Jump to content

Amaravati


Recommended Posts

7 minutes ago, katti said:

shearwall tech lo walls are build in the factories and brought anukunta. Diagrid tech ante they will use iron bars on the outside of the building for support. Internally there would not be any pillars.

- Shear wall: its like concrete walls. Ex: NGO buidings

- Prefab: built some where as per design and assembles oniste. Ex: CRDA office buiding

 

Link to comment
Share on other sites

నవ నిర్మాణం
28-12-2018 02:52:12
 
636815623315219435.jpg
  • శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేసిన సీఎం
  • అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఐదు టవర్లు
  • ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌, డయాగ్రిడ్‌ విధానం
  • 33 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేస్తాం
  • ఆత్మగౌరవానికి ప్రతీకగా రాజధాని: సీఎం
  • సచివాలయానికి శ్రీకారం
  • సచివాలయ నిర్మాణ పనులు ఆరంభం
గుంటూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ నిర్మాణంలో కీలకమైన అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ‘ఐకానిక్‌’గా నిర్మిస్తున్న ఈ ఐదు ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి గురువారం ఉదయం 8.50 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. ఐదు టవర్లలో రెండో టవర్‌ కోసం ఇనుప చట్రాలతో ఏర్పాటు చేసిన భారీ ర్యాఫ్ట్‌పైకి వెళ్లి... వాస్తు ప్రకారం అర్చకులు నిర్దేశించిన ప్రాంతంలో, వేద మంత్రాల నడుమ పూజా ద్రవ్యాలను వదిలారు. అందులో సిమెంటు మిశ్రమాన్ని వేసి... టవర్లకు పునాదులు (ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌) వేసే భారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు నిర్మాణ స్థలం వద్ద శాంతి హోమం కూడా నిర్వహించారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
 
ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇది జీవితంలో మరిచిపోలేని సంఘటన’’ అని తెలిపారు. సచివాలయ భవనాల శంకుస్థాపనను రాజధాని నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించారు. ఆధునికత, సాంకేతిక ప్రమాణాలతో నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ‘‘అమరావతిలో ప్రపంచంలోనే అత్యంత ఎతైన పరిపాలన భవనాలు నిర్మిస్తున్నాం. టవర్ల నిర్మాణం కోసం మాస్‌ కాంక్రీట్‌ విధానంలో పునాది వేస్తున్నారు. ఒక్కో టవర్‌కు 57 మీటర్ల పొడవు, 57 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల ఎత్తైన ఇనుప చట్రాల నిర్మాణంలో... 12వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ నింపుతారు. ఇలాంటి నిర్మాణం చేపట్టడం దేశంలోనే తొలిసారి. 40 అంతస్థులతో నాలుగు, 50 అంతస్థులతో ఒక భవనం నిర్మిస్తున్నాం. పిల్లర్లు లేకుండా అంతా డయాగ్రిడ్‌ విధానంలో నిర్మిస్తున్నాం. శుక్రవారం నుంచి నిరంతరాయంగా పనులు కొనసాగుతాయి’’ అని చంద్రబాబు వివరించారు.
 
మొత్తం ఐదు టవర్లలో 16 వేల మంది ఉద్యోగులు పని చేస్తారన్నారు. ‘‘తెలుగువారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది. సచివాలయ ప్రాగణంలో 4 వేల కార్లు పార్క్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి 10 వేల మంది సందర్శకులకు ఆతిథ్యం లభిస్తుంది. 33 నెలల్లో ఐదు టవర్ల నిర్మాణం పూర్తవుతుంది’’ అని చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం రైతులు భూములు ఇవ్వడం వల్లే ఇలాంటి నిర్మాణాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. ప్రజల సహకారం, ప్రభుత్వ దూరదృష్టితో ఏదైనా సాధ్యమన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో పేద వారికి కూడా స్థానం ఉండాలన్న ప్రణాళికతో నిర్మాణాలు చేపడున్నట్లు తెలిపారు. రాజధాని పరిధిలో అర్హులకు ఇళ్లు ఇస్తామన్నారు. 50 వేల మంది పేదలకు ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఇకపై కొండవీటివాగు ముంపు ఉండదని, సుందరమైన రాజధానిగా అమరావతి తయారవుతుందని ప్రకటించారు. మరోవైపు... ఆరు నెలల్లో పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు , నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.
 
 
ఆనందం.. ఆహ్లాదం!
సచివాలయ టవర్లకు శంకుస్థాపన కార్యక్రమం యావత్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఇవీ ఆ విశేషాలు...
  • టవర్ల నిర్మాణంతోపాటు అమరావతికి సంబంధించి కీలకపాత్ర పోషిస్తున్న ఇంజనీర్లు, అధికారులను సీఎం చంద్రబాబు దగ్గరికి పిలిచి, భుజం మీద చేయి వేసి ఫొటో దిగి అభినందనలు తెలిపారు.
  • ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ శంకుస్థాపన కార్యక్రమంలో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సీఎంకు జ్ఞాపికను బహూకరించారు.
  • పునాది కోసం ఇనుప కడ్డీలతో ఏర్పాటు చేసిన ‘ర్యాఫ్ట్‌’ను సందర్శకులు ఆసక్తిగా గమనించారు. ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ అంటే ఏమిటి? 40-50 అంతస్తుల భవనాలను పిల్లర్లు లేకుండా ఎలా నిర్మిస్తారు? అంటూ పలు వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకోవడం కనిపించింది.
  • శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత రైతులు, సందర్శకులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఇడ్లీ, వడ, కట్టెపొంగలి, కేసరి, సాంబారు, చట్నీలతో రుచికరమైన అల్పాహారం వడ్డించారు.
మురిసిన రాయపూడి
నిన్నటి వరకు ఆ గ్రామం అంటే మేలైన నిమ్మ, అరటి, జామ కాయలు గుర్తుకొచ్చేవి. ఇప్పుడు అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న రాష్ట్ర పరిపాలన భవనానికి అదే వేదిక అయింది. ఈ సన్నివేశానికి ఆతిథ్య గ్రామం రాయపూడి మురిసింది.
 
చకచకా పనులు
సీఎం పూజలు చేసి పనులు ప్రారంభించడమే ఆలస్యం... పనులు శరవేగంగా మొదలయ్యాయి. సీఎం శంకుస్థాపన చేసిన శాశ్వత సచివాలయం రెండో టవర్‌ కాంక్రీట్‌ ర్యాఫ్ట్‌లోకి ఆరు పంపులతో కాంక్రీట్‌ను నింపడం మొదలైంది. గురువారం సాయంత్రం ఆరుగంటలకల్లా 800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వేశారు. రాత్రి ఫ్లడ్‌ లైట్ల వెలుగులో కూడా పనులు కొనసాగిస్తున్నారు. 3 రోజులపాటు నిరంతరాయంగా ఈ పనులు జరుగుతాయి.
 
ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ అంటే...
సాధారణ పునాదులకు... గోతులు తీసి, లోపల కాంక్రీట్‌ వేసి, పైకి స్తంభాలు తీసుకొస్తారు. ర్యాఫ్ట్‌లో అలా కాదు. నిర్ణీత ప్రాంతం మొత్తాన్ని కాంక్రీట్‌తో నింపే ప్రక్రియే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌. స్టీలు, కాంక్రీటుతో అత్యంత పటిష్ఠమైన, మందపాటి దిమ్మెనే భవనానికి పునాదిగా వాడతారు.
- గుంటూరు/తుళ్లూరు, ఆంధ్రజ్యోతి
Link to comment
Share on other sites

అద్భుత ఘట్టం రైతుల సహృదయంతోనే సాధ్యం
28-12-2018 10:47:15
 
636815908344778913.jpg
 
  • అమరావతి అభివృద్ధికి ప్రత్యక్ష సాక్షులు మీరే..
  • రాజధాని పరిధిలో పేదలందరికీ ఇళ్లు
  • భావితరాల భవిష్యత్తుకు పునాదిగా అమరావతి
  • ప్రపంచంలోనే సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతాం
  • సచివాలయం శంకు స్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ‘సచివాలయ టవర్ల’కు అంకురార్పణ జరిగింది. గురువారం ఉదయం 8-50 గంటలకు సీఎం చంద్రబాబు కొండమరాజుపాలెం, రాయపూడిలో సచివాలయం ఐదు టవర్ల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులకు శ్రీకారం చుట్టారు. అపూర్వ రీతిలో అమరావతిలోని సెక్రటేరియట్‌-హెచ్‌వోడీల కోసం ఐదు ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నారు. వీటిలో నాలుగు టవర్లను 40అంతస్థులు.. సీఎం కొలువుతీరే జీఏడీ టవర్‌ను 50 అంతస్థులతో ‘ఐకానిక్‌’గా నిర్మిస్తున్నారు. శాంతి హోమంతో ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులను ప్రారంభించిన సీఎం మాట్లాడుతూ ‘రైతులు భూములివ్వడం వల్లే ఇలాంటి నిర్మాణాలు సాధ్యమవుతున్నాయని, వారు చరిత్ర లో నిలిచిపోతారని కొనియాడారు.
 
గుంటూరు(ఆంధ్రజ్యోతి): ’రైతులు భూములివ్వడం వల్లే ఇలాంటి నిర్మాణాలు సాధ్యమవుతున్నాయి... వారి సహృదయం మరవలేం’ అని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు అన్నారు. కొండమరాజుపాలెం, రాయపూడిలో గురువారం ఉదయం ఆయన సచివాలయం ఐదు టవర్లకు ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు ప్రారంభించారు. తొలుత శాంతిహోమం నిర్వహించి సరిగ్గా ముహూర్తం సమయం ఉదయం 8-50 గంటలకు ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. ప్రజారాజధాని అమరావతి అభివృద్ధికి రైతులే ప్రత్యక్ష సాక్షులని అన్నారు. భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలుపుతూ... వారు చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో టవర్ల నిర్మాణం జరుగుతుందని, ప్రపంచానికే తలమానికంగా సచివాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు.
 
భావితరాల భవిష్యత్తుకు పునాది...
Untitled-38.jpgభావితరాల భవిష్యత్తుకు పునాదిగా రాజధాని అమరావతి నిలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇది ప్రజారాజధాని, ఇక్కడ అందరికీ చోటుంటుంది’ అని ఉద్వేగంగా ఆయన చెప్పుకొచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని... బౌద్ధస్తూపం ఆకారంలో ఐకానిక్‌ భవనం నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయ ప్రాగణంలో 4వేల కార్లు నిలు పుకొనేలా పార్కింగ్‌ అవకాశం ఉంటుందన్నారు. ఒకేసారి 10వేల మంది సందర్శకులకు అతిథ్యం లభిస్తుందని, 1375ఎకరాలలో పరిపాల భవనాలు ఉంటా యని వివరించారు.33 నెలల్లో టవర్ల నిర్మాణం పూర్తిచేస్తామని సీఎం తెలిపారు.
 
రాజధాని ప్రాంతంలో అందరికీ ఇళ్లు... 
ప్రజారాజధాని అమరావతిలో పేదవారికి కూడా స్థానం ఉండాలన్న ప్రణాళికతో నిర్మాణాలు చేపడున్నట్లు సీఎం తెలిపారు. రాజధాని పరిధిలో అర్హులందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. అందులో భాగంగా 50 వేల మంది అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో బయట నుంచి వచ్చి స్థిరపడాలనుకునే పేదల అవసరాల కోసం 500 ఎకరాల భూమిని రిజర్వుగా ఉంచతున్నామని సీఎం తెలిపారు. ఇకపై కొండవీటివాగు ముంపు ఉండదని... ప్రపంచంలోనే అతి సుందరమైన ప్రాంతంగా అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
 
Untitled-26.jpgకార్యక్రమంలో స్పీకర్‌ డాక్టర కోడెల శివప్రసాదరావు, మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, ఎంపీ కొనకళ్ల నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జేఆర్‌ పుష్పరాజ్‌, నన్నపనేని రాజకుమారి, జియావుద్దీన్‌, దాసరి రాజామాస్టారు, గోనుగుంట్ల కోటేశ్వరరావు, సీఆర్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌, ఏపీఎన్‌వోఓస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.ఆశోక్‌బాబు, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు.
 
దేశంలోనే తొలిసారి...
Untitled-37.jpgదేశంలోనే తొలిసారి ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. 11వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌తో సచివాలయ టవర్లకు ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేస్తున్నామని తెలిపారు. శుక్రవారం నుంచి నిరంతరాయంగా పనులు జరుగుతాయని, 1375ఎకరాల్లో పరిపాలన భవనం ఉంటుందని, 40 అంతస్థులతో నాలుగు టవర్లు, 50 అంతస్థులతో ఒక టవర్‌ నిర్మాణం పూర్తిచేస్తామని వివరించారు. శుక్రవారం నుంచి పనులు నిరంతరాయంగా జరుగుతాయని... 16 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్మాణాలు చేపట్టామని, 33 నెలల్లో టవర్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు
Link to comment
Share on other sites

ఈ గడ్డ నుంచే న్యాయపాలన

 

హైకోర్టు విభజనను స్వాగతిస్తున్నాం 
తొలుత సీఎం క్యాంపు కార్యాలయం   నుంచి న్యాయ కార్యకలాపాలు 
దేశంలోనే తొలిసారిగా   రాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానంలో  సచివాలయ పునాది పనులు 
36 నెలల్లో శాశ్వత రాజధాని   భవనాల నిర్మాణం పూర్తి 
ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు వెల్లడి 
రాష్ట్రంలోని 50వేల మంది పేదలకు  అమరావతిలో ఇళ్లు కేటాయిస్తామని వెల్లడి 
ఈనాడు - అమరావతి

27ap-main2a.jpg

‘‘హైకోర్టు విభజనను స్వాగతిస్తున్నాం. జనవరి 1 నుంచి పనిచేయడానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడకొచ్చాయి. హైకోర్టు కూడా వస్తే ఈ గడ్డ మీద నుంచే న్యాయపాలన జరుగుతుంది. అందుకే వారితో (న్యాయాధికారులు, న్యాయవాదులు) మాట్లాడి రెండు మూడు రోజులు విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి న్యాయకార్యకలాపాలు ప్రారంభించే ఏర్పాటు చేస్తాం. అనంతరం 10 నుంచి 15 రోజుల్లో అమరావతి రాజధాని ప్రాంతంలో కొత్తగా నిర్మించే తాత్కాలిక హైకోర్టు (జిల్లా కోర్టు భవనాలు)కు వస్తారు..’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. సచివాలయ టవర్స్‌ నిర్మాణంలో భాగంగా రాఫ్ట్‌ ఫౌండేషన్‌ మాస్‌ కాంక్రీట్‌ విధానంలో చేపట్టిన పునాది పనులకు ఆయన గురువారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సభాపతి డాక్టరు కోడెల  శివప్రసాదరావు, మంత్రులు పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ శాశ్వత హైకోర్టుకు దేశంలో ఎక్కడా లేని విధంగా బౌద్ధ స్థూపాకృతితో ఒక ఐకానిక్‌(దిగ్గజ) భవనం నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. ఆయన మాటల్లో...

ఒకే రోజు రెండు కీలక కార్యక్రమాలు 
ఒకే రోజు రాష్ట్రానికి ప్రధానమైన రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వెనకబడిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం మనందరికి గర్వకారణం. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టాం. ఇందుకు కారణమైన రైతులను, పనిచేస్తున్న అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కొండవీటివాగు వల్ల ముంపునకు గురయ్యే ఈ ప్రాంతం అతి సుందరమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా మన రాజధాని వైపు చూస్తోంది. నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తెస్తున్నాం. 225 మీటర్ల ఎత్తుతో.. ప్రైవేటు కార్యాలయాలకు భిన్నంగా ఆధునిక వసతులతో కూడిన ఇంటెలిజెంట్‌ (మేధో) భవనంగా.. ప్రపంచంలోనే ఎత్తైన సముదాయంగా నిర్మిస్తున్నాం.

27ap-main2b.jpg

రాష్ట్రంలోని 50 వేల మంది పేదలకు రాజధానిలో నివాసం 
ప్రజా రాజధానిలో ఈ ప్రాంతంలోని పేదలెవరూ తమకు ఇల్లు లేదనకూడదు. అందుకే అర్హులైన అందరికీ 1+4 విధానంలో ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పేదలు కూడా ఇక్కడకొచ్చి పనిచేయాలన్నా.. నివాసం ఏర్పరచుకోవాలన్నా వారికి కూడా 500 ఎకరాలు కేటాయించాలనుకుంటున్నాం. ఒక్కో చోట 50 ఎకరాలు కేటాయించి అక్కడ 5 వేల ప్లాట్లు చొప్పున నిర్మిస్తాం. ఇలా పది చోట్ల 500 ఎకరాల్లో 50 వేల మంది పేదలకు ప్రాధాన్యమిస్తాం.

27ap-main2c.jpg

సీఎం మాటల్లో... సచివాలయ ప్రాధాన్యాలు 
1,375 ఎకరాల్లో పరిపాలన నగరం. అందులో 41 ఎకరాల్లో అయిదు టవర్లతో సచివాలయం. 
4 టవర్లు 40 అంతస్తులు, మరోటి 50 అంతస్తులు. 
దేశంలో మొదటిసారిగా రాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానంలో పునాది. 
మొత్తం 56 లక్షల చదరపు అడుగుల నిర్మాణం. 
13 లక్షల చదరపు అడుగుల పార్కింగ్‌. 
ఒకే సారి నాలుగువేల కార్ల పార్కింగ్‌. 
అయిదు టవర్లలో మొత్తం 145 ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు. 
16వేల మంది ఉద్యోగులు పనిచేసేలా ఏర్పాట్లు. 
అత్యున్నత స్థాయిలో సౌకర్యాలు, ఆడిటోరియం, ఇతర వసతులు.. నిర్వహణ వ్యయం తక్కువ. 
10 వేల మంది సందర్శకులు వచ్చినా ఆహ్వానం. 
తాగు, వినియోగించిన, శుద్ధి చేసిన, వరద నీరు అన్నీ భూగర్భంలోనే. 
విద్యుత్తు, కమ్యూనికేషన్‌, గ్యాస్‌ అన్ని భూమి లోపలే. బీ 37 శాతం విద్యుత్తు ఆదా. 
ఆక్సిజన్‌ ఎక్కువుండాలి. కాలుష్యంఉండకూడదు.. అన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలే. 
షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ వంటి పెద్ద సంస్థలతో నిర్మాణం. 
250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ భవన నిర్మాణం.. 12.16 లక్షల చదరపు అడుగుల్లో మండలి, అసెంబ్లీ, సెంట్రల్‌హాల్‌. 
మొత్తం నిర్మాణ పనులు 36నెలల్లో పూర్తి.

 

Link to comment
Share on other sites

ఇస్లామిక్‌ కేంద్రం, చర్చి నమూనాల ఖరారుకు కమిటీలు

 

మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇస్లామిక్‌ కేంద్రం, చర్చి నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటి నమూనాలను పరిశీలించి ఖరారు చేసేందుకు ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ, సీఆర్‌డీఏ సహాయంతో ఈ కమిటీలు నమూనాలను పరిశీలిస్తాయని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె.రాంగోపాల్‌ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించారు..
ఇస్లామిక్‌ కేంద్రానికి సంబంధించిన కమిటీలో: మైనారిటీ సంక్షేమశాఖ, పురపాలకశాఖ మంత్రులు. ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, అత్తార్‌ చాంద్‌బాషా, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ ఛైర్మన్‌ మహమ్మద్‌ హిదాయత్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి, వక్ఫ్‌ సర్వే కమిషనర్‌ బీఎస్‌ యూసఫ్‌, గుంటూరు సంయుక్త కలెక్టర్‌ ఎ.ఎండీ.ఇంతియాజ్‌ సభ్యులుగా ఉంటారు.

చర్చి కమిటీలో: మైనారిటీ, సాంఘిక, గిరిజన సంక్షేమం, పురపాలకశాఖ మంత్రులు. ఎమ్మెల్యే ఫిలిప్‌ సి టోచర్‌, విశ్రాంత ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఎస్‌ఎం సెల్వరాజ్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, మైనారిటి సంక్షేమ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

 

Link to comment
Share on other sites

చలో అమరావతి
28-12-2018 03:19:59
 
  •  తరలిరానున్న హైకోర్టు లాయర్లు
  •  దాదాపు రెండు వేలమంది రాక
  •  గుంటూరు-విజయవాడ మధ్య
  • అపార్టుమెంట్ల కోసం అన్వేషణ
  •  సీఆర్డీయే పరిధిలో కొనుగోళ్లు
గుంటూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మన ప్రాంతం నుంచే... మన హైకోర్టు కార్యకలాపాలు జనవరి 1నుంచి ప్రారంభమవుతుండటంతో రాజధాని ప్రాంతంలో కొత్త సందడి నెలకొంది. అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం ఇంకా పూర్తికాక పోవడంతో, ప్రస్తుతానికి విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో నూతన ఏడాది తొలిరోజు నుంచి రాష్ట్ర హై కోర్టు కార్యకలాపాలు మొదలుకావాలన్న తలంపుతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. జనవరి 1 నుంచి 4వ తేదీ వరకు హైకోర్టు పనిచేయనుది. జనవరి 5 నుంచి 20 రోజుల పాటు సెలవు దినాలు కావడంతో తిరిగి నెలాఖరులో హైకోర్టు కార్యాకలాపాలు కొనసాగనున్నాయి. ఆ సెలవులు పూర్తయ్యేనాటికి అమరావతి సిటీ సివిల్‌ కోర్టును సిద్ధం చేయించాలనే సంకల్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. అప్పటివరకు సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టు హాల్స్‌ను జీఎడీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. జడ్జీలు, సిబ్బందికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.
 
మకాం ఎక్కడ?
హైదరాబాద్‌లో ఉండి ఏపీకి సంబంధించిన కేసు లు చూస్తున్న హైకోర్టు ప్లీడర్లు కొత్త ఏడాది ఇక్కడికి మకాం మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 2 వేలమంది న్యాయవాదులు, సిబ్బంది హైదరాబాదు నుంచి ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా. గుంటూరు, విజయవాడ మధ్యలో స్థలాలు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసేందుకు బేరసారాలు నిర్వహిస్తున్నారు. కొంత మంది పేరున్న ప్లీడర్లు సీఆర్‌డీఏ పరిధిలో ఫ్లాట్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. హైకోర్టు తమ ప్రాంతానికే తరలిరావడంపై గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు ఆనందంతో ఉన్నా రు. హైకోర్టులో వాదించే ప్రతిభ ఉన్నా హైదరాబాద్‌ వెళ్లి రావడం అనేది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకోవడంతో తమ వద్దకు వచ్చిన హైకోర్టుకు సంబంధించిన కేసులను ఇప్పటి వరకు అక్కడ ఉండే వేరే న్యాయవాదులకు పంపి, వారి ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇకపై గంట వ్యవఽధిలోనే ఇంటి నుంచి హైకోర్టుకు వెళ్లే వీలుండటంతో, కొత్త హైకోర్టు మొదలయ్యే ఘడియల కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.
 
3 నెలలు టైం ఇస్తే బాగుండేది
నేను 40 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నా ను. హైకోర్టు బెంచ్‌ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తు న్న వారిలో నేనూ ఒకడిని. ఊహించని విధంగా ఏకం గా హైకోర్టే ఇక్కడకు రావటం సంతోషంగా ఉంది. ఇప్పటివరకు మా క్లయింట్లకు సంబంధించిన హైకోర్టు కేసుల విషయంలో హైదరాబాద్‌లో ఉండే స్నేహితుల సహకారం తీసుకునేవారం. వ్యయ ప్రయాసలతో మా క్లయింట్లను అక్కడికి పంపినా కమ్యూనికేషన్‌ సరిగాలేక, కేసుల విషయంలో సరైన ఫలితాలను పొందలేకపోయేవాళ్లం. ఇప్పుడు మా కేసులను మేమే స్వయంగా వాదించుకునే అవకాశం వచ్చింది. హైకోర్టులో వాదించేందుకు న్యాయవాద వృత్తిలో ఉన్న వారంతా అర్హులే. అయితే, హైకోర్టు ఏర్పాటుకు మరో మూడు నెలలు సమయం ఇచ్చి ఉంటే బాగుండేది. గతంలో ఏర్పడిన రాష్ట్రాలకు గజిట్‌ సమయంలోనే కొంత గడువు ఇచ్చిన దాఖలాలున్నాయి.
- అరెగకూటి సంజీవరెడ్డి, న్యాయవాది
Link to comment
Share on other sites

కొండవీటి వాగు వల్ల అమరావతి మునుగుతుంది అని మొదట్లో కొంతమంది గోల చేశారు..

దానిలో కొంత వాస్తవం వుంది.

#కృష్ణ నదికి వరద వచ్చినప్పుడే కొండవీటి వాగుకి వరద వస్తే .. అది వెనక్కి తన్ని అమరావతి లో కొన్ని ప్రాంతాలను ముంచేస్తుంది.

అది అమరావతికి Threat...
కొండవీటి వాగు మీద ఒక ఎత్తిపోతలు పధకం కట్టారు. అక్కడే కొండవీటి వాగుని #గుంటూరు ఛానెల్ కి మళ్లించే ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొండవీటి వాగుకి, కృష్ణ నదికి వరద వస్తే, కొండవీటి వాగు వరద లో కొంత భాగం గుంటూరు ఛానల్ కి డైవర్ట్, మిగతాది ఎత్తిపోతలు ద్వారా కృష్ణ నదిలోకి ఎత్తి పోస్తారు.

అంటే అమరావతికి వున్న Threat ని #Amaravati కట్టక ముందే సాల్వ్ చేసేసారు.

కానీ Threat ని Opportunity గా మలుచుకోవటమే #చంద్రబాబు స్పెషాలిటీ .. కొండవీటి వాగుకి వచ్చే వరదని Oppurtunity గా మలుచుకునే ప్లాన్ వేశారు.

#అనంతవరం, #శాఖమూరు, #నీరుకొండ, #కృష్ణాయపాలెంలో పెద్ద చెరువులు తవ్వుతున్నారు... వీటిలో ౦.5 టీఎంసీ వరకు నీళ్ళని స్టోర్ చేస్తారు, #అమరావతి తాగునీటికి ఇవి ఉపయోగపడతాయి.

50 నుంచి 100 అడుగులు వెడల్పు వుండే కొండవీటి వాగుని .. 150 నుంచి 400 అడుగులు వెడల్పు చేస్తున్నారు, #పాలవాగు ని కూడా వెడల్పు చేస్తున్నారు.

దీనివల్ల దగ్గర దగ్గర ఒక వంద కిలోమీటర్లు లేక్ ఫ్రంట్, కెనాల్ ఫ్రంట్ ప్రాపర్టీస్ డెవలప్ చెయ్యొచ్చు, వీటికి మార్కెట్లో వేల్యూ ఎక్కువ.

ఒక సర్కులర్ కెనాల్ నెట్వర్క్ ఏర్పడింది, అంటే అమరావతిలో 45 కిలోమీటర్లు కెనాల్ నెట్వర్క్ ఉంటుంది. ఒక చోట మొదలయ్యి 2 గంటల్లో అమరావతి అంతా బోట్లో చుట్టూ తిరిగి రావొచ్చు. అసెంబ్లీ, హై కోర్ట్, శాఖమూరు పార్క్, ఎన్టీఆర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం స్పాట్స్ అన్ని కాలవ ఒడ్డునే ఉంటాయి.

వరద రాకపోతే, చెరువులు, కాల్వలు ఎండిపోతాయా? ప్రాబ్లెమ్ లేదు. #కొండవీటి వాగుకి ఫ్లో లేకపోతే, #ప్రకాశం_బ్యారేజీ నుంచి నీళ్లు తీసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రకాశం బ్యారేజీ లో నీటి మట్టం, అమరావతి చెరువులు కాలవల్లో నీటి మట్టం వరద వచ్చినప్పుడు తప్పితే ఎప్పుడు ఒకే లెవెల్ ఉంటుంది (+17m msl).

దేశంలో ఏనగరానికి ఈ ఫెసిలిటీ లేదు.

మొదట్లో కొండవీటి వాగు ఒక Threat,
దానిని ఒక Oppurtunity గా మార్చేశారు
చంద్రబాబు ... VISIONARY ???
#మళ్ళీ_నువ్వే_రావాలి_చంద్రబాబు

 

Link to comment
Share on other sites

Secretariat complex set to have many unique features

THE HANS INDIA |   Dec 28,2018 , 01:47 AM IST
   

 
 
Secretariat complex set to have many unique features
Secretariat complex set to have many unique features
 
 
Amaravati: The Andhra Pradesh state Secretariat and Heads of Departments building complex, foundation for which was laid by Chief Minister N Chandrababu Naidu at Nelapadu in Guntur district on Thursday, will be one of the largest and tallest commercial buildings in the country at 50-storey tall and 6.9 million sq ft.
 
The building boasts of multiple ‘firsts’, such as first integrated Secretariat, incorporation of twin lifts, utilizing a District Cooling System for air conditioning, a roof-top helipad and a platinum level green building rating.
 
 
 
The new Secretariat Complex is the tallest in India with height of 225 metre. The building is structurally stable and is resistant to earthquakes and high wind speeds.
 
 
 
For the first time in India, the structure is designed on the unique structural system called diagrid without the conventional columns. This gives column free spaces and flexibility.
 
The structure consists of perimeter frame, has a column-free interior space. It gives more usable area without any obstacles and a beautiful view for high rise towers. It saves considerable amount of structural steel compared with conventional columns. Moreover, it acts a self-shading and reduces the heat gain from the sun and helps in reducing the HVAC costs.
 
The core of the building consists of all the necessary services needed for the functionality of the building. The building will have a Destination Control System (DCS) for quick vertical transportation.
 
First time in India, CRDA (Capital Region Development Agency) is using the twin lift technology, in which two elevators operate in same lift shaft thus saving usable office area.
 
Much consideration was given for safety as per NBC norms. Additionally, helipad is also provided on General Administration Department (GAD) tower, serving as means of evacuation. Top class amenities have been planned, apart from health care facilities in the campus along with fitness centres and sports complex.
 
The building generates part of electricity needed through roof-top solar panels thus reducing the load on the electricity grid. A total of five towers in the complex are designed, all connected by a three-storey podium at the base.
 
The concept integrates office spaces (chambers, open office, etc.,), conference facilities and other office amenities, with the connected podiums consisting of common amenities for the staff. Beautiful landscapes and a pedestrian-friendly environment has also been planned, to meet the vision for Amaravati.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...