Jump to content

Amaravati

Recommended Posts

By the way SRM has best football,cricket,basketball,tennis courts on other side with "FLood lights to play even night time"....Theater is also set up for entertainment...talked to present hostel students and they are all very happy with lot of fun.......

other side(land leveling) in the below photo is Phase-2 with 600 crores expansion to start soon

cxvlnhtyxc-1532097947.jpg

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

రాజధానిపై రైల్వే దెబ్బ 
అమరావతి రైలు ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష 
ఎర్రుపాలెం-నంబూరు సింగిల్‌ లైన్‌కే పరిమితం 
పెదకూరపాడు-అమరావతి, సత్తెనపల్లి-నరసరావుపేట మార్గాలు ప్రస్తుతానికి లేనట్లే 
గత అంచనా వ్యయాన్ని తగ్గించిన రైల్వే బోర్డు 
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 
ఈనాడు - అమరావతి 
23ap-main1a.jpg

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని రైలు మార్గాలతో అనుసంధానించే ప్రాజెక్టుల విషయంలో కేంద్రం రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో అత్యంత ప్రధానమైన ఎర్రుపాలెం-నంబూరు రైలు మార్గాన్ని సింగిల్‌ లైన్‌కే పరిమితం చేయాలని నిర్ణయించింది. పెదకూరపాడు-అమరావతి, సత్తెనపల్లి-నరసరావుపేట సింగిల్‌లైను రైలు మార్గాల నిర్మాణాన్ని ఆర్థికంగా వెసులుబాటు కాదంటూ ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. తదునుగుణంగా గతంలో రూపొందించిన అంచనా వ్యయాన్ని రూ.2,679.59 కోట్ల నుంచి రూ.1,732.56 కోట్లకు తగ్గించింది. గత నెలలో జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ ఇటీవల విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వవర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్రం సహయ నిరాకరణలో ఇది భాగమేనని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఒక రాష్ట్ర రాజధానిని ప్రధాన రైలు మార్గాలతో అనుసంధానించేందుకు తలపెట్టిన లింక్‌ రైలు మార్గాల నిర్మాణాన్ని ఆర్థికంగా  వెసులుబాటు కాదనే కోణంలో చూడటం సరికాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో రెండూ సింగిల్‌ లైన్లే. వాటి మొత్తం పొడవు 49.50 కి.మీ. నిర్మాణ వ్యయమూ తక్కువే. అయినా వాటినీ పక్కన పెట్టేశారు.

2016-17 బడ్జెట్‌లో ఆమోదం 
అమరావతి నుంచి ప్రధాన రైలు మార్గాలను అనుసంధానించేందుకు గాను మూడు లింక్‌ మార్గాలను నిర్మించాలన్న డిమాండ్ల నేపథ్యంలో రైల్వే బోర్డు రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) సంస్థతో రెండేళ్ల కిందట అధ్యయనం చేయించింది. దాని ప్రకారం విజయవాడ-మధిర మధ్యనున్న ఎర్రుపాలెం నుంచి దాములూరు, వడ్లమాను, తాడికొండ ప్రాంతాల మీదుగా అమరావతిని కలుపుతూ విజయవాడ-గుంటూరు మధ్యనున్న నంబూరు వరకూ (ఎర్రుపాలెం-నంబూరు) రైలుమార్గాన్ని 56.80 కి.మీ మేర డబుల్‌ లైన్‌, పెదకూరపాడు నుంచి అమరావతి వరకూ 24.50 కి.మీ మేర, సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకూ 25 కి.మీ మేర సింగిల్‌ లైన్లు చొప్పున మొత్తం 106.03 కి.మీ మేర కొత్తగా లింకు మార్గాల అభివృద్ధికి రూ.2,679.59 కోట్లు వ్యయమవుతుందని అంచనాలు సిద్ధం చేయించింది. 2016-17 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉన్నా అది జరగలేదు. ఈ ప్రాజెక్టు వ్యయంలో సగం భరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే బోర్డు కోరింది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము ఆ భారాన్ని భరించలేమంటూ ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు ఎర్రుపాలెం-నంబూరు డబుల్‌లైన్‌ను సింగిల్‌ లైన్‌కు కుదిస్తూ సవరించిన అంచనాలు రూపొందించింది.

భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోరా? 
అమరావతికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాకపోకలు సాగనున్నాయి. ఇప్పటి నుంచే దానికనుగుణంగా రైలు మార్గాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. అందుకు భిన్నంగా ప్రధాన అనుసంధాన మార్గాన్ని సింగిల్‌ లైన్‌కు పరిమితం చేయడం రాజధాని అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలపైన ప్రభావం చూపుతుంది. అయితే తాజా మార్పుల విషయంపై దక్షిణమధ్య రైల్వే అధికారుల వివరణ కోసం అడిగేందుకు ప్రయత్నించగా..వారు స్పందించలేదు.

23ap-main1b.jpg

ప్రతిపాదిత రైలు మార్గాల నిర్మాణం చేపడితే ప్రయోజనాలివే! 
* ఎర్రుపాలెం-నంబూరు మధ్య డబుల్‌ లైన్‌ నిర్మిస్తే రెండు వైపులా ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్ల రాకపోకలు సాగేందుకు అవకాశముంటుంది. సింగిల్‌ లైన్‌ అయితే ఆ వెసులబాటు ఉండదు. 
* పెదకూరపాడు-అమరావతి మార్గం నిర్మాణం ఫలితంగా సికింద్రాబాద్‌కు వెళ్లే దూరం తగ్గుతుంది. 
* సత్తెనపల్లి-నరసరావుపేట మార్గాన్ని నిర్మిస్తే రాజధాని నుంచి గుంతకల్లు మీదుగా బెంగళూరు వెళ్లే ప్రధాన రైలు మార్గానికి అనుసంధానత ఏర్పడుతుంది.

Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:

asala a lane gesina sannsi evado kani.......ante ippudu guntur NUNCHI oka 20-30 bridges at every road to capital kavali......why can't they join with pedakurapadu existing?

Railway lane is the WORST thing to have inside capital in India(a shit kampu oakti bonus)

Link to comment
Share on other sites

అమరావతిలో ప్రపంచ బ్యాంక్‌ బృందం
24-07-2018 03:38:03
 
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంత నిర్వాసితులు... లేక ప్రభావితులయ్యే ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలేమిటి? వాటి పురోగతి ఎంతవరకూ వచ్చిందన్న అంశాలపై ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం వాకబు చేసినట్లు తెలిసింది. అమరావతిలోని ప్రాధాన్య రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను రుణరూపేణా ఇవ్వాల్సిందిగా ఏపీసీఆర్డీయే పంపిన ప్రతిపాదనలపై మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం సోమవారం ఆ బ్యాంక్‌ ప్రతినిధులు వచ్చారు.
Link to comment
Share on other sites

కొండవీటివాగు’ కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపు
25-07-2018 07:37:58
 
636681010777045900.jpg
అమరావతి: రాజధానిలోని ఉండవల్లి కొండవీటి వాగు ప్రభావిత కుటుంబాలకు సహాయ, పునరావాస ప్యాకేజీలో భాగంగా గుంటూరు జేసీ ఇంతియాజ్‌ ఇళ్ల స్థలాలను ఆన్‌లైన్‌ లాటరీలో కేటాయించారు. విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కార్యక్రమం జరిగింది.
 
కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణంతో నివాసాలు కోల్పోయిన 21 కుటుంబాలకు ఉండవల్లి పరిధిలో కేటాయించిన ప్రత్యామ్నాయ నివేశన స్థలాలను అందజేశారు. లబ్ధిదారులకు ధ్రువపత్రాలను ఇచ్చారు. ఈ కాలనీని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని ఇంతియాజ్‌ ప్రకటించారు. ఈ కుటుంబాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద తగిన పరిహారం అందనుంది. కార్యక్రమంలో సీఆర్డీఏ ల్యాండ్స్‌ డైరెక్టర్‌ బి.ఎల్‌.చెన్నకేశవరావు, తాడేపల్లి తహసీల్దార్‌ పద్మనాభుడు, ఉండవల్లి డిప్యూటీ కలెక్టర్‌ రజనీకుమారి తదితర అధికారులతోపాటు ఉండవల్లిలోని కొండవీటి వాగు ప్రభావిత కుటుంబాల వారు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రాజధానిలో సమస్యలివి.. స్పందించాలి మరి!
25-07-2018 07:39:20
 
636681011601173989.jpg
  • అడ్వైజరీ కమిటీ తొలి భేటీలో పలు అంశాలపై చర్చ
  • రాజధానిలోని పలు సమస్యలను ప్రస్తావించిన కమిటీ సభ్యులు
  • గడువు విధించి సత్వరమే పరిష్కరించాలని వినతి
  • అప్పుడే అమరావతి నిర్మాణం పుంజుకుంటుందన్న అభిప్రాయం
అమరావతి: రాజధాని గ్రామాలవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తేవడంతోపాటు అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ముమ్మర కసరత్తు మరింత వేగంగా జరిగేందుకు తోడ్పడే సలహాలను ఇస్తుందన్న ఉద్దేశ్యంతో సీఆర్డీయే కొద్దిరోజుల క్రితం ఏర్పాటుచేసిన ‘అడ్వైజరీ కమిటీ’ మొట్టమొదటిసారిగా సమావేశమైంది. రాజధాని రైతులతోపాటు ఆ ప్రాంతానికి చెందిన తుళ్లూరు మండలాధ్యక్షురాలు వడ్లమూడి పద్మలత, మంగళగిరి జడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య, దొండపాడు ఎంపీటీసీ గిరిజ, తాడికొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు బెల్లంకొండ వెంకట నరసింహారావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చరల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ జానకిరామమూర్తి, వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావులతో పాటు వివిధ వర్గాలకు చెందిన మొత్తం 12మందితో ఈ సలహా సంఘం ఏర్పాటైంది. దీనికి అధ్యక్షుడిగా ఎస్‌ఆర్‌ఎం అమరావతి క్యాంపస్‌ ప్రో వైస్‌ చాన్స్‌లర్‌ డి.నారాయణరావు, ప్రత్యేక ఆహ్వానితురాలిగా విజయవాడ మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య నియమితులయ్యారు. కన్వీనర్‌గా సీఆర్డీయే స్ట్రాటజీ విభాగం డైరెక్టర్‌ జేఎస్సార్కే శాస్త్రి వ్యవహరించనున్నారు.
 
విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఈ కమిటీ ప్రప్రథమ భేటీలో తొలుత శాస్త్రి దీని ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యాలను వివరించారు. అనంతరం ప్రసంగించిన కమిటీ సభ్యులు అమరావతికి భూములిచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అలా చేస్తేనే రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశిస్తున్న విధంగా మరింత చురుగ్గా సాగుతుందని పేర్కొన్నారు. అమరావతి రూపకల్పన ప్రక్రియ మొదలై దాదాపు నాలుగేళ్లవుతున్నప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోవడం శోచనీయమంటూ వాటిని ఏకరువు పెట్టారు. ప్రతిదానికీ నిర్దిష్ట కాలవ్యవధిని నిర్ణయించి, ఆ లోపునే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
 
ఇదీ.. సమస్యల జాబితా..
  • గ్రామకంఠాల గుర్తింపునకు సంబంధించి సీఆర్డీయేకు అందిన వినతులన్నింటినీ సత్వరమే పరిష్కరించాలి.
  • సర్వే వివాదాలు, కోర్టు కేసుల్లో ఉన్న భూవివాదాల పరిష్కారానికి చర్యలు గైకొనాలి.
  • వీధి పోట్లుండే రిటర్నబుల్‌ ప్లాట్లను పొందిన రైతుల అభ్యర్థనలను మన్నించి, వాటిని వెంటనే మార్చాలి.
  • శ్మశానాలు, న్యాయస్థానాల్లో ఉన్న భూముల్లో ప్లాట్లు వచ్చిన రైతులు వాటిని అమ్ముకోలేకపోతుండడాన్ని దృష్టిలో ఉంచు కుని వారికి ప్రత్యామ్నాయ స్థలాలను కేటా యించాలి.
  • లంకభూములు, చెరువులు, పోరంబోకులు, అస్సైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలి.
  • భూసమీకరణ సమయంలో రాజధాని గ్రామాలను కూడా అమరావతికి దీటుగా అభివృద్ధి పరుస్తామని ఇచ్చిన వాగ్దానాల అమలుకు చర్యలు తీసుకోవాలి.
  • రాజధానిలోని ప్రతి గ్రామంలోనూ సకల సదుపాయాలతో కూడిన ఆరోగ్య ఉపకేంద్రాలను నెలకొల్పడంతోపాటు వాటిల్లో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలి.
  • ప్రతి రాజధాని గ్రామంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటు విద్యాలయాలకు దీటుగా మెరుగు పరచాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసేలోగా ఈ పనిని పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరంకల్లా అమరావతిలోని ప్రభుత్వ విద్యాలయాలన్నీ అన్ని వసతులతో అలరారేలా చూడాలి.
  • భూములిచ్చిన గ్రామాల్లో విద్యావంతులను గుర్తించి, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇప్పించి, రాజధానిలో ఏర్పాటయ్యే సంస్థలతోపాటు సెక్రటేరియట్‌లో ఉద్యోగావకాశాలు కల్పించాలి.
  • రాజధాని గ్రామాల్లోని వ్యవసాయ కార్మికులు, మహిళలకు మెరుగైన ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలి. వారిలో ఎవరన్నా స్వయంఉపాధి కోసం స్వంతంగా యూనిట్లను స్థాపించుకోదలిస్తే అందుకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతోపాటు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని, శిక్షణను ఇవ్వాలి. అక్కడ తయారయ్యే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కూడా కల్పించాలి.
  • అమరావతిలో ఏర్పాటయ్యే అన్ని సంస్థల్లోనూ కొన్ని ఉద్యోగాలను స్థానికుల కోసం కేటాయించాలి.
  • రాజధానిలో అంతకంతకూ పెరుగుతున్న భారీ వాహనాల రాకపోకల కారణంగా తుళ్లూరు, ఎర్రబాలెం తదితర గ్రామాల్లో ఏర్పడుతున్న కాలుష్యం, ఇతర సమస్యలు, ప్రమాదాలను నిరోధించేందుకుగాను అవి తిరిగేందుకు సీఆర్డీయే వెంటనే ప్రత్యామ్నాయ రహదారులను నిర్మించాలి.
Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
25-07-2018 09:23:41
 
636681074202718721.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న రోడ్ల పురోగతిని మంత్రి పరిశీలించారు. మరింత వేగంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆల్ ఇండియా సర్వీసెస్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. డిసెంబర్‌ 31 నాటికి క్వార్టర్స్‌ నిర్మాణాలు పూర్తిచేస్తామని తెలిపారు. రాజధానిలో ఇటుక పడలేదని విమర్శలు అర్ధరహితమని మంత్రి నారాయణ మండిపడ్డారు.
Link to comment
Share on other sites

చంద్రబాబు వెంటే ఉంటామంటున్న రాజధాని రైతులు
25-07-2018 09:54:32
 
636681092714504503.jpg
అమరావతి: రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసే శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. రాజధాని ఫలాలు అందుకునే మొదటి లబ్ధిదారులు రైతులేనని.. అమరావతి అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసి, లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఉండ వల్లిలోని ప్రజావేదిక వద్దకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన రాజధాని ప్రాంత రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రశాంత సరోవరంలో రాళ్లు వేసినట్లు కొందరు రాజధాని రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. చేతనైతే తమతో కలిసి రావాలని కోరారు.
 
రాజధాని నిర్మా ణానికి దాదాపు రూ.50 వేల కోట్లతో ఇప్పటికే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టామని గుర్తుచేశారు. తనపై విశ్వాసంతో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు ఆయనతో మాట్లాడుతూ.. ‘మేం ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాం. ఈ ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం. మీపై విశ్వాసంతో.. స్వచ్ఛందంగానే రాజధానికి భూములిచ్చాం. ఇందులో ఎవరి ఒత్తిడి, బలవంతం లేదు. కొన్ని శక్తులు పనిగట్టుకుని ఇక్కడకు వచ్చి రెచ్చగొడుతున్నాయి. మేం భూ యజమానులం. రాజధాని నిర్మాణానికి మా భూములు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. భూసమీకరణ కింద స్వచ్ఛందంగానే అప్పగించాం. మా భూముల్లో రాజధాని నిర్మించడం మాకు గర్వంగా ఉంది. మరో పదేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలనేది మా ఆకాంక్ష’ అని అన్నారు.
 
కాగా.. ప్రతి పేదవాడికి రుచిగా శుచిగా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు తమకెంతో స్ఫూర్తినిస్తున్నాయని వారు తెలిపారు. వాటి నిర్వహణకు తమ వంతుగా రూ.3,32,500 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా.. ముఖ్యమంత్రి ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారని, ఈ దశలో ప్రభుత్వానికి తాము అండగా నిలవాలని నిశ్చయించామని, అందుకే అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళమిచ్చామని చెప్పారు. ఎలాంటి ఖర్చులేకుండా రక్తసంబందీకులకు రిజిస్ట్రేషన్‌ చేసి, కౌలు కొనసాగిస్తూ చట్టబద్ధత కల్పించాలని, తమకిచ్చిన ప్లాట్లలో రోడ్లు వేగంగా వేసేటట్లు చూడాలని రైతులు ఆయన్ను కోరారు.
Link to comment
Share on other sites

CRDA housing projects progressing rapidly
CRDA housing projects progressing rapidly

CRDA housing projects progressing rapidly

Tuesday, Jul 24, 2018
In a CRDA review meeting held at the Secretariat, the Chief Minister said that the progress of the housing projects should not be hampered because of the rainy season, and should be completed as per schedule.

He directed contractors to carry out the construction works even during the night time if necessary, to prevent delay in completion of the project. He said that the housing projects should be completed as per schedule, by December.

The Chief Minister also asked the contractors to speed up the works and said that he wants to see visible development in the project. He also asked them to come up with an action plan for the completion of the project.

Addressing the gathering, CM said that once there is visible development in the capital city, it would attract more investments by increasing the confidence of investors from all over the world.

The progress report of construction works of the All India Service Officers housing showed completion of six floors in the first tower. In the MLAs housing, the 1st floor has been completed in two towers. In NGOs housing 3rd, 4th, 5th floors have been completed in the 1st tower and silt slab concrete works have been completed for the Gazetted Officers housing project.

The access road has been completed for the Judicial Complex and site survey and clearance works have been completed for the Secretariat site.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...