Jump to content

Amaravati


Recommended Posts

బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో ట్రేడ్ అయిన అమరావతి బాండ్లు
14-08-2018 12:26:04
 
636698463649585821.jpg
అమరావతి: బాంబే స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో అమరావతి కేపిటల్‌ బాండ్లు ట్రేడ్ అయ్యాయి. లిస్ట్‌ అయిన వెంటనే 600 బాండ్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ ఫ్లాట్‌ఫాం ద్వారా బాండ్ల అమ్మకాలు జరిగాయి. దేశంలోనే మొట్టమొదటి సారిగా రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఏపీ సీఆర్‌డీఏ ద్వారా బాండ్లను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం కోసం రూ. 1300 కోట్ల విలువైన బాండ్లను బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌లో ఉంచారు.
 
ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఓ ఇన్వెస్టర్ 600 బాండ్లను కొనుగోలు చేశారు. ఒక్కో బాండ్‌ విలువ రూ.10 లక్షలుగా ఉంది. అమరావతి కేపిటల్ బాండ్లకు ఆదరణ దక్కడంతో సీఆర్డీఏ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాండ్లను కొనుగోలు చేసిన వారికి 10.38 వడ్డీ చెల్లించే విధంగా బాండ్లను అమ్మకానికి ఉంచారు. బాండ్లకు ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ గ్యారెంటీ ఇచ్చింది. బాండ్ల కొనుగోలుకు ఆదరణ పెరుగుతుండటంతో భవిష్యత్‌లో మరో రూ.700 కోట్లు విలువైన రీటైల్ బాండ్లకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

అమరావతి బాండ్లకు భారీ డిమాండ్
14-08-2018 13:31:08
 
636698502691599280.jpg
అమరావతి: బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో ఏపీ సీఆర్డీఏ బాండ్లు రికార్డు స్థాయిలో కొనుగోలు అయ్యాయి. ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రూ.1300 కోట్ల బాండ్లు విడుదల చేయగా రూ.2వేల కోట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. గంట వ్యవధిలోనే బాండ్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి. ప్రభుత్వ క్రెడిబులిటీ కారణంగానే ఇది సాధ్యమైందని సీఆర్డీఏ అధికారులు అంటున్నారు. ఓవర్ సబ్‌స్క్రైబ్ అవడం దేశంలో మొదటి సారి అని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో పురపాలక సంఘాలన్నీ కలిపి రూ.1800కోట్లకు మాత్రమే బాండ్లు కొనుగోలు అయ్యాయి.
 
అమరావతి నిర్మాణానికి నిధులు సేకరించే పనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం అమరావతి షేర్లను స్టాక్ ఎక్ఛేంజ్‌లో అమ్మకానికి పెట్టింది. ఓ రాజధాని నిర్మాణం కోసం దేశంలో మొదటి సారిగా బాండ్లు జారీ చేశారు. ఈ బాండ్లు రూ.10లక్షల ముఖవిలువతో సంస్థాగత మదుపర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తొలివిడతలో భాగంగా రూ.1300 కోట్ల నిధుల సేకరణకు అమరావతి బాండ్లను సీఆర్డీఏ విడుదల చేసింది.
Link to comment
Share on other sites

అమ్మకానికి అమరావతి బాండ్లు
బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్ఛ్సేంజీలో ప్రవేశపెట్టిన సీఆర్‌డీఏ
12205514BRK81A.JPG

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి బాండ్లు అమ్మకానికి వచ్చాయి. అమరావతి నిర్మాణానికి నిధులు సేకరించే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతి షేర్లను స్టాక్‌ ఎక్ఛ్సేంజీలో అమ్మకానికి పెట్టింది. ఓ రాజధాని నిర్మాణం కోసం దేశంలోనే తొలిసారిగా బాండ్లు జారీ చేశారు. ఈ బాండ్లు రూ.10లక్షల ముఖ విలువతో సంస్థాగత మదుపర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో భాగంగా రూ.1,300 కోట్ల నిధుల సేకరణకు అమరావతి బాండ్లను సీఆర్‌డీఏ విడుదల చేసింది.

బీఎస్‌ఈలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా తొలివిడతలో 600 బాండ్లు విక్రయానికి అందుబాటులో ఉంచారు. వీటిపై మదుపర్లు ఆసక్తి చూపడంతో త్వరగానే అమ్ముడుపోయాయి. మధ్యహ్నం 12 గంటల తర్వాత మరిన్ని బాండ్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. బాండ్ల విక్రయాలను సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ సహా ఉన్నతాధికారులు కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తున్నారు.

Link to comment
Share on other sites

అమరావతి బాండ్లకు భారీ డిమాండ్‌

 

స్టాక్‌మార్కెట్‌లో ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయిన బాండ్లు

02054814BRK90.JPG

ముంబయి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ( సీఆర్డీఏ) విడుదల చేసిన అమరావతి 2018 బాండ్లు నూతన అధ్యాయాన్ని సృష్టించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజిలో ట్రేడింగ్ అవుతూనే గంట వ్యవధిలో 2 వేల కోట్ల రూపాయలను ఆర్జించాయి. తొలివిడతగా 1300 కోట్ల రూపాయలకు సీఆర్డీఏ బాండ్లను విడుదల చేసింది. అనూహ్యంగా గంట వ్యవధిలోనే 1.5 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన అమరావతి బాండ్లు 2వేల కోట్ల రూపాయల మార్కెట్‌ను సృష్టించాయి. తొలి బిడ్‌లో 600 బాండ్లను సంస్థాగత మదుపరులు దక్కించుకున్నారు. అనంతరం గంట వ్యవధిలో అన్ని బాండ్లనూ దక్కించుకునేందుకు మదుపరులు పోటీ పడ్డారు. దీంతో బాండ్లు ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయినట్లు బోంబే స్టాక్ ఎక్చ్సేంజీలో నమోదైంది.

బీఎస్ఈలో తొలిసారి అమరావతి బాండ్లు ట్రేడింగ్ అవుతున్న వ్యవహారాన్ని సీఆర్డీఏ ఉన్నతాధికారులు చాలా ఉత్కంఠతో పరిశీలించారు. వీటికి సంస్థాగత మదుపరుల నుంచి అనూహ్య స్పందన రావడంపై అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మున్సిపల్ బాండ్లలో ఓ స్థానిక నగరాభివృద్ధి సంస్థ జారీ చేసిన బాండ్లకు ఈ స్థాయిలో ఆనూహ్య స్పందన రావటం ఇదే తొలిసారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకూ దేశంలోని మున్సిపాలిటీలు జారీ చేసిన మొత్తం బాండ్ల విలువ 1800 కోట్ల రూపాయలైతే.. ఒక్క సీఆర్డీఏ గంట వ్యవధిలోనే బాండ్ల ద్వారా 2వేల కోట్ల రూపాయల నిధుల్ని సేకరించగలిగిందని అధికారులు వెల్లడించారు.

మా లక్ష్యం రూ.10వేల కోట్లు

దీనిపై సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. అమరావతి బాండ్లకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చినట్లు తెలిపారు. రూ.1300 కోట్ల నిధుల సేకరణ అంచనా వేస్తే ఏకంగా రూ.2వేల కోట్లకు పైగా ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయినట్లు తెలిపారు. మున్సిపల్‌ బాండ్ల కేటగిరీలో ఇంత భారీ మొత్తంలో సబ్‌స్ర్కైబ్‌ కావడం దేశంలో ఇదే తొలిసారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన సలహాతోనే అమరావతి బాండ్లను స్టాక్‌మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రిటైల్‌ బాండ్లను కూడా ప్రవేశపెడతామని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి బాండ్ల ద్వారా రూ.10వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. అందులో భాగంగా తొలి విడతగా రూ.1300 కోట్ల విలువైన బాండ్లను విక్రయించినట్లు చెప్పారు. దశలవారీగా మిగిలిన బాండ్లను కూడా స్టాక్‌మార్కెట్‌లో ప్రవేశపెడతామని శ్రీధర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

భరోసా తెచ్చిన బాండ్‌!
15-08-2018 02:53:44
 
636698984256800330.jpg
  • రుజువైన అమరావతి బ్రాండ్‌
  • క్షేత్రస్థాయిలో ఇన్వెస్టర్ల పరిశీలన
  • సీఎం వద్ద సందేహాల నివృత్తి
  • ఆ తర్వాత బాండ్ల కొనుగోలు
  • రిటైల్‌, మసాలా బాండ్లతో
  • 8000 కోట్ల సేకరణ లక్ష్యం
  • రుజువైన అమరావతి బ్రాండ్‌
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘మీరు కేంద్రంలోని అధికార కూటమితో విభేదించి విడిపోయారు. విడిపోయి మనగలరా? మీకు నిధులెలా వస్తాయి? ప్రాజెక్టులు ఎలా వస్తాయి?’ ...కొన్నాళ్లక్రితం రాష్ట్రానికి వచ్చిన జపాన్‌ రాయబారి కెంజీ హిరమత్సు సీఎం చంద్రబాబును అడిగిన ప్రశ్న ఇది!
‘‘నవ్యాంధ్రప్రదేశ్‌ తనకు తాను బ్రాండ్‌ ఇమేజి సృష్టించుకుంది. కేంద్ర సహాయం లేకపోయినా నిలదొక్కుకోగల స్థితికి వచ్చింది’’... ఇది చంద్రబాబు ఇచ్చిన సమాధానం!
 
అమరావతి బాండ్లకు పెట్టుబడి సంస్థల నుంచి లభించిన స్పందన ఈ ధీమాకు అద్దం పట్టింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మునిసిపాలిటీల అవసరాల కోసం రూ.150 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేసింది. నామమాత్ర స్పందనే లభించింది. చివరికి ఆ ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కొనిపించి ‘మమ’ అనిపించింది. కానీ... అమరావతి నిర్మాణానికి సీఆర్డీయే రూ.1300 కోట్ల విలువైన బాండ్లను జారీ చేయగా, గంటలోనే రూ.2వేల కోట్లు వచ్చాయి. ఇది అమరావతి నిర్మాణంపై ఉన్న విజన్‌, చంద్రబాబుపై నమ్మకమే కారణమని ఓ అధికారి తెలిపారు.
 
అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టదల్చుకొన్న సంస్థలు ముందుగానే ఇక్కడకు వచ్చి.. సీఆర్డీయే చెబుతున్నట్లుగా పనులు జరుగుతున్నాయా... అభివృద్ధి జరిగే అవకాశం ఉందా అనే విషయాన్ని నిర్ధారించుకున్నాయి. కొన్ని సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కూడా కలిసి.. ‘‘సార్‌... మీ ఆలోచనలు, ప్రణాళికలు చాలా బాగున్నాయి. కానీ, రేపు ఎన్నికల్లో మీరు గెలవకపోతే మా పెట్టుబడులు ఏమవుతాయి? మాకు గ్యారంటీ ఏమిటి’’ అని ప్రశ్నించారు. సీఎం అంతే సూటిగా జవాబిచ్చారు. ‘‘మా గెలుపుపై ఒక్క శాతం కూడా అనుమానం లేదు. ఎవరు వచ్చినప్పటికీ అమరావతి అభివృద్ధిని ఆపలేని స్ధాయిలో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఆయన్ను కలిసి వెళ్లాక ఒక సంస్థ తాము ముందుగా అనుకున్నదానికంటే రెట్టింపు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.
 
 
మూడు రూపాల్లో...
మొత్తం మూడు రకాల బాండ్ల ద్వారా సుమారుగా రూ.8 వేల కోట్ల వరకూ సమీకరించాలని సీఆర్డీయే వర్గాలు భావిస్తున్నాయి. ఈ బాండ్ల ద్వారా నిధుల సమీకరణకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు అడ్డురావు. ఇదే దారిలో తర్వాత విశాఖ, విజయవాడ వంటి నగర పాలక సంస్థలు కూడా విడిగా బాండ్లు జారీ చేసి నిధులు సేకరించుకొనే మార్గం ఏర్పడింది. ప్రస్తుతం జారీ అయిన అమరావతి బాండ్లు ఈ నెల 27వ తేదీ నుంచి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్‌ కానున్నాయి. ఆ రోజు ముంబై స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ముఖ్యమంత్రి లాంఛనంగా గంట మోగించి ఈ ట్రేడింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పుడు బాండ్లు కొన్న కంపెనీలు వాటిని తిరిగి అమ్ముకొనే అవకాశం దీని వల్ల కలుగుతుంది. తర్వాత చిన్న మదుపర్ల కోసం రిటైల్‌ బాండ్లను సీఆర్డీయే తీసుకొస్తోంది. మూడో దశలో విదేశీ ఇన్వెస్టర్ల కోసం మసాలా బాండ్లు (విదేశాల్లో భారతీయ సంస్థలు జారీ చేసే బాండ్లు) విడుదల చేయబోతున్నారు.
 

Advertisement

Link to comment
Share on other sites

భరోసా తెచ్చిన బాండ్‌!
15-08-2018 02:53:44
 
636698984256800330.jpg
  • రుజువైన అమరావతి బ్రాండ్‌
  • క్షేత్రస్థాయిలో ఇన్వెస్టర్ల పరిశీలన
  • సీఎం వద్ద సందేహాల నివృత్తి
  • ఆ తర్వాత బాండ్ల కొనుగోలు
  • రిటైల్‌, మసాలా బాండ్లతో
  • 8000 కోట్ల సేకరణ లక్ష్యం
  • రుజువైన అమరావతి బ్రాండ్‌
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘మీరు కేంద్రంలోని అధికార కూటమితో విభేదించి విడిపోయారు. విడిపోయి మనగలరా? మీకు నిధులెలా వస్తాయి? ప్రాజెక్టులు ఎలా వస్తాయి?’ ...కొన్నాళ్లక్రితం రాష్ట్రానికి వచ్చిన జపాన్‌ రాయబారి కెంజీ హిరమత్సు సీఎం చంద్రబాబును అడిగిన ప్రశ్న ఇది!
‘‘నవ్యాంధ్రప్రదేశ్‌ తనకు తాను బ్రాండ్‌ ఇమేజి సృష్టించుకుంది. కేంద్ర సహాయం లేకపోయినా నిలదొక్కుకోగల స్థితికి వచ్చింది’’... ఇది చంద్రబాబు ఇచ్చిన సమాధానం!
 
అమరావతి బాండ్లకు పెట్టుబడి సంస్థల నుంచి లభించిన స్పందన ఈ ధీమాకు అద్దం పట్టింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మునిసిపాలిటీల అవసరాల కోసం రూ.150 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేసింది. నామమాత్ర స్పందనే లభించింది. చివరికి ఆ ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కొనిపించి ‘మమ’ అనిపించింది. కానీ... అమరావతి నిర్మాణానికి సీఆర్డీయే రూ.1300 కోట్ల విలువైన బాండ్లను జారీ చేయగా, గంటలోనే రూ.2వేల కోట్లు వచ్చాయి. ఇది అమరావతి నిర్మాణంపై ఉన్న విజన్‌, చంద్రబాబుపై నమ్మకమే కారణమని ఓ అధికారి తెలిపారు.
 
అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టదల్చుకొన్న సంస్థలు ముందుగానే ఇక్కడకు వచ్చి.. సీఆర్డీయే చెబుతున్నట్లుగా పనులు జరుగుతున్నాయా... అభివృద్ధి జరిగే అవకాశం ఉందా అనే విషయాన్ని నిర్ధారించుకున్నాయి. కొన్ని సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కూడా కలిసి.. ‘‘సార్‌... మీ ఆలోచనలు, ప్రణాళికలు చాలా బాగున్నాయి. కానీ, రేపు ఎన్నికల్లో మీరు గెలవకపోతే మా పెట్టుబడులు ఏమవుతాయి? మాకు గ్యారంటీ ఏమిటి’’ అని ప్రశ్నించారు. సీఎం అంతే సూటిగా జవాబిచ్చారు. ‘‘మా గెలుపుపై ఒక్క శాతం కూడా అనుమానం లేదు. ఎవరు వచ్చినప్పటికీ అమరావతి అభివృద్ధిని ఆపలేని స్ధాయిలో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఆయన్ను కలిసి వెళ్లాక ఒక సంస్థ తాము ముందుగా అనుకున్నదానికంటే రెట్టింపు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.
 
 
మూడు రూపాల్లో...
మొత్తం మూడు రకాల బాండ్ల ద్వారా సుమారుగా రూ.8 వేల కోట్ల వరకూ సమీకరించాలని సీఆర్డీయే వర్గాలు భావిస్తున్నాయి. ఈ బాండ్ల ద్వారా నిధుల సమీకరణకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు అడ్డురావు. ఇదే దారిలో తర్వాత విశాఖ, విజయవాడ వంటి నగర పాలక సంస్థలు కూడా విడిగా బాండ్లు జారీ చేసి నిధులు సేకరించుకొనే మార్గం ఏర్పడింది. ప్రస్తుతం జారీ అయిన అమరావతి బాండ్లు ఈ నెల 27వ తేదీ నుంచి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్‌ కానున్నాయి. ఆ రోజు ముంబై స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ముఖ్యమంత్రి లాంఛనంగా గంట మోగించి ఈ ట్రేడింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పుడు బాండ్లు కొన్న కంపెనీలు వాటిని తిరిగి అమ్ముకొనే అవకాశం దీని వల్ల కలుగుతుంది. తర్వాత చిన్న మదుపర్ల కోసం రిటైల్‌ బాండ్లను సీఆర్డీయే తీసుకొస్తోంది. మూడో దశలో విదేశీ ఇన్వెస్టర్ల కోసం మసాలా బాండ్లు (విదేశాల్లో భారతీయ సంస్థలు జారీ చేసే బాండ్లు) విడుదల చేయబోతున్నారు.
Link to comment
Share on other sites

బాండ్‌’ బాజా.. అదరగొట్టిన అమరావతి బాండ్లు
15-08-2018 02:52:52
 
636698983736758942.jpg
  • గంటలోనే 1.5 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌
  • రూ.1300 కోట్లు కోరితే 2 వేల కోట్లు రాక
  • సంస్థాగత మదుపుదారుల్లో పక్కా నమ్మకం
  • స్థానిక సంస్థ జారీ చేసిన బాండ్లకు
  • ఇంత ఆదరణ దేశంలో ఇదే తొలిసారి
  • ఇంట గెలిచిన ఉత్సాహంలో సీఆర్డీయే
  • త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లో బాండ్లు
  • రెండు నెలల్లో పబ్లిక్‌ ఇష్యూకు కూడా
  • రాజధాని నిర్మాణానికి నిధుల మార్గం
అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’పై జాతీయ స్థాయిలో ఉన్న ఆసక్తి, ఆదరణ ఏమిటో స్పష్టంగా రుజువైంది. రూ.1300 కోట్లు సేకరించేందుకు బాండ్లను విడుదల చేయగా... గంట వ్యవధిలోనే ఒకటిన్నర రెట్లు అదనంగా సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి. అంటే రూ.2వేల కోట్ల విలువైన బాండ్లు అమ్ముడయ్యాయి. మంగళవారం బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి (బీఎ్‌సఈ)లో అమరావతి బాండ్‌ హల్‌చల్‌ సృష్టించింది. ఇదే ఉత్సాహంతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బాండ్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజిలో అమరావతి బాండ్లను లిస్ట్‌ చేయాలని భావిస్తోంది.
 
 
బీఎస్‌ఈలో సంస్థాగత మదుపుదారులకోసం మాత్రమే అమరావతి బాండ్లను అందుబాటులో ఉంచారు. పూర్తిస్థాయిలో పరిశోధన, లాభాలు, నమ్మకం... ఇలా అన్ని కోణాల్లో పరిశోధించిన తర్వాత ఆయా సంస్థలు బాండ్లను కొనుగోలు చేస్తాయి. అంతా బాగుందని సంతృప్తి చెందితేనే అడుగు ముందుకు వేస్తాయి. బీఎ్‌సఈలో ‘సూపర్‌ సక్సెస్‌’ అయిన నేపథ్యంలో... అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే ఫలితాలు సాధిస్తామని, అమరావతికి అవసరమై నిధులు సేకరిస్తామని సీఆర్డీయే చెబుతోంది. ఒక్కొక్క యూనిట్‌ ధర రూ.10 లక్షల చొప్పున... రూ.1300 కోట్లు సేకరించాలనే లక్ష్యంతో ‘అమరావతి బాండ్ల’ను మార్కెట్‌లో పెట్టారు. బాండ్ల కాలవ్యవధి పదేళ్లు. వీటిపై 10.32 శాతం స్థిర వడ్డీని నిర్ణయించారు. మదుపుదారులను ఇదే అంశం ఆకర్షించింది. తొలి ఐదేళ్లపాటు ఈ బాండ్లపై మారటోరియం ఉంటుంది. ఆ వ్యవధిలో మూడునెలలకోసారి వడ్డీ మాత్రం చెల్లిస్తారు. తర్వాత ఐదేళ్లలో అసలును వడ్డీతో కలిపి 3 మాసాలకోసారి మదుపుదారులకు చెల్లిస్తారు. సీఆర్డీయే జారీ చేసిన ఈ బాండ్లకు రాష్ట్రప్రభుత్వం కౌంటర్‌ గ్యారెంటీగా ఉంటుంది. సుప్రసిద్ధ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలైన క్రిసిల్‌, బ్రిక్‌వర్క్‌, ఆయుక్ట్‌ ఈ బాండ్లకు మంచి రేటింగ్‌లు ఇచ్చాయి.
 
 
దీంతో... అమరావతి బాండ్లపై తొలి నుంచీ మదుపుదారుల్లో ఆసక్తి ఏర్పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఎలకా్ట్రనిక్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫాం (ఈబీపీ)పై లిస్టింగ్‌ మొదలైన తొలి నిమిషాల్లోనే 600 బాండ్లు అమ్ముడయ్యాయి. అలా చూస్తుండగానే... తొలి గంటలోనే వందశాతం దాటి, మరో 50 శాతం బాండ్లు అదనంగా సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి. దేశంలోని అన్ని మునిసిపాలిటీలు కలిపి ఇప్పటిదాకా జారీ చేసిన బాండ్ల మొత్తం విలువైన రూ.1800 కోట్లు! ఇప్పుడు ఒక్క అమరావతి బాండ్లే ఈ మొత్తాన్ని అధిగమించడం విశేషం. దీనిపై సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, స్పెషల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావు మీడియాతో మాట్లాడారు. ‘‘అమరావతి బాండ్ల ఇష్యూ 1.53 రెట్ల ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయింది. దేశంలో ఒక రాజధాని నిర్మాణానికి నిధుల కోసం విడుదల చేసిన బాండ్లకు ఇంతటి స్పందన లభించడం ఇదే మొదటిసారి’’ అని తెలిపారు. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ గ్యారెంటీ ఇవ్వడం, సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌స)లో రాష్ట్రానికి ప్రథమ స్థానం రావడంతోపాటు అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన సీఎం పై, రాజధాని నగరాభివృద్ధిపై నెలకొన్న నమ్మ కం వల్లనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ ప్రక్రియకు సీఆర్డీయే ఆమోదం తెలిపిన మరునాడే ఈ నిధులు అందుతాయని తెలిపారు.
 
 
అవసరానికి ఆసరా...
అమరావతిలో తొలి దశ నిర్మాణాలకు రూ.48,000 కోట్లు అవసరమని, వీటిని సమకూర్చుకునేందుకు ప్రభుత్వ సహాయంతోపాటు ప్రపంచ బ్యాంక్‌, హడ్కో, వాణిజ్య బ్యాంకులు, బాండ్ల జారీ తదితర మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నామని శ్రీధర్‌ తెలిపారు. బాండ్ల ద్వారా జమ కాబోయే రూ.2,000 కోట్లను వివిధ పనులకు వినియోగించుకోవడంపై ఆంక్షలు ఉండవని... ప్రాధాన్యక్రమంలో వాడుకునే సౌలభ్యం ఉంటుందని చెప్పారు.
 
 
అందరిదీ అమరావతి!
‘‘ప్రజా రాజధానిగా నిర్మితమవుతున్న అమరావతి కోసం రైతులు భూములు ఇచ్చారు. నా ఇటుక- నా అమరావతి పిలుపునకు స్పందించి ఇప్పటికి 50,000వేలకుపైగా ఇటుకలను కొనుగోలు చేశారు. త్వరలో సాధారణ ప్రజలు కూడా అమరావతిలో భాగస్వాములయ్యేలా పబ్లిక్‌ ఇష్యూకు వెళతాం. ఒక్కొక్కటి రూ. 100 ముఖ విలువతో ఈ ఏడాది అక్టోబరులోగా బాండ్లను జారీ చేస్తాం’’
- చెరుకూరి శ్రీధర్‌, సీఆర్డీయే కమిషనర్‌
Link to comment
Share on other sites

రూ.1300 కోట్లు సేకరించేందుకు అమరావతి బాండ్లను విడుదల చేయగా... గంట వ్యవధిలోనే ఒకటిన్నర రెట్లు అదనంగా సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి. అంటే రూ.2వేల కోట్ల విలువైన బాండ్లు అమ్ముడయ్యాయి. మంగళవారం బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి (బీఎ్‌సఈ)లో అమరావతి బాండ్‌ హల్‌చల్‌ సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే ఉత్సాహంతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బాండ్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజిలో అమరావతి బాండ్లను లిస్ట్‌ చేయాలని భావిస్తోంది.

Link to comment
Share on other sites

అమరావతి బాండ్లతో చరిత్ర సృష్టించాం
16-08-2018 03:14:17
 
636700133764379256.jpg
  • గంట వ్యవధిలో 2 వేల కోట్ల బాండ్లు
  • మా విశ్వసనీయతకు ఇదే నిదర్శనం
  • లిస్టింగ్‌కు పారిశ్రామికవేత్తలనూ పిలవండి
  • అధికారులకు ముఖ్యమంత్రి సూచన
అమరావతి/శ్రీకాకుళం/విజయవాడ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయి ప్రజా రాజధానిగా అమరావతి రూపొందడం తథ్యమన్న తన నమ్మకాన్ని అమరావతి బాండ్లకు లభించిన భారీ ప్రతిస్పందన నిలబెట్టిందని సీఎం చంద్రబాబు అన్నారు. తద్వారా చరిత్ర సృష్టించామని తెలిపా రు. బుధవారమిక్కడ సీఆర్‌డీఏ, ఏడీసీ ఉన్నతాఽధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘రూ.1300 కోట్ల సేకరణ కోసం ఈ బాండ్లకు బిడ్డిం గ్‌ నిర్వహిస్తే కేవలం గంట వ్యవధిలో రూ.2,000 కోట్ల బాండ్లు అమ్ముడుపోవడం చరిత్రాత్మకం. దేశీయ ఇన్వెస్టర్లు మన రాష్ట్రంపై ఉంచిన విశ్వాసానికి ఈ బాండ్లు ప్రబల నిదర్శనం. దీనిని నిలుపుకోవడమే కాకుండా మరింత పెంచుకునేందుకు కృ షి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ పరిణామంతో అంతర్జాతీయ మదుపుదారులు సైతం అమరావతితోపాటు వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారన్న ఆశిస్తున్నాం.
 
 
అయితే పెట్టుబడిదారులను ఆహ్వానించేటప్పుడు తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్‌ చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకే ప్రాధాన్యమివ్వాలి. అమరావతి వేగంగా కార్యరూ పం దాల్చేలా చూడాలి. అప్పుడే 5 కోట్ల మంది ఆంధ్రుల కల నెరవేరుతుంది’ అని చెప్పారు. అమరావతి బాండ్లను కొన్న మదుపుదారులు వాటిని అమ్ముకునేందుకు బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఈ నె ల లిస్టింగ్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వానించాలని సీఎం సూచించారు.
 
 
సాధారణ మదుపుదారులు కూడా రాజధాని బాండ్లను కొనుగోలు చేసేందుకు అక్టోబరులో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్తున్నామని అధికారులు చెప్పగా.. రాజధానికి నిధుల సేకరణ ప్రక్రియ మరింత ముమ్మరంగా సాగేందుకు అమరావతి పురోగతి గురించి పెట్టుబడిదారులకు తెలియజేయాలన్నారు. ఇలా చేస్తే.. భాగస్వామ్య సదస్సుల్లో పలు సంస్థలు రాజధాని ప్రాంతంలో పెట్టుబడుల కు సంబంధించి చేసిన ప్రకటనలన్నీ కార్యరూపం దాల్చుతాయన్నారు. అమరావతిలో పెట్టుబడులకు ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపిచ్చారు. విజయవాడ, గుంటూరు, తెనాలి కలిసిపోయి అమరావతి నగరం మెగాసిటీగా రూపాంతరం చెందుతుందని, అది ప్రపంచంలోనే ఐదో అత్యుత్తమ నగరంగా ఉంటుందని తెలిపారు.
 
 
కేంద్రానికే భారీ ఆదాయం
అమరావతి నిర్మాణం పూర్తయితే కేంద్రానికే ఎక్కువ లాభమని, భారీగా ఆదాయం సమకూరుతుందని సీఎం తెలిపారు. కానీ నిర్మాణానికి సహకరిస్తానని చెప్పి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందని ఆక్షేపించారు. కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుందని, అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పురపాలక మంత్రి పి.నారాయణ, సీఎస్‌ దినేశ్‌కుమార్‌, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ప్రత్యేక కమిషనర్‌ వి.రామమనోహరరావు, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అటవీ భూముల మళ్లింపుపై కేంద్రం తాత్సారం 
నవంబరులోనే ప్రతిపాదన అందజేసినా స్పందన కరవు 
  కొండపల్లి భూములు ఇచ్చేది లేదని స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని అటవీ భూముల మళ్లింపుపై కేంద్రం ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలో వివిధ ప్రాజెక్టుల కోసం అటవీ భూముల మళ్లింపునకు (ఇతర అవసరాలు, ప్రాజెక్టులకు వినియోగించుకునేందుకు మళ్లింపు) రాష్ట్ర ప్రభుత్వం గత నవంబరులోనే ప్రతిపాదన అందజేసింది. మొత్తం 24 బ్లాకుల్లోని 13,267 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపు కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు అందజేయగా... 2,089 హెక్టార్లకే అనుమతి ఇచ్చింది. మిగతా 22 బ్లాకులకు సంబంధించి 3 విడతల్లో ప్రతిపాదనలు అందజేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... తొలి విడతలో 10 బ్లాకుల్లో 4,235 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపునకు అనుమతి కోరింది. వాటిలో కొండపల్లి బ్లాక్‌ పరిధిలో 890 హెక్టార్ల మళ్లింపు ప్రతిపాదనను కేంద్ర అటవీశాఖ ఇటీవలే తోసిపుచ్చింది. వెంకటాయపాలెంలో రక్షణ పరిశోధన సంస్థలు, కొండవీడులో ఎకో టూరిజం ప్రాజెక్టులు, అటవీ అకాడమీ వంటివి ఏర్పాటు చేస్తామని కర్లపూడి, నిడుముక్కల్లో సైన్స్‌ సిటీ, పంచభూతాల కాన్సెప్ట్‌తో పార్కు, జీవ వైవిధ్య పార్కు వంటివి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మోతడక, పెదమద్దూరుల్లోనూ కొన్ని ప్రాజెక్టులను ప్రతిపాదించింది. కొండపల్లిలో వ్యవసాయ పర్యాటకం, క్రీడలకు సంబంధించి ప్రాజెక్టులు చేపడతామని తెలిపింది. అయితే కొండపల్లి ప్రతిపాదనపై కేంద్ర అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టుల కోసం అటవీ భూముల్నే కేటాయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మిగతా 9 అటవీ బ్లాకులకు సంబంధించిన ప్రాజెక 
 ప్రతిపాదనలపై ఇంత వరకూ ఎలాంటి కదలికా లేదు. తాడేపల్లి, వెంకటాయపాలెంలలో మళ్లింపునకు అనుమతిచ్చిన 2,089 హెకార్లకుగానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.220 కోట్లు చెల్లించాలి. ఇందులో రూ.200 కోట్లను ఇప్పటికే చెల్లించగా ఇంకా రూ.20 కోట్ల బకాయి ఉంది. అదీ చెల్లించాకే ఆ భూమిలో ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలవుతుంది.

Link to comment
Share on other sites

ఒక్క ఏడాదిలోనే రూ.18వేల కోట్లు! 
రాజధాని ప్రాజెక్టులకు అవసరమైన నిధులు 
వివిధ మార్గాల్లో సేకరణకు సీఆర్‌డీఏ ప్రణాళిక 
15ap-story8b.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులకు 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.15,000 కోట్ల నుంచి నుంచి రూ.18,000 కోట్లు అవసరమవుతాయని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అంచనా వేసింది. రాజధానిలో చేపట్టిన రహదారుల నిర్మాణం వంటి ప్రాజెక్టుల గడువు ఏడాదే కావడంతో ఈ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ వివిధ మార్గాలను అనుసరిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఒక్క రోజే అమరావతి బాండ్ల ద్వారా సంస్థాగత మదుపరుల నుంచి రూ.2వేల కోట్లు రావడం సీఆర్‌డీఏకి కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మిగతా నిధుల్ని వివిధ బ్యాంకుల కన్సార్షియం, హడ్కో, ప్రపంచ బ్యాంకుల నుంచి, ఇతర మార్గాల్లోనూ సమీకరించుకోవాలన్నది ఆలోచన. రీటెయిల్‌, మసాలా బాండ్ల ద్వారా మరో 6వేల కోట్లను సీఆర్‌డీఏ సేకరించనుంది.

అమరావతి నిర్మాణంలో పాలు పంచుకునేందుకు చాలామంది ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రజల నుంచీ నిధులను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రీటెయిల్‌ బాండ్లు విడుదల చేయనుంది. విధి విధానాలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రీటెయిల్‌ బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్ల వరకూ సమీకరించే అవకాశముంది. రాజధాని ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ప్రవాసాంధ్రులు ఆసక్తిగా ఉన్నారు. ప్రభుత్వం ‘నా అమరావతి -నా ఇటుక’ పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ ప్రక్రియలో... ఆర్‌బీఐ నిబంధనలు అనుమతించనందున ఎన్‌ఆర్‌ఐలు పాలుపంచుకోలేక పోతున్నారు. రీటెయిల్‌ బాండ్లలో పెట్టుబడులకు చాలామంది ఎన్‌ఆర్‌ఐలు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. వారూ పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఈ బాండ్లు రూపొందించనున్నారు. మరోపక్క విదేశీ స్టాక్‌ మార్కెట్లలో మసాలా బాండ్ల విడుదలకు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది.

15ap-story8a.jpg

3 బ్యాంకుల నుంచి రూ.2060 కోట్లు.. 
రాజధాని ప్రాజెక్టులకు 3 బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి రూ.2,060 కోట్లు రుణం ఇవ్వనున్నాయి. ఆంధ్రా, ఇండియన్‌, విజయా బ్యాంకుల కన్సార్షియం నుంచి ఈ రుణం ఖరారైంది. త్వరలోనే ఈ నిధులు వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య బ్యాంకుల నంచి మరో రూ.10వేల కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందించింది.

హడ్కో నుంచి రూ.7500 కోట్లు.. 
రాజధానికి రూ.7500 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ఇదివరకే అంగీకరించింది. ఈ మేరకు హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒక ఎంవోయూ కుదిరింది. హడ్కో తొలి విడతలో రూ.1275 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.900 కోట్లను సీఆర్‌డీఏ ఇప్పటికే ఖర్చు చేసింది.

జనవరి నాటికి ప్రపంచ బ్యాంకు నిధులు.. 
ప్రపంచ బ్యాంకు నుంచి రూ.3500 కోట్ల రుణం వచ్చే జనవరి నాటికి వస్తుందని సీఆర్‌డీఏ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నిధులు ఇప్పటికే రావాల్సి ఉన్నా ప్రపంచ బ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌కు కొందరు ఫిర్యాదులు చేయడం వంటి కారణాలవల్ల జాప్యం జరిగింది.

15ap-story8c.jpgబీఎస్‌ఈలో బాండ్ల లిస్టింగ్‌కు ప్రముఖులకు ఆహ్వానం 
అమరావతి బాండ్లకు విశేష స్పందన లభించడంపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి బాండ్లను ఈ నెల 27న బీఎస్‌ఈలో నమోదు (లిస్టింగ్‌) చేస్తున్న సందర్భంగా ముంబయిలో నిర్వహించే కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించాలని ఆయన సీఆర్‌డీఏ అధికారులకు సూచించారు.

‘బాండ్ల విజయంతో అమరావతిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయత రెట్టింపైంది. ఈ విజయం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు దక్కుతుంది. రాబోయే రోజుల్లో అమరావతిలో పెట్టుబడులు రెట్టింపవుతాయి. ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుని రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలి’ అని అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నట్లు సీఆర్‌డీఏ మీడియా అడ్వైజర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Link to comment
Share on other sites

గ్యాలరీ.. చకచకా 
పోలవరంలో స్పిల్‌వే పునాది పూర్తయిందని చాటిచెప్పే ఘట్టం 
సెప్టెంబరు 3న ఆవిష్కరించేందుకు నిర్ణయం 
15ap-story3a.jpg

పోలవరంలో కీలకమైన స్పిల్‌వేలో... పునాది నిర్మాణం పూర్తయిన ఘట్టాన్ని ‘గ్యాలరీ నడక’ రూపంలో ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది.  సెప్టెంబరు 3న ముహూర్తంగా నిర్ణయించింది. పోలవరం నిర్మాణంలో ఒక మైలురాయిని చేరుకున్నామని చాటిచెప్పడానికి ప్రభుత్వం ఈ సందర్భాన్ని ‘గ్యాలరీ వాక్‌’గా చేపడుతోంది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలతో పాటు ఇతర నాయకులు, అధికారులు భాగస్వాములు కానున్నారు. పెద్ద ఎత్తున రైతులను తీసుకురావాలని కూడా ప్రణాళిక రూపొందించారు. రైతులు కూడా ఈ గ్యాలరీలో నడవనున్నారు. అక్కడే బహిరంగ సభ కూడా ఉంటుంది.

గ్యాలరీ అంటే ఏమిటి... ఎందుకు? 
ఏ ప్రాజెక్టులో జలాశయం నిండిన తర్వాత అదనంగా వచ్చే నీటిని తలుపులు తెరిచి జలాశయం దిగువకు వదిలేసే కట్టడం స్పిల్‌వే కాగా ఇందులో గ్యాలరీ ఓ భాగం. స్పిల్‌వే కాంక్రీటు పునాది తర్వాత ఆపైన దాదాపు మూడు మీటర్ల ఎత్తులో నిర్మాణం పూర్తయితే ఈ గ్యాలరీ సిద్ధమవుతుంది. 2 మీటర్ల వెడల్పున 2.5 మీటర్ల ఎత్తులో స్పిల్‌ వేలో ఇది ఒక సొరంగంలా ఉంటుంది. కాంక్రీటు డ్యాం కట్టిన తర్వాత ఏమైనా లీకేజీలు ఉన్నాయా? ఆ నీటిని ఎలా మళ్లించాలి? తదితర అంశాలు పరిశీలించడానికి ఇది ఇంజినీర్లకు ఎంతో ముఖ్యమైనది.

15ap-story3b.jpg

ఎందాకా వచ్చిందంటే... 
పోలవరం ప్రాజెక్టులో మొత్తం 52 బ్లాకుల్లో స్పిల్‌వే నిర్మిస్తున్నారు. మూడో బ్లాకు నుంచి 48వ బ్లాకు వరకు స్పిల్‌వే ఓవర్‌ఫ్లో బ్లాకులుగా... ఒకటి, రెండు, 51, 52 బ్లాకులు నాన్‌ఓవర్‌ఫ్లో బ్లాకులుగా పిలుస్తారు. ఇప్పుడు 3 నుంచి 48 బ్లాకుల వరకు గ్యాలరీలో నడకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో 26, 34 బ్లాకుల పని ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సెప్టెంబరు మొదటి నాటికి ఆ పనులు కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్యాలరీ నడక ఎలా నిర్వహించాలనే విషయంలోను ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. లోపల సొరంగంలా ఉంటుంది కాబట్టి వెలుతురు, గాలి వచ్చే ఏర్పాట్లు చేయాలని పోలవరం అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు.

- ఈనాడు, అమరావతి
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...