Jump to content

Amaravati


Recommended Posts

ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌.. ఖరారు
17-11-2018 08:33:47
 
636780404256807208.jpg
  • కేవలం ఐదు మార్పులతో రింగురోడ్డు మార్గం
  • పొడవు 96.25 కి.మీ., వెడల్పు 75 మీటర్లు
  • కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 10 మండలాల్లో 41 గ్రామాలమీదుగా..
(ఆంధ్రజ్యోతి, అమరావతి): రాజధాని నగరాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని విజయవాడ తదితర ప్రదేశాలకు అనుసంధానించడం తోపాటు పలు ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐ.ఆర్‌.ఆర్‌.) మార్గాన్ని (అలైన్‌మెంట్‌) సీఆర్డీయే ఖరారు చేసింది. దీని డ్రాఫ్ట్‌ అలైన్‌మెంట్‌ను పేర్కొంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో తానిచ్చిన నోటిఫికేషన్‌పై ప్రభావిత ప్రాంతాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అభ్యంతరాలను సునిశితంగా పరిశీలించిన అనంతరం ఫైనల్‌ అలైన్‌మెంట్‌ను నిర్ధారించింది.
 
అయితే డ్రాఫ్ట్‌తో పోల్చితే తుది నోటిఫికేషన్‌లో కేవలం 5 మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి! ప్రతిపాదిత అలైన్‌మెంట్‌ ద్వారా గ్రామం, చెరువు వంటి వాటికి వాటిల్లబోయే నష్టాన్ని తప్పించేందుకు, దానికి దగ్గరగా మరేదైనా పెద్ద రోడ్లు వెళ్తుంటే కొత్త మార్గం వేస్తే జరిగే వృథా వ్యయాన్ని నివారించేందుకుగాను వీటిని చేశారు. అంతే తప్ప తమ భూముల గుండా ప్రతిపాదిత మార్గం వెళ్తుంది కాబట్టి అలైన్‌మెంట్‌ను మార్చాలంటూ పలువురు ప్రభావితులు చేసిన అభ్యర్థనలను నిపుణులు, అనుభవజ్ఞులైన అధికారులతో కూడిన పరిశీలన కమిటీలు పరిగణనలోకి తీసుకోలేదు!
 
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 10 మండలాల (అమరావతి, దుగ్గిరాల, మంగళగిరి, పెనమలూరు, గన్నవరం, విజయవాడ గ్రామీణ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, తుళ్లూరు, తాడికొండ)కు చెందిన 41 గ్రామాలతోపాటు కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ గుండా వెళ్లే ఈ బహుళ ప్రయోజనకర రహదారి తుది వివరాలిలా ఉన్నాయి. పొడవు 96.25 కిలోమీటర్లు, వెడల్పు 75 మీటర్లు. రాజధాని అమరావతిని ఐ.ఆర్‌.ఆర్‌.తో అనుసంధానించేందుకు రాజఽధాని పరిధిలో నిర్మిస్తున్న పలు రహదారులను పొడిగించబోతున్నట్లు కూడా ఫైనల్‌ నోటిఫికేషన్‌లో ప్రస్తావించారు. వీటి నిర్మాణానికి మొత్తం 3521.76 ఎకరాలు అవసరమని పేర్కొన్నారు. ఈ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును 2 దశల్లో నిర్మించనున్నారు.
 
ప్రతిపాదిత మార్గంపై 1185 అభ్యంతరాలు, సూచనలు...
ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఐ.ఆర్‌.ఆర్‌.కు సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిపై అభ్యంతరాలు లేదా సూచనలు చేసేందుకు ప్రజలకు మార్చి 19వ తేదీ వరకు గడువునిచ్చారు. ఈ వ్యవధిలో మొత్తం 1185 అభ్యంతరాలు, సూచనలు సీఆర్డీయేకు అందాయి. వాటన్నింటినీ సీఆర్డీయే అదనపు కమిషనర్‌ నేతృత్వంలోని కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, వాటిపై తన రిమార్కులు, అభిప్రాయాలను నమోదు చేసి, కమిషనర్‌కు సమర్పించింది. ఇందుకోసం కమిటీ మొత్తం 9 సమావేశాలను నిర్వహించింది. సంబంధిత అంశాల్లో నిపుణులను సంప్రదించింది. అనంతరం క్షేత్రస్థాయిలో నిజమైన సమస్యలుగా ఉన్న వాటిని గుర్తించింది. తదనుగుణంగా పైన పేర్కొన్న 5 మార్పులను ప్రతిపాదించి, ఫైనల్‌ అలైన్‌మెంట్‌ను సీఆర్డీయే నిర్ధారించింది. ఈ విషయంలో కేవలం బహుళ ప్రజా ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న సీఆర్డీయే వ్యక్తిగత లబ్ధిని కాంక్షిస్తూ పలువురు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోలేదు.
 
ఇవీ మార్పులు..
  • ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కృష్ణా జిల్లాలోని కొత్తూరు తాడే పల్లిలోని చెరువు, కవులూరు గ్రామంలోని కొంత భాగం గుండా వెళ్లాల్సి ఉంది. అయితే దీనిని నివారించేందుకుగాను ఆయా గ్రా మా ల వద్ద అలైన్‌మెంట్‌ను కొద్దిగా మార్చారు.
  • కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం వద్ద ఐ.ఆర్‌.ఆర్‌. ముసాయిదా మార్గానికి సమీపానే ఒక జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (జడ్‌.డి.పి.) రోడ్డు వెళ్తోంది. పక్కపక్కనే 2 రహదారుల నిర్మాణం అనవసరమన్న ఉద్దేశ్యంతో జడ్‌.డి.పి. రోడ్డు మార్గాన్నే ఐ.ఆర్‌.ఆర్‌. అలైన్‌మెంట్‌గా చూపారు.
  • కృష్ణా జిల్లా కొండపల్లి వద్ద ఐ.ఆర్‌.ఆర్‌. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ హైవేను దాటే ప్రదేశంలో ఉన్న కూడలిని రవాణా సౌలభ్యం దృష్ట్యా కొద్దిగా పక్కకు జరిపారు.
  • రాజధానిలోని ప్రాధాన్య రహదారులను ఐ.ఆర్‌.ఆర్‌.తో అనుసంధానించే లింక్‌ రోడ్ల లోనూ ఒక మార్పు చేశారు. ఎన్‌ 6- ఎన్‌-9 రోడ్లను ఐ.ఆర్‌.ఆర్‌.కు కలిపే 2 రహదారుల మధ్య అంతగా దూరం లేనందున వాటిల్లో ఒకదానిని తొలగించారు.
  • అమరావతిలోని ఈ-3 రహదారిని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో అనుసంధానించే రోడ్డు గతంలో వంకరగా ఉంది. అయితే రాజధానిలోని రోడ్లన్నీ ఎటువంటి వంపుల్లేకుండా, తిన్నగా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సదరు రహదారిని వంకర లేకుండా సరి చేశారు.
ఇవీ ఐ.ఆర్‌.ఆర్‌. వివరాలు..
తొలి దశలో భాగంగా ఈ రహదారిపై గుం టూరు జిల్లాలోని వైకుంఠపురం- కృష్ణా జిల్లా లోని కొటికలపూడిల మధ్య కృష్ణానదిపై 3.1 కి.మీ. పొడవైన వంతెనను నిర్మించనున్నారు. మరొక వంతెనను గుంటూరు జిల్లాలోని రామ చంద్రాపురం- కృష్ణా జిల్లాలోని చోడవరంల మధ్య 1.4 కి.మీ. పొడవుతో నిర్మిస్తారు. 2వ దశలో భాగంగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 9 కి.మీ. మేర వెళ్లనుంది. ఇందులో 8 కి.మీ. సొరంగమార్గం ఉండనుంది. ఈ రహదారి అంబాపురం వద్ద పోలవరం కాల్వను రెండుసార్లు దాటనుంది.
 
ఇవీ ఐఆర్‌ఆర్‌ మార్గంలోని గ్రామాలు..
ఈ రహదారి రాజధాని ఆవల ఉన్న 41 గ్రామాలతోపాటు రాజధాని పరిధిలోని అనం తవరంలో కొంతమేర వెళ్లనుంది. అమరావతి మండలంలోని ఎండ్రాయి, కర్లపూడి, వైకుంఠ పు రం, దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడి, మం గళగిరి మండలంలోని చినకాకాని, చినవ డ్లపూడి, కాజ, నూతక్కి, పెదవడ్లపూడి, రామ చంద్రా పురం, తాడికొండలోని కంతేరు, మోత డక, తాడికొండ, తుళ్లూరులోని హరిశ్చంద్రాపురం, పెదపరిమి, వడ్డమాను, అనంతవరం, జి.కొం డూరు మండలంలోని కవులూరు, వెలగలేరు, గన్నవరంలోని రామచంద్రపురం, సవారగూడెం, వెదురుపావులూరు, ఇబ్రహీం పట్నంలోని దామ లూరు, ఇబ్రహీంపట్నం, జూపూడి, కేతనకొండ, కొండపల్లి, కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌, కొటిక లపూడి, నవీపోతవరం, త్రిలోచనపురం, జమీ మాధవరం, పెనమలూరులోని చోడవరం, గం గూరు, పెనమలూరు, పోరంకి, విజయవాడ గ్రామీణ మండలంలోని దోనేఆత్కూరు, కొత్తూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, కొత్తూరు తాడేపల్లి గ్రామాల పరిధిలో నుంచి వెళ్లనుంది.
Link to comment
Share on other sites

ప్రతిష్ఠాత్మకంగా పారిశ్రామిక వాడ
17-11-2018 08:35:35
 
  • ఆసక్తి వ్యక్తీకరణలకు సీఆర్డీయే ఆహ్వానం
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజధానిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను భారీగా పెంచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఊతం, ప్రభుత్వ ఖజానాకు పెద్దఎత్తున ఆదాయం సమకూర్చేందుకు ఉద్దేశించిన ఇంటెగ్రేటెడ్‌ మల్టీప్రొడక్ట్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ స్థాపన దిశగా సీఆర్డీయే ఇంకో అడుగు వేసింది. దశలవారీగా సుమారు 350- 500 ఎకరాల్లో అభివృద్ధి చేయాలనుకుంటున్న ఈ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేయబోయేవన్నీ పూర్తిగా కాలుష్యరహితమైనవి, సేవారంగాలకు సంబంధించినవి.
 
కొద్ది నెలల క్రితం ఈ సమీకృత పారిశ్రామికవాడ స్థాపనకు సంబంధించి సదరు రంగంలో అనుభవం, నైపుణ్యం కలిగిన జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌- ఈవోఐ)లను సీఆర్డీయే ఆహ్వానించింది. స్పందించిన వివిధ సంస్థలు ఈ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏ విధంగా ఉంటే బాగుంటుందోననే అంశంపై తమ ప్రతిపాదనలను సమర్పించాయి. ఈ నేపథ్యంలో దీని అభివృద్ధి, మార్కెటింగ్‌, నిర్వహణ కోసం దేశ, విదేశాల్లోని పేరొందిన ఇండస్ట్రియల్‌ పార్క్‌ డెవలపర్లు, ఆపరేటర్ల నుంచి సరైన సంస్థను ఎంచుకునే ప్రక్రియను సీఆర్డీయే చేపట్టింది. ఇందుకోసం ‘వ్యూహాత్మక భాగస్వామి’గా వ్యవహరించే సదరు సంస్థగా ఎంపికై, తనతో కలసి పని చేయాలనే ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిని సమర్పించేందుకు వచ్చే నెల 21వ తేదీ వరకు గడువునిచ్చిన సీఆర్డీయే ఏవైనా విషయాల్లో దరఖాస్తుదారులకు ఏమైనా అనుమానాలు లేదా సందేహాలు వచ్చిన పక్షంలో వాటిని నివృత్తి చేసేందుకు వచ్చే నెల 3న విజయవాడలో ప్రిబిడ్‌ సమావేశాన్ని జరపనుంది.
 

A

Link to comment
Share on other sites

అమరావతికి త్వరలో 6 ప్రముఖ ఆసుపత్రులు: లోకేశ్‌
17-11-2018 03:43:46
 
636780230278386831.jpg
  • శ్రావణ్‌కుమార్‌కు పలువురు మంత్రుల అభినందనలు
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ముంబైకి చెందిన ప్రముఖ ఆసుపత్రి లీలావతితో పాటు మరో అయిదు అతిపెద్ద ఆసుపత్రులు అమరావతికి త్వరలో రానున్నట్లు మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. ఇటీవల ప్రాథమిక వైద్య, కుటుంబ సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్‌కుమార్‌ను ఇతర మంత్రులు చినరాజప్ప, లోకేష్‌, అఖిలప్రియ, ఎంపీ రామ్మోహననాయుడు, ఎమ్మెల్యే అశోక్‌, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల రాష్ట్రంలో మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు.
 
పర్యాటకంగా అరకును అభివృద్ధి చేస్తా: అఖిలప్రియ
అరకులో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ మరింత అభివృద్ధి చేయాలని పర్యాటకమంత్రి అఖిలప్రియను మంత్రి శ్రావణ్‌ కోరగా, ఆమె అంగీకరించారు. అరకులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను ప్రారంభించాలని శ్రావణ్‌ కోరగా డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని లోకేశ్‌ చెప్పారు.
 
Link to comment
Share on other sites

హైకోర్టు న్యాయమూర్తులతో ముగిసిన సీఎం భేటీ
17-11-2018 18:42:39
 
విజయవాడ: హైకోర్టు న్యాయమూర్తులతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. రెండు గంటలపాటు సమావేశం జరిగింది. డిసెంబర్‌ నాటికి సివిల్‌ కోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. నిర్మాణాలపై న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి నాటికి భవనం సిద్ధం చంద్రబాబు చేస్తామన్నారు. న్యాయమూర్తుల సలహాల మేరకే తాత్కాలిక హైకోర్టు నిర్మాణం చేపట్టారు.
Link to comment
Share on other sites

సంక్రాంతికి వచ్చేయండి!
18-11-2018 02:46:01
 
636781059596539520.jpg
  • నోటిఫికేషన్‌ వస్తే పండగ తర్వాత అమరావతికి హైకోర్టు
  • తరలివచ్చే జడ్జిలకు నాదీ పూచీ
  • ఏ లోటూ, సమస్యా రానివ్వం
  • డిసెంబరుకల్లా తాత్కాలిక కోర్టు
  • ఆ వెంటనే ‘శాశ్వత’ నిర్మాణాలు
  • ప్రతి పనినీ నేనే పర్యవేక్షిస్తున్నా
  • హైకోర్టు జడ్జిలకు సీఎం వెల్లడి
అమరావతి, విజయవాడ, తుళ్లూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వచ్చే జనవరిలో సంక్రాంతి సెలవుల తర్వాత నవ్యాంధ్ర రాజధానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా తొలినుంచీ వేగంగా కదులుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు.. శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ బృందం రాకతో ఒక స్పష్టమైన రూపును సంతరించుకొన్నాయి. తాత్కాలిక హైకోర్టు నిర్మాణ ప్రగతిని పరిశీలించే నిమిత్తం శనివారం అమరావతిని చీఫ్‌ జస్టిస్‌ రాధాకృష్ణన్‌, ఇతర న్యాయమూర్తులు సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా వారిని విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో కలుసుకొని మాట్లాడారు. హైకోర్టు తరలింపు అంశం ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది.
 
అమరావతికి హైకోర్టును తరలిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉందని, ఒకవేళ జనవరి ఒకటో తేదీన ఆ ఉత్తర్వులు అందితే, సంక్రాంతి సెలవుల తర్వాత ఇక్కడ నుంచి కోర్టు పనిచేయడం ప్రారంభిస్తుందని న్యాయమూర్తులు తెలిపినట్లు సమాచారం. హైకోర్టుకు జనవరి ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు సెలవులు ఉన్నట్లు చెబుతున్నారు. న్యాయమూర్తుల నివాసాలు, హైకోర్టు ఉద్యోగుల నివాస వసతి గురించి కూడా చీఫ్‌ జస్టిస్‌, సీఎంల మధ్య కొంత చర్చ జరిగింది. సచివాలయం తరలి వచ్చినప్పుడు కొందరు అధికారులు, మహిళా ఉద్యోగులకు మంగళగిరిలోని రెయిన్‌ ట్రీ పార్క్‌లో వసతి కల్పించామని, ఇప్పుడు కూడా అవసరమైతే అటువంటి సదుపాయం న్యాయమూర్తులకు, న్యాయస్థానాల సిబ్బందికి కల్పిస్తామని సీఆర్డీయే కమిషనర్‌ పేర్కొన్నారు.
 
న్యాయమూర్తుల నివాసాలు కూడా వేగంగా నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. మొత్తంగా రాజధాని నిర్మాణ ప్రగతిని ముఖ్యమంత్రి వివరించారు. ‘ప్రపంచంలో అధునాతన నగరాలకు తీసిపోని రీతిలో అమరావతిలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం వివిధ ప్రాజెక్టుల కింద రూ.40 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. కొద్ది కాలంలోనే మీకు వాటి ఫలితాలు కనిపిస్తాయి’’ అని చెప్పారు. ఆయన దూరదృష్టి, ప్రణాళికలను న్యాయమూర్తులు అభినందించారు. న్యాయమూర్తులు, హై కోర్టు ఉద్యోగులకు సంబంధించి, ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు. రెండుగంటలపాటు సాగిన ఈ భేటీ సందర్భంగాను, అనంతరం మీడియాతోను చంద్రబాబు ఏమన్నారంటే...
 
ఐకాన్‌లా హైకోర్టు రూపు
ముందు జిల్లా కోర్టులను పూర్తిచేసి.. వాటిని తాత్కాలిక హైకోర్టుకు ఉపయోగించుకుంటాం. ఆ పనులను వచ్చే డిసెంబరు కల్లా పూర్తి చేస్తాం. ఆ వెంటనే హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. ఓ ఐకాన్‌ మాదిరిగా ఈ భవనాలను సిద్ధం చేస్తాం.
 
సీబీఐ కన్నా ఏసీబీయే మెరుగు
సీబీఐ ఎంత భ్రష్టు పట్టిందో దేశ ప్రజలందరికీ తెలుసు. అలాంటి సంస్థకు రాష్ట్ర అధికారాలను అప్పగించాల్సిన అవస రం లేదు. సీబీఐ ఉన్నతాధికారుల అక్రమ వ్యవహారాలన్నీ సుప్రీంకోర్టులో తేలాల్సి ఉంది. సీబీఐకి జనరల్‌ కన్సెంట్‌ను ఉపసంహరించడంపై బీజేపీ, వైసీపీల విమర్శ సరికాదు. అసలు ఈ నిర్ణయంతో పార్టీలకు ఏం సంబంధం? మన రాష్ట్ర పరిధిలో మనమే గట్టిగా పనిచేసుకోగలమనే ధీమాతో సీబీఐకి జనరల్‌ కన్సెంట్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. ఇది శుభ పరిణామం. ప్రస్తుతం సీబీఐ పనితీరు ఏమీ బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్న ఏసీబీ, ఇతర వ్యవస్థలే బాగా మెరుగ్గా ఉన్నాయి. వాటిని మరింత బలోపేతం చేసుకోగల శక్తి మనకుంది.
 
అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది. భవిష్యత్తులో ఇంకా నీతివంతమైన పాలనను అందిస్తాం. కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాలనే మేం వ్యతిరేకిస్తున్నాం. వ్యవస్థలు మరింత సమర్థంగా పనిచేసేలా చేయాలి గానీ.. రాజకీయాలకు ఉపయోగించుకుంటూ నిర్వీర్యం చేయకూడదు. కాగా, చీఫ్‌ జస్టిస్‌ వెంట పర్యటించిన బృందంలో హైకోర్టు పోర్టుపోలియో న్యాయమూర్తి జస్టిస్‌ వీ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎస్‌వీ భట్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ సునీల్‌చౌదరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథశర్మ, గుంటూరు జూనియర్‌ సివిల్‌జడ్జి ఎ.వి. రామకృష్ణయ్య, మంగళగిరి సీనియర్‌ సివిల్‌ జడ్జి వి.భవాని ఉన్నారు.
 
నాకే రావాలనిపిస్తోంది
  • చీఫ్‌ జస్టిస్‌ రాధాకృష్ణన్‌ సంతృప్తి
తాత్కాలిక హైకోర్టు నిర్మాణ ప్రగతి, ఇతర సౌకర్యాలపై ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఈ(అమరావతిలోని) హైకోర్టుకు వచ్చే అవకాశం నాకు ఉండకపోవచ్చు. అవకాశం ఉంటే నేను తప్పనిసరిగా వచ్చేవాడిని. అంత బాగా ఇక్కడ వసతులు కల్పిస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు సమాచారం. తాము మూడు వారాల కిందట వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు పనుల వేగం బాగా పెరిగిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
 
ఎటునుంచి దారి.. ఎక్కడ చాంబర్లు..
అమరావతిలోని నేలపాడు రెవెన్యూ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న జుడీషీయల్‌ కాంప్లెక్స్‌ పనులను చీఫ్‌ జస్టిస్‌ బీ రాధాకృష్ణన్‌ బృందం పరిశీలించింది. ఆ కాంప్లెక్స్‌ వెలుపల, లోపల జరుగుతున్న పనులను న్యాయమూర్తులు నిశితంగా గమనించారు. కోర్టు హాళ్ల ను పరిశీలించి తగిన సూచనలు చేశారు. కాంప్లెక్స్‌ మధ్య భాగంలో కడుతున్న ఓ నిర్మాణం గురించి చీఫ్‌ జస్టిస్‌ ఆసక్తిగా ఆరా తీశారు. అక్కడ గ్లాసెస్‌ ఏర్పాటుచేస్తామని అధికారులు ఆయనకు తెలిపారు. ఫర్నిచర్‌, కోర్టు హాళ్ల డిజైన్‌, న్యాయమూర్తుల చాంబర్లు, అడ్వకేటు కార్యాలయాలు, ఫుల్‌ కోర్టు సమావేశ మందిరం, రాకపోకల మార్గం తదితర అంశాలకు సంబంధించిన విషయాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. న్యాయమూర్తు లు, న్యాయవాదులు, ప్రజలు కోర్టులోకి ప్రవేశమార్గాల గురించి, కాంప్లెక్స్‌లో వారికి అనువైన స్థలాల గురించి తెలుసుకున్నారు. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన డిజైన్‌లను వారు పరిశీలించారు. న్యాయమూర్తుల నివాసాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు.
 
 
Link to comment
Share on other sites

హ్యాపీ’నెస్ట్‌‌‌‌లో మరో 1200 ఫ్లాట్లు!
19-11-2018 02:27:36
 
636781912552594936.jpg
  • 900 ఫ్లాట్ల బుకింగ్‌ కాగానే ప్రకటన
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రజల కోసం రాజధానిలో ప్రభుత్వం నిర్మించనున్న తొలి నివాస సముదాయం ‘హ్యాపీనెస్ట్‌‌‌‌’కు భారీ స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి దఫా 300 ఫ్లాట్లకు నిర్వహించిన ఆన్‌లైన్‌ బుకింగ్‌కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో మరో 900 ఫ్లాట్లకు ఈ నెలాఖరులో ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఇవే కాకుండా.. అదనంగా మరో 1200 ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం! అయితే వాటన్నింటినీ ఇప్పట్లా ఓపెన్‌ బుకింగ్‌ ద్వారా కాకుండా కొన్నింటిని ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా రిజర్వ్‌ చేసే ఆస్కారముందని తెలిసింది.
 
అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు సమీపంలో, అధునాతన వసతులతో, సువిశాల స్థలంలో హ్యాపీనె్‌స్టను ఏపీసీఆర్డీయే నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. 12 టవర్లలో 1200 డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లతో రూపుదిద్దుకోనున్న వీటి ధరను చదరపుటడుగుకు రూ.3492(రాజధానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతమున్న ధరల కంటే రూ.వెయ్యి తక్కువ)గా నిర్ణయించారు. తొలి విడతలో వీటిలోని 3 టవర్ల(300 ఫ్లాట్లు)కు ఈ నెల 9న బుకింగ్‌ ప్రారంభించగా, అదే రోజు కేవలం గంటల వ్యవధిలోనే అవన్నీ బుక్కయిపోయాయి! దీంతో మిగిలిన 9 టవర్లలో 900 ఫ్లాట్లకు ఈ నెలాఖర్లో బుకింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నారు.
 
దీని తర్వాత..
ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌ పట్ల వ్యక్తమవుతున్న ఆసక్తి ఇలాగే కొనసాగి, ఈ నెలాఖర్లో ప్రారంభమయ్యే 900 ఫ్లాట్ల బుకింగ్‌ కూడా చకచకా అయిపోతుందని సీఆర్డీయే ఆశిస్తోంది. తొలి విడతలో ఫ్లాట్లను బుక్‌ చేసుకోలేని వారిలో పలువురు ఈ దఫా కూడా బుకింగ్‌ కోసం ప్రయత్నిస్తారని, వారితోపాటు కొత్తవారూ బుక్‌ చేసుకునేందుకు ముందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఫ్లాట్లను బుక్‌ చేసుకోలేని వారు నిరాశకు గురయ్యే అవకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకుని హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా మరొక 1200 ఫ్లాట్లతో కూడిన 12 టవర్లను నిర్మిస్తే ఎలా ఉంటుందని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి నిర్మాణం ద్వారా అమరావతిలో స్వంత ఇల్లు కలిగి ఉండాలనుకుంటున్న మరి కొందరికి అవకాశం కల్పించనున్నారు.
 
ఎన్జీవోలకు అవకాశం!
అదనంగా నిర్మించేందుకు అవకాశమున్న 1200 ఫ్లాట్లలో కొన్నింటిని రాష్ట్ర ఎన్జీవోలకు కేటాయించేందుకు అవకాశాలున్నాయని వినవస్తోంది. అమరావతిలో నివాసానికి ప్రభుత్వం గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా కొన్ని టవర్లను నిర్మిస్తోంది. అయితే వాటిలో ఉద్యోగం చేస్తున్నంత వరకు మాత్రమే ఎన్జీవోలు ఉండగలుగుతారు. దీంతో అమరావతిలో తమకు స్వంత ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను కేటాయించాల్సిందిగా గత కొంతకాలంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. అయితే, స్థలాలను కేటాయించేందుకు అవకాశాల్లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా అపార్ట్‌మెంట్లను కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. దీంతో తమకుహ్యాపీనె్‌స్టలో ఫ్లాట్లను రాయితీ ధరలకు కొనుగోలు చేసుకునే అవకాశమివ్వాలంటూ కొందరు ఎన్జీవోలు కోరగా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
 
దీనిపై ఇటీవల జరిగిన సీఆర్డీయే సమావేశంలోనూ కొంత చర్చ జరగ్గా, ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో హ్యాపీనె్‌స్టలో ఇప్పటికే ప్రకటించిన 1200 ఫ్లాట్లు కాకుండా మరొక 1200 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తే వాటిలో కొన్నింటిని ఎన్జీవోలకు కేటాయించే అవకాశముందంటున్నారు. ఇదిలావుంటే, ఇప్పటికే ప్రతిపాదించిన 12 టవర్లకు కేటాయించిన భూమి పక్కనే మరింత భూమి అందుబాటులో ఉండడంతో ఈ 1200 ఫ్లాట్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

అనుసంధానానికి... అడ్డంకులు
ఒక్కొక్క సమస్య పరిష్కారం దిశగా చర్యలు
amr-gen3a.jpg
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన ప్రధాన అనుసంధాన రహదారి(సీడ్‌యాక్సెస్‌ రోడ్‌) నిర్మాణానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూసమీకరణ చేసిన ప్రాంతంలో సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉండగా భూసేకరణ చేయాల్సిన ప్రాంతంలోనూ సమస్యలు కొలిక్కి రావడం లేదు. విద్యుత్తు టవర్ల తరలింపు, వంతెనల నిర్మాణం, భూసేకరణలో జాప్యం ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. రాజధానిలో నిర్మిస్తున్న రహదారులన్నింటికీ 21కిలోమీటర్ల పొడవైన ప్రధాన అనుసంధాన రహదారి కీలకం కావడంతో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. గుంటూరు జిల్లా సంయుక్త పాలనాధికారి వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒక్కొక్కటి సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. అయితే    న్యాయస్థానాల్లో కేసులు, భూసేకరణ సమస్యలు అడ్డంకిగా మారాయి.
ఈనాడు, అమరావతి

దొండపాడు గ్రామం వైపు నుంచి ప్రధాన అనుసంధాన రహదారి 500 మీటర్ల దూరం నిర్మాణం పూర్తయిన తర్వాత హైటెన్షన్‌ విద్యుత్తు టవరు ఒకటి అడ్డంకిగా ఉంది. ఇది రహదారి మధ్యలో ఉండటంతో ఇక్కడ నిర్మాణం ఆగింది. విద్యుత్తు టవరు మార్చి నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ప్రస్తుతం టవర్ల మార్పు పనులు కొనసాగుతున్నాయి.
 

దొండపాడు గ్రామం సమీపంలో వాగు నీరు రహదారి కింద వెళ్లేలా వంతెన నిర్మించాల్సి ఉంది. వంతెన నిర్మాణానికి గొయ్యి తవ్వి సాంకేతిక కారణాలతో వదిలేశారు. కాంక్రీటు పనులు ప్రారంభించకపోవడంతో ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి.

amr-gen3b.jpg

రాయపూడి గ్రామం వద్ద ప్రధాన అనుసంధాన రహదారి నిర్మాణానికి చర్చి అడ్డంకిగా ఉంది. చర్చికి ప్రత్యామ్నాయ స్థలం, నిర్మాణానికి నిధులు కేటాయించినా చర్చి తొలగింపులో జాప్యం జరుగుతోంది. దీంతో ఇక్కడ  నిర్మాణం ఆపేశారు. చర్చి వెనుక వైపు రెండు సర్వేనంబర్లలో భూసేకరణ సమస్య ఉంది.
 

రాయపూడి గ్రామంలో గతంలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా భూమి సేకరించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ ఇళ్లు రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోతున్నారు. వీరందరికీ ప్రత్యామ్నాయంగా సమీపంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఇళ్లు తొలగించారు. అయితే రెండు గుడిసెలు తొలగింపులో జాప్యం జరుగుతోంది. ఇక్కడ రహదారి నిర్మాణం అసంపూర్తిగా ఉంది.
 

కొండమరాజుపాలెం గ్రామం రెవెన్యూ పరిధిలో రహదారి నిర్మాణానికి భూసమీకరణ కింద ఇవ్వని రైతు నుంచి భూమి సేకరించాల్సి ఉంది. భూసేకరణలో జాప్యం జరగడంతో రహదారిలో కొంతభాగం నిర్మించి ఒకవైపు నిర్మాణం ఆపేశారు.
 

మందడం గ్రామం సమీపంలో రహదారి నిర్మాణంలో భాగంగా వరదనీరు వెళ్లడానికి వంతెన నిర్మించాల్సి ఉంది. ఇందుకు గొయ్యి తవ్వినా సాంకేతిక కారణాలతో వంతెన నిర్మాణం ప్రారంభించకపోవడంతో రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది.
 

దొండపాడు నుంచి ప్రారంభమైన ప్రధాన అనుసంధాన రహదారి వెంకటపాలెం సమీపంలో మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం సమీపంలో ఆగిపోయింది. ఇక్కడి నుంచి ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతుల నుంచి భూసేకరణ చేయాల్సి ఉంది. భూసమీకరణ కింద ఇచ్చిన రైతులు కూడా కొందరు పంటలు సాగుచేయడం గమనార్హం.
 
 

తాడేపల్లి పరిధిలో ప్రధాన అనుసంధాన రహదారి రెండోదశలో భాగంగా ఉండవల్లిలో వంతెన నుంచి కనకదుర్గవారథి వరకు 2.7కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయాల్సి ఉంది. ఇక్కడ భూసేకరణకు సంబంధించి డ్రాప్టు డిక్లరేషన్‌ విడుదల చేశారు. రైతులకు పరిహారం చెల్లించి భూమి స్వాధీనం చేసుకోవాలి.

కనకదుర్గ వారథి సమీపంలో జాతీయ రహదారిలోకి ప్రధాన అనుసంధాన రహదారి కలిసే ప్రాంతం. ఇక్కడ జాతీయ రహదారిలోకి వాహనాలు ప్రవేశించడానికి, అదేవిధంగా జాతీయ రహదారి నుంచి అనుసంధాన రహదారిలోకి వెళ్లడానికి వేర్వేరుగా మార్గాలు నిర్మిస్తారు.
 

దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు తొలిదశ 18.3 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఎక్కువగా భూసమీకరణ ప్రాంతం మీదుగా ప్రధాన అనుసంధాన రహదారి ప్రయాణిస్తోంది. కొందరు రైతులు భూసమీకరణకు భూములు ఇవ్వకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి. విద్యుత్తు టవర్ల తరలింపు, వంతెనల నిర్మాణంలో జాప్యం, ప్రైవేటు నిర్మాణాల తొలగింపులు అడ్డంకిగా మారాయి.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...