Jump to content

Recommended Posts

పవన్ హెచ్చరికలతో ‘స్పీడ్’ ఆగిపోతుందా..?
29-07-2018 07:58:49
 
636684479265121661.jpg
 • సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పూర్తయ్యేదెన్నడో?
 • చురుగ్గా మొదటి ప్యాకేజీ నిర్మాణ పనులు
 • 2వ ప్యాకేజీకి అడుగడుగునా ఆటంకాలు
 • భూములిచ్చేందుకు ససేమిరా అంటున్న రైతులు
 • భూసేకరణకు దిగితే ఆందోళన చేపడతామన్న పవన్‌ కల్యాణ్‌
అమరావతి: అమరావతికి రాచమార్గంగా అభివర్ణితమవుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఎప్పటికి పూర్తయ్యేది కచ్చితంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాజధానిని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానించడమే కాకుండా అమరావతిలో పడమర కొసన ఉన్న దొండపాడు వరకు సాగే ఈ రహదారికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కనకదుర్గమ్మ వారధి నుంచి దొండపాడు వరకు మొత్తం సుమారు 21.2 కిలోమీటర్ల పొడవున నిర్మించదలచిన ఈ రహదారికి ఇరువైపులా లెక్కకు మిక్కిలిగా ప్రాజెక్టులు రానున్నాయి. దీంతో రాజధానిలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు సమీపాన ఉన్నంత డిమాండ్‌ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన ఉన్న ప్లాట్లకు ఉంది. అమరావతిలో స్థలాలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రముఖ సంస్థల్లో చాలావాటి ప్రథమ ఛాయిస్‌ సీడ్‌ యాక్సెస్‌కు చేరువలోనే అంటే దీనికి ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది.
 
ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ.. ఈ అత్యంత కీలక రహదారి ఎప్పటికి పూర్తవుతుందో తెలియని సందిగ్ధత నెలకొంది. 2 ప్యాకేజీలుగా విభజించిన ఈ రోడ్డులోని దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన మొదటి ప్యాకేజీ (దొండపాడు- వెంకటపాలెం మధ్య) పనులు చురుగ్గా సాగుతూ, మరికొన్ని నెలల్లోనే పూర్తవనున్నాయి. కానీ 2వ ప్యాకేజీ అయిన సుమారు 3.2 కి.మీ. పొడవుండే భాగంలో నిర్మాణం మాత్రం ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. ఎప్పటికి అవుతుందో తెలియదు. వెంకటపాలేనికి చెందిన కొద్దిమందితో పాటు పెనుమాక, ఉండవల్లి రైతుల్లో పలువురు ఈ భాగానికి అవసరమైన భూములను సమీకరణ ప్రాతిపదికన ఇచ్చేందుకు ససేమిరా అంటుండడమే దీనికి కారణం. అధికారులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నా, ఎప్పటికప్పుడు ఎల్పీఎస్‌ కింద వారి భూములను తీసుకునే గడువును పొడిగించుకుంటూ పోతున్నా, ఇవేవీ ఫలించేలా లేవన్న అభిప్రాయంతో భూసేకరణకు నోటీసులు జారీచేసినా పరిస్థితిలో అంతగా మార్పు రావడం లేదు. గత కొన్ని నెలల్లో కొందరు రైతులు భూసమీకరణ కింద తమ పొలాలను ఇచ్చినప్పటికీ అత్యధికులు మాత్రం మెట్టు దిగడం లేదు. వారికి నయానో భయానో నచ్చజెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలితమివ్వకపోవడమే అధికార యంత్రాంగానికి తలనొప్పి కలిగిస్తుండగా ఇటీవల హైకోర్టు ఈ ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియపై చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి ఇంకొంత జటిలమైంది.
 
పవన్‌ కల్యాణ్‌ హెచ్చరికలు..
ఈ నేపథ్యంలో ఇటీవల రాజధానికి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రైతులను భయపెట్టి భూములను తీసుకుంటే సహించేది లేదని రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందుకు అవసరమైతే ఆందోళనబాట పడతానని చెప్పిన ఆయన ఈ విషయంలో కావాలంటే పోలీసుల తూటాలకు ఎదురొడ్డుతానని సైతం వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ పరిణామం అమరావతికి భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులకు ఆనందం కలిగించగా, ఇది రాజధాని నిర్మాణానికి కొన్నిచోట్ల, ప్రధానంగా సీడ్‌ యాక్సెస్‌ రహదారికి అడ్డంకిగా పరిణమిస్తుందన్న వ్యాఖ్యానాలు గత కొన్నిరోజులుగా విస్తృతంగా వినవస్తున్నాయి. దీంతో ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అవసరమైన భూములను సేకరించేందుకు అధికార యంత్రాంగం ఏవిధంగా ముందుకు వెళ్తుందోనన్న దానిపై చర్చలు సాగుతున్నాయి.

Share this post


Link to post
Share on other sites
అమరావతిపై అధ్యయనం.. వెబ్‌సైట్‌లో రిపోర్టు
29-07-2018 08:02:57
 
636684481749225607.jpg
 • సీఆర్డీయే వెబ్‌సైట్‌లో కేస్‌ స్టడీ రిపోర్టు
 • రైతులు సహకరించిన తీరుపై వివరాలు
 • మోడల్‌గా ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌
గుంటూరు: అమరావతి రాజధాని నగర భూసమీకరణ పథకం కేస్‌ స్టడీ రిపోర్టుని ఏపీ సీఆర్డీయే అంతర్జాలంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భూసమీకరణకు ఎలా నాంది పలికింది, లక్ష్యసాధనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించిన తీరు తదితర వివరాలను రిపోర్టులో పొందుపరిచింది. దేశంలోనే ఇంత పెద్దఎత్తున భూసమీకరణ పథకం అమలు జరిగిన దాఖలాలు లేకపోవడంతో ఈ స్కీమ్‌ని ప్రథమస్థానంలో ఉంచుతోంది. 60 రోజులు, 25 వేల మంది రైతులు, 30 వేల ఎకరాలు ఈ గణాంకాలు హైలైట్‌గా నిలుస్తున్నాయి. దీనిని కేంద్ర ప్రభుత్వం ఎలుగెత్తి చాటడంతో పాటు మహారాష్ట్రలో నూతనంగా నిర్మించబోతున్న రాజధానికి అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం ఒక మోడల్‌గా నిలువబోతోంది.
 
భూసేకరణ ద్వారా అభివృద్ధి కోసం భూమిని తీసుకోవడం ఎంతో కష్టం. అంతేకాకుండా బాగా ఖర్చుతో కూడుకున్న విధానం. అయితే అమరావతి రాజధాని భూసమీకరణ విధానం అనాదిగా వస్తున్న భూసేకరణకు ప్రత్యామ్నాయంగా నిలువబోతోందని సీఆర్డీయే అభిప్రాయపడుతోంది. ఏపీ విభజన చట్టంలో హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ప్రకటించారు. అయితే మన రాజధాని మనకు ఉండాలన్న బలమైన ఆకాంక్ష ప్రజల నుంచి రావడంతో అందుకు అనుగుణంగా సీఆర్డీయే ముందుకు అడుగులు వేసింది. ఈ క్రమంలో సింగపూర్‌ దేశం మాస్టర్‌ప్లాన్‌ని కేవలం ఆరు నెలల వ్యవధిలో రూపొందించి ఇచ్చి సహకరించింది. అయితే ప్రపంచస్థాయిలో ప్రజాఽ రాజధాని నిర్మాణం చేయాలంటే భూమి కావాలి. అందుకు అవసరమైన డబ్బు ప్రభుత్వం వద్ద లేదు. అంతేకాకుండా భూమి యజమానులను భూసేకరణకు ఒప్పించడం సాఽధ్యమయ్యేది కాదు. ఇందుకు పరిష్కారమార్గంగా భూసమీకరణ పథకాన్ని సీఆర్డీయే ఎంచుకొంది. రైతులతో పలు దఫాలు చర్చలు జరిపి వారికి ఆమోదయోగ్యమైన స్కీమ్‌ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకోసం కేబినెట్‌ సబ్‌కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
ఛత్తీస్‌గడ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో పర్యటించిన అనంతరం మోడల్‌ ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ని రూపొందించి అమలు చేశారు. 2015 జనవరిలో స్కీమ్‌ 38,581 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రారంభమైంది. కేవలం రెండు నెలల వ్యవధిలో పాతికవేల మంది రైతులు ముందుకొచ్చి 30 వేల ఎకరాల భూమిని ఇవ్వడం ఒక చరిత్రత్మాకమైనదిగా సీఆర్డీయే వర్గాలు పేర్కొంటున్నాయి. రైతులు ఏ నమ్మకంతో అయితే భూములు ఇచ్చారో దానిని నిలబెట్టుకొంటూ అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తోంది. ఇందుకోసం ఎలకా్ట్రనిక్‌ లాటరీ విధానాన్ని అవలంబించడం ద్వారా పారదర్శకతను ప్రదర్శించింది. మొత్తం 24లో 22 గ్రామాల ప్రజలు స్కీం ప్రకటించిన నాలుగు నెలల్లోనే భూములు ఇచ్చేశారు. మొత్తం 90 శాతం భూమి వచ్చేసింది. మిగిలిన 10 శాతం భూమిని భూసేకరణ పద్ధతిన తీసుకొనే ప్రక్రియ కొనసాగుతోంది.
 
2018 జూన్‌ నెలాఖరు నాటికి 33,700 ఎకరాల భూమి సీఆర్డీయే చేతుల్లోకి వచ్చేసింది. ఇందుకోసం గుంటూరు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చేసిన కృషి చిరకాలం నిలిచిపోతుంది. గ్రామీణ జీవన విధానం నుంచి పట్టణ లైఫ్‌స్టయిల్‌కు ప్రజలను మార్చేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే రాజధాని రైతులను సింగపూర్‌ తీసుకెళ్లి అక్కడ పట్టణాభివృద్ధిని కళ్లకు కట్టించింది. సమగ్ర జలమార్గాలు, వాల్స్‌, బహుళ వినియోగ అభివృద్ధి ప్రదేశాలు వంటివి చూపించింది. భవిష్యత్తులో అమరావతి రాజధాని అలా ఉండబోతోన్నదని విశ్లేషించింది. అయితే ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ ద్వారా గట్టి పునాది రాయి పడిందనేది సుస్పష్టమని సీఆర్డీయే పేర్కొంటోంది. ఈ వివరాలన్నీ కేస్‌ స్టడీలో వివరించింది.

Share this post


Link to post
Share on other sites
స్థలాలు తీసుకుని తాత్సారం..!
నిర్మాణాల్లో వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం ముందంజ
కొనసాగుతున్న ఎన్‌ఐడీ, అమృత యూనివర్సిటీ పనులు
సన్నాహాల్లోనే బీఆర్‌షెట్టి, ఐయూఐహెచ్‌ ప్రాజెక్టులు
ముందుకు కదలని అంకురప్రాంత అభివృద్ధి

అమరావతిలో ఇంత వరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) స్థలాలు కేటాయించిన సంస్థల్లో వీఐటీ-ఏపీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు మాత్రమే కొన్ని భవనాల నిర్మాణాలు పూర్తిచేసి, అడ్మిషన్లు, బోధన కార్యక్రమాలు ప్రారంభించాయి. తమ ప్రణాళికల మేరకు ప్రాజెక్టులో మిగతా దశల్నీ వేగంగా పూర్తి చేస్తున్నాయి. దాదాపు వీటితో పాటుగా స్థలాలు పొందిన సంస్థలు మాత్రం... ఏవో కారణాలు చెబుతూ తాత్సారం చేస్తున్నాయి.

65 సంస్థలకు..
రాజధానిలో ఇంత వరకు సుమారు 65 సంస్థలకు దాదాపు 1500 వేల ఎకరాలకుపైగా సీఆర్‌డీఏ భూములు కేటాయించింది. వాటిలో పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేటు ఆస్పత్రులు వంటివి ఉన్నాయి. నందమూరి బసవతారక రామారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌కి వెయ్యి పడకల క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి సీఆర్‌డీఏ 15 ఎకరాలు కేటాయించింది. ఆ సంస్థ ఈ నెలాఖరులో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనుంది.

ఆ రెండు సంస్థలు అందరికంటే ముందు..!
వీఐటీ యూనివర్సిటీకి సీఆర్‌డీఏ 200 ఎకరాలు కేటాయించింది. ఆ సంస్థ ఇప్పటికే 3.22 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం కలిగిన భవనాలు నిర్మించింది. మరో 1.79 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతంతో అకడమిక్‌ బ్లాక్‌-2, 2 లక్షల చ.అడుగుల్లో బాలురు, బాలికల హాస్టల్‌ భవనాల నిర్మాణం జరుగుతోంది. బీటెక్‌ మొదటి, రెండో సంవత్సరం తరగతులు నిర్వహిస్తోంది. సుమారు 1900 మంది విద్యార్థులున్నారు. మొత్తం మీద ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సుల్లో 50 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసేలా భవనాలు, వసతులు, వెయ్యి పడకల బోధనాసుపత్రి నిర్మించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి రూ.3700 కోట్లు.

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి కూడా సీఆర్‌డీఏ 200 ఎకరాలు కేటాయించింది. ఆ సంస్థ ఇప్పటికే 7 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం కలిగిన భవనాలు నిర్మించింది. మరి కొన్ని భవనాల నిర్మాణం జరుగుతోంది. 2017 జులై నుంచి తరగతులు ప్రారంభించింది. మొత్తంగా 52వేల మంది విద్యార్థులకు సరిపడా వసతులు కల్పించడం లక్ష్యం, 750 పడకల బోధనాసుపత్రి నిర్మిస్తుంది. ప్రాజెక్టుపై పెట్టుబడి రూ.3400 కోట్లు.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థకు సీఆర్‌డీఏ 50 ఎకరాలు కేటాయించింది. ఆ సంస్థ 2017 మేలో నిర్మాణాలు ప్రారంభించింది. సుమారు లక్ష చ.అడుగుల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో లక్ష చ.అడుగులు నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్టు వ్యయం 108 కోట్లు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించింది.

శంకుస్థాపనలతో సరి..!
అబుదాబికి చెందిన బీఆర్‌ షెట్టి గ్రూపు, బ్రిటన్‌కు చెందిన ఐయూఐహెచ్‌ వైద్య, ఆరోగ్యరంగంలో పేరెన్నికగన్న సంస్థలు. గత ఆగస్టులోనే రెండు ప్రాజెక్టులకూ ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత  ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. త్వరగా నిర్మాణాలు మొదలు పెట్టాలంటూ ఆ రెండు సంస్థలకూ సీఆర్‌డీఏ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత బీఆర్‌షెట్టి సంస్థ స్థలాన్ని చదును చేసే పనులు మొదలు పెట్టింది. ఆ తర్వాత మళ్లీ పెద్దగా పురోగతి లేదు. బీఆర్‌ షెట్టి గ్రూపుకు మెడిసిటీ ఏర్పాటుకు గానూ 100 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 1500 పడకలతో బోధనాస్పత్రి, అనుబంధ సంస్థలు, త్రీస్టార్‌ హోటల్‌ ఏర్పాటు చేస్తామని బీఆర్‌ షెట్టి సంస్థ ప్రకటించింది. పెట్టుబడి రూ.6700 కోట్లు.

29ap-main14a.jpg

బ్రిటన్‌కు చెందిన ఐయూఐహెచ్‌ సంస్థ లండన్‌లోని ప్రఖ్యాత కింగ్స్‌ కాలేజీ హాస్పిటల్‌ భాగస్వామ్యంతో అమరావతిలో మెడిసిటీ ప్రాజెక్టు చేపట్టనుంది. ఆ సంస్థకు రెండు దశల్లో మొత్తం 150 ఎకరాల్ని సీఆర్‌డీఏ కేటాయించనుంది. 50 ఎకరాల్ని ఇప్పటికే కేటాయించింది. వెయ్యి పడకల బోధనాసుపత్రి, అనుబంధ సంస్థల్ని రూ.వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. పెట్టుబడులు సమీకరణలో భాగంగా, వివిధ అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే ప్రక్రియలో ఉన్నామని, త్వరలో పనులు మొదలు పెడతామని బిఆర్‌షెట్టి గ్రూపు చెబుతున్నట్టు సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. ఐయూఐహెచ్‌ సంస్థ ఎప్పుడు పనులు మొదలు పెడుతుందన్న విషయంలో అనిశ్చితి నెలకొంది.

29ap-main14b.jpg

అంకుర ప్రాంతం పరిస్థితీ అదే..!
సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్షియం 1,691 ఎకరాల్లో అంకురప్రాంత అభివృద్ధికి మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపికైంది. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ)తో కలసి స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నది ఒప్పందం. 2017 మేలోనే ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

ఇతర సంస్థలదీ అదే దారి..!
రాజధానిలో ఇంకా నేషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ (నిఫ్ట్‌), సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌, క్జేవివర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌, గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ ఆకాడెమీ వంటి సంస్థలకు సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించింది. అవి కూడా ఇంకా సన్నాహక దశలోనే ఉన్నాయి.

నిర్మాణాలు ప్రారంభించినవి..
* నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) సంస్థ నిర్మాణ పనుల్ని వేగవంతం చేసింది.
* మాతా అమృతానందమయి యూనివర్సిటీ నిర్మాణ పనులు ఇటీవలే మొదలై వేగంగా జరుగుతున్నాయి.

29ap-main14c.jpg

ఇంతవరకూ పనులు మొదలు పెట్టనివి..
* రాజధానిలో భారీ ఎత్తున ఆస్పత్రులు, వైద్య విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామంటూ స్థలాలు తీసుకున్న విదేశాలకు చెందిన బీఆర్‌షెట్టి, ఇండో యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయూఐహెచ్‌) సంస్థలు ఇంత వరకు నిర్మాణాలే ప్రారంభించలేదు.
* రాజధానిలో 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన సింగపూర్‌ సంస్థల కన్సార్షియం కూడా ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. ఈ ప్రాజెక్టుకి 2017 మే నెలలో శంకుస్థాపన చేశారు.

ఈనాడు, అమరావతి

Share this post


Link to post
Share on other sites
అమరావతిపై జాతీయ వర్క్‌షాపులు
30-07-2018 02:28:11
 
636685144884658429.jpg
 • 9 నగరాల నిర్మాణంలో నిపుణుల సూచనలు
 • రాష్ట్రమంతటికీ రాజధాని అభివృద్ధి ఫలాలు
 • పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నించండి
 • సీఆర్‌డీఏ అధికారులతో చంద్రబాబు
అమరావతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని ప్రాజెక్టుకు అంతర్జాతీయ సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఈ నేపథ్యంలో ఢిల్లీలో జాతీయ స్థాయి వర్క్‌షాపులు ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రణాళికలను వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. సీఆర్‌డీఏ అధికారులతో సీఎం ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో 9 ప్రతిపాదిత నగరాలతో అమరావతిని ప్రపంచంలోని ఉత్తమ సంతోష నగరంగా, నవకల్పనల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను వివరించాలని సీఎం సూచించారు. అమరావతి మీడియా సిటీపై ఢిల్లీలో ఇప్పటికే వర్క్‌షాప్‌ నిర్వహించామని, అలాగే క్రీడలు, ప్రభుత్వ, న్యాయ, ఆర్థిక, నాలెడ్జి, పర్యాటక, ఎలకా్ట్రనిక్స్‌, ఆరోగ్య నగరాల అభివృద్ధి ప్రాజెక్టులపైనా వర్క్‌షాపులు నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించాలని చెప్పారు. ఆయా నగరాలను విశిష్ఠ పాలన, ఉపాధి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చాలని అన్నారు. ఈ తొమ్మిది నగరాల నిర్మాణంలో సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ అంతర్జాతీయ నిపుణులను ఆహ్వానించాలని సూచించారు. ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందన్న నమ్మకం తనకుందని, దేశ అభివృద్ధిలోనూ కీలకంగా మారుతుందని అన్నారు. రాజధాని ప్రాంతంలో 9 నగరాల ఏర్పాటు మరే దేశంలోనూ లేదన్నారు.
 
ఈ నగరాలు ప్రజలకు ప్రపంచశ్రేణి జీవన ప్రమాణలను కల్పించడమే గాక జనం ఎప్పుడూ సంతోషంగా ఉండేందుకు దోహదపడతాయన్నారు. అమరావతి అభివృద్ధి ఫలాలు రాష్ట్రమంతటికీ చేరతాయని, అదే ప్రభుత్వ విధానమని చెప్పారు. గడచిన నాలుగేళ్లలో అన్ని హామీలు నెరవేర్చామని చెప్పిన చంద్రబాబు... రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. డిసెంబర్‌లోగా అమరావతికి ఒక రూపు తీసుకొస్తే అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు కచ్చితంగా ముందుకొస్తాయని స్పష్టం చేశారు. సీఎం పిలుపు మేరకు రాష్ట్రానికి చెందిన చుక్కపల్లి ఆకాశ్‌ నేతృత్వంలోని యువ వాణిజ్యవేత్తల బృందం అమరావతి నిర్మాణ కార్యక్రమాల్లో అనుసరించాల్సిన అంతర్జాతీయ విధానాలపై అధ్యయనం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిందని తెలిపారు. అజయ్‌జైన్‌ 9 నగరాల కాన్సె్‌ప్టను వివరిస్తూ... ఆర్థిక నగరాన్ని 2,091 హెక్టార్లలో ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడల నగరంలో భారీ స్టేడియాలు, వేదికలు, అంతర్జాతీయ క్రీడలు నిర్వహణకు ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. మీడియా సిటీని 2067 హెక్టార్లలో ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణానది తీరం వెంట పర్యాటక నగరం ఏర్పాటు చేస్తామని వివరించారు. మంత్రి నారాయణ, సీఎం ప్రత్యేక సీఎస్‌ సతీ్‌షచంద్ర, ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌, ఏడీసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారధి, సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Share this post


Link to post
Share on other sites
సెక్రటేరియట్‌ టవర్ల డిజైన్లపై చర్చలు
31-07-2018 03:08:38
 
636686033189844412.jpg
 • లండన్‌ బయల్దేరిన సీఆర్డీఏ ఉన్నతాధికారులు
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): అమరావతికి మకుటాయమానంగా నిలవనున్న సెక్రటేరియట్‌ టవర్ల డిజైన్లపై చర్చల కోసం ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులు లండన్‌ బయల్దేరారు. రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ అయిన నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌కు చెందిన కార్యాలయంలో ఈ నెల 31 నుంచి వచ్చేనెల 4 వరకు నిర్వహించనున్న పలు సమావేశాల్లో వీరు పాల్గొంటారు. సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ షణ్మోహన్‌, సీఈ వెంకటేశ్వరరావు, డిజైన్‌ ఆర్కిటెక్ట్‌ అనుశ్రీతో కూడిన బృందం అక్కడ నార్మన్‌ ఫోస్టర్‌తో పాటు స్ట్రక్చరల్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న బ్యూరో హెపాల్డ్‌ సంస్థ నిపుణులతోనూ భేటీ అవుతుంది.
 
కాగా, సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లోని మొత్తం 5టవర్ల నిర్మాణ కాంట్రాక్టులను సొంతం చేసుకున్న ఎల్‌అండ్‌టీ, షాపూర్జీ పల్లోంజీ, ఎన్‌సీసీ కంపెనీలు ఆయా ఆకాశసౌధాలకు అవసరమైన స్ట్రక్చరల్‌ డిజైన్లను రూపొందించే శక్తిసామర్థ్యాలున్న సంస్థగా బ్యూరో హెపాల్డ్‌ను ఎంపిక చేసుకున్నాయి. కాంట్రాక్ట్‌ కంపెనీలు, సీఆర్డీయే ఉన్నతాధికారులతో సంస్థ నిపుణులు సంప్రదింపులు జరుపుతున్నారు.

Share this post


Link to post
Share on other sites
సీఆర్‌డీఏ అధికారుల లండన్‌ పర్యటన

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ, హైకోర్టు, సచివాలయ భవనాల ఆకృతులపై చర్చించేందుకు సీఆర్‌డీఏ అధికారుల బృందం లండన్‌ వెళ్లింది. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ సారథ్యంలో వెళ్లిన ఈ బృందంలో అదనపు కమిషనర్‌ షణ్మోహన్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఎం.వెంకటేశ్వరరావు, డిజైన్‌ ఆర్కిటెక్ట్‌ అనుశ్రీ చౌదరి ఉన్నారు. ఈ బృందం జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు లండన్‌లో ఉంటుంది. శాసనసభ, హైకోర్టు, సచివాలయ ఆకృతుల్ని రూపొందిస్తున్న నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థకు చెందిన కార్యాలయంలో జరిగే పలు సమావేశాలు, వర్క్‌షాపుల్లో సీఆర్‌డీఏ అధికారులు పాల్గొంటారు.

Share this post


Link to post
Share on other sites
అసెంబ్లీని సందర్శించిన ఏపీ బృందం
01-08-2018 08:04:37
 
636687074780541163.jpg
హైదరాబాద్: తెలంగాణ శాసనభలోని అంతర్గత నిర్మాణాలను అమరావతిలో కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపడుతున్న పాస్టర్స్‌ సంస్థ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారుల బృందం సందర్శించింది. మంగళవారం ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలోని పలు నిర్మాణాలను పరిశీలించింది. శాసనసభ, సభాపతి, ముఖ్యమంత్రి చాంబర్లు, సభ్యుల విశ్రాంతి గదులు, లైబ్రరీ, శాసనసభ సచివాలయాలంతోపాటు పలు నిర్మాణాలను ఈ బృందం పరిశీలించింది. సభ్యుల స్థానాల క్రమాన్ని కూడా పరిశీలించింది. శాసనసభ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఈ బృందానికి వివరించారు.

Share this post


Link to post
Share on other sites
మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగానే నిర్మాణాలు
02-08-2018 06:45:47
 
636687891486789881.jpg
 • సోషల్‌ మీడియాలో ప్లాన్‌, గూగుల్‌ ఇమేజ్‌ పోస్టులు
 • ముచ్చట పడుతున్న నెటిజన్లు
గుంటూరు: అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన మాస్టర్‌ప్లాన్‌ నమూనాలు చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేసిన విషయం విదితమే. అయితే ఆ విమర్శలకు సమాధానంగా ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలను సీఆర్‌డీఏ ఇంటర్నెట్‌లో పెట్టింది. అచ్చు మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న విధంగానే రోడ్లు, భవన నిర్మాణాలు జరుగుతుండడం అందరినీ ఆకర్షిస్తోంది. ప్లాన్‌ కాపీతోపాటు గూగుల్‌ ఎర్త్‌ శాటిలైట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టుచేస్తున్న నెటిజన్లు సీఆర్‌డీఏ వాస్తవ చిత్రాలను ఆవిష్కరిస్తోందంటూ కామెంట్‌లు పెడుతున్నారు.
 
రాజధానిలో రవాణా వ్యవస్థకు ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా గీత గీసినట్లు ఉండాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే సింగపూర్‌ సంస్థ మాస్టర్‌ప్లాన్‌లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను రూపొందించింది. ఆ ప్రకారమే రాజధానిలో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్లాన్‌లో చూపించిన విధంగానే లేఅవుట్‌లు, గ్రీన్‌ప్యాచ్‌ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో చేపడుతున్నారు.
 
రోడ్ల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకపోవడం వల్లే అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇది సీఎం పిలుపునకు స్పందించి రూ. వేల కోట్ల విలువ చేసే భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని, తమ నిబద్ధతని చాటిచెబుతోందని, ఈ నమ్మకాన్ని తాము నిలబెట్టుకుం టామని టీడీపీ శ్రేణలు చెబు తున్నాయి. మరోవైపు హైదరా బాద్‌లో అప్పటి సీఎం వైఎస్‌ హయాంలో అవుటర్‌ రింగు రోడ్డు విషయంలో మలుపులు తిప్పడానికి సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలను టీడీపీ నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి, ఇతర ప్రభుత్వాలకు మధ్య వ్యత్యాసం ఇదేనని స్పష్టం చేశారు.

Share this post


Link to post
Share on other sites
అమరావతి నిర్మాణం కోసం బాండ్ల జారీకి కేబినెట్‌ నిర్ణయం
02-08-2018 18:29:38
 
636688313796181223.jpg
అమరావతి: అమరావతి నిర్మాణం కోసం బాండ్ల జారీకి కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. బాండ్ల ద్వారా రూ.2వేల కోట్లు సమీకరించడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 10.32శాతం వడ్డీకి ప్రభుత్వం బాండ్లను జారీ చేయనుంది. బాండ్ల జారీకి స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదించింది. స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, సభ్యులుగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్‌ను నియమించింది.
 
Tags : amaravathi, Chandrababu, AP Cabinet

Share this post


Link to post
Share on other sites
సీడ్‌యాక్సిస్‌ రోడ్డుకు సహకరించండి
03-08-2018 07:19:43
 
636688775849516889.jpg
 • రీ సర్వే చేయించి సమన్యాయం చేస్తాం
 • జేసీ ఇంతియాజ్‌
అమరావతి: సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో భూములు కోల్పోతున్న తాడేపల్లి రైతులకు ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం అందజేస్తామని, సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నిర్మాణానికి రైతులు, ప్రజలు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ కోరారు. గురువారం సాయంత్రం తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో రైతులు, ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. గతంలో జరిగిన సర్వే తప్పులతడకగా ఉందని రైతులు, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయగా రీ సర్వే జరిపించి అందరికీ సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జేసీ చెప్పారు.
 
భూవిస్తీర్ణం విషయంలో కూడా ఉన్న తేడాలు సరి చేస్తామని, అధికారులు క్షేత్ర స్థాయిలో పూర్తి నిబద్ధతతో పనిచేయాలన్నారు. సీడ్‌యాక్సిస్‌ రోడ్డులో ఎంత భూమి పోతుందో, ఎంత భూమి మిగిలి ఉంటుందో ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెప్పారు. రాజధానికి ప్రధానమైన సీడ్‌యాక్సిస్‌ రోడ్డునిర్మాణ ం జరిగే విధంగా ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పద్మనాభుడు, రైతులు కొల్లి సీతారెడ్డి, శివారెడ్డి, బోసురెడ్డి, జగదీశ్వరి, వెంకట్రావు, శేషగిరి, శివరామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గోపాల్‌ రెడ్డి, ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share this post


Link to post
Share on other sites
అమరావతి బాండ్ల జారీకి క్యాబినెట్‌ ఓకే
03-08-2018 07:15:46
 
636688773475265431.jpg
 • రూ.2,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా వారం రోజుల్లో ఇష్యూ
 • బాండ్లపై 10.32 శాతం త్రైమాసిక స్థిర వడ్డీ
 • తొలుత రూ.1300 కోట్లకు జారీ- స్పందన బాగుంటే మిగిలిన రూ.700 కోట్లకు సైతం
 • విధివిధానాల ఖరారుకు నిపుణులు, అధికారులతో స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటు
 
అమరావతి: రాజధాని నగర నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ.2,000 కోట్లను మదుపరుల నుంచి సేకరించే నిమిత్తం ఏపీసీఆర్డీయే జారీ చేయదలచిన అమరావతి బాండ్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాండ్ల జారీకి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఆర్థికరంగ నిపుణులు, ఉన్నతాధికారులతో కూడిన ఒక స్టాండింగ్‌ కమిటీని కూడా ఈ సందర్భంగా నియమించారు.
 
రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీనిచ్చే ఈ బాండ్ల కోసం ఈ నెల ఆరు లేదా ఏడు తేదీల్లో బిడ్లను పిలుస్తారని, తర్వాత మూడు నాలుగు రోజుల్లో అవి బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎ్‌సఈ)లో లిస్టవుతాయని తెలుస్తోంది. బాండ్ల ద్వారా నిధుల సమీకరణ మదుపరులకు, సీఆర్డీయేకు కూడా ప్రయోజనకరమైనందున రాష్ట్ర ప్రభుత్వం వీటి జారీకి ఆమోదముద్ర వేసింది.
 
త్రైమాసిక స్థిర వడ్డీ 10.32 శాతం..
 • అమరావతి బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఆకర్షణీయమైన వడ్డీ ఇచ్చేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలియజేసింది. వీటిపై 10.32 శాతం స్థిర వడ్డీని, ప్రతి మూడు నెలలకూ ఒకసారి మదుపరులకు చెల్లించేందుకు అంగీకరించడం ద్వారా వీటిపై పలువురు ఆసక్తి కనబరచేలా చూసింది.
 • మొత్తం సేకరించదలచిన రూ.2,000 కోట్లకు తొలి దశలో (బేసిక్‌ ఇష్యూ) రూ.1300 కోట్ల విలువైన బాండ్లను బీఎ్‌సఈ ఎలకా్ట్రనిక్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫాం (ఈబీపీ)పై జారీ చేయనున్నారు.
 • వీటికి ఆశించిన స్పందన లభిస్తే మిగిలిన రూ.700 కోట్ల (గ్రీన్‌ షూ ఆప్షన్‌)కూ బాండ్లను సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఇష్యూ చేసేందుకు క్యాబినెట్‌ అనుమతించింది.
స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటు
 • పైన పేర్కొన్న విధంగా బహుళ ప్రయోజనకరమైన అమరావతి బాండ్ల జారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటును సైతం క్యాబినెట్‌ సమావేశం ఆమోదించింది.
 • కాగా ఈ స్టాండింగ్‌ కమిటీకి రాష్ట్ర ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
 • రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీసీఆర్డీయే కమిషనర్‌, స్పెషల్‌ కమిషనర్‌, సంబంధిత అంశంలో నిపుణుడు సభ్యులుగా ఉంటారు.
 
 
ఇవీ.. సీఆర్డీయేకు కలిగే ప్రయోజనాలు
 • అమరావతి బాండ్లు మదుపరులకు భద్రతతో కూడిన మంచి ఆదాయాన్ని ఇస్తూనే.. వాటిని జారీ చేసే సీఆర్డీయేకూ ప్రయోజనాలను కలిగించనున్నాయి. బాండ్ల ద్వారా లభించే నిధులను అవసరాలు, ప్రాథమ్యాలకు అనుగుణంగా ఖర్చు చేసుకునే సౌలభ్యం సీఆర్డీయేకు ఉంటుంది.
 • కాలహరణం జరగదు. బాండ్ల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది. ఆ వెంటనే నిధులు అందుతాయి.
 • అమరావతి బాండ్లపై ఐదు సంవత్సరాల మారిటోరియం ఉంది. అంటే.. 2023 తర్వాత మాత్రమే మదుపరులకు రీపేమెంట్లు ప్రారంభమవుతాయి. ఇది సీఆర్డీయేకు ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తుంది.

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×