Jump to content

Amaravati


Recommended Posts

ఆ మూడు లక్ష్యాలు సాధిద్దాం...!
16-08-2018 10:40:33
 
636700128347385637.jpg
  • అధికారులు, సిబ్బందికి సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ ఉద్బోధ
  • సీఆర్డీయే, ఏడీసీ ప్రధాన కార్యాలయాల్లో
  • ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు
అమరావతి: ప్రజా రాజధాని అమరావతి నిర్మాణమనే మహా యజ్ఞంలో ఇప్పటి మాదిరిగానే ఇకముందూ శ్రమించి, లక్ష్యాన్ని సాధించాల్సిందిగా సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ అధికారులు, ఉద్యోగులకు ఉద్బోధించారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన వారినుద్దేశించి ప్రసంగించారు. తొలుత ఆయన జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో కలిసి సీసీడీపీ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.ఎ.క్యూ.జిలానీ కవాతు నిర్వహించి, గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మాట్లాడిన శ్రీధర్‌ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, సీఆర్డీయే ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
 
 
సీఆర్డీయే గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి మరీ అమరావతి నిర్మాణం శరవేగంగా సాగడానికి స్పెషల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావు, అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ల నేతృత్వంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది విశేషంగా శ్రమించారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో పని చేసి, వచ్చే ఏడాదిలో 3 లక్ష్యాలను సాధించేందుకు అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని కోరారు. రాజఽధానిలో నిర్మాణంలో ఉన్న గవర్నమెంట్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది మేలోగా పూర్తిచేసి, అప్పగించాలన్నది మొదటి లక్ష్యమన్నారు. ఐకానిక్‌ నిర్మాణాలైన అసెంబ్లీ, హైకోర్టులతోపాటు సచివాలయ నిర్మాణం ఒకరూపం సంతరించుకునేలా పనిచేయాలని, ప్రధాన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పనులను పూర్తిచేయడం మిగిలిన రెండూ అని పేర్కొన్నారు. వీటన్నింటినీ సాధించడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రజలు సీఆర్డీయేపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
crda.jpgరాజధాని ప్రాజెక్టుపైనా, సీఎంపై సంస్థాగత పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసం వల్లనే అమరావతి బాండ్లు ఓవర్‌ సబ్‌స్ర్కెబ్‌ అయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన స్పెషల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావును శ్రీధర్‌ సత్కరించారు. జేఎస్సార్కే శాస్త్రి (స్ట్రాటజీ), జి.నాగేశ్వరరావు (ప్లానింగ్‌), వి.శ్రీనివాసరావు (ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌)ల నేతృత్వంలో ఆయా విభాగాలు మంచి పనితీరును కనబరిచాయంటూ వారికి ప్రత్యేక పురస్కారాలను అందజేశారు. సీఈలు టి.ఆంజనేయులు, ఎం.జక్రయ్య, ఎస్‌.ఇ.సీహెచ్‌ ధనుంజయ, ఇంజినీరింగ్‌ అధికారులు పీవీకే భాస్కర్‌, గోవిందరావు, ఏడీ బి.జె.బెన్నీ, ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు, మేనేజర్‌ సపోర్ట్‌ బాలకృష్ణ, తహసీల్దార్‌ మల్లేశ్వరరావు, అసిస్టెంట్‌ ప్లానర్‌ ఎం.గౌరీశాంతి, టీ అండ్‌ టీ ఎం.మనోజ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, ఐటీ విభాగాలకు చెందిన వి.సునీత, అజయ్‌బాబు, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వి.దొరబాబు, జీఐఎస్‌ శ్రీకర్‌, సర్వేయర్‌ వి.వి.పి.రాజశేఖరరావులను కూడా కమిషనర్‌ సత్కరించారు. ఈ సందర్భంగా సీఆర్డీయే ఉద్యోగులతోపాటు ఎస్కేసీవీ అనాథ బాలల సంరక్షణ ట్రస్ట్‌, శారదా విద్యాలయం, విద్యా ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు దేశభక్తి గీతాలాపన, నృత్యరూపకాలు తదితర సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.
 
 
ఏడీసీ కార్యాలయంలో...
విజయవాడలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు ఆమె మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ రాజధాని నిర్మాణంలో ఏడీసీ ఉద్యోగులందరూ మరింత ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జి.రత్నకుమార్‌, ల్యాండ్స్‌ డైరెక్టర్‌ బి.రామయ్య, సీఈ టి.మోజె్‌సకుమార్‌, ఎస్‌.ఇ.లు ఎం.సూర్యనారాయణ, పి.అంకమ్మచౌదరి, అటవీ విభాగం ఉప సంచాలకుడు బి.శ్రీనివాసులు, వివిధ విభాగాధిపతులు పి.సురే్‌షబాబు, కె.వి.గణే్‌షబాబు, జీఎం వి.విద్యాసాగర్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
 
 
Tags : APCRDA, amaravathi
Link to comment
Share on other sites

సీఆర్‌డీఏపై చంద్రబాబు సమీక్ష
16-08-2018 14:30:02
 
636700266033187310.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సీఆర్‌డీఏపై సమీక్ష జరిపారు. ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో సుందరంగా తీర్చి దిద్దాలని అధికారులకు ఆదేశించారు. పూలవనాలు, హరిత వనంగా తీర్చిదిద్దాలని సూచించారు. మూడు కాలువలు, బ్యారేజీ సుందరీకరణకు ప్రణాళిక సిద్ధం చేశామని సీఆర్‌డీఏ అధికారులు చంద్రబాబుకు వివరించారు.
నా ఆలోచనలు చంద్రబాబు వివరించా: సురేష్‌బాబు
16-08-2018 16:48:34
 
636700349155271443.jpg
అమరావతి: అమరావతిలో తొమ్మిది సిటీల ఏర్పాటు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు సమీక్షించారు. మీడియాసిటీ ప్రతిపాదనలపై తన ఆలోచనలను చంద్రబాబుకు నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు వివరించారు. స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులను వినియోగించుకుంటే ఏడాదిన్నరలో సినీ పరిశ్రమ రూపుదిద్దుకుంటుందని సురేష్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో కేవలం స్టూడియోలు, నిర్మాణాల వరకే ఉన్నాయని, ఏపీలో సహజ సిద్ధమైన, ఆకర్షణీయమైన ప్రాంతాలున్నాయని చంద్రబాబు చెప్పారు. మీడియా సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని, అర్హత గల సంస్థలను ఆహ్వానించాలని చంద్రబాబు ఆదేశించారు.
Link to comment
Share on other sites

భవానీ ఐలాండ్ మాత్రమే కాదు, మరో రెండు దీవుల అభివృద్ధికి ముందుకొచ్చిన యూఏఈ సంస్థ.

   

uae-16082018-1.jpg
share.png

కృష్ణా నదిలో ఉన్న దీవుల అభివృద్ధికి ఆసక్తి కనబర్చిన యూఏఈ కి చెందిన బీఎల్ఎఫ్ సంస్థ రెండు దీవుల అభివృద్ధికి సీఆర్‌డీఏతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ యూఏఈ లో అక్కడి ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న బిజినెస్ లీడర్స్ ఫోరమ్ (బీఎల్ఎఫ్). కృష్ణానదిలో ఉన్న 14 దీవుల్లో ఏడు దీవులు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ రెండు ఐలాండ్ లను బీఎల్ఎఫ్ ప్రతినిధులు పరిశీలించారు.

 

uae 16082018 2

దాదాపు 500 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్, కన్వెన్షన్ సెంటర్, రిక్రియేషన్ విల్లాలు నిర్మించడానికి యూఏఈ సంస్థ ముందుకు వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తిగా ప్రారంభించే ముందు పర్యావరణ అంశాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మూడు నెలల్లో ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. చంద్రబాబు అక్టోబర్ 2017లో దుబాయ్ పర్యటన చేసిన సందర్భంలో, బిజినెస్ లీడర్స్ ఫోరమ్ తో సమావేశం అయ్యారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రాజెక్టుతో నవ్యాంధ్రకు రావాలని, పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు, వారు అధ్యయనం చేసి, వచ్చారు.

uae 16082018 3

ఇప్పటికే భవానీ ఐల్యాండ్ ను దాదాపుగా రూ. 4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. భవానీ ద్వీపాన్ని ఓ ఫిలిం సిటీ లాగ అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యూటిఫికేషన్ చేపడుతున్నారు. చూడ చక్కటి ఆర్కిటెక్ట్, అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్స్ ఆవిష్క రించే ప్రతిపాదనలు చేయనున్నారు. వీటితో పాటు భవానీ ద్వీపాన్ని సింగపూర్ లోని సెంతోసా తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సెంతోసాను మించి ఏ విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చన్న దాని పై తగిన ప్రణాలికలను నిర్దేశించనుంది. పర్యాటకం, ఆనందం, ఉత్కంఠ, వినోదం, ఆహ్లాదం, ఆటవిడుపు, ఆహారం వంటి అంశాలతో సుందరీకరించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది.

Link to comment
Share on other sites

కృష్ణా దీవుల్లో గోల్ఫ్‌ కోర్సు! 
రెండు చోట్ల 500 ఎకరాల్లో  పలు ప్రాజెక్టులు 
యూఏఈకి చెందిన బీఎల్‌ఎఫ్‌తో  సీఆర్‌డీఏ ఎంఓయూ 
రాజధాని ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష 
ఫిల్మ్‌, టీవీ ఇన్‌స్టిట్యూట్‌కి సహకరించాలన్న నిర్మాత సురేష్‌బాబు 
ఈనాడు - అమరావతి 
16ap-main12a.jpg
రాజధాని అమరావతికి పక్కనే కృష్ణా నదిలోని రెండు దీవుల్లో 18 హోల్స్‌ గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్‌ సెంటర్‌, హోటళ్లు, రిసార్టులు, విల్లాలు అభివృద్ధి చేసేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు చెందిన బిజినెస్‌ లీడర్స్‌ ఫోరం(బీఎల్‌ఎఫ్‌) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గురువారం బీఎల్‌ఎఫ్‌, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. కృష్ణానదిలో ఒక దీవిలో 399, మరో దీవిలోని 99 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు అమలు చేయాలన్నది ప్రతిపాదన. ఒప్పందంపై బీఎల్‌ఎఫ్‌ అధ్యక్షుడు రామ్‌బుక్సానీ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ సంతకాలు చేశారు. రాజధాని ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) అధికారులతో గురువారం సమీక్షించారు. కృష్ణా నదిలో మొత్తం 14 దీవుల్లోనూ ఏడింటి అభివృద్ధికి వీలుందని అధికారులు వివరించారు. ఏడు దీవుల్లో 3,800 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు దీవుల్లో చేపట్టే ప్రాజెక్టులపై స్పష్టమైన ప్రతిపాదనలు, ప్రణాళికలతో రావాలని బీఎల్‌ఎఫ్‌ సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. నాలుగు నెలల్లో ప్రణాళికలతో వస్తామని బీఎల్‌ఎఫ్‌ ప్రతినిధులు తెలిపారు. బీఎల్‌ఎఫ్‌ను యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ, అక్కడి భారత రాయబార కార్యాలయం, కాన్సుల్‌ జనరల్‌ సంయుక్తంగా నెలకొల్పాయి.

25 ఎకరాల్లో సినీ స్టూడియో! 
అమరావతిలోని మీడియా సిటీలో అత్యుత్తమ ప్రమాణాలతో 25 ఎకరాల్లో సినీ స్టూడియో నిర్మాణ ప్రతిపాదనలను అధికారులు వివరించారు. రాజధానిలో తొమ్మిది థీమ్‌సిటీలపై మెకన్సే సంస్థ సిద్ధం చేసిన ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ప్రతి సిటీకి ఒకటి చొప్పున తొమ్మిది కమిటీలు వేసి సలహాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అదేశించారు. మీడియాసిటీని కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌, గ్రామీ అవార్డ్స్‌ ఫంక్షన్‌, ఇ-స్పోర్ట్స్‌ వరల్డ్‌కప్‌ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆతిథ్యమిచ్చే స్థాయిలో తీర్చిదిద్దుతామని కమిషనర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. మీడియా సిటీ ప్రతిపాదనలపై సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు తన ఆలోచనల్ని పంచుకున్నారు. అమరావతిలో ప్రపంచస్థాయి ఫిల్మ్‌, టీవీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమకు అవసరమైన అందమైన ప్రదేశాలు, సదుపాయాలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు.

సుందరీకరణపై జాప్యమెందుకు..? 
విజయవాడలోని కాలువల సుందరీకరణ పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి అసహనం ప్రకటించారు. నిర్లిప్తతను సహించబోనన్నారు. ప్రకాశం బ్యారేజీ పరిసరాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కృష్ణా ఒడ్డున వేదిక నిర్మించి.. భారీ ఎత్తున జాతీయ జెండాను ఏర్పాటుచేయాలని సూచించారు.

కేంద్ర నిధులు రెండు రోడ్లకూ చాలవు: నారాయణ 
కృష్ణా నదిలోని దీవుల్లో గోల్ఫ్‌కోర్సు, ఇతర ప్రాజెక్టులపై బీఎల్‌ఎఫ్‌తో ప్రాథమిక చర్చలే జరిగాయని పురపాలక మంత్రి పి.నారాయణ విలేకరులకు తెలిపారు. ఆ సంస్థ నిర్దిష్ట ప్రాజెక్టు ప్రతిపాదనలతో వచ్చాక టెండరు పిలిచి మెరుగైన ఆఫర్‌తో వచ్చేవారికి ప్రాజెక్టు అప్పగిస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.48వేల కోట్లు కావాలని, వివిధ మార్గాల్లో నిధులు సమీకరిస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన రూ.1500 కోట్లు రాజధానిలో రెండు రోడ్లకూ చాలవని అన్నారు.

Link to comment
Share on other sites

ద్వీపాలు దేదీప్యం!
17-08-2018 03:06:52
 
  • 8 కృష్ణా ఐలాండ్స్‌ అభివృద్ధి
  • 8 బీఎల్‌ఎ్‌ఫతో సీఆర్డీఏ ఒప్పందం
  • 8 27న ముంబైకి సీఎం.. బాండ్స్‌ లిస్టింగ్‌ పరిశీలన
అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): కృష్ణానదిలో ఉన్న ద్వీపాలను అభివృద్ధి చేయడానికి యూఏఈకి చెందిన బిజినెస్‌ లీడర్స్‌ ఫోరమ్‌(బీఎల్‌ఎ్‌ఫ)తో సీఆర్డీఏ ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రామ్‌ బుక్షానీ ఈ ఒప్పందంలో పాల్గొన్నట్టు తెలిపారు. కృష్ణానదిలో 14 ద్వీపాలు ఉన్నాయని, వీటిలో 7 ద్వీపాలు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయన్నారు. వాటిలో గోల్ఫ్‌కోర్స్‌, విల్లాలు, రెస్టారెంట్లు, కన్వన్షన్‌ సెంటర్ల నిర్మాణానికి బీఎల్‌ఎఫ్‌ ప్రతినిధులు ముందుకొచ్చారని తెలిపారు. ఈ మేరకు సీఆర్డీఏతో బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రామ్‌ బుక్షానీ ఒప్పందం చేసుకున్నారన్నారు. ద్వీపాల అభివృద్ధికి పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. గోల్ఫ్‌కోర్సు, రెస్టారెంట్లు, విల్లాలు, కన్వన్షన్‌ సెంటర్‌ వస్తే టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఒక్కో ద్వీపాన్ని మీటరు నుంచి 2.5 మీటర్ల మెరక చేయాల్సి ఉందన్నారు. 3500 ఎకరాల్లో 18 గోల్ఫ్‌ కోర్స్‌, రిసార్ట్స్‌, కన్వెన్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. మీడియా సిటీ గురించి కూడా సీఎం వద్ద జరిగిన సమీక్షలో చర్చ జరిగిందన్నారు. మీడియా సిటీపై మెకెన్సీ కంపెనీ ప్రజెంటేషన్‌ ఇచ్చిందన్నారు. మీడియా సిటీ ఏర్పాటు వల్ల ఉద్యోగావకాశాలు విస్తారంగా లభిస్తాయన్నారు. ఇదిలావుంటే, అమరావతిలో భూములు తీసుకుని పనులు ప్రారంభించని సంస్థల యాజమాన్యాలతో వచ్చేవారం సీఎం సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. రాజధాని అభివృద్ధి కోస మే తక్కువ ధరలకు ఆయా సంస్థలకు భూములు కేటాయించామన్నారు. గురువారం అమరావతిలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి బాండ్ల విక్రయాలు విజయవంతం కావడం కొందరికి ఇష్టం లేదని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నెల 27న బాంబే స్టాక్‌ ఎక్సెంజ్‌లో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ జరగనుందని, దీనికి సీఎం చంద్రబాబు హాజరవుతారని చెప్పారు. విజయవాడలోని కాలువల సుందరీకరణ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
Link to comment
Share on other sites

Andhra CM directs CRDA officials to beautify Krishna River bunds

ANI |   Aug 17,2018 , 09:57 AM IST
   

Andhra CM directs CRDA officials to beautify Krishna River bunds
Andhra CM directs CRDA officials to beautify Krishna River bunds
 
 
Amaravati (Andhra Pradesh): Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has directed the officials of the Capital Region Development Authority (CRDA) to beautify Krishna river bunds downstream Prakasam Barrage in Vijayawada.
 
 
 
 
 
The Chief Minister suggested construction of a platform and national flag at the central point of river bed and beautification of bunds on both sides. He said that an atmosphere should be created to provide an opportunity for people to relax in the evenings.
 
While addressing review meeting of Amaravati CRDA on Thursday, the Chief Minister said, "Proposals should be prepared to beautify the bunds of Krishna River and three canals passing through the city."
 
A delegation led by business leaders' forum president Ram Buxani of UAE came forward to develop two islands of Krisha River. The forum of Ministry of Economy UAE and Indian Embassy and Consulate General in UAE offered proposals to develop PGA state Golf Court, Hotel complex, Convention centre, recreation villas and apartments in nearly 500 acres of both the islands. Later they signed a MoU with the Andhra Pradesh Government.
 
The Chief Minister asked them to come back with proposals and made it clear that the project should be completed in a time-bound manner. The officials informed Naidu that there is a chance to develop seven islands in Krishna River out of total 14 islands.
 
Later, the CRDA commission Ch Sridhar said that there was a good response to Amaravati bonds. He explained about nine cities proposed in Amaravati capital and the development of Amaravati from a media city to a world-class media hub with a long-term vision to host international events like Cannes film festival, Grammy awards, e-Sports world cup.
 
Referring to film and TV development, cine producer D Suresh Babu said cultural and emotional entity should be provided by encouraging local talent here. He said that the government should extend their support for the development of world-class film and TV training institutes in Amravati capital. Describing Amravati as the most beautiful and liveable city of future, he said once the movie-friendly atmosphere created here it would attract cine industry.
 
Stating that the role of media city has changed, Naidu said that content preparation plays a key role in all sectors at present. He said that the producers should come forward for film production in Andhra Pradesh as abundant local talent and picturesque locations are available here. The Chief Minister suggested the appointment of nine committees with experts of the respective fields for the development of nine cities of Amravati.
Link to comment
Share on other sites

2 hours ago, AnnaGaru said:

island development ki modi govt permission ivvadu......amaravati islands capacity ento delhi lo edavalaki ki baga ardam ayyindi.....get ready for hurdles

5000 acres ki ippudu 3800 unnayi  ante, 1000 acres kottukupoinattu unnayi ga

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...