Jump to content

Amaravati


Recommended Posts

జస్టిస్‌ సిటీపై 30న న్యూఢిల్లీలో వర్క్‌షాప్‌
28-10-2018 08:09:44
 
636763109825723849.jpg
హాజరవనున్న న్యాయమూర్తులు, న్యాయకోవిదులు, పెట్టుబడిదారులు
 
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): అమరావతిలో నెలకొల్పదలచిన 9 థీమ్‌ సిటీస్‌లో ఒకటైన న్యాయనగరం(జస్టిస్‌ సిటీ)పై ఈ నెల 30న న్యూఢిల్లీలో ఒక వర్క్‌షా్‌పను నిర్వహించబోతున్నారు. ఇందులో సుప్రీం, రాష్ట్ర హైకోర్టులకు చెందిన కొందరు న్యాయమూర్తులతోపాటు పలువురు న్యాయవాదులు, న్యాయకోవిదులు, పెట్టుబడిదారులు పాల్గొననున్నారు. రాజధానిలోని నవ నగరాల విశిష్టతలను జాతీయస్థాయిలో ఆయా రంగాల ప్రముఖులకు సవివరంగా తెలియజేసి, భారీస్థాయిలో వాటికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఇలాంటి వర్క్‌షాపులను జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మీడియా సిటీ, స్పోర్ట్స్‌ సిటీలకు సంబంధించిన కార్యశాలలను నిర్వహించగా, మంచి స్పందన లభించింది. దీంతో జస్టిస్‌ సిటీపై 30న వర్క్‌ షాప్‌ జరిపేందుకు నిర్ణయించారు. దేశ రాజధానిలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ చొరవతో, ఇలాంటి కార్యశాలలను జరపడంలో అనుభవమున్న సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ లీడర్‌షిప్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈసదస్సులు ఏర్పాటవుతున్నాయి.
 
జస్టిస్‌ సిటీపై వర్క్‌ షాపులో సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొని, ఈ న్యాయ నగరపు ప్రత్యేకతల గురించి ఆ రంగ నిపుణులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ల ద్వారా తెలియజేస్తారు. అద్భుత ఆర్కిటెక్చర్‌తో ఐకానిక్‌ కట్టడంగా పలు విశిష్టతలతో నిర్మించనున్న హైకోర్టుకు సంబంధించి వివరిస్తారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులతోపాటు కక్షిదారులకు అవసరమైన సకల సదుపాయాలకు నెలవుగా దానిని ఏ విధంగా రూపొందించబోతున్నదీ తెలుపుతారు. న్యాయశాస్త్రానికి చెందిన సమస్త వివరాలకు కేంద్రస్థానంగా ఈ నగరం విరాజిల్లేందుకుగాను అందు లో ఏఏ విశేషాలను పొందుపరచనున్నదీ వివరిస్తారు. ఈ సందర్భంగా న్యాయ నిపుణులు, పెట్టుబడిదారులు వెలిబుచ్చే అనుమానాలు, సందేహాలను నివృత్తి చేస్తారు. కాగా.. జస్టిస్‌ సిటీపై వర్క్‌ షాప్‌ ముగిసిన అనంతరం రాజధానిలోని నవ నగరాల్లో మిగిలిన 6 సిటీలకు సంబంధించి కూడా ఇలాంటి వర్క్‌ షాపులను న్యూఢిల్లీలో ఆయా రంగాల నిపుణులతో వరుసగా జరపనున్నారు.
Link to comment
Share on other sites

మెగా నగరానికి ప్రణాళిక
217 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు
రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ
27ap-state1a.jpg

విజయవాడ, న్యూస్‌టుడే: అమరావతి ఇప్పటికే రాజధాని నగరమైనందున విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి పరిధుల్లోని 217 కిలోమీటర్లను కలిపి మెగా నగరంగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కేంద్రం ఇచ్చిన ర్యాంకుల్లో రాష్ట్రానికి మొదటి 10లో మూడు ర్యాంకులు, 300లో 31 ర్యాంకులు రావడం గర్వకారణమన్నారు. శనివారం అమరావతి పరిధిలోని గన్నవరం నుంచి విజయవాడ వరకు ఉన్న జాతీయ రహదారి విభాగినులు (సెంటర్‌ డివైడర్‌), రహదారికి ఇరువైపులా చేపట్టిన పచ్చదనం, నడక దారుల(ఫుట్‌పాత్‌లు)ను ఆయన పరిశీలించారు. విమానాశ్రయం నుంచి పవిత్ర సంగమం వరకు, విజయవాడ నుంచి గుంటూరు వరకూ రోడ్డు విభాగినులను అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. అనుకున్న సమయానికే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. బాండ్ల రూపంలో రూ.2వేల కోట్లు సేకరించామని.. కేంద్రం ఈ విధానాన్ని ప్రోత్సహిస్తూ రాయితీగా రూ.26 కోట్లు అందజేసిందన్నారు. ఆయన వెంట సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ నివాస్‌ తదితరులు ఉన్నారు.

Link to comment
Share on other sites

అమరావతిలో లంబాడా విశ్వవిద్యాలయం నెలకొల్పాలి
కేంద్రమంత్రి జుయల్‌ ఓరమ్‌కు వినతి

ఈనాడు, దిల్లీ: ప్రత్యేక సంస్కృతి, కళలు కలిగిన తమ జాతి కోసం అమరావతిలో ప్రత్యేక విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్‌ ఓరమ్‌కు నంగారాభేరీ సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు రామావత్‌ కృష్ణా నాయక్‌ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని శనివారం కలిసిన సేన రాష్ట్ర ప్రతినిధులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు శాతంగా ఉన్న లంబాడాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎటువంటి ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినా ఆ హామీ నెరవేరలేదన్నారు. తండాలను పంచాయతీలుగా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని నిలుపుకోలేదని తెలిపారు. ఇవే సమస్యలపై సేన ప్రతినిధులు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సేన ప్రధాన కార్యదర్శి డి.వీరూ నాయక్‌, నాయకులు నర్సింగ్‌ నాయక్‌, రామకోటేశ్వరరావు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

అమరావతిలో ‘హ్యాపీనెస్ట్‌’
సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో గృహ నిర్మాణం
31న వెబ్‌సైట్‌ ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆ తర్వాత రెండు వారాలకు బుకింగ్‌ ప్రారంభం
నేలపాడు సమీపంలో 14.46 ఎకరాల్లో ప్రాజెక్టు
తొలి దశలో ఆరు టవర్లలో 600 ఫ్లాట్ల నిర్మాణం
ఈనాడు - అమరావతి
27ap-main8a.jpg
రాజధాని అమరావతిలో సొంతింటి కల సాకారం కానుంది. సీఆర్‌డీఏ సొంతంగా ఫ్లాట్లు నిర్మించి ప్రజలకు విక్రయించనుంది. ఈ ప్రాజెక్టుకి ‘హ్యాపీనెస్ట్‌’ అని పేరు పెట్టారు. గృహ నిర్మాణ ప్రాజెక్టు బ్రోచర్‌, లోగో, వెబ్‌సైట్‌లను ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన రెండు వారాల్లో ఆన్‌లైన్‌లో ఫ్లాట్ల బుకింగ్‌ ప్రారంభిస్తారు. బుకింగ్‌ సమయంలో ఫ్లాట్‌ మొత్తం విలువలో ఏడు శాతం చెల్లించాల్సి ఉంటుంది. నేలపాడు సమీపంలో 14.46 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు చేపడుతున్నారు. మొత్తం 12 టవర్లలో 1200 ఫ్లాట్లు నిర్మించాలన్నది ప్రతిపాదన. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపడతారు. తొలి దశలో ఆరు టవర్లలో 600 ఫ్లాట్లు జీ+18 విధానంలో నిర్మిస్తారు. ఫ్లాట్ల పరిమాణాలు ఆరు కేటగిరీలుగా ఉంటాయి. చ.అడుగు ధర సుమారు రూ.3,500 (బేసిక్‌ సేల్‌ ప్రైస్‌) ఉంటుందని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. ప్రఖ్యాత ప్రైవేటు నిర్మాణ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టుల కంటే మెరుగైన నాణ్యతతో, అంతకంటే తక్కువ ధరకే ఫ్లాట్లు విక్రయించనున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. చ.అడుగు ధర బహిరంగ మార్కెట్‌ కంటే తమ ప్రాజెక్టులో రూ.వెయ్యి తక్కువ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రాజెక్టు చుట్టూ రిఫ్లెక్సాలజీ ట్రాక్‌
* హ్యాపీనెస్ట్‌లో నిర్మించే టవర్ల చుట్టూ 1.1 కి.మీ.ల పొడవున ‘రిఫ్లెక్సాలజీ ట్రాక్‌’ని పంచభూతాల కాన్సెప్ట్‌తో నిర్మిస్తారు.
* టవర్లలోని ప్రతి ఫ్లాట్‌ని ‘స్మార్ట్‌ హోం’గా రూపొందిస్తారు. విద్యుద్దీపాలు, లాక్‌, ఫ్యాన్‌లు సెల్‌ఫోన్‌ ద్వారా ఎక్కడి నుంచైనా పనిచేసేలా చేయవచ్చు.

* బుకింగ్‌ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ప్రాజెక్టు త్రీడీ నమూనా వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఫ్లాట్లకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని త్రీడీ నేవిగేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
* ఈ ప్రాజెక్టుకి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ ప్రాజెక్ట్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. జెనెసిస్‌ సంస్థ ఆకృతులు రూపొందించింది.

ప్రాజెక్టులో ముఖ్యాంశాలు
* ప్రాజెక్టుకి అత్యంత సమీపంలో శాకమూరు పార్కు ఉంటుంది. 4-5 కి.మీ. పరిధిలో విట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, సచివాలయం, ఐటీ సెజ్‌ వంటివి వస్తున్నాయి.

* వీటిలో 1285, 1580, 1700, 1965, 2230, 2735 చ.అడుగుల విస్తీర్ణంగల ఫ్లాట్లు ఉంటాయి.
* తొలి దశ ప్రాజెక్టులో భాగంగానే 50 వేల చ.అడుగుల క్లబ్‌ హౌస్‌ నిర్మిస్తారు.

* క్లబ్‌ హౌస్‌లో ఈత కొలను, ఏసీ జిమ్‌, యోగా-మెడిటేషన్‌ సెంటర్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ కేంద్రం, టేబుల్‌ టెన్నిస్‌, స్క్వాష్‌ కోర్టు వంటివి వస్తాయి. దీనిలోనే పార్టీ లాంజ్‌, బిజినెస్‌ సెంటర్‌, రీడింగ్‌లాంజ్‌, కెఫెటేరియా, ప్రివ్యూ థియేటర్‌, సూపర్‌ మార్కెట్‌, క్లినిక్‌, ఫార్మసీ డెస్క్‌, క్రెచ్‌ వంటివి వస్తాయి.

* ప్రాజెక్టు ప్రాంగణంలో క్రికెట్‌ ప్రాక్టీసింగ్‌ నెట్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌ కోర్టులు, స్కేటింగ్‌ రింక్‌, రాక్‌ క్లైంబింగ్‌, మెడిటేషన్‌ గార్డెన్‌, యాంఫీ థియేటర్‌ వంటివి వస్తాయి.

* మొత్తం ప్రాజెక్టు స్థలంలో భవనాల నిర్మాణానికి 20 శాతమే వినియోగిస్తారు. మిగతా 80 శాతం ఓపెన్‌ ఏరియాగా ఉంటుంది. పార్కులు, ఇతర సదుపాయాలు వస్తాయి.

 
 

 

 
Link to comment
Share on other sites

India is building a high-tech sustainable city from scratch

An aerial view of a central district of Mumbai December 22, 2006. As global firms and some of their overseas staff flock to India to tap opportunities in its burgeoning economy, premium residential rents in cities like Mumbai and the capital, New Delhi, are going through the roof. Add a rising number of high-income Indian professionals and a shift to a nuclear family from the traditional extended one, and the number of people looking for good homes is pushing rents to levels seen in the more desirable parts of London and New York. Picture taken December 22, 2006.       To match feature INDIA-PROPERTY/RENT       REUTERS/Arko Datta (INDIA) - GM1DUHLUQQAA
Andhra Pradesh has enlisted Norman Foster to help redesign its capital city, Amaravati.
Image: REUTERS/Arko Datta
26 Oct 2018
  1. Emma Charlton Writer
 
Cities and Urbanization
medium_C7yV-PVzRh0ApbOVUIeRhAo633U5mJU9qIT3sPdkt04.png

Skyscrapers, high-rise apartments, neon signs and congested roads. These are a few things that might spring to mind when you think about a modern city.

Many of the world’s major conurbations are organically grown sprawls – think of London, Tokyo, New York or Mexico City – and face challenges including air pollution, traffic jams, waste disposal and homelessness.

So what if you could start from scratch and try to create utopia? And what if one of the world’s leading architects designed the centre?

Amaravati’s proposed legislature building.
Image: Foster + Partners

That’s happening in the Indian state of Andhra Pradesh, where the local government has enlisted Norman Foster to help redesign the capital city for the province, Amaravati. Singapore-based urban consultants Surbana Jurong are also involved in the planning, which aims to create jobs and homes for all, a world-class infrastructure, a green city and efficient resource management.

Foster’s team is designing the central focus of the 217-square-km city, including the Legislature Assembly and High Court Complex, and according to the architect, the design will incorporate “decades-long research into sustainable cities” as well as the latest technologies being developed in India.

Large shaded walkways to encourage people to walk through the city, lots of green spaces, widespread use of solar energy and a transportation strategy that includes electric vehicles, water taxis, and dedicated cycle routes characterize the plans, which are set to be realized within 25 years.

Amaravati envisioned as modern and sustainable.
Image: Foster + Partners

The plans could help illustrate how to address the challenges faced by other cities around the world and those discussed by the World Economic Forum Council on Cities and Urbanization.

This will become more important as the planet becomes increasingly urban, with around 70% of the world’s population forecast to live in cities by 2050.

In its report Harnessing the Fourth Industrial Revolution for Sustainable Emerging Cities, the Forum looks at how the world’s emerging cities can harness rapid and disruptive technological change to help build a sustainable future.

“Fourth Industrial Revolution technologies such as artificial intelligence, autonomous vehicles and drones, the internet of things, advanced materials, 3D printing and biotechnology are particularly relevant,” Celine Herweijer, a partner at PwC UK wrote in the report. “Many are already showing promise at reshaping urban sectors – including transport, energy, waste, water and buildings – and change will only accelerate.”

A $5 billion annual opportunity

In a separate paper, the Forum assesses how the state of Andhra Pradesh could benefit from harnessing new technologies and concludes there could be a $5 billion annual opportunity by 2022.

Cities in other locations are also aiming to become more sustainable. Copenhagen wants to become the world's first carbon-neutral capital by 2025. Norway is building Oslo Airport City, a 4 million square metre city that will take 30 years to build and be powered entirely by renewable energy and served by electric vehicles.

In a Forum podcast on the future of cities and urbanization, Abha Joshi-Ghani, Senior Advisor on Infrastructure, Public-Private Partnerships and Guarantees at The World Bank discussed simple ways that technology can be harnessed to address waste and mobility problems, for example waste bins that send messages when they are full.

Joshi-Ghani and her co-chair of the Forum’s Council on Cities and Urbanization, Carlo Ratti, discussed how cities need strong leadership and a space for young graduates to experiment with new ideas for innovation to flourish.

“Look at technology and look at how data can change a city,” said Ratti, who is also director of the SENSEable City Laboratory at MIT. “But for the ultimate goal, never forget the three most important things: people, people and people.”

Share
Edited by sonykongara
Link to comment
Share on other sites

నవంబరు 5 నుంచి ఫ్లాట్స్‌ బుకింగ్‌
28-10-2018 03:34:55
 
  • రాజధానిలో మధ్య తరగతికి సీఆర్‌డీఏ అపార్ట్‌మెంట్లు
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): రాజధాని లోపల మధ్య తరగతి వారి కోసం సీఆర్‌డీఏ సొంతంగా నిర్మిస్తున్న ఫ్లాట్స్‌ బుకింగ్‌ నవంబరు ఐదో తేదీ నుంచి మొదలు కానుంది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను వచ్చేవారం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించే యోచనలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం రాజధాని లోపల ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎన్జీవోలు తదితరుల కోసం ప్రభుత్వ క్వార్టర్లను సీఆర్‌డీఏ నిర్మిస్తోంది. దీనితోపాటు రాజధాని లోపల నివాస వసతి పెంచే లక్ష్యంతో మధ్య తరగతి వారి కోసం విడిగా అపార్ట్‌మెంట్లను నిర్మించనుంది. వీటిని బహిరంగంగా విక్రయించాలని నిర్ణయించారు.
 
త్వరలో నిర్మాణం మొదలు పెట్టి ఒక ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో 1200 ఫ్లాట్స్‌ నిర్మిస్తారు. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి సమీపంలో ఎన్జీవోల కోసం నిర్మిస్తున్న క్వార్టర్లకు ఎదురుగా వీటిని నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి సరాసరిన చదరపు అడుగు రూ.3,500 చొప్పున వీటిని విక్రయించాలని అనుకొంటున్నారు. అన్ని ఆదాయవర్గాలకు అనుకూలంగా ఉండేలా నాలుగైదు సైజుల్లో వీటిని నిర్మిస్తారు. అతిపెద్ద ఫ్లాట్‌ విస్తీర్ణం 2500 చ.అ. వరకూ ఉంటుంది. వీటి వివరాలు తెలుసుకోవడానికి లేదా బుకింగ్‌ చేసుకోవడానికి ఎవరూ సీఆర్‌డీఏ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా మొత్తం వెబ్‌సైట్‌ ద్వారా జరిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
Link to comment
Share on other sites

ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయం
29-10-2018 02:54:03
 
636763784424777375.jpg
  • 41 ఎకరాల్లో 212 మీటర్ల నిర్మాణం.. దేశంలోనే తొలి డయాగ్రిడ్‌ భవనం
  • మొదటిసారిగా ట్విన్‌ లిఫ్ట్‌ సౌకర్యం
  • మన నిబద్ధతే పెట్టుబడుల ఆకర్షణ
  •  సీఆర్డీయే అధికారులతో చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 212 మీటర్ల ఎత్తుతో(695 అడుగులు) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయ నిర్మాణం చేపట్టి చరిత్ర సృష్టిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. 41 ఎకరాల్లో నిర్మించే ఈ సచివాలయం దేశంలోనే తొలి డయాగ్రిడ్‌ భవనం కావడం విశేషమని, అలాగే మొదటిసారిగా ట్విన్‌ లిఫ్ట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీసీఆర్డీయే, ఏడీసీ అధికారులతో ముఖ్యమంత్రి ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మౌలిక వసతుల కల్పనలోనూ అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ‘ప్రతి సవాలు మనల్ని మరింత దృఢం గా చేస్తుంది. అనేక ఇబ్బందులు, కష్టాల మధ్య మూడేళ్ల కిందట ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అతితక్కువ సమయంలోనే తాత్కాలిక పరిపాలనా భవనం, అసెంబ్లీని నిర్మించుకొని చరిత్ర సృష్టించాం’ అని చంద్రబాబు వివరించారు.
 
వచ్చే ఏడాది కల్లా అమరావతి ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణం కూడా ఒక రూపునకు వస్తుందన్నారు. ‘మన కష్టాన్ని, నిబద్ధతను, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు గుర్తించారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడులకు అమరావతిని ఎంచుకొంటున్నారు. మన సర్కార్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం. ఈ ఫలాలలను ప్రజలందరికీ అందించడమే మన కర్తవ్యం. సమీప భవిష్యత్‌లో అమరావతిలో జనాభాతోపాటు ఆర్థిక వృద్ధి గణనీయంగా ఉంటుంది’ అని సీఎం పేర్కొన్నారు. శాశ్వత సచివాలయ, శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యే గడువులను తెలియజేస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని చంద్రబాబు ఆదేశించారు. అమరావతి అభివృద్ధితో కలిగే ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ అందేలా సీఆర్డీయే చర్యలు తీసుకొన్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
 
శరవేగంగా పనులు
రూ.14,360 కోట్లతో చేపట్టిన రోడ్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, రూ.4890 కోట్లతో మొదలుపెట్టిన సచివాలయం, హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సీఆర్డీయే సీఈవో అజయ్‌జైన్‌ వివరించారు. కీలక పెట్టుబడి అవకాశాలను కూడా సీఆర్డీయే గుర్తించిందన్నారు. 2019 సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని వివరించారు.
Link to comment
Share on other sites

రపంచంలోనే ఎత్తయిన సచివాలయం
ఇది దేశంలోనే తొలి డయాగ్రిడ్‌ భవనం
  ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘‘ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సచివాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించి చరిత్ర సృష్టించనున్నామని’’ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు ఏపీ ఇంధన, మౌలిక వసతుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 41 ఎకరాల్లో 212 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న ఇది దేశంలోనే తొలి డయాగ్రిడ్‌ భవనమని, దీనిలో ట్విన్‌ లిస్ట్‌ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నట్లు వెల్లడించింది. ‘‘సామాజిక మౌలిక వసతుల కల్పనలోనూ ఇవే ప్రమాణాలను పాటించాలి. అమరావతిలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ జీవన ప్రమాణాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటి ప్రధాన భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యే గడువును తెలియజేస్తూ సమగ్ర నివేదిక అందజేయాలి. వచ్చే ఏడాదినాటికి అమరావతి ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణాలకు ఒక రూపం తేవాలి. మనం అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు గుర్తించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా అమరావతిని పెట్టుబడులు పెట్టేందుకు గమ్యస్థానంగా మార్చుకున్నారు.’’ అని సీఎం పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

Link to comment
Share on other sites

Andhra Pradesh Capital Region Development Authority bonds get Centre’s Rs 26 crore reward

By the end of the tenth year, the APCRDA will have Rs 1,573.5 crore towards interest on the Rs 2,000 crore bonds.

Published: 27th October 2018 09:24 AM  |   Last Updated: 27th October 2018 09:24 AM   |  A+A-

By Express News Service

VIJAYAWADA: Appreciating the Andhra Pradesh Capital Region Development Authority (APCRDA) for issuing Amaravati Bonds, the Union Housing and Urban Affairs Ministry announced an incentive of Rs 26 crore under Atal Mission For Rejuvenation And Urban Transformation (AMRUT) scheme.

“Congratulations to APCRDA, Amaravati, for issuing bonds worth Rs 2,000 crore. In recognition, the Union Ministry awards them Rs 26 crore as an incentive under #AMRUT (sic),” the Union Ministry tweeted on Friday. 

For the record, the Union Ministry, to encourage Urban Local Modies (ULBs) covered under AMRUT scheme in raising finances through municipal bonds, has decided to provide incentives to 10 ULBs in 2018-19. The incentive would be limited to Rs 13 crore for every Rs 100 crore worth of bonds issued with a cap of Rs 200 crore.

The announcement came as a shot in the arm for the authority, which received a backlash from various quarters, especially Opposition parties claiming the authority raised funds at a high interest rate. 

 
 

 

It may be noted that the APCRDA in August had issued bonds to institutional investors, who oversubscribed the Amaravati Bonds by 1.53 times. The coupon rate of the bonds was set at 10.32 per cent and the interest will be paid on a quarterly basis. 

As there is a moratorium of five years, the authority will have to pay Rs 52 crore per quarter for the first five years of the 10-year-tenure. From the sixth year, the authority will repay 20 per cent of the principal annually. By the end of the tenth year, the APCRDA will have Rs 1,573.5 crore towards interest on the Rs 2,000 crore bonds.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...