Jump to content

Amaravati


Recommended Posts

రెండో దశలో 11 సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లు
 
636261103841315660.jpg
  • రాజధానిలో రోడ్ల నిర్మాణంపై దృష్టి
  • రెండోదశలో 11 సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లు
  • 71.75 కి.మీల పొడవున నిర్మాణం
  • అంచనా వ్యయం రూ.1150 కోట్లు
  • సీఎం పరిశీలనలో రెండో దశ ప్రాజెక్టు
  • టెండర్లకు సిద్ధమవుతున్న ఏడీసీ
రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. సబ్‌ ఆర్టీరియల్‌ రహదారుల నిర్మాణంలో భాగంగా తొలిదశలో 66.22 కిలోమీటర్ల మేర ఏడు రహదారుల పనులకు ఈ నెల 29న శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వెంటనే రెండో దశ సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిం ది. ఈ మేరకు అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ 11 సబ్‌ ఆర్టీరియల్‌ రహదారులను కలిపి 71.75కిమీ మేరకు రూ. 1149.11 కోట్ల వ్యయంతో రెండు ప్యా కేజీలుగా నిర్మించేందు కు ప్రణాళికను రూ పొందించింది.

అమరావతి/మంగళగిరి : రాజధానిలో ఇప్పటికే అతి ప్రధానమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును 21.47 కిలోమీటర్ల పొడవున వారధి నుంచి దొండపాడు వరకు రెండు దశల్లో నిర్మిస్తున్న సం గతి తెలిసిందే. తాజాగా చేపట్టిన సబ్‌ ఆర్టీరియల్‌ రహదారుల నిర్మాణంలో భాగంగా తొలిదశ కింద 66.22 కిలోమీటర్ల ఏడు రహదారులను రూ.915 కోట్ల వ్యయంతో చేపట్టనుంది. ఈ పనులను నాలుగు ప్యాకేజీలుగా వర్గీకరించి టెండర్లను పిలవడంతోపాటు వెనువెంటనే పనులను ఆరంభించేలా ఉగా ది పర్వదినమైన ఈనెల 29వ తేదీన శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ వెంటనే రెండోదశ సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
 
ఈ మేరకు అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పోరేషన్‌ రెండోదశ కింద 11 సబ్‌ ఆర్టీరియల్‌ రహదారులను కలిపి 71.75 కిలీమీటర్ల మేరకు రూ.1149.11 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీలుగా నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించారు. తొలిదశ కింద ఏడు రోడ్లను నాలుగు ప్యాకేజీలుగా చేపడుతున్న ఏడీసీ రెండోదశ కింద 11 రోడ్లను ఐదు, ఆరు ప్యాకేజీలతో నిర్మించేలా టెండర్లను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన అనంతరం ఈ రెండు ప్యాకేజీలకు టెండర్లను పిలిచేందుకు ఏడీసీ సన్నద్ధంగా ఉం ది. ఈ 11 రోడ్ల నిమిత్తం 361.11 హెక్టార్ల భూమిని వినియోగించుకోనున్నారు.
 
amtava.jpgమొదటి ప్యాకేజీలోని రోడ్లు
  • ఇ-2 సబ్‌ ఆర్టీరియల్‌ రహదారిని అబ్బురాజుపాలెం పరిధిలో 4.48 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల రహదారిగా నిర్మించనున్నారు. ఈ మార్గంలో ఆరు బ్రిడ్జిలు, పది కల్వర్టులు రానున్నాయి.
  • ఇ-4 సబ్‌ ఆర్టీరియల్‌ రహదారిని రాజధాని ఏరియాకు ఉత్తరం వైపున పశ్చిమ-తూర్పు దిక్కుల మధ్య తుళ్లూరు నుంచి వెంకటపాలెం వరకు 15.55 కిలోమీటర్ల పొడవున నిర్మించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గంలో ఐదు బ్రిడ్జిలు, 32 కల్వర్టులు రానున్నాయి.
  • ఇ-6 పేరుతో నిర్మించనున్న మ రో సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్డును అనంతవరం-తుళ్లూరు మధ్య 9.84 కి లోమీటర్ల పొడవున నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మార్గంలో నాలుగు బ్రిడ్జిలు, 19 కల్వర్టులు రానున్నాయి.
  • ఎన్‌-18 పేరుతో నిర్మించనున్న సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్డును 2.30 కిలోమీటర్ల పొడవున ఐనవోలు-నేలపాడుల మధ్య నిర్మిస్తారు. ఈ రహదారి మార్గం లో ఐదు కల్వర్టులను నిర్మిస్తే సరిపోతుంది.
  • ఎన్‌-11 పేరుతో లింగయపాలెం-నెక్కల్లు మధ్య 8.65 కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తారు.ఈ మార్గం లో ఒక బ్రిడ్జి, 24 కల్వర్టులు రానున్నాయి.
రూ.455.88 కోట్లతో రెండో ప్యాకేజీ
  • రెండో ప్యాకేజీ కింద ఇ-12, ఇ-15, ఎన్‌-1, ఎన్‌-2, ఎన్‌-5, ఎన్‌-7)ను కలిపి రూ.455.88 కోట్లతో నిర్మించాలని అం చనాలను రూపొందించారు.
  • ఇ-12 రహదారిని రాజధాని ప్రాంతానికి దక్షిణ శివారు కురగల్లు పరిధిలో 6.79 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఈ మార్గం లో ఒక బ్రిడ్జి, 24 కల్వర్టులు వస్తాయి.
  • ఇ-15 సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్డును నిడమర్రు-నవులూ రు మధ్య 4.07 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఈ మార్గంలో మూడు కల్వర్టులు రా నున్నాయి.
  • ఎన్‌-1 సబ్‌ ఆర్టీరియల్‌ రహదారిని 3.66 కిలోమీటర్ల పొడవున రాజధానికి ఈశాన్యం గా ఉన్న ఉండవల్లి ప్రాంతంలో నాలుగు వరుసలతో నిర్మిస్తారు.ఈ మా ర్గంలో కేవలం నాలుగుకల్వర్టులు మాత్రమే వస్తాయి.
  • రాజధాని ప్రాంతానికి ఆగ్నేయంగా పెనుమాక ప రిధిలో కేవలం 2.12 కిలోమీటర్ల నిడివిలో ఎన్‌-2 పేరుతో సబ్‌ ఆర్టీరియల్‌ రహదారి నిర్మిస్తారు. ఈ మార్గంలో ఒక బ్రిడ్జి,నాలుగు కల్వర్టులు రానున్నాయి.
  • ఎన్‌-5 పేరుతో మరో సబ్‌ ఆర్టీరియల్‌ రహదారిని 2.06 కిలోమీటర్ల నిడివిలో బేతపూడి పరిధిలో నిర్మించనున్నారు. ఈ మార్గంలో ఆరు కల్వర్టులు మాత్రమే వస్తాయి.
  • ఎన్‌-7 రహదారిని తాళ్లాయపాలెం వద్ద నుంచి ప్రారంభించి దక్షిణంగా మందడం, కురగల్లు మీదుగా బేతపూడి వద్ద రాజధాని దక్షిణ ప్రాంత హద్దు వరకు 12.23 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రహదారి మార్గంలో నాలుగు బ్రిడ్జిలు, 21 కల్వర్టులు రానున్నాయి.
రూ.6.93 కోట్లతో 69,388 మొక్కలు
ఈ రహదారులు యాభై మీటర్లకు పైగా వెడల్పుతో ఉండడంతో ఉష్ణోగ్రతలు బాగా పెరుగొచ్చునని అం చనా వేస్తున్నారు. పచ్చదనం ద్వారా నే దీనిని తగ్గించవచ్చునని భావిస్తున్న అధికారులు రహదార్ల వెంట మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం రహదార్లకు ఇరువైపులా రూ.6.93 కోట్ల వ్యయంతో 69,388 మొక్కలను నాటించాలని నిర్ణయించారు. ప్రతి రోడ్డు మధ్య సెంట్రల్‌ వెర్జ్‌లో రూ1.57 కోట్ల వ్యయంతో వివి ధ పుష్ఫ జాతులకు చెందిన 47,787 మొక్కలను నాటాలని ప్రతిపాదించారు.

11 రోడ్లు రెండు ప్యాకేజీల్లో..
రెండోదశ కింద చేపట్టనున్న 11 సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లను ఇ-2, ఇ-4, ఇ-6, ఎన్‌- 18, ఎన్‌-11, ఇ-12, ఇ-15, ఎన్‌-1, ఎన్‌-2, ఎన్‌-5, ఎన్‌-7లుగా వ్యవహరించనున్నా రు. ఈ 11 రోడ్లను రెండు ప్యాకేజీల రూ పంలో నిర్మించే విధంగా ఏడీసీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇ-2, ఇ-4, ఇ-6, ఎన్‌-18, ఎన్‌-11 సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లను (40.82 కి.మీలు) ఒక ప్యాకేజీలోను, ఇ-12, ఇ-15, ఎన్‌-1, ఎన్‌ -2, ఎన్‌-5, ఎన్‌-7 రహదారులను (30.93 కి.మీలు) మరో ప్యాకేజీలోను చేర్చారు.
Link to comment
Share on other sites

జనం కోసం కడుతున్న మొట్టమొదటి రాజధాని అమరావతే !!
 
 

రాజధాని కోసం ఇంత హడావుడి చేస్తారా ? హౌసింగ్ బోర్డ్ వాళ్లు నయారాయ్ పూర్ కట్టలేదా అంటూ దిష్టిగుమ్మడి కాయల్లాంటి మాటలు వినిపిస్తున్నాయ్. అంటే రూపురేఖలకి నదరుపోయేందుకు ఇలాంటివి ఉండాల్సిందేకానీ, మనకి కూడా వాస్తవాలు తెలియాలి కదా ! అసలు అమరావతి గురించి ఇంత భారీ ప్రణాళిక ఎందుకు వేస్తున్నట్టు ? ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నట్టు ? ఇప్పటి వరకూ ఉన్న రాజధానుల్లో లేనిది ఏమిటి ? అమరావతిలో ఉండబోతున్నది ఏమిటి ?

ఇండియాలో ఇప్పటి వరకూ ఆల్రెడీ ఉన్న నగరాల్నే రాజధానులు ఎంచుకున్నారు. నవాబుల కట్టడాలున్న హైద్రాబాద్ అదే అడ్వాంటేజ్ తో అప్పటి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అయ్యింది. బెంగళూరు నుంచి చెన్నై మొదలు జమ్మూ వరకూ అన్నిట్లోనూ ఇంచుమించు ఇదే స్టోరీ ! ఇండియా కళ్లు తెరిచాక అంటే 1947 తర్వాత గాంధీనగర్, న్యూ రాయ్ పూర్ లాంటి సిటీలు కట్టుకున్నా అవి కేవలం అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం. అంటే పరిపాలనా భవనాలు మాత్రమే అక్కడ ఉంటాయ్. అందులో నివాస ప్రాంతాల్లేవ్. అహ్మదాబాదే హార్ట్ ఆఫ్ గుజరాత్. రాయ్ పూరే ఛత్తీస్ గఢ్ కి అనఫీషియల్ కేపిటల్. కానీ అమరావతి అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ! దేశానికి స్వతంత్ర్యం వచ్చాక తొలి రాజధాని జనం కోసం కడుతున్నది. పేరులో ప్రజారాధాని అని అన్నారని కాదు సుమా…తీరులో ఇంతటి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు చూశారా అందుకూ ! ఈ మధ్య హిస్టరీ తిరగేస్తే ఢిల్లీ తర్వాత ఇలా జనంకోసం కట్టిన రెండోనగరం, కేవలం రెండో నగరం అమరావతి !

అవును. ఎక్కడో మూలనున్న కోల్ కతా నుంచి ఢిల్లీకి రాజధానని మార్చాలని బ్రిటీషర్లు అనుకున్నారు. 1911లో నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 22 ఏళ్లు పట్టింది ఇప్పటి ఢిల్లీ రూపుదిద్దుకోడానికి ! రాష్ట్రపతి భవనం నుంచి ప్రతీ ఒక్కటీ తీర్చిదిద్ది ఇరాన్ నుంచి ప్రత్యేక శిల్పుల్ని రప్పించి నిర్మించారు అప్పట్లో ! అందుకే ఢిల్లీ అంత సౌకర్యవంతంగా ఎకరాలకి ఎకరాల భవనాలతో విశాలంగా ఉంటుంది. అయితే ఆనాటి పరిస్థితులు, సొంత పని కాదు కాబట్టి అంగ్లేయులు మరీ లోతుగా ఆలోచించికపోవడం లాంటివాటివల్ల పరిశ్రమలకి ప్రత్యేక ప్రాంతాలు కేటాయించడం లాంటివి చేయలేదు. అందుకే ఇప్పుడు కాలుష్యం, అవస్థలు. అది వేరే స్టోరీ !
ఇదీ అమరావతి ప్రత్యేకత !

బెజవాడ మహాత్మాగాంధీ రోడ్డు మీద సమ్మర్ లో 48 డిగ్రీల టెంపరేచర్ ఉంటోంది. పక్కనుండే సందులో 35 డిగ్రీలే ఉంటుంది ఎందుకంటే అక్కడ చెట్లు ఉంటాయ్ అని చెబుతోంది రాజధాని నిర్మాణ బృందం ! ఇదొక్కటి చాలు రాజధాని అంటే ఇటుకలు పేర్చి సిమెంటు రాయడం కాదు..ఆలోచనల్ని ఏకం చేయడం అని చెప్పడానికి ! అవును. ప్రపంచ స్థాయి ఆలోచనలు, స్థానిక పరిస్థితులు, భవిష్యత్ ప్రమాణాలు. ఇవీ అమరావతి ఫాలో అవుతున్న మూడు సూత్రాలు. పైగా నవ నగరాలు, 27 టౌన్ షిప్ లు, కనీసం 50 ఏళ్లు ముందుకెళ్లిన ఆలోచనలు తోడవుతున్నాయ్ కాబట్టి… కోటి మంది ఉండేందుకు తగినన్ని సదుపాయాలుండాలి అని ఓ బెంచ్ మార్క్ పెట్టుకున్నాం కాబట్టి ఈ స్థాయిలో వర్కవుట్ జరుగుతోంది. నగరం మధ్యలో నీటిమడుగులు, సువిశాలమైన రోడ్లకి ఇరువైపులా మాత్రమే కాదు మధ్యలోనూ లోనూ గ్రీన్ లైన్ లాంటి ఏర్పాట్లు చేయడం అంటే డిజైన్ కోసం కాదు. భవిష్యత్ కోసం. సౌకర్యం కోసం. బ్రెజిల్ తరహాలో భారీ కార్నివాల్స్, ఉత్సవాలు కూడా రోడ్ల మీద నిర్మించే స్థాయిలో… ఏర్పాట్లు, కొన్ని చోట్ల ఇరువైపులా సీటింగ్ ఏర్పాటు చేయడం లాంటివన్నీ శాతవాహనుల నాటి ఆలోచనలకి మోడ్రన్ టచ్ ఇస్తున్నట్టుగా ఉన్నాయ్.

చెత్తను వేరుచేయడం శుద్ధి చేయడం, కరెంటుగా మార్చుకోవడం లాంటి సాంకేతిక పరిజ్ఞానం, ప్రతి భవనం చతురస్ర, దీర్ఘ చతురస్ర ఆకారంలోనే ఉండాలంటూ ప్లానింగ్ కి ప్రతిరూపంగా నిలవాలనుకోవడం లాంటివన్నీ దీర్ఘకాలిక ఆలోచనలు. భవిష్యత్ తరాలకి ఏపీ అందిస్తున్న కానుకలు. 60 ఏళ్లలో మూడు ఎదురుదెబ్బలు తిన్నాక… మేం నేర్చుకున్నాం పాఠం ఇదీ, ఈ స్థాయిలో మనం కట్టుకున్నాం, ఇదిగో ఇంతటి గంభీరంగా ప్రపంచస్థాయిలో నిలబడ్డాం అని జెండా ఎగరేసినట్టు చెప్పడం – ఇదీ రాజధాని అంటే !

అయినా ఇన్ని మాటలు, పోలికలు ఎందుకు ! అమరావతి అంటే రాజకీయం కాదు. అమరావతి అంటే ప్రాంతీయ ఎత్తుగడ కాదు. అమరావతి అంటే గ్రాఫిక్స్ కాదు. అమరావతి అంటే గవర్నమెంట్ ఆఫీసులో… రాయ్ పూర్ తో పోలికలో కాదు. అంతేగా అంటూ నోటికొచ్చిన మాట అనే ముందు, ఉన్న బుర్రతో ఒక్కక్షణం ఆలోచించుకోవాలి ఎవరైనా ! ఎందుకంటే… ఓ జాతి అంతరంగం. ఆంధ్రుడి ఠీవీ. ఆరుకోట్ల మంది జీవితం. శ్రీకాకుళం నుంచి అనంత వరకూ ప్రతిఒక్కడి నెత్తురూచెమటల్ని ఏకంచేసి… వందల ఏళ్ల భవిష్యత్ ని కట్టడంలా నిలబెడితే, కనిపిస్తుందే ఓ నిలువెత్తు నిర్మాణం… అదీ అమరావతి !

Link to comment
Share on other sites

ఇదిగిదిగో ప్రభుత్వ నగరి..!
 
636260888966333308.jpg
  • లండన్‌, ఢిల్లీల్లా డిజైన్‌..
  • ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ప్రజెంటేషన్‌
  • నదీ ముఖంగా 900 ఎకరాల్లో అడ్మినిస్ట్రేటివ్‌ సిటీ
  • జూలైలో మొదలు... 2018 డిసెంబర్‌కి పూర్తి
  • ఒకే చోట అసెంబ్లీ, ప్రభుత్వ సముదాయాలు
  • మకుటాయమాన భవనాలుగా అసెంబ్లీ, హైకోర్టు
  • ఎక్కడికక్కడ అన్ని సౌకర్యాలతో 27 టౌన్ షిప్పులు
  • మౌలిక వసతులకు రూ.13 వేల కోట్ల సేకరణ
  • ట్రెఫాల్గర్‌ స్క్వేర్‌... రాజ్‌పథ్‌ తరహాలో ఆకర్షణలు
అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): లండన్, న్యూఢిల్లీ మహా నగరాల్లోని నిర్మాణాలే స్ఫూర్తిగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని ప్రభుత్వ నగరి నిర్మాణం కాబోతోంది. రాజధాని నిర్మాణ డిజైన్ల తయారీకి ఎంపికైన నార్మన్ ఫోస్టర్‌ సంస్థ(లండన్‌) ఇక్కడి డిజైన్ల తయారీకి ముందు లండన్, వాషింగ్టన్, న్యూఢిల్లీలోని ప్రభుత్వ భవనాలు, ప్రధాన వీధులు, ఇతర ఆకర్షణీయ వసతులపై పరిశీలన జరిపింది. అందులో లండన్, ఢిల్లీలోని కొన్ని అంశాలను స్ఫూర్తిగా తీసుకొని అమరావతిలోని అడ్మినిస్ట్రేటివ్‌ సిటీ నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక డిజైన్లను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సభ్యులకు శనివారం ఇక్కడ అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధులు ఇందులోని ప్రధానాంశాలను వివరించారు. ప్రభుత్వ మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్, సీఆర్‌డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ కూడా కొన్ని అంశాలను వివరించారు. సీఎం చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప, మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రజంటేషన్ లోని ముఖ్యాంశాలు..
  • 55 వేల ఎకరాల్లో ( 217 చదరపు కి.మీ.పరిధిలో) అమరావతి రాజధాని నగరం ఏర్పాటు కాబోతోంది. ఇందులో ప్రధానమైన సీడ్‌ క్యాపిటల్‌ 67 చ.కి.మీ.లలో విస్తరించి ఉంటుంది. ఇక్కడే 6.9 చ.కి.మీ. ప్రాంతాన్ని తమకు కేటాయిస్తే అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి కంపెనీలను ఇక్కడకు తీసుకువస్తామని సింగపూర్‌కు చెందిన సంస్థల కన్సార్షియం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో దీనికి పోటీ బిడ్లను పిలిచి ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
  • కృష్ణా నదికి అభిముఖంగా 27 కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి నగరం రాబోతోంది. నదికి సరిగ్గా ఈశాన్యంలో ఉండే చోట 900 ఎకరాల్లో ప్రభుత్వ నగరిని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ నగరిని అడ్మినిస్ట్రేటివ్‌ సిటీ అని పిలుస్తున్నారు. ఇటువంటి సిటీలను మొత్తం తొమ్మిదింటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సిటీలో అంతర్గతంగా మూడు టౌన్ షిప్పులు నిర్మిస్తారు. ప్రతి టౌన్ షిప్పులో నివాస భవనాలు, షాపింగ్‌ మాల్స్‌, ఆస్పత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు వంటివి ఉంటాయి.
  • ప్రభుత్వ భవనాల్లో అసెంబ్లీ, హైకోర్టు మరెక్కడా లేని విధంగా మకుటాయమానంగా నిర్మించాలని నిర్ణయించారు. మిగిలిన వాటిని కూడా ప్రత్యేక శ్రద్ధతో నిర్మించినా ఈ రెంటికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ నగరిలో అసెంబ్లీ వస్తుంది. దానికి వెనుకనే జస్టిస్‌ సిటీ (న్యాయ నగరి). హైకోర్టు అందులో వస్తుంది.
  • నదికి అభిముఖంగా వచ్చే ప్రభుత్వ నగరి గీత గీసినట్లు పొడుగ్గా ఉంటుంది. నాలుగు బ్లాకులుగా దీనిని విభజిస్తారు. అసెంబ్లీ భవనంతో ఈ నగరి మొదలవుతుంది. దానికి కొనసాగింపుగా సచివాలయం, సీఎం, గవర్నర్ల నివాసాలు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, ఆ తర్వాత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల నివాసాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరికి సరిగ్గా మధ్యలో పెద్ద జల ప్రవాహం ఏర్పాటు చేస్తారు. అందులో పడవల్లో విహరించే వీలుంటుంది. దాని పక్కన నడక దారులు, సైకిల్‌ దారులు, వినోద కేంద్రాలు, ఫుడ్‌ కోర్టులు వస్తాయి. సరిగ్గా నది పక్కన.. ప్రభుత్వ నగరికి ముందు బాగా పెద్ద పార్కు వస్తుంది. ఇందులో పర్యాటక ఆకర్షణలు కూడా చేరుస్తారు. అసెంబ్లీకి ముందు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా పెద్ద మ్యూజియం, కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తారు.
  • ప్రభుత్వ నగరిలోని నాలుగు బ్లాకుల్లో మొదటి బ్లాకులో అసెంబ్లీ, సచివాలయం, సీఎం నివాసం, గవర్నర్‌ నివాసం, శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. రెండో బ్లాకులో మంత్రులు, ఉన్నతాధికారుల నివాసాలు ఉంటాయి. ఈ రెండు బ్లాకుల్లో 80 శాతం ప్రభుత్వ భవనాలే ఉంటాయి. మిగిలిన రెండు బ్లాకుల్లో వాణిజ్య భవనాలు, ఇతర భవనాలు వస్తాయి.
  • జూ ప్రభుత్వ నగరికి నాలుగు ప్రవేశ మార్గాలుంటాయి. వీటికి తిరుమల దేవాలయం నమూనాలో శిఖరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రవేశమార్గాల్లో మధ్యలో కార్లు, ఆ పక్కన బస్సులు, వాటి తర్వాత సైకిళ్ళు, చివరగా నడక దారులు ఉండేలా చూస్తున్నారు. ప్రతి రోడ్డు పక్కనా తగినన్ని చెట్లతో పచ్చదనం ఉండేలా చూస్తారు. మొత్తం మీద 51 శాతం పచ్చదనం, 16 శాతం జలాలు ఉండేలా చూడాలని నిర్ణయించారు.
  • సిటీ బస్సులు ఎక్కాలంటే 100- 150 మీటర్లకు మించి నడిచే పని లేకుండా డిజైన్ చేస్తున్నారు. రోడ్లు 24 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకూ వివిధ సైజుల్లో ఉంటాయి. కేవలం పాదచారులకు ప్రత్యేకించే రోడ్ల వెడల్పు మాత్రం 7 మీటర్లు ఉంటుంది. అలాగే.. ప్రభుత్వ నగరిలో ఎలక్ట్రిక్‌ కార్లు పెట్టే ప్రతిపాదన ఉంది. వీటికి డ్రైవర్లు ఉండరు. వాటిని ఎక్కి బటన నొక్కితే కంఫ్యూటర్‌ నియంత్రణతో కావాల్సిన చోటికి తీసుకువెళ్తాయి.
  • ట్రెఫాల్గర్‌ స్క్వేర్‌.. లండన్‌ నగరానికే పెద్ద పర్యాటక ఆకర్షణ. అదే తరహాలో ప్రభుత్వ నగరిలో సిటీ స్క్వేర్‌ వస్తుంది. ఢిల్లీలోని రాజ్‌పథ్‌.. గణతంత్ర వేడుకలకు ఎలా పేరొందిందో అదే తరహాలో ప్రభుత్వ నగరికి పక్కనే పెరేడ్‌ రహదారి, పెరేడ్‌ మైదానాలు వస్తాయి.
  • అసెంబ్లీ ఎదురుగా పెద్ద జలాశయం నిర్మిస్తారు. తిరుపతిలోని కోనేరు తరహాలో అదే పరిమాణంలో ఉంటుందిది. నది ఒడ్డున ఏర్పాటు చేసే పార్కు విదేశాల్లోని పార్కుల నమూనాలో భారీగా ఉంటుంది.
  • అమరావతిలో గాలి ప్రవాహ దిశలు, ఉష్ణోగ్రత తదితర అంశాలను లండన్‌ సంస్థ అధ్యయనం చేసింది. గాలి ప్రవాహం బాగుంటే ఉక్కపోత తగ్గుతుందన్న నిపుణుల సూచనతో అసెంబ్లీ వద్ద భవనాల ఎత్తు తగ్గించి నది వైపు వెళ్లేకొద్దీ ఎత్తు పెరిగేలా రూపకల్పన చేస్తున్నారు. ఆకాశహర్మ్యాలు సరిగ్గా నది పక్కన వస్తాయి. దీనివల్ల గాలి సాఫీగా వీస్తుందని, కొంత మేర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయని చెబుతున్నారు.
  • విజయవాడలో కంటే కృష్ణా నది పక్కన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నగరిలో సరిగ్గా మధ్యలో నదీ ప్రవాహం, దానిని ఆనుకొని పచ్చదనం ఉండేలా చూస్తున్నారు.
  • పాదచారులు ఎండలో, వానలో నడిచే పని లేకుండా పై కప్పు ఉండేలా నడక దారులు అభివృద్ధి చేస్తారు. కొన్ని వీధుల్ని ప్రత్యేకంగా పాదచారులు తిరిగేలా డిజైన చేస్తున్నారు. షాపింగ్‌, తినుబండారాల దుకాణాలు, రోడ్డు పక్క ఫుడ్‌ కోర్టులు వంటివి ఉంటాయి.
  • ప్రభుత్వ నగరి తుది డిజైన్లు మే నెలలో వస్తాయని అంచనా. జూలైలో పనులు మొదలు పెట్టి 2018 డిసెంబర్‌కు పూర్తి చేయాలని నిర్ణయించారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం హడ్కో నుంచి రూ.7500 కోట్లు సేకరిస్తోంది. అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 4 వేల కోట్లు తీసుకొంటున్నారు. కేంద్రం నుంచి రూ.1500 కోట్లు వస్తాయి. అమరావతిలో రైతులకు ఇచ్చే భూమి పోను మూడు నాలుగు వేల ఎకరాలను సీఆర్‌డియే తన కింద ఉంచుకొంటోంది. ఈ భూమిని అభివృద్ధి చేసి ఈ అప్పులను తీరుస్తారు.
  • రాజధాని ప్రాంతంలో ఎస్‌ఆర్‌ఎం, విట్‌, ఎమిటి వర్సిటీలకు భూమి కేటాయించారు. వీటిలో ఎస్‌ఆర్‌ఎం, విట్‌ భవన నిర్మాణాలను మొదలు పెట్టాయి. జూలైలో 800 నుంచి 1000 మంది వరకూ విద్యార్థులను చేర్చుకొని తరగతులు మొదలు పెట్టాలని ఈ యూనివర్సిటీలు నిర్ణయించాయి. తొలుత విజయవాడ లేదా గుంటూరులో తరగతులు మొదలు పెట్టి భవనాల నిర్మాణం పూర్తి కాగానే వాటిలోకి తరలిస్తాయి.
  • అమరావతిలో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, రెండు ఫోర్‌ స్టార్‌ హోటళ్లు, మూడు త్రీ స్టార్‌ హోటళ్లు రానున్నాయి. ఇండో యూకే సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి పడకల ఆస్పత్రి, వైద్య పరికరాల తయారీ విభాగం, గల్ఫ్‌కు చెందిన బిఆర్‌ శెట్టి గ్రూవ్‌ ఆధ్వర్యంలో వైద్య కళాశాల, ఆస్పత్రి రాబోతున్నాయి. మరి కొన్ని ప్రఖ్యాత పాఠశాలలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. 
SYF_8217%2022222222.jpg 33 లక్షల చదరపుటడుగుల నిర్మాణాలు 
అమరావతిలో తొమ్మిది వందల ఎకరాల్లో రాబోతున్న ప్రభుత్వ నగరిలో నిర్మాణాల విస్తీర్ణం 33 లక్షల చదరపుటడుగుల మేర ఉండనుంది. దీన్ని రూపొందించిన నార్మన్ ఫోస్టర్‌ సంస్ధ ప్రతినిధులు ఈ విషయం తెలిపారు. వెలగపూడిలో ఆరు భవనాల్లో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి విస్తీర్ణం 6 లక్షల చ.అడుగులు. ఒకో భవనం లక్ష చదరపుటడుగుల విస్తీర్ణంతో కట్టారు. వీటిలో శాఖాధిపతుల కార్యాలయాలు మాత్రం లేవు. కొత్తగా నిర్మించే అడ్మినిస్ట్రేటివ్‌ సిటీలో 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు రానున్నందువల్ల అన్ని శాఖలూ సర్దుబాటు చేసుకోవచ్చునని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ సిటీలోని మొత్తం విస్తీర్ణంలో నిర్మాణాలు 25 శాతం ఉండబోతున్నాయి. పచ్చదనం 51 శాతం, జల వనరులు 10 శాతం, రోడ్లకు 14 శాతం కేటాయించారు. ప్రభుత్వ నగరి మొత్తం ప్రజలు వచ్చి చూడటానికి అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ నగరంలో మధ్యలో ఉండే ప్రధాన రహదారిలో ఎలక్ట్రిక్ వాహనాల్లో మాత్రమే ప్రయాణించేవిధంగా తీర్చిదిద్దనున్నారు.
 
show%2015.jpg
Link to comment
Share on other sites

అమరావతికి దివ్యాకృతి
 
  • నార్మన్‌ ఫోస్టర్స్‌డిజైన్లలో కీలకాంశాలు
అమరావతిలో నిర్మించే అత్యంత కీలకమైన ‘పరిపాలనా నగరం’ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే. మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్ ఫోస్టర్స్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ దీనిని రూపొందించింది. ఈ ప్రణాళిక ప్రకారం... కృష్ణా నదికి అభిముఖంగా 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయం వెలుస్తుంది. ఇది ఉత్తరం నుంచి దక్షిణం వైపు సాగుతుంది. ఇందులో... 51 శాతం పచ్చదనం ఆవరిస్తుంది. 10 శాతం జల వనరులు ఉంటాయి. 25 శాతం విస్తీర్ణాన్ని భవంతులు, మిగిలిన 14 శాతం రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం కేటాయిస్తారు. రాష్ట్ర పరిపాలనాయంత్రాంగం, చట్టసభలు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారుల నివాస గృహాలతోపాటు ప్రజలకు సౌకర్యం, ఆహ్లాదం పంచే అనేక వసతులు ఇందులో ఉంటాయి.
 

ఇదే మాస్టర్‌ ప్లాన్‌

 106fkk.jpgsucha.jpg
 
 హైకోర్టు డిజైన్లు...
177.jpg 
హైకోర్టు కోసం మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ రూపొందించిన డిజైన్లు ఇవి. మొత్తం 75వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. కోర్టు హాళ్లు, చాంబర్లను 21వేల చదరపు మీటర్లలో నిర్మిస్తారు. ఇదే సముదాయంలో న్యాయవాదుల కోసం గదుల నుంచి కాన్ఫరెన్స్‌ హాళ్ల దాకా సకల వసతులు ఏర్పాటు చేసేలా నిర్మాణాలను ప్రతిపాదించారు.
 
ఇదే శాసన సభ, మండలి
151.jpg
ఇది శాసనసభ, మండలి డిజైన్లు. మధ్యలో ఉన్నది సెంట్రల్‌ హాల్‌. అటూ, ఇటూ అసెంబ్లీ, శాసన మండలి. ఈ భవన సముదాయం 28,389 మీటర్లలో నిర్మితమవుతుంది. పది వేల చదరపు మీటర్లలో అసెంబ్లీ, సుమారు 8వేల చదరపు మీటర్లలో శాసనమండలి భవనాలను నిర్మిస్తారు. ఇదే సముదాయంలో గ్రంథాలయం, శాసనసభకు సంబంధించిన కార్యాలయాలు, ఇతర వసతులకు సంబంధించిన నిర్మాణాలు ఉంటాయి.
 
ఇది పరేడ్‌ మైదానం...
194.jpg
స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంతోపాటు వివిధ సందర్భాల్లో కవాతు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘పరేడ్‌ మైదానం’ డిజైన్‌ ఇది. ఢిల్లీలోని రాజ్‌పథ్‌ స్ఫూర్తితో దీనిని రూపొందించారు. ప్రభుత్వ ప్రాథమ్యాలు, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా దీనిని ఏర్పాటు చేసేలా 3 ప్రదేశాలను సూచించారు.
 

13 జిల్లాలకు ప్రతిరూపాలు

రాజధానిలో 13 జిల్లాలకు చెందిన ప్రత్యేకతలన ప్రతిబింబించేలా నిర్మాణాలు ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాలను నిర్మిస్తారు. ఆయ జిల్లాలు, వాటికి ప్రాతినిధ్యం వహించే సాంస్కృతిక, కళా రూపాలు ఇవి... కృష్ణా - కూచిపూడి, విశాఖపట్నం - ఉక్కునగరం, సముద్రం, పశ్చిమ గోదావరి - కోనసీమ పచ్చదనం, ప్రకాశం - టంగుటూరి ప్రకాశం పంతులు, అనంతపురం - లేపాక్షి, చిత్తూరు - వెంకన్న ఆలయం, విజయనగరం - గుజరాడ అప్పారావు, శ్రీకాకుళం - సూర్యదేవాలయం, తూర్పు గోదావరి - రాజమండ్రిలో గోదావరిపై వంతెనలు, నెల్లూరు - వరి, కర్నూలు - శ్రీశైలం, కడప - నల్లరాయి.
 

రాజ్‌భవన్, సీఎం నివాసం ఎక్కడ?

గతంలో మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపికై, ఆ తర్వాత ప్రజలకు డిజైన్లు నచ్చని దృష్ట్యా తొలగింపునకు గురైన మాకీ అండ్‌ అసోసియేట్స్‌ (జపాన) రూపొందించిన ఆకృతుల్లో రాజ్‌భవన, ముఖ్యమంత్రి అధికారిక నివాసాలను కృష్ణా నదీ తీరాన, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు ఉత్తర కొసన చూపారు. ప్రస్తుతం నార్మన ఫోస్టర్స్‌ డిజైన్లలో కూడా అలాగే చూపించింది. అయితే... అవసరం, సౌలభ్యాన్ని బట్టి వీటిని మార్చుకునేందుకు వీలుగా మొత్తం నాలుగు వేర్వేరు చోట్ల ఈ భవనాలను నిర్మించవచ్చునని సూచించారు. ఆ మేరకు ‘రాష్ట్ర అతిథి గృహం’ నిర్మాణ ప్రదేశాన్ని కూడా మార్చారు.
 

స్థలం కేటాయింపు ఇలా...

కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు 19,15,976 చదరపు అడుగులు కేటాయించారు. అలాగే... రిటైల్‌ వినియోగానికి 19,37,504, మంత్రుల నివాస సముదాయాలకు 5,95,244, సాంస్కృతిక పరమైన నిర్మాణాలకు 11,19,447, విద్యా సంస్థలకు 5,62,414 చదరపు అడుగులు కేటాయించాలని ప్రతిపాదించారు.
 

3 వర్గాలుగా నివాస సముదాయాలు
పరిపాలనా నగరిలో నివాస సముదాయాలు 3 రకాలుగా ఉండాలని మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ సూచించారు. తక్కువ అంతస్తులు (4 నుంచి 6 ఫ్లోర్లు), మధ్యస్థం (8 అంతస్థుల వరకు), భారీ భవనాలు (12 అంతస్థల వరకు)గా వీటిని వర్గీకరించారు. నగరంలో ఉష్ణోగ్రతల నియంత్రణకుగాను వీటిల్లో హైరైజ్‌ భవనాలను నదీ తీరానికి దగ్గరగా నిర్మించాలని... ఆ తర్వాత (దక్షిణ దిశగా) మధ్యస్థ, చివరిగా తక్కువ అంతస్థుల భవనాలను నిర్మించాలని ప్రతిపాదించారు.

- ఆంధ్రజ్యోతి, అమరావతి
Link to comment
Share on other sites

 

  plan_01.png

plan_02.png

 

I am trying to send my feed back since yesterday.  Showing characters remaining 217, but while submitting showing 500 characters only dialogue and not accepting.  

 

 

 

Submitted from here.

https://crda.ap.gov.in/APCRDA/UserInterface/Admin/CitizenSuggestionsForm.aspx

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...