Jump to content

Amaravati


Recommended Posts

తెలుగువారు గర్వపడేలా రాజధాని
15-11-2018 09:02:12
 
636778693337679105.jpg
  • వేగవంతంగా నిర్మాణ పనులు
  • ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలన
  • నిర్మాణాల తీరుపై సంతృప్తి
తుళ్లూరు: తెలుగు వారు గర్వపడేవిధంగా రాజధాని అమ రావతి నిర్మాణం ఉంటుందని సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం రాజధానిలో నిర్మితమవుతున్న ఎమ్మెల్యే, ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారుల అపార్టుమెంట్లు, ఎన్‌జీవో ఇళ్ల నిర్మాణాలు, తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. గవర్నమెంటు కాంప్లెక్స్‌లో ఐదు ఐకానిక్‌ టవర్ల అండర్‌ గ్రౌండు పనులను ఆయన పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు నిర్మాణాలను పరిశీలించారు. తొలుత మోడల్‌గా నిర్మించిన ఐఏఎస్‌ అపార్ట్‌మెంటులో ఒక ఫ్లాట్‌ని సీఎం పరిశీలించారు. అత్యద్భుతంగా నిర్మించారని కొనియాడారు. ఆ తరువాత గెజిడెడ్‌ అధికారుల ఇళ్ల టవర్ల నిర్మాణాలను పరిశీలించారు.
 
444444.jpg అందులో పూర్తిగా తయారైన ఫ్లాట్‌ను సీఎం పరిశీలించి సంతృప్తి వ్యవక్తంచేశారు. హైకోర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కోర్టు పనులు ఇంకా వేగవంతంగా సాగాలని ఆదేశించారు. అనంతరం గవర్నమెంటు కాంప్లెక్స్‌ నిర్మాణం జరిగే ప్రదేశంలోనే మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన రాజధాని నిర్మాణ పనులు సంతృప్తికరంగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. శాశ్వత అసెంబ్లీ పక్కన ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణం జరుగుతోంది. డిస్ట్రిక్‌ కోర్టు (ప్రస్తుతం తాత్కాలిక హైకోర్టు) పక్కనే పర్మినెంటు హైకోర్టు నిర్మాణం చేపట్టారు. రాజధానిలో 34రోడ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నాయి. అంతా అండర్‌ గ్రౌండు కేబుల్‌ సిస్టంతో రోడ్లనిర్మాణం జరుగుతుండడం విశేషం! ఎక్కడా చుక్కనీరు వేస్ట్‌ కాకుండా ప్లాన్‌ చేయడం గమనార్హం! ప్రపంచమే మెచ్చేలా నిర్మాణాలు అమరావతిలో అదీ గవర్నమెంటు కాంప్లెక్స్‌లలో ఉండడం విశేషం! 30 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్‌లలో బిల్డింగ్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మొత్తం రూ.48,116 కోట్లు నిర్మాణాలకు ఖర్చు చేస్తుండగా... ఇప్పటికే రూ. 37,777 కోట్ల పనుల అవార్డు ఇచ్చారు. డిసెంబరు నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తిచేసి నూతన సంవత్సరంలో ప్రారంభించేందుకు సిద్ధంచేస్తున్నారు. కోర్టు భవనాలే కాదు జస్టిస్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నారు.
 
ఆక్సిజన్‌ శాతం పెంపునకు చర్యలు...
00000000000.jpgరాజధాని అమరావతి నగరంలో ఆక్సిజన్‌ శాతం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. రోడ్డుకిరువైపులా చెట్లు, పెద్ద పెద్ద పార్క్‌లు కూడా ఉంటాయి. అన్నీ వాహనాలు బ్యాటరీతో నడిచే విధంగా రూపొందిస్తున్నారు. సీడ్‌యాక్సెస్‌ రోడ్డు మధ్యలో ఎలక్ర్టికల్‌ బస్సులు నడుస్తాయి. డ్రైవర్‌ ఉన్నా కాని సంబంధిత స్టేజీలలో ఆటోమేటిక్‌గా బస్సు ఆగేవిధంగా టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. రాజధాని నగరం మొత్తాన్ని కూలింగ్‌ విధానంలోకి తీసుకెళ్లేవిధంగా చర్యలు తీసుకోనున్నారు.
 
9 సీటీలు 27టౌన్‌షిప్‌లు
5665555546.jpgరాజధాని నగరంలో 9 సీటీలు, 27 టౌన్‌షిప్‌లు ఏర్పాటవుతాయి. ఎమర్జన్సీ సూపర్‌స్పెషాలటీ హస్పటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ అన్నీ టౌన్‌షిప్‌లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కాలినడక దూరంలో అన్నీ అందుబాటులో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. హ్యాపీనెస్ట్‌కి ప్రజల నుంచి విశేష స్పందన రావటమే రాజధాని నగరంపై మక్కువ చెప్పకనే చెబుతోంది. గంట వ్యవధిలోనే వంద ఫ్లాట్లు బుక్కు అయ్యాయి.
 
ప్రజారాజధానిగా...
srtggdfwe.jpgఅమరావతి రాజధాని ప్రజారాజధానిగా ఏర్పాటు అవుతుందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అన్నీ వర్గాల ప్రజలు ఇక్కడే ఉండే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లుచెప్పారు. ఇళ్లులేని నిరుపేదలకు రాజధానిలో గ్రూపు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసినట్టు చెప్పారు. త్వరలో వాటిని పేదలకు అందజేస్తామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు వెంట మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, తాడికొండ శాసన సభ్యుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, తుళ్లూరు ఎంపీపీ పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, రైతు నాయకులు అనుమోలు సత్యనారాయణ, నూతపాటి రామారావు ఉప్పలపాటి సాంబశివరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బెల్లంకొండ నరసింహారావు, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌, ఎస్‌ఈ ధనుంజయ, ల్యాండ్సు డైరెక్టర్‌ చెన్నకేశవరావు, నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడికక్కడ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటుచేశారు.
Link to comment
Share on other sites

కేసీఆర్‌కు చేతకాక నాపై విమర్శలు
15-11-2018 03:39:03
 
636778499441033119.jpg
అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):  హైదరాబాద్‌ ద్వారా లభించే ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చేతకావడం లేదని సీఎం అన్నారు. పైగా తరచుగా తనపై అసంబద్ధ వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘నా హయాంలో ఐటీకి హబ్‌గా సైబరాబాద్‌ను నిర్మించడం ద్వారా ఒక సరికొత్త నగరాన్ని హైదరాబాద్‌కు జతపరిచాం. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం ఏటేటా వేలాది కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఆ నిధుల సద్వినియోగంతో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్‌ ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. నన్ను మాత్రం తిడుతుంటారు’ అని దుయ్యబట్టారు.
 

Advertisement

Link to comment
Share on other sites

ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు
వేల కోట్లు పన్ను తీసుకుంటూ రాజధానికి పైసా ఇవ్వడం లేదు
మనకీ మంచి రోజులొస్తాయి
అప్పుడు వడ్డీ సహా వసూలు చేస్తాం
కేంద్రంపై చంద్రబాబు ధ్వజం
విపక్షాలు దివాలాకోరు పార్టీలుగా మారాయని విమర్శ
రాజధాని నిర్మాణ పనుల పరిశీలన
ఈనాడు - అమరావతి
14ap-main1a.jpg

కేంద్ర ప్రభుత్వం మనల్ని బానిసల్లా చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రం కంటే కేంద్రానికే పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం వెళుతున్నా... రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఏటా జీఎస్టీ ద్వారా కేంద్రానికి రూ.6 వేల కోట్లు వెళుతోందని చెప్పారు. రాష్ట్రానికి మంచి రోజులొస్తాయని, అప్పుడు కేంద్రం నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తామని పేర్కొన్నారు. రాజధానిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి బుధవారం స్వయంగా పరిశీలించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల టవర్ల నిర్మాణం చేపడుతున్న చోట ఆయన విలేకరులతో మాట్లాడారు.

పనులన్నీ సంతృప్తికరంగా సాగుతున్నాయని, ఇన్నాళ్లుగా తాము పడ్డ శ్రమకు ప్రతిఫలం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపైనా, ప్రతిపక్ష పార్టీలపైనా ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని విపక్షాలు దివాలాకోరు పార్టీలుగా మారాయని, రాజధాని నిర్మించడం, రాష్ట్రం అభివృద్ధి చెందడం వాటికి ఇష్టంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధానిలో వైభవాన్ని చూసి అవి ఓర్చుకోలేకపోతున్నాయన్నారు. విజయవాడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలు, ప్రయాణం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా... కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులివ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘విజయవాడ-సింగపూర్‌ విమాన సర్వీసు కోసం ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నాను. కొత్త టర్మినల్‌ కోసం కేంద్రానికి రూ.వెయ్యి కోట్ల విలువైన భూమి ఇచ్చాం. కేంద్రం మాత్రం సహకరించడం లేదు. విదేశాలకు విమానాలు నడపాలంటే విమానాశ్రయంలో కస్టమ్స్‌ కేంద్రం ఉండాలి. కానీ నిర్వహణ ఖర్చులన్నీ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీనే ఇవ్వాలని కస్టమ్స్‌ విభాగం తెలిపింది. దానికి ఎయిర్‌పోర్ట్స్‌   అథారిటీ స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పాం. ఆ గందరగోళంలో ఒక సీజన్‌ పోయింది. డిసెంబరుకి రీషెడ్యూల్‌ చేశారు’’ అని పేర్కొన్నారు.

కట్టకపోతే భూములు వెనక్కి...!
రాజధానిలో వివిధ ప్రాజెక్టుల కోసం భూములు తీసుకున్న సంస్థలు నిర్మాణాలు చేయకపోవడాన్ని విలేకరులు ప్రస్తావించగా... ప్రాజెక్టులు మొదలు పెట్టనివారికి భూమి కేటాయింపులు రద్దు చేసి కొత్తవారికి ఇస్తామని తెలిపారు. ఇప్పుడు రాజధానికి రానివాళ్లు భవిష్యత్తులో పశ్చాత్తాప్పడతారని ఆయన వ్యాఖ్యానించారు.

అప్పులు ఎలా తీర్చాలో నాకు తెలుసు..!
రాజధాని నిర్మాణానికి చేస్తున్న అప్పుల్ని ఎలా తీర్చుతారని కొందరు అడుగుతున్నారని, దానికి తమ వద్ద పరిష్కారాలున్నాయని చంద్రబాబు తెలిపారు. ‘‘నేను ఎకనమిక్స్‌ స్టూడెంట్‌ని. డబ్బుల్లేవని ఇంట్లో పడుకుంటే పనులు జరగవు. రాజధాని పరిపాలన నగరంలో 400 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిస్తాం. దాని వల్ల ఆదాయం వస్తుంది. సుమారు ఐదారు వేల ఎకరాల్ని రిజర్వుగా ఉంచుకున్నాం. మరోపక్క రాజధానిలో నిర్మాణ కార్యక్రమాల వల్ల పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఈ వనరులతో అప్పులు తీరుస్తాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో భూమిలేని నిరుపేదలకు నైపుణ్య శిక్షణనిచ్చి, స్థానికంగా వచ్చే అవకాశాల్ని ఉపయోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపడతామని ఆయన ప్రకటించారు.

మంచి నగరాన్ని ఇచ్చినందుకు కేసీఆర్‌ నన్ను తిడుతున్నారు..
అమరావతి భవిష్యత్‌ తరాలకు గొప్ప ఆస్తి అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. మరో మూడేళ్లలో ఈ నగరం ఎవరూ ఊహించనంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ‘‘హైదరాబాద్‌ని బాగా అభివృద్ధి చేశాం. అదిప్పుడు బంగారు బాతు. ఈ రోజు అక్కడున్న పాలకులు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. మంచి నగరాన్ని ప్లాన్‌ చేసి ఇచ్చినందుకో ఏమో... కేసీఆర్‌ ఇప్పుడు పదే పదే నన్ను తిడుతున్నారు. హైదరాబాద్‌ని తెలుగువారి కోసం అభివృద్ధి చేశాం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి బ్రహ్మాండమైన రాజధాని నగరం నిర్మిస్తామని చెప్పాం. ఎన్ని కష్టాలున్నా లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాం. కేంద్రం సహకరించకపోగా ప్రజల్ని రెచ్చగొట్టడం, మభ్యపెట్టడం లాంటివి చేస్తోంది’’ అని పేర్కొన్నారు. ఒకాయన రాజధానిలో ఒక్క ఇటుకరాయి కూడా పెట్టలేదని విమర్శిస్తున్నారని, ఇటుకలతో భవనాలు కట్టే రోజులు పోయాయని, ఆధునిక టెక్నాలజీలు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. దొంగ లెక్కలు రాసుకోవడానికే అలవాటు పడ్డవారికి ఈ విషయాలేమీ బోధపడవన్నారు.


ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..!

*రాజధానికి రూ.1.09 లక్షల కోట్ల నిధులు కావాలని కేంద్రానికి డీపీఆర్‌ ఇచ్చాం.
*తాత్కాలిక హైకోర్టు భవనాన్ని డిసెంబరు 15కి పూర్తి చేస్తాం. వచ్చే జనవరి 1న ప్రారంభిస్తాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానిస్తాం.
*అఖిల భారత సర్వీసుల అధికారులు, ఉద్యోగులు, ఎమ్మెల్యేల కోసం 4 వేల ఫ్లాట్ల నిర్మాణం మార్చి, ఏప్రిల్‌ నాటికి పూర్తవుతుంది.
*ప్రధాన అనుసంధాన రహదారి మధ్యలో... ఎలక్ట్రికల్‌ బస్సులు నడుపుతాం.
*రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న పనులకు రూ.48,116 కోట్లు ఖర్చవుతుంది. రూ.30,757 కోట్ల పనులు ఇప్పటికే చేపట్టాం.
*గుజరాత్‌ సచివాలయంలోకి పులి వచ్చేసింది. అమరావతిలో సచివాలయం అలా ఉండకూడదన్నదే మా లక్ష్యం.
*ముఖ్యమంత్రి రాజధానిలో మొదట ఎన్‌9 రహదారి పనుల్ని, తర్వాత అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్లలో సిద్ధం చేసిన నమూనా ఫ్లాట్‌ని, తాత్కాలిక హైకోర్టు, ఇతర నిర్మాణ పనుల్ని పరిశీలించారు.

Link to comment
Share on other sites

అదిగో.. అమరావతి
15-11-2018 02:55:56
 
636778473574699094.jpg
  • మన శ్రమ క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది..
  • రహదార్లు, ఇన్‌ఫ్రా నిర్మాణాలు కొలిక్కి
  • మరో 3 నెలల్లో మరింత ప్రస్ఫుటంగా!
  • పూర్తయితే చూసేందుకు కళ్లు చాలవు
  • ఇలాంటి నగరం ఎక్కడా ఉండదు
  • జనవరి 1 నుంచి ఇక్కడే హైకోర్టు
  • మార్చికల్లా ప్రభుత్వ నివాసాలు సిద్ధం
  • పేదల నుంచి ప్రముఖుల వరకూ.. అందరికీ నాణ్యమైన జీవనం
  • అమరావతిలో నివాసం అదృష్టం
  • రానివారికి పశ్చాత్తాపం ఖాయం
  • ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
  • పలు నిర్మాణ పనుల ప్రత్యక్ష పరిశీలన
‘‘ఇంతటి సువిశాల ప్రదేశంలో, పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా, అత్యుత్తమంగా నిర్మితమవుతున్న మరో నగరమేదీ ప్రపంచంలోనే లేదు.’’
‘‘డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తాం. ప్రాణాంతక వాయువులకు ఆస్కారం లేకుండా చేస్తాం.’’
‘‘తాత్కాలిక హైకోర్టు భవనమైన జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ జనవరి 1నాటికి సిద్ధమవుతుంది. హైకోర్టు ప్రారంభ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానిస్తాం.’’
- చంద్రబాబు
 
 
అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఐదు కోట్ల మంది ఆంధ్రులు సగర్వంగా చెప్పుకొనేలా రాజధాని అమరావతిని నిర్మించేందుకు నాలుగేళ్లకుపైగా తాము పడుతున్న శ్రమ, తపన ప్రస్తుతం పలు నిర్మాణాల రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తుమ రాజధాని నగరాల్లో ఒకటిగా దీనిని రూపుదిద్దేందుకు చేపట్టిన పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో ఇందులోని రహదారులు, భవనాలు, మౌలిక వసతులు, ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి పనులన్నీ మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయని తెలిపారు. రాజధానిలో ప్రాధాన్య రహదారులు, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మితమవుతున్న గృహ సముదాయాలు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు ఇత్యాది నిర్మాణాలను బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. కొద్ది నెలల క్రితం తొలిసారి క్షేత్ర పర్యటన జరిపిన సంగతి తెలిసిందే.
 
 
ఇది రెండోసారి. పర్యటన ఆసాంతం ముఖ్యమంత్రి హుషారుగా కనిపించారు. ఆయా నిర్మాణాల తీరుపై ఆయన ముఖంలో సంతృప్తి కనపడింది. అనంతరం జీఏడీ టవర్‌ నిర్మాణ ప్రదేశంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. రాజధాని నగర విశిష్టతలు, దానిని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, తద్వారా రాష్ట్రానికి, ప్రజలకు ఒనగూరబోయే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కేంద్రం, ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘అమరావతి అంతటి సువిశాల ప్రదేశంలో, పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా, అత్యంత భారీ ఎత్తున, అత్యుత్తమంగా నిర్మితమవుతున్న నగరం ప్రస్తుతం ప్రపంచంలోనే లేదు. ఇందులో నిర్మించే ఐకానిక్‌ నిర్మాణాలు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లు, కృష్ణానదిపై వంతెనలు, 8, 6 వరుసల సువిశాల రహదారులు, వందలాది ఎకరాల్లో పచ్చదనం, ల్యాండ్‌స్కేపింగ్‌, రోడ్ల పక్కన వేలాది మొక్కలు, భారీ ఉద్యానవనాలు చూసి మన రాజధానిని యావత్ప్రపంచం కీర్తిస్తుంది.
 
 
గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మధ్యలో, సుమారు 7 కిలోమీటర్ల పొడవున దాదాపు 600 ఎకరాల్లో రానున్న ల్యాండ్‌స్కేపింగ్‌, సమున్నతంగా నిర్మితమయ్యే అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ టవర్లు, 320 కిలోమీటర్ల పొడవైన వంకర లేని రోడ్లు, నీరు-డ్రైనేజీ- గ్యాస్‌- విద్యుత్‌- ఐటీ తదితర సకల మౌలిక వసతులూ.. భూగర్భంగుండానే సాగేలా రోడ్ల పక్కల ఏర్పాటు చేస్తున్న డక్ట్‌లు.. మరే నగరానికీ లేని ప్రత్యేకతలు. ఇందులోని ప్రతి నిర్మాణంపైనా సౌరవిద్యుత్‌ ఫలకాల అమరికతో వాటికి అవసరమయ్యే విద్యుత్‌లో కనీసం 33 శాతం అక్కడే ఉత్పత్తయ్యేలా చూస్తాం. నగరంలో పెద్దఎత్తున ఎలక్ట్రికల్‌ వాహనాలను ప్రవేశపెడతాం. నిరుపేదలు సైతం నాణ్యమైన, సౌకర్యవంతమైన జీవనం గడిపేందుకు అవసరమైన అన్ని వనరులతో అమరావతి రూపుదిద్దుకోనుంది. 9 థీమ్‌ సిటీలు, 27 టౌన్‌ షిప్‌లతో దేనికీ రాజధాని వెలుపలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నీ వాటిల్లోనే ఏర్పడేలా చూడడం మరో ప్రత్యేకత’.
 
 
కొందరు తప్పనిసరై ఉంటున్నారు..
‘ప్రస్తుతం కొందరు అమరావతికి స్వచ్ఛందంగా వచ్చినప్పటికీ ఇంకొందరు మాత్రం తప్పనిసరై ఇక్కడ ఉంటున్నారు. అయితే కొద్ది సంవత్సరాల్లోనే ఇక్కడ ఉండకపోతే పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి వస్తుంది. హైకోర్టు తాత్కాలిక నిర్వహణ నిమిత్తం 2,53,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ వచ్చే నెల 15కల్లా పూర్తవుతుంది. జనవరి 1నాటికి హైకోర్టు నిర్వహణకు వీలుగా సిద్ధమవుతుంది. నవ్యాంధ్ర హైకోర్టు ప్రారంభ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించబోతున్నాం. ఇందులో 19 కోర్టులు ఉంటాయి. ఇది పూర్తయిన 3, 4 నెలలకే వివిధ కేటగిరీల అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న 3,840 ఫ్లాట్లు సిద్ధమవుతాయి. శాశ్వత హైకోర్టుతో కూడిన జస్టిస్‌ సిటీని పూర్తి హంగులతో నిర్మిస్తాం.’
 
ముఖ్యమంత్రి పర్యటన కొనసాగిందిలా..
  • మధ్యాహ్నం 3.30కి ఉండవల్లిలోని తమ నివాసం నుంచి బయల్దేరిన సీఎం తొలుత ఉద్దండరాయునిపాలెం నుంచి నిడమర్రు వరకు నిర్మితమవుతున్న ఎన్‌-9 కీలక రహదారిని పరిశీలించారు. వివిధ ప్రాధాన్య రహదారులు కలుసుకునే జంక్షన్లను తిలకించి అధికారులకు సూచనలిచ్చారు.
  • తర్వాత రాయపూడి, నేలపాడు వద్ద అఖిల భారత సర్వీస్‌ అధికారులు(ఏఐఎస్‌), గెజిటెడ్‌, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగులకు ఉద్దేశించిన కొన్ని టవర్ల పరిశీలించారు.
  • 12 అంతస్థులు పూర్తయిన టవర్‌ను చూసి వచ్చి.. బస్సెక్కబోయే ముందు మళ్లీ వెనక్కి తిరిగి పరిశీలన.. నిర్మాణంపై సంతృప్తి.
  • అసెంబ్లీ, శాశ్వత హైకోర్టుల నిర్మాణ ప్రదేశాల పరిశీలన. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, సెక్రటేరియట్‌ టవర్ల పనుల పురోగతిపై అధికారుల, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధుల వద్ద వాకబు. వివిధ ప్రాజెక్టు ప్రదేశాల వద్ద ఫొటో ఎగ్జిబిషన్ల సందర్శన.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...