Jump to content

Amaravati


Recommended Posts

అమరావతి అంతా గ్రీన్‌ బిల్డింగ్స్‌!
12-02-2019 04:20:22
 
  • కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసిన సీఆర్డీయే
  • రేపు డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌కు సీఎం శంకుస్థాపన
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కాలుష్యానికి ఆస్కారం లేకుండా.. ఇంధన వనరుల సమర్థ వినియోగార్థం రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాలూ గ్రీన్‌ బిల్డింగ్‌లుగా నిర్మితమయ్యేలా ఒక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశామని ఏపీసీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. భారత్‌లోనే అత్యంత పెద్దదిగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేస్తారని ఆయన వెల్లడించారు.
 
‘గ్రీన్‌ బిల్డింగ్‌ రేటింగ్స్‌, అడ్వాన్స్‌డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌’ అనే అంశంపై సీఆర్డీయే, ఏపీసీడ్‌కో, తెరి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో సోమవారం జరిగిన ఒకరోజు వర్క్‌షా్‌పలో శ్రీధర్‌ ప్రసంగించారు. 2,000 మెగావాట్లలోపు విద్యుత్తును వినియోగించే నివాస భవంతులను ఇంధన సామర్థ్యంతో నిర్మించేందుకు జ్యూరిచ్‌కు చెందిన ఒక సంస్థతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. అమరావతిలో డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థను నెలకొల్పనున్నామని, తద్వారా 40 శాతం ఇంధనం ఆదా అవుతుందని అన్నారు. రాజధానిలోని అన్ని ప్రభుత్వ, నివాస, వాణిజ్య భవంతుల శీతలీకరణ అవసరాలన్నింటినీ ఈ వ్యవస్థ ద్వారా తీరుస్తామని పేర్కొన్నారు.
 
నగరంలోని అన్ని భవంతులూ ఐజీబీసీ లేదా గృహ రేటింగ్‌ను కలిగి ఉండాలని, అన్ని ఐకానిక్‌ భవనాలు 5 స్టార్‌ రేటెడ్‌గా నిర్మితమవ్వాలని పేర్కొన్నారు. సీఆర్డీయే స్పెషల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావు, రాష్ట్ర ఇంధన సలహాదారుడు కె.రంగనాధం, ఏపీసీడ్‌కో సీఈవో అండ్‌ ఎండీ ఎ.చంద్రశేఖరరెడ్డి, తెరి ప్రతినిధులు సోనియారాణి, యతిన్‌ చౌదరి, హరకుమార్‌వర్మ నంబూరు, అనంత్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, ఐటీ టవర్ల నిర్మాణానికి టెండర్లు
13-02-2019 08:56:29
 
అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, ఐటీ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 18వతేదీ నుంచి మార్చి 14వరకు బిడ్లకు గడువును విధించింది. కాగా... రూ.455 కోట్లతో అసెంబ్లీని నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. అలాగే రూ.328.50 కోట్ల అంచనా వ్యయంతో ఐటీ పార్కును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

Link to comment
Share on other sites

అమరావతికి కొత్త సొగసులు

 

శంకుస్థాపనలు చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
శాఖమూరు తొలిదశ పార్కు ప్రారంభం
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి అవసరాలు తీర్చేలా... కొత్త సొగసులు అద్దేలా అనేక ప్రాజెక్టులకు అమరావతి అభివృద్ధి కార్పొరేషన్‌ ప్రణాళిక రచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బుధవారం ఈ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో అనేక కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.
* రాజధానికి నీరందించేందుకు వీలుగా దాదాపు 10 టీఎంసీల నిల్వకు అవకాశం ఉండేలా రూ.2169 కోట్ల అంచనా వ్యయంతో వైకుంఠపురం బ్యారేజి నిర్మించనున్నారు. బ్యారేజి పనులకు సీఎం వైకుంఠపురం వెళ్లి శంకుస్థాపన చేస్తారు. మిగిలిన శంకుస్థాపనలను విజయవాడలోని ఒక హోటల్‌లో సంతోష నగరాల సదస్సు వేదిక నుంచి రిమోట్‌ సాయంతో శ్రీకారం చుట్టనున్నారు.
* అమరావతిలో మొత్తం రూ.1931.94 కోట్ల అంచనా వ్యయంతో కీలకమైన దాదాపు 9 రహదారులు, ఆరు వంతెనలు పనులు, సీవరేజి వ్యవస్థ ఏర్పాటు సైకిలు ట్రాక్‌ పనులు మొదలుపెట్టనున్నారు.
* రూ.1054.20 కోట్ల అంచనా వ్యయంతో రాజధాని వరద నివారణ పనులూ పట్టాలకు ఎక్కబోతున్నాయి. దీనికి తోడు రూ.537.37 కోట్లతో కృష్ణా నది కుడి గట్టును పటిష్ఠం చేయనున్నారు.
* శాఖమూరు పార్కు తొలిదశలో భాగంగా రూ.40 కోట్లతో రాజధానిలోనే 20 ఎకరాల్లో అటవీవనాన్ని ఏర్పాటు చేశారు.ఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. శాఖమూరు పార్కులో రూ.129.83 కోట్టతో రోజ్‌ గార్డెన్‌, క్రాఫ్ట్‌ బజారు, ముఖద్వారం తదితరాలు చేపట్టబోతున్నారు.
* 30 ఎకరాల్లో రూ.100 కోట్లతో ఆహ్లాదకర, వినోద సమ్మిళిత పార్క్‌కు శంకుస్థాపన.
* 10 ఎకరాల్లో రూ.30 కోట్ల అంచనా వ్యయంతో పర్యావరణహిత రిసార్ట్‌లకు అంకురార్పణ.
* 15 ఎకరాల్లో రూ.30 కోట్లతో నిర్మించే అడ్వెంచర్‌ పార్కుకు శంకుస్థాపన.
* 4.1 ఎకరాల్లో రూ.50 కోట్లతో క్రీడలు, వినోద కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం.
* రూ.40 కోట్లతో మూడు ఎకరాలలో త్రీస్టార్‌ రిసార్ట్‌కు శంకుస్థానప.

నేడు మంత్రిమండలి భేటీ
మళ్లీ దిల్లీకి ముఖ్యమంత్రి

దిల్లీ నుంచి మంగళవారం రాత్రికి విజయవాడ చేరుకున్న చంద్రబాబు బుధవారం ఉదయం 8 గంటలకు మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం శంకుస్థాపనలు పూర్తి చేస్తారు. ఆనంద నగరాల సదస్సులో పాల్గొంటారు. తర్వాత మళ్లీ దిల్లీ బయలుదేరి వెళ్తారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖ నగరానికి చేరుకుంటారు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయాల్సి ఉండగా ఈ కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేశారు. ఒక వేళ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు గురువారం ఉదయమే ఈ శంకుస్థాపనలో సీఎం పాల్గొంటారు.

 

Link to comment
Share on other sites

విజ్ఞాన నగరంగా అమరావతి

 

సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ వెల్లడి
వివిధ దేశాల మేయర్లు, కమిషనర్లతో సమావేశం

ఈనాడు-అమరావతి: రాజధాని అమరావతిని విజ్ఞాన నగరంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. ప్రపంచంలోని 40నగరాల నుంచి హాజరైన మేయర్లు, కమిషనర్లు, ఇతర నిపుణులతో మంగళవారం ఆయన ఇక్కడ సమావేశమయ్యారు. అమరావతిలో ఇప్పటికే వెల్లూరు, ఎస్‌ఆర్‌ఎం, ఎన్‌ఐడీ విద్యా సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు. 46 నుంచి 47 నెలల వ్యవధిలోనే అభివృద్ధి సాధించామని తెలిపారు. నగర ప్రత్యేకతలను వివరించారు. రాజధాని మరింత ప్రగతి సాధించడానికి సూచనలు అందించాలని అతిథులను కోరారు. సంతోష నగరాల సదస్సు- 2019 విశేషాలను కూడా తెలిపారు. మూడు రోజుల సదస్సును బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని ఒక హోటల్‌లో ప్రారంభిస్తారు. అంతకుముందు కమిషనర్‌ రాజధాని ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను మేయర్లు, కమిషనర్లకు చూపించారు.

Link to comment
Share on other sites

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి భూమిపూజ చేయనున్న సీఎం
13-02-2019 22:13:50
 
636856929379475923.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉదయం తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరుకానున్నారు. ఈ ఆస్పత్రికి ప్రభుత్వం 15 ఎకరాల భూమి కేటాయించింది. హైదరాబాద్‌లో ఈ ఆస్పత్రి సేవలు కొనసాగుతున్న విషయం విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్ వ్యాధిగస్తులకు ఏపీ రాజధాని ప్రాంతంలోనూ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి గురువారం భూమి పూజ చేయనున్నారు.
Link to comment
Share on other sites

గతి మార్చే అమరావతి!
14-02-2019 03:27:57
 
636857116780640508.jpg
  • ఆనంద నగరి, అందరికీ నెలవు.. నాణ్యమైన,సంతోష స్థాయులతో అత్యుత్తమ నగరంగా అవతరణ
  • ఎక్కడెక్కడి వారూ ఇక్కడికి వచ్చి స్థిరపడాలనిపించేలా నిర్మాణం
  • నూత్న యోచన, టెక్నాలజీలతో పెరగనున్న పట్టణాల సంతోషం
  • కాలాన్ని దాటి సాగితేనే విజయం
  • ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
  • విజయవాడలో అతి కోలాహలంగా హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌ ప్రారంభం
  • ఒకే వేదిక నుంచి రూ.8 వేల కోట్ల
  • ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
అత్యుత్తమ సంతోషస్థాయులతో, అత్యున్నత జీవన ప్రమాణాలతో ప్రపంచంలోని ఎక్కడి వారికైనా అందులోనే నివసించాలనిపించేలా అమరావతి రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘పలు రాజధాని నగరాలు కేవలం పరిపాలనా కేంద్రాలుగానే మిగిలిపోవడంతో సాయంత్రమయ్యేసరికి నిర్మానుష్యంగా మారి, నిస్సారంగా, నిర్జీవంగా కనిపిస్తాయి. అమరావతిలో మాత్రం ఆ పరిస్థితి రానీయబోం. నిరంతరం కళకళలాడేలా పలు చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించారు. అమరావతితోపాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలన్నింటినీ ఆనందాలకు లోగిళ్లుగా మలచే ఉద్దేశ్యంతో సీఆర్డీయే నిర్వహిస్తున్న హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌-2019ను బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి ప్రారంభించారు.
 
30కిపైగా దేశాల్లోని పలు నగరాల మేయర్లు, కమిషనర్లతోపాటు వందలాదిమంది నిపుణులు సదస్సుకు హాజరయ్యారు. ఈ నాలుగున్నరేళ్లలో హ్యాపీ సిటీస్‌ సదస్సును సీఆర్డీయే జరపడం ఇది రెండోసారి. అత్యంత నాణ్యమైన జీవనానికి అసలైన చిరునామాగా అమరావతి నిలవబోతోందని సీఎం అన్నారు. ‘‘కాలంతోపాటు, ఆ మాటకొస్తే కాలానికంటే ముందుగానే ఆలోచించి, వినూత్న ఆవిష్కరణలతో, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సాగితేనే ఏ నగరమైనా పదికాలాలపాటు మనగలుగుతుంది. కేవలం సంపాదనతోనే సంతోషం కలగదు. నాణ్యమైన నీరు, ఆహారం, గాలితో కూడిన అత్యుత్తమ జీవన ప్రమాణాలను అందిస్తేనే ప్రజలు ఆనందంగా జీవించగలుగుతారు’’ అని వివరించారు.
 
కేవలం ఉన్నతాదాయ వర్గాలకే అమరావతి పరిమితం కారాదన్న భావనతో అల్పాదాయ వర్గాల కోసం 500 ఎకరాల్లో 50వేల గృహాలను నిర్మిస్తున్నామని చెప్పారు. గతంలో జరిగిన పారిశ్రామిక విప్లవాలతో పారిశ్రామికీకరణ జరగ్గా, ప్రస్తుత ఇన్ఫర్మేషన్‌, నాలెడ్జ్‌ విప్లవంతో ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుందని, దీనిని గుర్తించే తాను ‘వయాడక్ట్‌’ సూత్రాన్ని ప్రతిపాదించానని పేర్కొన్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, అలీబాబా వంటి ప్రముఖ సంస్థల విజయరహస్యం సృజనాత్మకతతో కూడిన ఆలోచనలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలోనే ఉన్నదని, ఇదే సూత్రాన్ని మనమూ పాటిస్తే అమరావతి నాలెడ్జ్‌ హబ్‌గా ఎదుగు తుం దని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
 
నిపుణుల సూచనలు..
దేశ విదేశాలకు చెందిన పలువురు పట్టణీకరణ నిపుణులు.. ప్రజల్లో సంతోషస్థాయులను పెంచడమెలాగన్న దానిపై పలు సూచనలిచ్చారు. అమరావతితోపాటు పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ చెప్పారు. ఇప్పటికే విజయవాడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనుల్లో భాగస్వాములం అయ్యామని, అమరావతి నిర్మాణంలోనూ సహకరించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని భారత్‌లో ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ మైఖేల్‌ తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతోనే సంతోష నగరాలు సాధ్యమవుతాయని భూటాన్‌లోని థింఫూ నగర మేయర్‌ కిన్లే దోర్జి అన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించేందుకు అమరావతి చక్కటి వేదికగా నిలుస్తుందని ఏపీసీఆర్డీయే ముఖ్య కార్యదర్శి, అజయ్‌ జైన్‌, ఆ సంస్థ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు.
 
ఈ సదస్సులో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా, బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిడర్డ్‌, స్మార్ట్‌ దుబాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఐషా బిన్‌ బి్‌ష్ర, హజీం గలాల్‌, ఫ్రాన్సిస్‌ ఛోగ్‌ (సింగపూర్‌), ప్రిన్స్‌ (ఘనా), తుషార సంజీవ (శ్రీలంక), అడ్నాన్‌ (టర్కీ), ఏడీసీ సీఎండీ డీ లక్ష్మీ పార్థసారధి, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, కమిషనర్‌ నివాస్‌, సింగపూర్‌, ఘనా, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నిపుణులు పాల్గొన్నారు.
 
సుఖ జీవనానికి పంచ సూత్రాలు
  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌
  • ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌
  • అవినీతి రహిత సమాజం
  • అందరికీ అందుబాటులో సాంకేతికత
  • పర్యావరణ పరిరక్షణ
రివర్‌ఫ్రంట్‌ అమరావతి సొంతం
ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులుంటేనే నాణ్యమైన జీవనం సాధ్యం. దీనికోసమే అమరావతిని చక్కటి పచ్చదనంతో, అద్భుత రివర్‌ఫ్రంట్‌తో అభివృద్ధి పరుస్తున్నాం. ప్రపంచంలోని మరే నగరానికీ లేని విధంగా అమరావతిని సుమారు 21 కిలోమీటర్లకుపైగా ఆనుకుని కృష్ణానది ప్రవహిస్తోంది. ఈ నదీ తీరప్రాంతాన్ని మరింత ఆహ్లాదభరితం చేసేందుకు వైకుంఠపురం, ప్రకాశం, చోడవరం బ్యారేజీలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిల్లో వైకుంఠపురం, చోడవరం బ్యారేజీలు పూర్తయితే సుమారు 100- 120 కిలోమీటర్ల పొడవైన రివర్‌ ఫ్రంట్‌ పుష్కలమైన మంచినీటితో మనకు అందుబాటులోకి వస్తుంది. అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ నగరమైనందున ఇక్కడ వినూత్న ఆలోచనలకు ఆకాశమే హద్దు’’
 
నేను నిత్య విద్యార్థిని
‘‘నేను నిత్య విద్యార్థిని. ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటాను. అలా నేర్చుకున్న దానిని రాష్ట్రాభ్యున్నతి కోసమే వినియోగిస్తాను. వినూత్న ఆలోచనలు, సృజనను నేనెప్పుడూ స్వాగతిస్తాను. ఇబ్బడిముబ్బడిగా కొత్త ఐడియాలను ఇవ్వడం ద్వారా నాకు అందరూ తోడ్పడాలి. అమరావతిని ప్రజోపయోగకర ఆలోచనలకు పరీక్షాస్థలిగా నిపుణులు మార్చుకోవాలి. ఎన్నికల హడావుడి లేకుంటే మరింత సమయం ఈ సదస్సులోని నిపుణుల మధ్య గడిపేవాడిని’’
 
ఒక్క ఐడియా జీవితాలనే మార్చేస్తుంది
‘వైవిధ్యంతో కూడిన, ప్రజోపయోగకరమైన ఒక్క ఆలోచన ఊహించలేని అద్భుత విజయాలను అందిస్తుంది. అమరావతి నిర్మాణంలో తొలిమెట్టుగా చేసిన ‘భూసమీకరణే’ దీనికి పెద్ద ఉదాహరణ. విభజనానంతర రాష్ట్రంలో కనీస వనరులూ కరువైన తరుణంలో అమరావతి వంటి ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తున్నామంటే అప్పట్లో నాకు వచ్చిన ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం యోచనే కారణం. 71.76 లక్షల వ్యవసాయ పంపుసెట్లు సౌర విద్యుత్‌తో నడిచేలా చేయాలన్న యోచన సైతం విద్యుత్తును పెద్దఎత్తున ఆదా చేసి, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది’
 
 
FOUNDATION-OF-30-PRIVATE-IN.jpgశంకుస్థాపనలు- ఆవిష్కరణలు
రూ.8,000 కోట్ల విలువైన అమరావతిలోని 30 ప్రాజెక్ట్‌లకు హ్యాపీ సిటీస్‌ సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు జరిపారు.డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టం, వరుణ్‌ నోవోటెల్‌ 5 స్టార్‌ హోటల్‌, మైస్‌ హబ్‌, కోస్తా మెరీనా, కమర్షియల్‌ మాల్‌, గోపీచంద్‌ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌, మాలక్ష్మీ డబుల్‌ట్రీ 5 స్టార్‌ హోటల్‌, గ్రాండ్‌ ప్లాజా అమరావతి, పోధార్‌, ర్యాన్‌, గ్లెండేల్‌ మాలక్ష్మి ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, హ్యాపీనెస్ట్‌ శంకుస్థాపనలు జరుపుకొన్నవాటిలో ఉన్నాయి.
 
ఇవి కాకుండా, అమరావతి సెంట్రల్‌ పార్క్‌ (శాఖమూరు పార్క్‌)లో రూ.40కోట్లతో అభివృద్ధి పరచిన వైల్డర్‌నెస్‌ పార్క్‌ను చంద్రబాబు ప్రారంభించారు. రూ.130కోట్లతో చేపట్టనున్న రోజ్‌గార్డెన్‌, క్రాఫ్ట్‌ బజార్‌, రూ.100కోట్లతో నిర్మించే అమ్యూజ్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్క్‌, రూ.30కోట్లతో నిర్మించే ఎకో రిసార్ట్‌, రూ.30కోట్ల వ్యయమయ్యే అడ్వెంచర్‌ పార్క్‌, రూ.10కోట్లతో అభివృద్ధి పరిచే బోటింగ్‌, జలక్రీడలు, రూ.50కోట్లతో నిర్మించే స్పోర్ట్స్‌ అండ్‌ రిక్రియేషన్‌ సెంటర్‌, రూ.40కోట్లతో చేపట్టే 3స్టార్‌ రిసార్ట్‌కు సీఎం శంకుస్థాపన చేశారు.
 
9 రహదారులను అభివృద్ధి పరచేందుకు రూ.1931.94కోట్లతో చేపట్టనున్న పథకానికి, రూ.1054.20కోట్లతో వరద నియంత్రణ పనులకు, కృష్ణానది కుడివైపున రూ.537.37కోట్లతో నిర్మించనున్న ఇన్‌స్పెక్షన్‌ పాత్‌కు కూడా శంకుస్థాపన జరిపారు. 2వేల మెగావాట్ల స్మార్ట్‌ సిటీ ఎంవోయూతోపాటు సీఆర్‌సీడబ్ల్యూఎ్‌ససీ అనే సంస్థతో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కుదుర్చుకున్న ఎంవో యూ ఖరారైంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ రూపొందించిన అమరావతి-2050 నివేదికను సీఎం ఆవిష్కరించారు.
 
 

Advertisement

Link to comment
Share on other sites

సింగపూర్‌కు దీటుగా అమరావతి

 

సంక్షోభంలో అవకాశాలు సృష్టించి రాజధాని నిర్మాణం
నమ్మిన రైతులకు, సహకరించిన సింగపూర్‌కు కృతజ్ఞతలు
ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలు, సాంకేతికత వినియోగంలో ముందుంటాం
ఆలోచనలు, సలహాలు అందించి రాజధాని అభివృద్ధికి సహకరించాలి
సంతోష నగరాల అంతర్జాతీయ సదస్సులో చంద్రబాబు
ఈనాడు - అమరావతి

13ap-main10a_3.jpg

‘సింగపూర్‌ను మించిన నగరంగా అమరావతిని నిర్మించి భవిష్యత్తు తరాలు సంతోషంగా జీవించే వాతావరణం కల్పిస్తున్నాం. సంక్షోభం నుంచి అవకాశాలను సృష్టించి ఏర్పాటవుతోన్న అమరావతి నగరం ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా నిలిచిపోతుంది. ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా నిలిచిపోతుంది. ఉన్నత ప్రమాణాలతో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతున్నాం. సౌర, పవన విద్యుత్తుని మొదటి ప్రాధాన్య అంశంగా పరిగణిస్తున్నాం. ఇక్కడ నివసించే వారంతా ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తారని కచ్చితంగా చెప్పగలను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సును విజయవాడలోని ఒక హోటల్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ప్రభుత్వంపై నమ్మకంతో 28 వేల మంది రైతులు 34 వేల ఎకరాలను ఇవ్వడం దేశంలోనే మొదటిసారి అని, సింగపూర్‌ ప్రభుత్వం రూపాయి తీసుకోకుండా రాజధాని ప్రాంత అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక తయారు చేసి అందివ్వడం మరో గొప్ప విషయమని చెప్పారు. ‘అమరావతికృష్ణా నదికి అభిముఖంగా 100 నుంచి 120 కిలోమీటర్ల పొడవునా స్వచ్ఛమైన నీరు కలిగి ఉన్న అందమైన రాజధాని.  ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు శీతల సదుపాయాన్ని కల్పించే ప్రత్యేక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నాం. దీంతో విద్యుత్తు వినియోగం 22 నుంచి 30 శాతం ఆదా అవుతుంద’ని వివరించారు.

వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా రాజధాని
‘అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తూ వాణిజ్య కార్యకలాపాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు ఇక్కడ ఏర్పావుతున్నాయి. ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా, ఉపాధి కల్పించేలా రాజధానిని నిర్మిస్తున్నాం. 500 ఎకరాల్లో పేద కుటుంబాలకు రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో 15 వేల గృహాలను నిర్మిస్తున్నాం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన నిపుణులు అమరావతి అభివృద్ధికి  సూచనలు, సలహాలు ఇస్తే వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది కూడా నిర్వహించే సదస్సుకి మీరంతా మరోసారి తరలిరావాలి. సులభతర వాణిజ్యంలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచాం. దేశంలో మొదటిసారి విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. సమాచార, సాంకేతిక రంగంలో ఇదో గొప్ప విప్లవం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో అమరావతిలో చేపట్టే పలు ప్రాజెక్టులకు ఆకర్షణీయ నగరాల వేదికపై నుంచి ముఖ్యమంత్రి  ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటిలో హోటళ్లు, వినోద, విద్య సంబంధిత ప్రాజెక్టులు ఉన్నాయి. ‘అమరావతి-2050’ పేరుతో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ సిటీస్‌ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సీఆర్‌సీడబ్ల్యూఎస్‌, విజయవాడ నగరపాలక సంస్థ మధ్య ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.

పంచ ప్రణాళికలివీ
సమర్థ నాయకత్వం, దీర్ఘకాలిక ప్రణాళికలు, భద్రత, సకాలంలో పౌర సేవలు, ప్రజల్లో సాధికారత.. ఈ ఐదింటి అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఐషా బిన్‌ బిషర్‌ వివరించారు.
* సింగపూర్‌లో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, ఇతర ఉత్తమ విధానాలను ఆ దేశ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖ (ఎంటీఐ) సీనియర్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ చాంగ్‌ వివరించారు. ఇదే తరహా అభివృద్ధి అమరావతిలోనూ సాధ్యమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
* ప్రభుత్వ పాలనలో ఆధునిక సాంకేతికత వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంతో ముందుందని బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్ల్మింగ్‌ చెప్పారు.
* ‘ఆకర్షణీయ విశాఖ’ నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ బి హడ్డా వివరించారు.
* కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ జిరాడ్‌ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత వినియోగంలో భారత్‌ ఎంతో ముందంజలో ఉందని, యువత ఎక్కువగా ఉండటం భారత్‌కు కలిసివచ్చే అంశమని అన్నారు.
అమరావతి అభివృద్ధికి సహకరించాలి: పురపాలక మంత్రి నారాయణ మాట్లాడుతూ పట్టణాల్లో మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌,  సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు మాట్లాడారు.

13ap-main10b_1.jpgపంచ ప్రణాళికలతో  ‘సంతోషం’
‘స్మార్ట్‌ దుబాయి’ డైరెక్టర్‌ జనరల్‌ ఐషా బిన్‌

ఈనాడు-అమరావతి: నగరాల్లో ప్రజలు సంతోషంగా ఉండాలంటే పంచ ప్రణాళికలు అవసరమని ‘స్మార్ట్‌ దుబాయి’ డైరెక్టర్‌ జనరల్‌ ఐషా బిన్‌ బిషర్‌ అన్నారు. విజయవాడలో బుధవారం ప్రారంభమైన అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సులో.. ‘ఆకర్షణీయ (స్మార్ట్‌) నగరాల్లో ఉత్తమ విధానాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. నగరాల సమగ్ర అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఇతర దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

 

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...