Jump to content

Amaravati

Recommended Posts

రాజధాని రహదారుల నిర్మాణంలో వేగం పెంచాలి
17-07-2018 09:10:31
 
తుళ్లూరు/అమరావతి: రాజధాని నిర్మాణాలలో మరింత వేగం పెంచాలని ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి ఆయా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. రాజధానిలో ఏర్పాటవుతున్న రహదారులను సోమవారం ఇంజనీరింగ్‌ అధికారులతో కలసి ఆమె పరిశీలించారు. ఎన్‌-16 , ఇ-4, ఇ6, ఇ8, ఇ3 రహదారుల పురోగతిని సమీక్షించారు. వీటి నిర్మాణాలు ఆశించిన స్థాయిలోనే జరుగుతున్నాయన్నారు. వర్షాలు పడుతున్నా పనుల్లో అలసత్వం చూపవద్దన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని పనులు ఆగకుండా చూడాలన్నారు. డిసెంబర్‌ నాటికి నిర్థేశించిన లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీసీ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతంలో అత్యాధునిక జంతుప్రదర్శనశాల 
మంత్రి శిద్ధా రాఘవరావు

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతంలో  అత్యాధునిక జంతుప్రదర్శన శాలను ఏర్పాటుచేయనున్నట్లు అటవీశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాజధాని అమరావతికి చేరువలోని వివిధ రక్షిత అటవీ ప్రాంతాలను పరిశీలించిన సాంకేతిక బృందం.. కొండపల్లిని అనువైన ప్రాంతంగా ఎంపిక చేసిందని ఆయన వెల్లడించారు. ఇదే ప్రాంతంలో జంగిల్‌ సఫారీ, రకరకాల వృక్ష జాతులతో బొటానికల్‌ గార్డెన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో పర్యావరణ పర్యాటకానికి పెద్దపీట వేస్తామన్నారు. జంతు ప్రదర్శన శాల అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం రూ.10కోట్లు విడుదల చేసిందని..సంబంధిత ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించానన్నారు. 11వ విడతలో 1083 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా 26కోట్ల మొక్కలు నాటనున్నామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు అటవీశాఖ సిబ్బంది కోసం 125 రివాల్వర్లను కొనుగోలు చేయనున్నమన్నారు.

Link to comment
Share on other sites

చంద్రబాబు చెప్పిన విషయం విని.. ఆశ్చర్యపోయిన ఉన్నతాధికారులు...
17-07-2018 12:52:45
 
636674287656376205.jpg
 
విజయవాడ: సింగపూర్ రహస్యం ఇప్పుడు ఆంధ్రపదేశ్ అధికార యంత్రాంగాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ బ్యాంక్ రుణం కోసం సీఆర్డీయే చేసిన దరఖాస్తు... రుణం మంజూరులో జాప్యం వెనుక ఉన్న అసలు కథను ముఖ్యమంత్రే చెప్పడంతో ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. అసలు సింగపూర్‌లో ఏం జరిగింది?
 
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలకు రైతులు సహకరించినప్పటికీ, రుణం మంజూరులో వెళుతున్న ఫిర్యాదులు ప్రతిబంధకంగా మారాయి. రాజధాని అమరావతిలో పది ప్రాధాన్యతా రహదారులు, రాజధాని ముంపు నివారణ కోసం సి.ఆర్.డి.ఎ.. ప్రపంచ బ్యాంకుకు రుణం కోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తును పరిశీలించిన ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ ఈ లోపు ప్రతిపక్షాల నుంచి రాజధానిలోని కొంతమంది రైతుల నుంచి ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు వెళ్లాయి. పచ్చని పంట పొలాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో పర్యావరణం దెబ్బతింటుందని, సంవత్సరానికి మూడు పంటలు పండే భూములు ఇవ్వడం వల్ల ఆహారభద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఫిర్యాదులు చేయడంతో ప్రపంచ బ్యాంకు వీటిని తీవ్రంగా పరిణగణించింది. ఇన్స్ పెక్షన్ ప్యానల్‌కు ఈ ఫిర్యాదులను పంపింది. ఇన్స్ ఫెక్షన్ ప్యానల్ ఇటీవల అమరావతిలో పర్యటించి ఫిర్యాదు చేసిన వారిని పిలిపించి మాట్లాడి వారికున్న అభ్యంతరాలను రాతపూర్వకంగా సేకరించింది. అయితే ఊరు, పేరు లేనివారు కొంతమంది ఫిర్యాదు చేయడం, మరికొంతమంది తప్పుడు పేర్లతో ఫిర్యాదులు చేయడంతో వారి కోసం ప్రపంచ బ్యాంకు అధికారులు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇక బ్యాంకు రుణం మంజూరు చేసేందుకు ఆరుసార్లు ప్రపంచ బ్యాంకు బృందానికి చెందిన పదిహేను మంది అధికారులు అమరావతి వచ్చి రైతులతోనూ, అధికారులతోనూ మాట్లాడి అప్రైజల్ రిపోర్టును అందించారు.
 
ఇటీవల చంద్రబాబు సింగపూర్ వెళ్లినప్పుడు ప్రపంచబ్యాంక్ ఉపాధ్యక్షుడితో సీఎం సమావేశం అయ్యారు. రుణం మంజూరులో జాప్యం వెనుక అసలు విషయాన్ని ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడు చంద్రబాబుకు సోదాహరణంగా వివరించారు. రుణం మంజూరు సమయంలో ప్రపంచ బ్యాంకుకు కొన్ని నిర్దేశిత ప్రమాణాలు ఉంటాయని, వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామని చెప్పారు. ఆ విధంగా రాజధాని భూములపై వచ్చిన పిర్యాదులను పరిశీలిస్తే.. అవన్నీ పూర్తిగా అవాస్తవం అని తేలిందని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి కూడా దాదాపుగా 97శాతం మంది రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారని, 33వేల ఎకరాలను బలవంతంగా లాక్కుంటే శాంతిభద్రతల సమస్యలు తలెత్తవా అని ప్రపంచ బ్యాంకు వైస్ ఛైర్మన్‌ను ప్రశ్నించారు.
 
రుణం మంజూరు సమయంలో ప్రపంచ బ్యాంకు ఇన్స్ ఫెక్షన్ ప్యానల్ ఫిర్యాదులన్నింటినీ కూడా ఇప్పటికే క్లియర్ చేసిందని, అప్రైజల్ రిపోర్టు కూడా సిద్దంగా ఉందని, ఆయన చంద్రబాబుకు వివరించారు. అప్రైజల్ రిపోర్టును ఒక్కసారి ప్రపంచ బ్యాంకు పరిగణలోకి తీసుకుని సెప్టెంబర్ కల్లా 4వేల 576కోట్లు (715మిలియన్ల యూ.యస్. డాలర్లు) మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణానికి ముందే అందులో ముప్పై శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం, లేదా సి.ఆర్.డి.ఎ నిధులు విడుదల చేసి నిర్మాణాలు చేపట్టవచ్చని నిబంధన ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే రహదారుల నిర్మాణాన్ని చేపట్టింది.
 
ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడు చెప్పిన ఈ విషయాలను చంద్రబాబు ఉన్నతాధికారులకు వివరించడంతో వారంతా ఆశ్చర్యపోయారు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేస్తుందని తెలుసుకున్న కొంతమంది ఈ ఫిర్యాదులను ఉద్దేశపూర్వకంగా ఎక్కువుగా పంపుతున్నారని, గత నెల రోజుల్లోనే ఎక్కువ ఫిర్యాదులు వెళ్లాయని కూడా సీఎం వివరించారు. అయితే ప్రపంచ బ్యాంకు వాస్తవంగా ఉన్న ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఎటువంటి ఆధారాలు, ప్రామాణికత లేకుండా చేస్తున్న ఫిర్యాదులను పక్కన పెట్టేయడం ప్రారంభించిందని, సెప్టెంబర్ నాటికి రుణం మంజూరు అవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సి.ఆర్.డి.ఎ కమిషనర్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్‌కు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సీఎం సూచనలు జారీ చేశారు..
Link to comment
Share on other sites

అమరావతికి రుణం కోసం తొమ్మిది నెలలు..!

ఆ తర్వాత మంజూరు చేస్తామని ప్రపంచబ్యాంకు ప్యానల్‌ నిర్ణయం

0626341705BRK132-BANKC.JPG

హైదరాబాద్‌: నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి నిర్మాణం వల్ల ప్రజా జీవనానికి, పర్యావరణానికి ముప్పు ఏదైనా ఉందా? ఉంటే ఎలాంటి ముప్పు? అనే అంశంపై విచారణ జరిపేందుకు తొమ్మిది నెలల పాటు వేచి చూస్తామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రపంచబ్యాంకు ప్యానెల్‌ వెల్లడించింది. అమరావతి నిర్మాణానికి అవస్థాపనా సౌకర్యాలు కల్పించేందుకు ప్రపంచ బ్యాంకును కేంద్ర, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు రుణాన్ని మంజూరు చేయాల్సిందిగా కోరగా, ఏషియన్‌ ఇన్‌ఫ్రా'స్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు(ఏఐఐబీ)తో కలిసి 300 మిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.

ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం వల్ల ప్రజా జీవనానికి ఇబ్బంది ఏర్పడుతుందని, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కొందరు వ్యక్తులు ప్రపంచబ్యాంకు తనిఖీ బృందానికి లేఖరాశారు. అంతేకాదు, నవ్యాంధ్రలో పర్యటించి స్వయంగా ఆ విషయాన్ని తెలుసుకోవాలని కోరారు. దీంతో ఉన్నతాధికారుల చర్చల అనంతరం బ్యాంకు ఒక నిర్ణయానికి వచ్చింది.

‘‘రుణ మంజూరు నిబంధనలు 1999 అకౌంట్‌ పేరాగ్రాఫ్‌ 5 ప్రకారం మరో తొమ్మిది నెలల పాటు వేచి చూడాలని బ్యాంకు మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో విచారణ అవసరమా? కాదా? అన్న విషయంపై ప్రపంచబ్యాంకు ప్యానల్‌ ఒక నిర్ణయానికి రానుంది. ఇందుకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఒప్పుకొంటే తనిఖీ బృందం అమరావతిలో పర్యటిస్తుంది.’’ అని తనిఖీ బృందం జులై 13న ప్రపంచబ్యాంకు బోర్డుకు నివేదిక సమర్పించింది.

గత ఏడాది సెప్టెంబరు నెలలో ప్రపంచబ్యాంకు తనిఖీ బృందం అమరావతిలో పర్యటించింది. రాజధాని నిర్మాణం కోసం బలవంతంగా భూములు లాక్కొన్నారని ఆరోపణలు చేసిన రైతులను కలిసి వివరాలు సేకరించింది. అంతేకాకుండా, అసెంబ్లీతో సహా, రాజధాని నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించింది. అనంతరం సెప్టెంబరు 27, 2017న తన నివేదిక, ప్రతిపాదనలను ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్స్‌కు సమర్పించింది.

అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చే అంశాన్ని ఆరు నెలల తర్వాతే తేలుస్తామని ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు స్పష్టం చేసింది. ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సహాయ పునరావాస ప్యాకేజీని అమలు చేయాలని కోరింది. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని జరగదని, స్థానికుల జీవనోపాధికి విఘాతం కలగదని, ఆహార భద్రతకు ముప్పు రాదని తేలితే... ఆరు నెలల తర్వాత రుణం మంజూరు గురించి నిర్ణయం తీసుకుంటామంది. కాగా, ఇప్పుడు మరో తొమ్మిది నెలల పాటు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

lite adi

Link to comment
Share on other sites

Ayina lands ivvani farmers ki endhuku antha jila.

This pichhi dxx Alla too much he wants to stop capital coming near mangalagiri, evaranna thama area (or) district lo capital vasthe baagutundi anukuntaaru ee idiot maatram raakudadu ani Jaffa Jagan order vesaadani sontha praanthaaniki anyayam chesthunnadu.

Malli capital valla ekkuvaga benefit ayyindi ee MLA batch ee.

Link to comment
Share on other sites

17 hours ago, sonykongara said:

lite adi

Picha na pushpalla vunnaru ga ee World bank vallu kooda. Ee sodhantha lekunda babu garu aa local bonds and NRI bonds evo release chesthe oka 7-8% interest tho, evadu appudu ivvakkaraledhu.

Link to comment
Share on other sites

సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష
18-07-2018 17:37:33
 
636675322541864020.jpg
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రైవేటు అభివృద్ధిపై త్వరలో నూతన విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. అమరావతిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన రూ.26వేల కోట్ల నిధులను ఎలా సమకూర్చాలన్నదానిపై చర్చించారు. రాజధానిలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు మహీంద్రా కంపెనీ ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. ఈహెచ్‌వీ లైన్ల రీరూటింగ్‌ కోసం చెట్లను నరికివేయొద్దని అధికారులకు సూచించారు. డీఏవీ, భారతీయ విద్యాభవన్‌కు 3 ఎకరాల చొప్పున స్థలం కేటాయించినట్లు సీఎం తెలిపారు.
Link to comment
Share on other sites

Sony bro, రాజధానిలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు మహీంద్రా కంపెనీ ముందుకొచ్చిందని సీఎం తెలిపారు

Idi mostly sattenapalli daggara "railway track" pakkana govt lands lo anukuntunna...I may be wrong but guessing....

One main reason CBN going super fast on Vykuntapuram-NSP right merge is 1) prakasam&sattenapalli industiral belt will get life...right now there is only land but no water....

Link to comment
Share on other sites

సాయమందితే జలఫలం! 
గోదావరి పెన్నా అనుసంధానానికి ప్రభుత్వ రుణ ప్రయత్నం? 
దక్షిణ కొరియా నుంచి తీసుకునే యోచన 
దీంతో పాటు సీఆర్‌డీఏ, గెయిల్‌ ప్రాజెక్టులకూ... 
ఈనాడు - అమరావతి 
17ap-main2a.jpg

గోదావరి పెన్నా అనుసంధానంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి దక్షిణ కొరియా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైన నేపథ్యంలో అటు కేంద్రం సాయం ఆశిస్తోంది. దక్షిణ కొరియా ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులను రుణంగా సమకూర్చేందుకు సిద్ధంగా ఉండగా ఆ నిధిని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగు పనుల్లో అనుభవం ఉన్న ఆ దేశానికి చెందిన ఓ కంపెనీ కూడా ఈ అంశాల్లో ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఆ దేశం నుంచి రుణం పొందేందుకు రాష్ట్రం మొత్తం మూడు ప్రాజెక్టులను ప్రతిపాదిస్తోంది. అమరావతి నగర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు ఒకటి,  కాకినాడ వద్ద గెయిల్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సంయుక్త ప్రాజెక్టుతో పాటు గోదావరి పెన్నా అనుసంధానాన్ని అందులో చేర్చారు. ఈ మూడు ప్రతిపాదనలకు సంబంధించి దక్షిణ కొరియా నుంచి రుణం కోసం ప్రయత్నిస్తున్నారు.ఈడీబీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులకు పెట్టుబడులు సాధించే ప్రయత్నాలు సాగుతున్నాయి.

Link to comment
Share on other sites

2 minutes ago, AnnaGaru said:

Sony bro, రాజధానిలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు మహీంద్రా కంపెనీ ముందుకొచ్చిందని సీఎం తెలిపారు

Idi mostly sattenapalli daggara "railway track" pakkana govt lands lo anukuntunna...I may be wrong but guessing....

One main reason CBN going super fast on Vykuntapuram-NSP right merge is 1) prakasam&sattenapalli industiral belt will get life...right now there is only land but no water....

lands unnaya bro akkada

Link to comment
Share on other sites

3 minutes ago, AnnaGaru said:

Sony bro, రాజధానిలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు మహీంద్రా కంపెనీ ముందుకొచ్చిందని సీఎం తెలిపారు

Idi mostly sattenapalli daggara "railway track" pakkana govt lands lo anukuntunna...I may be wrong but guessing....

One main reason CBN going super fast on Vykuntapuram-NSP right merge is 1) prakasam&sattenapalli industiral belt will get life...right now there is only land but no water....

outer ringroad plan daggara vasthundi anukutunna 5000 acres daka adigaru anukunta

Link to comment
Share on other sites

7 minutes ago, sonykongara said:

outer ringroad plan daggara vasthundi anukutunna 5000 acres daka adigaru anukunta

between Sateenapalli-Madipadu road and pulichintala hills govt lands(20K undi)...piduguralla,rajuplaem avi touch avutai...

anni pakkalaki railway track unnai ...GOdavari water vaste a area "the best for industry"

manam chusina worst dry areas in coastal districts ki good times vastunani "vyjuntapuram-nsp right project tho".......benefits of this project are endless....

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

On 7/5/2018 at 3:37 PM, baabuu said:

thanks babai.. 
kaani nenu pettina Chinmaya vidyalaya ledu nee list lo... ? 
ivi ganuka vasthe 
janalu lagethhuku raatame , inka education ledu ante tantharu.. 
Delhi public school works are going fine (near Tadikonda X road electric Substation)

Amaravati to have world-class integrated industrial parks
Amaravati to have world-class integrated industrial parks

Amaravati to have world-class integrated industrial parks

Wednesday, Jul 18, 2018
Addressing a review meeting of the Capital Region Development Authority (CRDA)at secretariat today, the Chief Minister said that private partnership should be encouraged for affordable housing, commercial complexes, businesses, IT parks, tourism and infrastructure. He asked officials to prepare a draft policy to attract private participation and to create an best ecosystem in capital development.

In the review meeting, officials informed the Chief Minister about the land lease system, joint venture, joint development, private and public partnership project options. They said that they are formulating the private partnership policy with offers provided by noted private partners like DLF, Shobha, Prestige, Myhome, Shapoonji Palloji, Aparna, Radian, S. Urban, GVK, RMZ and NSL. The Chief Minister asked the officials to prepare a policy to make Amaravati a hub of mixed economic activity.

CM said that the projects should meet international standards in innovation and technology. He also told the officials that students should be involved in structural designs of Amaravati and their innovative ideas should be considered.

The officials informed the Chief Minister about world-class integrated industrial parks proposals. They added that the Mahindra group has put forward a proposal to develop an industrial park in Amaravati. The officials also informed CM about proposals of Chinmaya Mission, DAV and Bharatiya Vidya Bhavan schools to be set up in Amaravati.
Link to comment
Share on other sites

అమరావతిలో.. ప్రైవేట్‌ భాగస్వామ్యం
19-07-2018 09:52:01
 
636675907227147022.jpg
  • సంపద సృష్టిలో కీలకపాత్ర పోషించేలా పాలసీ
  • నిర్మాణాల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థుల భాగస్వామ్యం
  • సీఆర్డీయే సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
అమరావతి: ఆర్థిక, సామాజికాభివృద్ధితోపాటు రాజధాని అమరావతిలో సంపద సృష్టిలో ప్రైవేట్‌ సంస్థలు కీలకపాత్ర పోషించేలా పకడ్బందీ విధానాన్ని రూపొందించాలని సీఆర్డీయేను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఏపీసీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో రాజధాని పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అమరావతిలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ఏఏ రంగాల్లో, ఏ ప్రాతిపదికన అనుమతించాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ సంస్థల ఎంపికలో బ్రాండ్‌ ఇమేజ్‌, అనుభవం, అవి కల్పించే ఉద్యోగావకాశాలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పర్యాటకం, ఐటీ పార్కులు, ఉపాధి కల్పన ఇలా సమ్మిళితంగా అమరావతి మిశ్రమ ఆర్థిక కార్యకలాపాలతో ముందుకెళ్లాలన్నారు. స్థిరాస్తి రంగాభివృద్ధిలో సంప్రదాయక లీజు విధానాలు.. విక్రయాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల పద్ధతిలో జాయింట్‌ వెంచర్‌, జాయింట్‌ డెవలప్‌మెంట్‌, పీపీపీ విధానాలపై అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.
 
డీఎల్‌ఎఫ్‌, శోభా, ప్రెస్టీజ్‌, మై హోం, షాపూర్జీ పల్లోంజీ, అపర్ణ, రాడియన్‌, ఏస్‌- అర్బన్‌, జీవీకే, ఆర్‌ఎంజెడ్‌, ఎన్‌ఎస్‌ఎల్‌ తదితర ప్రఖ్యాత సంస్థలు, డెవలపర్ల నుంచి అందిన సలహాలు, సూచనలతో ప్రైవేట్‌ భాగస్వామ్య విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రియల్‌ పార్కును అభివృద్ధి చేయడంతోపాటు నిర్వహణకు మహీంద్రా గ్రూప్‌ ముందుకు వచ్చిందని చెప్పారు. అమరావతిలో చేపట్టే ప్రతి నిర్మాణమూ అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో, అంతర్జాతీయస్థాయిలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. స్ట్రక్చరల్‌ డిజైన్లలో ఇంజినీరింగ్‌ విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా వారు ఇచ్చే సలహాలు, సూచనల్లో అనుసరణీయమైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఫలితంగా రాజధాని నిర్మాణంలో పాలుపంచుకున్నామన్న సంతృప్తిని వారికి కలిగించాల్సిందిగా ఆదేశించారు.
 
నిధుల సమీకరణ ఎలా?
రాజధాని ప్రాజెక్టులకు అవసరమైన సుమారు రూ.26,000 కోట్లను ఏ విధంగా సమకూర్చుకోవాలన్న అంశంపైనా సమావేశంలో చర్చించారు. కొన్ని ప్రతిపాదనలను అఽధికారులు సీఎం ముందు ఉంచారు. హైటెన్షన్‌ తీగల మళ్లింపు కోసం రాజధాని ప్రాంతంలో కొన్ని చెట్లను తొలగించాల్సి వస్తుందని సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ చెప్పగా.. వాటిని ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విధానంలో ఇతర ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. రాజధానిలో 60 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేయనున్న జలమార్గంపై అసెంబ్లీ భవంతికి సమీపంలో నిర్మించబోయే ఎలివేటెడ్‌ రహదారికి 3 వంతెనలను నిర్మించాలని సూచించారు.
 
విద్యాసంస్థలకు స్థలాలు
అమరావతిలో డీఏవీ, భారతీయ విద్యాభవన్‌ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడానికి రాజధాని రైతులు రెండు బృందాలుగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలుపగా.. 3 ఎకరాల చొప్పున స్థలం కేటాయించాలని సీఎం ఆదేశించారు. చిన్మయ విద్యాసంస్థ ముందుకు వచ్చిందని శ్రీధర్‌ చెప్పారు. భవనాలు నిర్మించి అప్పగిస్తే వాటిల్లో పాఠశాలను ఏర్పాటు చేసేందుకు డీఏవీ స్కూల్‌ సుముఖంగా ఉందన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...