ఇవ్వడం, ప్రతి ఇంటికీ విపత్తు సమాచారం చేర్చే ఏర్పాటు. విపత్తు సమయంలో బాధితుల్ని గుర్తించి రక్షించే వ్యవస్థ, వారికి అవసరమైన సాయం అందజేత.

* ఇందుకు అనుగుణంగా రాజధాని ప్రాంతంలో విపత్తు సమయంలో అత్యవసరంగా స్పందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్‌ వేదికకి రూపకల్పన. ముందుగానే విపత్తు సమాచారం అందుకోవడం నుంచి ఎదుర్కొనే చర్యల వరకూ సంయుక్తంగా ఈ వేదిక నుంచే పర్యవేక్షణ. తుపాను రక్షిత కేంద్రాలు, వాటి ఆధునికీకరణ.

* అత్యవసర సమయాల్లో విపత్తు బాధితులకు ఆశ్రయమిచ్చేందుకు శాశ్వత రక్షిత కేంద్రాలతోపాటు కేంద్ర అత్యవసర భవనాలు నిర్మించడం. ప్రతి టౌన్‌షిప్‌లో రక్షిత భవనాల ఏర్పాటు.

* భూకంపాల్ని తట్టుకొనేందుకు ప్రత్యేక చర్యలు. ఇందుకు అనుగుణంగానే నూతన భవనాల నిర్మాణాల ప్రణాళికలు ఉండేలా నిబంధనలు. భూకంపం సంభవిస్తే రక్షించేందుకు అవసరమైన ప్రమాణాలు పాటించడం. ప్రజల్లో ఇందుకు సంబంధించిన అవగాహన కల్పన. కుప్పకూలిన నిర్మాణాల నుంచి రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ సిద్ధం చేసుకోవడం.

శూన్య శాతానికి వ్యర్థాలు!

అమరావతిలో 2050 నాటికి జీరో శాతానికి వ్యర్థాలను తీసుకురావాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇళ్ల నుంచి పరిశ్రమల వరకు చెత్త, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి ఎరువులు, బయోగ్యాస్‌ వంటివి ఉత్పత్తి చేయనున్నారు.. * 2050 నాటికి వెయ్యి మంది రోగులుండే ఆసుపత్రుల నుంచి రోజూ 17,765 కిలోల వ్యర్థాలు ఉత్పత్తయే అవకాశముంది. రహదారులు, కాలువలు, ఇళ్ల నుంచి రోజూ మరో 3,819 టన్నుల వ్యర్థాలు వెలువడే వీలుంది.

30ap-main1b.jpg

100%సహజవాయువు వాడకం

ఈనాడు, అమరావతి: పర్యావరణహితం, కాలుష్యరహితం కోసం హానికరమైన వాయువుల్ని నియంత్రించి.. స్వచ్ఛమైన గాలి అందించేలా వందశాతం సహజ వాయువు వాడకమే లక్ష్యంగా అమరావతి అభివృద్ధి ప్రణాళిక తయారు చేశారు. నెల్లూరు-విజయవాడ మధ్య పైప్‌లైన్‌ నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం లభించింది. నగరానికి తూర్పుదిశగా సాగే ఈ మార్గం నుంచి రాజధానికి అవసరమైన గ్యాస్‌ తీసుకుంటారు. గృహ, వాణిజ్య వినియోగానికీ అధిక, మధ్యస్థాయి ఒత్తిడి పైప్‌లైన్ల ద్వారా సరఫరా అందిస్తారు.

* రాజధాని చుట్టూ అధిక ఒత్తిడి గొట్టపుమార్గం, తూర్పు- పశ్చిమ ప్రాంతాల్లో రెండు గేట్‌స్టేషన్లు, మరో రెండు అధిక, మధ్యస్థాయి ఒత్తిడి నియంత్రిత కేంద్రాలను నిర్మిస్తారు. వీటికి అనుసంధానిస్తూ మధ్యస్థాయి ఒత్తిడి గొట్టపుమార్గాన్ని నగరమంతా విస్తరించి నాలుగు వలయాలద్వారా నిర్దేశిత ప్రాంతాలకు పంపిస్తారు.

* చైనాలోని 6 నగరాలతో పాటు అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌, దిల్లీ, విజయవాడలో గ్యాస్‌ వినియోగం, అక్కడి ప్రమాణాలను పరిశీలించి ఇక్కడ అనుసరించాల్సిన విధానం తయారు చేశారు. చైనా, టొరంటో, అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా, జపాన్‌, భారత్‌లోని గొట్టపుమార్గాలను పరిశీలించారు. వాటిలో మేలైనవాటిని ప్రతిపాదించారు.

* సిటీ గేట్‌ స్టేషన్‌ నుంచి రాజధానిని అనుసంధానిస్తూ గొట్టపుమార్గాలు నిర్మించి 20 స్టేషన్లు నిర్మిస్తారు. అక్కడ నుంచి సరఫరా జరుగుతుంది. స్మార్ట్‌ గ్యాస్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో పర్యవేక్షిస్తారు.

* 2050నాటికి పెట్రోలు, డీజిల్‌, బొగ్గు వాడకం అనేవే అమరావతి ప్రాంతంలో ఉండవు. తక్కువ ఖర్చు, సమర్థవంతంగా వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అంతరాయంలేని సరఫరా ఇవ్వాలని ప్రణాళికల్లో పొందుపరిచారు.

రాజధానికి రక్షితజలం

30ap-main1c.jpg

ఈనాడు, అమరావతి: వచ్చే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్పటికి రాజధాని జనాభా 47.26 లక్షలుగా అంచనా వేసి తాగునీటి ప్రణాళిక తయారుచేశారు. ఇక్కడుండే అందరికీ ఒక్కొక్కరికి రోజుకు 150 లీటర్ల చొప్పున నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుత ఆనకట్టతోపాటు కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద నిర్మించే మరో బ్యారేజి నుంచి నీటిని తీసుకుంటారు. శుద్ధి చేసి సరఫరా చేస్తారు.

* రాజధాని మొత్తాన్ని కలుపుతూ 45 కిలోమీటర్ల ప్రధాన గొట్టపుమార్గం, మధ్యలో 24 ట్యాపింగ్‌పాయింట్లు ఏర్పాటుచేసి 60 నీటి సరఫరా కేంద్రాలకు అనుసంధానిస్తారు.

* నీటి నిర్వహణకు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటవుతాయి. కమాండ్‌కంట్రోల్‌ కేంద్రం నుంచి రాజధాని మొత్తానికి నీటిసరఫరా, నియంత్రణ ఉంటుంది.

* అగ్నిప్రమాదాల నియంత్రణ కోసం యంత్రాలకు ఎక్కడికక్కడే నీటిని పంపింగ్‌ చేసే విధానం అందుబాటులో ఉంటుంది.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రజారోగ్య పర్యావరణ ఇంజినీరింగ్‌ విభాగ ప్రమాణాలకు అనుగుణంగా రక్షితజలం అందిస్తారు.

* 47.26 లక్షల ప్రజల అవసరాలు తీరేలా (నీరు ఎంఎల్‌డీల్లో.. రోజుకు మిలియన్‌ లీటర్లు)

30ap-main1d.jpg

Link to comment
Share on other sites

సౌకర్యానికి రహదారి!

అమరావతి నగరంలో 5 మార్గాలు..

593 కిలోమీటర్ల పొడవు

30ap-story4a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలోని రహదారుల్ని అయిదు రకాలుగా విభజించారు. ఇవి 593 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. ఈ రహదారుల విశేషాలివి...

* అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, కూడళ్లు, అండర్‌పాస్‌లు, కొన్నిచోట్ల అండర్‌పాస్‌తోపాటు ర్యాంప్‌ల నిర్మాణం.

* 2050నాటికి రాజధాని నగరంలో 70%, కేంద్ర వాణిజ్య ప్రాంతంలో 80%మందికి అందుబాటులోకి ప్రజా రవాణా వ్యవస్థ.

* తొలి దశలో బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ ప్రజా రవాణా వ్యవస్థను తీసుకొచ్చి తరువాతి దశలో మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌కి అభివృద్ధి. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ప్రతిపాదన.

* వినోద, ఉల్లాసాల కోసం జల రవాణాకి అనువైన కాలువల నిర్మాణం. మోటారు రహిత రవాణా వ్యవస్థ.

* కేవలం సరకు రవాణా కోసమే ఉద్దేశించిన ఈస్ట్‌కోస్ట్‌ ఎకనామిక్‌ కారిడార్‌ అభివృద్ధి ఇందులో భాగమే.

పీపీపీ విధానంలోనూ, రుసుం వసూలు చేసి ఆ ప్రదేశాన్ని నిర్వహించే తరహాలో ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలు గుర్తింపు. వీటి ద్వారా వచ్చే నిధులు ప్రజారవాణా వ్యవస్థ అభివృద్ధికి వినియోగం. భవనాల నిర్మాణ సమయంలోనూ పార్కింగ్‌ నిబంధనలు.

అమరావతిలో నిర్మించనున్న అయిదు రకాల రహదారులివే..

* మేజర్‌ ఆర్టీరియల్‌ రహదారి - 52 కిలోమీటర్లు (వెడల్పు - 60 మీటర్లు)

* సీడ్‌ యాక్సిస్‌ రహదారి - 19 కిలోమీటర్లు (వెడల్పు - 60 మీటర్లు)

* ఆర్టీరియల్‌ రహదారి - 94 కిలోమీటర్లు (వెడల్పు -50 మీటర్లు)

* సబ్‌-ఆర్టీరియల్‌ రహదారి - 151 కిలోమీటర్లు (వెడల్పు -50 మీటర్లు)

* కలెక్టర్‌ రహదారి - 277 కిలోమీటర్లు (వెడల్పు-25 మీటర్లు)

Link to comment
Share on other sites

నది వెంట పర్యాటక నగరం

థీమ్‌కు ఒక్కొక్కటి చొప్పున రాజధానిలో తొమ్మిది నగరాలు

30ap-story1a.jpg

ఈనాడు, అమరావతి: రాజధానిలో తొమ్మిది నగరాలను ఏర్పాటవనున్నాయి. తొమ్మిది ప్రధాన థీమ్‌లతో ఒక్కో థీమ్‌కి ఒక్కో నగరం చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాజధానికి ఒకవైపున కృష్ణా నదివెంట పర్యాటక నగరం కొలువు తీరనుంది. పర్యాటకానికి అనుబంధంగా ఉంటే క్రీడానగరం దీనికి ఆనుకుని రానుంది. దీని పక్కనే వరుసగా పర్యాటక నగరాని ఆనుకుని ప్రభుత్వ, ఆర్థిక, ఆరోగ్యనగరాలు కొలువుదీరనున్నాయి. తర్వాత న్యాయ, విద్య, విజ్ఞాన(నాలెడ్జ్‌), ఎలక్ట్రానిక్‌ నగరాలుంటాయి. వీటికి అనుబంధంగా రాజధానికి ఒకవైపున మీడియా నగరాన్ని ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక ఆహ్లాదాన్ని ఆస్వాదించేలా ఈ నగరానికి ఆనుకుని ఆర్థిక, వైద్య, క్రీడ నగరాలను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనల్లో చూపించారు.

30ap-story1b.jpg

Link to comment
Share on other sites

సౌర విద్యుత్తుకు ప్రాధాన్యం!

30ap-story5a.jpg

ఈనాడు, అమరావతి: అమరావతిలో సౌర విద్యుదుత్పత్తి, వినియోగానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. ప్రతి విద్యుత్తు వినియోగదారుడు సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడటం తప్పనిసరి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ప్రభుత్వ, విద్యా భవనాలపైన 1,816 మెగావాట్ల ఇళ్ల పైకప్పు(సోలార్‌ రూఫ్‌టాప్‌)ను నెలకొల్పడానికి అవకాశముంటుందని అంచనా. ఇంటిపై 10చదరపు మీటర్లకు ఒక కిలోవాట్‌ సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉంటుందనే లెక్కతో ఈ అంచనా వేశారు.

* స్మార్ట్‌ నగరం ప్రాథమిక లక్షణమైన స్మార్ట్‌ విద్యుత్తు గ్రిడ్‌, మీటరింగ్‌ ఉంటుంది.

* నగరంలో ఎక్కడా వేలాడే తీగలుండవు. లైన్లన్నీ భూగర్భంలోనే కాంక్రీట్‌ డక్ట్‌లో వేస్తారు.

* నగరాన్ని మూడు విద్యుత్తు జోన్లుగా విభజించారు.

* పంపిణీ వ్యవస్థ బలోపేతానికి వీలుగా లింగాయపాలెం, తాళ్లాయపాలెంల్లో 220కేవీ, 400కేవీ సబ్‌స్టేషన్లు కొత్తగా నిర్మిస్తారు. ఓల్టేజీ హెచ్చు తగ్గులు ఉండవు.

* 2050నాటికి నగరానికి 2,706 మెగావాట్లు అవసరమని అంచనా. తదనుగుణంగా పంపిణీ వ్యవస్థ నిర్మితమవుతుంది. స్మార్ట్‌గ్రిడ్‌, స్మార్ట్‌ మీటరింగ్‌, సరఫరా, పంపిణీ నియంత్రణ అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మితమవుతుంది.

* విద్యుత్‌ నష్టాలు 5 శాతం కంటే తక్కువగా ఉండేలా విద్యుత్‌ వ్యవస్థ ఉంటుంది.

* ఇంధన పొదుపు లైటింగ్‌ వ్యవస్థ ఉంటుంది.

Link to comment
Share on other sites

స్మార్ట్‌గా సౌకర్యాలు!
 
636265244264840737.jpg
 
  • 11 అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఆర్మీ అసోసియేట్స్‌, జీఐఐసీ ప్రణాళిక
  • రాజధాని ఇన్‌ఫ్రా మాస్టర్‌ ప్లాన్‌ సమర్పణ.. బ్లూ, గ్రీన్‌ కేపిటల్‌ కాన్సెప్ట్‌ ఆచరణ
 
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నగర భవిష్యత్తు అవసరాలకు భరోసా ఇచ్చేలా మౌలిక సదుపాయాల మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. సీఎం చంద్రబాబు విజన ఆధారంగా, ఏడీసీ (అమరావతి అభివృద్ధి సంస్థ), ఏపీసీఆర్డీయేల నేతృత్వంలో మన దేశానికి చెందిన ఆర్వీ అసోసియేట్స్‌, చైనాకు చెందిన జీఐఐసీ సంయుక్తంగా స్మార్ట్‌ ఇంటెగ్రేటెడ్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ మాస్టర్‌ ప్లాన(ఎస్‌ఐఐఎంపీ)ను రూపొందించాయి. ఇందుకోసం పలు దేశాల్లో వీటి ప్రతినిధులు పర్యటించారు. అనంతరం... 217.23 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అమరావతి నగరంలో 2050 నాటికి ఉండబోయే జనాభాకు అనుగుణంగా, అత్యున్నత మౌలిక వసతులను పర్యావరణ హితంగా ఏర్పాటు చేసేలా ఈ మాస్టర్‌ ప్లాన్‌కు రూపకల్పన చేశారు.
 
ప్లాన్‌లోని మౌలిక వివరాలు...
సీఎం చంద్రబాబు ప్రవచిస్తున్న ‘హరిత- నీలి రాజధాని’ (గ్రీన్, బ్లూ కాన్సెప్ట్‌) నిర్మాణానికి ఉద్దేశించిన మాస్టర్‌ ప్లాన్ తో ప్రస్తుత ఇన్ ఫ్రా మాస్టర్‌ ప్లాన్ కు చక్కటి సమన్వయం కుదిరేలా చూశారు. రాజధానిని స్మార్ట్‌గా నిలిపేందుకు 24 గంటలూ నాణ్యమైన నీరు, పారిశుద్ధ్య వ్యవస్థ నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ, రవాణ, విద్యుత్, గ్యాస్‌ సరఫరా, సమాచార వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు. విద్యుత్ విషయంలో మొత్తం 3 జోన్లుగా విభజించి 220/33 సామర్థ్యంతో 18 కేవీ సబ్‌స్టేషన్లు, 400/220 కేవీ సామర్థ్యంతో 3 సబ్‌స్టేషన్లను నిర్మించడంతోపాటు ఏడాదికి కనీసం 1816 మెగావాట్ల సౌరవిద్యుత్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. మురుగు నీరు, విద్యుత్, గ్యాస్‌, కేబుళ్ల వ్యవస్థ మొత్తం భూగర్భంలోనే అత్యాధునిక పద్ధతిలో ఏర్పాటు నిర్మిస్తారు. ఘన వ్యర్థాల విషయంలో నగరాన్ని 3 జోన్లుగా విభజించారు. వ్యర్థాలను వాటి స్వభావాన్ని బట్టి వర్గీకరించి, సేకరించి, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు తరలించి, శుభ్రపరచాలని పేర్కొన్నారు. ఇందుకోసం 3 ట్రాన్సఫర్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌లో 11 అంశాలకు కన్సల్టెంట్లు ప్రాధాన్యమిచ్చారు. అవి... ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్సపోర్టేషన్, వాటర్‌ సప్లై అండ్‌ ఫైర్‌ ఫైటింగ్‌, వేస్ట్‌వాటర్‌ మేనేజ్‌మెంట్‌, స్టార్మ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, విద్యుత్, ఘనవ్యర్థాల నిర్వహణ, వంటగ్యాస్‌ పంపిణీ, ఇన్ఫర్మేషన్ అండ్‌ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌, సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌.
 
నీటి అవసరాలు తీరేదిలా...
2050 నాటికి రాజధాని జనాభా 35.50 లక్షలకు చేరుతుందని అంచనా. ఈ జనాభాతోపాటు వాణిజ్య, పారిశ్రామికవాడలకు నీటి సరఫరా వ్యవస్థను ఈ ప్లాన్‌లో ప్రతిపాదించారు. వాగులు ఇతర జలవనరులపై పెద్దగా ఆధారపడకుండా, ప్రకాశం బ్యారేజీపై ఒత్తిడి పడకుండా, దానికి 20 కిలోమీటర్ల ఎగువన వైకుంఠపురం వద్ద 6.53 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తారు. అంతేకాదూ... అమరావతివాసులకు పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన జలాలను అందజేసేందుకు కృష్ణానదీతీరంలో 2 భారీస్థాయి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిల్లో ఒకదానిని ప్రకాశం బ్యారేజీ వద్ద (367 ఎం.ఎల్‌.డి.ల సామర్ధ్యం)తో, రెండో దానిని అబ్బరాజుపాలెం సమీపంలో (486 ఎం.ఎల్‌.డి.ల కెపాసిటీతో) నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు నదీజలాలను ప్రత్యేక పైపులైన (రా వాటర్‌ ట్రంక్‌ మెయిన) ద్వారా చేర్చి, ప్లాంట్లలో శుద్ధి పరచిన అనంతరం రాజధాని నగరవ్యాప్తంగా సుమారు 45 కిలోమీటర్ల పొడవున విస్తరించి, 2 బ్యారేజీలతోనూ అనుసంధానమై ఉండే రింగ్‌మెయిన సిస్టం(ఆర్‌.ఎం.ఎస్‌.) పైపులైనలోకి పంపుతారు. రింగురోడ్డు మాదిరిగా నిర్దేశిత ప్రదేశం యావత్తూ విస్తరించి ఉండే ఈ ఆర్‌.ఎం.ఎస్‌. నుంచి రాజధానిలోని అన్ని ప్రదేశాలకూ శుద్ధి చేసిన నీటిని అందజేసేందుకు వీలుగా 24 ట్యాపింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. వాటి నుంచి అమరావతి నగరంలోని సకల ప్రాంతాలకూ అవసరమైన నీటిని నిరంతరాయంగా సరఫరా చేసేందుకు రాజధానిని మొత్తాన్ని 60 వాటర్‌ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు(డబ్ల్యు.డి.సి.)లుగా విభజిస్తారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అవకాశం లేకపోవడంతో ప్రెజరైజ్డ్‌ పంపింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా నీటి వృథానూ అరికట్టవచ్చు.
 
రవాణా సౌకర్యాలు
రవాణా సాఫీగా, పర్యావరణహితంగా ఉండేలా ఈ ప్రణాళికలో పలు సూచనలు చేశారు. మొత్తం 5 రకాలైన రోడ్లను ప్రణాళికలో సూచించారు. వీటి మొత్తం పొడవు 593 కిలోమీటర్లు ఇందులో మేజర్‌ ఆర్టీరియల్‌ (వెడల్పు 60 మీటర్లు - పొడవు 52 కి.మీ.), సీడ్‌ యాక్సెస్‌ (60- 19), ఆర్టీరియల్‌ (50- 94), సబ్‌ ఆర్టీరియల్‌ (50- 151), కలెక్టర్‌ రోడ్లు (25 మీ- 277 కి.మీ.) ఉన్నాయి. సెంట్రల్‌ డివైడర్‌పైన, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతారు. ‘జాతీయ అర్బన్ ట్రాన్స్ పోర్టు పాలసీ’ని అనుసరించి అమరావతిలో ‘గ్రీన్ అండ్‌ స్మార్ట్‌’ ట్రాన్స్పోర్టు సాధనాలకు ప్రాధాన్యం ఇస్తారు. మోటారైజ్డ్‌, నాన్ మోటారైజ్డ్‌ (సైకిళ్లు, బ్యాటరీ వాహనాలు తదితరాలు) ట్రాఫిక్‌లను వేరు చేయాలని సూచించారు. అదే విధంగా ప్రజా రవాణా వ్యవస్థను పెంచి బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్ పోర్టు(బీఆర్టీ), మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్ పోర్టు (ఎంఆర్టీ)లను పెంచాలని, హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ప్రవేశపెట్టాలని, వినోద ప్రయోజనాల కోసం కాలువలను వినియోగించుకునేలా చూడాలని పేర్కొన్నారు. పార్కింగ్‌ వ్యవస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 
  
ఇతరత్రా ఏర్పాట్లు...  
డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌: అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే కనిపించే డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థను అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ కోసం కన్సల్టెంట్లు ప్రతిపాదించారు. కేంద్రీకృతంగా ఉండే శీతలీకరణ ప్లాంట్ల ద్వారా చల్లటి గాలులను ప్రభుత్వ కార్యాలయాలకు పంపడమనే ఈ విధానం ద్వారా వ్యక్తిగత ఏసీ ప్లాంట్ల వినియోగం భారీగా తగ్గి, పర్యావరణానికి మేలు చేకూరుతుంది.
 
సెక్యూరిటీ: ప్రజల ధనమానప్రాణాలకు ఎలాంటి హానీ కలగకుండా ఎక్కడికక్కడ నిఘా కెమెరాలు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసేలా చూడడంతోపాటు రహదారులపై రాత్రివేళల్లో అంధకారం అలుముకోకుండా పూర్తిస్థాయిలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. సేఫ్టీ అలారం వ్యవస్థలను విస్తృతంగా వినియోగించాలని, నగరంలోకి ప్రవేశించే, రాకపోకలు సాగించే నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించింది.
 
కమ్యూనికేషన్‌: ఎక్కడికక్కడ 4జీ స్టేషన్లను నెలకొల్పి శక్తిమంతమైన యాంటెన్నాలు ఏర్పాటు చేయాలి. ‘సీఎం డ్యాష్‌బోర్డు’ తరహాలో రాజధానికి సంబంధించిన సకల అంశాలనూ చిటికెలో, సమగ్రంగా తెలుసునేందుకు వీలు కల్పించే వ్యవస్థను అభివృద్ధి పరచాలని సూచించారు.
 
లే అవుట్ల అభివృద్ధి: భూసమీకరణ పథకంలో రైతులకు ఇచ్చే ప్లాట్లను నివాస, వాణిజ్య, జనరల్‌, మిక్స్‌డ్‌ జోన్లు, నైబర్‌హుడ్‌, రీజినల్‌, టౌన్ సెంటర్లు, బిజినెస్‌ పార్కు, కాలుష్యరహిత పరిశ్రమలు, రిజర్వ్‌, రోడ్‌ రిజర్వ్‌ జోన్లు .. ఇలా పలు ప్రయోజనాలకు నిర్దిష్ట ప్రదేశాలను కేటాయించడం ద్వారా అన్నింట్లోనూ ప్రణాళికాబద్ధ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
 
58769858585.jpg 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...