Jump to content

Amaravati


Recommended Posts

6 minutes ago, ravikia said:

Inthaki Assembly ekkada. Assembly ki Inni floors avasarama. Not talking in Negative way. But just asking

Meeru Washington DC vachunte you have clear idea of this one

Idi simple copy and paste of US capitol

House of representatives old and new buidlings and supporting rooms (Manaki Assembly and Mandali)

Statues of Persons who fought for their country and history of their country

Its also a Tourist spot free of cost

Link to comment
Share on other sites

2 minutes ago, Yaswanth526 said:

Meeru Washington DC vachunte you have clear idea of this one

Idi simple copy and paste of US capitol

House of representatives old and new buidlings and supporting rooms (Manaki Assembly and Mandali)

Statues of Persons who fought for their country and history of their country

Its also a Tourist spot free of cost

Kaneesam ee Assembly ki aina jenam visit cheyatanikisthe bavunnu. Aaa madhya Velagapudi Assembly ki kaneesam Gate lopaliki(Not during session) kooda vellanivvaledhu. Eee building dooram nundi chusi anandhinchadamenemo manaki.

Link to comment
Share on other sites

Just now, ravikia said:

Kaneesam ee Assembly ki aina jenam visit cheyatanikisthe bavunnu. Aaa madhya Velagapudi Assembly ki kaneesam Gate lopaliki(Not during session) kooda vellanivvaledhu. Eee building dooram nundi chusi anandhinchadamenemo manaki.

Assembly lopaliki ithe allow undadhu eppudu unless your a staff or house of representative

May be dani deggara daaka vellanisthadu anukunta lets see building lo etu side vastado assembly mandali

Link to comment
Share on other sites

ఆ సంస్థలకు నోటీసులు ఇచ్చాం: చంద్రబాబు
22-11-2018 21:20:20
 
636785184734773907.jpg
అమరావతి: సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూకేటాయింపులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకలాపాలు చేపట్టని సంస్థలకు నోటీసులు ఇస్తామని తెలిపారు. ఇండో యూకే ఆస్పత్రి, బీఆర్‌ శెట్టి సంస్థలకు నోటీసులు ఇచ్చామన్నారు.
1 hour ago, ravikia said:

Kaneesam ee Assembly ki aina jenam visit cheyatanikisthe bavunnu. Aaa madhya Velagapudi Assembly ki kaneesam Gate lopaliki(Not during session) kooda vellanivvaledhu. Eee building dooram nundi chusi anandhinchadamenemo manaki.

janam chudtani ke ga tower anedi kattedi,

Link to comment
Share on other sites

ఆ సంస్థలకు నోటీసులు ఇచ్చాం: చంద్రబాబు
22-11-2018 21:20:20
 
636785184734773907.jpg
అమరావతి: సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూకేటాయింపులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకలాపాలు చేపట్టని సంస్థలకు నోటీసులు ఇస్తామని తెలిపారు. ఇండో యూకే ఆస్పత్రి, బీఆర్‌ శెట్టి సంస్థలకు నోటీసులు ఇచ్చామన్నారు.
Link to comment
Share on other sites

సీఎం చంద్రబాబు చేతికి అసెంబ్లీ స్కిన్ డిజైన్లు
22-11-2018 21:31:53
 
636785192051784722.jpg
అమరావతి: నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు అసెంబ్లీ స్కిన్ డిజైన్‌ను సీఎం చంద్రబాబుకు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్వల్ప మార్పులతో వచ్చేవారం పూర్తిస్థాయి డిజైన్లు జరుగుతాయన్నారు. నవంబర్‌ 30 కల్లా అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని సీఎం అన్నారు. తిరగబడిన లిల్లీ ఫ్లవర్‌ ఆకారంలో అసెంబ్లీ నిర్మాణం ఉంటుందని తెలిపారు. 12.4 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందన్నారు. 250 మీటర్ల ఎత్తు, 200మీ. పొడవు, వెడల్పుతో అసెంబ్లీ నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ టవర్‌లో రెండు గ్యాలరీలు, ర్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు.
Link to comment
Share on other sites

ఇదే అసెంబ్లీ టవర్‌!
23-11-2018 01:56:24
 
636785349863315955.jpg
  • 250 మీటర్ల ఎత్తుతో నిర్మాణం
  • గతంకంటే ఆకర్షణీయ నమూనా
  • 80 మీ., 250 మీటర్ల వద్ద గ్యాలరీలు
  • నమూనాలు ప్రదర్శించిన ‘ఫోస్టర్‌’
  • స్వల్ప మార్పులు సూచించిన సీఎం
  • నెలాఖరుకే టెండర్లు పిలుస్తాం
  • రెండేళ్లలో పనులు పూర్తి: నారాయణ
అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి సిగలో ‘లిల్లీ’ విరియనుంది! ఐకానిక్‌గా నిర్మించాలని నిర్ణయించిన శాసనసభ భవన సముదాయానికి ‘తిరగేసిన లిల్లీ’ పువ్వు డిజైన్‌ను దాదాపు ఖరారు చేశారు. చుట్టూ నీటి కొలనుల మధ్య ఇది స్వాతిముత్యంలా కనిపిస్తుంది. ఐకానిక్‌ కట్టడాల డిజైనింగ్‌లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ (లండన్‌) సంస్థ రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అసెంబ్లీ టవర్‌కు సూదిమెనను తలపించేలా డిజైన్‌ను రూపొందించారు. దీనిని మరింత మెరుగు పరచాలని సీఎం సూచించారు. ఆ మేరకు ఫోస్టర్‌ ప్రతినిధులు దానికి మరిన్ని హంగులద్ది, ఇంకా ఆకర్షణీయం చేశారు. అసెంబ్లీ టవర్‌తోపాటు పక్కనే నిర్మించే సచివాలయ టవర్ల నమూనాలను గురువారం ముఖ్యమంత్రికి చూపించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అసెంబ్లీ టవర్‌ డిజైన్లను పరిశీలించిన సీఎం... కొన్ని సూచనలు చేశారు. వచ్చే సమావేశంలో డిజైన్లను ఖరారు చేసే అవకాశముంది.
 
అదే జరిగితే... రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి అధికారిక నివాసాల డిజైన్లు మినహా మిగిలినవన్నీ ఖరారైనట్లవుతుంది. 30 తేదీ నాటికి ఐకానిక్‌ టవర్‌ అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. రెండేళ్లలో అసెంబ్లీ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘‘అమరావతి పరిపాలనా నగరంలో నిర్మించే భవంతులు అధికార యంత్రాంగానికి మాత్రమే కాదు... ఇవన్నీ మావేనని ప్రజలు సగర్వంగా చాటుకునేలా ఉండాలి’’ అని సీఎం పేర్కొన్నారు. సచివాలయ టవర్లలోకి ప్రజలను ఏమేర అనుమతించాలన్న అంశంపై చర్చ జరిగింది. 5 టవర్లకు కుడి పక్కన ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా పబ్లిక్‌ ప్లేస్‌గా ఉంచి, ప్రజలను అలరించే పలు వినోద, విహార, వాణిజ్య ప్రత్యేకతలతో దానిని అభివృద్ధి పరచాలని సీఎం సూచించారు. సచివాలయానికి పనులపై వచ్చే వారినే కాకుండా సాధారణ ప్రజలను కొంతవరకు అనుమతిస్తేనే ప్రజా రాజధాని అనే పేరు సార్థకమవుతుందని తెలిపారు. పరిపాలనా నగరం మొత్తం ఫేస్‌ డిటెక్షన్‌ సహా పలు అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నందున భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని అభిప్రాయపడ్డారు.
 
చురుగ్గా జస్టిస్‌ సిటీ నిర్మాణాలు...
అమరావతిలో చేపట్టిన జస్టిస్‌ సిటీ నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. హైకోర్టు భవన పనులతోపాటు 4 వేల అపార్టుమెంట్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. అమరావతిలో భూములు కేటాయించినా పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు జారీ చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించిందని తెలిపారు.
 
ఎన్నెన్నో విశేషాలు...
 
అసెంబ్లీ టవర్‌ ఎత్తు 250 మీటర్లు. దీంతో దానికి దగ్గర్లో 40, 50 అంతస్థులతో నిర్మించే సచివాలయ టవర్లు కూడా అసెంబ్లీ టవర్‌ ముందు చిన్నబోతాయి.
 
 
మొదట్లో అసెంబ్లీ టవర్‌పై 80 మీటర్ల ఎత్తులో సందర్శకుల ఒక గ్యాలరీ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పుడు 80 మీటర్లలో ఒకటి... 250 మీటర్ల మరొకటి గ్యాలరీలు నిర్మిస్తారు. మొదటి గ్యాలరీ నుంచి ఏకకాలంలో 300 మంది పరిసరాల అందాలను వీక్షించవచ్చు. రెండో గ్యాలరీలో 25 మందికి చోటు ఉంటుంది.
 
 
తొలి ప్రతిపాదనలో టవర్‌ డిజైన్‌ను సాదాసీదాగా మొనదేలినట్లుగా రూపొందించారు. ఇప్పుడు... దానిని పొరలుగా (లేయర్లు) మార్చి ముస్తాబు చేశారు. గతంలో శిఖరాగ్ర భాగం మూసుకుపోయినట్లు ఉండగా... ఇప్పుడు గ్యాలరీతోపాటు మరింత ఆకర్షణీయమైన డిజైన్‌ను రూపొందించారు.
 
అసెంబ్లీ భవనానికి నలువైపులా నీటి కొలనులు, ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తారు. సువిశాలమైన మార్గాలు, భారీ ప్రవేశ ద్వారాలు, వర్తులాకారంలో రెయిలింగ్‌ ఉంటాయి. శాసనకర్తలు, ఉద్యోగులు, సందర్శకులను ఆకట్టుకునేలా ఇంటీరియర్స్‌ డిజైన్‌ చేశారు.
 
మూడు అంతస్తుల్లో... 12.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీని నిర్మిస్తారు.
Link to comment
Share on other sites

అమరావతి విహంగ వీక్షణం 
250 మీటర్ల ఎత్తున శాసనసభ టవర్‌పై ప్రత్యేక గ్యాలరీ 
  అసెంబ్లీ, సచివాలయ బాహ్య ఆకృతులు దాదాపు ఖరారు 
  బోర్లించిన లిల్లీ ఫ్లవర్‌ నమూనాలో అసెంబ్లీ 
  పరిశీలించిన ముఖ్యమంత్రి 
  ఈ నెల 30న టెండర్లు 
22ap-main1a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ, సచివాలయ భవనాల బాహ్య ఆకృతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం దాదాపు ఖరారు చేశారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ శాసనసభ, సచివాలయ భవనాలకు సంబంధించి మూడేసి బాహ్య ఆకృతుల్ని సిద్ధం చేసి తీసుకొచ్చింది. వాటిని ముఖ్యమంత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో క్షుణ్నంగా పరిశీలించారు.

శాసనసభకు...మూడంతస్తుల భవనంపై పొడవైన టవర్‌తో ఉన్న ఆకృతిని ఇది వరకే ఖరారు చేశారు. దాని బాహ్య స్వరూపానికి సంబంధించి ఇది వరకు ఇచ్చిన ఆకృతుల్లో కొన్ని మార్పులు చేసి... మూడు తాజా ఆకృతుల్ని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇప్పుడు తీసుకొచ్చింది. శాసనసభ భవనం ఆకృతిని బోర్లించిన ‘లిల్లీ ఫ్లవర్‌’ని పోలిన విధంగా రూపొందించింది. శాసనసభ పైనుంచి రాజధానిని వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేసింది. అసెంబ్లీ భవనం ఎత్తు 250 మీటర్లు, పొడవు 200 మీటర్లు, వెడల్పు 200 మీటర్లు ఉంటుంది. సాధారణ సందర్శకుల్నీ ఈ భవనంలోకి అనుమతిస్తారు. ఈ భవనం మధ్యలోంచి టవర్‌పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లు ఉంటాయి. ఇది వరకు ఇచ్చిన ఆకృతిలో టవర్‌లో 80 మీటర్ల ఎత్తు నుంచి మొత్తం రాజధాని నగరాన్ని వీక్షించేందుకు వీలుగా ఒక ‘వ్యూయింగ్‌ గ్యాలరీ’ని ఏర్పాటు చేశారు. తాజా ఆకృతిలో మొత్తం రెండు ‘వ్యూయింగ్‌ గ్యాలరీలు’ ప్రతిపాదించారు. 80 మీటర్ల ఎత్తులో ఒకటి గ్యాలరీ, 250 మీటర్ల ఎత్తులో చివర్న మరో గ్యాలరీ ఉంటాయి. 80 మీటర్ల ఎత్తు గ్యాలరీ నుంచి ఒకేసారి 300 మంది, 250 మీటర్ల ఎత్తున్న గ్యాలరీ నుంచి ఒకేసారి 25 మంది రాజధానిని వీక్షించే వీలుంటుంది. శాసనసభ భవనంలో పార్లమెంటు భవనంలో మాదిరిగా ఏర్పాటు చేస్తున్న సెంట్రల్‌ హాల్‌ ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని సీఎం సూచించారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఆ ప్రాంతం ఒక వారధిలానిలవాలన్నారు. హైకోర్టు భవనం బాహ్య ఆకృతిని ఇది వరకే ఖరారు చేయగా, మరికొంత మెరుగులు దిద్దిన ఆకృతిని నార్మన్‌ ఫోస్టర్‌ బృందం తీసుకొచ్చింది. దానిపై సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు.

22ap-main1b.jpg

హెలిప్యాడ్‌ అవసరమే! 
పరిపాలన నగరంలో శాసనసభ, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని ఐదు టవర్లుగా నిర్మిస్తున్నారు. వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనంలో 50 అంతస్తులు, మిగతా నాలుగు భవనాల్లో 40 అంతస్తులు చొప్పున ఉంటాయి. ఈ భవనాల్ని దేశంలోనే తొలిసారిగా ‘డయాగ్రిడ్‌’ విధానంలో నిర్మిస్తున్నారు. ఈ భవనాల బాహ్య స్వరూపానికి సంబంధించి మూడు ఆకృతుల్ని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించింది. వాటిలో ఏ ఆకృతి బాగుందన్నదానిపై సమావేశానికి హాజరైన వారందరి అభిప్రాయాల్ని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మొదట్లో ఇచ్చిన ‘డైమండ్‌’ నమూనా ఫ్రేమ్‌తో ఉన్న ఆకృతి ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, దాన్నే ఖరారు చేద్దామని ఎక్కువ మంది చెప్పడంతో ముఖ్యమంత్రి సరేనన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ భవనం ఉన్న టవర్‌పై నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ హెలిప్యాడ్‌ను ప్రతిపాదించింది. హెలిప్యాడ్‌ ఉండాలా? లేదా? అన్న విషయంలో చర్చ జరిగింది. భవనంపైన హెలిప్యాడ్‌ ఉండటాన్ని విలాసంగా భావించే అవకాశముందున్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. కానీ ఫైర్‌ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఎత్తైన భవనంపై హెలిప్యాడ్‌ ఉండటం అవసరమే తప్ప, విలాసం కాదని అధికారులు వివరించడంతో ముఖ్యమంత్రి సరేనన్నారు.

22ap-main1c.jpg

ప్రజల కోసం ప్రత్యేక జోన్‌! 
శాసనసభలోకి సందర్శకులను అనుమతిస్తున్నట్టే... సచివాలయం ప్రాంగణంలోకి సాధారణ ప్రజల్ని అనుమతించాలా? లేదా? అన్న విషయంలో చాలా చర్చ జరిగింది. ప్రభుత్వ భవనాల్ని కేవలం అధికార యంత్రాంగానికే పరిమితం చేయకుండా, సాధారణ ప్రజలు సందర్శించేందుకూ వీలుగా ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజల్ని అనుమతించకపోతే ఆ ప్రాంగణమంతా సాయంత్రానికి నిర్మానుష్యంగా మారిపోతుందన్నారు. ఎలాగూ పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపడతాం కాబట్టి... సాధారణ ప్రజల్ని అనుమతిస్తేనే బాగుంటుందన్నారు. దుబాయిలో వాణిజ్య భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలూ ఉంటాయని గుర్తుచేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రజల్ని స్వేచ్ఛగా అనుమతించడం వల్ల గోప్యత పరంగా, ఇతరత్రా సమస్యలు కూడా వస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దీనిపై చాలా చర్చ జరిగిన మీదట... ఐదు సచివాలయ టవర్లకు పక్కనే, ఉత్తరంవైపు ఉన్న స్థలాన్ని ప్రజల కోసం ప్రత్యేక వాణిజ్య, వినోద ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అక్కడ మల్టీప్లెక్స్‌, షాపింగ్‌మాల్‌, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, స్పోర్ట్స్‌ సెంటర్‌ వంటివి నిర్మించాలని సీఎం సూచించారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ తరహాలో ఒక భవనాన్ని నిర్మించాలని తెలిపారు.

శాసనసభ భవనంలో మొత్తం నిర్మిత ప్రాంతం 12.4 లక్షల చదరపు అడుగులు ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ విలేఖరుల సమావేశంలో తెలిపారు. తాజా ఆకృతిపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారని, వచ్చే సమావేశం నాటికి ఇంకా కొంత మెరుగుపరిచి తీసుకురమ్మని సూచించారని ఆయన వెల్లడించారు. శాసనసభ భవనం తొలి దశ పనులకు ఈ నెల 30 టెండర్లు పిలుస్తామన్నారు.

Link to comment
Share on other sites

Andhra Pradesh’s new assembly to be taller than Statue of Unity

Andhra Pradesh’s new assembly to be taller than Statue of Unity

VIJAYAWADA: Andhra Pradesh chief minister Chandrababu Naidu’s political oneupmanship is not limited to spearheading an anti-BJP alliance and blocking CBI’s entry into his state. He has now stated that the proposed Andhra Pradesh Assembly building at Amaravati will be taller than the Statue of Unity by 68 metres. Once completed, this will be the tallest structure in the country. The Statue of Unity stands at 182 metres.

Naidu has almost finalised the design with minor changes and the blueprint will be submitted to the state government by UK-based architects Norma Fosters. The new assembly will be constructed with three floors and a tower spiralling 250 metres into the sky.
 
Amaravati1

A view of the final designs of assembly and secretariat buildings of Amaravati, which were presented to Chandrababu Naidu at Amaravati on Thursday.

Naidu has made the announcement at a time when the unveiling of the Statue of Unity has sparked off competition between states to outdo each other. While Uttar Pradesh chief minister Yogi Adityanath has announced that he will build a Ram statue that will be 201metres tall, the Karnataka government is keen to build a statue of Mother Cauvery which will be 125 feet tall.
 
The structure that Naidu plans to build will be shaped like an upside-down lily flower, said minister for municipal administration P Narayana. The government would call for tenders by Novemberend and the process will be completed in two years.
 
The new Assembly building will also have two galleries – the first one at 80 metres accommodating 300 people and the second one at 250 metres accommodating 20 people and will give a view of Amaravati city. The second gallery will be wrapped in glass and will have elevators. The building will be cycloneand-earthquake proof, the minister said.
 
Narayana added that the chief minister suggested minor changes to the design and this will be ready in a couple of days.
 
Naidu also cleared designs of the five buildings of the secretariat. He directed the AP Capital Region Development Authority officials to prepare draft tender notifications.
Edited by Yaswanth526
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...