Jump to content

Amaravati


Recommended Posts

ర్మాణ కేంద్రంగా నవ్యాంధ్ర
03-07-2018 02:38:43
 
636661823219212100.jpg
  • స్థానిక-సింగపూర్‌ బిల్డర్ల కలయిక
  • రాష్ట్రంలో ‘కన్‌స్ట్రక్షన్‌ పార్కులు’.. సకల సామగ్రి తయారు
  • 8న బిల్డర్లతో కలిసి సింగపూర్‌కు సీఎం
  • అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసంగం.. పెట్టుబడులకు ఆహ్వానం
అమరావతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): నిర్మాణ రంగానికి నవ్యాంధ్రను చిరునామాగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. నూతన రాజధాని నిర్మాణం, 17 పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా మార్చాలన్న లక్ష్యం, వాణిజ్య, నివాస అవసరాలకు పెరుగుతున్న డిమాండ్‌... వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్రంలో నిర్మాణ రంగానికి అవకాశాలు భారీగా పెరిగాయి. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకునే దిశగా ఈ రంగాన్ని మలచాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీనికోసం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పెద్ద బిల్డర్ల స్థాయి పెంచడంతోపాటు నిర్మాణ రంగానికి అవసరమయ్యే ప్రతి సామగ్రిని రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణ రంగంలో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఆయన ఈ నెల 8, 9 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొంటారు. పెట్టుబడిదారులతో భేటీ అవుతారు. సింగపూర్‌కు మంత్రులతోనూ సమావేశమవుతారు. అక్కడ 8వ తేదీన ప్రపంచ మేయర్ల సదస్సు జరగనుంది. నివాస అనుకూల, సుస్థిర నగరాలు అనేఅంశంపై సీఎం ప్రసంగిస్తారు. అమరావతి గురించి, ఇక్కడ ఉన్న అవకాశాల గురించి వివరిస్తారు. 9వ తేదీన జరిగే ‘వరల్డ్‌ సిటీస్‌’ సదస్సులో ప్యానల్‌ డిస్కషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
 
రాష్ట్రంలో కన్‌స్ట్రక్షన్‌ పార్కులు
ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రంలోని 20-25మంది బిల్డర్ల బృందం కూడా సింగపూర్‌ వెళ్లనుంది. నిర్మాణ రంగంలో వచ్చిన తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తుంది. అదే సమయంలో సింగపూర్‌ బిల్డర్లతో కలిసి రాష్ట్రంలో నిర్మాణరంగ ప్రాజెక్టులు చేసేందుకు ఈ పర్యటన ఉపకరిస్తుందని భావిస్తున్నారు. నిర్మాణ రంగంలో వాడే సిమెంటు, డోర్లు, శానిటరీ, టైల్స్‌, ఎలక్ర్టికల్‌, అలంకరణ వస్తువులు... ఇలాంటివన్నీ ఒకేచోట తయారయ్యేలా చూడాలని సీఎం భావిస్తున్నారు. అమరావతి, ఒంగోలు తదితర చోట్ల ఈ కన్‌స్ట్రక్షన్‌ పార్కులను పెట్టాలని యోచిస్తున్నారు. వీటిలో పెట్టుబడులు పెట్టేవారిని సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆహ్వానించనున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని బిల్డర్లు కూడా చైనానుంచి నిర్మాణ సామాగ్రి తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా రాష్ట్రంలోనే ఆయా సామగ్రి ఉత్పత్తి అయ్యేలా చేయడం, రాష్ట్ర అవసరాల కోసమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసే స్థాయిలో ఈ పార్కులను నెలకొల్పాలని ప్రణాళిక రూపొందించారు.
 
రాష్ట్రానికి జపాన్‌ ‘లిక్సిల్‌’
ఇప్పటికే నిర్మాణరంగంలో ఉపయోగపడే సామాగ్రిని తయారుచేసే కొన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. జపాన్‌కు చెందిన శానిటరీ వేర్‌ తయారీ సంస్థ ‘లిక్సిల్‌’ రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించిందని ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్‌ తెలిపారు. సెయింట్‌ గోబిన్‌ సంస్థ విశాఖపట్నంలో రూ.2వేల కోట్లతో ప్లాంటు పెట్టనుందన్నారు. హింద్‌వేర్‌ శానిటరీ కంపెనీ కూడా రాష్ట్రానికి రానుందన్నారు. సింగపూర్‌ పర్యటనలో మరింతమంది పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆకర్షించే లక్ష్యంతో ఉన్నామన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 10వ తేదీ ఉదయం తిరిగి అమరావతికి వస్తారు. ఆయన వెంట వెళ్లిన బిల్డర్ల బృందం మాత్రం 10వ తేదీన కూడా అక్కడే ఉంటుంది.
Link to comment
Share on other sites

అమరావతి సిటిజెన్‌ స్మార్ట్‌ కార్డు
అన్ని చెల్లింపులు, సేవలు ఆ కార్డుతోనే
వివిధ పత్రాలూ నిక్షిప్తం
రాజధాని పౌరుల కోసం ప్రత్యేకం
రూపొందిస్తున్న సీఆర్‌డీఏ
రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం

ఈనాడు, అమరావతి: మీరు కరెంటు బిల్లు కట్టాలన్నా... బస్‌ టిక్కెట్‌ తీసుకోవాలన్నా... షాపింగ్‌ చేయాలనుకున్నా... ఎక్కడా నగదు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఆ కార్డు ఉంటే చాలు. మీ డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌ కార్డు, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డులు వంటివేవీ వెంటబెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. అదే కార్డులో ఆ పత్రాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన చోట ఆ కార్డుని స్వైప్‌ చేస్తే చాలు...! అదే రాజధాని పౌరుల కోసం సీఆర్‌డీఏ రూపొందిస్తున్న ‘అమరావతి సిటిజెన్‌ స్మార్ట్‌కార్డు’.  ఒకే కార్డు ద్వారా బహుముఖ సేవలు పొందే అవకాశం (సింగిల్‌ స్టాప్‌ సొల్యూషన్‌) కల్పించడం దీని ముఖ్యోద్దేశం.

ఈ కార్డుతో పాటు ‘అమరావతి ఆల్‌-ఇన్‌-వన్‌ సిటిజెన్‌ సర్వీసెస్‌ మొబైల్‌ యాప్‌’ను కూడా సీఆర్‌డీఏ అభివృద్ధి చేస్తోంది. వివిధ చెల్లింపులకు, ప్రభుత్వ సేవలకు స్మార్ట్‌ కార్డు వాడాల్సిన అవసరం లేకుండా, ఉన్న చోటు నుంచే పనులు చక్కబెట్టుకునేందుకు ఈ యాప్‌ తోడ్పడుతుంది. కార్డులో లేని మరిన్ని అదనపు సదుపాయాలు యాప్‌లో ఉంటాయి. అమరావతి స్మార్ట్‌ కార్డుని బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేస్తారు. బ్యాంకు ఖాతా లేనివారు... దీన్ని ప్రీ పెయిడ్‌ డెబిట్‌ కార్డులా వినియోగించుకోవచ్చు. దీర్ఘకాలిక భాగస్వామ్యం కోసం ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులతో సీఆర్‌డీఏ సంప్రదింపులు జరుపుతోంది.

ఏఎస్‌ఎస్‌సీసీఎల్‌ ఆధ్వర్యంలో
యూనిఫైడ్‌ పేమెంట్‌ సొల్యూషన్‌ (యూపీఐ) సేవలతో అమరావతి స్మార్ట్‌ కార్డుని, యాప్‌ని మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వివిధ సర్టిఫికెట్లు, పత్రాల్ని కార్డులో నిక్షిప్తం చేయడం వంటి ప్రక్రియల్ని పూర్తి చేసేందుకు మరో ఐదారు నెలల సమయం పడుతుందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. రాజధాని గ్రామాల్లో నివసించే ప్రజలకు మొదట ఈ కార్డులు అందుబాటులోకి తెస్తారు. అమరావతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు నెలకొల్పిన అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌ఎస్‌సీసీఎల్‌) ఆధ్వర్యంలో సీఆర్‌డీఏ ఈ కార్యక్రమాలు చేపడుతోంది.

ఆ యాప్‌తో అన్ని సేవలూ..
స్మార్ట్‌కార్డుకి అనుబంధంగా రూపొందించే యాప్‌తోనూ అన్ని రకాల చెల్లింపులు జరపవచ్చు. దాంతో పాటు మరిన్ని అదనపు సదుపాయాలు ఈ యాప్‌లో కల్పిస్తున్నారు.

 
Link to comment
Share on other sites

రాజధాని అభివృద్ధి పనులపై చంద్రబాబు సమీక్ష
04-07-2018 19:36:06
 
636663297678099704.jpg
అమరావతి: రాజధాని అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 12 వారధులతో రాజధానికి అనుసంధానం చేస్తామని, వైకుంఠపురం దగ్గర కృష్ణానదిపై నిర్మించనున్న వారధిని ఐకానిక్ నిర్మాణంగా చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రాజధానిలో రహదారుల నిర్మాణాలు డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 15 నాటికి తాత్కాలిక హైకోర్టును సిద్ధం చేయాలన్నారు. అంతేకాకుండా ఈ సమావేశంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదనపై చర్చించారు. శ్రీవారి ఆలయ నిర్మాం కోసం పవిత్ర సంగమ ప్రాంతంలో స్థలం గుర్తించారు.
Link to comment
Share on other sites

 
కృష్ణా తీరంలో శ్రీవారి ఆలయం
20 ఎకరాల్లో తితిదే ఆధ్వర్యంలో నిర్మాణం
దొనకొండలో నిర్మాణ నగరం
డిసెంబరు 15కి తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం
సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో పలు నిర్ణయాలు
రాజధాని పనుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి
4ap-main10a.jpg

ఈనాడు, అమరావతి: కృష్ణానది ఒడ్డున పవిత్రసంగమం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందుకు 20 ఎకరాలు కేటాయిస్తూ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తితిదే వీలైనంత త్వరలో దేవాలయం ఆకృతులు సిద్ధంచేసి, వాటిపై ప్రజాభిప్రాయం తెలుసుకుని, వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతం, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ పవిత్రసంగమం వద్ద కట్టే ఐకానిక్‌ బ్రిడ్జి సమీపంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తారు. వైకుంఠపురం రిజర్వాయర్‌ దగ్గర కృష్ణానదిపై నిర్మించే వారధి ఐకానిక్‌గా ఉండాలని సీఎం ఆదేశించారు. వివిధ ప్రాంతాల్ని అమరావతికి అనుసంధానం చేస్తూ కృష్ణా నదిపై నిర్మించే డజనుకుపైగా వారధులన్నీ రాజధానికి మకుటాయమానంగా నిలవాలన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద నిర్మాణ నగరాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మొదట 61.77 ఎకరాల్లో ట్రేడ్‌ సెంటర్‌లా దీన్ని నెలకొల్పుతారు. ఇక్కడ వ్యాపార కార్యలాపాలు ప్రారంభించేందుకు ఇప్పటికే 610 కంపెనీలు ముందుకొచ్చాయని ఏపీటిడ్కో అధికారులు వివరించారు. భవిష్యత్తులో ఈ నగరాన్ని తయారీ, నిర్మాణ రంగ సామగ్రి, పరికరాలకు సంబంధించిన హబ్‌గా తీర్చిదిద్దుతారు. మొదటి దశలో కార్పొరేట్‌ కార్యాలయాలు, నిర్మాణ సామగ్రి ప్రదర్శన కేంద్రాలు, గిడ్డంగులు, గ్రీన్‌ బెల్ట్‌, పార్కింగ్‌ ప్రాంతం, ఫుడ్‌ ప్లాజా, క్రేన్లు వంటి భారీ వాహనాలు, పరికరాల కోసం సింగపూర్‌ భాగస్వామ్యంతో ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేస్తారు. ‘‘కేవలం నిర్మాణ సామగ్రి తయారీకి నెలవుగానే కాకుండా, నిర్మాణరంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, నవ్యావిష్కరణలకు ఆలవాలంగా, సాంకేతిక, వైజ్ఞానిక కేంద్రంగా ఉండాలి. దీర్ఘకాల మన్నిక, అందుబాటు ధర, ఆకట్టుకునే ఆకృతులు, ఆధునిక నగర ప్రణాళికలకు సంబంధించిన నూతన ఆలోచనలకు వేదికగా నిలవాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు, చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.
* రాజధానిలో రహదారుల నిర్మాణ పురోగతి ఆశించినంత వేగంగా లేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 36 శాతం పనులే పూర్తయ్యాయని, రూ.కోట్లు వెచ్చించి పెట్టుకున్న కన్సల్టెన్సీ సంస్థలు ఏం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
* వీజీటీఎం-ఉడా కింద ఉన్న ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, నాలుగో తరగతి ఉద్యోగుల్ని సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
* రాజధానిలో సొంత ఫ్లాట్ల కొనుగోలుకు ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతర వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా సీఆర్‌డీఏ వెయ్యి ఫ్లాట్లను వాణిజ్య ప్రాతిపదికన నిర్మించేందుకు ఆమోదించింది.
* దేశంలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థను రాజధానిలో ఏర్పాటు చేయనున్నారు.
* అమరావతిలో భూములు కేటాయించిన 8 పాఠశాలల నిర్మాణాలు త్వరలో ప్రారంభం.
* త్వరలో ఒక ఫైవ్‌స్టార్‌, నాలుగు ఫోర్‌స్టార్‌, నాలుగు త్రీస్టార్‌ హోటళ్ల నిర్మాణాలు ప్రారంభం.
* అమరావతిలోని శాఖమూరు పార్కులో భాగంగా 7.5 ఎకరాల్లో నిర్మించే ఎత్నిక్‌ విలేజ్‌లో ఎకరం విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో హస్తకళల కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
* రాజధాని ప్రాంతంలోని కొండలన్నింటినీ  వివిధ రకాల పుష్పజాతులతో సుందరంగా తీర్చిదిద్దాలి.
* నీరుకొండలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌, మ్యూజియం ఆవరణలో ట్రాక్‌ రహిత టాయ్‌ ట్రైన్‌, స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, స్పోర్ట్స్‌ రిక్రియేషన్‌ క్లబ్బుల ఏర్పాటుకి ప్రతిపాదనలు.
* డిసెంబరు 15 నాటికి తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం చేయాలని సీఎం ఆదేశం.
* నగరాల్లో రోడ్డు మీద నీరు నిలిస్తే సంబంధిత అధికారిని సస్పెండ్‌ చేయాలి.

 

Link to comment
Share on other sites

12వారధులు అమరావతితో అనుసంధానం
05-07-2018 04:57:15
 
636663634368333175.jpg
  • వైకుంఠపురం దగ్గర ఐకానిక్‌ వంతెన
  • ఈ ఏడాది చివరికల్లా రాజధాని రహదారులు పూర్తి చేయాలి
  • మరింత వేగంగా సీడ్‌ యాక్సిస్‌ నిర్మాణం
  • అమరావతిలో 4 ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
  • పర్యాటక ప్రాంతాలుగా రాజధాని కొండలు
  • రోడ్లపై నీళ్లుంటే సంబంధిత అధికారిపై వేటు
  • సీఆర్డీయే సమావేశంలో సీఎం చంద్రబాబు
 
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిని 12 వారధులతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులు ఆదేశించారు. ఇందులో భాగంగా వైకుంఠపురం రిజర్వాయర్‌ దగ్గర కృష్ణానదిపై నిర్మించే వంతెన ఐకానిక్‌గా ఉండాలని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ 17వ అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధి పనులను సీఎం సమీక్షించారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని అమరావతికి అనుసంధానం చేస్తూ కృష్ణానదిపై నిర్మించే వారధులన్నీ రాజధానికే మకుటాయమానంగా నిలవాలని స్పష్టం చేశారు. రాజధాని నగరంలో చేపట్టిన రహదారుల నిర్మాణాలు డిసెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.
 
నిర్మాణంలో వేగం పుంజుకుంటే తప్ప లక్ష్యాలను చేరుకోలేమన్నారు. సీడ్ యాక్సిస్ నిర్మాణం మరింత చురుగ్గా సాగాలని చెప్పారు. అమరావతి పరిధిలో గల కృష్ణానది తీరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. పవిత్ర సంగమం ప్రాంతంలో స్థలాన్ని గుర్తించారు. రాజధానిలో సొంత ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ కాంట్రాక్టు ఉద్యోగులు, హైకోర్టు న్యాయవాదులు, ఇతర వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి వెయ్యి గృహాలను వాణిజ్యపరంగా నిర్మించడం కోసం రూపొందించిన అంశాలపై 1285, 1580, 1880, 2150 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తారు. చదరపు అడుగుకు రూ.3వేల ధరను ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 500 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారు.
 
అమరావతిలో విద్యాలయాలను నెలకొల్పడానికి 8 ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని, నిర్మాణాలను చేపట్టేందుకు సిద్దమవుతున్నాయని సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ చెప్పారు. ఇవిగాక సెయింట్ గేబ్రియల్, శ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ సొసైటీ, పీహెచ్ఆర్ ఇన్వెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సొసైటీ ఆఫ్ సెయింట్ మేరీ, ఎన్ఎంఎస్ సంస్థలు కూడా దరఖాస్తు చేశాయని తెలిపారు.
 
పైవ్ స్టార్ హోటళ్లు, 4 త్రీస్టార్ హోటళ్లు ఒకటి రాజధానిలో త్వరలో నిర్మాణాలను చేపట్టనున్నాయని చెప్పారు. ప్రస్తుతం విజయవాడలో 1700 హోటల్ గదులు అందుబాటులో ఉన్నాయని, అమరావతిలో మొత్తం 10వేల గదులు అందుబాటులో తీసుకురావాలన్నదే లక్ష్యమని సీఎం గుర్తుచేశారు. శాఖమూరులో 7.5 ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామం తరహాలో ఏర్పాటు చేయనున్న ఎత్నిక్ విలేజ్ లో ఎకరం స్థలంలో క్రాప్ట్ బజారును ఏర్పాటు చేయడానికి ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్ ప్రతినిధులు సీఎం ముందుంచారు. రాజధాని ప్రాంతంలో కొండలన్నింటీని సుందరీకరించాలని, వివిధ రకాల పుష్పజాతులతో ఒక్కోకొండకు ఒక విలక్షణ తను తీసుకురావాలని సీఎం ఆదేశించారు. దీనికోసం అటవీశాఖ, సీఆర్ డీఏ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్యాటకులు, సాహసక్రీడాప్రియులు, పర్వతారోహకులను ఆకట్టుకునేలా వీటిని తీర్చిదిద్దాలని సూచించారు.
 
సింగపూర్ భఆగస్వామ్యంతో దొనకొండలో నిర్మాణిస్తున్న నగరం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చైనాలో ఈ తరహా నగరం ఉందని, నిర్మాణాలకు సంబంధించిన సమస్త వస్తు సామాగ్రి ఇక్కడ లభ్యమవుతాయని చెప్పారు. గాలి స్వచ్ఛత, ధ్వని కాలుష్యం, వైపరిత్యాల నిర్వహణ నగరమే మార్గదర్శిగా ఉండాలన్నారు. తొలుత 61.77 ఎకరాలలో ట్రేడ్ సెంటర్ గా దీన్ని నెలకొల్పుతామని, ఇప్పటికే 610 సంస్థలు ఇక్కడ వ్యాపారా కార్యకలాపాలను ఆరంభించడానికి ముందుకొచ్చాయని టిడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామనాథ్ ముఖ్యమంత్రికి వివరించారు. డిసెంబరు 15 నాటికి తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇటీవల రెండు రోజులు ఎన్ఆర్ఎం వర్సిటీకి నీటి సరఫరాలో ఇబ్బందులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లో ఇది పునారవృతం కాకూడదని సీఆర్ డీఏ కమిషనర్ కు చెప్పారు. నగరాల్లో రోడ్డు మీద నీరు నిలిచివుంటే సంబంధిత అధికారిని సస్పెండ్ చేసేలా కార్యాచరణలోకి దిగాలని పురపాలక శాఖ అధికారులకు స్పష్టం చేశారు. పెను తుఫాన్లు వస్తేనే వైఫరీత్యాలు అని అనుకోరాదని, రహదారిపై వర్షం నీరుపారే వ్యవస్థ సక్రమంగా లేకపోతే అది కూడా వైపరీత్య నిర్వహణగా తీసుకోవాలన్నారు
Link to comment
Share on other sites

4 hours ago, baabuu said:

8 Schools enti?
i know one is Chinmaya Vidyalaya

Below are the list of international schools, willing to setp up in Amaravati:

  • DPS International
  • Global Indian International School (GIIS), Singapore
  • Ryan International
  • Podar International
  • Indus International
  • Pathways, NCR
  • GEMS, Dubai
  • Chirec International
  • Jubilee Hills Public School
  • Amity International
  • HLC International
  • Candor International school
Link to comment
Share on other sites

thanks babai.. 
kaani nenu pettina Chinmaya vidyalaya ledu nee list lo... ? 
ivi ganuka vasthe 
janalu lagethhuku raatame , inka education ledu ante tantharu.. 
Delhi public school works are going fine (near Tadikonda X road electric Substation)

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...