Jump to content

Amaravati


Recommended Posts

AP secretariat to be world’s tallest

DECCAN CHRONICLE.
Published Oct 29, 2018, 1:15 am IST
Updated Oct 29, 2018, 1:15 am ISTDEOEo6e.jpg
The AP Secretariat on the banks of the Krishna River in Amaravati will be 212 metres tall.
 
 The ground clearing work for all five towers has been completed and the raft foundation work was recently done. The completion date is May 2019.

Vijayawada: The AP Secretariat will be the tallest Secretariat in the world with 50 floors. The temporary Secretariat was constructed at Velagapudi and is operational. The permanent Secretariat will be constructed in the core capital area and will have five towers. The first, second, third and fourth towers will have 40 floors each and the fifth will have 50 floors. This permanent Secretariat will be equipped with “world class facilities” including a rooftop helipad.

The APCRDA finalised tenders for the five towers of the permanent Secretariat. According to APCRDA officials, the construction firm of Shapoorji Pallonji got the contract for erecting the first and second towers, L& T the third and fourth towers, and NCC Limited bagged the contract for the fifth tower. L&T and Shapoorji Pallonji were involved in the construction of the temporary Secretariat at Velagpudi.

 

 

The AP Secretariat on the banks of the Krishna River in Amaravati will be 212 metres tall. It is also said to be the first Secretariat with a rooftop helipad, which will cost Rs 4,000 crore. The ground clearing work for all five towers has been completed and the raft foundation work was also recently completed. The completion date is May 2019.

APCRDA commissioner Ch Sreedhar said that the metropolitan government building in Tokyo, Japan, is 243 metres tall and is the tallest government Secretariat in the world. The new AP Secretariat will be the second tallest in the world. He further said that the diagrid structural system, a new technology, will be used in the construction whereby columns are avoided to get more space.

 

...
Edited by sonykongara
Link to comment
Share on other sites

ప్రపంచంలోనే ఎత్తయిన సచివాలయం
ఇది దేశంలోనే తొలి డయాగ్రిడ్‌ భవనం
  ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
DZX89FI.jpg

ఈనాడు, అమరావతి: ‘‘ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సచివాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించి చరిత్ర సృష్టించనున్నామని’’ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు ఏపీ ఇంధన, మౌలిక వసతుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 41 ఎకరాల్లో 212 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న ఇది దేశంలోనే తొలి డయాగ్రిడ్‌ భవనమని, దీనిలో ట్విన్‌ లిస్ట్‌ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నట్లు వెల్లడించింది. ‘‘సామాజిక మౌలిక వసతుల కల్పనలోనూ ఇవే ప్రమాణాలను పాటించాలి. అమరావతిలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ జీవన ప్రమాణాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటి ప్రధాన భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యే గడువును తెలియజేస్తూ సమగ్ర నివేదిక అందజేయాలి. వచ్చే ఏడాదినాటికి అమరావతి ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణాలకు ఒక రూపం తేవాలి. మనం అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు గుర్తించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా అమరావతిని పెట్టుబడులు పెట్టేందుకు గమ్యస్థానంగా మార్చుకున్నారు.’’ అని సీఎం పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

Link to comment
Share on other sites

ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయం
29-10-2018 02:54:03
 
y37GTzS.jpg 
  • 41 ఎకరాల్లో 212 మీటర్ల నిర్మాణం.. దేశంలోనే తొలి డయాగ్రిడ్‌ భవనం
  • మొదటిసారిగా ట్విన్‌ లిఫ్ట్‌ సౌకర్యం
  • మన నిబద్ధతే పెట్టుబడుల ఆకర్షణ
  •  సీఆర్డీయే అధికారులతో చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 212 మీటర్ల ఎత్తుతో(695 అడుగులు) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయ నిర్మాణం చేపట్టి చరిత్ర సృష్టిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. 41 ఎకరాల్లో నిర్మించే ఈ సచివాలయం దేశంలోనే తొలి డయాగ్రిడ్‌ భవనం కావడం విశేషమని, అలాగే మొదటిసారిగా ట్విన్‌ లిఫ్ట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీసీఆర్డీయే, ఏడీసీ అధికారులతో ముఖ్యమంత్రి ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మౌలిక వసతుల కల్పనలోనూ అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ‘ప్రతి సవాలు మనల్ని మరింత దృఢం గా చేస్తుంది. అనేక ఇబ్బందులు, కష్టాల మధ్య మూడేళ్ల కిందట ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అతితక్కువ సమయంలోనే తాత్కాలిక పరిపాలనా భవనం, అసెంబ్లీని నిర్మించుకొని చరిత్ర సృష్టించాం’ అని చంద్రబాబు వివరించారు.
 
వచ్చే ఏడాది కల్లా అమరావతి ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణం కూడా ఒక రూపునకు వస్తుందన్నారు. ‘మన కష్టాన్ని, నిబద్ధతను, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు గుర్తించారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడులకు అమరావతిని ఎంచుకొంటున్నారు. మన సర్కార్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం. ఈ ఫలాలలను ప్రజలందరికీ అందించడమే మన కర్తవ్యం. సమీప భవిష్యత్‌లో అమరావతిలో జనాభాతోపాటు ఆర్థిక వృద్ధి గణనీయంగా ఉంటుంది’ అని సీఎం పేర్కొన్నారు. శాశ్వత సచివాలయ, శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యే గడువులను తెలియజేస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని చంద్రబాబు ఆదేశించారు. అమరావతి అభివృద్ధితో కలిగే ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ అందేలా సీఆర్డీయే చర్యలు తీసుకొన్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
 
శరవేగంగా పనులు
రూ.14,360 కోట్లతో చేపట్టిన రోడ్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, రూ.4890 కోట్లతో మొదలుపెట్టిన సచివాలయం, హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సీఆర్డీయే సీఈవో అజయ్‌జైన్‌ వివరించారు. కీలక పెట్టుబడి అవకాశాలను కూడా సీఆర్డీయే గుర్తించిందన్నారు. 2019 సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని వివరించారు.
Edited by sonykongara
Link to comment
Share on other sites

సాటిలేని ఆకృతి
ఏపీ హైకోర్టు నమూనా.. న్యాయనగరి ప్రణాళిక అద్భుతం
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రభట్‌ అభినందన
‘జస్టిస్‌ సిటీ’ నిర్మాణంపై దిల్లీలో సీఆర్‌డీఏ సదస్సు
హాజరైన సుప్రీం, దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు
ఆకృతులను పరిశీలించిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ శాంతనగౌడర్‌
యుద్ధప్రాతిపదికన తాత్కాలిక హైకోర్టు నిర్మాణం: జస్టిస్‌ సురేష్‌ఖైత్‌
30ap-main13a.jpg

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న  ఏపీ హైకోర్టు భవన నిర్మాణ ఆకృతులు, న్యాయనగరి ప్రణాళిక అద్భుతమని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రభట్‌ ప్రశంసించారు. ఇలాంటి నగరి నిర్మాణం ప్రపంచంలోనే తొలిసారి కావచ్చని పేర్కొన్నారు. అమరావతిలో న్యాయనగరి (జస్టిస్‌ సిటీ) నిర్మాణంపై మంగళవారం దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) నిర్వహించిన సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ శాంతన ఎం.గౌడర్‌, దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవీంద్రభట్‌, జస్టిస్‌ వినీత్‌శరణ్‌, జస్టిస్‌ ప్రతిభ, జస్టిస్‌ సురేష్‌ఖైత్‌లు హాజరయ్యారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వారికి తాత్కాలిక హైకోర్టు నిర్మాణం, శాశ్వత భవనం నమూనా, జస్టిస్‌ సిటీ ఇతివృత్తాలను వివరించారు. న్యాయనగరి నమూనాను క్షుణ్నంగా పరిశీలించిన న్యాయమూర్తులు.. హైకోర్టు ఎన్ని ఎకరాల్లో వస్తుంది? భవిష్యత్తులో విస్తరణకు ఎంత స్థలం కేటాయిస్తున్నారు? కోర్టులు ఎలా ఉంటాయి? ‘పబ్లిక్‌ స్పేస్‌’ ఎంతమేర వదిలిపెడుతున్నారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రెండు దశల్లో న్యాయనగరి
‘‘రెండు దశల్లో న్యాయనగరి నిర్మిస్తున్నాం. తొలి దశలో 2×1 కిలోమీటర్లలో.. 500 ఎకరాల్లో హైకోర్టు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. రెండో దశలో అనుబంధ కార్యకలాపాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రారంభమవుతాయి. 2.66 లక్షల జనాభా నివసించడానికి యోగ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. న్యాయనగరి పూర్తిరూపు సంతరించుకున్నాక.. 1.79 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

18 అడుగుల విస్తీర్ణంతో కారిడార్లు
ఉష్ణ ప్రాంతమైన అమరావతిలో వేడిని తగ్గించి, సహజమైన వెలుతురును ఉపయోగించుకునేలా హైకోర్టు భవనం ఆకృతిని రూపొందించినట్లు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధి చెప్పారు. కక్షిదారులతో సంబంధం లేకుండా న్యాయమూర్తులు నేరుగా తమ కోర్టుహాళ్ల దగ్గరకు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ‘‘సుప్రీంకోర్టులో 12 అడుగుల కారిడార్లు ఉండగా.. అమరావతి హైకోర్టులో 18 అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకొని కోర్టు హాళ్లను విశాలంగా డిజైన్‌ చేశాం. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్‌ 4,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది’’ అని వివరించారు.

తదుపరి గమ్యం అమరావతి కావాలి: జస్టిస్‌ రవీంద్రభట్‌
అమరావతిలో న్యాయనగరి ప్రణాళిక చాలా బాగుందని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రభట్‌ అభినందించారు. ‘‘చక్కగా అన్ని కోర్టులను ఒకే ప్రాంగణంలో సమీకృతం చేశారు. న్యాయమూర్తులు, సిబ్బంది, కక్షిదారుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక రూపొందించారు. మాకు చూపిన డిజైన్లు నిజంగా అద్భుతం.  ఇప్పుడున్న కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య పెరిగినా మౌలికవసతులు పెరిగే పరిస్థితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు విస్తృతిని దృష్టిలో ఉంచుకొని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడంలో అద్భుతమైన విజయం సాధించారని భావిస్తున్నా. న్యాయమూర్తుల తరఫున న్యాయనగరికి శుభాకాంక్షలు. తదుపరి గమ్యం అమరావతి కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

జనవరికి ఏపీ హైకోర్టు అమరావతికి:  జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌
దిల్లీ హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌ మాట్లాడుతూ ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తాను గుంటూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జిగా పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. ఆగస్టు 18న సీఆర్‌డీఏ ప్రాంతానికి వెళ్లి తాత్కాలికంగా హైకోర్టు కోసం నిర్మితమవుతున్న భవన నిర్మాణ నమూనాను ఖరారు చేసినట్లు తెలిపారు. దానికి 500 మీటర్ల దూరంలో హైకోర్టు వస్తుందన్నారు. తాత్కాలిక హైకోర్టు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, డిసెంబరుకు భవన నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఏపీ హైకోర్టు డిసెంబరు చివరికిగానీ, జనవరికి గానీ అక్కడికి వెళ్లిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దిల్లీ హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభాసింగ్‌ మాట్లాడుతూ హైకోర్టు, న్యాయనగరి ఇతివృత్తం అద్భుతంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌, ఆర్థికాభివృద్ధి బోర్డు ప్రత్యేక అధికారి భావనాసక్సేనా, ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్‌ గుంటూరు ప్రభాకర్‌, పెద్దసంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.


3న అమరావతికి న్యాయమూర్తుల కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ నవంబరు 3న  అమరావతిలో పర్యటించనుంది. నేలపాడులో నిర్మాణంలో ఉన్న ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం పనులను, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న న్యాయమూర్తుల నివాస సముదాయాల్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, మరికొందరు న్యాయమూర్తులు ఈకమిటీలో సభ్యులుగా ఉన్నారు. న్యాయమూర్తుల నివాసం నిమిత్తం నాగార్జున వర్సిటీ దగ్గర్లో ఉన్న గృహ టవర్లు, ఐఏఎస్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న కోర్‌కాంపీటెంట్‌ కాంప్లెక్స్‌, ఉండవల్లిలో గుర్తించిన 14 విల్లాలను న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం చూపించనుంది.

Link to comment
Share on other sites

జస్టిస్‌ సిటీ అద్భుతం!
31-10-2018 02:39:53
 
636765503946951957.jpg
  • అలాంటి నగరం దేశంలోనే లేదు
  • అదో అమరం: న్యాయ కోవిదులు
  • ఢిల్లీలో సీఆర్‌డీఏ అవగాహన సదస్సు
  • పరిశీలనకు న్యాయమూర్తుల కమిటీ
హైదరాబాద్‌/న్యూఢిల్లీ/అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న.. జస్టిస్‌ సిటీ అద్భుతమని, ఇలాంటి నగరం దేశంలోనే ఉండదని పలువురు న్యాయమూర్తులు కొనియాడారు. జస్టిస్‌ సిటీ కలకాలం వర్ధిల్లాలని పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఆకాంక్షించారు. జస్టిస్‌ సిటీ విశేషాలను చాటిచెప్పడానికి సీఆర్‌డీఏ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా మంగళవారం ఢిల్లీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాయి. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ శాంతాన గౌడార్‌, జస్టిస్‌ వినీత్‌ సరన్‌, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ ప్రతిభా, జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌, ఇతర న్యాయకోవిదులు పాల్గొన్నారు. జస్టిస్‌ సిటీ 3డీ డిజైన్ల ద్వారా న్యాయమూర్తులకు సిటీ వివరాలను, ప్రాముఖ్యతను, నిర్మాణ శైలిని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు.
 
ఈ సందర్భంగా జస్టిస్‌ రవీంద్ర భట్‌ మాట్లాడుతూ.. జస్టిస్‌ సిటీ తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌ మాట్లాడుతూ.. తాను ఈ ఏడాది ఆగస్టు 18న జస్టిస్‌ సిటీ ప్రాంతాన్ని సందర్శించానని వివరించారు. కోర్టు హాళ్లు, ఇతర గదులను విశాలంగా నిర్మిస్తున్నారని చెప్పారు. జస్టిస్‌ ప్రతిభా మాట్లాడుతూ.. ఈ సిటీ కలకాలం నిలవాలని ఆకాంక్షించారు. అమరావతి ఎప్పుడూ అమరంగా ఉంటుందని స్పష్టం చేశారు. జస్టిస్‌ సిటీ పరిశీలనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని న్యాయమూర్తుల కమిటీ తరలి వస్తోంది. నవంబరు 3న ఈ కమిటీ అమరావతి పరిధిలోని నేలపాడులో నిర్మాణంలోని హైకోర్టు తాత్కాలిక భవనం పనులను, న్యాయమూర్తుల నివాసగృహాల సముదాయాన్ని పరిశీలించనుంది.
Link to comment
Share on other sites

పనుల ఆలస్యంపై మంత్రి ఆగ్రహం
31-10-2018 08:36:11
 
636765717724167431.jpg
  • రాజధాని రోడ్ల నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ
  • కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులు వివరణ ఇవ్వాలి..
  • అంతవరకు పనులు ఆపివేయాలని ఆదేశం
అమరావతి, తుళ్లూరు అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రాజధానిలో నిర్మిస్తున్న రహదారుల పనులను వాటిని చేపట్టిన కాంట్రాక్ట్‌ సంస్థల సీఈవోలు వివరణ ఇచ్చేంతవరకు పనులను నిలిపివేయాలంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ ఆదేశించారు. అమరావతిలో రోడ్ల నిర్మాణం నత్తనడకన జరుగుతుండడంపై ఆయా కాంట్రాక్ట్‌ కంపెనీల ప్రతినిధులపై ఆయన ఆగ్రహం ప్రకటించారు. మంగళవారం రాజధానిలోని వివిధ రహదారులను అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి తదితరులతో కలసి ఆయన పరిశీలించారు. ఆయా రోడ్లు అనుకున్న విధంగా కాకుండా మందకొడిగా నిర్మితమవుతుండడాన్ని గమనించిన ఆయన అఽధికారులు, కంపెనీలపై అసహనాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో ఇలా జరుగుతుండడం తగదన్నారు.
 
సమీక్షా సమావేశంలోనూ..
అనంతరం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో నారాయణ ఏడీసీ ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్‌ కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులోనూ ఆయన రోడ్ల పనులు సాగుతున్న విధంపై అసంతృప్తి ప్రకటించారు. ఇప్పటి వరకు చేసిన పనుల గురించి వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం ఆశించిన విధంగా పనులు జరగాలంటే అందరూ శ్రద్ధగా పని చేయాలని, లక్ష్యాలు విధించుకుని వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఆదేశించారు. అవసరమైతే మరింతమంది కార్మికులను నియమించుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికల్లా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇందులో విఫలమైతే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వచ్చే ఏడాది జనవరికల్లా నిర్మాణం చేపట్టిన రోడ్లన్నింటినీ వాహనాలు నడిచేందుకు అనువుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. అమరావతిలో మంత్రులు, శాసనసభ్యులు, అఖిల భారత సర్వీస్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాల వద్ద వారి గన్‌మెన్‌, డ్రైవర్ల కోసం డార్మిటరీ తరహాలో గదులు నిర్మించాలన్నారు. ఇకపై ప్రతి బుధవారం కాంట్రాక్టర్లు, అధికారులతో రాజధాని పనులపై సమీక్ష, క్షేత్రస్థాయి పరిశీలనలు జరపనున్నట్లు వెల్లడించారు.
Link to comment
Share on other sites

సీఆర్‌డీఏ పరిధిలో పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష
31-10-2018 13:36:28
 
636765897894289264.jpg
అమరావతి: సీఆర్‌డీఏ పరిధిలో పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా గృహ నిర్మాణాలపై సీఆర్‌డీఏ కమిషనర్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రజా గృహ నిర్మాణ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, రాజధానిలో తొలి ప్రాజెక్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. నవంబర్ 9 నుంచి వెబ్ పోర్టల్ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అమరావతి హ్యాపీనెస్ట్ పేరుతో ప్రాజెక్టు రూపొందించాలన్నారు. ప్రజల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
 
సొంత గృహాలు కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల కోసం హ్యాపినెస్ట్ తరహాలో గృహనిర్మాణ ప్రాజెక్టు చేపట్టాలన్నారు. నేలపాడు సమీపంలో 14.46 ఎకరాల విస్తీర్ణంలో గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టాలని, మొత్తం 12 టవర్లలో 1200 ఫ్లాట్లు నిర్మించాలని ప్రతిపాదన వచ్చిందన్నారు. తొలి దశలో ఆరు టవర్లలో 600 ఫ్లాట్లు, జీ+18 విధానంలో నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. పోర్టల్‌లో ఫ్లాట్‌ను నిశితంగా పరిశీలించుకునేందుకు వీలుగా త్రిడీ గ్రాఫిక్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ఉండే విధంగా దరఖాస్తుల స్వీకరించాలని అధికారులకు సూచించారు. రాజధానిలో చేపట్టే ప్రతి ప్రాజెక్టు నిర్మాణంపై కచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Link to comment
Share on other sites

మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష
31-10-2018 15:31:04
 
636765966658628476.jpg
అమరావతి: రాజధానిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. పనులను పూర్తి చేయడంలో కాలయాపన చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిర్మాణ సంస్థల దగ్గర అవసరమైన స్థాయిలో మావన వనరులు లేవన్నారు. అందుకే ఆయా ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయలేకపోతున్నామని తెలిపారు. తక్షణం మీకు అవసరమైన మానవ వనరులను నియమించుకోవాలని సూచించారు. పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయాల్సిందేనని ఆదేశించారు.
Link to comment
Share on other sites

అమరావతి హ్యాపీనెస్ట్‌పై సీఎం సమీక్ష

0429453110APCMCRDA.JPG

అమరావతి: రాజధానిలో ప్రజా గృహ నిర్మాణ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. రాజధానిలో చేపడుతున్న ఈ మొట్ట మొదటి ప్రాజెక్టును అత్యుత్తమ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టంచేశారు. సీఆర్‌డీఏ పనుల పురోగతిపై సీఎం ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రజల కోసం చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టుపై సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘అమరావతి హ్యాపీనెస్ట్’ పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై ప్రజలలో ఇప్పటికే ఆసక్తి పెరిగిందని సీఎం అన్నారు. ప్రజల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పూర్తిచేయాలని సీఎం సూచించారు. సొంత గృహాలు కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల కోసం హ్యాపినెస్ట్ తరహాలో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు ఉంటుందన్నారు.

నేలపాడు సమీపంలో 14.46 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. మొత్తం 12 టవర్లలో 1200 ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో ఆరు టవర్లలో 600 ఫ్లాట్లను జీ+18 విధానంలో నిర్మించనున్నారు. చ.అడుగు ధర సుమారు 3,500 రూపాయలుగా ఆరు కేటగిరీల్లో ప్లాట్ల పరిమాణాలు ఉండనున్నాయి. వెబ్‌పోర్టల్‌లో ఒక్కో ఫ్లాట్‌ను నిశితంగా పరిశీలించుకునేందుకు వీలుగా త్రీడీ గ్రాఫిక్స్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనికోసం నవంబర్‌ 9 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను అందుబాటులో ఉంచనున్నారు.

మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం విధానంలో దరఖాస్తులను స్వీకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును పారదర్శకంగా నిర్వహించాలన్నారు. రాజధానిలో చేపట్టే ప్రతి ప్రాజెక్టు నిర్మాణంపై కచ్చితమైన కార్య ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

Link to comment
Share on other sites

Only carpet area ni sft ga chepthunnam annaru previous articles lo. Ippudu website lo chuste 1295 sft flats ki only 886 sft carpet area ga vundhi. Oka 74 sft balcony.

Expensive ye kaani cheppina facilities as is provide cheste it will be a good deal considering this project is coming up in the prime area.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...