Jump to content

Amaravati


Recommended Posts

ఒక్కో యూనిట్‌ రూ.10 లక్షలు!
04-08-2018 07:48:47
 
636689657288417441.jpg
  • అమరావతి బాండ్లపై సీఆర్డీయే నిర్ణయం
  • సంస్థాగత ఇన్వెస్టర్లకే కొనుగోలు అవకాశం
అమరావతి: అమరావతి నిర్మాణార్థం ఏపీసీఆర్డీయే త్వరలో బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లో జారీ చేయించనున్న అమరావతి బాండ్లలో ఒక్కో యూనిట్‌ ధరను రూ.10లక్షలుగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ బాండ్ల ద్వారా రూ.2,000 కోట్లను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే, వ్యక్తిగత ఇన్వెస్టర్లకు కాకుండా కేవలం సంస్థాగత మదుపరులకే వీటిని కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే పేరుగాంచిన ఇలాంటి సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సమావేశమై, అమరావతి విశేషాలు, అందులో పెట్టే పెట్టుబడులపై లభించేందుకు అవకాశమున్న ఆదాయం తదితర అంశాలను సీఆర్డీయే ఉన్నతాధికారులు వివరించగా మంచి స్పందన లభించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... తాము అమరావతి బాండ్లను కొనుగోలు చేస్తామంటూ వివిధ సంస్థలు వారికి హామీ ఇచ్చాయని, అవన్నీ కార్యరూపం దాల్చితే కనీసం రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల విలువైన బాండ్లు అమ్ముడుపోవచ్చునని తెలుస్తోంది.
 
ఈ బాండ్లపై ఇవ్వనున్న వడ్డీరేటు (10.32 శాతం) ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లపై లభిస్తున్న వడ్డీలతో పోల్చితే మెరుగ్గా ఉండడం ఇందుకు దోహదపడగలదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా.. ఈ బాండ్లపై సమీకరించిన మొత్తాలను తిరిగి చెల్లించేందుకు ఇచ్చే కాలవ్యవధి (మారటోరియం)ని ముందుగా భావించినట్లు పదేళ్లకు కాకుండా ఐదేళ్లకు తగ్గించడం కూడా ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించేలా చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. అమరావతి నిర్మాణ యజ్ఞంలో ప్రజలకూ భాగస్వామ్యం కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం త్వరలోనే వివిధ వర్గాల వారు తమ శక్తి మేరకు మదుపు చేసేలా బాండ్లు జారీ చేయాలనే యోచనలో సీఆర్డీయే ఉందని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

లంక భూముల రైతులకు చివరి అవకాశం
05-08-2018 07:35:15
 
636690513140750410.jpg
  • వారంలో వారి వద్ద ఉన్న డాక్యుమెంట్‌లు చూపించాలి
  • అన్నీ సవ్యంగా ఉంటే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్‌ అమలు
  • లేకుంటే సంబంధిత భూములు స్వాధీనం
గుంటూరు: అమరావతి రాజధాని పరిధిలోని లంక గ్రామాల్లో భూముల సమస్యని పరిష్కరించే దిశగా గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ చర్యలు చేపట్టారు. రెండురోజుల క్రితం ఇబ్రహీంపట్నం ఫెర్రీ పాయింట్‌ నుంచి పడవ ద్వారా లంక గ్రామాల్లోని భూములను ఆయన పరిశీలించి అవగాహన ఏర్పరుచుకొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న భూముల రికార్డులను తెప్పించి పరిశీలించారు. అలానే రాజధాని నగరం ప్రకటించే రోజుకు లంక గ్రామాల్లో వ్యవసాయం చేస్తున్న వారి వివరాలను కూడా తెప్పించుకొని అధ్యయనం చేశారు. అయితే సరైన రికార్డులు లేకుండా, వాటిల్లో వ్యవసాయం చేయకుండా తమ భూములంటూ వాదిస్తున్న కొంతమందికి ఆయన చివరి అవకాశం కల్పించారు. మీ వద్ద ఉన్న పత్రాలు తీసుకొచ్చి వారంలో తహసీల్దార్‌, సీఆర్డీయే కాంపిటెంట్‌ అథారిటీకి నివేదించాలని లేకుంటే భూములు స్వాధీనం చేసుకొంటామని స్పష్టం చేశారు.
 
రాజధానిలో బోరుపాలెం, రాయపూడి, ఉద్ధండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెంకటపాలెం, ఉండవల్లి గ్రామాల పరిధిలో కృష్ణానది గర్భంలోని లంక భూములున్నాయి. వీటిని రైతులు వ్యక్తిగతంగా, ఒక సొసైటీగా ఏర్పడి గతంలో సాగు చేసుకొనేవారు. లంక భూములకు కూడా జరీబుతో సమానంగా ప్యాకేజ్‌ ఇవ్వాలని రైతులు తొలినుంచి డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. అయితే భూముల విస్తీర్ణం నేటికీ ఒక కొలిక్కి రాలేదు. రిజిస్ట్రేషన్‌, అసైన్‌మెంట్‌ పత్రాలలో ఉన్న విస్తీర్ణానికి, రైతులు అనుభవిస్తున్న భూమి కొలతల్లో వ్యత్యాసం ఉన్నది. అయినప్పటికీ తమకు రికార్డుల ప్రకారమే భూమికి లెక్క కట్టి ప్యాకేజ్‌ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అయితే ఎంజాయ్‌మెంట్‌లో లేనిది ఎలా మీ భూమిగా క్లెయిమ్‌ చేస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది రైతులకు రికార్డుల్లో తక్కువ విస్తీర్ణం భూమి ఉండగా, ఎంజాయ్‌మెంట్‌లో ఎక్కువ ఉన్నది. గతంలో రెల్లు గడ్డి కోసుకోవడానికి ప్రభుత్వం సొసైటీలకు అనుమతించింది. ఆ సొసైటీల రైతులంతా తమకు ప్యాకేజ్‌ ఇవ్వాలని కోరుతోన్నారు. అయితే చాలామంది రైతుల వద్ద సరైన రికార్డులు లేవు. అలానే 2009 వరదల సమయంలో తాము సాగు చేసిన భూమి నదీ గర్భంలో కలిసిపోయిందని వాదిస్తున్నారు.
 
 
ఇంచుమించు మూడేళ్లుగా ఇదే సమస్య రాజధానిలో కొనసాగుతోన్నది. మొదట్లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత జేసీ కృతిక శుక్ల కూడా రైతులతో సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మరోవైపు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి లంక భూములు కీలకం కావడంతో త్వరతిగతిన వాటిని స్వాధీనపరుచుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భూములు క్లెయిమ్‌ చేస్తోన్న రైతులు వారి వద్ద ఉన్న ఆధారాలతో సహా వచ్చి తహసీల్దార్‌, కాంపిటెంట్‌ అథారిటీ కార్యాలయంలో నివేదించాలని జేసీ ఇంతియాజ్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే తాము తుది నిర్ణయం తీసుకొంటామని స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

అమరావతి.. ఆంధ్రుల వైభవం
05-08-2018 07:33:01
 
636690511802831425.jpg
  • వారసత్వాన్ని పరిరక్షించుకోవాలి..
  • మేధావుల ఆశాభావం
  • అమరావతిలో ముగిసిన వర్క్‌షాప్‌
అమరావతి: ఆంధ్రుల చారిత్రక, కళాత్మక, సంస్కృతి సంప్రదాయాలతో పాటు వారసత్వ విశేషాలను భావితరాలకు అందించేలా అమరావతి రాజధాని నగర నిర్మాణం ఉండాలని వివిధ రాష్ట్రాలకు చెందిన చారిత్రక, వారసత్వ మేధావులు ఆశాభావం వ్యక్తం చేశారు. చారిత్రక అమరావతిలోని వారసత్వ కేంద్రంలో ఈనెల 1వ తేదీ నుంచి జరుగుతున్న వర్క్‌షాప్‌లో చివరిరోజు శనివారం 14 రాష్ట్రాల నుంచి పలువురు మేధావులు పాల్గొని ప్రసంగించారు. వారసత్వ నగర అభివృద్ధి సలహాదారు గల్లా అమరేశ్వర్‌ వీరి మనోభావాలను డాక్యుమెంటరీ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సమర్పించనున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని చారిత్రక విశేషాలను పరిరక్షించాలని వారంతా కోరారు. పలువురి అభిప్రాయాలు ఇలా..
 
 
ఆసక్తికరంగా ఉంది..
నాలుగురోజుల పాటు వర్క్‌షాప్‌ చాలా బాగా జరిగింది. అందరూ కలసి చర్చించిన అంశాలు ఎంతో ఆసక్తి కరంగా ఉన్నాయి. సమీక్షలో సూచించిన అంశాలు రాజధాని నిర్మాణంలో అమలు జరిగితే అమరావతి పేరుకు తగ్గట్టుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. రానున్న రోజులలో ఇలాంటి వర్క్‌షాప్‌లు రాజధాని నిర్మాణానికి ఉపకరిస్తాయి.
- డాక్టర్‌ డి.త్యాగరాజన్‌, అధ్యక్షురాలు, దక్షిణ చిత్ర ఫౌండేషన్‌, చెన్నై
 
 
సమీక్షలో సూచనలు చేశాం..
వివిధ ప్రముఖ పట్టణాల నుంచి హాజరైన మేధావులంతా వివిధ రంగాల్లో ప్రావీణ్యం కలవారు. వీరంతా ఇక్కడ చారిత్రక కట్టడాలు, చరిత్ర, ప్రజల జీవన విధానం అర్ధం చేసుకుని వారి జ్ఞానాన్ని మిళితం చేసి రాజధాని నిర్మాణంలో చేపట్టాల్సిన అంశాలను వివరించారు. మా సూచనలు అమలుచేస్తే ఆంధ్రుల చరిత్రకు తగ్గట్టుగా రాజధాని ఉంటుంది.
- అదితి దియో, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అహ్మదాబాద్‌
 
 
అసమానతలు తొలగాలి..
కుల, మత, ఆర్థిక అస మానతలు లేకుండా ఒకటేనన్న భావనతో ఉంటేనే రాజధాని నిర్మా ణం ఆనందకరంగా ఉంటుంది. ఇది విద్య, ఆర్థికాభివృద్ధి ద్వారా సాధ్యపడుతుంది. ప్రపంచంలో ఒక్కో నగరం ఒకో అంశానికి ప్రాధాన్యా న్ని సంత రించుకుని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజ ధాని కూడా అన్ని రంగాల్లో ప్రా ధాన్యతను సంత రించుకునేలా ఉండాలి. అన్ని వృత్తులు అందరూ చేపట్టడం ద్వారా ప్రతి ఒక్కరిలో సమభావం కలుగుతుంది.
- పొత్తూరి రంగనాయకులు, శ్రీ వేంకటేశ్వర మ్యూజియం విశ్రాంత అధికారి
 
 
ఆదరణ అద్భుతంగా ఉంది..
స్థానికుల ఆదరణ కూడా అద్భుతంగా ఉంది. ఈ వారసత్వ కేంద్రం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా, అభివృద్ధికి కేంద్ర బిందువుగా ఉంటుంది. ఈ కేంద్రం ఇతర ప్రాంతాల్లోని మేధావులకు, స్థానికులకు అనుసంధానంగా నిలువనుంది. చారిత్రక వారసత్వం పెంపొందించుకునేందుకు ఈ కేంద్రం బీజం వేస్తుంది.
- యాంతియా ఫెర్నాండెజ్‌, ఆర్కిటెక్‌, ముంబై
 
 
అమరావతి గొప్ప వరం..
అమరావతి చరిత్రతో పాటు, శిల్పసంపద, కట్టడాలు ఉండటం స్థానికులకు గొప్ప వరం. లండన్‌ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్పసంపదకు ప్రత్యేక విశిష్టత ఉంది. రాజధాని నిర్మాణంతో ఇలాంటి చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, శిల్పాలు వెలుగులోకి వస్తున్నాయి. రానున్న రోజులలో గొప్ప చారిత్రక నగరంగా ఆంధ్రుల గొప్పతనానికి ప్రతీకగా నిలువనుంది.
- డాక్టర్‌ బెన్ని కురియాకోస్‌, కన్జర్వేషన్‌ ఆర్కిటెక్‌, కేరళ
Link to comment
Share on other sites

On 6/23/2018 at 3:51 AM, sonykongara said:
వారంలో శాశ్వత సచివాలయ పనులు!
23-06-2018 03:16:53
 
636653206277037289.jpg
  •  వర్క్‌ ఆర్డర్లు అందజేసిన సీఆర్డీయే
  •  నేడో, రేపో హైకోర్టు భవనానికీ టెండర్లు
అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో కీలకమైన శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు వారం, పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మొత్తం 70లక్షల చ.అ. విస్తీర్ణంలో, 5 టవర్లుగా, సుమారు రూ.2600 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ భారీ కాంప్లెక్స్‌ టెండర్లను 3 సుప్రసిద్ధ నిర్మాణ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలకు ఏపీసీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ శుక్రవారం వర్క్‌ ఆర్డర్లను అందజేశారు. ఒక వారంలోగా ఈ కంపెనీలు సీఆర్డీయేతో అంగీకారపత్రాలను కుదుర్చుకుని వెంటనే పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 26న టెండర్లు పిలవగా ఆ సంస్థలు తక్కువ మొత్తాలను కోట్‌ చేశాయి. ఈ నెల 20న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబుకి సీఆర్డీయే అధికారులు ఈ విషయం తెలియజేయగా.. వెంటనే ఆయా సంస్థలకు వర్క్‌ ఆర్డర్లు ఇచ్చి, పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశించారు. కాగా, 2 ఐకానిక్‌ భవంతుల్లో ఒకటైన రాష్ట్ర హైకోర్టు భవన నిర్మాణానికి నేడో, రేపో టెండర్లు పిలిచేందుకు సీఆర్డీయే సన్నద్ధమవుతోంది. బౌద్ధ స్థూపాకృతిలో రూపొందనున్న ఈ భవనానికి రూ.1168 కోట్ల వ్యయం కాగలదని అంచనా. తొలిదశగా ఫౌండేషన్‌, స్ట్రక్చరల్‌ టెండర్లను రూ.700 కోట్ల అంచనా వ్యయంతో పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ పనులు జరుగుతుండగానే అంతర్గత, ఇతర పనుల కోసం రూ.468 కోట్లతో మరొక టెండర్‌ను ఆహ్వానిస్తారని సమాచారం. మొత్తంమీద హైకోర్టు శాశ్వత భవనం పూర్తయ్యేందుకు రెండేళ్ల నుంచి రెండున్నరేళ్లు పట్టవచ్చునని సమాచారం.

ee towers start chesara bro L&T vallu ???

Link to comment
Share on other sites

2 hours ago, LuvNTR said:

ee towers start chesara bro L&T vallu ???

L&t recently took over the plots for their 2 towers 

And the steel structures will be ready in 14 months. 

Two towers are by shapoorji

And cm tower is by NCC

All of them 30+ floors

Link to comment
Share on other sites

24 minutes ago, rk09 said:

L&t recently took over the plots for their 2 towers 

And the steel structures will be ready in 14 months. 

Two towers are by shapoorji

And cm tower is by NCC

All of them 30+ floors

vallu eppudu start chestharata emaina idea bro?? 

Link to comment
Share on other sites

అమరావతిలో ‘స్పెషల్‌’ వర్క్‌షాప్‌
06-08-2018 09:31:07
 
636691446659876178.jpg
  • ఈ నెల 8న మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహణ
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు
  • పాల్గొననున్న 1,200 మంది స్పెషలాఫీసర్లు
  • గ్రామ, వార్డుల అభివృద్ధి ప్రణాళికలే అజెండా
 
గుంటూరు: నియోజకవర్గ, మండలస్థాయి స్పెషలాఫీసర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలు, వార్డుల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాల్సి ఉన్న దృష్ట్యా విధివిధానాలను వివరించేందుకు ఒక్కరోజు రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీన బుధ వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే వర్కుషాప్‌నకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల నుంచి సుమారు 1,200 మంది స్పెషలాఫీసర్లు హాజ రు కానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వర్కుషాప్‌ నిర్వహణ ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి సీఎంవో నుంచి ఆదే శాలు వెలువడ్డాయి.
 
 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1,500 రోజులు పూర్తి అయిన సంద ర్భంగా గత నెలలో గ్రా మదర్శిని కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వే మూరు నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని స్థాయిల అధికా రులు గ్రామాలకు వెళ్లి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, ఇంకా చేయాల్సిన పనులు గురించి వాకబు చేసి ప్రజలతో సంభాషించి ఒక సమగ్ర ప్రణాళికని రూపొం దించాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమం ఇప్పటికే జిల్లాలో ఇంచుమించు అన్ని గ్రామాలు, మునిసిపల్‌ వార్డుల్లో జరుగుతోన్న విషయం తెలిసిందే. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటోన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తయారు చేసిన ప్రణాళికలు, ఇంకా చేయాల్సిన వాటి గురించి అన్ని జిల్లాల స్పెషలాఫీసర్లతో చర్చించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం వర్కుషాపు ఏర్పాటు చేయాల్సిందిగా పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు.
 
 
నాలుగు నెలల క్రితం మంగళగిరిలోని పీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో అంతర్జాతీయ స్థాయి హ్యాపీ సిటీస్‌ సమిట్‌ జరిగిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే కన్వెన్షన్‌ హాల్‌లో స్పెషల్‌ వర్కుషాప్‌ని నిర్వహించబోతున్నారు. సదస్సు ప్రారంభానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై కీలకోపన్యాసం చేస్తారు. అలానే మంత్రులు, సచివాలయ స్థాయి ఉన్న తాధికారులు ఈ వర్కుషాప్‌నకు హాజరు కానున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. సదస్సుకు విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన కన్వెన్షన్‌ సెంటర్‌ని సందర్శించి అధికారులతో సంభాషించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...