Jump to content

Recommended Posts

రాజధాని రహదారుల పరిశీలన
13-11-2018 07:37:39
 
636776914603584138.jpg
అమరావతి(ఆంధ్రజ్యోతి): అమరావతిలో కీలక ప్రాంతాలను కలుపుతూ నిర్మితమవుతున్న ఈ-12, ఎన్‌-11 రహదారుల పనులు చురుగ్గా సాగుతున్నట్లు ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి చెప్పారు. ఆ రెండు రోడ్లను అఽధికారులతో కలసి సోమవారం పరిశీలించారు. తొలుత ఎర్రబాలెం నుంచి నీరుకొండ వరకు నిర్మిస్తున్న ఈ-12 రోడ్డులో పర్యటించిన ఆమె అందులో భాగంగా జరుగుతున్న వంతెనలు, యుటిలిటీ డక్ట్‌లు, వరదనీటి కాలువల నిర్మాణాలను తిలకించారు.
 
ఆ తర్వాత శాఖమూరు నుంచి లింగాయపాలెం వరకు నిర్మాణంలో ఉన్న ఎన్‌-11 రహదారిని పరిశీలించారు. ఆయా పనులన్నీ మరింత వేగం పుంజుకునేలా చేసి, నిర్ణీత గడువుల్లోగా అవి పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఏడీసీ సీఈ టి.మోజె్‌సకుమార్‌, ఎస్‌.ఇ. ఎం.వి.సూర్యనారాయణ, ఈఈ నరసింహమూర్తి, భూవిభాగపు డైరెక్టర్‌ బి.రామయ్య తదితర అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
 

Advertisement

Share this post


Link to post
Share on other sites
హ్యాపీనెస్ట్‌ రెండోదఫా బుకింగ్‌ వాయిదా!
13-11-2018 02:54:21
 
636776744619383728.jpg
  • ఒక్కో విడతలో 300 ఫ్లాట్లకు బదులు
  • ఒకేసారి 900 బుకింగ్‌కు సీఆర్డీయే మొగ్గు
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాజధానిలో ఏపీసీఆర్డీయే నిర్మించనున్న ప్రజా నివాస సముదాయం ‘హ్యాపీనెస్ట్‌’లోని మరొక 300 ఫ్లాట్లకు ఈ నెల 15వ తేదీన బుకింగ్‌ జరగకపోవచ్చునని విశ్వసనీయంగా తెలుస్తోంది! సీఆర్డీయే ఇంకా అఽధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ మేరకు ఉన్నతాధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అమరావతిలో 14.46 ఎకరాల్లో, 12 టవర్లు-1200 ఫ్లాట్లతో హ్యాపీనె్‌స్టను సీఆర్డీయే నిర్మించనున్న సంగతి తెలిసిందే. అత్యాధునిక వసతులు, పలు విశిష్టతలతో రూపొందుతున్న ఈ 2, 3 బెడ్‌రూంలతో కూడిన ఫ్లాట్ల కాంప్లెక్స్‌పై దేశ, విదేశాల్లో పెద్దఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ నెల 9వ తేదీన ఇందులోని 3 (ఏ, బీ, సీ) టవర్లలో ఉన్న 300 ఫ్లాట్లకు సీఆర్డీయే ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిర్వహించగా, భారీ స్పందనతో అవన్నీ ఒక్కరోజులోనే బుక్‌ అయిన విషయం తెలిసిందే.
 
దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15న మరో 300 (డీ, ఈ, ఎఫ్‌ టవర్లలోని) ఫ్లాట్లకు బుకింగ్‌లు నిర్వహించనున్నట్లు సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ 9న తేదీనే ప్రకటించారు. 15వ తేదీ తర్వాత కూడా వారానికి 300 చొప్పున ఇంకో 2 పర్యాయాలు బుకింగ్‌లు జరపడం ద్వారా ఈ నెలాఖర్లోగా హ్యాపీనె్‌స్టలోని మొత్తం 1200 ఫ్లాట్లకు బుకింగ్‌ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రకటనతో... తొలి విడతలో హ్యాపీనెస్ట్‌లో అపార్ట్‌మెంట్లను బుక్‌ చేసుకోలేకపోయిన పలువురిలో తిరిగి ఆశలు రేకెత్తాయి. వచ్చే గురువారం మరోసారి ప్రయత్నించేందుకు వారంతా ఎదురుచూస్తున్నారు. వీరిలో కొందరైతే బుకింగ్‌ ప్రక్రియపై అవగాహన పెంచుకునేందుకు, ఇతరత్రా సందేహాలు తీర్చుకునేందుకు విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తున్నారు.
 
పరిస్థితులు ఇలా ఉండగా, సీఆర్డీయే ఉన్నతాధికారులు మాత్రం ఈ నెల 15న బుకింగ్‌ నిర్వహించడంపై పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే... హ్యాపీనెస్ట్‌ బ్రోచర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించినది మొదలు సుమారు 2 వారాలుగా తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రముఖంగా చూపుతూ వచ్చిన సంబంధిత వివరాలను సోమవారం తొలగించినట్లు తెలుస్తోంది! తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో మళ్లీ కేవలం 300 ఫ్లాట్లకే బుకింగ్‌లు జరిపితే తొలిసారి పరిస్థితులే పునరావృతమవుతాయని సీఆర్డీయే అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల ఒకేసారి మిగిలిన 900 ఫ్లాట్లకూ బుకింగ్‌ జరిపితే మేలని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే ఇందుకు ఒక నిర్దిష్ట తేదీని ఖరారు చేయలేదని, బహుశా ఈ నెలాఖర్లోగా ఉండే వీలున్నదని సమాచారం.
 
అనుమతుల్లో జాప్యమూ కారణమా?
సీఆర్డీయే ఈ ఆలోచన వెనుక మరొక ప్రధాన కారణమూ ఉందంటున్నారు. ఫ్లాట్ల అమ్మకాలు జరపాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన ‘ఏపీ రెరా’, ఇతర చట్టపరమైన అనుమతులు హ్యాపీనె్‌స్టలోని ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌ టవర్లలోని 600 ఫ్లాట్లకే లభించాయని, మిగిలిన (జీ, హెచ్‌, ఐ, జే, కే, ఎల్‌ టవర్లలోని) 600 ఫ్లాట్లకు రావాల్సి ఉందని చెబుతున్నారు. నియమ నిబంధనలకు పూర్తి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నందున అవి లభించడం ఖాయమేనని భావిస్తున్నప్పటికీ అవి రాకముందే అమ్మకాలను ప్రారంభించడం లేదా ప్రచారం చేయడం నిషిద్ధం. పైగా.. ఒకవేళ ఏ కారణం వల్లనైనా ఈ అనుమతులు లభించడంలో కొద్ది రోజులు అటూఇటూ గనుక అయితే 15వ తేదీ తర్వాత 3, 4 విడతల్లో మిగిలిన 600 ఫ్లాట్లకు జరపదలచిన బుకింగ్‌ ప్రక్రియను వాయిదా వేయక తప్పదని అధికారులు భావిస్తున్నారని తెలిసింది. అదే జరిగితే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అనుకుంటున్నారు. దీనిని నివారించేందుకు ఆ అనుమతులు కూడా వచ్చేవరకూ ఆగి, ఆ తర్వాత మొత్తం 900 ఫ్లాట్లకూ ఒకేసారి బుకింగ్‌ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Share this post


Link to post
Share on other sites
హ్యాపీనెస్ట్‌లో రెండో విడత బుకింగ్‌ 26న?
13ap-state10a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు ‘హ్యాపీ నెస్ట్‌’లో రెండో విడత బుకింగ్‌ ప్రక్రియను ఈ నెల 26న నిర్వహించే అవకాశముంది. తొలి విడతలో 300 ఫ్లాట్లకు ఈ నెల 9న ఆన్‌లైన్‌లో బుకింగ్‌ నిర్వహించగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. సుమారు లక్ష మంది ప్రయత్నించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తుండగా... ప్రతి గురువారం 300 ఫ్లాట్లకు బుకింగ్‌ నిర్వహిస్తామని, రెండో విడత ఈ నెల 15న ఉంటుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ అప్పట్లో చెప్పారు. ఆ నిర్ణయాన్ని సీఆర్‌డీఏ ఇప్పుడు మార్చుకుంది. మిగతా 900 లేదా 600 ఫ్లాట్లకు రెండో విడతలో ఈ నెల 26న బుకింగ్‌ నిర్వహించాలని భావిస్తోంది. బుధవారం జరిగే సీఆర్‌డీఏ సమీక్ష సమవేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు.

Share this post


Link to post
Share on other sites
నేడు ముఖ్యమంత్రి రాజధానిలో పనుల పరిశీలన

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తారు. మధ్యాహ్నం మూడింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు వివిధ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భవన నిర్మాణాలను పరిశీలిస్తారు. శాఖమూరు- నేలపాడు మధ్య నిర్మిస్తున్న హైకోర్టు భవనాల పనులను పరిశీలిస్తారు.

Share this post


Link to post
Share on other sites
రాజధానిలో నూతన నిర్మాణాలను పరిశీలించిన సీఎం
14-11-2018 18:36:14
 
636778173752098922.jpg
అమరావతి: రాజధానిలో నూతన నిర్మాణాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. అలాగే ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మిస్తున్న రహదారి పనులను కూడా చంద్రబాబు పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెం నుంచి నిడమర్రు వరకు రహదారి నిర్మాణం, రాయపూడిలో ఐఏఎస్‌ క్వార్టర్స్‌ మోడల్‌ను సీఎం పరిశీలించారు. ఐఏఎస్‌ క్వార్టర్స్‌ మూడో అంతస్థులో పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగిన గృహాన్ని పరిశీలించారు. అంతేకాకుండా పాలవాగుపై నిర్మిస్తున్న వంతెనను పరిశీలించిన చంద్రబాబు.. రోడ్ల నిర్మాణంపై ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను తిలకించారు. నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్‌ను, జ్యూడిషియల్ కాంప్లెక్స్ పనులను చంద్రబాబు పరిశీలించారు.

Share this post


Link to post
Share on other sites
 
 

Tweets

 

Chief Minister's visit to the Capital City. The APCRDA Projects (Seed- Access Road, AIS- MLA housing, NGO's Housing and the High Court) were inspected by the Hon'ble Chief Minister Sri. Chandrababu Naidu @ncbn accompanied by Dr.Sreedhar Cherukuri IAS, Commissioner,APCRDA & Team

Dr-Pni5VYAALhNE.jpg
Dr-PneqUcAIAyzg.jpg
Dr-PnisUwAAt5qo.jpg
Dr-PnirU0AEHaRM.jpg

Share this post


Link to post
Share on other sites
మూడు నెలల్లో రూపు రేఖలు మారిపోతాయి: చంద్రబాబు
14-11-2018 21:44:16
 
636778287797561677.jpg
విజయవాడ: రాజధాని నిర్మాణ పనులపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. తాము పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తోందన్నారాయన. నాణ్యత, వసతుల్లో ఎక్కడా రాజీ పడటం లేదని చెప్పారు. 13 వేల మంది సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని తెలిపారు. 100 ఎకరాల్లో ప్రజా అసెంబ్లీని నిర్మిస్తామని వెల్లడించారు. రియల్ టైంలో పని చేసేలా సచివాలయం నిర్మిస్తున్నామన్నారు.
 
రాజధానిలో 34 రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రపంచంలో ఇంత పెద్ద నిర్మాణం ఎక్కడా జరగలేదన్నారు. అన్ని హంగులతో గ్రీన్ ఫీల్డ్ సిటీని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. వరద నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, 30 మిలియన్ చదరపు అడుగుల్లో భవనాలు నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తామని, కొత్త ఏడాదిలో హైకోర్టు భవనం సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తోందని, అమరావతి నిర్మాణం ద్వారా జీఎస్టీ రూపంలో కేంద్రానికి రూ.6 వేల కోట్లు చెల్లిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
 
కేంద్రం ఏపీ ప్రజల్ని బానిసలుగా చూస్తోందని వ్యాఖ్యానించారు. నిర్మాణాలు చేపట్టని సంస్థల నుంచి భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం తర్వాత 5 వేల నుంచి 6 వేల ఎకరాలు మిగులు భూమి ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తామన్నారు. మరో 3 నెలల్లో కొత్త రాజధాని రూపు రేఖలు మారిపోతాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×