Jump to content

Amaravati


Recommended Posts

డిసెంబరు కల్లా 61 టవర్లు
09-08-2018 01:33:26
 
636693752054902592.jpg
  • రాజధానిలో 3800 ఫ్లాట్లు
  • హైకోర్టు నిర్మాణ పనులు షాపూర్జీకి
  • 2 నెలల్లో అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లు
  • మొదలైన సచివాలయ పనులు: సీఆర్డీయే
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. ఈ ఏడాది చివరికే కొత్తరూపుతో అమరావతి కళకళలాడనుంది. డిసెంబరు చివరికల్లా రాజధానిలో 61 నివాస టవర్ల నిర్మాణం పూర్తి చేసి తాళం చెవులు అప్పగిస్తామని సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో కొందరు విలేకరులతో ముచ్చటిస్తూ ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ టవర్లలో 3800 ఫ్లాట్లు నిర్మిస్తున్నామని, ఐఏఎస్‌ అధికారులు మొదలుకొని నాలుగో తరగతి ఉద్యోగుల వరకూ నివసించడానికి వీలుగా వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
 
 
‘ఈ టవర్లలో ప్రస్తుతం ప్రతి ఆరు రోజులకు ఒక అంతస్తు చొప్పున నిర్మాణం చేసుకొంటూ వెళ్తున్నాం. ఈ ఏడాది జనవరిలో వీటి నిర్మాణం మొదలైంది. డిసెంబరు చివరి నాటికి మొత్తం పనులు పూర్తవుతాయి. ఐఏఎస్‌ అధికారులకు కొంత విశాలంగా.. ఒక్కో అంతస్తుకు రెండు ఫ్లాట్లు వస్తాయి. ఎన్జీవోలకు ఒక్కో అంతస్తుకు నాలుగు వస్తాయి. వైశాల్యంలో తేడా తప్ప నిర్మాణ నాణ్యతలో అన్నీ ఒకటిగానే ఉంటాయి. వారి కోసం నిర్మించే క్లబ్‌ హౌస్‌లు కూడా ఒకే రకమైన నాణ్యతతో నిర్మిస్తున్నాం. సీఎం చంద్రబాబు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు’ అని శ్రీధర్‌ చెప్పారు. మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, జడ్జిల కోసం నిర్మించే 189 నివాస భవనాల పనులు త్వరలో మొదలు పెడతామని తెలిపారు. ఆ హోదాలో ఎవరు ఉంటే వారు ఇందులో నివాసం ఉండవచ్చని, ఇవి ప్రభుత్వ క్వార్టర్లని చెప్పారు.
 
 
రెండేళ్లలో హైకోర్టు భవనం పూర్తి!
హైకోర్టు భవన నిర్మాణ పనుల టెండర్‌ను షాపూర్జీ పల్లొంజీ కంపెనీ దక్కించుకొన్నట్లు శ్రీధర్‌ తెలిపారు. 24 నెలలలో నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. అసెంబ్లీ భవనం నిర్మాణ డిజైన్లను కొంత మార్చామని, అవి వచ్చిన తర్వాత 2 నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు. ‘అసెంబ్లీ భవన నిర్మాణం కొంత క్లిష్టంగా ఉంటుంది. దానికి పైన 250 మీటర్ల ఎత్తుతో ఒక టవర్‌ నిర్మిస్తున్నాం. ఇది 65 అంతస్తుల ఎత్తుతో సమానం. వంద మీటర్ల ఎత్తులో 150 మంది నిలబడి చూడటానికి ఒక డెక్‌ నిర్మిస్తున్నాం. అక్కడి నుంచి పైకి 250 మీటర్ల ఎత్తు వరకూ ఒక క్యాప్సూల్‌లో ప్రయాణించడానికి ఏర్పాటు చేస్తున్నాం.పారి్‌సలోని ఈఫిల్‌ టవర్‌ 267 మీటర్ల ఎత్తు ఉంది. దానితో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువ ఉంటుంది’ అని సీఆర్డీయే కమిషనర్‌ వివరించారు.
 
 
మే నాటికి 25 అంతస్తులు రెడీ
సచివాలయానికి సంబంధించిన 5 టవర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయని శ్రీధర్‌ తెలిపారు. ప్రస్తుతం పునాదుల తవ్వకం జరుగుతోందని, 40 అంతస్తులకంటే మించి జరిగే ఈ నిర్మాణాలు వచ్చే మే నెల నాటికి 25 అంతస్తులు వరకూ పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజధాని ప్రాంతంలో మొదటి దశ కింద ఇప్పటివరకూ రూ.28వేల కోట్ల విలువైన పనులు మంజూరు చేశామని, ఇవి వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.
 
 
హడ్కో, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, బాండ్లు తదితర రూపాల్లో నిధులు సమీకరిస్తున్నట్లు వివరించారు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తామని, రాజధాని ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేయడానికి వీలుగా కొన్ని అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నామని, మొదటి దశలో 277 ఫ్లాట్లు నిర్మించి సాధారణ ప్రజలకు విక్రయిస్తామని తెలిపారు.
Link to comment
Share on other sites

రాజధాని రైతులకు అర్బన్‌ హౌసింగ్‌
10-08-2018 07:07:46
 
636694816656192886.jpg
  • రూ.500 కోట్లతో నిర్మాణాలు
  • 22 బ్యాంకుల ద్వారా రుణాలు
  • 5,024 మంది లబ్ధిదారులకు జి+3 గృహాలు
  • ఒక్కో గృహానికి రూ. 3 లక్షల సబ్సిడీ
గుంటూరు: రాజధాని అమరావతిలోని పేదవర్గాలకు అర్బన్‌ హౌసింగ్‌ పథకాన్ని విస్తరించారు. ప్రధాన మంత్రి అవాస్‌ యోజన (పీఎంఎవై) పథకం కింద దీనిని చేపట్టారు. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లోని 29 గ్రామాల అమరావతిలో 5,024 మంది లబ్ధిదారుల కోసం వీటిని నిర్మిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 10 గ్రామాలలో జి+3 అపార్ట్‌మెంట్‌లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 15 బ్యాంకులు 22 శాఖల ద్వారా లబ్ధిదారులకు రుణాలు అం దిస్తాయి.
 
మూడు విభాగాలుగా గృహాలు...
ఏపీ టిడ్కో ద్వారా లబ్ధిదారులకు మూడు విభాగాలలో అపార్ట్‌మెంట్‌లను నిర్మించబోతున్నారు. లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ. లక్షన్నర, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్షన్నర సబ్సిడీగా ఇస్తుంది. లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు అందిస్తాయి. దీంతోపాటు లబ్ధిదారులు సొంతంగా కొంత భరించాలి. మూడు విభాగాల నిర్మాణాల వివరాలు...
 
మొదటి భాగం: 300 చదరపు అడుగుల సింగిల్‌ బెడ్‌రూమ్‌ పక్కా గృహం. దీనికి లబ్ధిదారులు రూ. 500 చెల్లించాలి. బ్యాంకులు రూ. 2.65 లక్షలు రుణంగా మంజూరు చేస్తాయి.
రెండో భాగం: 365 చదరపు అడుగుల సింగిల్‌ బెడ్‌రూమ్‌ పక్కాగృహం. దీనికి లబ్ధిదారులు రూ.50వేలు చెల్లించాలి. బ్యాంకులు రూ.3.15లక్షలు రుణంగా మంజూరు చేస్తాయి.
మూడో భాగం: 430 చదరపు అడుగుల డబుల్‌ బెడ్‌ రూమ్‌ పక్కాగృహం. లబ్ధిదారుడు రూ.లక్ష చెల్లించాలి. బ్యాంకులు రూ.3.65లక్షలు రుణంగా మంజూరు చేస్తాయి.
 
ప్రారంభమైన నిర్మాణాలు....
ప్రస్తుతం రాజధాని అమరావతిలోని అనంతవరంలో మొదటిదశలో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మందడం లో రెండోదశలో నిర్మాణాలు చేపడతారు. పెనుమాకలో మూడోదశలో, నవులూరు, నేలపాడులలో నాలుగోదశలో ని ర్మాణాలు చేపడతారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని బ్యాంక్‌లు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడానికి అంగీకారం తెలిపాయి.
 
నాలుగు నెలల్లో నిర్మాణాలు పూర్తి...
రాష్ట్రప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాలుగు నెలల్లో నిర్మాణాలు పూర్తిచేయాలని భావిస్తోంది. దీనికితోడు తాత్కాలిక రాజధాని వెలగపూడిలో నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారు. సీఎం చంద్రబాబు రెండు నెలలకు ఒకసారి బ్యాంకర్ల సమావేశం జరుపుతున్నారు. మరోవైపు శాశ్వత రాజధాని పనులు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే రాజధాని 29 గ్రామాలకు సంబంధించిన భూమిలేని పేదలకు నెలనెలా పింఛన్లు ఇస్తున్నారు. వారికి ఆ ప్రాంతంలోనే ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో పాటు పక్కాగృహం నిర్మించి ఇస్తే పేదలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని రాజధాని అమరావతికి విస్తరింపచేసింది. దీనికి తోడు బ్యాంకర్లు కూడా రాజధాని అమరావతి ప్రాంతం త్వరలో పెద్ద నగరంగా విస్తరించబోతుందని అంచనాలు వేస్తున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు రాజధాని అమరావతి ప్రాంతంలో అర్బన్‌ హౌసింగ్‌ కింద 5,024 ఫ్లాట్ల నిర్మాణానికి సుమారు రూ. 160 కోట్లు రుణాలు ఇవ్వడానికి అంగీకరించాయి.
 
రూ.500కోట్లతో అర్బన్‌ హౌసింగ్‌
రాజధాని ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ, బ్యాంకులు ఇచ్చే రుణాలు, లబ్ధిదారులు చెల్లించే డబ్బు.... నిర్మాణాలు పూర్తి అయిన తరువాత జి+3 అపార్ట్‌మెంట్‌ల వద్ద ఏర్పాటుచేసే మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టుకు రూ. 500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
 
 
రాజధానిలో అర్బన్‌ హౌసింగ్‌ వివరాలు...
జి+3 అపార్ట్‌మెంట్‌ నిర్మించే గ్రామాలు: మందడం, ఉండవల్లి, పెనుమాక, దొండపాడు, నిడమర్రు, అనంతవరం, ఐనవోలు, నవులూరు, నేలపాడు, శాఖమూరు
 
రుణాలు ఇచ్చే బ్యాంక్‌లు...
మందడం: ఆంధ్రాబ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సీబీఐ), ఎస్‌బీఐ, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
ఉండవల్లి : ఆంధ్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ
పెనుమాక : కెనరా బ్యాంక్‌, ఐసీఐసీఐ
దొండపాడు: ఆంధ్రాబ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌
నిడమర్రు: చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌, ఎస్‌బీఐ
అనంతవరం: ఆంధ్రాబ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, యాకో బ్యాంక్‌
ఐనవోలు: ఎస్‌బీఐ
నవులూరు: ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌ (ఐవోబీ)
శాఖమూరు: కార్పొరేషన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
 
 
 
రాజధాని అమరావతిలో అర్బన్‌ హౌసింగ్‌...
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అర్బన్‌ హౌసింగ్‌ నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. భవిష్యత్తులో అమరావతి, నగర ప్రాంతంగా విస్తరించబోతుంది. దీనిని దృషిలో ఉంచుకొని బ్యాంకర్లు అర్బన్‌ హౌసింగ్‌ రుణాలు ఇవ్వడానికి అంగీకరించారు. తొలిదశలో 10 గ్రామాలలో జి+3 అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి 5,024 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పక్కాగృహాలు నిర్మిస్తుంది. దీనికి బ్యాంకర్లు రుణాలు ఇస్తున్నారు.
- మానం సుదర్శనరావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌
Link to comment
Share on other sites

సిద్ధమైన అమరావతి రక్షణ కవచం... అమరావతిలో ఏం చేసారు అనేవారికి మరో సమాధానం...

   
kondaveeti-10082018-1.jpg
share.png

రాజధాని అమరావతికి రక్షణ కవచంగా పనిచేయనున్న కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనులు చివరి స్టేజి కు వచ్చాయి. తొలిదశలో 5 వేల క్యూసిక్కుల నీటిని ఎత్తిపోసేందుకు నిర్మాణం పూర్తి చేసారు. రెండో దశలో 7350 క్యూసిక్కుల వరద నీటిని పంపింగ్ చెయ్యటానికి పధకం నిర్మస్తారు. ఆగష్టు 15 నాటికి, ఈ పధకం అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతిలో సుమారు పదివేల ఎకరాలను ముంపునకు గురిచేసే కొండవీటివాగు వరద సమస్యకు చెక్‌ పెడుతూ దానినే సుందర వాహినిగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ తీసుకుంటున్న చర్యలు చివరి స్టేజికు వచ్చాయి.

 

kondaveeti 10082018 2

సింగపూర్‌లో ఓ నది నుంచి తరచూ వస్తున్న వరద కట్టడికి అక్కడి ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని అధ్యయనం చేసి రూపొందించిన మాస్టర్‌ప్లాను మేరకు కొండవీటివాగు వరద కట్టడి ప్రాజెక్టును చేపడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించిన రూ.1500 కోట్ల నిధుల నుంచి రూ.237 కోట్లను వెచ్చించి దీనిని చేపట్టారు. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణ పనులను జరిపిస్తోంది. కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ పట్టిసీమ ఎత్తిపోతలను ఎంతైతే వేగంగా పూర్తిచేసిందో అదే వేగాన్ని కొండవీటివాగు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లోనూ చూపిస్తోంది.

kondaveeti 10082018 3

కలెక్షన్‌ పాయింట్‌.. కొండవీటివాగులో గరిష్ట నీటి ప్రవాహాన్ని 16వేల క్యూసెక్కులుగా అంచనా వేస్తూ ఎత్తిపోతలను డిజైన్‌ చేశారు. ఉండవల్లి కరకట్ట నుంచి 350 మీటర్ల దూరంలో వాగు వెంబడి వరదనీటి కలెక్షన్‌ పాయింట్‌ అంటే ఓ సంపు వంటి మినీ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఎస్కేప్‌ రెగ్యులేటర్‌.. సంపులోకి వచ్చిపడే వరదనీటిని కృష్ణానదితో పాటు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి తరలించేవిధంగా ఈ పథకాన్ని రూపొందించారు. సంపుకు తూర్పువైపున ఐదు లాకులతో కూడిన వంతెన వంటి నిర్మాణాన్ని ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ పేరుతో నిర్మించారు. వరదల సందర్భంలో రెగ్యులేటర్‌ లాకులను ఎత్తేస్తే ఐదువేల క్యూసెక్కుల వరదనీరు పశ్చిమ ప్రధానకాలువలోకి తరలిపోతుంది.ఈ ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ను రూ.9.5 కోట్లవ్యయంతో నిర్మించారు.

kondaveeti 10082018 4

పైౖపులతో అనుసంధానమే కీలకం.. డెలివరీ సిస్టమ్‌ను పంప్‌హౌస్‌తో అనుసంధానిస్తూ కరకట్ట రోడ్డు దిగువ నుంచి రెండుమీటర్ల డయా వ్యాసం కల 16 పైపులను ఏర్పాటు చేసారు. ఈ పైపుల కోసం రూ.18 కోట్లను ఖర్చు చేశారు.. డెలివరీ సిస్టమ్‌... ఉండవల్లి కరకట్టకు దిగువన కృష్ణాతీరం వైపు రూ.ఎనిమిది కోట్ల వ్యయంతో డెలివరీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది చూసేందుకు ఓ మినీ శ్రీశైలం ప్రాజెక్టు మాదిరి వుంటుంది. ఈ డెలివరీ సిస్టమ్‌ నుంచే మరో ఐదువేల క్యూసెక్కుల వరదనీరు నదిలోకి వేగంగా దూసుకుపోతుంది.

Link to comment
Share on other sites

వేగంగా రాజధాని పనులు
11-08-2018 03:12:36
 
  •  నాణ్యత విషయంలో రాజీ పడొద్దు: సీఎం
  •  14న బీఎ్‌సఈలో అమరావతి బాండ్ల బిడ్డింగ్‌
  •  ప్లాట్ల సత్వర రిజిస్ట్రేషన్లకు మరో డిప్యూటీ కలెక్టర్‌
  • సింగపూర్‌ పర్యటనకు మరికొందరు రైతులు
అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాజధాని పురోగతి మరింత స్పష్టంగా ప్రజలకు కనిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో అమరావతిలో జరుగుతున్న పనులను నాణ్యతా ప్రమాణాల్లో ఏమాత్రం రాజీ పడకుండా, నిర్దిష్ట గడువుల్లోగా పూర్తి చేయాలని సీఆర్డీయే, ఏడీసీ అధికారులకు స్పష్టంచేశారు. వీటిపై ప్రజలకు ఉన్న అంచనాలను అందుకునే విధంగా అవి రూపుదిద్దుకునేలా నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సీఆర్డీయే సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఐఏఎస్‌, ఇతర ఉన్నతాధికారుల కోసం నిర్దేశించిన 144అపార్ట్‌మెంట్లతో కూడిన 6 టవర్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.
 
ఎలివేషన్‌పై మరింత దృష్టి కేంద్రీకరించడం ద్వారా అవి ఆకర్షణీయంగా రూపుదిద్దుకునేలా చూడాలని ఆదేశించారు. పనులు పూర్తయి, వాటిల్లో ఉన్నతాధికారులు నివసించడం మొదలైతే రాజధాని పురోగతి మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తులకు ఒకే టవర్‌లో నివాస వసతి కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అమరావతి నిర్మాణ పురోగతిపై ప్రతివారం నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. దివ్యాంగులు, పింఛనుదారులు సహా పలువురు అమరావతికి విరాళాలు ఇస్తుండటం ద్వారా కలిగిస్తున్న స్ఫూర్తిని మరింతగా పెంపొందించడం ద్వారా అత్యధికులు రాజధాని నిర్మాణంలో ఉత్సాహంగా భాగస్వాములయ్యేలా చూడాలని సూచించారు.
 
సింగపూర్‌ సాధించిన అభివృద్ధి గురించి మరింతమంది రాజధాని రైతులు తెలుసుకునేందుకు వీలుగా ఇంకొందరిని అక్కడికి పంపేందుకు చంద్రబాబు అంగీకరించారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్ల రిజిస్ర్టేషన్లు వేగంగా, సజావుగా జరిగేలా చూడడానికి మరొక డిప్యూటీ కలెక్టర్‌ను నియమించుకోవాలని సూచించారు. రాజధాని నిర్మాణార్థం రూ.2,000కోట్లను సేకరించేందుకు సీఆర్డీయే జారీ చేయనున్న అమరావతి బాండ్ల బిడ్డింగ్‌ వచ్చే మంగళవారానికల్లా జరుగుతుదని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ నెలాఖరుకల్లా ఈ బాండ్ల లిస్టింగ్‌ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని, దీనిని పురస్కరించుకుని ముంబైలో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరుకావాలని సీఎంను కోరారు. ఒక రాష్ట్రం రూ.2,000కోట్ల భారీమొత్తాన్ని బాండ్ల ద్వారా సేకరించడం దేశంలో ఇదే ప్రథమమైనందున ఆ కార్యక్రమానికి విశిష్ట ప్రాధాన్యముందని అధికారులు చెప్పడంతో అందులో పాల్గొనేందుకు సీఎం అంగీకరించారు.
Link to comment
Share on other sites

మావేశంలో కీలక నిర్ణయాలు, ప్రతిపాదనలు.. 
* అమరావతి నిర్మాణానికి రూ.2వేల కోట్లు సమీకరించేందుకు సీఆర్‌డీఏ విడుదల చేస్తున్న అమరావతి బాండ్ల బిడ్డింగ్‌ ప్రక్రియ మంగళవారానికి పూర్తవుతుందని, ఈ నెలాఖరున బొంబాయి స్టాక్‌ ఎక్ఛేంజ్‌(బీఎస్‌ఈ)లో లిస్టింగ్‌కు వెళుతున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఒక రాష్ట్రప్రభుత్వం మొదటిసారి బాండ్ల ద్వారా రూ.2వేల కోట్లు సమీకరిస్తోందని, లిస్టింగ్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరైతే బాగుంటుందని ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు సూచించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

* రాజధానిలో ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మిస్తున్న 3,840 ఫ్లాట్లలో కనీసం 30శాతం అక్టోబరు నెలాఖరుకి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని నిర్మాణ సంస్థల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. అప్పటికి రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతుల పనులు పూర్తిచేస్తారు. నవంబరులో అధికారులకు ఇళ్లు అప్పగిస్తారు. డిసెంబరుకల్లా  మొత్తం 61 టవర్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం.

* అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న ఆరు టవర్లలో ఒకదాన్ని హైకోర్టు న్యాయమూర్తులకు కేటాయించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశం. వాటిని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని, టవర్ల ఎలివేషన్‌ అద్భుతంగా రావాలని స్పష్టీకరణ.

* రాజధానిలో స్థలాలు తీసుకుని నిర్మాణాలు మొదలుపెట్టని వివిధ సంస్థల ప్రతినిధుల్ని తదుపరి సమీక్ష సమావేశానికి పిలవాలని సీఎం ఆదేశం.

* రాజధాని పనుల పురోగతి వివరాలను ప్రతి నెలా బులెటిన్‌ రూపంలో విడుదల చేయాలని సూచన.

* రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన మరికొందరు రైతులను సింగపూర్‌ పర్యటనకు పంపాలన్న ప్రతిపాదనకు ఆమోదం.

* గుంటూరులో భూగర్భ డ్రెయినేజి పనులు, విజయవాడలో వరదనీటి పారుదల ప్రాజెక్టు పనుల్ని డిసెంబరు 31 నాటికి పూర్తిచేయాలని గుత్తేదారులకు సీఎం ఆదేశం. గుంటూరులో భూగర్భ డ్రెయినేజి ప్రాజెక్టు కోసం రహదారుల మధ్యలో తవ్వడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని నివారించేందుకు..వెంటనే గుంతలు పూడ్చాలని ఆదేశం.

10ap-main1b.jpg

* అన్న క్యాంటీన్లపై సుదీర్ఘ చర్చ. ఐదు రోజుల్లో 100 క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు. మిగతా 104 క్యాంటీన్ల నిర్మాణాలు సెప్టెంబరు 10 నాటికి పూర్తిచేస్తామని, అదే నెల 15-20 తేదీల మధ్య ప్రారంభిస్తామని వెల్లడి. నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని మండల కేంద్రాల్లోనూ అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు  సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.

* రాజధాని పనుల పురోగతిపై ప్రతి వారం తనకు నివేదిక ఇవ్వాలని, ప్రజల్ని ఎక్కువగా భాగస్వాముల్ని చేయాలని సీఎం సూచన.

* సీఆర్‌డీఏ పరిధిలో 130 కి.మీ.ల పొడవునా జాతీయ రహదారికి ఇరుపక్కలా చెట్లు పెంచాలని, గన్నవరం, చిలకలూరిపేట మార్గాల్లోంచి రాజధాని ప్రాంతంలోకి ప్రవేశించేవారికి హరిత హారం స్వాగతం పలకాలని సీఎం సూచన. విజయవాడలోని కాలువల సుందరీకరణకు ఆదేశం.

Link to comment
Share on other sites

Seed access roads before polls

THE HANS INDIA |   Aug 10,2018 , 11:20 PM IST
   
 

grabon.jpg

Seed access roads before polls
Seed access roads before polls
 
 
Vijayawada: The State government is keen to complete the seed access road before the forthcoming elections though some sections of farmers are reluctant to give their lands and Jana Sena chief Pawan Kalyan is opposing to the land acquisition plans. 
 
The seed access road is the main entry to Amaravati capital city and the state government wants to complete the road by acquiring land from farmers. In fact, the state government should have completed the road almost six months ago. 
 
 
 
 
 
 
 
 
 
 
It started the six-lane seed access road works almost two years ago. The Amaravati Development Corporation (ADC) and Capital Region Development Authority (CRDA) decided to provide six lane road as (with provision of upgrading it to eight-lane). 
 
 
 
The road is divided into two phases from Undavalli to Dondapadu and Undavalli to Kanaka Durga Varadhi. In the first phase, the State government started works to complete 18 km stretch from Undavalli to Dondapadu village. Already the 14 km stretch has been completed so far from Venkatapalem to Dondapadu.
 
The culvert works are also progressing at brisk pace. But the road works from Venkatapalem to Undavalli were stopped in the midway as some section of farmers did not give their consent for land pooling scheme of state government.
 
Moreover, the leaders of YSR Congress approached the courts opposing land acquisition. Jana Sena chief Pawan Kalyan visited the capital location and opposed the land acquisition.
 
According to new Land Acquisition Act, the government has provision to acquire required land for road formation without the consent of land owners.
 
Already the capital construction works including the IAS and the MLA quarters are progressing at brisk pace. The works would be completed by December. 
 
The  construction works were launched for ministers’ quarters, chief secretary and higher officials.The administrative building works also will be started from September. In this backdrop, the state government wants to complete the seed access road to Amaravati at any cost. 
 
CRDA Commissioner Cherukuri Sridhar said that they would complete the road soon. The required land would be taken from the farmers, he said and added that other road works also would be completed by December this year.  
Link to comment
Share on other sites

On 8/8/2018 at 11:11 AM, AnnaGaru said:

 

 

DkFIVe6XgAMf0B0.jpg

A well thought long term plan and present students are very happy.They started 2nd phase expansion and have 5 phases total.

 

:howdy: Jamshed Bharucha is the vice chancellor

Bombay International School
Vassar College (BA)
Yale University (MA)
Harvard University (PhD)

 

 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

టార్గెట్ 2019
13-08-2018 03:05:04
 
636697263012452091.jpg
  •  8 నెలల్లో పునాదిస్థాయి దాటాలిట
  •  సచివాలయం, హెచ్‌వోడీలపై సీఎం ఆదేశం
  •  నిర్మాణ పనుల్లో ప్రపంచశ్రేణి ప్రమాణాలు
  •  సీడ్‌ యాక్సెస్‌ రోడ్లు 86 శాతం పూర్తి
  •  ఎస్‌-9 రోడ్డు 70%.. ఇతర రోడ్లు 60%
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): సచివాలయం, హెచ్‌వోడీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు... అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఇప్పటికే పురోగతి సాధించామని, అదే జోరు కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే 8 నెలల్లో పునాదుల స్థాయి దాటాలని సీఆర్‌డీఏ ఉన్నతాధికారులకు సూచించారు. ఆదివారం వారితో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సచివాలయం, హెచ్‌వోడీ టవర్లలో 2019 మే నాటికి 20 అంతస్తుల మేరకు కోర్‌వాల్‌, 9 అంతస్తుల వరకూ డెస్క్‌ స్లాబ్‌ నిర్మాణాలను పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకోవాలని చెప్పారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీపడొద్దని, ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న రాజధాని ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమని సీఎం పేర్కొన్నారు.
 
కాగా, సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ పనులను ప్రారంభించిన నాటి నుంచి 29 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకి వివరించారు. రాజధాని నగరంలోని ప్రధానమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం 86ు పూర్తయిందన్నారు. ఎన్‌-9 రోడ్డు 70ు, ఇతర రోడ్లు 50-60ు పూర్తయ్యాయని చెప్పారు. హౌసింగ్‌ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయని ఏడీసీఎల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథి తెలిపారు. దీంతో... అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కీలక అంశాలను స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీసీఆర్‌డీఏ శకటంలో ప్రదర్శించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. యావత్‌ ప్రపంచం అమరావతి వైపు చూస్తోందని, పెట్టుబడిదారులకు స్వర్గధామంలా మారనుందని సీఎం పునరుద్ఘాటించారు. ఇటీవల జపాన్‌కు చెందిన వ్యాపారవేత్త ర్యుకోహిరా అమరావతిని సందర్శించినప్పుడు... ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలంగా ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఒక్క పట్టణ టౌన్‌షి్‌పల రంగంలోనే 10 బిలియన్‌ డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టొచ్చని చంద్రబాబు అన్నారు.
 
తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఎన్నారైలు విమానాశ్రయాలకు కూడా వచ్చి అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆరా తీస్తున్నారని, దీన్ని బట్టే అమరావతికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ పనుల్లో ప్రపంచ శ్రేణి ప్రమాణాలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. అంతర్జాతీయ నిపుణులతో థర్డ్‌ పార్టీ నాణ్యతా తనిఖీలను నిర్వహించాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు సూచించారు. ఈ విషయంలో జపాన్‌ తరహా తనిఖీలపై అధ్యయనం చేస్తున్నట్లు సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. ప్రజలకు రాజధాని నగరాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేలా కార్యక్రమాలను ప్రారంభించాలని, సెమినార్లు, వర్క్‌షాపుల నిర్వహణ, సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకుని ప్రజలను భాగస్వాములను చేయాలని చంద్రబాబు సూచించారు. కాగా, చట్టసభ సభ్యులు, సీనియర్‌ అధికారులు, ఇతర సిబ్బంది కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల పనుల పర్యవేక్షణకు ఏపీసీఆర్‌డీఏ వారాల వారీ ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...